1 ENS Live Breaking News

సాలురులో జోనల్ అధికారుల మార్పు..

విజయనగరం జిల్లా సాలూరు మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని జోనల్ అధికారులను మార్పు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేసారు.  సాలూరు మునిసిపాలిటీ ఎన్నికల్లో జోన్-3కి జోనల్ అధికారిగా వ్యవహరిస్తున్న పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం (పిఐయు) కార్యనిర్వహక ఇంజనీరు ఎం.వి.ఎన్. వెంకటరావు స్థానంలో మండల ఇంజనీరింగ్ అధికారి డి.లోకనాధంను నియమిస్తు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు.  పంచాయితీరాజ్ విభాగంలో పనులు చేపడుతున్న దృష్ట్య  ఆ శాఖ పర్యవేక్షక ఇంజనీరు విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు చేయడం జరిగిందని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కోన్న కలెక్టర్ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.

Vizianagaram

2021-03-03 18:01:22

మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలి..

మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ డి ఈ ఓ, ఎం ఈ ఓలు, ప్రధానోపాధ్యాయులు లు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపొందించుటకు కృషి చేయాలన్నారు. జిల్లాలో నాలుగు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో 82.50 శాతం ఓటింగ్ నమోదైందని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదయ్యేలా చూడాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని, ఓటు హక్కు ఉన్న వారి ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తీసుకువచ్చి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాలు ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేశారని, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లు కచ్చితంగా ఓటు వేసేలా చూడాలన్నారు. ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో విద్యార్థుల ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి అందరూ ఓటింగ్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా పాఠశాలల విద్యార్థులు తమ ఇంటిలో 18 ఏళ్లు నిండి ఓటుహక్కు ఉన్నవారు ఓటు వేసేలా వారికి తెలియజేయాలని, విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో పాటు వారి చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్నికల ప్రక్రియ, ఓటు ప్రాధాన్యత గురించి తెలియజేయాలని, దీని ద్వారా ఓటింగ్ శాతం పెంచడానికి వీలు కలుగుతుందన్నారు. ఏ పాఠశాల పరిధిలో అయితే ఎక్కువ శాతం పోలింగ్ శాతం నమోదు అవుతుందో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులను పిలిపించి వారిని సన్మానిస్తామన్నారు. ఒక ఛాలెంజ్ గా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు చేసేందుకు కృషి చేయాలన్నారు.  అలాగే ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నామని, హాయ్ అందరికీ అందేలా లేదా అనేది విద్యార్థులు చూడాలన్నారు. వృద్ధులు ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే వెళ్లి ఓటు వేసేలా కిరణ్ తీసుకోవాలని అధికారులు ఇప్పటికే తెలియజేశామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించామన్నారు.  అన్ని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలను రప్పించి ఓటింగ్లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని, అలాగే మున్సిపల్ ఎన్నికలలో కూడా వలస కూలీల లో వెనక్కి తీసుకు వచ్చి వారు పోలింగ్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలింగ్ రోజున ఓటు హక్కు  కలిగిన వారందరూ కచ్చితంగా ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఎక్కువ శాతం పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే మున్సిపల్ కమిషనర్ల ద్వారా ఓటర్ల వివరాలు ముందస్తుగా సేకరించుకుని ప్రణాళిక బద్ధంగా కార్యచరణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య, డీఈవో శామ్యూల్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ పివిఎన్ఎన్ మూర్తి, సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్, ఎంఈ ఓ లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Anantapur

2021-03-03 17:33:36

జలకళ లక్ష్యాలు తక్షణమే పూర్తి చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో జలకళ లక్ష్యాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. జలకళ బోర్లకు రైతులు www.ysrjalakala.ap.gov.in వెబ్సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చని  కలెక్టర్ చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి దరఖాస్తు చేయుటకు సహకరించాలని ఆదేశించారు. జలకళ ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఉచితంగా ప్రభుత్వం బోర్లను వేయడం జరుగుతుందని తెలిపారు.  జలకళ లక్ష్యాలు, పనుల ప్రగతిని బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జియాలజిస్టులు త్వరితగతిన పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికి 10 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల ప్రశ్నించారు. కనీసం రెండు మండలాలకు ఒక జియాలజిస్టును ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. నియోజకవర్గంలో కనీసం రెండు రిగ్ లు ఉండాలని ఆయన ఆదేశించారు. జలకళ కార్యక్రమం జిల్లాకు అత్యంత ప్రయోజనకరమని అన్నారు. ఖరీఫ్ లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, రబీలో కేవలం 40 లేదా 50 వేల టన్నులు మాత్రమే సేకరణ జరుగుతుందని చెప్పారు. మందస, పాతపట్నం, భామిని తదితర మండలాల్లో సాగునీటి సదుపాయాలు లేవని, జలకళ ద్వారా లబ్ది పొందగలరని అన్నారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు బాగా జరుగుటకు కృషి చేయాలన్నారు.  ఆసరా, సంక్షేమం జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ లక్ష్యాలను చేరుటకు సరాసరిన రోజుకు నాలుగు బోర్లు తవ్వాలని పేర్కొన్నారు. అధికంగా ఏ ప్రాంతాల్లో తవ్వాలో గుర్తించాలని ఆదేశించారు. రిగ్ లను జిల్లా నీటియాజమాన్య సంస్థ ఏపిడిలు, జియాలజిస్టుల ఆధ్వర్యంలో ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ పిడీ హెచ్.కూర్మారావు మాట్లాడుతూ కనీసం 2.50 ఎకరాలు ఉండాలన్నారు. జిల్లాలో వెయ్యి బోర్లు లక్ష్యం కాగా 990 బోర్లు ఇంకా తవ్వాలని ఆయన తెలిపారు. 1141 దరఖాస్తులు అందాయని ఆయన అన్నారు. జిల్లాలో మూడు రిగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో భూగర్భ జలాల శాఖ డిడి సి.ఎస్.రావు, జిల్లా నీటియాజమాన్య సంస్థ ఏపిడిలు డా.విద్యాసాగర్, పి.రాధ, రోజారాణి, అలివేలు, శైలజ, రామారావు, జియాలజిస్టులు, రిగ్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-03-03 14:04:59

