కెజీహెచ్(కింగ్ జార్జి ఆసుపత్రి) అంటే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని..ఎంతో గౌరవం, పేరున్న ఉన్న ఈ ఆసుపత్రి గౌరవాన్నిఇక్కడి నర్సింగ్ కళాశాల సిబ్బంది, ప్రిన్సిపాల్, ట్యూటర్లు చదువుకుంటున్న విద్యార్ధినిలను లైంగికంగా వేధించి రోడ్డున పడేస్తున్నారు. తిరగబడితే చదువు మధ్యలో ఆగిపోయేలా చేస్తారని భయం.. ఎదురు తిరిగితే ప్రాక్టికల్ మార్కులు తగ్గేంచేస్తారని ఆందోళన.. ప్రశ్నిస్తే సీనియర్ నర్సులు అన్నీ నైట్ డ్యూటీలే వేసేస్తారని ఆవేద.. ప్రతిగటించకపోతే వేధింపులు తాళలేక ఎక్కడ ఆత్మ హత్యచేసుకోవాల్సి వస్తుందోననే ఆలోచన.. ఇక్కడ సిబ్బందికి నచ్చినట్టుగా పనిచేయకపోయినా..ఊడిగం చేయకపోకపోయినా వీళ్లందరికీ మనిషికొచ్చేంద కోపాలూ వచ్చేస్తాయట.. దాంతో నువ్వెలా నర్శింగ్ పాసై బయటకి వెళతావో చూస్తాను అనే లక్ష్మణ రేఖతో అందరూ బెదిరింపులు, హెచ్చరికలు, శారీరక సుఖం కోసం వేధింపులు..ఒకటి కాదు రెండు కాదు ఇక్కడి నర్శింగ్ విద్యార్ధినిల బాధల వర్ణణాతీతం. ఎదురుగానే జిల్లా కలెక్టరేట్..అయినా కలెక్టర్ ఏనాడూ కన్నెత్తి కూడా కూడా ఇక్కడ చూసిన పాపాన పోలేదు. కాదు కాదు కలెక్టర్ దృష్టి కళాశాలలపై పడకుండా వారికి అనుకూలంగా ఉన్న విద్యార్ధినిలతో అంతా బాగా ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు ఇక్కడి వారంతా. మెజారిటీ విద్యార్ధినిలు ఇక్కడ చవిచూసే నరకం వారి మాటల్లో చెప్పేది కాదు. స్థానిక అధికారులతో తమకు న్యాయం జరగదని బావించిన విద్యార్ధినిలు ఏకంగా తమ గోడును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డికి విన్నవించుకున్నారు. ఆ కాపీని లోకల్ మీడియాకి కూడా పంపించారు. మీడియా కూడా ఇక్కడి అధికారులతో కలిసిపోయి తమ గోడుని, తాము పడుతున్న నరకయాతనను బయటపెట్టడదని తెలీసి కూడా మానవత్వం ఉన్నవారు ఎవరైనా స్పందించకపోతారా..? అనే ఒక్క ఆశతో మీడియాకి తమ గోడుని వినిపించారు.
