కర్నూలు జిల్లాలోని తుంగభద్ర పుష్కరాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉదయం జిల్లాకలెక్టర్ వీరపాండియన్, నగరపాలక సంస్థ కమిషనర్ డికెబాలజీ దంపతులు పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి వేదపండితుల ఆశీర్వచనాలు పొందారు. సంకల్ బాగ్ ఘాట్ వద్ద మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో దేవాదాయ శాఖ వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆది పుష్కరాల ముగింపు హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధికారుల దంపుతులు పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని ముఖ్య అధికారుల రాక సందర్భంగా, పుష్కరాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈకార్యక్రమంలో ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, పలువురు జిల్లా అధికారులు, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
కర్నూలు నగరంలో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం వాకీటాకీలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ నిధులు రూ.7.50 లక్షలతో కొన్న 30 పోలీస్ కంట్రోల్ వైర్లెస్ సెట్స్ ను తుంగభద్ర పుష్కరాల ముగింపు రోజున సంకల్ బాగ్ ఘాట్ వద్ద కలెక్టర్ పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నిర్వహణకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ డికే బాలజీ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వీటిని పోలీసులకు అందజేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పి మహబూబ్ బాషా మొదటి సెట్ ను అందుకోగా, ఇతర సెట్లను సిబ్బంది స్వీకరించారు. ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎయిడ్స్ నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. విస్తృతమైన అవగాహన కల్పించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా వర్చువల్ విధానంలో మంగళవారం నిర్వహించారు.* హెచ్ఐవి సోకినవారిపట్ల సంఘీభావం తెలుపుదాం, భాగస్వామ్యంతో బాధ్యత వహిద్దాం* అన్న నినాదంతో ఈ ఏడాది ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలకు నగదు బహుమతిని, ప్రశంసా పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. మొదటి బహుమతిని ఆర్.సాయికుమార్, ద్వితీయ బహుమతిని జె.ప్రశాంత్, తృతీయ బహుమతిని టి.చంద్రశేఖర్ గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చికిత్స కంటే నివారణే ఎయిడ్స్‌కు ఏకైక మార్గమన్నారు. ఈ ఈ వ్యాధిని తరిమికొట్టడానికి ప్రతీఒక్కరిలో సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని కాపాడటం, కొత్తవారు ఈ వ్యాధి బారిన పడకుండా చూడటం మన లక్ష్యం కావాలని సూచించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచేందుకు తగిన అవగాహన పెంపొందించి, వారు పౌష్టికాహారాన్న, అవసరమైన మందులను తీసుకొనేలా చూడాలన్నారు. అలాగే ఆరోగ్యపరమైన అలవాట్లను ప్రతీఒక్కరికీ అలవాటు చేయడం ద్వారా పలు రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడవచ్చని సూచించారు. జిల్లాలో ఎయిడ్స్ నివారణలో ప్రభుత్వ శాఖలతోపాటు, స్వచ్ఛంద సంస్థలు కూడా మెరుగైన పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే సహకారాన్ని కొనసాగించాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి మరియు ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ జె.రవికుమార్, జిల్లా అదనపు డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎల్.రామ్మోహనరావు, పాజిటివ్ నెట్‌వర్కు ప్రతినిధి పద్మావతి, వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ఎన్‌వైకె కో-ఆర్డినేటర్ విక్రమాధిత్య, ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్, రెడ్‌రిబ్బన్ క్లబ్ వాలంటీర్లు, ఎన్‌జిఓ ప్రతినిధులు, ఏఆర్‌టి కౌన్సిలర్లు, ఎయిడ్స్ కంట్రోల్ సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బ్రేక్ దర్శనంలో డ్రమ్స్ ప్లేయర్ శివమణి, ప్రముఖ సినీ దర్శకుడు బాబీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్,కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్,గంటా శ్రీనివాస రావులు దర్శించుకున్నారు. ఎమ్మేల్యేకు మాత్రం స్వామివారి శేష వస్త్రాలను దేవస్థానం అధికారులు అందజేశారు. తిరుమలకి డ్రమ్స్ ప్లేయర్ శివమణి, సినీదర్శకులు బాబి రావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా వుందని, దేశంలో కరోరానా తగ్గి జనజీవితం మళ్లీ సాధారణంగా మారాలని కోరుకున్నట్టు వారు తెలియజేశారు.