పాఠశాల విద్యను మరింత అభివ్రుద్ధి చేస్తాం..

విద్యార్థుల‌కోసం ప్ర‌భుత్వం ఎన్నో సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తోంద‌ని, వాటిని వినియోగించుకొని బాగా క‌ష్ట‌ప‌డి చ‌దివి, మంచి పేరు తెచ్చుకోవాల‌ని పాఠ‌శాల‌ విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుడితి రాజ‌శేఖ‌ర్ కోరారు.   విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణం, కొత్త‌పేటలో నాడూ-నేడు కార్య‌క్ర‌మం క్రింద అభివృద్ది చేసిన పుర‌పాల‌క‌ ప్రాధ‌మిక పాఠ‌శాల‌ను ఆయ‌న బుధ‌వారం సంద‌ర్శించారు. ప్ర‌తీ త‌ర‌గ‌తి గ‌దినీ, విద్యార్ధుల‌ను, వారి యూనిఫారాల‌ను, బ‌ల్ల‌ల‌ను, గోడ‌ల‌కు వేసిన రంగులు, చిత్రాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. చేపట్టిన‌ అభివృద్ది ప‌నుల‌ప‌ట్ల ఆయ‌న సంతృప్తిని వ్య‌క్తం చేశారు. పాఠ‌శాల రూపురేఖ‌లు సంపూర్ణంగా మారిపోయాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.   ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌తో రాజ‌శేఖ‌ర్ మాట్లాడారు. ప్ర‌భుత్వం క‌ల్పించిన వ‌స‌తుల‌ప‌ట్ల ఆరా తీశారు. బ‌ల్ల‌లు సౌక‌ర్య‌వంతంగా ఉన్న‌దీలేనిది అడిగి తెలుసుకున్నారు.  వివిధ అంశాల‌ప‌ట్ల వారి‌ అవ‌గాహ‌నా స్థాయిని ప‌రిశీలించారు. అల్ల‌రి చేయ‌కుండా పాఠాలు వినాల‌ని సూచించారు. సందేహాలు అడిగిన వారే మంచి విద్యార్థుల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో మొక్క‌ను నాటారు.  ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, స‌మ‌గ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ విక్ట‌ర్ సెల్వి, మౌళిక వ‌స‌తుల కల్ప‌న స‌ల‌హాదారు ముర‌ళి, జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, డిఇఓ జి.నాగ‌మ‌ణి,  అసిస్టెంట్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పివివిడి ప్ర‌సాద‌రావు, ఎంఇఓ రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kothapeta

2021-03-03 13:50:29

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ..

మొక్కలను  విస్తారంగా  నాటడం వలన పర్యావరణ పరిరక్షణ కు తోడ్పడగలమని జిల్లా కలెక్టర్ డా. ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. మంగళవారం బొండపల్లి మండలం వేండ్రం గ్రామంలో గల భోగి వాని  చెరువు దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం  కలెక్టర్ ఆధ్వర్యం లో జరిగింది. అనంతరం గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ విజయనగరం జిల్లా శాఖ ఆద్యర్వంలో నిర్వహించిన బ్లడ్ డోనేషన్ క్యాంప్ ను కలెక్టర్  ప్రారంభించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు పెంచడం, చెరువుల్ను సంరక్షించడం,రక్త దానం చేయడం  అనే ముఖ్యమైన మూడు అంశాలపై  దృష్టి పెట్టి జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ప్రమాదాలకు గురై చావు బతుకుల మధ్య నున్న అనేక మంది బాధితులు రక్తం కోసం ఆసుపత్రులలో అవస్థలు పడుతున్నారని,  రక్త దానం వలన ఇలాంటి వారికీ ఎంతో సహాయం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా  గ్రామంలో ప్రజలను  చైతన్యవంతులు చేసి మొక్కలు నాటే  కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యం చేస్తున్న గ్రామానికి చెందిన శ్రీ రామదండు యువతను ప్రత్యేకంగా అభినందించారు.        ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక అటవీ శాఖ అధికారి జానకిరావు ,డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, నెహ్రు యువ కేంద్ర  డిస్ట్రిక్ కో.ఆర్డినేటర్ విక్రమాదిత్య, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రసాదరావు, ఎం.పి.డి.ఓ త్రివిక్రమ్ రావు, తహశీల్దార్ సీతారామరాజు, ఎం.ఈ.ఓ  విమలమ్మ,డా. వెంకటేశ్వరరావు, కాంట్రాక్టర్ శివ రాజు, రిటైర్డ్ టీచర్ విజయలక్ష్మి,హరిత విజయనగరం కో.ఆర్డినేటర్ రామ్మోహన్, సభ్యులు, సాయి సిద్దార్థ విద్యా సంస్థల డైరెక్టర్ శేఖర్, స్కూల్ చైర్మన్ కె.రాజు, స్కూల్ ఉపాద్యాయులు యం వై నాయుడు, సిచ్. యన్. రావు, ఉజ్వల, ఏంజెల్ స్వచ్చంద సంస్థల  ప్రతినిధులు రమేష్ బాబు,సర్పంచ్ కె. శ్రీనివాస్, ఉపాధి హామీ  సిబ్బంది, రెడ్ క్రాస్ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-02 20:56:51

