1 ENS Live Breaking News

జివిఎంసీ మేయర్ కి గంట్ల సత్కారం..

మహావిశాఖ నగరపాలక సంస్థకు మొట్టమొదటి మహిళా మేయర్ గా ఎన్నికైన గొలగాని వెంకట హరి కుమారిని గురువారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు సత్కరించారు. మేయర్ ఎన్నిక పూర్తయిన తరువాత ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 14ఏళ్ల తరువాత కొలువుదీరిన సభలో మహిళా మేయర్ గా రాణించి, విశాఖ ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధం జర్నలిస్టుల నుంచి జీవిఎంసీకి, వైఎస్సార్సీపీకి ఎల్లప్పుడూ సహకారం వుంటుందని చెప్పారు. అత్యధిక సభ్యులు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నందున జీవిఎంసీకి మహిళా మేయర్ గా మరింత వన్నతీసుకురావాలని గంట్ల ఆకాంక్షించారు. మేయర్ ను కలిసిన వారిలో స్వతంత్ర అభ్యర్ధి కందుల నాగరాజు తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2021-03-18 21:42:15

25న ప్రెస్ అకాడమీ చైర్మన్ రాక..

రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ఈ నెల 25న జిల్లాకు రానున్నారు. జిల్లాలో రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు.   మార్చి 24న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి 25న ఉదయం 05.40గం.లకు శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) కు చేరుకుంటారు. ఉదయం 05.50గం.లకు రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి ఉదయం 06.10గం.లకు శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకొని జిల్లా అధికారులు, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు.  ఉదయం 09.30గం.లకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి బయలుదేరి 10.00గం.లకు అరసవల్లికి వెళతారు. అక్కడనుండి 11.00గం.లకు శ్రీకూర్మంకు  చేరుకుంటారు.  ఉదయం 11.30గం.లకు శ్రీకూర్మం నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.00గం.లకు శాలిహుండం చేరుకోనున్న ఆయన మధ్యాహ్నం 12.30గం.లకు శాలిహుండం నుండి బయలుదేరి 01.00గం.కు శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 03.30గం.లకు అతిథి గృహం నుండి బయలుదేరి సాయంత్రం 04.00గం.లకు డా. బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయంలో జర్నలిజం చేస్తున్న విద్యార్ధులు మరియు పాత్రికేయులతో సమావేశమవుతారు. సాయంత్రం 06.00గం.లకు ఆర్ అండ్ బి అతిథిగృహంలో జిల్లా అధికారులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మార్చి 26న ఉదయం 09.00గం.లకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి బయలుదేరి ఉదయం 10.00గం.లకు శ్రీముఖలింగం చేరుకుంటారు. 11.00గం.లకు శ్రీముఖలింగం నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.00గం.లకు వంశధార ప్రోజెక్టు వద్ద జిల్లా అధికారులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 03.00గం.లకు వంశధార ప్రోజెక్టు నుండి బయలుదేరి సాయంత్రం 04.00గం.లకు  ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకోనున్న ఆయన రాత్రి 07.00గం.లకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి బయలుదేరి 07.30గం.లకు శ్రీకాకుళం రైల్వేస్టేషనుకు చేరుకుంటారు. అక్కడ నుండి బయలుదేరి విజయవాడకు వెళ్లనున్నారు. 

Srikakulam

2021-03-18 18:20:32

25 వరకు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు..

శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో విక్రయించని రైతుల వద్ద గల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువును పెంపుదల చేసినట్లు సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 ఖరీఫ్ సీజన్ లో 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసిన 837 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించిన సంగతి విదితమే. అందులో భాగంగా జిల్లాలో డిసెంబర్ 2020 నుండి నేటి వరకు 7.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 99,159 మంది రైతుల నుండి సేకరించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధరను ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ధాన్యం సేకరణ కార్యక్రమం 2021 ఫిబ్రవరి మాసాంతానికి ముగిసినప్పటికీ, ఇంకనూ రైతుల వద్ద ధాన్యం నిల్వలు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. రైతులు నష్టపోరాదనే ఉద్దేశ్యంతో ఈ నెల 25 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేయుటకు ప్రభుత్వం నిర్ణయించినట్లు జె.సి వివరించారు. కావున ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఇంకనూ ధాన్యం అమ్మని రైతులు వారి గ్రామానికి దగ్గరలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధరకు విక్రయించుకోవాలని జె.సి ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2021-03-18 16:05:49

బోర్ల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి..

