గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. మంగళ వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు డివిజనల్ స్థాయి శిక్షణా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అత్యంత ప్రాముఖ్యత నిస్తున్నదన్నారు. అన్ని రకాల సేవలను గ్రామ స్థాయిలోనే పొందే సౌలభ్యాన్ని కలిగించడం జరిగిందన్నారు. ప్రతీ ఒక్కరు వారి విధులను అంకిత భావంతో నిర్వర్తించాలన్నారు. ప్రజలకు సేవలను అందించే మంచి అవకాశం సచివాలయ ఉద్యోగులకు లభిస్తున్నదన్నారు. తమ విధులు, బాధ్యతలను సచివాలయ ఉద్యోగులు పూర్తిగా తెలుసు కోవాలన్నారు.
ప్రజలకు సకాలంలో సక్రమంగా సేవలను అందించాలని తెలిపారు. ప్రవర్తనా నియమావళిని తప్పని సరిగా పాటించాలని, అతిక్రమించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామ, వార్డు సచివాలయాల సంయుక్త కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారు హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన సచివాలయాల సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకొనడం జరిగిందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంయుక్త సంచాలకులు మొగిలిచెండు సురేశ్ సచివాలయ ఉద్యోగుల నియమావళి, సీసీఏ నియమావళి పెనాల్టీ, కార్యాలయ నడవడిక/సమాచార ప్రసార నడవడిక తదితర విషయాలపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ ఉద్యోగులలో ప్రవర్తన, పనితీరు అత్యంత కీలకమైన అంశాలని తెలిపారు. "వ్యక్తిత్వము, విశ్వసనీయత ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా కలిగి వుండవలసిన రెండు ప్రధాన లక్షణాలు" అనే ముఖ్యమంత్రి ఆశయాలను నెరవేర్చాలన్నారు. "విధి నిర్వహణకు మించిన దేశ సేవ లేదు"
అన్న మహాత్మా గాంధీ సూక్తితో ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలన్నారు. ప్రతి ఉద్యోగి సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయని ప్రజల ముంగిటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మన ప్రభుత్వం స్థాపించడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. గ్రామంలో 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి, వేకువ ఝామునే, సూర్య కిరణాలు పింఛనదారుల ఇంటి తలుపులను తాకకముందే, పింఛన్లు వారి గడప వద్దనే అందజేసే బృహత్తర లక్ష్యాన్ని సాధించడంలో మన ప్రభుత్వం సరికొత్త చరిత్రను సృష్టించిందన్నారు. ప్రజలతో మమేకమై, మృదు మధుర భాషణతో ప్రజలకు సత్వరమే సేవలందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి రమా ప్రసాద్, జిల్లా పరిషత్ డిప్యూటీ సి ఈ ఓ లక్ష్మీ పతి, ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.
జివిఎంసీ పరిధిలోని స్మార్ట్ సిటీ అభివ్రుద్ధి పనులను వేగంగా, నాణ్యతగా పూర్తిచేయాలని కమిషనర్ డా. జి. సృజన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్మార్ట్ సిటీ పధకం క్రింద నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఎం.వి.పి. కోలనీలోగల ఏ.ఎస్. రాజా గ్రౌండ్ నందు నిర్మాణ దశలో వున్న ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించారు. పనులు మందకొడిగా కోనసాగుతున్నాయని తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. పూర్తిగా పనులపై శ్రద్ధ వహించి త్వరితగతిన స్టేడియం పనులు పూర్తి చేయాలని లేక పొతే తగుచర్యలు గైకొంటామని సంబందిత కాంట్రాక్టరును హెచ్చరించారు. మరో పది రోజులలో వచ్చి తనిఖీ చేస్తామని అప్పటికీ పనులు సంతృప్తిగా ఉండాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు.
