1 ENS Live Breaking News

ప‌ట్ట‌ణాల ప‌రిశుభ్ర‌త‌కు క్లాప్ అమలు..

ప‌ట్ట‌ణాల ప‌రిశుభ్రంగా, అందంగా, అహ్లాద‌క‌రంగా తీర్చిదిద్దడానికి ప్ర‌భుత్వం కొత్త‌గా రూపొందించిన క్లాప్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణ సిద్దం చేయాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మం అమ‌లుపై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, టిట్కో ఇంజ‌నీర్ల‌తో త‌న క్యాంపు కార్యాల‌యంలో బుధ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప‌ట్ట‌ణాల్లో పరిశుత్ర‌ను, ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు ప్ర‌భుత్వం కొత్త‌గా క్లాప్ పేరుతో క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వంద రోజుల‌ ప్ర‌త్యేక పారిశుధ్య‌ కార్య‌క్ర‌మాన్ని రూపొందించింద‌ని చెప్పారు. దీనిలో భాగంగా  ప్ర‌తీ ఇంటినుంచి చెత్త సేక‌ర‌ణ‌, సేక‌రించిన చెత్త‌ను వేరుచేయ‌డం, స‌మ‌ర్థవంతంగా చెత్త నిర్వ‌హ‌ణ, మొక్క‌ల పెంప‌కం త‌దిత‌ర కార్యక్ర‌మాల ద్వారా ప‌రిశుభ్ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ట్టణాల‌ను రూపొందించ‌డం ల‌క్ష్య‌మ‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు జిల్లాకు నోడ‌ల్ అధికారిగా ఛీఫ్ ఇంజ‌నీర్ గోక‌ర్ణ శాస్త్రిని నియ‌మించినట్లు తెలిపారు. ఈ నోడ‌ల్ అధికారులు ప్ర‌త్యేక పారిశుధ్య కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించ‌డంతోపాటుగా, రోడ్ల‌ను మ‌ర‌మ్మ‌తు చేసి అందంగా తీర్చిదిద్ద‌డం, ప్ర‌తీ ఇంటికీ త్రాగునీటి స‌ర‌ఫ‌రా కార్య‌క్రమాల‌ను కూడా ప‌ర్య‌వేక్షిస్తార‌ని చెప్పారు. జిల్లాలో ఇప్ప‌టికే ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని, ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా దీనిని మ‌రింత ముమ్మ‌రం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.                  టిట్కో ఇళ్ల నిర్మాణంపై స‌మీక్షించారు.  విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని టిట్కో ల‌బ్దిదారుల‌నుంచి సుమారుగా 57 కోట్లు, నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయితీ  నుంచి 10 కోట్లు, సాలూరు మున్సిపాల్టీ నుంచి 3 కోట్లు, బొబ్బిలి మున్సిపాలిటీ నుంచి 12 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేయాల్సి ఉంద‌న్నారు. ల‌బ్దిదారుల‌నుంచి రావాల్సిన వాటాను వ‌సూలు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అనంత‌రం పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్దిశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వై.శ్రీ‌ల‌క్ష్మి నిర్వ‌హించిన జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్ పాల్గొన్నారు. క్లాప్ కార్య‌క్ర‌మం అమ‌లుకు తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. ఈ స‌మావేశంలో విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, టిట్కో ఇఇ శ్రీ‌నివాస‌రావు పాల్గొన్నారు.

Vizianagaram

2021-02-24 19:37:44

16 మంది సాగర మిత్రాల నియామకం..

తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు  సహాయ పడేందుకు  రెండు తీర ప్రాంత మండలాలకు 16 మంది సాగర మిత్ర పోస్ట్ లను నియమించినట్లు సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు.   సంయుక్త కలెక్టర్(రెవిన్యూ), పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. నరసింహులు, మత్స్య శాఖ ఉప సంచాలకులు  నిర్మలా కుమారి  సభ్యులుగా గల కమిటి బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో   సాగర మిత్ర పోస్టల ఇంటర్వ్యూ లను  జరిపారు.  16 పోస్ట్ ల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 174 దరఖాస్తులు అందాయని, 1:3 నిష్పత్తి లో  48 మందికి కాల్ లెటర్స్ పంపగా 45 మంది హాజరైనారని, అందులోంచి  16 మందిని రోస్టర్ పాటిస్తూ మెరిట్ ప్రకారంగా ఎంపిక చేయడం జరిగిందని జే.సి తెలిపారు.  వీరికి ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారి చేయడం జరుగుతుందన్నారు.   వీరు తీర ప్రాంతల్లో పనిచేస్తూ, బోట్ల రిజిస్ట్రేషన్, ప్రభుత్వం నుండి మత్స్యకా రులకు  అందవలసిన సమాచారాన్ని అందించడం , పధకాల గురించి అవగాహనా కల్పించడం ,  మత్స్య సంపదను అంచనా వేయడం లోను మత్స్యకారులకు సహాయ పడతారని తెలిపారు. 

