1 ENS Live Breaking News

కరోనా నుంచి కోలుకున్న46 మంది డిశ్చార్జ్..

కరోనా నుంచి కోలుకోవడంతో 46 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆదివారం అనంతపురం లో ఆయన మీడియతో మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు  46 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేసానట్టు వివరించారు. వారందరినీ 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని, బలవర్ధక ఆహారం తీసుకోవాల్సిందిగా సూచించామని కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.  ప్రతీఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. దేవాలయాలు, ప్రయాణాలు చేస్తున్న సమయంలో నాణ్యమైన శానిటైజర్లు వినియోగించాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గంధం చంద్రుడు కోరారు.

అనంతపురం

2020-11-29 20:45:59

మంత్రాలయం ఘాట్ కి పోటెత్తిన భక్తులు..

కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర పుష్కరాలలో 10వ రోజైన ఆదివారం మంత్రాలయం తీరం భక్తజన సందోహంతో నిండిపోయింది. తుంగభద్ర పుష్కరాలతో పాటు ఆదివారం సెలవు రోజు కావడం, కార్తీక పౌర్ణమి కూడా ఒకే రోజు కలిసి రావడంతో  భక్తులు పెద్ద ఎత్తున మంత్రాలయంకు తరలి వచ్చారు. ఆంధ్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ లలో భక్తుల కోలాహలంతో సందడి నెలకొంది. మంత్రాలయంలోని పుష్కర ఘాట్ లలో ఆదివారం ఉదయం నుంచి నుంచి భక్తులు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షవర్ ల కింద జల్లు స్నానం చేసి  తుంగభద్రమ్మ నదీమ తల్లి వద్ద దీపాలు వెలిగించి నమస్కారాలు చేసుకున్నారు. తుంగభద్ర పుష్కరాలలో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు కావడంతో తమ పెద్దలకు ఎక్కువమంది భక్తులు పిండప్రదానాలు చేశారు. కర్ణాటక లోని బెంగళూరు, రాయచూరు, బళ్ళారి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భక్తులు తరలి రావడంతో పుష్కర ఘాట్ లు అన్నీ కిటకిటలాడాయి. పుష్కర ఘాట్ లలో తమ కుటుంబ సభ్యులతో సహా హాజరైన యువత సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న భక్తులు .. తుంగభద్ర పుష్కారాల్లో జల్లు స్నానం అనంతరం మంత్రాలయం మఠంలో వెలిసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు రాఘవేంద్ర స్వామిని ప్రశాంత వాతావరణంలో భక్తులు దర్శించుకున్నారు. తుంగభద్ర పుష్కరాలు మరియు పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు కావడంతో ఆదోని ఆర్డీఓ రామకృష్ణరెడ్డి తన కుటుంబంతో సహా మంత్రాలయంలోని వి ఐపి ఘాట్ లో పుష్కర సాంప్రదాయ పూజలు చేశారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో  పుష్కర ఘాట్ ల వద్ద భక్తుల కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.

మంత్రాలయం

2020-11-29 16:32:02

పచ్చదనంతోనే పరిపూర్ణ ఆరోగ్యం..