రామకృష్ణ మిషన్ రోడ్డు ఆధునీకరణ పనులను పరిశీలించి, సంబందిత కాంట్రాక్టరుతో మాట్లాడుతూ ఎక్కువమంది పనివారిని, వస్తు సామగ్రిని ఏర్పాటు చేసుకొని నిర్ణీత గడువులోగా రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. లేకపొతే తగు చర్యలు చేపడతామని హెచ్చరించారు. తదుపరి బీచ్ రోడ్డులో ఉన్న వారసత్వ భవనాలు, టౌన్ హాలు, పాత మున్సిపల్ భవనాన్ని పరిశీలించి డిశంబరు నెలలోగా పనులు పూర్తిచేయాలని సంబందిత కాంట్రాక్టరును ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీరు వినయ కుమార్, కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్, స్మార్ట్ సిటీ కన్సల్టన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ప్రైవేటు వైద్యంపై నమ్మకం కలిగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రనాయక్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.అండ్.హెచ్.ఓ. చంద్ర నాయక్ మాట్లాడుతూ, ప్రైవేటు వైద్య శాలలు, క్లినిక్ లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిబంధనలను విధిగా పాటించాలని తెలిపారు. ఆసుపత్రులలో ఏ యే వైద్యం చేస్తున్నారు, వాటి ఖర్చుల వివరాలను బోర్డుపై డిస్ప్లే చేయాలన్నారు. ఆసుపత్రులలో చేస్తున్న వినిధ వైద్య పరీక్షలకు ఎంత ఖరీదు అవుతున్న విషయం ప్రజలకు తెలియ చేయాలన్నారు. ప్రజలకు వైద్యసేవలను సక్రమంగా అందించాలని, అదే విధంగా వారిని సక్రమంగా రిసీవ్ చేసుకోవాలని తెలిపారు. కరోనా సమయంలో ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులంతా సంయుక్తంగా పని చేసారని, కరోనా వ్యాప్తి నిరోధానికి చేసిన సేవలను ప్రశంసించారు.
ముఖ్యంగా జిల్లాలో కరోనా మరణాల సంఖ్య తగ్గించడం జరిగిందని, ఇకపై సెకెండ్ వేవ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సామాజిక దూరం, మాస్కులను వుపయోగించడం తప్పని సరి అని అన్నారు. సానిటైజర్లను తప్పని సరిగా వుపయోగించాలని, ఇంట్లో మాత్రం సబ్బును వుపయోగించాలని చెప్పారు. కరోనా సమయంలో సానిటైజేషన్, వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా ఇప్పటి వరకు సీజనల్ వ్యాధులు ప్రబల లేదన్నారు. త్వరలోనే కరోనా వేక్సిన్ వస్తుందని, మొదటి విడతలో కరోనా వారియర్స్ కు, రెండవ విడతలో వృ ధ్ధులు, పది సంవత్సరాల లోపు వయస్సు కల పిల్లలకు, వేయడం జరుగుతుందన్నారు.
మూడవ విడతలో అందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు. కరోనా వంటి ఖరీదైన వైద్యంపై ప్రజలకు వివరంగా తెలియ చేయాలన్నారు. మందుల ఖరీదు వివరాలను ఖచ్చితంగా తెలియచేసి, నర్సింగ్ హోమ్ లపై విమర్శలకు తావు లేకుండా పని చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్లు , కొత్త నర్సింగ్ హోమ్ లకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పని సరి అని, పాత ఆసుపత్రులను కూడా ఆన్ లైన్ చేసుకోవాలని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలలో పరిశుభ్రత పాటించాలన్నారు. ఆసుపత్రులను తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఐ.ఎం.ఎ. నిబంధనలు పాటిస్తూ, వైద్యానికి వచ్చిన రోగులకు మంచి సేవలందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి.జగన్నాధం, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు డా. కె.అమ్మన్నాయుడు, డా.సి.హెచ్.కృష్ణ మోహన్, డా.భీమారావు, డా.ఎస్.సంతోష్, మెట్ట మధు, డా. జి.వరహాల నాయుడు, కిమ్స్, జెమ్స్, తదితర ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలోని మడకశిరలో 26 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు టూరిజం అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మడకశిర ట్యాంక్ బండ్ అభివృద్ధి, ట్యాంక్ ఎదురుగా ఉన్న ప్రదేశంలో టూరిజం హోటల్, రిక్రియేషన్ జోన్ ఏర్పాటుపై కలెక్టర్ టూరిజం అధికారులతో చర్చించారు. మడకశిర ట్యాంక్ ఎదురుగా ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేయనున్న టూరిజం హోటల్ తో పాటు రిక్రియేషన్ జోన్ లో భాగంగా షాపులు, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆటస్థలం ,బాంకెట్ హాల్, స్పోర్ట్స్, అడ్వెంచర్స్ ,సైన్స్ మ్యూజియం యాంఫిథియేటర్ ,పార్కింగ్ ,టాయిలెట్స్ లతో పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