Vizianagaram

2021-02-24 19:26:00

రిటర్నింగ్ అధికారులదే కీలక బాధ్యత..

 జీవీఎంసీ ఎన్నికలలో రిటర్నింగ్ అధికారులు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పేర్కొన్నారు.  బుధవారం వి.ఎం.ఆర్.డి.ఏ.చిల్డ్రన్స్ ఎరీనా లో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో మూడు ఘట్టాలు ఉంటాయని, పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం చేయవలసిన పనులను ముందుగా సమీక్షించుకొని తగిన ముందస్తు చర్యలను చేపట్టాలన్నారు. పోలింగ్ కు ముందుగా చేసే పనులలో బ్యాలెట్ పేపర్ సిద్ధం చేయడం ప్రముఖమైనదని తెలిపారు. నామ పత్రాల విరమణ కు ముందుగానే బ్యాలెట్ డ్రాఫ్ట్ ప్రతిని సిద్ధం చేసుకుంటే బాగుంటుందన్నారు. ఎన్నికల కమిషన్ నియమాలను అనుసరించి ముందుగా జాతీయ పార్టీలు తరువాత ప్రాంతీయ పార్టీలు చివరగా స్వతంత్రులను తెలుగు అక్షరమాల ప్రకారం వరుసక్రమాన్ని నిర్ణయించాలన్నారు. బ్యాలెట్ పేపర్ తయారీలో ఏమాత్రం అలసత్వం ఉండకూడదన్నారు. గుర్తుల కేటాయింపు లో ప్రతి అభ్యర్థికి 3 గుర్తులను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుందని, నియమాలను తు.చ. తప్పకుండా గుర్తులు కేటాయించాలన్నారు సమయం తక్కువగా ఉన్నందున బ్యాలెట్ పేపర్ లను 24 గంటలలోగా సర్వీస్ ఓటర్లకు పంపించవలసి వుంటుందన్నారు. బ్యాలెట్ పత్రాలు తయారు అనంతరం జోనల్ కమిషనర్ లు భద్రపరచాలన్నారు. ఎన్నికల నియమావళి అమలు రిటర్నింగ్ అధికారులు చూడాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రిటర్నింగ్ అధికారి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులను కల్పించాలని,  వేగంగా ఓట్లను వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలని, పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ, సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు,  పోలింగ్ ఏజెంట్ లకు నియామక పత్రాలు జారీ చేయాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లకు సీల్ వేయడం,   వివరాలను సంబంధిత కవర్లలో సీల్ చేయవలసి ఉంటుందన్నారు. జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి హ్యాండ్ బుక్ ను సమగ్రంగా చదివి ఎటువంటి లోటుపాట్లు లేకుండా  అధికారులు సిబ్బంది సమన్వయంతో  పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశించారు.

Visakhapatnam

2021-02-24 19:18:23

శభాష్ డాక్టర్ కృష్ణ చైతన్య..

అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తన తనయుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యలతో మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లాలోపంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ  మద్దతుదారులు అత్యధికశాతం విజయం సాధించిన విషయాన్ని సీఎం ద్రుష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పంచాయతీల పోరులో పార్టీ మద్దతుదారులను గెలిపించడంలో క్రుషిచేసి మంత్రి, మంత్రి తనయుడిని అభినందించారు.టీడీపీకి బాగా పట్టున్న చోట్ల కూడా వైయస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందడం, ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసాన్ని చూపిస్తుందని చెప్పారు. అదేవిధంగా నరసన్నపేట నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీలను వైఎస్సార్సీపీ మద్దతుదారులే చేజిక్కించుకునేలా యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య చేసిన ప్రణాళికాబద్ధమైన కృషిని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సీఎం జగన్ కు ప్రత్యేకంగా వివరించారు. నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో 115 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలవగా, టీడీపీ మద్దతుదారులు కేవలం 20 పంచాయతీలకు మాత్రమే పరిమితమయ్యారని సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యని శభాష్ డాక్టర్ అంటూ సీఎం అభినందించారు.  

Srikakulam

2021-02-24 14:53:51

ధాన్యం సేకరణకు కంట్రోల్ రూం..

శ్రీకాకుళంజిల్లాలో ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వివిధ కారణాల రీత్యా ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరగలేదని అన్నారు. రైతులు ధాన్యం విక్రయించుటకు జిల్లా కేంద్రంలోను, సంబంధిత మండలాలలోను కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూం 7075839959, 7075439959 ఫోన్ నంబర్లకు రైతులు ధాన్యం సమాచారం అందించవచ్చని ఆయన వివరించారు. వీరఘట్టం, పాలకొండ, బూర్జ మండలాలతో ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా ధాన్యం విక్రయించే రైతుల వివరాలు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.  ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 

Srikakulam

2021-02-24 14:50:54

మీసేవకై వస్తున్నా ఆదరించండి..గెలిపించండి..