 భూగర్భ జల మరియు జలగణన శాఖ స్వర్ణోత్సవంలో భాగంగా రైతులు, ప్రజలు బోర్ల నిర్మాణంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఆ శాఖ సంచాలకులు ఏ.వరప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  బోర్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. బోర్లలో త్రవ్వకపు బోర్లు, బోరు బావులు అని రెండు రకాల బోర్లు ఉంటాయన్నారు. భూమి పై పొరల్లో నిక్షిప్తమైన భూగర్భ జలాన్ని వెలికి తీయడానికి చేసే నిర్మాణాలను బావులంటారని, బోర్వెల్స్ రావటంతో త్రవ్వకవు బావులు క్రమంగా కనుమరుగవుతున్నా యని చెప్పారు. అలాగే కాస్తంత లోతైన భూపొరల్లో నిక్షిప్తమైన నీటిని వెలికి తీయడానికి నిర్మించే బావులనే బోరుబావులంటారని, సాధారణంగా గట్టి రాతిపొరల్లో వున్న నీటిని వెలికి తీయడానికి ఈ బోరుబావులను నిర్మిస్తారని చెప్పారు. సాధారణంగా మంచినీటి కోసం 4 అంగుళాల వ్యాసంతోను, సాగునీటి కోసం 6 అంగుళాల వ్యాసంతోను వీటి నిర్మాణం చేస్తారని, ఈ బోర్లు అయా రాతిపారలను బట్టి 60 నుండి 120 మీ. లోతు వరకు నిర్మిస్తారని తెలిపారు. పైన వుండే మెతక పొరలను బట్టి 40 నుండి 80 అడుగుల కేసింగు పైపు వేయాల్సి ఉంటుందని, బోరు నిర్మాణానికి 5 నుండి 8 గంటల సమయం పడుతుందని అన్నారు. వీటి ద్వారా గంటకు 4,000 నుండి 15, 000 లీటర్ల నీరు లభ్యమవుతుందని తెలిపారు. రైతులు లేదా ప్రజలు బావి, బోరు నిర్మించుకునే ముందు జియాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిదని,  నల్లరేగడి ప్రాంతంలో వృత్తాకారపు బావులు నిర్మిస్తే ఒడ్డు త్వరగా విరిగిపడిపోదని ఆయన సూచించారు. బావికి   స్టీనింగు కట్టాలని, తద్వారా పశువులు ప్రమాదవశాత్తు బావిలో పడిపోకుండా ఉంటుందని ఆయన సూచించారు.అలాగే సందులు, పగుళ్ళు ఉన్న రాయి వస్తే బావి అడుగున బోరు వేసుకోవాలని, బోరు చేసేటప్పుడు తేమ లేకుండా పౌడరు లాంటి దుమ్ము వస్తుంటే డ్రిల్లింగు నిలిపివేయాలని పేర్కొన్నారు.బోరులో నీరు పడిన తరువాత లోతు వెళ్ళే కొలది నీరు పెరుగుతుందో లేదో గమనించాలని, లోతుతో పాటు నీరు పెరగకపోతే ఎక్కువ లోతు డ్రిల్లింగు చేయటం అనవసరం అని అన్నారు. బోరు వేసేటప్పుడు వంకర లేకుండా నిట్టనిలువుగా వేసేలా జాగ్రత్త వహించాలని, బోరు సైజు కూడా పైనుండి క్రింది వరకు సమానంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అలా కానిపక్షంలో బోరులోనికి మోటారు, పైపులు అమర్చటం కష్టమవుతుందని, బోరు నిర్మించేటప్పుడు లోపలి రాయిలో పగుళ్ళుండి నీటితోపాటు పెద్ద పెద్ద రాయి ముక్కలు బయటకు వస్తుంటే బోరు ఇంకా లోతు వేయించాల్సి ఉంటుందని చెప్పారు. ఇనుప గొట్టాలు చెడిపోతున్న ప్రాంతాలలో పి. వి. సి. కేసింగు పైపు వేసుకోవాలని, మెత్తని రాతిపొర ఉన్నంతవరకు కేసింగ్ పైపు దించుకోవాలని, కేసింగు పైపు దించవలసిన లోతు వరకు ఎక్కువ వ్యాసంతో బోరు నిర్మించాలని అన్నారు. డ్రిల్లింగు చేసే సమయంలో ఎంత పరిమాణంలో నీరు వస్తుందో తెలుసుకోవాలని, ఈ విధంగా లోతుతో పాటు నీరు పెరుగుతుందా లేదా గమనించి బోరు లోతు పెంచాలా వద్దా అనేది నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. బోరు డ్రిల్లింగు అయ్యాక రెండు గంటలు బోరు శుభ్ర పరచేందుకు ప్లషింగ్ చేయించాలని ఆయన తెలిపారు. ఒక ప్రాంతంలో బోరు పడుతుందా లేదా అనేది అనేక అంశాల మీద ఆధారపడి వుంటుందని,. బోర్వెల్ పడుతుందా లేదా అని పరిశీలించే భూగర్భజల శాస్త్రజ్ఞులు ద్వారా ఒక ప్రాంతం లేదా పొలంలో క్షుణ్ణంగా పరిశోధన  చేసిన తదుపరి మాత్రమే బావులను నిర్మించుకోవడం మంచిదని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  కోరారు.