అలాగే ట్యాంక్ బండ్ అభివృద్ధి చేయడంలో భాగంగా ఫుడ్ కోర్టులు, ఫౌంటైన్, బోటింగ్ సౌకర్యం, మైజ్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, శిల్పాలు, ట్యాంక్ బండ్ కు పర్యాటకులు వెళ్లేందుకు పాత్ వే లతో కూడిన పనులు చేపట్టేలా ప్రతిపాదనలలో చేర్చాలన్నారు. 26 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ పర్యాటక అభివృద్ధి పనులకు సంబంధించి ఎస్టిమేట్లతోపాటు,సంపూర్ణంగా ప్రణాళికలు రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ టూరిజం అధికారులను ఆదేశించారు. వారి నుండి ప్రతిపాదనలు అందిన వెంటనే ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజినల్ డైరెక్టర్ ఈశ్వరయ్య, జిల్లా టూరిజం అధికారి దీపక్ పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమి రోజున భక్తులకు ఉచిత దర్శనం సమయంలో టికెట్లు అమ్మడం సముచితం కాదని వారించిన పూజారి పై ఆలయ చైర్మన్ కొరడాతో దాడి చేయడం అమానుషమని పలు బ్రాహ్మణ సంఘాల నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘాలు సభ్యులు స్థానిక ఒంగోలు బస్టాండ్ వద్ద గల పాండురంగ స్వామి దేవస్థానం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లాలో బండి ఆత్మకూరు ఓం కార క్షేత్రం లో ఈ సంఘటన జరిగిందని తక్షణం ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పై క్రిమినల్ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు వినతిపత్రాన్ని అందచేసారు.ఈ సందర్భంగా ఆదిశైవ సంఘం అధ్యక్షుడు శేషగిరిరావు మాట్లాడుతూ ఆలయం బాగోగులు చూడాల్సిన చైర్మన్ దైవ సన్నిధిలో పూజారిని కొట్టడం హేయమని విచారం వ్యక్తం చేసారు.అర్చక పురోహిత సంఘం రాష్ట్ర నాయకుడు గుండాపంతుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, దేవుడికి భక్తులకు అనుసంధానంగా పూజలు నిర్వహించే అర్చకులపైనే ఇలా భౌతిక దాడులు చేయడం తీవ్రమైన ఘటనగా దేవాదాయశాఖ పరిగణించి గట్టి చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల పెద్దలు మూర్తి స్వామి, ప్రసాద్, రాజేంద్ర, మల్లికార్జున్ శర్మ,భాస్కర శర్మ ,తెలికేపల్లి శేషయ్య, కిట్టు స్వామి, అయ్యప్ప గుడి అర్చకులు నాగమల్లేశ్వరరావు ,విశ్వబ్రాహ్మణ అర్చక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ఉన్నత ర్యాంకును సాధించేందుకు మరింతగా అధికారులు, సిబ్బంది క్రుషి చేయాలని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన అన్నారు. మంగళవారం స్వచ్ఛ సర్వేక్షణ్ లో సంబందిత అధికారులు తీసుకుంటున్న చర్యలను కమిషనర్ వి.ఎం.ఆర్.డి.ఎ చిల్డ్రన్ ఎరేనా థియేటర్ లో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆమె, మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ సూచికలకు అనుగుణంగా వివిధ జోనల్ స్థాయిలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయో మదించి రేపటిలోగా జోనల్ వారీగా నివేదిక ఇవ్వాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. జాతీయ స్థాయి అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ డాక్యుమెంటేషన్ లో ప్రతిపాదించిన విధంగా క్షేత్ర స్థాయిలో డిశంబర్, జనవరి నెలల్లో ఆకస్మికంగా ప్రత్యక్ష పరిశీలనా చేపడతారని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఓ.డి.ఎఫ్. పరిశీలనకు గాని, డబ్ల్యూ పరిశీలనకు గాని, స్వచ్ఛ సర్వేక్షణ్ పరిశీలనకు గాని, విడివిడిగా బృందాలు వచ్చి ప్రత్యక్ష పరిశీలన చేపడతాయన్నారు.