విశాఖ ప్రజలకు సేవచేసుకునే అవకాశాన్ని కల్పించాలని మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పోరేటర్ అభ్యర్ధిగా మీ ముందుకు వస్తున్నానని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. బుధవారం విశాఖలోని 21వార్డులోని తమిళ వీధి, నేతాజీ వీధి, ఎల్ఎంఎం చర్ఛ్, ప్రాంతాల్లో వంశీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు మేలు చేయడానికే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మన ఉత్తరాంధ్రా అభివ్రుద్ధికోసం రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని ప్రజలకు వివరించారు. మీ కుటుంభ సభ్యునిగా ఆదరించి ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. వంశీ ప్రచారానికి వెళ్లే ప్రాంతాల్లో మహిళలు బ్రహ్మరదం పడుతూ, హారతులు పట్టి ఆత్మీయంగా ఆహ్వానాలు పలికారు. ఎక్కడికి వెళ్లినా మీవెంట మేమున్నామంటూ మహిళలు భరోసా ఇస్తున్నారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ పెద్దలు, వార్డ్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున వంశీ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-02-24 13:04:04

స్ట్రాంగ్ రూమ్ లకు పటిష్ట బందోబస్తు..

విజయనగరం జిల్లాలో మార్చి 14న  నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల  కౌంటింగ్ ప్రక్రియకు కట్టు దిట్ట మైన  ఏర్పాట్లు చేయాలని పార్వతీపురం ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు.  మంగళవారం పార్వతీపురం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను   ఆయన సందర్శించారు. అనంతరం   ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ  మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి   10వ తేదీన ఎన్నికలు, 14వ తేదీన  కౌంటింగ్ ప్రక్రియ జరుగునని, ఫలితాలు త్వరగా వెలువడేలా  సిబ్బందిని, టేబుళ్ల ను , డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం లో  నాలుగు వైపులా సి సి కెమెరాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ను , త్రాగు నీరు   ఏర్పాటు చేయాలని కమీషనర్ కు  సూచించారు. అలాగే బ్యాలెట్ బాక్స్ లు  పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి విధులు సజావుగా నిర్వహించాలని హితవు పలికారు. ఈ పర్యవేక్షణా కార్యక్రమానికి పార్వతీపురం మునిసిపల్ కమిషనర్ కె.కనక మహా లక్ష్మి,, సబ్ ఇన్స్పెక్టర్ కళాధర్, మునిసిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-02-23 20:27:47

జివిఎంసిలో కంట్రోల్ కేంద్రం ఏర్పాటు..

విశాఖలోని జివిఎంసి కి మార్చి నెలలో ఎన్నికలకు సంబంధించి ప్రధానకార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కమిషనర్ నాగలక్ష్మి సెల్వరాజన్ చెప్పారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు సంబందించి ఏమైనా ఫిర్యాదులు ప్రజలు చేయాలనుకుంటే నేరుగా క్రింది తెలియజేసిన నెంబర్లకు నేరుగా ఫోన్ ఈ క్రింది తెలిపిన  టోల్ ఫ్రీ ఫోన్  నెంబర్ కు గాని ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లకు  ఫోన్ చేసి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు అందించవచ్చని తెలియజేశారు.  ప్రధాన కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్లు :  1800  4250  0009, ల్యాండ్ లైన్ నెంబర్   0891  2869122  లేదా  0891  2869123 ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Visakhapatnam

2021-02-23 20:22:26

కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ కు ఘన సత్కారం..

ప్ర‌భుత్వ‌ కార్య‌ద‌ర్శి హోదా పొందిన జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను, వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌మాఖ్య  ఫోర‌మ్ ఫ‌ర్ బెట‌ర్ విజ‌య‌న‌గ‌రం  ఘ‌నంగా స‌న్మానించింది. క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఫోర‌మ్ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్రావు, కె.ప్ర‌కాష్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో వివిధ స్వ‌చ్ఛంద‌ సంస్థ‌ల ప్ర‌తినిధులు  పాల్గొని క‌లెక్ట‌ర్‌ను అభినందించారు. శాలువ‌ల‌తో స‌త్క‌రించి, జ్ఞాపిక‌ల‌ను అందించారు. ఆయ‌న జిల్లాకు చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ముఖ్యంగా హ‌రిత విజ‌య‌న‌గ‌రంగా మార్చేందుకు క‌లెక్ట‌ర్ చేసిన కృషిని మ‌రోసారి గుర్తు చేశారు. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌ పేరు జిల్లా చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిఉంటుంద‌ని శ్లాఘించారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఫోర‌మ్ కోశాధికారి బిహెచ్ సూర్య‌ల‌క్ష్మి, ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, రోట‌రీ క్ల‌బ్‌, రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్‌, మ‌న ఊరు విజ‌య‌న‌గ‌రం, లిఫ్టింగ్ హేండ్స్‌, కౌముదీ పరిష‌త్‌, సాగి సీతారామ‌రాజు క‌ళాపీఠం, క్రెడ‌య్‌, ఇన్న‌ర్ వీల్ క్ల‌బ్‌, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజ‌య‌న‌గ‌రం, ఐఎంఏ, బార్ అసోసియేష‌న్‌, ల‌యిన్స్ క్ల‌బ్‌, హొట‌ల్స్ అసోసియేష‌న్‌, హూమ‌న్ రైట్స్‌, థెరిసా క్ల‌బ్‌, ఇండియ‌న్ అకాడ‌మీ ఆఫ్ పీడియాట్రిక్స్‌ త‌దిత‌ర‌ సంస్థ‌ల ప్ర‌తినిధులు ఎస్ఎస్ఎస్ఎస్‌విఆర్ ఎం రాజు,  శివ‌, డాక్ట‌ర్ ప‌ద్మ‌కుమారి, గౌరీశంక‌ర్‌, విశాలాక్షి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-02-23 20:11:17