ప్రజలకు స్వచ్ఛమైన గాలి (ఆక్సీజన్), నీరు అందించటమే లక్ష్యంగా హరిత విజయనగరం బృందం, జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తున్నాయని కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన పచ్చదనం- పరిరక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 1.20 కోట్ల మొక్కలు, విజయనగరం నగర పరిధిలోని 1.40 లక్షలు మొక్కలు నాటామని తెలిపారు. దండుమారమ్మ ఆలయం సమీపంలో.. నూతనంగా నిర్మించిన ఫైనాన్షియల్ కార్యాలయ సమూహం ఎదురుగా ఏర్పాటు చేసిన పార్కులో హరిత విజయనగరం బృంద సభ్యులతో కలిసి ఆయన ఆదివారం మొక్కలు నాటారు. వాటి సంరక్షణ నిమిత్తం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే   మహాభాగ్యంగా ఇటు అధికార యంత్రాంగం, అటు హరిత విజయనగరం బృందం పని చేస్తున్నాయని చెప్పారు. రానున్న రెండు మూడేళ్ళలో మంచి ఫలితాలు చవి చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో ప్రజలు అధికారులు పాలుపంచుకోవడం చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. జిల్లాలో పలు చెరువులు అభివృద్ధి చేశామని, వాటి చుట్టూ వివిధ రకాల మొక్కలు నాటి రక్షణ కవచాలు ఏర్పాటు చేశామని ఈ సందర్బంగా గుర్తు  చేశారు. ఇలా చేయటం వల్ల నీటి వనరులు పెరుగుతాయని, వేసవిలో నీటి ఎద్దడి కూడా ఉండదని పేర్కొన్నారు. గాలి, నీరు స్వచ్ఛంగా ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు. అనంతరం పార్కును పరిశీలించి, అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. భవిష్యత్తులో ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దాలను దానికి తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అలాగే స్థానిక ఏసీబీ కార్యాలయం నుంచి ఎస్.కోట మెయిన్ రోడ్ వరకు రోడ్డుకిరవైపులా మొక్కలు నాటి పెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Vizianagaram

2020-11-29 13:46:34

మంత్రిపై హత్యాయత్నం చేసింది ఇతడే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నానికి దిగిన వ్యక్తిని బడుగు నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. మంత్రి తన తల్లి మరణించిన తరువాత దినదశ ఖర్మలు చేసి వస్తుండగా మంత్రిపై పదునైన తాపీతో హత్యచేయడానికి తెగబడ్డాడు. అయితే అదికాస్త మంత్రి నడుకున్న బెల్టుకి తగిలి వంగిపోయింది. రెండోసారి పొడవాలని ప్రయత్నించే సమయంలోనే మంత్రి సమయస్పూర్తిగా తప్పుకున్నారు. దీంతో పక్కనే వున్న పోలీసులు, మంత్రి అనుచరులు మంత్రిని పక్కకు తప్పించారు. వెంటనే మంత్రిపై తెగబడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో..హత్యకు తెగబడ్డ వ్యక్తి బడుగు నాగేశ్వర్రావుగా గుర్తించినట్టు పోలీసులు తెలియజేశారు. ఈయనపై కేసు నమోదు చేసి పూర్తివివరాలు సేకరిస్తున్నారు పోలీసులు..

Machilipatnam

2020-11-29 13:35:29

మంత్రిపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం..గంట్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నానిపై ఆదివారం జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు చెప్పారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంలోనూ, జర్నలిస్టులకు తనవంతు సహాయంగా నిలిచి, వారి  పక్షాన నిలిచే మంచి వ్యక్తి పేర్ని నాని కొనియాడారు. అలాంటి వ్యక్తి తన తల్లి మరణించిన బాధలోనే దినఖర్మలు చేసే సమయంలో మంత్రి పేర్నినానిపై హత్యాయత్నానికి తెగబటం దారుణమైన ఘటన అని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆదేవుడి దయతో మంత్రి యత్యాయత్నం నుంచి బయటపడం ఆనందదాయకమన్నారు. మంత్రిపై జరిగిన దాడిని జర్నలిస్టుల తరపున ఖండిస్తున్నట్టు శ్రీనుబాబు చెప్పారు. సహచర జరలిస్టు సంఘాలు కూడా మంత్రిపై జరిగిన దాడిని ఖండించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు.