స్వచ్ఛత యాప్ వినియోగంపై, వాటిలో అడిగిన అడిగే 7 ప్రశ్నలకుగాను జవాబులు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు మరియు వార్డు శానిటరీ కార్యదర్సులకు సూచించారు. చెత్తను ఎక్కువగా వేసే ప్రాంతాలపై(జి.వి.పి.) దృష్టి సారించాలని వాటిని ప్రత్యేక ఆకర్షణ కలిగిన ప్రాంతాలుగా తీర్చిదిద్ది, చెత్తను పారవేయకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ప్రజా మరియు సామాజిక మరుగుదోడ్డ్ల మరమ్మత్తులను త్వరితగతిన చేపట్టాలని, కాలువలలో చెత్తను నిలువరించే స్కాన్నర్ గ్రిల్స్ లను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఎం.ఎస్.ఎఫ్. నందు మరియు ఎస్.టి.పి.ల వద్ద నిర్వహించే పనులకు లాగ్ బుక్కులు తయారు చేయించి తనిఖీలకు సిద్ధంగా ఉంచాలని కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్)ను ఆదేశించారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేసిన వారి పైన, కాలువలో చెత్త వేసే ప్రజలుపైన, వ్యాపారస్తులపైన తగు చర్యలు తీసుకొని వారి నుండి అపరాధ రుసుములు వసూలు చేయాలని ఆదేశించారు.
నిషేదిత ప్లాస్టిక్ సామగ్రిని అమ్మే వర్తకులపైన, ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాదారుల వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు. వార్డులలో ఇంటి వద్ద నుండి నేరుగా చెత్తను సేకరణ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ వాహనాలను ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో మాత్రమే ఆరుబయటగల డస్ట్ బిన్ లు తొలగించాలని ఏ.ఎం.ఓ.హెచ్. లను, శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. ఈ విధుల నిర్వహణలో అంతరాయం ఏర్పడ కుండా వార్డు స్థాయిలో కొంతమంది పారిశుద్ధ్య సిబ్బందిని, మినీ వాహనాన్ని రిజర్వ్ లో ఉంచాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021పై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అందరికీ అవగాహన కల్పించారు. నీటి సరఫరా విభాగపు పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ డబ్ల్యూ మార్కులు పూర్తిగా సాధించడానికి గాను, అందులోని అంశాలైన యు.జి.డి. కనక్షనులను ఏర్పాటు, సెప్టింకు ట్యాంకు క్లీనింగ్ విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
సంబందిత జోనల్ కమిషనర్లు వారి యొక్క జోనల్ స్థాయిలో చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పనులపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల రావు అందరు జోనల్ కమిషనర్లు, మెకానికల్ మరియ వాటర్ సప్ప్లై ఇంజినీరింగ్ అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అభం శుభం తెలియని ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోసం రూ.2.25 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేసామని, ఈ నిధి నుండి చిన్నారులకు అవసరమైన న్యూట్రీషన్ ఫుడ్ ను ఈ నెల నుండే అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక జిల్లా రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 230 మంది ఎయిడ్స్ బాధిత చిన్నారులు ఉన్నారని, ఎయిడ్స్ అంటే ఏమిటో కూడా తెలియని అభం శుభం చిన్నారులు వారని అన్నారు. అటువంటి చిన్నారులను ఆదుకునేందుకు రూ.2.25 కోట్లతో కార్పస్ ఫండ్ ను ఏర్పాటుచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చెప్పారు.