ప్రతీ ఎకరాకు సాగునీరు అందాలి..

తూర్పుగోదావ‌రి జిల్లాలో ర‌బీ వ‌రి సాగుకు నీటి ఎద్ద‌డి లేకుండా ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హరిస్తున్నామ‌ని, నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో ప్ర‌తి ఎక‌రాకూ సాగునీరు అందేలా చూస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న నీటి వ‌న‌రులు; ‌సాగు, తాగునీటికి కొర‌త లేకుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ స‌మావేశం నిర్వ‌హించారు. ఇరిగేష‌న్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో ర‌బీసాగుకు నీటి స‌ర‌ఫ‌రా స్థితిగ‌తులు, పంట ప‌రిస్థితులపై స‌మీక్షించారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో దిగుబడులు సాధించేలా నీటి త‌డులు అందించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు కాఫ‌ర్ డ్యామ్ ప‌నుల నేప‌థ్యంలో ఈ నెల చివ‌రి నాటికి గోదావ‌రి కాలువ‌లకు నీటి స‌ర‌ఫ‌రా నిలిచిపోనున్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న విలువైన స‌మ‌యంలో  క్షేత్ర‌స్థాయి అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రిస్తూ ర‌బీ పంట ప్ర‌ణాళిక‌ను దిగ్విజ‌యంగా పూర్తిచేయాల‌ని ఆదేశించారు. జిల్లాలో దాళ్వా పంట కాలంలో 1,61,632 హెక్టార్ల విస్తీర్ణంలో వ‌రి సాగవుతోంద‌ని.. చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా ప్ర‌తి రైతుకూ మేలు జ‌రిగేలా చూడాల‌న్నారు. సాగునీటిపై ఒత్తిడి ఉన్న ప్రాంతాలను ఇప్ప‌టికే గుర్తించామ‌ని, ఆయా మండ‌లాల్లో రైతుల బృందాలు/‌రైతులు  ఏర్పాటు చేసుకున్న ఇంజన్ల‌కు ప్ర‌భుత్వ‌మే ఆయిల్‌ను అందిస్తోంద‌ని తెలిపారు. డ్రెయిన్ల నుంచి నీటిని కాలువ‌ల‌కు ఎత్తిపోసి, అక్క‌డి నుంచి నీటిని పంట‌ల‌కు మ‌ళ్లిస్తున్నామ‌ని తెలిపారు. ఈ ప్ర‌క్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా కొన‌సాగించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇంకా ఈ సౌక‌ర్యం అవ‌స‌ర‌మైన రైతులు గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కుల (వీఏఏ)‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు. వీఏఏల సిఫార్సుతో ఇరిగేష‌న్ ఏఈలు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆయిల్ స‌ర‌ఫ‌రాకు తూర్పు డెల్టాలో 24 ఏజెన్సీలు, సెంట్ర‌ల్ డెల్టాలో ఎనిమిది ఏజెన్సీలు ప‌నిచేస్తున్నాయ‌ని, మ‌రికొన్ని కూడా అందుబాటులోకి రానున్నాయ‌ని తెలిపారు. గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు మొద‌లు అధికారులు రైతుల‌కు అందుబాటులో ఉండాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు వారికి అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు అందించాల‌ని సూచించారు. ప్ర‌తి నీటిబొట్టు ప్రాధాన్యాన్ని గుర్తెరిగి, రైతులు కూడా పొదుపు చ‌ర్య‌లు పాటించాల‌ని కోరారు. తూర్పు డెల్టాలో కాజులూరు, క‌ర‌ప‌, తాళ్ల‌రేవు, పెద‌పూడి, ఆల‌మూరు, క‌పిలేశ్వ‌ర‌పురం, కె.గంగ‌వ‌రం, రామ‌చంద్రాపురం త‌దిత‌ర మండ‌లాల‌తో పాటు సెంట్ర‌ల్ డెల్టాలోని అమ‌లాపురం, అల్ల‌వ‌రం, ఉప్ప‌ల‌గుప్తం, కాట్రేనికోన‌, మామిడికుదురు, అయిన‌విల్లి త‌దిత‌ర మండ‌లాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని వ్య‌వ‌సాయ‌, ఇరిగేష‌న్ అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. త‌క్కువ నీటితో పంట సాగుచేసి అధిక దిగుబడులు సాధించేందుకు వీలుక‌ల్పించే ఎండు-పండు విధానంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని క‌లెక్ట‌ర్ అదేశించారు. తాగునీటి విష‌యంలోనూ ప్ర‌జ‌లు పొదుపు చ‌ర్య‌లు పాటించేలా చూడాల‌న్నారు. నెలాఖ‌రు నాటికి అన్ని ట్యాంకులూ పూర్తిస్థాయిలో నిండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈసారి ప్ర‌త్యేకంగా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఎండు-పండు విధానంతో అధిక దిగుబడులు: వ‌్య‌వ‌సాయ అధికారులు‌ ప్ర‌స్తుతం సాగునీటికి ఇబ్బంది ఏమీ లేద‌ని వ్య‌వ‌సాయ‌, ఇరిగేష‌న్ అధికారులు వెల్ల‌డించారు. ఇన్‌ఫ్లో త‌గ్గిన నేప‌థ్యంలో  సాగునీటికి ఒత్తిడి ఉన్న ప్రాంతాల్లో పొదుపు చ‌ర్య‌లు పాటించాలని వ్య‌వ‌సాయ అధికారులు రైతుల‌కు సూచించారు. ఎండు-పండు విధానంతో మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని.. ఈ విధానంలో నీటిని నిల‌గ‌ట్ట‌డం అనేది ఉండ‌ద‌ని, పొలంలోని మ‌ట్టి త‌డిగా ఉంటే స‌రిపోతుంద‌న్నారు. పిల‌క‌ల ఉద్ధృతి పెర‌గ‌డంతో పాటు కంకులు వేసే పిల‌క‌ల సంఖ్య కూడా పెరుగుతుంద‌ని, త‌ద్వారా దిగుబ‌డి అధిక‌మ‌వుతుంద‌ని వివ‌రించారు. త‌క్కువ నీటి వినియోగంతో చీడ‌పీడ‌ల ఉద్ధృతి కూడా త‌గ్గేందుకు అవ‌కాశ‌ముంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో పురుగు మందుల ఖ‌ర్చు త‌గ్గి, పెట్టుబ‌డులు త‌గ్గుతాయ‌ని వివ‌రించారు. స‌మావేశంలో ఇరిగేష‌న్, డ్రెయిన్, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా అధికారులు ఆర్‌.శ్రీరామ‌కృష్ణ‌, టి.గాయ‌త్రీదేవి, ర‌వికుమార్‌, ఐవీ స‌త్య‌నారాయ‌ణ, కె.రాంబాబు, కె.వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రుల‌తో పాటు వ్య‌వ‌సాయ శాఖ జేడీ కేఎస్‌వీ ప్ర‌సాద్‌, డీడీ రామారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-03-02 20:32:29