మున్సిపల్ ఎన్నికలు విజయవంతం చేయాలి..

మహా విశాఖ నగర పాలక సంస్థ,  నర్సీపట్నం, యలమంచిలి పురపాలక సంస్థలకు  మార్చి 10వ తేదీన జరిగే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అందరూ కృషి చేయాలని   జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  ఆదేశించారు.  మంగళవారం జీవీఎంసీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఎన్నికల నియమ, నిబంధనలను   క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే   నిర్వహణ   సులభమవుతుందన్నారు. జిల్లాలో జరిగిన నాలుగు దశల పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ, ఆ ఎన్నికలలో పనిచేసిన అధికారుల సేవలను  వినియోగించు కోవాలన్నారు.  జీవీఎంసీలో ఎన్నికలు జరిగి చాలా కాలమైనందున జాయింట్ కలెక్టర్ లను, జోనల్ కమిషనర్లకు సహకరించేందుకు  రెవెన్యూ శాఖకు చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించామన్నారు.  శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు, ఎటువంటి లోపాలు రానీయకుండా చూసేందుకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు.  అధికారులకు అప్పగించిన విధులను వేగంగా, స్పష్టంగా, నేర్పుతో   చేయాలన్నారు.  ఎన్నికలలో   వందశాతం పక్కాగా పూర్తి చేస్తేనే విజయవంతం అవుతుంది అన్నారు. నగరంలో 98 వార్డులు ఉన్నాయని, 31 మంది  రిటర్నింగ్ అధికార్లు  ఉంటారన్నారు. జోనల్ కమిషనర్లే కీలకంగా వ్యవహరించాలన్నారు. నామినేషన్ల విరమణ, గుర్తుల కేటాయింపు, తుది జాబితా తయారుచేయడం పక్కాగా చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందస్తు చర్యలు  తీసుకోవాలన్నారు.  బ్యాలట్ బాక్సులను, ఓటర్ల జాబితా ఐదు కాపీలు ముందుగా సిద్ధం చేసుకోవాలన్నారు. సెక్రటేరియట్ సిబ్బందిని ఎన్నికలలో ఉపయోగించుకోవచ్చని, వార్డు వాలంటీర్లను మాత్రం వినియోగించరాదన్నారు. పోలింగ్ కేంద్రాలను మూడు పర్యాయాలు పరిశీలన చేయాలని, తాగునీరు మరుగుదొడ్లు మొదలైన మౌలిక వసతులను  కల్పించాలన్నారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలన్నారు.  పోలింగ్ సిబ్బందికి తగిన శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వివిధ కమిటీల ద్వారా చేసే పనులను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు.  ప్రచార సమయాలను, నియమాలను ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ పక్కాగా ఉండాలన్నారు. పోలింగ్ సిబ్బందికి వాహనాలు, శుభ్రమైన ఆహారం  నామినేషన్ల ప్రక్రియ, ఓటింగ్ సరళి, ఫలితాల వెల్లడిలో ఎటువంటి ఆలస్యం పనికి రాదన్నారు. కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు రిపోర్టులు  పై అధికారులకు అందజేస్తూ ఉండాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో   జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్లు పి., అరుణ్ బాబు,  ఆర్ గోవిందరావు,  అడిషనల్ కమిషనర్ లు ఎ.వి.రమణి, పి.ఆశాజ్యోతి, వి.సన్యాసిరావు, డి.ఆర్.డి.ఎ. పి.డి. వి.విశ్వేరరావు, డిఆర్వో ఎ.ప్రసాద్, జిల్లా పంచాయితీ అధికారి వి.కృష్ణ కుమారి, సాంఘిక సంక్షేమ  జె.డి. డి.వి.రమణమూర్తి, జెడ్.పి. సి.ఈ.వో. వి.నాగార్జున సాగర్, ఎస్.డి.సి. సిహెచ్.రంగయ్య, డిఈవో బి.లింగేశ్వరరెడ్డి, సి.ఈ. కె.వెంకటేశ్వరరావు, సిసిపి ఆర్.జె.విద్యుల్లత, డిఐవో వైవికెఎస్ఆర్ మూర్తి, ఆర్టిసీ ఆర్.ఎమ్. ఎమ్.వై.దానం, డిఎంఅండ్ హెచ్ వో డా.పి.సూర్య నారాయణ, జివియంసి సిఎమ్ వో డా.కె.ఎస్. శాస్త్రి, జోనల్ కమిషనర్లు, ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-02-23 19:35:49