ఈ నిధి నుండి చిన్నారులకు అవసరమైన న్యూట్రీషన్ ఫుడ్ ను ఈ నెల నుండే అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎయిడ్స్ బాధిత చిన్నారులను పాఠశాలల్లో చేర్చకపోవడంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, రెడ్ క్రాస్ మరియు సి.వి.నాగజ్యోతి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున ఒక గదిని కేటాయించి అటువంటి చిన్నారులకు ఉచిత విద్యాబోధన ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇవేకాక ఎయిడ్స్ బాధిత చిన్నారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేస్తామని, ఎట్టి పరిస్థితిల్లో వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నివిధాల ఆదుకుంటామని వివరించారు. ఈ సమావేశం అనంతరం 17 రకాల న్యూట్రీషన్ కిట్ ను 20 మంది ఎయిడ్స్ బాధిత చిన్నారులకు కలెక్టర్ అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లీల, పి.శ్రీకాంత్, నిక్కు అప్పన్న, పెంకి చైతన్యకుమార్, నటుకుల మోహన్, శ్రీధర్, సంతోశ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హెచ్.ఐ.వి రోగులకు నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు వైరల్ లోడ్ మెషీన్ ను మంగళవారం రిమ్స్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రారంభించారు. ఈ మెషిన్ సామర్ధ్యం 8 గంటలలో సుమారు 93 మంది యొక్క వైరస్ నిర్దారణ ఫలితాలు వస్తాయని ఆసుపత్రి సిబ్బంది జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా 80మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ ప్యాకెట్లను ఆఫ్ హోల్డ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఫిలిప్ తిమోతి ఆధ్వర్యంలో కలెక్టర్ అందించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ చైర్మన్ తిమోతికి కలెక్టర్ దుస్సాలువతో సత్కరించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రధమ బహుమతి క్రింద ఎల్ నిశాంత్ , శ్రీనివాస్ లకు రూ.3500/-లు, ద్వితీయ బహుమతి క్రింద సిహెచ్ యతీరాజ్, భార్గవ్ రావు లకు రూ.2500/-లు, తృతీయ బహుమతిగా గాంధీవర్మ, హరిశంఖర్ లకు రూ. 2000/-నగదుతో పాటు సర్టిఫికేట్లను కలెక్టర్ అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రనాయక్, డా. బగాది జగన్నాధం, డి.ఎల్.ఓ డాక్టర్ కె.లీల , డి.పి.ఎం ఉమామహేశ్వర రావు, డి.ఎన్.ఎం డాక్టర్ ప్రవీణ్, స్వచ్ఛంద సేవకులు మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని 35వ వార్డు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో మంగళవారం వైయస్సార్ క్రికెట్ కప్ పై విల్లూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ బ్రోచర్లు విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన ఆమట్లాడుతూ, డా వైఎస్సార్ పేరుతో క్రికెట్ కప్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, అందులో యువ క్రికెటర్లకు పోటీ ఏర్పాటు చేయడం ద్వారా వారిలోని క్రీడా సామర్ధ్యాన్ని వెలికి తీసినట్టు అవుతుందని అన్నారు. విశాఖలోని అన్ని ప్రాంతాల నుంచి ఎన్నో జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని, దానికోసం అన్ని వర్గాల వారు ఈ వైఎస్సార్ క్రికెట్ కప్ ప్రచారం విరివిగా చేపడుతున్నారని అన్నారు. అంతకుముందు ఆటవిడుపుగా బౌలింగ్, బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రోలర్ స్కేటింగ్ రాష్ట్ర అధ్యక్షుడు శీలం లక్ష్మణ్, ఫుట్బాల్ కోచ్ బాబు, బుజ్జి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా పాడి రైతులకు మరింత లాభం చేకూర్చేందుకు అమూల్ సంస్థ తో కుదుర్చుకున్న అవగాహ న ఒప్పందం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డిశం బర్ 2 న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్. జగన్ మెహన్ రెడ్డి విజయవాడ నుంచి వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా మధ్యాహ్నం 1 గంట కు చిత్తూరు, ప్రకాశం , వైఎ స్సార్ కడప జిల్లాలలో లాంఛనంగా పాల కొనుగో లును ప్రారంభిస్తారని ,ఈ కా ర్యక్రమానికి సంబందించి చి త్తూరు జిల్లాలో అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భ రత్ గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు జిల్లా కు సంబం దించి మదనపల్లి మండలం, వేంపల్లి వేదికగా కార్యక్రమం లాంఛనం గా ప్రారంభమవు తుందని, వేంపల్లి తో పాటు సి .టి.ఎం, కొండామార్రి పల్లి, వలసపల్లి, పెంచు పాడు, అంకిశెట్టి పల్లి, చిప్పిలి ప్రాంతాలలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమాన్ని పాడి రైతులందరూ వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, లాంఛనంగా వేంపల్లి లో ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజా ప్రతి నిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు.