Visakhapatnam

2021-03-18 16:02:30

విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్‌గా వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి

విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్‌ కార్పొరేష‌న్ తొలి మేయ‌ర్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. డిప్యుటీ మేయ‌ర్‌గా అదే పార్టీకి చెందిన ముచ్చు నాగ‌ల‌క్ష్మిని స‌భ్యులు ఎన్నుకున్నారు. మేయ‌ర్ ఎన్నిక‌‌ ప్రిసైడింగ్ ఆఫీస‌ర్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆధ్వ‌ర్యంలో ఈ ఎన్నిక జ‌రిగింది. జిల్లా సాధార‌ణ ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు కాంతిలాల్ దండే ఈ ఎన్నిక‌ల‌ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించారు.   మేయ‌ర్ ఎన్నిక నిర్వ‌హించేందుకు కార్పొరేష‌న్ కార్యాల‌యంలో గురువారం ప్ర‌త్యేక స‌మావేశం జ‌రిగింది. కార్పొరేష‌న్‌లో 50 డివిజ‌న్లు ఉండ‌గా, ఎన్నికైన‌ స‌భ్యులంతా హాజ‌రు కావ‌డంతో, క‌లెక్ట‌ర్ వారిచేత ముందుగా కార్పొరేట‌ర్లుగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం మేయ‌ర్ ఎన్నిక ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యింది. 11వ డివిజ‌న్ స‌భ్యులైన వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మిని మేయ‌ర్ అభ్య‌ర్థిగా, 14 డివిజ‌న్ స‌భ్యులు ఎస్‌వివి రాజేష్ ప్ర‌తిపాదించారు. ఆమె అభ్య‌ర్థిత్వాన్ని 23వ డివిజ‌న్ స‌భ్యులు కేదార‌శెట్టి సీతారామ్మూర్తి బ‌ల‌ప‌రిచారు. మ‌రో ప్ర‌తిపాద‌న రాక‌పోవ‌డంతో, విజ‌య‌ల‌క్ష్మి మేయ‌ర్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. డిప్యుటీ మేయ‌ర్‌గా 1వ డివిజ‌న్ స‌భ్యులు ముచ్చు నాగ‌ల‌క్ష్మిని, 40 డివిజ‌న్ స‌భ్యులు బోనెల ధ‌న‌ల‌క్ష్మి ప్ర‌తిపాదించ‌గా, 42వ డివిజ‌న్ స‌భ్యులు పిన్నింటి క‌ళావ‌తి బ‌ల‌ప‌రిచారు. మ‌రో అభ్య‌ర్థిత్వం రాక‌పోవ‌డంతో, డిప్యుటీ మేయ‌ర్‌గా నాగ‌ల‌క్ష్మి కూడా ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. అనంత‌రం మేయ‌ర్‌, డిప్యుటీ మేయ‌ర్‌ల‌కు ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను క‌లెక్ట‌ర్ అంద‌జేశారు.              ఈ సమావేశానికి హాజ‌రైన గౌర‌వ స‌భ్యులు, ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, కార్పొరేట‌ర్లుగా ఎన్నికైన వారిలో సుమారు 45 మంది కొత్త‌వారే ఉన్నార‌ని అన్నారు. వారు నిర్వ‌ర్తించాల్సిన విధులు, హ‌క్కులు, అభివృద్ది కార్య‌క్ర‌మాల గురించి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరారు. దీనిపై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ స్పందిస్తూ, త్వ‌ర‌లో నిపుణుల‌చేత శిక్ష‌ణ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. అనంత‌రం ప్రత్యేక స‌మావేశాన్ని ముగించారు. స‌మావేశ నిర్వ‌హ‌ణ‌లో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పివివిడి ప్ర‌సాద‌రావు, ఇత‌ర మున్సిప‌ల్ అధికారులు, సిబ్బంది స‌హ‌క‌రించారు. 

విజయనగరం

2021-03-18 15:50:25

మేయర్ ఎన్నిక 10 నిమిషాలు..శుభాకాంక్షలు 60 నిమిషాలు..

మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కేవలం 10 నిమిషాల్లోనే ఎన్నికల అధికారులు ముగించేశారు. సుమారు 14ఏళ్ల తరువాత కొలువుదీరిన కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా పదే పది నిమిషాల్లో జరిగిపోయింది. ఉదయం 10.50 గంటలకు ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్, జివిఎంసీ కమిషనర్ నాగలక్ష్మీ సెల్వరాజన్ లతో పాటు ఎన్నికలో గెలుపొందిన కార్పోరేర్లంతా జివిఎంసీ కౌన్సిల్ హాలులో కూర్చుకున్నారు. అప్పటికే ఎవరి పేర్లతో వారి సీట్ల వద్ద ప్రమాణ పత్రాలను ఉంచేలా అధికారులు ఏర్పాటు చేశారు. సరిగ్గా 11.55 నిమిషాలకు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆవెంటనే 11.57 ఎన్నికల నియమ నిబంధనలను సభకు చదివి వినిపించారు. అనంతరం కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం తెలుగు, మరియు ఇంగ్లీషులో జరిగింది. ఆపై అత్యధిక మెజార్టీ వున్న వైఎస్సార్సీపీ కార్పోరేటర్లల నుంచి వంశీక్రిష్ణ శ్రీనివాస్ మేయర్ అభ్యర్ధికై గొలగాని వెంకట హరి కుమారి పేరును ప్రతిపాదించారని ఎన్నికల అధికారి ప్రకటించగానే మూజువాణి రూపంలో ఎన్నిక నిర్వహించారు.  ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో మేయర్ అభ్యర్ధిని పేరు ఎన్నికల అధికారి ఖరారు చేశారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా జియ్యాని శ్రీధర్ ను ఎంపిక చేశారు. ఈ తంతు మొత్తం పది నిమిషాల్లోనే ముగిసిపోయంది.. ఆపై ప్రోటో కాల్ ప్రకారం జివిఎంసీ మేయర్ అభ్యర్ధికి ప్రత్యేక డ్రెస్ వేసిన తరువాత, ఆమెను రాష్ట్ర మంత్రి ముత్తం శెట్ట శ్రీనివాసరావు పోడియంలో సాదరంగా తోడ్కొని వెళ్లి కూర్చో బెట్టి శుభాకంక్షాలు చెప్పారు. తరువాత ఒక్కొక్కరుగా నూతన మేయర్ కు బొకేలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. కాగా టిడిపి కార్పోరేట్లరు, జనసేన, స్వతంత్ర్య అభ్యర్ధుల కోసం ఒక వైపు, వైఎస్సార్సీపీ కార్పోరేటర్లకు మరో వైపు కౌన్సిల్ లో సీట్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యన్నారాయణ, డా.బి.సత్యవతి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణాబాబు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, ఎమ్మెల్సీలు పివిఎన్ మాధవ్, దువ్వారపు రామారావు, బుద్దా వెంకన్న, పి.రవీంధ్రబాబు, జీవిఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2021-03-18 15:18:54

జీవిఎంసీ కమిషనర్ టెక్నాలజీ సూపర్..

యువ ఐఏఎస్ అధికారులు ఏ పనిచేసినా అది చాలా వైవిధ్యభరితంగా, వినూత్నంగానూ ఉంటుంది..ప్రజలకు చాల తక్కువ సమయంలో చేరుతుంది కూడా..మొబైల్ టెక్నాలజీ పుణ్యమాని ఇపుడు అది మరింత చేరువుగా మారుతోంది. సరిగ్గా అదే ఆలోచన చేశారు యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిణి, జివిఎంసీ కమిషనర్ నాగలక్ష్మి.. సుమారు 14 సంవత్సరాల తరువాత విశాఖ జీవిఎంసీ కి మేయర్ ఎన్నిక జరగబోతుంది. తమ తమ పార్టీ అభ్యర్ధులు ప్రమాణస్వీకారం ఎలా చేస్తారో చూడాలని చాలా మంది కుటుంబ సభ్యులకు ఎంతో ఉత్సాహంగా వుంటుంది. కానీ స్వయంగా అక్కడికి వెళ్లడానికి అవకాశం లేనివారికి, సుమారు 98 మంది కార్పోరేట్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుల కార్యక్రమాన్ని విశాఖ నగర ప్రజలదరికీ నేరుగా చూపించాలనే సంక్షల్పంతో రేపు జరిగే కార్యక్రమాన్ని జీవిఎంసీ యూట్యూబ్ ఛానల్ https://www.youtube.com/channel/UCxEFAwSRd6WH5TDY0-o-wlg/live  ద్వారా లైవ్ లో చూపించాలని సంకల్పించారు. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లును చేయించి ఆ లింక్ ను ఒక రోజు ముందుగానే విశాఖ ప్రజలకు తెలియజేయశారు. దీనితో ఆ లింక్ ద్వారా తమవారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వాళ్లు చూడంటంతో పాటు తమ తమ కుటుంబ సభ్యులకు కూడా చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆ యూట్యూబ్ లింక్ ని పంపించుకునే వెసులుబాటుని కల్పించారు. సాధారణంగా అయితే వీరు ప్రమాణ స్వీకారం చేసిన వార్త మరుసటి రోజు అంటే 24 గంటలు గడిస్తే తప్పా పత్రికల్లో రాదు...ఎవరో గట్టిగా ప్యాకేజీలు ఇస్తే తప్పా వారి విజువల్స్ టీవీ ఛానళ్లలో కనిపించవు. కానీ కమిషన్ ఆలోచన ద్వారా మాత్రం అన్ని వర్గాల ప్రజలు రేపు జరగబోయే జివిఎంసీ మేరయ్ ఎన్నిక, కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం కూడా అందరూ లైవ్ లో తిలింకించే అశకాశం ఏర్పడనుంది. ఏది ఏమైనా యువ ఐఏఎస్ అధికారులు ఆలోచన సరళి ఏ స్థాయిలో వుంటుందనడానికి ఈ చిన్న టెక్నాలజీ ఈవెంట్ ఒక మచ్చుతునకగా చెప్పవచ్చు..అదే విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ ద్వారా కూడా అందరికీ ఒక రోజు ముందుగానే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం...

