చదువుతోనే మంచి భవిష్యత్తు, శాశ్వత ఆనందం లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి అన్నారు. జీవితంలో గెలుపు కావాలంటే ప్రతీ వ్యక్తి, విద్యార్థీ తప్పకుండా పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన "చదవడం మాకిష్టం" కార్యక్రమం స్థానిక గురజాడ స్మారక కేంద్ర జిల్లా గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఈవో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ముందుగా "చదవడం మాకిష్టం" పేరుతో ఉన్న ప్రచార పత్రాన్ని, బ్రోచేర్ని ఆవిష్కరించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ మంచి భవిష్యత్తు, ఆనందకరమైన జీవితం కావాలంటే విద్యార్థి దశలోనే కష్టపడాలని సూచించారు. పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలని, దాని ద్వారా మనోవికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థీ సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. దీని అమలులో ప్రతి ఉపాధ్యాయుడు భాద్యతగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం చేపడతామని చెప్పారు. మండల కేంద్రాల్లో గ్రంథాలయాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాంతాల్లో రీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. మహనీయుల జీవిత చరిత్రలు, కథలు, బాలల సాహిత్యంతో కూడిన అనేక పుస్తకాలు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. విద్యార్థులు సినిమాలు, సీరియల్స్, ఫోన్ ప్రభావం నుంచి బయట పడాలంటే చదువు ఒక్కటే మంచి వేదిక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఉపాధ్యాయుడు, విద్యార్ధి తల్లిదండ్రులు భాద్యతగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ కార్యదర్శి ఎన్.లలిత, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.తిరుపతి నాయుడు, చదవడం మాకిష్టం ప్రాజెక్ట్ కో - ఆర్డినేటర్ నాగవల్లి, ఏ.ఎం.వో. బి.అప్పారావు, బాల సాహిత్యం కో - ఆర్డినేటర్, తెలుగు పండిట్ జి.ఎస్.చలం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువు ఆవశ్యకతను, పుస్తక పఠనం ప్రాముఖ్యతను వివరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.
అసమానతలు లేని పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఆదివారం నవభారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 64 వ వర్ధంతిని పురస్కరించుకుని అమలాపురం మద్దాలవారి పేట లో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ మేధావి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎస్.సి.ఎస్టీ,ఇతర వర్గాలమధ్య తేడా లేకుండా అన్ని వర్గాలవారికి సమాన ప్రాధాన్యత కల్పిస్తూ జనరంజకమైన పాలన రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని మంత్రి కొనియాడారు. భారత దేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం కారణం గానే ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక్కటిగా భారత దేశం ఎదిగిందని మంత్రి తెలియ చేసారు. స్త్రీ దాశ్య విమోచకడు బాబా సాహెబ్ మేధస్సును గుర్తించి ఈ రోజు ఆ మహా మేధావి కి దేశ ప్రధాని మొదలుకొని,రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు మొదలుకొని ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా ఘనంగా నివాళులు అర్పించారని మంత్రి తెలిపారు.అలాగే అమలాపురం గడియార స్తంభం సెంటర్ లోను,మరియు ఈదరపల్లి ఒంతెన వద్ద కూడా మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ శాసన సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి,పట్టణ నాయకులు మట్ట పర్తి నాగేంద్ర, వాసంసెట్టి సత్యం, వాసంసెట్టి సుభాష్, చెల్లు బోయిన శ్రీనివాస్,ఒంటెద్దు వెంకన్నా యుడు, షేక్ అబ్దుల్ ఖాదర్,సంసాని బులినాని,తోట శ్రీను,అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బొక్కా ఆదినారాయణ,వైస్ చైర్మన్ బాబి, తిరుకోటి సతీష్ కుమార్, ఉండ్రు వెంకటేష్, మెండు రమేష్, కొల్లాటి దుర్గాబాయి,కర్రి రాఘవులు ,నాగారపు వెంకటేశ్వరరావు, పొలమూరి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం లో ప్రతీ నిరుపేదకు సొంత ఇల్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ నెల 25 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 26 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణ,మరియు గ్రామీణ నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయింపు ప్రక్రియను మంత్రి లాటరీ విధానం ద్వారా ప్రారంచారు. ఆదివారం అమలాపురం లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అమలాపురం పట్టణ, మరియు గ్రామీణ నిరుపేదలు మొత్తం 4648 మంది లబ్ధిదారులకు మంత్రి లాటరీ ద్వారా ఇండ్ల స్థలాలను కేటాయించడం జరిగింది.ఇందులో పట్టణ నిరుపేదలు(లబ్ధిదారులు) 2454 మంది కాగా గ్రామీణ నిరుపేదలు(లబ్ధిదారులు)2194 మంది. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పారదర్శకమైన పాలన ప్రజలకు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతీ నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యం తో ముఖ్య మంత్రి పనిచేస్తున్నారని,రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని మంత్రి తెలియ చేసారు.ఈ నెల 25 తేదీన రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది నిరుపేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని మంత్రి తెలిపారు.అదే రోజు అల్లవరం మండలం బోడసకుర్రు లో అమలాపురం పట్టణ నిరుపేదలు కొరకు నిర్మించిన 1632 టిడ్ కో భవనాలను లబ్ధిదారులకు అప్పగిస్తూ భవనాలకు సంభందించిన రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మునిసిపల్ కమీషనర్ వి.ఐ.పి. నాయుడు,మండల తహసీల్దార్ ఠాగూర్,మండల అభివృద్ధి అధికారి ప్రభాకరరావు,డిప్యూటీ తహసీల్దార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యను అనంత శక్తిగా మార్చుకుని తన భవితను దిద్దుకున్న మహోన్నత వ్యక్తిగా బి.ఆర్ అంబేద్కర్ నిలుస్తారని ఏయూ వీసీ ఆచార్యపి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన జీవితం, విధానాలు నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. విద్యతో దేశం గర్వించే నాయకుడిగా ఎదిగిన వ్యక్తిగా అంబేద్కర్ నిలచారన్నారు. ఆయన జీవితం నుంచి యువత స్ఫూర్తిని పొందాలని సూచించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, కిష్ణమంజరి పవార్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సంఘం అద్యక్షులు ఆచార్య పి.అర్జున్, ఆటా అద్యక్షులు ఆచార్య జాలాది రవి, డీన్‌లు టి.షారోన్ రాజు, ఎన్.సత్యనారాయణ, జి.సుధాకర్, టి.వెంకట క్రిష్ణ, ఎన్.ఏ.డి పాల్, డాక్టర్ కె.ఎస్.ఎన్ మూర్తి, ఆచార్యులు, ఉద్యోగులు, పరిశోధకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువతకు ఆదర్శమని డివైఎఫ్ఐ నగర కార్యదర్శి రాజు అన్నారు. ఆదివారం డా.బీఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఎల్ఐసీ భవనం వద్ద వున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేస్తుందన్నారు. బీజేపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేసిందని ఆరోపించారు. వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. దళితుల పైన దాడులు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దీనిని ప్రజలంతా ఖండించాలని కోరారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు గణేష్ నాయకులు సాయి తేజ, వేణు, భానుప్రకాష్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంభేత్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ క్రుషిచేయాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. ఆదివారం డా.బిఆర్ అంబేత్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేత్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అనగారిన వర్గాల అభ్యున్నతికి క్రుషి చేసిన మహా మనిషి అంభేత్కర్ అని కొనియాడారు. ఆయన రచించిన భారత రాజ్యంగం వలనే మనకు ఎన్నో హక్కులు సంక్రమించాయని చెప్పారు. ఆయన స్పూర్తితోనే దళిత సామాజిక వర్గం అభివ్రుద్ధికి కూడా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రుషి చేస్తూనే ఉంటుందని అన్నారు. తరువాత ఎల్ఐసీ భవనం దగ్గర అంబేత్కర విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం అధ్యక్షులు బోని శివరామక్రిష్ణ, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రెయ్య వెంకట రమణ, నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, చెట్టిపాల్గున, శాసనమండలి సభ్యులు సురేష్, సమన్వయ కర్త లు మళ్ల విజయ ప్రసాద్, కే.కే రాజు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కోలా గురువులు, మధుసూదన రావు, పి సుజాత,మాజీ శాసనసభ్యులు కుంభ రావి బాబు,ఎస్ ఎ రెహ్మాన్, పార్టీ అదనపు కార్యదర్శి రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజీనిరింగ్ కళాశాలలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు రూ 2 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, టెక్విప్ సమన్వయకర్త ఆచార్య భాస్కర రెడ్డిలను వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అభినందించారు. టెక్విప్ 2 పథకంలో ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశలకు రూ 7 కోట్లు మంజూరు అయిందని, దీనికి అదనంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌నుకు అదనంగా రూ 2 కోట్లు మంజూరు చేసినట్లు వీసీకి వివరించారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో భాగంగా నానో టెక్నాలజీ సెంటర్, ఫ్యూయల్ సెల్స్ ల్యాబ్‌లను ఏయూ ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పి పరిశోధనలు జరుపుతోందన్నారు. ఈ నిధులను ఈ పరిశోధన కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా వినియోగిస్తామన్నారు.
ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీలో పరిశోధనలకు, ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఆచార్యులు, పరిశోధకులు నవ్య, సమాజ ఉపయుక్తంగా పరిశోధనలు, ఆవిష్కరణలు జరపాలన్నారు.ఈ దిశగా వర్సిటీ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. నిధులను ఉపయుక్తంగా నిలుపుకుంటూ పరిశోధన కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తూ నిర్ధేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శనివారం మద్యాహ్నం ఏయూ వీసీ కార్యాలయంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ మేథమేటిక్స్ విభాగం ఆచార్యులు వి.వి బసవ కుమార్ రచించిన గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ మేథమేటిక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ శాస్త్రీయ అంశాలతో పుస్తకాలను రచించడం ఎంతో క్లిష్ణమైన పక్రియ అన్నారు. విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో, ఆసక్తి కరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో పుస్తక రచన చేయడం అభిలషనీయమన్నారు. పుస్తక రచయిత బసవ కుమార్‌ను అభినందించారు. పుస్తక రచయిత ఆచార్య వి.వి బసవ కుమార్ మాట్లాడుతూ పుస్తకంలో సులభంగా అర్ధమయ్యే విధంగా విషయాలను తెలియజేయడం, ఎక్కువగా ఉదాహరణలో వివరించడం, గణిత భావనలు విపులంగా తెలియజేయడం జరిగిందన్నారు. లీనియర్ ఆల్‌జీబ్రా-కాలిక్యులస్, న్యూమరికల్ మెథడ్స్, సీరీస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, కాంప్లెక్స్ అనాలసిస్, స్టాటస్టిక్స్-ప్రోబబులిటీ, లీనియర్ పోగ్రామింగ్ తదితర అంశాలను పొందుపరచడం జరిగిందన్నారు. గతంలో సైతం తాను రచించిన న్యూమరికల్ అనాలసిస్- ఇంటరాటివ్ మెథడ్స్ పుస్తకానికి మంచి ఆదరణ లభించిందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు ఇంజనీరింగ్ మేథమేటిక్స్ విభాగాధిపతి శాంతి సుందర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగ పరిశోధకురాలు చికిలే శాంతి దేవికి వర్సిటీ డాక్టరేట్ లభించింది. శనివారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో శాంతి దేవికి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. విభాగ ఆచార్యులు డి.సంధ్యా దీపిక పర్యవేక్షణలో ‘అనాలసిస్ ఆఫ్ వాటర్ టు చెక్ ఇట్స్ ప్రోబబులిటీ ఇన్ టెన్ పంచాయత్స్, ఆప్ అనంతగిరి మండల్, విశాఖపట్నం’ అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా శాంతి దేవిని విభాగ ఆచార్యులు, పరిశోధకులు అభినందించారు.