చెత్త నుంచి విధ్యుత్ తయారు చేసే ప్రాజెక్టు పని 90శాతం పూర్తి అయ్యిందని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అన్నారు. సోమవారం కాపులుప్పాడ డంపింగు యార్డులో జిందాల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న చెత్త నుంచి విధ్యుత్ తయారు చేసే ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇంకా మెకానికల్, కరంటు వంటి చిన్న చిన్న పనులు ఉన్నాయని డిశంబరు నెలాఖరుకి పూర్తిస్థాయిలో పనులు పూర్తిచేయాలన్నారు. వీలుంటే జనవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు. చెత్త డంపు చేయడానికి, ర్యాంపు, రోడ్లు పూర్తీ స్థాయిలో పూర్తయ్యాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని వచ్చిన చెత్తను ఏ విధంగా క్రమబద్దీకరిస్తున్నామో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం వారు స్వయంగా చూస్తారని అన్నారు. గత సంవత్సరం లో పోల్చుకుంటే నుండే కొన్ని నూతన పద్దతుల ద్వారా చెత్తను క్రమబద్దీకరిస్తున్నామన్నారు. ఈ విధ్యుత్ ప్రాజెక్టు యొక్క కెపాసిటీ 1200 మెట్రిక్ టన్నులని, సుమారు 1000 మెట్రిక్ టన్నుల చెత్త మన జివిఎంసియే సమకూర్చుతుందని ఇంకా ప్రక్కన ఉన్న మున్సిపాలిటీలైన విజయ నగరం, శ్రీకాకుళం నుండి తెప్పించడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సామర్ధ్యంగల విధ్యుత్ ప్రాజెక్టును ముందుగానే మనం ప్లాన్ చేసుకున్నామన్నారు.
అనంతరం డంపింగు యార్డు వద్ద ఉన్న బయో మైనింగు ప్లాంటును పరిశీలించి సుమారు 25 నుండి 30 సంవత్సరములుగా ఇక్కడ చెత్త నిల్వ ఉన్నందున మొదటి దశగా 25 ఎకరాలలో ఉన్న చెత్తను బయో మైనింగు చేసి, చుట్టూ ప్రక్కల ఎటువంటి దుర్వాసన రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఇందులో ముఖ్యంగా పార్కులు వంటివి ఏర్పాటు జరుగుతున్నాయని తద్వారా ప్రజలకు మంచి వాతావరణం కల్పిస్తామన్నారు. భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, విశాఖపట్నం సందర్శిస్తున్న సందర్భంగా సాగర్ నగర్ లోని అయన నివాసముండే పరిసరప్రాంతాలలో పారిశుద్ధ్యం, రోడ్లు తదితర పనులను పరిశీలించారు. ఆ ప్రాంతంలోని పారిశుద్ధ్యం, ఫాగ్గింగు వంటి పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ వి. సన్యాసిరావును ఆదేశించారు. రోడ్లపై పాట్ హోల్సును పూడ్చాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనరు వి. సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు కె.వి.ఎన్.రవి, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, వెంకటేశ్వర రావు, జిందాల్ ప్రాజెక్టు బయో మైనింగు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో డిసెంబరు 07నుంచి వ్యర్థాలపై యుధ్దం పేరుతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ తెలిపారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని 2న ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల 7వ తేదీకి మార్చడం జరిగింది. తొలిరోజు 7వ తేదీన జిల్లా స్థాయిలో, 8న మండల స్థాయిలో, 9న గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. నాల్గవరోజు నుంచి 15వ రోజు వరకూ, రోజుకో ప్రభుత్వ శాఖచేత వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చివరిరోజు 21వ తేదీన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పారిశుధ్యం, త్రాగునీటి విషయాల్లో ప్రజా చైతన్యాన్ని కల్పించి, వారి దృక్ఫథాన్ని మార్చడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సంకల్పించింది. దీనిలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి, పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తారు. రక్షిత మంచినీటి ఆవశ్యకతను వివరిస్తారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతీఒక్కరూ భాగస్వాములై, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