Visakhapatnam

2021-03-17 21:04:47

నూతన సభ్యులు GVMCకి 10.30కే చేరుకోవాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నికలు మార్చి 18 వ తేదీన జరుగనున్నాయని జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధారిటీ వి. వినయ్ చంద్ అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం జి.వి.యం.సి. సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు.  ఈ నెల 18వ తేదీన ఉదయం 11గం. లకు నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఎన్నికైన వార్డు మెంబర్లు తప్పనిసరిగా తమ ఎన్నికల ధృవీకరణ పత్రంతో మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నికలకు ఉదయం గం.10.30 ని.లకే హాజరు కావాలన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి  ఆదేశాల మేరకు మార్చి 18 వ తేదీన జి.వి.యం.సి.లో మేయరు, డిప్యూటీ మేయరు పదవులకు జరుగుచున్న ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన 98 మంది వార్డు మెంబర్లు, 15 మంది ఎక్ష్అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 113 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు.  ఈ ఎన్నికలలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలైన బి.జె.పి, సి.పి.ఐ, సి.పి.ఐ(ఎం), టి.డి.పి, వై.ఎస్.ఆర్.సి.పి.లు విప్ జారీ చేయవలసి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వివరాలతో కూడిన అనుబంధం పత్రాలు- 1, 2, 3 (Annexure – I, II & III),  మేయరు, డిప్యూటీ మేయరు అభ్యర్ధులను నామినేట్ చేసేందుకు సంబంధించిన “ఎ” & “బి” ఫారాలును (Form “A”&“B”) నిర్ణీత సమయంలో సంబంధిత జి.వి.యం.సి. అధికారులకు  అందజేయ వలసినదిగా కలెక్టరు తెలిపారు.   ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను సజావుగా నిర్వహించేటట్లు చూడాలని అదనపు కమీషనర్లు పి. ఆషా జ్యోతి, ఎ.వి. రమణిలను  ఆదేశించారు. ఈ సమావేశంలో గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్. విజయానందరెడ్డి(బి.జె.పి),  బి. గంగారావు, ఆర్.కె.ఎస్.వి.కుమార్ (సి.పి.ఐ.(ఎం). పాసర్ల ప్రసాద్ (టి.డి.పి.), తైనాల విజయ్  కుమార్ (వై.ఎస్.ఆర్.సి.పి), అదనపు కమీషనర్లు పి. ఆషాజ్యోతి, ఎ.వి.రమణి, వ్యయ పరిశీలకులు వై.మంగపతిరావు, సెక్రటరీ లావణ్య,, జి.వి.యం.సి. సలహాదారు జి.వి.వి.ఎస్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-03-17 20:35:24

సంక్షేమ పథకాల లక్ష్యాలను అదిగమించాలి..