ఏ చిన్న రోగమొచ్చినా నిరుపేదలు ఎవరైనా కెజీహెచ్ కి రావాల్సిందే..చాలా మంది వచ్చిన వ్యాధిని నయంచేసుకునే తిరిగి వెళతారు. వైద్యులు రోగులకు వచ్చే రోగాలకు శస్త్ర చికిత్సలు చేస్తే.. రోగులను ఎల్లవేళలా కంటికి కాపాడుతూ, వారికి సమయానికి మందులు ఇచ్చి, వైద్యులు రాసిచ్చిన కేస్ షీట్ ఆధారంగా వైద్య సేవలు చేసేది నర్శింగ్, పారామెడికల్ సిబ్బందే. ఒక రకంగా ప్రాణంపోసే వైద్యుడు పెద్ద దేవుడైతే.. ప్రాణం పోకుండా కాపాడేది మాత్రం పారామెడికల్ సిబ్బంది, నర్శింగ్ సిబ్బంది చిన్న దేవుళ్లతో సమానం. వైద్యులన్నా, నర్శింగ్ సిబ్బంది అన్నా రోగులకు, వారి బంధువులకు చాలా గౌరవ భావాలు కూడా ఉంటాయి. అలాంటి వారిలోనూ కర్కస సీనియర్ నర్శులు జూనియర్ నర్శులను ఎన్నో రకాలుగా వేధిస్తే వారి గోడు ఎవరికి చెప్పుకోవాలి..? సమస్యను పరిష్కరించాల్సిన కెజిహెచ్ సూపరింటెండెంట్, నర్శింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కూడా మొత్తంగా కుమ్మక్కై నర్శింగ్ విద్య చదివే విద్యార్ధినిలనే అన్ని రకాలుగా వేధిస్తుంటే..మానసికంగా హింసిస్తుంటే కన్నీటి వేదన, ఎవరి ముందు వెళ్లగక్కాలి.. తమకు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పా..మరెవరూ న్యాయం చేయలేరని భావించిన నర్శింగ్ విద్యార్ధులు తాము ఎర్కొంటున్న వేధింపులపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇపుడు ఆ ఫిర్యాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఇక్కడి విద్యార్ధినిలు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున త్రిసభ్య విచారణ కమిటీ కూడా వేశారు.
కెజిహెచ్ లో సీనియర్ నర్సులు, నర్శింగ్ కాలేజీ సిబ్బంది, ప్రిన్సిపాల్, ట్యూటర్లు కరాళ నృత్యం చేస్తూ..విద్యార్ధినిలను మానసికంగానూ, శారీరకంగానూ, లైంగికంగానూ వేధిస్తుంటే ఎవరు మాత్రం తట్టుకోగలరు చెప్పండి. వారి సహనం నశించి, కన్నీరు కట్టలు తెంచుకొని, తెగువకు దైర్యం వచ్చి ఇక్కడ జరుగుతున్న తంతు అంతా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రూపంలో సీఎంకి ఫిర్యాదు చేశారు. ఎవరైనా తమ పేర్లతో ఫిర్యాదు చేస్తే తమని.. టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారని ముందే పసిగట్టిని విద్యార్ధినిలు పేరు మార్చి కెజిహెచ్ లో జరుగుతున్న లైంగిక వేధింసులు, సీనియర్సుల బెదిరింపులు, ఒంగి ఒంగి ప్రతీ సారీ నమస్కారాలు పెట్టే తీరు దగ్గర నుంచి వీరికి పాఠ్యాంశాలు బోధించే విధానం వరకూ మొత్తం ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్ధినిల శరీర ఆకృతులను చూసి..కసి తీరా తినేసేలా చూసే ట్యూటర్ల అవమానకర చూపులు, పెట్టే ఇబ్బందులు, వారికి మద్దతునిచ్చే ప్రిన్సిపాల్ ఆగడాలపై కూడా ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.
కమిటీ వేశారని తెలుసుకొని మరీ బెరింపులు, హెచ్చరికలు..?