Visakhapatnam

2020-11-29 13:28:48

నాకేం కాలేదు..కంగారు వద్దు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపు(30వతేదిన) జరుగుతాయనగా ఆదివారం రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. మంత్రి తల్లి ఇటీవలే మ్రుతిచెందారు. ఆ సందర్భంగా దిన కర్మలు చేసి వస్తుండగా ఒక వ్యక్తి కాళ్లపై పడుతున్నట్టుగా నటించి చేతిలో వున్న ఇనుప ఆయుధాలతో మంత్రిని పొట్టలో పొడిచే ప్రయత్నం చేశాడు. మొదటిసారి అదికాస్తా బెల్టు బకిల్ కి తగలడంతో, రెండవసారి పొడిచేందుకు ప్రయత్నించగా మంత్రి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇంతలో పోలీసులు, కార్యకర్తలు మంత్రిపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేశారు. అయితే ఈ నేపథ్యంలో తనకి ఏమీ కాలేదని మంత్రి ప్రకటించారు. అసెలెందుకు తనపై హత్యాయత్నం చేశారనే విషయాన్ని పోలీసులు కూపీలాగుతున్నారు. మంత్రిని హత్యచేసేందుకు వాడిన ఇంటిపనులు చేసే తాపీగా కనిపిస్తుంది. చాలా బలంగా ప్రయత్నం చేసిన తరుణంగో బెల్టుకి తగలడంతో అదికాస్తా పూర్తిగా వంకరపోయి మంత్రి ప్రాణాలతో బయటపడ్డారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు, మంత్రిని చుట్టుముట్టి సేఫ్ గా బయటకు తీసుకు వచ్చారు. ఈ విషయమై మంత్రి స్పందిస్తూ, ఏదోలా దాడిచేయాలని ప్రయత్నించినా పనిజరలేదని అన్నారు. తన తల్లే తనను కాపాడిందని మంత్రి చెప్పుకొచ్చారు..

Machilipatnam

2020-11-29 13:18:46

బడుగు బలహీన వర్గాల ఊపిరి జ్యోతీరావ్ ఫూలే..

భారతదేశంలోని వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతీరావు పూలే బిసి సంఘం విశాఖ జిల్లా బిసి సంఘం మహిళా యువజన విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు, కోలా జయలక్ష్మి, ధనుకోటి రమ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి కార్యక్రమం విశాఖ జిల్లా బిసి సంఘం ఆధ్వర్యంలో శనివారం సీతంపేటలో ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి  పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఊపిరి జ్యోతీరావు ఫూలే మాత్రమేనన్నారు. సమాజంలో ఉన్న దురాచారాలకు , కుల వివక్షకు వ్యతిరేకంగా  150 ఏళ్ల క్రితమే ప్రజలను చైతన్యవంతులను చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. అనేక పోరాటాలు సాగించి విజయాలు సాధించి వెనుకబడిన, నిమ్నజాతులకు ఆశాజ్యోతి అయ్యారని అన్నారు. దళితులకు, వెనుకబడిన కులాలకు మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తి దాయకునిగా చరిత్రలో నిలుస్తారని అన్నారు. దేవదాసీ వ్యవస్థను , సతీ సహగమన దురాచారాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమాలు భారతీయ చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. వితంతు వివాహాలను ప్రోత్సహించి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు గురువుగా నిలిచారని రమ పేర్కొన్నారు. అనంతరం పలువురు నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.  పూలే ఆశయ సాధనకు, బి.సిల సంక్షేమానికి, యువజన విభాగం అభివ్రుద్ధికి తమ సంఘం అనేక కార్యక్రమాలు చేపడుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిసిలు పాల్గొన్నారు.

విశాఖ సీతంపేట

2020-11-28 21:36:57

శ్రీభగవద్గీత పారాయ‌ణంతో జ్ఞానం..

