దేశంలోని వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతీరావు పూలే అని జిల్లా వి.వినయ్ చంద్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి కార్యక్రమం బి.సి.సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న దురాచారాలకు , కుల వివక్షకు వ్యతిరేకంగా 150 ఏళ్ల క్రితమే ప్రజలను చైతన్యవంతులను చేసారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలక్టర్ గోవిందరావు, డిఆర్వో, ఎ. ప్రసాద్, బిసి కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్య శ్రీ ఫలాలను ప్రతి అర్హునికి అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిఆశయమని జాయింట్ కలెక్టర్ (గ్రామ/వార్డు సచివాలయాలు, అభివృద్ధి) మరియు ఆరోగ్యశ్రీ ఎక్స్ అఫిసియో అడిషనల్ ముఖ్య కార్యనిర్వణాధికారి డా.ఏ.సిరి తెలిపారు.శనివారం ఉదయం జేసీ క్యాంపు కార్యాలయంలో ఆమె డా.వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పై రూపొందించిన 3 రకాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆశయ సాధనలో భాగంగా ఈరోజు జిల్లా లోని 1208 సచివాలయంలో ఉన్న సచివాలయ ఆరోగ్యమిత్రల హెల్ప్ డెస్క్ లో ఈ పోస్టర్లను అతికించడం జరుగుతుందన్నారు.వీటిని జిల్లాలోని అన్ని సచివాలయాలలో అతికించి ప్రజలు ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా ఉపయోగించుకునేలా తెలియచేయవలసిన బాధ్యత సచివాలయ ఆరోగ్యమిత్రలపై ఉందన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ కె. శివకుమార్, జడ్పీ డిప్యూటీ సిఈఓ శ్రీనివాస్, మునిసిపల్ రీజినల్ డైరెక్టర్ నాగరాజు,టీం లీడర్ జి.టి.సుధాకర్, ఆరోగ్య మిత్ర నాగన్న తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వదవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి అభినందన పరంపర కొనసాగుతూనే వుంది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ విశాఖ చాప్టర్ సభ్యులు అభినందించారు. శనివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో చాప్టర్ చైర్మన్ ఓఆర్‌ఎం రావు, కార్యదర్శి జి.శ్రీధర రెడ్డి(మిలీనియం), రీజినల్ వైస్ ప్రెసిడెంట్ ఆచార్య సాంబశివ రావు, జాతీయ కమిటీ సభ్యులు డాక్టర్ మురళీధర్, శ్రీనివాస ఠాగూర్, సభ్యులు డాక్టర్ అంజన, సంతోష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రప్రభుత్వం నాలుగు యూనివర్శిటీలకు ఉపకులపతిలను నియమించినప్పటికీ ఏయూ మాత్రం ఇదే యూనివర్శిటీలో రెక్టార్ గా విధులు నిర్వహించిన వ్యక్తిని వీసీగా నియమించడం అభినందనీయమన్నారు. ఆసియాలోనే పేరెన్నికగన్న ఏయూ మరింత అభివ్రుద్ధి చేయాలని వీరు ఆకాంక్షించారు.
మహావిశాఖ నగర పాలక సంస్థ చేపడుతున్న స్వచ్చ సర్వేక్షణ్, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలకు ఆర్ధికంగా సహాయ సహకారాలు అందించేందుకు హెచ్.పి.సి.ఎల్.(విశాఖ రిఫైనరీ) ముందురావడం అభినందనీయమని కమిషనర్ డా.జి స్రిజన అన్నారు. శనివారం హెచ్పీసీఎల్ అధికారులు ఈ మేరకు కమిషనర్ కార్యాలయంలో ఈ సిఎస్ఆర్ నిధుల, వాటి వినియోగానికి సంబంధించిన ఎంఓయూను జివిఎంసీ, హెచ్పీసీఎల్ అధికారులు కుదర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం బి.పి.ఎల్. క్రింద పేదలకు చెత్తను వేరుచేసి అందించేందుకుగాను 3 రకాల డస్ట్ బిన్ లు పంపిణీ చేస్తారు. నగర పరిధిలోగల వార్డులలో పారిశుద్ధ్య పనులు నిమిత్తం పుష్ కార్ట్ లు పంపిణీతోపాటు ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్లు కొనుగోలు కి ఆ నిధులు వినియోగిస్తామని కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అధనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ పాల్గొనగా, హెచ్.పి.సి.ఎల్.(విశాఖ రిఫైనరీ) యాజమాన్యం తరుపున ఎగ్జిక్యుటివ్ డైరెక్టరు వి. రతన్ రాజు, డి.జి.ఎం. కె. నగేష్, సి.ఎస్.ఆర్ & పి.