1 ENS Live Breaking News

డంప్ లభ్యం..మావోయిస్టులు మిస్సింగ్..

ఆంధ్రప్రదేశ్‌- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో స్వాభిమాన్‌ అంచల్‌లోని పేపర్‌మెట్ల పోలీసులు గురువారం భీమారం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు.. భీమారం అటవీ సమీపంలోని గుణమాముడి గ్రామ సమీపంలో బుధవారం భద్రతా బలగాలు నక్సల్స్‌ కోసం ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు పోలీసులు తారపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచి నక్సల్స్‌ తప్పించుకోగా.. గురువారం సంఘటనా స్థలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ పేలుడుకి వినియోగించే ఐఈడీలు, 7.62 మిమీ ఎస్‌ఎల్‌ఆర్ లైవ్ రౌండ్లు 11, నాలుగు 7.62 మిమీ ఏకే రౌండ్లు, ఒక 5.56 మిమీ ఇన్‌సాస్ రౌండ్లు, ఎస్‌ఎల్‌ఆర్ మ్యాగజైన్, 32 డిటోనేటర్లు, ఒక ఫ్లాష్ కెమెరా, రేడియో, 11 కిట్ బ్యాగులు, మూడు మావోయిస్టు యూనిఫాంలు, విప్లవ సాహిత్యంతో పాటు రోజు వారి అవసరాలకు వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులే లక్ష్యంగా దాడులకు దిగి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు సోమవారం భద్రతా దళాలు స్వాభిమాన్‌ అంచల్‌లోని జోడాంబో పోలీస్‌స్టేషన్‌ పరిదిలోని గురాసేటు, బీజింగ్‌, జంప్లూర్‌, పర్లుబంధ గ్రామాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు.

ఏఓబి

2020-10-29 21:28:15

కేంద్రప్రభుత్వ పథకాలపై త్వరలో రివ్యూ..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాల అమలు తీరుపై జిల్లా అభివృద్ది కోఆర్డినేషన్ మరియు మోనటరింగ్ కమిటీ ప్రిలిమినరీ సమావేశం స్ధానిక పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అధ్యక్షతన త్వరలో జరగనున్నట్లు సంయుక్త కలక్టరు (ఆసరా) జె. వెంకటరావు తెలిపారు.  డిఆర్డిఎ సమావేశ మందిరంలో గురువారం ఇందుకు సంబంధించిన సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు.  ప్రతి శాఖకు చెందిన ఉన్నతాధికారులు వారి శాఖలో అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వ పధకాలపై పూర్తిగా అవగాహన కలిగివుండాలన్నారు.  ఈ కమిటీలో మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు  సభ్యులుగా ఉంటారన్నారు. వారు వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే బాధ్యత ఆయా శాఖల అధికారులదేనని స్పష్టం చేసారు.  ఈ సమావేశం కోసం అవసరమగు నివేదికలను నవంబరు 2వ తేదీలోగా నిర్ధేశిత ప్రొఫార్మాలో సమర్పించాలని సూచించారు. పలు శాఖల ద్వారా అమలు చేస్తున్న సుమారు 30 కేంద్ర ప్రభుత్వ పధకాలపై చర్చ జరగవచ్చన్నారు.  ప్రతి పధకం పట్ల అధికారులు అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు.   ఈ సమావేశంలో డిఆర్డిఎ ప్రాజక్టు డైరక్టరు కె. సుబ్బారావు, జిల్లా పరిషత్ సిఇఓ టి. వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ జయశ్రీ, గృహ నిర్మాణ సంస్ద పిడి రమణమూర్తి, ఇపిడిసియల్ ఎస్ఇ విష్టు తదితర అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-10-29 21:19:11

విసిఐసి సౌత్ బ్లాక్ సర్వే సత్వం పూర్తిచేయాలి..