శ్రీ కృష్ణ ప‌ర‌మాత్ముడు ఉప‌దేశించిన భగవద్గీతకు సమానమయిన గ్రంధం ఈ లోకంలో మరొకటి లేదని, గీతా పారాయ‌ణంతో జ్ఞానం, స‌త్‌ప్ర‌వ‌ర్త‌న, ప్ర‌సాదిస్తాయ‌ని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి తెలిపారు. కంచి స్వామి తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై శనివారం సాయంత్రం గీతా పారాయ‌ణంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వామివారు అనుగ్రహభాషణం చేస్తూ సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన  శ్రీభగవద్గీత ప్రపంచంలోని  సర్వ మానవాళికి అన్ని సమస్యలకు మార్గం చూపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ధర్మాన్ని అనుసరిస్తే ధర్మమే అందరిని కాపాడుతుందన్నారు. జప, హోమ, దానాల ద్వారా జ్ఞాన జ్యోతిని పొంద‌వ‌చ్చ‌న్నారు. కంచి పీఠం ఆధ్వర్యంలో 1966వ సంవత్సరం నుండి భగవత్ గీతను ముద్రించి దేశ విదేశాల‌లో ప్రచారం చేస్తున్న‌ట్లు తెలిపారు. టిటిడి ప్రతి రోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో గీతా పారాయణం నిర్వహించడాన్ని అభినందించారు. ఈ  కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా కోట్లాది మంది భ‌క్తులు వీక్షిస్తున్నార‌ని, త‌ద్వారా గీతా సారాంశాన్ని తెలుసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. లోక కల్యాణార్థం సెప్టెంబర్ 10వ తేదీ నుండి ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు టిటిడి తిరుమలలో గీతా పారాయణం నిర్వహిస్తున్న విషయం విదితమే. టిటిడి ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి , బోర్డు సభ్యులు  డి.పి.అనంత,  గోవింద‌హరి,  కృష్ణమూర్తి వైద్య‌నాధ‌న్‌ తదితరులు  ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Tirumala

2020-11-28 20:08:43

ట్రజరీ అకౌంట్స్ ఆఫీసర్ బదిలీ..

శ్రీకాకుళం జిల్లా ఖజానా కార్యాలయంలో ఉప సంచాలకులుగా పనిచేస్తూ వి.ఎం.ఆర్.డి.ఎ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా  బదిలీపై వెళ్తున్న జి.నిర్మలమ్మను ట్రెజరీ కార్యాలయ సిబ్బంది కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఘనంగా సన్మానించారు. జిల్లా ఖజానా కార్యాలయంలో ఉప సంచాలకులుగా 4 ఏళ్లకు పైగా సేవలు అందించిన ఆమెకు కార్యాలయ సిబ్బంది దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞుపికలు అందజేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు. శ్రీకాకుళం జిల్లాలో మాదిరిగానే విశాఖపట్నం వి.ఎం.ఆర్.డి.ఏలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉత్తమ సేవలు అందించి జిల్లాకు మంచిపేరును తీసుకురావాలని సిబ్బంది ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు   యం.పద్మ, యస్.సి.కార్పొరేషన్ విశ్రాంత కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్.మహాలక్ష్మీ, ఉప ఖజానా అధికారి రాష్ట్ర ట్రెజరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భాగ్యలక్ష్మీ, కార్యదర్శి సురేష్, రాష్ట్ర ఖజానా శాఖ సంఘం కోశాధికారి భాస్కరరావు, సహాయ ఖజానా అధికారులు పి.సావిత్రి, ఎ.తవిటన్న, కె.శ్రీనివాసరావు, వి.వి.రమణమూర్తి,  ఇతర యస్.టి.ఓలు, ఇతర ట్రెజరీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-28 19:51:08

నదుల్లో కార్తీక పౌర్ణమి స్నానాలు వద్దు..

సముద్రం, నదులు, చెరువులు, ఈత కొలనులలో కార్తీక స్నానాలు చేసే ప్రయత్నం చేయరాదని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. కరోనా వ్యాప్తిలోనే ఉందని, మూకుమ్మడిగా భక్తులు గుమిగూడటం ద్వారా వ్యాప్తి పెరుగుతుందని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కార్తీక మాసం అచరణపై ప్రభుత్వం శని వారం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం అత్యావశ్యమని ఆయన అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రం, నదులు, చెరువులు, ఈత కొలనులు, బావుల వద్ద కార్తీక స్నానాలు ఆచరించవద్దని పిలుపునిచ్చారు. ఆలయాల గర్భగుడిలోకి ఎవరికి ప్రవేశం కల్పించరాదని అన్నారు. ఆలయాల్లో 10 సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారులు, 65 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి కూడా అనుమతించరాదని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయాల్లో రద్దీ ఉండరాదని, ఆలయాల్లో నిర్వహించే సేవలు సైతం ఆలయ అర్చకులు మాత్రమే పూర్తి చేయాలని, భక్తులకు అనుమతించరాదని స్పష్టం చేసారు. కరోనా తగ్గిందనే భావన వద్దని ఆయన సూచించారు. చలికాలంలో వ్యాప్తికి అవకాశాలు అధికంగా ఉన్నాయని గుర్తించాలని అందుకు తగిన విధంగా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Srikakulam