ఎస్., సీనియర్ మేనేజర్ కాళి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోగ్రామ, వార్డు సచివాలయ శాఖలో జిల్లా, సహాయ, పట్టణ సమన్వయకర్తల పోస్టుల భర్తీకి జరిగిన పరీక్షకు 175 మంది హాజరయ్యారు. ఈ పరీక్షను శివాని ఇంజనీరింగు కళాశాలలో శనివారం నిర్వహించారు. దరఖాస్తు చేసిన అభ్యర్ధులలో అర్హతగల 197 మందికి పరీక్షకు హాజరు కావలసినదిగా సమాచారం అందించగా 175 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను గ్రామ, వార్డు సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు శని వారం తనిఖీ చేసారు. ప్రజల చెంతకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించుటలో భాగంగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అందులో భాగంగా జిల్లాలో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేయుటకు జిల్లా సమన్వయకర్త , సహాయ జిల్లా సమన్వయకర్త, పట్టణ సమన్వయకర్త పోస్టులను మంజూరు చేసారని ఆయన తెలిపారు. సమన్వయకర్తల బృందం గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధల ద్వారా జరుగుతున్న కార్యక్రమాల వివరాలు సేకరించడం, విశ్లేషించడం, అందులో మెరుగ్గా చేప్టటుటకు అవకాశాలు గుర్తించడం, బలహీనతలు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు గుర్తించడం తదనుగుణంగా విశ్లేషణ చేసి కార్యాచరణప్రణాళికలను రూపొందించడం చేయాల్సి ఉంటుందని డా.శ్రీనివాసులు తెలిపారు.
ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, బ్యాంకర్లు, డిఆర్డిఎ, యుసిడి, మెప్మా పిడిలు, ఇతర జిల్లా అధికారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ క్రియాశీల కార్యక్రమాలన్నింటిని పక్కాగ అమలు చేయాలన్నారు. అర్హత గల ప్రతీ లబ్దిదారునికి ప్రభుత్వ పథకాలు అందాలని ఆయన ఆదేశించారు. అందుకు బ్యాంకర్లంతా సహకరించాలని, ఆలాగే బ్యాంకు లింకేజి, జగనన్న తోడు, సున్నా వడ్డీ, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆసరా, వైయస్ఆర్ చేయూత, తదితర పథకాలపై ఆయన సుదీర్ఝంగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న వాటిని సత్వరమే విడుదల చేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలలో రాష్ట్రంలో విశాఖపట్నం ముందంజలో ఉండాలన్నారు. అర్హత గల ప్రతీ లబ్దిదారునికి ప్రభుత్వ పథకాలు అందాలని స్పష్టం చేశారు. వై.యస్.ఆర్. భీమా కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే డిఆర్డిఎ, యుసిడి, మెప్మా పిడిలకు తెలియజేయాలని పేర్కొన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి లబ్దిదారులకు త్వరితగతిన ఋణాలు అందచేయాలన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోనే లబ్దిదారులకు జగనన్న తోడు పథకంను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కూరగాయలు, తోపుడు బళ్లు, చిన్న చిన్న టిఫిన్ షాపులు, పూలు, మోటారు సైకిళ్ళపై వెళ్ళి వ్యాపారం చేసుకొనే వారు, పళ్లు, కిరాణా, బడ్డీ కొట్టులు, ఫ్యాన్సీ, మగ్గం వర్క్, క్లాత్ అండ్ హేండ్లూమ్స్, లేస్ వర్క్, స్టీల్ షాపులు, కుమ్మరి, కిచెన్ అండ్ ప్లాస్టిక్ సామానులు, బ్యూటీ అండ్ ఫ్యాషన్, బ్రేస్ వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, లెథర్ పప్పెట్స్, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణా, తదితర వ్యాపారులు జగనన్న తోడు పథకం కింద్రకు వస్తారని, జగనన్నతోడు పథకంనకు సంబంధించి అర్హత గల లబ్దిదారులు దరఖాస్తు చేసుకోకపోతే అలాంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమంత్రి ఒక నెల రోజులు సమయం ఇచ్చారని, నెల రోజుల కంటే ముందుగానే ఒక వారం రోజుల సమయం పాటు ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2, పిడిలు దృష్టి సారించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ మంజూరైన ప్రభుత్వ పథకాలను సత్వరమే లబ్దిదారులకు పంపిణీ చేయాలని బ్యాంకర్లను కోరారు. ట్రక్కులను మంజూరు చేయడం జరుగుతుందని ఆ వాహనాలకు ఋణాలు ఇవ్వాలని తెలిపారు. డిఆర్డిఎ, యుసిడి, మెప్మా పిడిలు వై.యస్.