చిత్తూరుజిల్లాలో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్  స్టార్టప్ ఏరియా భూసేకరణ సర్వే త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త సూచించారు. గురువారం  స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కనకనరసారెడ్డి కలసి సంభదిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 న  ఎపిఐఐసి డైరెక్టర్ సమీక్ష జిల్లాలో జరిగిందని ఆమేరకు ఈ నెలఖారునకు మనం 400 ఎకరాల సర్వే పూర్తికావలని నిర్దేశించామని ఆమేరకు పూర్తికావలని అన్నారు.  ఈ సర్వే తొట్టంబేడు మండలం  రౌతు సూరమాల, బి.ఎన్.కండ్రిగ కొత్తపాలెం, ఆలత్తూరు ప్రాంతాల భూసేకరణ పై ఆర్డీఓ వివరించారు.  జిల్లాలో తిరుపతి డివిజన్లలో విసిఐసి కారిడార్  24 వేల ఏకరాలుగా వుందని, నార్త్ బ్లాక్ 11 వేల ఎకరాలు ,సౌత్ బ్లాక్ 13 వేల  ఎకరాలుగా వుందని వివరించారు. స్టార్టప్ ఏరియా కు ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు.ఈ సమీక్షలో ఎపీఐఐసి జోనల్ మేనేజర్ ఎల్.రామ్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి,సంభందిత తహసీల్దార్లు పాల్గొన్నారు.

Tirupati

2020-10-29 20:57:54

రివ్యూ సమావేశానికి సిద్ధం కావాలి..

అనంతపురం జిల్లాలో వచ్చే నెల నవంబర్ 2వ తేదీన జిల్లా రివ్యూ కమిటీ సమావేశం (డిఆర్సీ) జరుగుతుందని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమగ్రమైన సమాచారాన్ని సిద్ధం చేయాల్సిందిగా  జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో డిఆర్సీ సమావేశం నేపథ్యంలో ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వాటి పురోగతిపై   ప్రతి శాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను  10 స్లైడ్స్ మించకుండా రూపొందించాలన్నారు.  ఆయా శాఖల పరిధిలో అమలయ్యే పథకాల అమలు, గైడ్ లైన్స్, పురోగతి, ఎప్పటి లోపు పనులు పూర్తి, పురోగతి లేకపోతే ఎందుకు వెనుకబడి ఉన్నాం అన్న వివరాలతో ప్రజంటేషన్ ఉండాలని, ఆ అంశాలపై  అన్ని శాఖల అధికారులకు పూర్తి స్పష్టత ఉండాలన్నారు. ప్రతి శాఖ పరిధిలోనూ కొత్త కొత్త ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయని, క్షేత్ర స్థాయిలో ఆయా పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, పథకాల అమలులో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము ఇలాంటి అన్ని రకాల వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఇరిగేషన్ పరిధిలోని ట్యాంకులకు నీటిని సరఫరా, వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలు, దెబ్బతిన్న రహదారుల వివరాలు, ఇసుక, సిమెంట్ సరఫరా, సీజనల్ వ్యాధులు, అంగన్వాడీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు,  వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాల భవనాల నిర్మాణం, నాడు నేడు పనుల పురోగతి, కోవిడ్ నేపథ్యంలో తీసుకుంటున్న కట్టడి చర్యలు, తదితర అన్ని  ప్రభుత్వ పథకాల అమలు, వాటి పురోగతిపై అన్ని వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.  అనంతరం జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయం, ఇరిగేషన్ తదితర శాఖల నివేదికల పై సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( గ్రామ వార్డు సచివాలయ లు మరియు అభివృద్ధి) ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, సబ్ కలెక్టర్ నిషా0తి, డిఆర్ఓ గాయత్రీదేవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-10-29 20:56:23

కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..