వాణిజ్య పంటల దిశగా అడుగులు..

వాణిజ్య పంటల దిశగా రైతులను కదలించుటకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. రాజాం మండలం బొద్దాంలో ఉద్యానవన నర్సరీ, రాజాం మండల కేంద్రంలో ఎర్ర చెరువు పనులు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నాడు – నేడు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు వాణిజ్య పంటల దిశగా అడుగులు వేయుటకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లా రైతులు దాదాపుగా వరి పంటపై మాత్రమే దృష్టి సారిస్తున్నారని ఆయన చెప్పారు. వరి పంట అనంతరం 6 నుండి 8 నెలల పాటు రైతులు ఖాళీగా ఉంటున్నారని, భూములు ఖాళీగా ఉంటున్నాయని పేర్కొన్నారు. సంవత్సరం పొడుగునా పని ఉండాలని, తద్వారా ఆదాయం రావాలని, రైతు కుటుంబాలు ఆర్ధికంగా ముందంజ వేయాలని ఆయన అన్నారు. ఇందులో భాగంగా భూములు ఖాళీగా ఉండకుండా వాణిజ్య పంటలు వేయుటకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గంటన్నర కాలంలో చేరుకునే పెద్ద నగరం విశాఖపట్నం ఉందని, జిల్లాలో పండిన పంటలను మార్కెటింగు చేయుటకు మంచి అవకాశం ఉందని ఆయన చెప్పారు. సేంద్రియ ఎరువులు ద్వారా పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉన్న విషయం అందరికి విదితమేనని ఆయన పేర్కొన్నారు. ఉద్యానవన నర్సరీలో కాప్సికం, కేరట్, బీర, మిరప తదితర పంటలు ఉన్నాయని వీటికి విశాఖపట్నంలో మంచి మార్కెట్ ఉందని చెప్పారు. రైతులకు మంచి ఆదాయం లభించడం, జిల్లా వాణిజ్య పంటలకు నిలయంగా మారడమే ధ్యేయమని నివాస్ అన్నారు. కోటి రూపాయలతో ఎర్ర చెరువు పనులు : రాజాం బొబ్బిలి జంక్షన్ వద్ద ఉన్న ఎర్ర చెరువు అభివృద్ధి పనులను కోటి రూపాయలతో చేపట్టుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ నివాస్ చెప్పారు. గతంలో ఎర్ర చెరువు పనులను వి.ఎం.ఆర్.డి.ఏ చేపట్టుటకు రూ.30 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, ఆ మొత్తానికి అదనంగా 60,70 లక్షల రూపాయలు కలిపి చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడం వలన రాజాం పర్యాటకంగా మరింత అభివృద్ధి కాగలదని ఆయన పేర్కొన్నారు. చెరువు గట్టుపై వాకింగ్ ట్రాక్, చెరువుకు ఆనుకుని ఉన్న స్ధలంలో మల్టిషాపింగ్ కాంప్లెక్సు, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఓపెన్ జిమ్ నిర్మించుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాజాం పట్టణానికి మరింత శోభను ఎర్ర చెరువు చేకూర్చగలదని కలెక్టర్ చెప్పారు. చెరువు గట్టుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, అచ్చట ఉన్న పేద కుటుంబాలకు మరో చోట ఇళ్ళను కల్పించే చర్యలు తీసుకోవాలని తహశీల్దారును ఆదేశించారు.           మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాడు – నేడు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులు చదువుకొనుటకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. మరుగుదొడ్లలో చేపడుతున్న పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర రావు, తహశీల్దారు వేణుగోపాల రావు, ఏపిఎంఐపి ప్రాజెక్టు డైరక్టర్ ఏ.వి.ఎస్.వి.జమదగ్ని, ఉద్యానవన సహాయ సంచాలకులు పి.లక్ష్మిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-02-23 19:29:05

2021-02-23 15:49:15

ఎన్నికల కౌంటింగ్ కి పక్కాగా ఏర్పాట్లు..