కెజిహెచ్ లోని నర్శింగ్ విద్యార్ధినిల లైంగిక వేధింపులపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున త్రిసభ్య విచారణ కమిటీ వేసిన గంటలోనే కెజిహెచ్ లోని సీనియర్ నర్శింగ్ సిబ్బంది, యూనియన్ నేతలు, కళాశాల సిబ్బంది హుటా హుటీన రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. విద్యార్ధినిలు ఎంక్వైరీలో వాస్తవాలు చెబితే ఖచ్చితంగా దానికి కారణమైన సిబ్బందిపై వేటు పడటం ఖాయం అనుకున్నవారంతా విచారణ విషయంలో విద్యార్ధినిలంతా తమకు అనుకూలంగా చెప్పాలని నిర్ణయించి మరీ డ్యూటీల్లో ఉన్నవారికి వాట్సప్ కాల్స్ ద్వారా సమాచారం పంపారట. ఏ ఒక్కరు తేడాగా చెప్పినా..వారే ఇబ్బంది పడేలా మొత్తం తిరుగుబాటు చేయాలని..అవసరమైనే యూనియన్ నేతలను రంగంలోకి దింపాలని, రాష్ట్ర యూనియన్ కి కూడా అత్యవసర సమావేశ వివరాలను పంపినట్టుగా తెలిసింది. ప్రస్తుతం డ్యూటీలో ఉన్న నర్శింగ్ సిబ్బందికి, ట్రైనింగ్ నర్సులకు చెప్పండి..ఎవరైనా గీసిన గీటు దాటితే ఎవరెవరు తమకు వ్యతిరేకంగా చెప్పారో, చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ల వివరాలన్నీ తమ దగ్గరున్నాయి. ఏ ఒక్కరూ నర్శింగ్ పాస్ అయి బయటకు వెళ్లరు. అంతేకాదు..చదివిన చదుని పనిచేయకుండా చేస్తాం(వీళ్లేం చేయగలరో, ఏమీ చేయలేరో నర్శింగ్ విద్యార్ధిని లకు తెలియదు కదా) అందరూ మాకు అనుకూలంగానే విచారణలో చెప్పాలని బెదిరింపులు, హెచ్చరికలు కూడా చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయంలో నర్శింగ్ కాలేజీ సిబ్బంది, ట్యూటర్లు కూడా వత్తాసు పలికినట్టుగా తెలిసింది. సీఎం కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లడం, మీడియాకి కూడా
తెలిసిపోవడంతో వేధింపుల విషయం రచ్చ రచ్చ అయ్యే అవకాశం ఉందని..ఏది ఏమైనా ఎలాంటి విచారణనైనా ఎదుర్కోవడానికి, ఫిర్యాదు చేసిన విద్యార్ధినిల తోనే తిప్పికొట్టడానికి సిద్దంగా ఉండాలని కేజిహెచ్ లోని సీనియర్ నర్సులంతా ఏకమైపోయినట్టు సమాచారం అందుతుంది. కాగా ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా నర్శింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అందుబాటులో లేరు. కాకపోతే అధికారులకు ఇచ్చిన వివరణలో మాత్రం..నర్శింగ్ విద్యార్ధినిల పేరుతో చిరునా మాలేని ఫిర్యాదుపై వివరణ అంటూ రెండు పేజీల వివరణ ఇచ్చారు. వాస్తవానికి కెజిహెచ్ లోని సీనియర్ నర్శింగ్ సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్ పై మీడియాకానీ, ఏ ఒక్కరూ ఫిర్యాదులు చేయడానికి వెనుకడుగు వేస్తారు. వాళ్లు తప్పుచేసినా..తమను లైంగికంగా వేధించారని ఎక్కడ ఫిర్యాదులు చేస్తారోనని..కానీ ఇపుడు నర్శింగ్ విద్యార్ధినిలే ఆ వేధింపులు గురవుతున్నప్పుడు ఇక్కడ తేడాగా వ్యవహరించేవారు తప్పించుకునే పరిస్థితి లేదు. వేధింపుల ఆరోపణలు చేసే విద్యార్ధినిలు నేరుగా ఏ దైర్యంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తారనే కోణంలో విచారణ అధికారులు ఆలోచించాల్సి ఉంది. చూడాలి సీఎం కార్యాలయాలనికి వెళ్లిన ఫిర్యాదు..దానిపై కలెక్టర్ వేసిన త్రీమెన్ కమిటీ విచారణలో ఏ తరహా వాస్తవాలను నిగ్గుతేలుస్తుందో..లేదంటే అంతా ముందే అనుకున్నట్టుగా ఏమీ లేదని..మమ అనిపించేస్తారో?!