విశాఖ జిల్లాలో డి.ఆర్.డి.ఎ., వ్యవసాయ శాఖల ద్వారా  అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టరు ఎమ్.వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన బ్యాంకు అధికారులతో వై.యస్.ఆర్. సున్నావడ్డీ, వై.యస్.ఆర్. చేయూత పథకాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వై.యస్.ఆర్. సున్నావడ్డ్డీ పథకానికి అర్హత గల రైతులను సకాలంలో గుర్తించాలని ఆయన మాట్లాడుతూ 2019 సం.రబీలో వై.యస్.ఆర్ సున్నావడ్డీ కార్యక్రమంలో అర్హత కలిగిన రైతులు లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకుని సకాలంలో వడ్డీతో సహా పూర్తిగా చెల్లించిన రైతుల జాబితాను వెబ్ సైట్ http://karshak.ap.gov.in8080/ysrsvpr/ లో ఈనెల 25వ తేదీలోగా నమోదు చేయవలసినదిగా కోరడమైనద. ఇందులో ఇప్పటివరకు 14 వేల మంది రైతుల జాబితా నమోదు చేయడమైనది చెప్పారు. నమోదు కార్యక్రమమం తప్పనిసరిగా సకాలంలో పూర్తి చేయవలసిందిగా జాయింట్ కలెక్టర్  అధికారులను ఆదేశించారు. అనంతరం చేయూత కార్యక్రమంలో పాడిపశువులు, గొర్రె-మేకలు, రిటైల్, వైయస్సార్ భీమా, జగనన్న తోడు కార్యక్రమాలపై బ్యాంకు రుణాల మంజూరు, లక్ష్యాల సాధనపై సమీక్షించారు.  పాడి పశువులు 4398, గొర్రె-మేక 3692, చేయూత కిరాణా 1222, వైయస్సార్ భీమా 6,05,801 లక్ష్యం సాధించాలని ఆదేశించారు.  లక్ష్యాన్ని ప్రణాళికా యుతంగా వివిధ శాఖల అధికారులు బ్యాంకు అధికారుల సమన్వయంతో సాధించాలన్నారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) ఆర్.గోవిందరావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విశ్వేశ్వరరావు, వ్యవసాయ శాఖ జె.డి.లీలావతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ ప్రశాద్, వివిధ బ్యాంకుల కంట్రోలర్ లు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-03-17 20:15:08

ఆ ప్రాంతంలో పనులు ప్రారంభం కావాలి..

శ్రీకాకుళం జిల్లాలో భూసేకరణ జరిగిన ప్రాంతాల్లో పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల భూసేకరణపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. హై లెవెల్ కెనాల్, వంశధార, తోటపల్లి తదితర ప్రాజెక్టుల క్రింద జరుగుతున్న పనులను సమీక్షించారు. సకాలంలో పనులు పూర్తి కావాలని, పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తరాదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వంశధార ఎస్ఇ డోల తిరుమల రావు, ఇఇ రామచంద్ర రావు, ఎస్డీసీలు బి.శాంతి, కాశివిశ్వనాథ రావు, జి.సుజాత, సంబంధిత తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-03-17 19:00:20

బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలిద్దాం !

శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలించేందుకు కృషిచేయాలని ఎం.పి.డి.ఓలకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ దిశ నిర్ధేశం చేసారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రతీ గ్రామంలో చెత్త లేకుండా చూడాలని, సేకరించిన చెత్తను తడిచెత్త ,పొడిచెత్తగా వేరుచెయ్యాలని చెప్పారు. అలాగే పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను వేరు చేసి సంబంధిత విభాగాలకు తరలించాలని సూచించారు. చెత్తతో సంపదను ఆర్జించే దిశలో భాగంగా వర్మీకంపోస్ట్ తయారీపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్థానిక గ్రామ సర్పంచుల సమన్వయంతో వాలంటీర్లను ఈ కార్యక్రమానికి వినియోగించుకుని చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఆదర్శగ్రామాలు, మోడల్ పంచాయితీలగా  అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమన్వయంతో పనిచేసి ముందడుగు వేయాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగులో ఉన్న పనులను రానున్న 20రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. మెయిన్ రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పరిశుభ్ర వాతావరణాన్ని తీసుకురావాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో       మల మూత్రాలకు రోడ్లపైకి వెళ్లకుండా అవగాహన కల్పించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరిత గతిన చర్యలు చేపట్టాలని, నిర్వహణ చర్యలు ఖచ్చితంగా ఉండాలని, నిరంతర నీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండటమే కాకుండా వాటిని వినియోగించుకునే దిశగా గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఇంటి పన్నుల వసూలు చేయడంలో   సుమారు 85 % లక్ష్యం సాధించిన శ్రీకాకుళం, రణస్థలం అధికారులను అభినందిస్తూనే,మిగిలిన మండలాల్లో లక్ష్యాలను సాధించలేకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేసారు. లక్ష్యాలు సాధించడంలో అధికారులు నిర్లక్ష్యధోరణి ప్రదర్శించరాదని కలెక్టర్ తెలిపారు. ప్రతీ విద్యుత్ స్తంబాన్ని పరిశీలించి వీధి దీపాలు లేనిచోట తక్షణమే ఏర్పాటుచేయాలని  ఆదేశించారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం అందచేసి పనులు వేగవంతం పూర్తిచేయాలని అన్నారు. పంచాయితీల్లో అక్రమ లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత ఫీజులను వసూలు చేయాలని చెప్పారు. అక్రమ లేఅవుట్ నిర్మాణాలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదుచేయాలని, అటువంటి కట్టడాలకు NOC జారీచేయరాదని తెలిపారు. అక్రమ లేఅవుట్లకు పెర్మిషను ఇస్తే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు,జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇ.ఓ.ఆర్.డిలు, ఇతర అధికారులు తదితరులు  పాల్గొన్నారు. 