ఏపి అమూల్ ప్రాజెక్ట్ ద్వారా గ్రామాలలో పాల సేకరణ పెంచేందుకు సంబంధిత మదనపల్లె, రామసముద్రం ఎంపిడిఓ లు మరియు వారి పరిధిలోని సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్ డిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అమూల్ పాల సేకరణ పై మదనపల్లె, రామసముద్రం మండలాల ఎంపిడిఓ లు, వారి పరిధిలోని సచివాలయ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాలు పొసే వారికి పాలల్లో ఫ్యాట్, ఎస్ ఎన్ ఎఫ్ ఎలా పెంచుకోవాలనే దాని పై అధికారులు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ స్థాయిలో రైతులకు ఏ పి అమూల్ ప్రాజెక్ట్ కు పాలు పోసిన యెడల మంచి ధర వస్తుందనే విషయాన్ని పశు సంవర్థ క శాఖ వారు ప్రచురించిన కరపత్రాల ద్వారా అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పాల ఉత్పత్తినీ పెంచేందుకు సహకరించాలన్నారు. అమూల్ ప్రాజెక్ట్ కొరకు చిత్తూరు జిల్లాలో వంద సెంటర్ల ద్వారా పాల సేకరణ జరుగుతూ ఉందని తెలిపారు. ఇంకా ఈ పాల సేకరణ ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పాల సేకరణ బాధ్యతను సంబంధిత ఎంపిడివో లు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) వి. వీరబ్రహ్మం, పశు సంవర్థక శాఖ జె డి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం సంతసీతారాం పురం మహిళా పోలీసు, గ్రామ సచివాలయ అడ్మిన్ పంచాయతీ కార్యదర్శిని సస్పెన్షన్ చేసినట్లు వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. సంతసీతారాం పురం మహిళా పోలీసు విధులకు గైర్హాజరు కావడం జరుగుతుందని విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. కార్యాలయానికి గైర్హాజరు కావడమే కాకుండా ఇంటి వద్ద నుండి బయోమెట్రిక్ హాజరు వేయడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుండటం జరుగుతుందని, అందుకు అడ్మిన్ పంచాయతీ కార్యదర్శి సహకరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో నిరూపణ జరగిందన్నారు. ఇద్దరిపై ఫోర్జరీ కేసుతో సహా విధులకు గైర్హాజరుపై క్రమశిక్షణా చర్యలను చేపట్టడం జరుగుతుందని ఆయన స్ఫష్టం చేసారు. ఇద్దరిని సస్పెన్షన్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయ నిర్వహణ పర్యవేక్షణలో అలసత్వం వహించినందుకు గ్రామీణ అభివృద్ధి కార్యనిర్వాహక అధికారి (ఇఓ పిఆర్ డి)కి, మండల పరిషత్ అభివృద్ధి అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసామని ఆయన పేర్కొన్నారు.
సకాలంలో రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ రుణ పథకాల పై బ్యాంకర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలన్నారు. వీలైనంత త్వరగా లబ్ధిదారుల ఖాతాలకు రుణాలను జమ చేసేందుకు బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే విషయంలో సచివాలయ సిబ్బంది బ్యాంకర్లకు సహకారం అందించాలన్నారు. వీధి విక్రయదారులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 7 వ తేదీ సోమవారం జిల్లాలో పెద్ద ఎత్తున రుణ పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్ల ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె. శ్రీనివాస్, కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె. రమణ మూర్తి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ జి ఎం రామ కృష్ణా రెడ్డి, ఎల్ డి ఎం గణపతి, మెప్మా పిడి జ్యోతి, వివిధ, బ్యాంకులకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులపై శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నైపుణ్య అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో లభ్యమయ్యే జీడిమామిడి, అనాస, కొబ్బరి తదితర పంటలకు విలువ ఆధారిత శిక్షణను అందించాలని ఆదేశించారు. అదే విధంగా యువతకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను ఎంపిక చేయాలని, వారికి నైపుణ్యం అభివృద్ధి చేయాలని తెలిపారు. జేసిబి, ప్రొక్లైనెర్, ఇండస్ట్రియల్ క్రేన్, వెల్డింగ్ తదితర రంగాల్లో సైతం అవకాశాలను, సిఎన్ సి మెషిన్ ఆపరేషన్ లో శిక్షణకు అవకాశాలు పరిశీలించాలని తెలిపారు. అకౌంటింగ్ టాలి కోర్సులను ప్రవేశ పెట్టాలని సూచించారు. గ్రామ సచివాలయాల పశుసంవర్ధక సహాయకులు, సర్వేయర్లు, తదితర పోస్టులకు అవసరమైన కోర్సులు విశ్వవిద్యాలయం లో ప్రవేశ పెట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో యువత మంచి నైపుణ్యం కలిగిన వారుగా ఆవిర్భవించాలని, ఏ రంగంలో నైనా అవలీలగా ప్రవేశించే స్థాయి ఉండాలని ఇందుకు మంచి ప్రామాణిక శిక్షణ కల్పించాలని తెలిపారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ డా.