బియ్యం వాహనాల రాకను తెలియజేయాలి..

బియ్యం పంపిణీ వాహనాల రాకను ముందుగా  తెలియజేయాలని పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ అన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  సమీక్షించారు. కమీషనర్ మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త ఫార్మాట్ లో చేపట్టడం జరిగిందని దానిని వివరించాలని సూచించారు. గతంలో పేకేట్ల రూపం నుండి మార్పు చేసి తూనిక వేసి అందించడం జరుగుతుందని తెలిపారు. తద్వారా నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చని పేర్కొన్నారు. గతంలో కొన్ని కెదులలో పేకెట్లను ప్రక్క ఇంట్లో లేదా ఇతర ప్రదేశాల్లో పెట్టేవారని, తరువాత బయోమెట్రిక్ తీసుకునేవారని చెప్పారు. ప్రస్తుతం అందుకు అవకాశం లేదని వాహనం ఉన్నప్పుడు రేషన్ తీసుకోవాలని తద్వారా కచ్చితంగా లబ్ధిదారులకు చేరుతుందని పేర్కొన్నారు. విధానాన్ని ఎందుకు మార్పు చేసామనేది ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వాలంటీర్లు క్రియాశీలకంగా ఉన్న చోట్ల బాగా జరుగుతుందని అన్నారు. వాలంటీర్లు ముందుగానే వాహనం రాకను తెలియజేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ ను తీసుకోవచ్చని,  పోర్టబిలిటీ ఉందని కమీషనర్ స్పష్టం చేశారు. కొండ ప్రాంతాలు, తదితర ప్రాంతాల్లో వాహనాలను సాధ్యమైనంత దగ్గరగా గ్రామాలకు తీదుకువెళ్లాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో కార్యక్రమం బాగా అమలు జరుగుతుందని చెప్పారు. సక్రమంగా చేస్తే 15 రోజుల్లో సరుకులు అందించడం పూర్తి చేయవచ్చని ఆయన అన్నారు. గ్రామంలో ఉంటూనే వాహనదారులు మంచి ఆదాయం పొందుతున్నారని తెలిపారు. ఏప్రిల్1 నుండి అన్ని వాహనాలు ఒకసారి పంపిణీ ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. దుకాణాలు రేషనలైజేషన్ చేయాలని, ఆసక్తి లేని వాహనదారులను మార్చవచ్చని తెలిపారు. ఐటిడిఏ పిఓ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఇంధన ఖర్చు వెయ్యి వరకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులు అనుసంధానం కాని 15 గ్రామాలకు దగ్గరా వెళుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గరోడా, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీవో లు ఐ. కిశోర్, టివిఎస్ జి  కుమార్, డి.ఎస్.ఓ డి.వి.రమణ, పౌర సరఫరాల సంస్థ డిఎం ఎన్. నరేంద్ర బాబు, విజిలెన్స్ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-03-02 19:59:20