2020-11-28 19:48:08

కలెక్టర్ కు ఎన్సీసీ విద్యార్ధుల అభినందన..

ఇండియన్ ఎచీవర్స్ సంస్థ నుండి మాన్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డు పొందిన జిల్లా కలెక్టర్ డా ఎం. హరి జవహర్ లాల్ కు జిల్లాలోని స్కౌట్, గైడ్ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్సీసీ విద్యార్ధులంతా చదువుతోపాటు, త్రివిధ దళాల్లో మంచి శిక్షణ పొంది జిల్లా, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. తనకు అభినందనలు తెలియజేయడానికి రావడం ఆనందంగా వుందన్నారు. సంస్థ జిల్లా చీఫ్ కమిషనర్ ఈపు విజయ కుమార్, కార్యదర్శి వాకా చిన్నం నాయుడు, డి.ఓ.సి. త్రినాథ నాయుడు, స్కౌట్ మాస్టర్లు భోగాపురం శ్రీను, సుబ్రహ్మణ్యం, ఎం.భాస్కర రావు,  హరిత విజయనగరం జిల్లా కో ఆర్డినేటర్ రామ్మోహన్ తదితరులు శనివారం జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ ను కలెక్టర్ కార్యాలయంలో కలిసి అభినందించారు.

Vizianagaram

2020-11-28 19:38:31

అంటువ్యాధులు రాకుండా చూడండి..

రాష్ట్రాలలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్/మున్సిపాల్టీలలో అంటు వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యన్నారాయణ ఆదేశించారు. శనివారం రాష్ట్రంలోని నివర్ తుఫాన్ వలన దెబ్బతిన్న విద్యుత్ శక్తి, నీటి సరఫరాలను త్వరితగతిన పునరిద్ధరించాలని అన్ని మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు. ఈమేరకు మున్సిపల్ కార్యదర్శి శ్యామలరావులతో కలసి అన్ని జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల నివర్ తుఫాన్ వలన కలిగిన నష్టాన్ని సంఘాల కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడానికి ఇప్పటి నుండే తగు చర్యలు చేపట్టాలని మంత్రివర్యులు అందరి కమిషనర్లను కోరారు. పట్టణ ప్రణాళిక విభాగంపై సమీక్షిస్తూ అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు నిరంతరంగా చేపట్టాలని సూచించారు. మున్సిపల్   పాఠశాలలో నాడు – నేడు పథకం కింద చేపడుతున్న పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించాలని కమిషనర్లను ఆదేశించారు. జివిఎంసికి సంబందించి మంత్రి సమీక్షలో కార్పోరేషన్ కు సంబంధించి  కమిషనర్ డా. జి. సృజన వివరణ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో  సి.డి.ఎం.ఎ. విజయ కుమార్, ఇ.ఎన్.సి. చంద్రయ్య, డి.టి.సి.పి. రాముడు తదితరులు పాల్గొనగా, జివిఎంసి తరుపున కమిషనర్ డా.జి. సృజన, అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, సి.సి.పి. విద్యుల్లత, పి.డి.(యు.సి.డి.)  వై. శ్రీనివాసరావు, పర్యవేక్షక ఇంజినీరు శివప్రసాదరాజు మొదలగు వారు పాల్గొన్నారు.

జివిఎంసీ కార్యాలయం

2020-11-28 19:33:08

స్కాలర్ షిప్ దరఖాస్తులకు గడువు పెంపు..