విజయనగరం జిల్లాలో మార్చ్ 14 న  నిర్వహించనున్న నగరపాలక సంస్థ ఎన్నికల  కౌంటింగ్ ప్రక్రియ కు కట్టు దిట్ట మైన  ఏర్పాట్లు చేయాలని  జిల్లా కలెక్టర్ మరియు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి డా. హరి జవహర్లాల్ పేర్కొన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రమైన రాజీవ్ క్రీడా ప్రాంగణాన్ని   ఆయన సందర్శించారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ,ఇతర అధికారులతో రాజీవ్ స్టేడియం ను సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియ అనుకూలతలను వివరించే రూట్ మ్యాప్ ను నగరపాలక సంస్థ అధికారులు కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్  మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి   10వ తేదీన ఎన్నికలు, 14వ తేదీన  కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నామన్నారు. ఫలితాలు త్వరగా వెలువడేలా  సిబ్బందిని, టేబుళ్ల ను , డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.   కేంద్రం లో  నాలుగు వైపులా సి సి కెమెరాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ను , తాగు నీరు, డస్ట్ బిన్ లను  ఏర్పాటు చేయాలని కమీషనర్ వర్మ కు సూచించారు.  కౌంటింగ్   ఏజెంట్ల కోసం  ఐ.డి కార్డులని జారీ చేయాలన్నారు.  కేంద్రం వద్ద  వాహనాల పార్కింగ్, భోజన ఏర్పాట్లకు అనువైన స్థలాన్ని గుర్తించి మార్కింగ్ చేయాలన్నారు.   గ్రౌండ్ వాటరింగ్ చేయాలని, గాలరీ ని పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు.   ఈ  కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏ సి పి వెంకటేశ్వరరావు, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి, టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, నగర సర్వేయర్ సింహాచలం  తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-02-23 15:00:34

పరిశోధనా ఫలితాలు రైతులకు చేరాలి..