ఇన్ని అవార్డులు రావ‌డం చాలా అరుదు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాకి అతి త‌క్కువ కాలంలోనే ఇన్ని అవార్డులు రావ‌డం చాలా అరుద‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను, రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్ కోన శ‌శిధ‌ర్ ప్ర‌శంసించారు. విజయనగరం జిల్లాకి పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్ లో కలెక్టర్ ను అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇదంతా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌ గొప్ప‌ద‌న‌మ‌ని, ఆయ‌న నిజంగా మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అని కొనియాడారు. అన్నిరంగాల్లోనూ అవార్డుల‌ను సాధించ‌డం విశేష‌మ‌ని పేర్కొన్నారు. జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న‌, క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో ఉన్న అవార్డులు, ప్ర‌శంసాప‌త్రాలు, జ్ఞాపిక‌ల‌ను ఆయ‌న ఆస‌‌క్తిగా తిల‌కించారు. ప్ర‌తీ అవార్డు గురించీ క‌మిష‌న‌ర్‌కు, క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ వివ‌రించారు. క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ హ‌యాంలో ప‌నిచేయ‌డం త‌మ‌కు ల‌భించిన గొప్ప అవ‌కాశ‌మ‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్‌కుమార్ పేర్కొన్నారు.

విజయనగరం

2021-03-02 19:49:59

ఇంటింటి బియ్యంపై కమిషనర్ ఆరా..

అమ్మా బియ్యం ఎలా ఉన్నాయి ?. ఇంటింటికీ తెచ్చి పంపిణీ చేస్తున్నారా?. మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ?. ఇంత‌కు ముందు ప‌ద్ద‌తి బాగుందా ? ఇప్ప‌టి ప‌ద్ద‌తి బాగుందా ?. ఎన్నిరోజుల ముందు మీకు స‌మాచారం ఇస్తున్నారు ?. తూకం స‌రిపోతోందా ?. సంచిల్లో వేసి ఇస్తున్నారా ?. అంటూ రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్ కోన శ‌శిధ‌ర్ ప్ర‌శ్నించారు. ఆయ‌నే నేరుగా ల‌బ్దిదారుల ఇళ్ల‌కు వెళ్లి, ఇంటింటికీ రేష‌న్ స‌ర‌ఫ‌రా ప‌థ‌కంపై వాక‌బు చేశారు. ఆయన రాష్ట్ర‌ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌కు స‌ర్వోన్న‌తాధికారి అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఎటువంటి భేష‌జాల‌కు పోకుండా, త‌న హోదాను ప్ర‌క్క‌న‌పెట్టి మురికివాడల్లో సైతం ఇంటింటికీ ప‌ర్య‌టించారు. ఇంటింటికీ రేష‌న్ ప‌థ‌కం అమ‌లు తీరుపై వాక‌బు చేశారు. ప‌థ‌కంపై పేద ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. సంచార‌ వాహ‌నాల ద్వారా జ‌రుగుతున్న స‌రుకుల పంపిణీని స్వ‌యంగా ప‌రిశీలించారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని లంకాప‌ట్నం, బొగ్గుల‌దిబ్బ ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం ఆయ‌న ప‌ర్య‌టించారు.                            లంకా ప‌ట్నంలో ప‌లువురు మ‌హిళ‌లతో క‌మిష‌న‌ర్‌తో మాట్లాడారు. బియ్యం చాలా బాగున్నాయ‌ని ల‌బ్దిదారులు సంతృప్తిని వ్య‌క్తం చేశారు. రేష‌న్ కోసం ఇంత‌కుముందు డిపోల‌వ‌ద్ద గంట‌లు గంట‌లు నిల్చొని ఉండాల్సి వ‌చ్చేద‌ని, ఇప్పుడు ఆ స‌మ‌స్య తీరిపోయింద‌ని వారు చెప్పారు. త‌మ వీధిలోకే బండి ద్వారా స‌రుకులు తెచ్చి ఇస్తున్నార‌ని తెలిపారు. తూకాల్లో తేడా లేద‌ని, సంచిలో స‌రుకులు వేసి అందిస్తున్నార‌ని చెప్పారు. ఎండియు ఆప‌రేట‌ర్ల‌తో కూడా క‌మిష‌న‌ర్ మాట్లాడారు. వారి స‌మ‌స్య‌ల‌పైనా దృష్టి పెట్టారు. త‌మ ప్రాంతంలోనే, త‌మ వారికే స‌రుకులు అందించే ప‌ని దొర‌క‌డం చాలా గౌర‌వ‌మ‌ని, దానిని నిల‌బెట్టుకోవాల‌ని వారిని శ‌శిధ‌ర్ కోరారు. వీలైనంత త్వ‌ర‌గా స‌రుకుల‌ను పంపిణీ చేయాల‌ని, రోజుకు క‌నీసం 150 మంది ల‌బ్దిదారుల‌కు పంపిణీ చేయాల‌ని ఆయ‌న‌ సూచించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసిహెచ్ కిశోర్ కుమార్‌, డిఎస్ఓ పాపారావు, సివిల్ స‌ప్ల‌యిస్ డిఎం భాస్క‌ర్రావు, విజ‌య‌న‌గ‌రం తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు, సిఎస్‌డిటిలు జ‌గ‌న్‌, శ్రీ‌నివాస‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-02 19:29:02