శ్రీకాకుళం జిల్లాలోని మైనారిటీ విధ్యార్ధులకు ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కం మీన్స్ జాతీయ స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువును డిసెంబర్ 30 వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి.ఎన్.వి.లక్ష్మీనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇదివరలో జిల్లాలోని మైనారిటీలకు చెందిన ( ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బుద్ధులు, పార్శీకులు,సిక్కులు ) విధ్యార్దులు ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ , మెరిట్ కం మీన్స్ జాతీయ స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు నవంబర్ 30 వరకు గడువు ఉండగా, కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు,విద్యాసంస్థలు నవంబర్ నెల నుండి ప్రారంభం అయినందున, ఆ గడువును డిసెంబర్ 30 వరకు  పొడిగించినట్లు ఆయన చెప్పారు. అలాగే స్కాలర్ షిప్ దరఖాస్తు కొరకు విద్యార్హతలుగా  ముందు తరగతుల్లో 50% మార్కులుగా  వుండేదని, కానీ కోవిడ్ దృష్ట్యా విద్యార్థులు ముందు తరగతుల్లో ఉత్తీర్ణులైతే సరిపోతుందని ఆయన స్పష్టం చేసారు. కావున జిల్లాలోని మైనారిటీలకు చెందిన  విద్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  ఆ ప్రకటనలో కోరారు.  ఇతర  వివరాల కొరకు మైనారిటీ సంక్షేమ కార్యాలయం, కలక్టరేట్ కాంపౌండ్, విజయనగరం జిల్లా  మొబైల్ నెంబర్లు 94904 98948, 82475 54334,94403 99588 ను  సంప్రదించవచ్చని ఆయన వివరించారు.   

Srikakulam

2020-11-28 19:23:03

జిల్లాకు జాతీయ‌స్థాయి గుర్తింపే లక్ష్యం..

విజ‌య‌న‌గ‌రం ‌జిల్లాలో చేప‌ట్టిన జ‌ల‌సంర‌క్ష‌ణ‌, ర‌క్త‌దానం, హ‌రిత విజ‌య‌న‌గ‌రం కార్య‌క్ర‌మాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల ద్వారా జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాల‌న్న త‌ప‌న‌తోనే చేప‌ట్టామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. స్కోచ్ అవార్డులు గాని, జాతీయ జ‌ల‌శ‌క్తి అవార్డు గాని, నిన్న ప్ర‌క‌టించిన ఇండియ‌న్ ఎచీవ‌ర్స్ అవార్డు గాని త‌న ఒక్క‌డికే కాద‌ని, ఇది జిల్లాకు, జిల్లా యంత్రాంగంలో ప‌నిచేసే ప్ర‌తి అధికారికి ల‌భించిన గుర్తింపుగా భావించాల‌న్నారు. జిల్లాకు ఇండియ‌న్ ఎచీవ‌ర్స్ అవార్డు ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా ఈ దిశ‌గా స‌హ‌క‌రించిన‌ జిల్లా అధికారులంద‌రికీ క‌లెక్ట‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కోవిడ్‌పై ప్ర‌చారోద్య‌మం నిర్వ‌హ‌ణ‌కు శ‌నివారం నిర్వ‌హించిన జిల్లా అధికారుల స‌మావేశంలో మాట్లాడుతూ అధికారులంతా ఒక టీమ్ వ‌ర్కుతో ప‌నిచేయ‌డం వ‌ల్లే ఈ ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాలు ఎవ‌రు చేప‌ట్టినా జిల్లా యంత్రాంగం ద్వారా పూర్తిగా స‌హ‌క‌రిస్తున్నామ‌ని పేర్కొంటూ న‌గ‌రంలోని ప‌లు పాఠ‌శాల‌ల ప్ర‌దానోపాధ్యాయులు ఇప్ప‌టికీ మొక్క‌లు నాట‌డంలో నిర్లక్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మొక్క‌లు నాటేందుకు అవ‌స‌ర‌మైన పూర్తి స‌హ‌కారాన్ని న‌గ‌ర పాల‌కసంస్థ, సామాజిక అట‌వీ విభాగాల ద్వారా అందిస్తున్నామ‌ని, అయినా కొంద‌రు త‌మ పాఠ‌శాల‌ల్లో మొక్క‌లు నాటేందుకు త‌గిన స్థ‌లం ఉన్నా ఆస‌క్తి చూప‌డం లేద‌న్నారు. అటువంటి వారిని గుర్తించి రానున్న రోజుల్లో చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు వెనుకాడ‌బోమ‌న్నారు. ప్ర‌దీప్ న‌గ‌ర్ స్కూలులో ఎంతో స్థ‌లం అందుబాటులో ఉన్నా అక్క‌డ మొక్క‌లు నాట‌క‌పోవ‌డంపై అసంతృప్తి వ్య‌క్తంచేశారు.