ఆర్. భీమాకు సంబందించి డేటా అప్డేషన్, తదితర విషయాలపై బ్యాంకర్లకు వివరించారు. అవసరమైతే తమ సిబ్బందిని బ్యాంకులలో ఏర్పాటుకు చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. వైయస్ఆర్ చేయూతకు సంబంధించి పశు సంవర్థక శాఖ జెడి రామకృష్ణ మాట్లాడుతూ ఈ పథకం కింద గొర్రెలు, మేకలు, తదితరమైన వాటిని మంజూరు చేయవచ్చునని, ఇందుకోసం ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఒక అసిస్టెంట్ ఉంటారని ఆయన అన్నారు. పశువులకు జియో ట్యాగింగ్ ఉంటాయన్నారు. వ్యవసాయ శాఖ జెడి లీలావతి సున్నా వడ్డీకి సంబంధించి వివరించారు. సున్నా వడ్డీకి సంబంధించి ఏమైనా పెండింగ్ లో ఉంటే వాటిని సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. మత్య్సశాఖ జె.డి. డా. ఫణి ప్రకాష్ కిషాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయడమైనదని, వాటిని లబ్దిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్.సి. బి.సి., మైనార్టీ, ఇ.బి.సి. కార్పొరేషన్ లకు సంబంధించి ట్రక్కుల ద్వారా పౌర సరఫరాలకు సంబంధించిన నిత్యవసర సరకులను రవాణా చేసేందుకు లబ్దిదారులకు మంజూరు చేయనున్నామని, అందుకు బ్యాంకర్లు సహకరించాలని ఇ.డి.లు కోరారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్-3 గోవిందరావు, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, యుసిడి పిడి శ్రీనివాసరావు, మెప్మా పిడి సరోజని, ఎల్.డి.ఎం. శ్రీనాథ్ ప్రసాద్, ఎస్సీ, బిసి, ఇబిసి, మైనార్టీ కార్పొరేషన్ల ఇడిలు శోభారాణి, పెంటోజిరావు, ఆయా బ్యాంకర్ల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కరోనా కారణంగా జిల్లాలో ఇప్పటికే రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయామని, సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ ఏ ఒక్క ప్రాణం కోల్పోకుండా చూడటమే లక్ష్యంగా నేటి నుండి ఏభై రోజుల ప్రచారోద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. ప్రజలందరినీ కోవిడ్‌పై అప్రమత్తం చేస్తూ జిల్లాలోకి సెకండ్ వేవ్ ప్రవేశించకుండా నిరోధించడమే లక్ష్యంగా మాస్కే కవచం పేరుతో అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ప్రచారోద్యమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏభై రోజుల్లో గ్రామం నుండి మండల, జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ప్రతిరోజూ చేపడుతూ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరిస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ తమ పరిధిలో వుండే లబ్దిదారులు, ప్రజానీకానికి అవగాహన కల్పించే బాధ్యతలు చేపట్టాల్సి వుంటుందన్నారు. శీతాకాలం ప్రారంభం కావడంతో యూరప్ దేశాలు, అమెరికాతో పాటు మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల ఉధృతి పెరిగిందని రెండో వేవ్‌లో ఈ వ్యాధి మరింత తీవ్రంగా ప్రభావం చూపుతోందని పేర్కొంటూ సెకండ్ వేవ్‌లో ఈ వ్యాధికి గురయ్యే వారు త్వరగా మృత్యువాత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని అందువల్ల జిల్లా ప్రజలంతా జిల్లా యంత్రాంగం చేసే సూచనలు పాటిస్తూ తాము ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఏభై రోజుల ప్రచారోద్యమంపై చర్చించే నిమిత్తం శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ ఒక సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు ఈ ప్రచారోద్యమం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి ముప్పు పూర్తిగా తొలగిపోయిందనే భావన నెలకొందని, అయితే సెకండ్ వేవ్ ద్వారా తలెత్తే ముప్పును వారికి తెలియజేసి ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించేలా అప్రమత్తం చేయాలన్నారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన పదిహేను అంశాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ శాఖ తమ ద్వారా చేపట్టే కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించి అందజేయాలన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని అప్పటివరకు రెండో వేవ్‌ను అడ్డుకొని ప్రజల ప్రాణాలను రక్షించాల్సి వుందన్నారు. జిల్లా యంత్రాంగంలోని గ్రామ, వార్డు వలంటీరు నుండి జిల్లాస్థాయి అధికారి వరకు ప్రతిఒక్కరూ మనస్ఫూర్తిగా ఇందులో పనిచేయాలన్నారు. మునిసిపాలిటీల్లో ప్రత్యేక ప్రచార వాహనాలు ఏర్పాటుచేసి కోవిడ్‌పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇకపై కేవలం కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలనే చేస్తారని, రేపిడ్ ఏంటిజెన్ పరీక్షలు, ట్రూనాట్ పరీక్షలు ఇకపై చేయబోరని చెప్పారు. ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు చేసే సామర్ధ్యం పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయుల్లో కోవిడ్‌పై పూర్తిస్థాయి అవగాహన కలిగించాల్సి వుందన్నారు. జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖ తాము చేపట్టిన కార్యక్రమాలను డాక్యుమెంటేషన్ చేయాలని చెప్పారు. ఉత్తమంగా డాక్యుమెంటేషన్ చేసిన ప్రభుత్వ శాఖలకు అవార్డులు ప్రకటిస్తామన్నారు. ప్రచారోద్యమంలో ఉత్తమ పనితీరు కనబరచిన ప్రభుత్వ శాఖలకు బహుమతులు ప్రకటిస్తామని వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణ కుమారి ఏభై రోజుల ప్రచారోద్యమంలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం తదితర పదిహేను అంశాలను ప్రతిఒక్కరూ పాటించాలని పేర్కొంటూ వాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. మాస్కును ఏవిధంగా వినియోగించాలి వంటి అంశాలన్నింటినీ వివరిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డా.జి.నాగభూషణరావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కమ్యూనిస్టు సిద్ధాంతకర్త ఫ్రెడరిక్ ఎంగెల్స్ ద్విశత జయంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, జిల్లా సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ గార్లు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా శనివారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసి సమావేశంలో కె.లోకనాథం మాట్లాడుతూ కార్ల్‌మార్కస్, ఎంగెల్స్‌ను వేరువేర్వగా చెప్పలేమన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని రూపొందించడంలో ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. కీలకమైన అనేక గ్రంధాలను రచించారన్నారు. పెట్టుబడిదారీ ప్రపంచం యావత్తూ ఆర్థిక మాంద్యం, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో వారు రచించిన దాస్ కాపిటల్, పెట్టుబడి గ్రంధాలను పెట్టుబడుదారులు అధ్యయనం చేయాల్సి వస్తుందన్నారు. భారతదేశం నేడు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుందన్న ఆయన బిజెపి నేతృత్వంలోని కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగాన్ని, వ్యవసాయరంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోందని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వరంగం, వ్యవసాయ రంగం పరిరక్షణ కోసం భారత్‌లో సాగుతున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాలన్నారు. . అందుకు సకల శ్రామికుల్నీ ఐక్యం చేసి ప్రజా పోరాటానికి ఉద్యుక్తులు కావాలని.. అదే ఎంగెల్స్ మహాశయునికి ద్విశత జయంతికి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.ప్రభావతి, జి.కోటేశ్వరరావు, డి.వెంకన్న, కె.సురేంద్ర, వి.ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జి.నాయనబాబు, ఆర్.శంకరరావు, వి.వి.శ్రీనివాసరావు, ఎస్.వి.నాయుడు, గనిశెట్టి సత్యన్నారాయణ, జి.శ్రీరామ్, ఆర్.రాము, విహెచ్.దాసు, వి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