తడిపొడి పొడిచెత్త విడివిడిగా అందించాలి..

జివిఎంసి మూడవ జోన్ పరిధిలో 19 వ వార్డులోని పెద్ద జాలారిపేట ప్రాంతంలో చేపడుతున్న పనులను సత్వరమే పూర్తిచేయాలని జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి .ఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవార ఈ ప్రాంతంలో పర్యటించి అక్కడ జివిఎంసి వివిధ విభాగాలు చేపడుతున్న పలు పనులను పరిశీలించారు. పెద్ద జాలారిపేట లోని పలు పనులను ఆమె స్వయంగా సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడారు.. ముఖ్యంగా, పారిశుధ్యపు విభాగాలు చేపడుతున్న పనులు, మంచినీటి సరఫరా జరుగుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక సౌచాలయాలను (టోయ్ లెట్లను) స్వయంగా పరిశీలించి వాటిని అక్కడగల ప్రజలు తప్పని సరిగా వినియోగించుకోనేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని, వాటిని నిరంతరం పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. కాలువలు పూడికతీత, రోడ్లను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడడం వంటివి శానిటరీ కార్యదర్శులు బాధ్యతలు తీసుకోవాలని మైక్రో పాకెట్ విధానాన్ని అనుసరించి గృహాల నుండి చెత్త సేకరణను “తడి - పొడి” మరియు “ప్రమాదకర” చెత్తగా విడదీసి వాహనానికి అందించేటట్లు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కార్యదర్శులను ఆదేశించారు. పెద్ద జాలరిపేట బీచ్ ప్రాంతాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. సముద్రంలోకి కలుస్తున్న కాలువ నీటిని ఎస్.టి.పి. వైపు మళ్ళించడానికి గల అవకాశాలను గూర్చి ఇంజినీరింగు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీరు వినయ్ కుమార్, జోనల్ కమిషనర్ – 3 శ్రీనివాసరావు, అసిస్టెంట్ సిటీ ప్లాన్నర్ భాస్కర్ బాబు, స్మార్ట్ సిటీ కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్, డిప్యూటీ ఇంజినీరు శ్రీనివాస్, నీరు, ఎలక్ట్రికల్ విభాగపు సహాయక ఇంజినీరులు విల్సన్, నాయుడు, శానిటరీ సూపర్వైజర్ జనార్ధన్, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, మలేరియా ఇన్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులు  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-03-02 19:14:36

దక్షణాది రాష్ట్రాల సమావేశం విజయవంతం కావాలి..