Vizianagaram

2020-11-28 19:16:27

సారిపల్లిని భూ నిర్వాసిత చట్టం పరిధిలోకి..

విజయనగరం జిల్లాలోని తారకరామ రిజర్వాయర్ పరిసర గ్రామమైన సారిపల్లిని భూ నిర్వాసిత చట్టం పరిధిలోకి తీసుకొచ్చేందుకు పరిశీలిస్తామని కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం నిమిత్తం భూసేకరణ చేసిన కోరాడపేట, తోటాడపేట, ఎ.టి.అగ్రహారం గ్రామాల మాదిరిగానే సమీపంలో ఉన్న సారిపల్లి గ్రామానికి కూడా అన్ని ప్రయోజనాలు కల్పించేందుకు, ఆర్ & ఆర్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు పరిశీలిస్తామని పేర్కొన్నారు. తారకరామ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలపై సమీక్షేందుకు శనివారం కలెక్టర్ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సారిపల్లి గ్రామాన్ని ఆర్ & ఆర్ పరిధిలోకి తీసుకొనే విషయాన్ని పరిశీలిస్తామని, అక్కడ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు. అక్కడున్న మొత్తం 1400 కుటుంబాలకు గతంలో చేసిన సర్వే లెక్కల ఆధారంగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నివాస స్థలాలు ఇచ్చే అంశాన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటామని, నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సారిపల్లి లో ప్రస్తుతమున్న తాజా పరిస్థితిపై నివేదిక అందజేయాలని జేసీ కిషోర్ కుమార్, ఆర్డీవో భవానీ శంకర్ లను ఆదేశించారు. ప్రభావితం అయ్యే రిజర్వాయర్  పరిధిలోని కొరాడపేట, తోటాడపేట, ఎ.టి.అగ్రహారం ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సారిపల్లి గ్రామం ప్రాజెక్ట్ పరిధిలోకి రానప్పటికీ అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై, సమస్యలపై పరిశీలన చేసి పి.ఎ.ఎఫ్. జాబితా పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత కమిటీ ఇచ్చిన నివేదికను పునఃపరిశీలన చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే పునరావాస చట్టం 2005 ప్రకారం కాకుండా 2013 చట్టం ప్రకారం ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పగా వీలుంటే తప్పకుండా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదులిచ్చారు. వీలైనంత త్వరగా ప్రభుత్వపరంగా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను సారిపల్లి గ్రామ ప్రజలకు అందజేయాలని, భూ నిర్వాసిత జాబితాలోకి తీసుకొచ్చి అక్కడ ప్రజలకు న్యాయం చేయాలని వైఎస్సార్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కోరారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రాంతంలో మరడపాలెం, పోలిపల్లి గ్రామాలకు చెందిన మరొక 40 మందిని నిర్వాసిత జాబితాలో చేర్చాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే కోరారు.  సమావేశంలో జేసీ కిషోర్ కుమార్, డి.ఆర్. వో. గణపతిరావు, ఆర్డీవో భవానీ శంకర్, సాగునీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-28 19:13:12