వ్యవసాయ రంగంలో చేస్తున్న పరిశోధనల ఫలితాలు రైతులకు చేరాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా సంస్ధలో మంగళ వారం జరిగిన కిసాన్ మేళాలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పరిశోధనా ఫలితాలు అందాలని, తరగతి గదుల నుండి క్షేత్ర స్ధాయికి ఫలితాలు చేరినప్పుడు మాత్రమే సార్ధకత ఉంటుందని పేర్కొన్నారు. పరిశోధనలు రైతులకు ఆదాయం తెచ్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేసారు. రైతులకు మంచి సూచనలు అందిస్తే దానిని పాటిస్తారని ఆయన అన్నారు. జిల్లాలో 1010 రకం వరి విత్తనాలను మార్పు చేయాలని నిషేధించి 1075 రకం విత్తనాలను సరఫరా చేసి రైతులకు అవగాహన కలిగించడంతో వారు మద్ధతు ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా 1075 రకం విత్తనాల స్ధానంలో 1121 విత్తనాలను వేసుకోవాలని కోరితే దానిని అంగీకరించారని పేర్కొన్నారు. ఖరీఫ్ పంటలో రైతులు ఏ అంశాల్లో మోసపోతున్నారో గ్రహించామని అందుకు అనుగుణంగా ధాన్యం సేకరణను చేపట్టామని చెప్పారు. రవాణా ఛార్జీలు రైతుల ఖాతాలలోకి వేసామని, తద్వారా రైతుకు 2 నుండి 3 వేల రూపాయలు ఆదాయం లభించిందని అన్నారు. రబీలో కూడా రైతుకు ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ సమయంలో తూకంలో సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పంట పూర్తి అయిన తరువాత పొలంలో పచ్చి రొట్ట విత్తనాలకు గాను పొలం పచ్చగా ఉండేందుకు రైతులు చర్యలు చేపట్టాలని, అనంతరం దానిని దున్నాలని పిలుపునిచ్చారు. తద్వారా  సేంద్రియ ఎరువు తయారు కాగలదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి విధానాలను పాటించి లబ్దిపొందాలని కోరారు. నాణ్యమైన, తినడానికి ఉపయోగపడే పంటలను శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పండించడం జరుగుతుందని, ఇతర ప్రాంతాల్లో వాణిజ్యపరంగా పంటలు పండిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ లో 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే విత్తనాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించగా అంగీకరించిందని, ఆ మేరకు ప్రతి రైతుకు విత్తనాలు అందించామని చెప్పారు. విత్తనాలను 50 శాతం సబ్సిడితో పంపిణీ చేసామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ లో సైతం ప్రతి రైతుకు ఎరువులు కూడా అందేవిధంగా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. పాడి పశువులను వృద్ధి చేయండి – అదనపు ఆదాయం పొందండి : రైతులు వ్యవసాయం మాత్రమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలపైనా దృష్టి సారించాలని కలెక్టర్ నివాస్ కోరారు. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఆవులు, గేదెలు కలిగిన రైతులు అమూల్ సంస్ధతో అనుసంధానం అవుతున్నారని చెప్పారు. అమూల్ సంస్ధకు పాలు పోయడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారని తెలిపారు. నాణ్యతకు అనుగుణంగా లీటరుకు రూ.70 వరకు ధర ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారని చెప్పారు. నాలుగైదు ఆవులు, గేదెలు ఉన్న మహిళలు అదనంగా రూ.21 వేల ఆదాయం పొందుతున్నట్లు గణాంకాలు ఉన్నాయని తెలిపారు. రైతులు అమూల్ సంస్ధతో అనుసంధానమై పాలు సరఫరా చేయడం వలన ఆదాయం వస్తుందని అన్నారు. చేయూత పథకం క్రింద మహిళలకు ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహాయంతో ఆవులు, గేదెలు, మేకలు వంటి పశుసంపద వృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ కంటే శ్రీకాకుళంలో మాంసం కిలో ధర అధికంగా ఉందని తెలియవచ్చిందని, అందుకు కారణం మేకలు, గొర్రెల లభ్యత తక్కువగా ఉందని చెప్పారు. మేకలు, గొర్రెలు పెంపకం ద్వారా ఆదాయం పొంచుకోవచ్చని ఆయన సూచించారు. అపరాలు, చిరుధాన్యాలు పండించడం ద్వారా కూడా అదనపు ఆదాయం హెచ్చింపు చేసుకోవచ్చని అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో అపారమైన అనుభవం ఉన్న రైతులు ఉన్నారని, వ్యవసాయ రంగంలో వారి పరిజ్ఞానం ముందు మా పరిజ్ఞానం చాలా తక్కువగా బావిస్తున్నామని వారందరికి సెల్యూట్ అని అన్నారు.       ఈ సందర్భంగా వివిధ పంటలలో చీడపురుగుల నివారణ, పంటల విస్తరణ తదితర అంశాలపై రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ నివాస్ ఆవిష్కరించారు. గోగు పంటను గత 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్న ఓ.వి.పేటకు చెందిన బుడుమూరు సూర్యారావు, సలికాంకు చెందిన మంగరాజు గురుగు నాయుడును సత్కరించారు. కిసాన్ మేళాలో భాగంగా వ్యవసాయ ఉత్పాదకాలను, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలతో కూడిన ప్రదర్శనలను ఏర్పాటు చేసారు.       ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరక్టర్ ఆఫ్ ఎక్స్ టెన్షన్ డా.పి.రాంబాబు, డైరక్టర్ ఆఫ్ రిసెర్చ్ డా.ఎన్.త్రిమూర్తులు, ఆమదాలవలస ఏ.ఆర్.ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డా.టి.శ్రీలత, అనకాపల్లి ఆర్.ఏ.ఆర్.ఎస్ శాస్త్రవేత్త డా.ఎం.భరత లక్ష్మి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.ఏ.ఈశ్వర రావు, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఏ.శ్రీనివాస రావు, ఉద్యానవన సహాయ సంచాలకులు పి.లక్ష్మిప్రసాద్, ఏపిఎంఐపి ప్రాజెక్టు డైరక్టర్ ఏ.వి.ఎస్.వి.జమదగ్ని, ఏ.ఆర్.ఎస్ శాస్త్ర వేత్తలు డా.డి.చిన్నం నాయుడు, డా.జి.చిట్టిబాబు, డా.కె.భాగ్యలక్ష్మి, డా.పి.అమరజ్యోతి, ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం బోర్డు సభ్యులు డా.ఎస్.వి.ఎస్.ఆర్.కె.నేతాజి, పి.దేవుళ్ళు, పి.భూదేవి, స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-02-23 14:57:08

సరుకుల పంపిణీ విజయవంతం కావాలి..