తిరుపతి పట్టణంలో ఈనెల 4న నిర్వహించే 29 వ  దక్షణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడానికి  అధికారులందరూ సమన్వయంగా   పని చేసి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని  జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం తిరుపతి పట్టణ  అశోక్ ఫంక్షన్ హాల్ నందు మున్సిపల్ కమీషనర్ పి.ఎస్.గిరీషా, జెసి (అభివృద్ధి) వి.వీరబ్రహ్మం, జెసి (సంక్షేమం) రాజశేఖర్, తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, స్మార్ట్ సిటీ జి.ఎం  వి.ఆర్ చంద్రమౌళి లతో కలిసి  ఈ నెల 4న తిరుపతి పట్టణము నందు నిర్వహించే  29 వ  దక్షణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సంబందించి నోడల్  అధికారులు , లైజన్ అధికారులతో  జిల్లా కలెక్టర్  సమీక్షాసమావేశం నిర్వహించారు.  ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లైజన్ అధికారులు విధులను సక్రమముగా నిర్వహించేందుకు మరొకమారు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  వివిద రాష్ట్రాల నుండి వచ్చే ముఖ్యమైన అధికారులకు 29 వ  దక్షణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి వివిధ రాష్ట్రాల నుండి ముఖ్యమైన అధికారులు రావడం జరుగుతుందని వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాద్యత లైజనింగ్ అధికారులదేనని తెలిపారు. లైజనింగ్ అధికారులకు కేటాయించిన అధికారులతో మాట్లాడుకుని వారు ఎప్పుడు వస్తారని , ఎంత మంది వస్తారు విమానాల ద్వారా వస్తారా వంటి వివరాలను తెలుసుకోవాలన్నారు.  బెంగళూరు – చెన్నై ఎయిర్పోర్టు నందు హెల్ప్ డెస్క్ ను  ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. బెంగళూరు – చెన్నై ఎయిర్పోర్టుకు వచ్చే విధంగా ఉంటే ముందుగానే సంబందిత ఎయిర్పోర్టు చేరుకోవాలని తెలిపారు. తాజ్ హోటల్ పరిసర ప్రాంతాలు మరియు ఎయిర్పోర్టు నుండి తాజ్ హోటల్ కు చేరుకొనే రోడ్ల మరమ్మత్తులను పూర్తి చేయాలని   రోడ్లు భవనాల శాఖ ఎస్.ఈ. ని  కలెక్టర్  ఆదేశించారు. విద్యుత్ సరఫరా కు సంబందించిన పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని సమావేశం జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఎస్.ఈ ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్.ఈ కలెక్టర్ కు వివరించారు. సమావేశంలో ఎల్.ఈ.డి. మైక్రో ఫోన్స్ , వీడియో కవరేజ్  సంబందించినవి జాగ్రత్తగా చేయాలని డి.ఈ. సమాచార శాఖ ఇంజినీరు ను ఆదేశించారు. ఫోటో కవరేజికి సంబందించి ఫోటోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకోవాలని డిపిఆర్ఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముఖ్యమైన వి.ఐ.పి లకు ప్రోటోకాల్ ప్రకారం  పుష్ప గుచ్చాలు , మొమెంటోస్ అందించేందుకు కావలసినవి అందుబాటులో ఉంచుకోవాలని జి.ఎం.డి.ఐ.సి. ని ఆదేశించారు.  తాజ్ , గ్రాండ్ రిడ్జ్, మానస సరోవర్, తిరుమలలో   వి.వి.ఐ.పి లు బస చేసే చోట ఆహార పదార్థాలను తనిఖీ చేయాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.  వి.ఐ.పి లకు , అధికారులకు,  వాహనాలకు పాసులు అందజేయాలని జెడ్.పి. సి.ఈ.ఓ ను ఆదేశించారు.  వాహనాల పార్కింగ్ , శానిటేషన్ శుభ్రంగా ఉండే విధంగా చేయాలని డి.పి.ఓ ను ఆదేశించారు.  తాజ్ హోటల్ లో  జరిగే సమావేశం కు సంబందించి అన్ని ఏర్పాట్లను చేయించాలని, స్నాక్స్, వాటర్ బాటల్స్,  సానిటైజర్స్ , మాస్కూలు, అందుబాటులో ఉండే విధంగా చూడాలని స్మార్ట్ సిటీ జి.ఎం ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పి.డి. చంద్రశేఖర్, డిఆర్ డిఎ పి.డి. తులసి, తుడా సెక్రెటరీ లక్ష్మి, జి.ఎం.డి.ఐ.సి. ప్రతాప్, ఎస్.ఈ కార్పొరేషన్ ఈ.డీ. రాజశేఖర్ నాయుడు, మెప్మా పి.డి. జ్యోతి, ఆర్డీఓ చిత్తూరు రేణుక, జెడ్.పి. సి.ఈ.ఓ ప్రభాకర్ రెడ్డి, డి.ఈ. బాల కొండయ్య,  నోడల్, మరియు లైజన్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2021-03-01 16:55:04

చంద్రబాబు నిరసనకు అనుమతిలేదు..

తిరుపతిలో చంద్రబాబు చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని తిరుపతి అర్భన్ ఎస్పీ అప్పలనాయుడు పేర్కొన్నారు. సోమవారం అనుమతి లేకుండా చంద్రబాబు రావడంతో ఆయనను రేణిగుంట ఎయిర్ పోర్టులో అడ్డుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఎన్నికల నిభందనలను పక్కాగా అమలు చేసే విషయంలో భాగంగానే చంద్రబాబుని అడ్డుకోవడం జరిగిందన్నారు. ఆయన పర్యటనకు అనుమతి లేదనే విషయాన్నిచంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని.. అయినా  ఆయన వినకుండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని ఎన్నికల నిభందనలు అనుసరించి ఆయనను అడ్డుకున్నామన్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల నిబంధనల విషయంలో విఘాతం కల్పించకుండా పోలీసులకు సహకరించాలని అర్భన్ ఎస్పీ పేర్కొన్నారు.

Tirupati

2021-03-01 16:51:52

విశాఖ డిపీఓ క్రిష్ణకుమారికి స్థాన చలనం..

విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారిని ప్రభుత్వం బదిలీచేసింది. ఆమెను జిఏడికి రోపోర్టు చేయాల్సిందిగా మెయిల్ ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయనేది ఆ మెయిల్ యొక్క సారాంశం. అయితే ఏ జిల్లాకి బదిలీ చేశారో అందులో పేర్కొనకుండి జిఏడికి రాపోర్టు చేయాల్సిందిగా ఆ ఉత్తర్వులు ఉన్నాయని డిపిఓ క్రిష్ణకుమారి ఈఎన్ఎస్ లైవ్ కు ప్రత్యేకంగా తెలియజేశారు. ఈ ఎన్నికల సమయంలో జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజనను బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా గ్రూప్1 అధికారి డిపిఓ క్రిష్ణకుమారికూడా బదిలీచేసింది. ఈ ఇద్దరు అధికారులను జిఏడికే రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఈ అధికారులను బదిలీ చేశారని సమాచారం అందుతుంది. అయితే ఎన్నికల తరువాత మళ్లీ వీరిని ఇదే స్థానానికి తిరిగి పంపిస్తారని ప్రచారం జరుగుతున్నా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాలి.

Visakhapatnam

2021-03-01 15:07:20

పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రిసైడింగ్ అధికారులు కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. పోలింగ్ కేంద్రాల్లో ఓట‌ర్లు ప్ర‌శాంతంగా ఓటు వేసేందుకు అనుగుణ‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డం, వేగంగా ఓటింగ్ జ‌రిగేలా చూడ‌టం ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచ‌వ‌చ్చ‌ని సూచించారు.  పిఓలు, ఏపిఓలు, జోన‌ల్ అధికారుల‌కు క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం ఎన్నిక‌ల‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఓట‌ర్లు ఎండ‌కు ఇబ్బంది ప‌డ‌కుండా నీడ క‌ల్పించాల‌ని, త్రాగునీరు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో పిఓల పాత్ర చాలా కీల‌క‌మ‌న్నారు.  వివాదాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా,  స‌మ‌ర్ధ‌వంతంగా, స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తో విధులను నిర్వ‌హించ‌డం ద్వారా ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రుగుతాయ‌ని చెప్పారు. నిష్పాక్షికంగా, పార‌ద‌ర్శ‌కంగా, త‌ట‌ష్టంగా విధుల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు.  నిర్ణీత స‌మ‌యం ఉద‌యం 7గంట‌ల‌కే ఖ‌చ్చితంగా పోలింగ్ మొద‌లు కావాల‌ని, స‌మ‌యం ముగిసేవ‌ర‌కూ ఎట్టి ప‌రిస్థితిలోనూ పోలింగ్‌కి విరామం ఇవ్వ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల నిబంధ‌నావ‌ళిని త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని, అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచించారు. అన్ని ర‌కాల ఎన్నిక‌ల‌ను స‌జావుగా, ప్ర‌శాంతంగా నిర్వ‌హించ‌డంతోపాటు, అత్య‌ధిక ఓటింగ్ శాతాన్ని న‌మోదు చేయ‌డంలో జిల్లాకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా ఆ పేరును నిల‌బెట్టేందుకు ప్ర‌తీఒక్క‌రూ కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.                        ఎన్నిక‌ల శిక్ష‌ణ నోడ‌ల్ అధికారి ఎస్‌.అప్ప‌ల‌నాయుడు ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా ఎన్నిక‌ల విధుల‌ను వివ‌రించారు. ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, స‌హాయ క‌మిష‌న‌ర్ పివివిడి ప్ర‌సాద‌రావు, నెల్లిమ‌ర్ల మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి.అప్ప‌ల‌నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-01 14:33:19

లెక్కింపు కేంద్రాల పరిశీలిన..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు జరుగబోయే ఎన్నికలకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను, స్ట్రాంగ్ రూములను అన్ని సౌకర్యాలతో  ఏర్పాట్లు  చేయాలని జివిఎంసి కమిషనర్ మరియు అదనపు ఎన్నికల అథారిటీ నాగలక్ష్మి.ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో కలిసి ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ బ్లాకుల్లో జరుగుచున్న ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ బ్లాకు లో 2, 3, 4, 6 జోన్ లకు సంబంధించి ఏర్పాటు చేసిన రిసెప్షన్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను మరియు స్ట్రాంగ్ రూములను పరిశీలించి అధికారులకు కమిషనర్ పలు సూచనలు చేసారు. ముఖ్యంగా, జోన్ ల వారీగా ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లలో చేపట్టవలసిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, బార్కేడింగ్ ఏర్పాట్లు చేయడం, స్ట్రాంగ్ రూముల లో క్రిమి సంహారక రసాయనాలు చల్లించడం, కౌంటింగ్ కేంద్రలాలో అవసరమైన కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం, కావలసిన మౌళిక సదుపాయాలను కల్పించడం వంటి పలు కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ ఎన్నికలు ప్రక్రియ సజావుగా జరిపేందుకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కేంద్రాల పరిశీలనా కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి. ఆషా జ్యోతి, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, వ్యయ పరిశీలకులు వై. మంగపతి రావు, పర్యవేక్షక ఇంజినీరులు శివప్రసాద రాజు, వేణుగోపాల రావు, వినయ్ కుమార్, శాంసన్ రాజు, రాజా రావు, సంబంధిత జోనల్ కమిషనర్లు, కార్య నిర్వాహక ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2021-02-28 23:06:01