దత్తత ఇచ్చేందుకు నియమ నిబంధనలు విధిగా పాటించాలని బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ గురుగుబిల్లి నరసింహమూర్తి అన్నారు. దత్తత మాసోత్సవాలలో భాగంగా జిల్లా మహిళ, శిశు అభివృద్ధి సంస్థ కార్యాలయంలో బాలల రక్షిత గృహాలు నిర్వహిస్తున్న సంస్థల సిబ్బందికి, ఐ.సి.పి.ఎస్ సిబ్బందికి పిల్లల దత్తత ఇచ్చే ప్రక్రియ, దత్తత ప్రక్రియలో బాలల రక్షిత గృహాల సిబ్బంది పాత్ర పై శని వారం ఒక రోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. బాలల రక్షిత గృహాలలో పనిచేస్తున్న సిబ్బంది పిల్లల పట్ల ప్రేమతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. పూర్తి అనాధ బాలలను గుర్తించి అటువంటి బాలల వివరాలను బాలల సంక్షేమ సమితి దృష్టికి తీసుకురావాలి ఆయన కోరారు. అటువంటి బాలల దత్తతకు అర్హతలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దత్తత పట్ల కౌన్సిలింగ్ సేవలు అందజేస్తూ వారికి ఒక మంచి కుటుంబాన్ని అందజేయాలని సూచించారు. దత్తత పట్ల గ్రామ స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహన కల్పించుటకు చర్యలు తీసుకోవలని కోరారు. ఐసిడిఎస్ అదనపు పథక సంచాలకులు పి.రాదా కృష్ణ మాట్లాడుతూ పిల్లల దత్తత విషయంలో బాలల రక్షిత గృహాల సిబ్బంది దత్తతకు అర్హులుగా ప్రకటించిన వారి చైల్డ్ స్టడీ రిపోర్ట్, ఆరోగ్య పరీక్షల నివేదికలు ఎప్పపటికప్పుడు తయారు చేయించి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలన్నారు. తద్వారా దత్తత ప్రక్రియను పటిష్టం చేయాలని కోరారు. పిల్లల దత్తతను ప్రోత్సహిస్తున్న బాలసదనం సూపరింటెండెంట్ బి.పుణ్యావతి, శిశుగృహ మేనేజర్ కె.నరేష్, శాంతాకళ్యాణ్ అనురాగ నిలయం ఇన్ చార్జి దేవేంద్ర ప్రసాద్ ను అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు బి.శశిభూషణ చౌదరి, ఆర్.జ్యోతి కుమారి, కె.సత్యవాణి, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, ఎ.ఎస్.ఐ పి.వి.రమణ, జిల్లా బాలల రక్షణ విభాగం, డి.సి.పి.ఓ కె. వి.రమణ, జిల్లాలో బాలల రక్షిత గృహాల యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలో 77లక్షల బ్యాంకు దోపిడీ దొంగలను పోలీసులు 72 గంటల్లోనే పట్టుకొని మొత్తం నగదు రికవరీ చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆధ్వర్యంలో పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నారు. యూట్యూబు వీడియోలు చూసి దొంగతనం చేయడం నేర్చుకున్న దొంగలు మూడు రోజుల క్రితం స్థానిక బ్యాంకు నుంచి 77లక్షలను కొట్టేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మూడురోజుల్లోనే వారినిపట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, దొంగలు ఎంతటివారైనా పోలీసుల నుంచి తప్పించుకోవడం అసాధ్యమని అన్నారు. ప్రజలు ప్రభుత్వ సంస్థలు ఇలాంటి దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పుడు ఏం జరిగినా ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలనే విషయాన్ని గుర్తుపెట్టుకొని తమకు సమాచారం అందిస్తే ప్రజలకోసం తాము పనిచేస్తామని వివరించారు. ఈ దొంగతనం కేసులో చాకచక్యంగా వ్యవహించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ దొంగతనంలో ట్విస్ట్ ఏంటంటే గతంలో వీరిపై ఎలాంటి కేసులు లేవని కేవలం యూట్యూబులో వీడియోలు చూసి మాత్రమే వీరు దొంగతనాలు చేశారని ఎస్పీ వివరించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతూనే వుంది. శనివారం విసిని పలువురు అభినందించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎం.జగన్నాధ రావు, మాజీ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, ఆంధ్రమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సుధాకర్, పెద్దసంఖ్యలో అభిమానులు, ఆచార్యులు,ఉద్యోగులు, కళాశాలల ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రాయూనివర్శిటీలో ఎవరికీ దక్కని గౌరవం మీకు దక్కిందని కొనియాడారు, పరిశోధకులుగా, రెక్టార్ గా, ఇపుడు విసిగా మూడు ఉన్నత స్థానాలను అదిరోహించిన తొలివ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆసియాలోనే అతి పెద్ద యూనివర్శిటీగా ఏయూ ఉందని, దీనిని సెంట్రల్ యూనివర్శిటీగా మార్పుచేసే కార్యక్రమం కూడా చేపట్టాలని వక్తలు సూచించారు. అందరి సహకారంతో యూనివర్శిటీని అభివ్రుద్ధి చేస్తామని విసి పివిజిగి ప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు.