జిల్లాలో పశ్చిమాన మం డలాలలో పాల దిగుబడి అధికంగా ఉన్న కారణంగా మదనపల్లి, రామసముద్రం మండలాలలో మొత్తం 32 రైతు భరోసా కేంద్రాల పరి ధిలో (మదనపల్లి -18, రామసముద్రం -14 రైతు భరోసా కేంద్రాలు), వంద గ్రామాలను ఈ కార్యక్రమం లో ఎంపిక చేయడం జరి గిందని,ఎంపిక చేసిన గ్రా మాలలో వై ఎస్సార్ చేయూ త, వైఎస్సార్ ఆసరా పధకా ల కింద 10,800 పశువులు (పాడి పశువులు, చూడి పశువులు ) అందజేయ డమే లక్ష్యం కాగా.. 1035 మంది ని ఈ రెండు మండ లాలలో అర్హులుగా గుర్తించ డమైనదని ,డిశంబర్ 2 న వేంపల్లి వేదికగా 168 మంది కి పాడి పశువులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో మెరుగైన ఇసుక విధానం అమలుకు జగన్ ప్రభుత్వం త్వరలో సిద్ధం కానుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల రెండవరోజున హాజరయ్యేందుకు ఆయన విజయవాడకు వెళ్లే హడావిడిలో సైతం మంగళవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత బందరు బృందావనపుర తాపీ పనివారల సంఘం నాయకులు మంత్రి పేర్ని నానిను కల్సి గత ఆదివారం ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించారు. భవన నిర్మాణ రంగంలో ఇసుక ఎంతో కీలకమని, కొందరు ఇసుకను అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని కొందరు ప్రైవేట్ వ్యాపారులు 18 టన్నుల లారీ ఇసుకను మచిలీపట్నంలో కొందరు 23 వేల రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు. దీంతో ఇసుకను కొనలేక పలువురు యజమానులు నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేస్తున్నారని దాంతో తాము పలు ఆర్ధిక ఇబ్బందులకు లోనవుతున్నట్లు మంత్రి వద్ద మొర పెట్టుకొన్నారు. అలాగే లంకపల్లి ఇసుక రీచ్ ఆన్లైన్ లో నమోదు చేసుకుందామంటే ఓపెన్ కావడం లేదని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
ఈ విషయాలపై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఎవరైతే ఇసుకను అధిక ధరలకు అక్రమంగా విక్రయిస్తున్నారో వారి సమాచారం తనకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పనులకు టన్ను ఇసుక 800 రూపాయల ధరకు అమ్మేలా వారిపై నిబంధన విధిస్తామని ఆయన అన్నారు. ఇసుక ధరలకు కళ్లెం వేయాలని ఇటీవల సీఎం వైయస్.జగన్ నిర్ణయం తీసుకొన్నారని చెబుతూ, ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం రూపొందించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. ఇకపై జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలని ఇటీవల కలెక్టర్లకు, గనులశాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇసుకను ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మితే.. వారిని వెంటనే జైలుకు పంపేలా చట్టం రూపుదిద్దుకోనుందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని వివరణకు బృందావపుర తాపీపనివార సంఘ నాయకులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇసుక లబ్యమైతే తమకు పనులు పుంజుకుంటాయని దాంతో తమ ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన వారిలో సంఘ అధ్యక్షులు వేమూరి గంగయ్య, కార్యదర్శి రమణ, సి ఐ టి యు రూరల్ సెక్రటరీ జయరావు కె. వి. గోపాలరావు, అందే శ్రీనివాసరావు, రాగం ధర్మరాజు, బి. వీరబాబు, బి. వాసు తదితరులు ఉన్నారు.