ఎన్.గోవింద రావు మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి కోర్సులపై ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో తెలియజేయాలన్నారు. కె.వి.కె. సీనియర్ శాస్త్రవేత్త చిన్నం న్నాయుడు మాట్లాడుతూ, వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన మరమ్మత్తులపై శిక్షణను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, సమగ్రగిరిజన అభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీధర్, జల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు శాంతిశ్రీ, మెప్మా పి.డి. కిరణ్ కుమార్, డి.ఐ.సి. జనరల్ మేనేజరు బి.గోపాల కృష్ణ, ఉపాధి కల్పనాధికారి డి.అరుణ, డిఆర్ డిఎ జెడిఎమ్ సి.హెచ్.రామ్ మోహన్ రావు, ఎన్.వై.కె. కో ఆర్డినేటర్ డి.శ్రీనివాసరావు, నెరేడ్ డైరక్టర్ తిరుమల కుమార్, జిల్లా స్కిల్ డెవలెప్ మెంట్ ఆఫీసరు ఎన్.గోవింద రావు, ఛీఫ్ కోచ్ బి.శ్రీనివాస కుమార్, అంబేద్కర్ విశ్వ విద్యాలయ ఎగ్జిక్యూటివ్ మెంబరు రాజేష్, గ్రైనైట్ ఫాక్టరీస్ అసోసియేషన్ అధ్యక్షులు రమాకాంత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు పోలీసులు దూకుడు పెంచారు. అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం డిఎస్పీ పి.సుధాకరరెడ్డి పర్యవేక్షణలో ఈస్ట్ సిఐ కె.బాలయ్య ఆధ్వర్యంలో బెంగళూరు-తిరుపతి హైవేపై అక్రమంగా తరలిస్తున్న రూ.1.75 లక్షల1104 కర్ణాటక మద్యం బాటిళ్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఒక టాటా ఇండికా కారు,ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సిఐ తెలియజేశారు. ఈ దాడుల్లో ఎస్ఐలు ఎన్.విక్రమ్, నాగసౌన్య, సిబ్బంది దయాళ్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, అక్రమ మద్యం రవాణా ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరైనా సమాచారం అందించవచ్చునని చెప్పిన పోలీసులు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. EB నెం9440900004 కు గాని, డయల్ 100 కు గాని, పోలీసు WHATSAPP నెం9440900005 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు..
విజయనగరం జిల్లాలోని ఎస్సీల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేయాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని సంయుక్త కలెక్టర్ జి.సి. కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సమృద్ధిగా వినియోగించి ఎస్సీల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలు తీసుకున్న చర్యల పై, అమలు చేసిన విధానాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ కేటగిరీలో ఉన్న అని ఉప కులాలను అభివృధి పథంలోకి తీసుకురావాలని, తగిన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పథకాలూ వారికి అందేలా భాధ్యత వహించాలని పేర్కొన్నారు. వారంతా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కృషి చేయాలని చెప్పారు. ఉపయోగకరమైన పనులను ప్రవేశ పెట్టడం ద్వారా ఉప ప్రణాళికా లక్ష్యాలను సాధించాలని సూచించారు. వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఎస్సీలకు అవకాశాలను కల్పించటం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని హితవు పలికారు. ఎస్సీ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఆయా శాఖల అధికారులు కృషి చేయాలని, ఉన్నతి, చేయూత, ఉపాధి హామీ పథకం ద్వారా ఎస్సీలకు ఆర్థిక ఫలాలను అందజేయాలని చెప్పారు. డి.ఆర్.డి.ఎ., డ్వామా, ఎస్సీ కార్పొరేషన్, మేప్మా, విద్య, హార్టికల్చర్, సెరికల్చర్, ఇతర శాఖలు ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పారు. ఎస్సీల ఆర్థిక అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకోవాలని సూచించారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, వారి కాలనీల్లో రోడ్లు వేయాలని, విద్యుత్తు సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ నుంచి వచ్చే ప్రతీ సేవా వారికి తప్పకుండా అందాలని, దీనిలో ప్రతీ శాఖ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి. జగన్నాథం, డి.ఆర్.డి. ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.సుబ్బారావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, డి.ఎం.& హెచ్.వో. పి. రమణ కుమారి, పశు సంవర్ధక శాఖ జేడీ ఏవీ నరసింహులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.