జివిఎంసీ పరిధిలోని జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాధికారులు వార్డు సచివాలయాలను తరచుగా తనిఖీలు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆదేశించారు. సోమవారం తమ చాంబర్ నుంచి జోనల్ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్దేశానుసారం పలు సంక్షేమ కార్యక్రమాలు తెలిపే సూచికలను, పోస్టర్లను, జాబితాలను సంక్షేమ పధకాల వారీగా, ప్రజలకు అర్ధమయ్యే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. 572 సచివాలయాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి చెక్ లిస్టులను గురువారం నాటికి జోనల్ కమిషనర్లు దృవీకరణతో సమర్పించాలని సూచించారు. జివిఎంసి పరిధిలో గల సచివాలయాలు రేషనలైజేషన్ చేసి, గృహాల సముదాయాలను, ప్రజలను మ్యాపింగ్ చేసి బుదవారం నాటికి ప్రతిపాదనలు సమర్పించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
గ్రామ/వార్డు సచివాలయం, మున్సిపల్ పరిపాలనా శాఖ, స్పందన పోర్టల్ ద్వారా స్వీకరించిన ప్రజా సర్వీసు దరఖాస్తులను నిర్ణీత సమయం దాటిన తరువాత పరిష్కారాలు 57శాతంగా నమోదు అవుతున్నాయని, నిర్ణీత కాలవ్యవధిలో 43శాతం మాత్రమే నమోదు అవుతున్నాయి. స్వీకరించిన సర్వీసు దరఖాస్తులను నిర్ణీత సమయంలో ఇక ముందు పరిష్కరించక పొతే సంబందిత అధికారులు, సిబ్బందిపై పెనాల్టీపెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ విభాగం నందు నిర్ణీత వ్యవధి దాటిన 58 సర్వీసు దరఖాస్తులను, యు.జి.డి., నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య శాఖ, యు.సి.డి. వంటి పలు శాఖలలో పెండింగులో గల దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించి నివేదిక సమర్పించాలని అందరి విభాగాదిపతులను ఆదేశించారు.
ప్రభుత్వ అదేశాల ప్రకారం చేపడుతున్న గృహాల వారి సర్వేలో ఇంకా సుమారు నాలుగు వేల మంది వాలుంటీర్లు సర్వేలో పాల్గొనలేదని వెంటనే మొత్తం పది వేల వాలంటీర్లతో ఈ సర్వేను రెండు రోజులలో పూర్తి చేయించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఇదివరకే ఆదేశించినట్లు అన్ని జోనల్ లో గల వివిధ కోర్టులలో పెండింగులో ఉన్న వాజ్యం పూర్తి వివరాలను వెంటనే ప్రదాన కార్యాలయమునకు సమర్పించాలని, సమాచార హక్కు చట్టం కింద స్వీకరించిన దరఖాస్తులు నిర్ణీత వ్యవధిలో పరిష్కరించి, సమాచారాన్ని దరఖాస్తుదారునకు అందించాలని, లేకపోతే సిబ్బంది పై తగు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జివిఎంసి నందున్న అన్ని ఫైల్సులను ఇ-ఆఫీసు ద్వారా మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, రమణి, సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, సి.సి.పి.విద్యుల్లత, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, పి.డి. (యు.సి.డి) వై. శ్రీనివాస రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, ఏ.డి.హెచ్ దామోదర రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ తదితరులు తో పాటు జోనల్ కార్యాలయాల నుండి జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు, ఇతర జోనల్ స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీసు సంబంధిత ఫిర్యాదులు ఇకపై గ్రామసచివాలయాల్లోని మహిళా సంరక్షణా కార్యదర్శిలకు అందజేయాలని కడపజిల్లా ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి గ్రామసచివాలయంలోని ఫిర్యాదు చేసిన అర్జీ దారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఫిర్యాదుదారుల సమస్యలను నిర్ణీత సమయంలో విచారించి పరిష్కరిస్తామని ఎస్.పి భరోసా ఇచ్చారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు 'స్పందన' ఫిర్యాదులను వారి వారి వార్డు, గ్రామ సచివాలయంలోని మహిళా పోలీసు (గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి) ల కు అందచేయాలని, వారు ఫిర్యాదులను జిల్లా పోలీసు కార్యాలయానికి స్కాన్ చేసి పంపుతారని, వాటిని ఆయా పోలీస్ స్టేషన్ల ద్వారా సంబంధిత వార్డు, గ్రామ సచివాలయాలు పరిధిలోని పోలీసు అధికారులు విచారించి న్యాయం చేస్తారని జిల్లా ఎస్.పి తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 'కరోనా' వైరస్ తీవ్రత దృష్ట్యా వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఫిర్యాదు దారులకు మరింత చేరువయ్యేందుకు ఈ విధానం రూపొందించడం జరిగిందని ఎస్.పి వివరించారు..
విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో కనీసం రక్త పరీక్షలు కూడా చేయకపోతే ఇక్కడ ఆసుపత్రి ఎందుకి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాలిమర్స్ బాధితుల కోసం ఏర్పాటుచేసిన ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ ఆసుపత్రిలో కనీసం సుగర్, బీపీ పరీక్షలు కూడా చేయకపోవడం దారుణమన్నారు. ఇంత ఆసుపత్రి ఏర్పాటు చేసి కనీసం ల్యాబ్ టెక్నీషియన్ ను నియమించకపోవడాన్ని బట్టే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో అర్ధమవుతుందని ఆయన మీడియాతో చెప్పారు. హైపవర్ కమిటీ చేసిన సూచనలు తక్షణమే అమలు అయ్యే దిశగా ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన బాదితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దయచేసి హైపవర్ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేయొద్దని, ల్యాబ్ టెక్నీషియన్లను నియమించి ముందు రోగులకు రక్తపరీక్షలు చేయాలని సూచించారు..హైపర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగాప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన పై సత్వరం పరిష్కారం చూపించాలని సిబ్బందిని ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందనలో అడ్మిన్ ఎస్పీలు సుప్రజ, ఆరిఫుల్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్మిన్ ఎస్పీలు మాట్లాడుతూ, ఈరోజు స్పందనలో జిల్లా యస్.పి కార్యాలయానికి 35 ఫిర్యాదులు వచ్చాయన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని ప్రజలు నేరుగా వచ్చి కలిసి తమ యొక్క సమస్యల తెలియజేశారన్నారు. వారి యొక్క సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరిని కేసు విషయాలు అడిగి తెలుసుకొని సంబందిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్టు వివరించారు. అంతేకాకుండా ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకార విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు వారికి సమాచారం కూడా అందిస్తామన్నారు. ముఖ్య సమస్యలపై పోలీసు అధికారులను కూడా యస్.పి స్పందన కార్యక్రమానికి పిలిపించి ఇక్కడే స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్టు అడ్మిన్ ఎస్పీలు వివరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జివిఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంలో ప్రజల నుంచి నేరుగా కాకుండా అంతర్జాలం ద్వారా స్వీకరించిన ఈ-స్పందనకు 6 దరఖాస్తులు వచ్చాయి. సోమవారంఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ద్వారా జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఫిర్యాదులపై వివరణ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన అర్జీలను పరిశీలించి పరిక్షస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఇ - స్పందన కార్యక్రమంలో పట్టణ పరిధిలో పలు ప్రాంతాల నుంచి 06 ఫిర్యాదులు రాగా, దీనిలో ప్రజారోగ్య విభాగానికి – 01, ఇంజినీరింగ్ విభాగానికి – 03, పట్టణ ప్రణాళికా విభాగానికి – 02 చెందినవి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్ వీటిపై చర్యలు నిమిత్తం సంబందిత అధికారులకు బదిలీ చేశారు. ఈ ఇ - స్పందన కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, రమణి, సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, సి.సి.పి.విద్యుల్లత, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, పి.డి. (యు.సి.డి) వై. శ్రీనివాసరావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, ఏ.డి.హెచ్ దామోదర రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసి స్పందన ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని కమిషనర్ డా.స్రిజన ఆదేశించారు. సోమవారం జివిఎంసిలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఆయనా శాఖలు, జోన్లకు బదలాయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన స్పందనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో సమాచారం అందించాలన్నారు. ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఒకటవ జోనుకు 02, రెండవ జోనుకు 07, మూడవ జోనుకు 07, నాల్గవ జోనుకు 03, అయిదవ జోనుకు 04, ఆరవ జోనుకు 07, మొత్తము 30 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, రమణి, సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, సి.సి.పి.విద్యుల్లత, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, పి.డి. (యు.సి.డి) వై. శ్రీనివాసరావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, ఏ.డి.హెచ్ దామోదర రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ సేవలతో సంతృప్తి లభిస్తుందని మార్పు ప్రత్యేక అధికారి పి.రంజనీకాంతారావు అన్నారు. ఎచ్చెర్ల ఐటిఐ ప్రన్సిపాల్ , జిల్లా ప్రభుత్వ ఐటిఐల కన్వీనర్ రాడా కైలసరావు సోమవారం పదవీ విరమణ చేసారు. ఈ సందర్భంగా ఐటిఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో రజనీకాంతారావు పాల్గొన్నారు. సుదీర్ఘ సేవలు అందించి, ఐటిఐల అభివృద్ధికి కైలాస రావు కృషి చేసారన్నారు. ఉత్తమ సేవలతో స్వయం సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాస రావు మాట్లాడుతూ కైలాస రావు చిత్తశుద్ధితో విధులు నిర్వహించారన్నారు. ఆదర్శప్రాయమైన సేవలు అందించారని పేర్కొన్నారు. ఉద్యోగ విధులు అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించారని ప్రశంసించారు. రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ జిల్లాలో మంచి సమన్వయంతో ఐటిఐ కార్యకలాపాలు నిర్వహించారన్నారు. ఐటిఐ సహాయ సంచాలకులు రామకృష్ణ మాట్లాడుతూ సుదీర్ఘకాలం సేవలు అందించి ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారన్నారు. పదవీ విరమణ చేసిన కైలాస రావు మాట్లాడుతూ విధులను కష్టంతో కాకుండా ఇష్టంతో నిర్వర్తించానన్నారు. తద్వారా పని పట్ల ఏకాగ్రత నిలపగలిగానన్నారు. విద్యార్ధులకు చక్కని బోధన అందించడం, సంస్ధలో మౌళిక సదుపాయాలు కల్పనకు కృషి చేసానని చెప్పారు. ఉద్యోగ జీవితం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ బాబా, వివిధ ఐటిఐల ప్రిన్సిపాల్స్, రాష్ట్ర ప్రైవేటు ఐటిఐల సంఘం సభ్యులు నాగభూషణ రావు, మొదలివలస రమేష్, ఇంటాక్ సభ్యులు సురంగి మోహన రావు., ఎస్.కె.నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో పుట్టపర్తి మండలం ఎనుములపల్లి చెరువు తెగిపోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం మరమ్మతు పనులు చేపట్టింది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువు గట్లు తెగిపోయే పరిస్థితి రావడంతో జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్ ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డిడిఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతానికి చేరుని గట్టువద్ద ఇసుక బస్తాలు వేశారు. ఎనుములపల్లి చెరువు తెగిపోతే ఇందే వున్న వరి పొలాలు మునిగి రైతులు నష్టాలపాలవుతురని పోలీసులు ముందుగా గుర్తించి ఈ సహాయక చర్యలు చేపట్టారు. పుట్టపర్తి డీఎస్పీ రామకృష్ణయ్య ఆధ్వర్యంలో పనులు పూర్తిచేశారు. అంతేకాకుండా మరువ ప్రాంతంలో నీటి ప్రవాహం సక్రమంగా వెళ్లేలా జె.సి.బి సహాయంతో మరమ్మతులు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా పోలీసు సిబ్బంది చేపట్టిన పనుల కారణంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
కడపజిల్లాల ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీగా కె.రవికుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ప్రభుత్వ నిబంధనలమేరకు విధులు నిర్వహిస్తానని చెప్పారు. ప్రభుత్వం తనమీద ఉంచిన బాధ్యతను నిర్వర్తిస్తూ, ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని వివరించారు. తాను 1995కి చెందిన పోలీసు అధికారినని పదోన్నతి పొంది ఇపుడు డిఎస్పీ అయ్యాయన్నాన్నరు. ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనే ఎస్సీ, ఎస్టీ కేసులు, విచారణపై పూర్తిస్థాయి అవగాహన ఉందన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు ఎస్సీఎస్టీ కేసులను సత్వరం పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని రవికుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.