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా  రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమం మొబైల్ వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం పట్టణ ప్రాంతాల్లో 43% పూర్తి చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్( రెవిన్యూ) మార్కండేయులు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్ ప్రజా పంపిణీ వ్యవస్థ పై వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ సరుకులు పంపిణీ ప్రజల వద్దకే తీసుకెళ్లి ఇవ్వాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని భావంతో కొంత మందికి ఉపాధి కలిగించే గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం మొబైల్ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 2 శాతం మంది మొబైల్ వాహనదారులు కొంత ఇబ్బంది పెడుతున్నారని అయితే ముందే దీన్ని గ్రహించిన ప్రభుత్వం ధరలు పెంచడం కూడా జరిగిందన్నారు. మొబైల్ వాహనదారుడు ఒక సహాయకుని నియమించు కోవాలని వారు వీఆర్వోలు వాలంటీర్లు సూచనల మేరకు ప్రజలకు నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ఇచ్చేవి అందజేయాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో వాలంటీర్లు మొబైల్ వాహనం డ్రైవర్లు కొత్త కావడం వల్ల కొంత ఆలస్యం జరుగుతోందని వీరికి వీఆర్వోలు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందని వారికి రెండు నెలల లోపు పని నేర్పిస్తే అనంతరం జిపిఎస్ విధానం ద్వారా పి ఆర్ వో లు ఎక్కడ ఉన్నా సిస్టం ను మానిటరింగ్ చేసుకోవచ్చునని కమిషనర్ తెలిపారు. ఏదైనా ఒక కొత్త పద్ధతిని తీసుకు వచ్చినప్పుడు మొదట సమస్యలు ఉంటాయని అదే విధంగా ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్థ కొంత ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది వాహనదారులు సహాయకులను నియమించు కోకుండా సమస్యలు తీసుకురావడం జరిగిందని ఆ సమస్యలు కూడా ప్రస్తుతం పరిష్కారమయ్యే దిశగా అందరూ కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు అనుకూలమైన సమయాల్లోనే నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని వేసవి కాలం వస్తోందని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం ప్రజలకు అనుకూలమైన సమయం నుంచి ప్రారంభించుకోవచ్చు నని సాయంత్రం ఆరు గంటల నుంచి 7 గంటల వరకు గ్రామ సచివాలయం వద్ద వాహనాలు ఉండేలా చూడాలని మొదటి నెలలో కొన్ని సమస్యలు రావడం జరిగిందని రానున్న కాలంలో ఈ సమస్యలను అధిగమించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మొబైల్ నుంచి ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర వస్తువులను ప్రజలకు అందజేయాలన్నారు. ఇక వాహనాలకు సంబంధించి మెయిన్ స్కేల్ ఈపాస్ యంత్రాలు వాటికి సంబంధించిన చార్జర్ లు వాహనంలో ఉన్న సమయంలో వాహనం ద్వారా లేదా ఇంటి వద్ద ఉన్నప్పుడు వేరే ఛార్జర్ ద్వారా చేయాలని లేకుంటే  చార్జర్లు పేలిపోయే ప్రమాదముందని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా మెయిన్ స్కేల్ విషయంలో గాని ఈపాస్ యంత్రం మరమ్మతు కు గురైతే జిల్లా కేంద్రంలో ఉండే మెకానిక్ ద్వారా సరి చేసుకోవాలన్నారు మెకానిక్ ను ఇతర ప్రాంతాలకు పంపడం వల్ల వేరే ప్రాంతంలో యంత్రం చెడిపోతే సమస్య వస్తుందని అందువల్ల జిల్లా మేనేజర్ కార్యాలయం లో కానీ సివిల్ సప్లై అధికారి కార్యాలయంలో గానీ మెకానిక్ ఉండేటట్లు చూడాలన్నారు. వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ 18 రోజులపాటు చేయాలని విఆర్ఓ వాహనదారులకు పని నేర్పించిన తర్వాత వారు తిరిగి రెగ్యులర్ విధులకు హాజరు కావచ్చునని ఆయన తెలిపారు. రోజువారి రేషన్ సరుకులు పంపిణీ ఈ కార్యక్రమాన్ని తాసిల్దార్ లు ఆర్ డి వో లు జాయింట్ కలెక్టర్ పౌరసరఫరాల శాఖ వారు సమీక్షించాలని రోజు జాయింట్ కలెక్టర్ నివేదిక చూడాలని అన్నారు. పేద ప్రజల కోసం వారు ఇబ్బందులు పడకుండా వారు కూలీలకు వెళ్ళే సమయం ఉదయం ఉంటుంది కాబట్టి వారిని సంప్రదించి వారికి అనుకూలమైన సమయంలో వాహనం పంపాలని కార్డులకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియను వీఆర్వోలు చూడాలన్నారు. ఇలా మ్యాపింగ్ ప్రక్రియల సమస్యలు వస్తే పరిష్కరించేందుకు వీలుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు తాము మానేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఇందుకు సంబంధించి కొంతమంది అడగడం జరిగిందని అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు తర్వాత సీనియార్టీ లిస్టు లో ఉన్నవారికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందని మరో నాలుగు రోజుల్లో నిర్దేశించిన టార్గెట్లను చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా నెట్వర్క్ సమస్య వస్తే సరిచూసుకొని ఆన్లైన్ విధానం ద్వారా  పంపిణీ చేయవచ్చునని తెలిపారు . జాయింట్ కలెక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ఏడు వందల ఇరవై నాలుగు వాహనాలు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో రేషన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తో పాటు చిత్తూరు ఆర్డీవో రేణుక ,జిల్లా పౌరసరఫరాల అధికారి శివరాం ప్రసాద్, జిల్లా మేనేజర్ మోహన్ బాబు, సోమయాజులు జిల్లా వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, తాసిల్దార్లు పాల్గొన్నారు.

Chittoor

2021-02-23 14:55:07