విశాఖ ఉక్కు 25 కిలోవాట్ల సామర్ధ్యం గల సౌర విద్యుత్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ యొక్క న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఆర్ఇడిసిఎపి) ద్వారా ఏర్పాటు చేస్తోందని స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ కిశోర్ చంద్రదాస్ అన్నారు. ఈమేరకు దీనిని విశాఖ విమల విద్యాలయ స్కూల్ బిసి రోడ్ వద్ద ఏర్పాటు చేస్తుమని ఆయన వివరించారు. దీనికోసం సిఈఆర్ బడ్జెట్ కింద రూ.11.97 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉక్కునగరంలో పాఠశాలల మధ్య సహకారం పెంచుకుంటూ అభివ్రుద్ధి చేసుకోవాలన్నారు. అదే సమయంలో విద్యార్ధులకు మంచి విద్యతోపాటు, క్రమశిక్షణలో తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఉత్తమ పద్దతులను అనుసరిస్తూ విద్యార్దులకు విద్యాబోధన కూడా చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎపిఎస్ఎస్ఎ, ఎపి ప్రభుత్వం, ఎఫ్కె లక్రా, సిజిఎం (టౌన్ అడ్మిన్), ఆర్‌ఐఎన్ఎల్, కె. , RINL & ఛైర్మన్-ఎల్ఎంసి వివివి స్కూల్, ఇతర సీనియర్ అధికారులు, డిఎవి పాఠశాల ఉక్కునగరం & వివివి పాఠశాల, ఉక్కునగరం యొక్క సిబ్బంది మరియు ప్రిన్సిపల్స్ ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ బిల్లులు తక్షణం సమర్పించాలని జిల్లా కలెక్ట్ జె నివాస్ కోరారు. జిల్లాలో కోవిడ్ నివారణా చర్యలలో భాగంగా పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అందులో భాగంగా వివిధ శాఖల ద్వారా వివిధ పనులను నిర్వహించామని అన్నారు. నవంబరు 30 నాటికి పెండింగులో ఉన్న కోవిడ్ సంబంధిత బిల్లులను సంబంధిత శాఖ అధికారి ద్వారా జిల్లా రెవిన్యూ అధికారికి వారం రోజుల్లోగా సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా సమర్పించని బిల్లులను పరిగణనలోకి తీసుకోవడం జరగదని ఆయన స్పష్టం చేసారు. సంబంధిత శాఖల అధికారులు పెండింగు బిల్లుల సమర్పణలో తగు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో ఆయాశాఖ సిబ్బంది బిల్లులను ఏవో కారణాలు చూపి తొక్కిపెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమర్పించిన అన్ని బిల్లులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు..
శ్రీకాకుళం జిల్లాలో గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీకి కార్యాచరణపై మంగళవారం సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా లక్ష్యాలను నిర్ణయించాలని ఆయన ఆదేశించారు. వై.యస్.ఆర్ చేయూత పథకం క్రింద ప్రయోజనం పొందిన లబ్ధిదారుల వివరాలు పరిశీలించాలని పేర్కొన్నారు. గొర్రెలు, మేకలు కొనుగోళుకు అవసరమగు మార్కెట్లను పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
ఆసరా, సంక్షేమ విభాగం జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ వై. యస్. ఆర్ చేయూత పథకం క్రింద గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. చేయూత క్రింద అందిన మొత్తం బ్యాంకు ఖాతాలలో ఉండాలని అటువంటి లబ్దదారులను పరిగణనలోకి తోసుకోవాలని సూచించారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 1000 యూనిట్లు లక్ష్యం కాగా 5296 మంది దరఖాస్తు చేశారని చెప్పారు. జిల్లాలో 10 మండలాల్లో మేకలు, గొర్రెలు అధికంగా పెంచుతున్నారని, అటువంటి ఆసక్తి ఉన్నవారికి యూనిట్లు మంజూరు వలన ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జెడి ఏ.ఈశ్వర రావు, డి ఆర్ డి ఏ పిడి బి.శాంతి, డిసిఓ కె.మురళి కృష్ణ మూర్తి, ఎల్డిఎం జి విబిడి హరి ప్రసాద్, ఎపిడిలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర విశ్వదవిద్యాలయం ఉపకులపతిగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగాలు మంగళవారం పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కార్యాలయంలో ఏయూ పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య జి.సుబ్రహ్మణ్యం, డిసిపి సురేష్ బాబులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ఆచార్యులు, కళాశాలల యాజమాన్యాలు, ఉద్యోగులు వీసీ ప్రసాద రెడ్డికి అభినందనలు తెలిపారు. ఒక పరిశోధకుడిగా, రెక్టార్ గా, ఆ తరువాత ఇన్చార్జి విసిగా, ఇపుడు పూర్తిస్థాయి వీసిగా ఒకే వ్యక్తికి అరుదైన అవకాశం రావడం ఆంధ్రాయూనివర్శిటీలో అరుదైన అంశంగా చరిత్రకెక్కిందని కొనియాడారు. ప్రసాదరెడ్డి హయాంలో యూనివర్శిటీ మరింత అభివ్రుద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.