Srikakulam

2021-03-17 18:58:32

భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..

అనంతపురం జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూమికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను నిర్దేశించిన గడువు లోవు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్లో హెచ్ ఎల్సి, హెచ్ ఎన్ ఎస్ ఎస్, పిఎబి ఆర్, నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎపిఐఐసి తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పురోగతిపై ఆర్డీవోలు, ఇంజనీర్లు, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్, పిఎబిఆర్, నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎపిఐఐసి తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని, వేగవంతంగా భూసేకరణ చేపట్టి ఆయా ప్రాజెక్టులను మొదలు పెట్టేలా చూడాలన్నారు. భూ సేకరణలో ఎలాంటి ఆలస్యం జరగరాదని, క్షేత్రస్థాయిలో ఆయా శాఖల అధికారులు పర్యటించి భూసేకరణ ఎంత వరకు వచ్చిందో పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. హెచ్ ఎల్సి, హెచ్ ఎన్ ఎస్ ఎస్, అమరావతి హైవే, భైరవానితిప్ప ప్రాజెక్ట్ తదితర పనులపై ప్రత్యేక దృష్టి సారించి పనులు చేపట్టేలా అధికారులంతా సమన్వయం చేసుకోవాలన్నారు.   పిఎబిఆర్ స్టేజి 1 కింద భూసేకరణ సర్వే పూర్తి చేయాలని,1442 ఎకరాలకు సంబంధించి రిపిటిషన్ ఫైల్ చేయాలన్నారు. ఏప్రిల్ 15 లోపు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చేలా పనులు వేగవంతం చేయాలన్నారు. పిఎబిఆర్ 32వ ప్యాకేజీలో ఈ నెలాఖరులోపు భూసేకరణ చేపట్టాలన్నారు. యాడికి బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తి చేసి నోటిఫికేషన్ ఇచ్చేలా చూడాలన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ కి సంబంధించి భూ సేకరణ పూర్తిచేయాలన్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ఉన్న చోట క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా రైల్వే పరిధిలోని రాయదుర్గం - తుముకూరు బ్రాడ్ గేజ్ లైన్ కు, ఇతర ప్రాజెక్టు లకు అవసరమైన భూసేకరణ పనులు చేపట్టేలా చూడాలని ఆర్డీవోలకు సూచించారు. ఆర్ అండ్ బి మరియు నేషనల్ హైవే లకు సంబంధించి మైనర్ సమస్యలన్నీ పరిష్కరించి ఈనెల 23 లోపు మరింత పురోగతి కనిపించేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా తెలుసుకో..ఎదుగు ( know & rise) లో భాగంగా అనంతపురం లోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ విద్యార్థులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎలాంటి విషయాలను తెలుసుకున్నారు, ఏ విషయాలను అబ్జర్వ్ చేశారని జిల్లా కలెక్టర్ విద్యార్థులను అడగగా, వారు సమావేశంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, సమస్యలు వాటి పరిష్కారాలు గురించి కూలంకషంగా వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ &,రైతు భరోసా) నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ నిషా0తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రవీంద్ర, శ్రీనివాసులు, వరప్రసాద్, ఆర్డీవోలు గుణ భూషణ్ రెడ్డి, మధుసూదన్, వెంకట్ రెడ్డి, రామ్మోహన్, ఏపీ ఐఐసి జెడ్ ఎం పద్మావతి, హెచ్ ఎన్ ఎస్ఎస్ ఎస్ఈ రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-03-17 18:55:18

వై.ఎస్.ఆర్.సంపూర్ణ పోషణ సకాలంలో అందించాలి..

పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్య మంత్రి వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణా ప్లస్ పథకం ప్రేవేశ పెట్టారని, పథకం సక్రమంగా అమలు చేసే విధంగా అందరూ విధులు నిర్వహించాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి బుధవారం తన పర్యటనలో భాగంగా కొమరాడ మండలం, కుమ్మరిగుంట పంచాయతీ కంబవలస అంగన్వాడీ కేంద్రం ఆకస్మికంగా పర్యటించారు. ప్రాజెక్ట్ అధికారి అంగన్వాడీ కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. పిల్లల హాజరు పట్టి పరిశీలించారు 17 మంది పిల్లలకు గాను పూర్తి స్థాయి లో పిల్లలు ఉండడం వారు మంచి ఉషారుగా ఉండడం చూసి సంతోషం వ్యక్తం చేశారు. పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు నిర్వహణ బాగుంది అన్నారు. ప్రతి ఒక్కరు విధులు అంకితభావంతో నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రం, పరిసరాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు అందజేస్తున్న పౌష్టిక ఆహారం సంబందించిన రికార్డులు పరిశీలించి రికార్డుల నిర్వహణ కు సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి కొమరాడ మండలం గుమడ సచివాలయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ,అభివృధి పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను నియమాలను అందరూ తప్పక అనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని, సమయపాలన పాటిస్తూ సమయానికి విధులకు హాజరు కావాలన్నారు. పిర్యాదులు సేకరణ,పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది హాజరుపట్టి, ప్రగతి నివేదికలు పరిశీలించారు వోలెంటరీ.వ్యవస్థను సక్రమంగా వినియోగంచు కోవాలని హితవపలికారు.         ఈ పర్యటనలో కొమరాడ తహశీల్దార్ ప్రసాద రావు, పార్వతీపురం అదనపు సి.డి.పి.ఓ సత్యవతి కంబవలస అంగన్వాడీ సిబ్బంది, గుమడ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Komarada

2021-03-17 18:07:22

అన్ని హంగులతో కౌన్సిల్ హాలు సిద్ధం..

అన్ని హంగులతో కౌన్సిల్ హాలు సిద్దం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధారిటి వి. వినయ్ చంద్ పేర్కొన్నారు.  గురువారం మహా విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయంలోని 2వ అంతస్తులోని కౌన్సిల్ హాలులో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లలో ఏ లోపం ఉండరాదని అధికారులను ఆదేశించారు.  ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.  ఎక్స్ ఆఫీసియో సభ్యులు, ఎన్నికైన వార్డు సభ్యులు హాజరు అవుతారని చెప్పారు.  ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, సభ్యులంతా ఉదయం గం.10.30 ని.లకే చేరుకోవాలన్నారు.  మేయర్ అభ్యర్థికి గుర్తింపు పొందిన పార్టీ సభ్యులు వివిధ ఫారాలు ద్వారా ప్రతిపాదనలు అందజేయాలని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జివియంసి కమీషనర్ నాగలక్ష్మి , విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, అదనపు కమీషనర్లు ఆశాజ్యోతి, రమణి, చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-03-17 18:03:40

అనంతలో మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి..

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక చేపట్టేందుకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికపై జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన అనంతపురం నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ లతోపాటు జిల్లాలోని గుత్తి, కళ్యాణదుర్గం, మడకశిర, పుట్టపర్తి, రాయదుర్గం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, హిందూపురం, కదిరి మునిసిపాలిటీ లలో చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నిక కోసం ప్రిసైడింగ్ అధికారులను నియమించామని, వారి ఆధ్వర్యంలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక చేపట్టడం జరుగుతుందన్నారు. కలెక్టర్ అనంతపురం మేయర్, ఉప మేయర్ ఎన్నిక, జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ ) హిందూపురం మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారన్నారు.  ఎన్నికల పరిశీలకులు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి ) తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను  పర్యవేక్షిస్తారన్నారు..మిగిలిన అన్ని మునిసిపాలిటీ ల్లో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికలను ఆయా ప్రిసైడింగ్ అధికారులు నిర్వహిస్తారన్నారు ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకూడదన్నారు. అందుకనుగుణంగా  పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో  సమన్వయం చేసుకొని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నియమ నిబంధనల ప్రకారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలన్నారు..ఎక్కడా  చిన్న పొరపాటు కూడా జరగకూడదన్నారు.. ప్రణాళికాబద్ధంగా   ఎన్నిక పూర్తి చేయాలన్నారు.  కౌన్సిల్ హాల్ లో సీటింగ్ ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టాలన్నారు..  వీడియో కెమెరాలు, సిసి టీవీ లు ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నిక ప్రక్రియ లో నియమ నిబంధనలు గురించి కలెక్టర్ కూలంకషంగా వివరించారు  టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి ) ఏ.సిరి, ఆర్డీవోలు, ప్రిసైడింగ్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-03-17 17:59:44