సామాజిక మార్పులకు, సంస్కరణలకు జ్యోతిరావు ఫూలే ఆధ్యునిగా నిలుస్తారని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని ఏయూలోని ఆయన విగ్రహానికి వీసీ ప్రసాద రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ మహిళా విద్యకు ఫూలే చేసిన కృషి నిరుపమానమన్నారు. ఫూలే స్ఫూర్తిగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి అట్డడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్నారన్నారు. బీసీల అభ్యున్నతికి,వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఆటా అద్యక్షులు ఆచార్య జాలాది రవి, ఏయూఇయూ అద్యక్షుడు డా జి.రవికుమార్, మత్స్యకార సంఘం అద్యక్షుడు మల్లేటి రాంబాబు, డీన్ ఎన్.సత్యనారాయణ, రాష్ట్ర బిసి సంఘం కార్యదర్శి పితాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలోని వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతీరావు పూలే అని బీసీ విభాగం విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు కంట్రెడ్డి రామన్న పాత్రుడు కొనియాడారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా ఆంథోని నగర్ వద్ద వున్న జ్యోతీరావ్ ఫూలే విగ్రహానికి విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు మళ్ళ విజయప్రసాద్, తదితరులతో పూలమాలలు వేసిఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాత్రుడు మాట్లాడుతూ, సమాజంలో ఉన్న దురాచారాలకు , కుల వివక్షకు వ్యతిరేకంగా 150 ఏళ్ల క్రితమే ప్రజలను చైతన్యవంతులను చేసారని చెప్పారు. ఫూలే ఆశయ సాధనకు ప్రతీఒక్కరు నడుంబిగించి ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో తైనాల విజయకుమార్ పార్టీ నాయకులు రవిరెడ్డి , పక్కి దివాకర్, బెహరా భాస్కరరావు,కోలా గురువులు,యతిరాజుల నాగేశ్వరరావు, అల్లంపల్లి రాజబాబు , పేర్లు విజయ్చందర్ విల్లూరి భాస్కర్రావు , పిల్లి సుజాత, బుగత నర్సింగరావు, బోని శివరామకృష్ణ , సాగరిక తదితరులు పాల్గొన్నారు.
బడుగు, బలహీనవర్గాల వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించిన ఆశా జ్యోతి, వారి హక్కులు, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు మహాజ్యోతీరావు ఫూలే అని ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు అన్నారు. శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే 130 వ వర్థంతి సందర్భంగా ఏపిఈడిసిఎల్ కార్యాలయ ఆవరణలోని ఫూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా పోలాకీ మాట్లాడుతూ, జోతిబా పూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు పూలే ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త అని కొనియాడారు. ఆయన కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకు గురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు వారి హక్కుల కోసం పోరాడిన మహా నేత అని అన్నారు. అలాంటి వ్యక్తిని ప్రతీఏటా ఖచ్చితంగా మననం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కీర్తించారు. ఆయన చూపిన బాటలో మనమంతా నడచినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందని పోలాకి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం 18వ ఉపకులపతిగా ఇటివల బాధ్యతలు స్వీకరించిన ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి ని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకలపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఆంధ్ర ఆదికవి విశ్వవిద్యాలయాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను, అభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించారు. రాష్ట్రాంలోని ఉన్నత విద్య అభివృద్ధికి కలిసి పని చేద్దామని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వీసీ మొక్కా జగన్నాథరావు అందజేసారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కీలకమైన వీసీ, రెక్టార్, రిజిష్ట్రార్ పదవులను చేపట్టిన తొలి వ్యక్తిగా, విద్యావేత్తగా, ఉత్తమ పరిశోధకులుగా ప్రసాదరెడ్డి ఉన్నారని అన్నారు. విశ్వవిద్యాలయ క్రమశిక్షణకు, విద్యార్థుల సంక్షేమానికి, నూతన ఆవిష్కరణలకు ప్రసాదరెడ్డి ప్రాధన్యతనిస్తున్నారని తెలిపారు. శతజయంతిలోనికి అడుగుపెడుతున్న ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళాలని ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నూతన పాలనలో ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ఉన్నత విద్యాభివృద్దికి కృషి చేస్తామని తెలియజేసారు.