జివిఎంసీ పరిధిలోని  పాఠశాలలు కోవిడ్ నిబందనల అనుసరించి తెరవాలని జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం, జివిఎంసి పరిధిలో ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నవంబరు రెండవ తేది నుండి పాఠశాలలు తెరవబడుచున్న నేపధ్యంలో కోవిడ్ దృష్ట్యా ప్రభుత్వ నిబందనల ప్రకారం పాఠశాలలలో విద్యార్దీ విద్యార్దినులు తగు జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. ముఖ్యంగా 1, 3, 5, 7 తరగతులు ఒక రోజు, 2, 4, 6, 8 తరగతులు మరో రోజు, 9, 10 తరగతులు ప్రతీ రోజూ తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాల ఆవరణలో కోవిడ్ నిబందనలకు సంబందించి ఫ్లెక్షీలు ఏర్పాటు చేయాలనీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు జరిపి అనుమానం ఉన్న పిల్లలను, ఉపాధ్యాయులు లోనికి అనుమతి ఇవ్వకూడదన్నారు. తరగతి గదులలో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, చాక్ పీసులు, రిజిస్టర్లు వంటివి ఒకరి నుండి మరొకరికి మార్పులు చేయకుండా చూడాలని అన్నారు. కరచాలం కూడా ఎవ్వరూ చేయకూడదన్నారు. మాస్కు లేనిదే లోనికి ఎవ్వర్నీ అనుమతి ఇవ్వకూడదని, మొదటి, ఆఖరి పీరియడ్ లో తప్పని సరిగా కోవిడ్ పై ప్రత్యేకమైన బోధనలు చేయాలని, క్లాసులో 20 మంది పిల్లలు ఉండే విధంగా ప్లాను చేసుకోవాలని, పిల్లలకు ఇచ్చిన వర్కు బ్లాక్ బ్బోర్డుపై వ్రాసి వారినే సరిచేసుకొనే విధంగా చూడాలన్నారు. మొదటి పది రొజులూ ఏ.ఎన్.ఎం.ల ద్వారా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసే పద్దతి క్షుణ్ణంగా తెలుసుకోవాలని, దీని కోసం మీలో చలాకీగా ఉన్న టీచరును రీసోర్సు పెర్సన్ గా ఏర్పాటు చేసుకోవాలని ప్రతీ రోజూ సాయంత్రం పాఠశాలలో అన్ని తరగతి గదులకు శానిటైజేషన్ చేసి శుభ్రపరచాలన్నారు. అలాగే, నాడు – నేడు పనులు పూర్తీ కావస్తున్నాయని, జగనన్న విద్యా కానుకలు అందరికి అందించేలా చూడాలన్నారు.  అదనపు కమిషనర్ మాట్లాడుతూ, గత 7 నెలలుగా పిల్లలు ఇంటివద్ద ఉండడం వలన వారిలో క్రమశిక్షణ లోపిస్తుందని పిల్లలకు మీరే ఓపికతో క్రమశిక్షణ నేర్పాలన్నారు. దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి రేపిడ్ టెస్టు చేయించాలని, తరగతి గదులలో ఒక గదిని ఐసోలేషన్ గదిగా ఉపయోగించాలన్నారు. ప్రతీ ప్రధానోపాధ్యాయులు వద్ద మీ పరిధిలో ఏ.ఎన్.ఎం., మలేరియా విభాగం, శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్లు ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టరు వి. సన్యాసి రావు, డి.ఇ.ఓ. శ్రీనివాస రావు, జివిఎంసి  పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

జివిఎంసీ కార్యాలయం

2020-10-29 20:39:53

వైఎస్సార్సీపీకి జై..టిడిపి, జనసేనకు బై బై..

వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి చెప్పారు. గురువారం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టిడిపి,జనసేన పార్టీలను వీడి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిడిపి, జనసేన పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదనే విషయం తెలుసుకున్నవారంతా వైఎస్సార్సీపీలో చేరుతున్నారని ఇదే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నిదర్శమని అన్నారు. ఆ కుటుంబాలకు చెందిన వారిని రామక్రిష్ణారెడ్డి సాదరంగా కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.  పార్టీలోకి చేరిన వారిలో  కూరాకుల మల్లికార్జునరావు, కూరాకుల సాంబయ్య, సంక అంజయ్య, యాదం రామకోటేశ్వరరావు, కూరాకుల సాంబయ్య, పాశం బ్రహ్మయ్య, కూరాకుల సాంబశివరావు, కూరాకుల కోటేశ్వరరావు, ఉప్పు నారాయణ, జెవిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు..

Macherla

2020-10-29 19:03:13

పండుగలా వాల్మీకి జయంతి..

మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతిని అక్టోబ‌రు 31న రాష్ట్ర పండుగగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ ప‌రిధిలో కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అధికారిక ఉత్స‌వంగా వాల్మీకి జ‌యంతిని జ‌రుపుకోవాల‌న్నారు. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు త‌మ ప‌రిధిలోని డివిజ‌న‌ల్‌, మండ‌ల‌, పంచాయ‌తీ, గ్రామ స్థాయి కార్యాల‌యాల్లో ఈ ఉత్స‌వం నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఇప్పటికే అన్నిశాఖలకు ఆదేశాలు జారీచేశామన్న కలెక్టర్ ఎవరు కార్యక్రమం నిర్వహించకపోయినా చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను అన్ని శాఖల అధికారులు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో మహర్షి వాల్మీకి జయంతిని నిర్వహించాలన్నారు. కార్యక్రమ నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలని కూడా కలెక్టర్ ఆదేశించారు.

క్రిష్ణాజిల్లా

2020-10-29 18:43:18

ఆధునికి టెక్నాలజీ వినియోగించుకోవాలి..

‌రాష్ట్ర పోలీసు శాఖ ఆధునిక టెక్నాల‌జీతో కూడిన సేవ‌లు అందిస్తోంద‌ని ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న మొబైల్ ఫోను ద్వారానే ఈ సేవ‌లు వినియోగించుకోవ‌చ్చ‌ని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రిత అన్నారు. ఏ.పి.పోలీసు సేవ యాప్ ద్వారా 87 ర‌కాల సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నామ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు స్టేష‌నుకే వెళ్లాల్సిన ప‌నిలేద‌ని, త‌మ మొబైల్ ఫోనులోని యాప్ ద్వారా ఎంతో సులువుగా ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని, కేసుల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఇటువంటి సేవ‌ల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లంతా వినియోగించుకోవాల‌న్నారు. రాష్ట్ర పోలీసుల ప‌నితీరుకు జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయ‌ని హోం మంత్రి పేర్కొన్నారు. స్కోచ్ సంస్థ 83 జాతీయ స్థాయి అవార్డులు ప్ర‌క‌టిస్తే అందులో 48 అవార్డులు మ‌న రాష్ట్ర పోలీసు శాఖ‌కు ల‌భించ‌డం ఈ శాఖ ప‌నితీరుకు నిద‌ర్శ‌మ‌ని, ఇందుకు చాలా గ‌ర్వంగా వుంద‌న్నారు. జిల్లా ప‌ర్య‌ట‌న‌కోసం గురువారం న‌గ‌రానికి వ‌చ్చిన హోంమంత్రి స్థానిక జిల్లాపరిష‌త్ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వై ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసుల‌కు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వ‌డం, దిశ చ‌ట్టం తీసుకురావ‌డం, దిశ పోలీసు స్టేష‌న్ల ఏర్పాటు ద్వారా పోలీసు శాఖ‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ల‌భించాయన్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు తీసుకువ‌చ్చిన దిశ చ‌ట్టంలో భాగంగా ప్రాంతీయ ఫోరెన్సిక్ లేబొరేట‌రీలు విశాఖ‌, తిరుప‌తి, విజ‌య‌వాడ‌ల్లో త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు పేర్కొన్నారు. దిశ చ‌ట్టంలో భాగంగా ప్ర‌త్యేక న్యాయ‌స్థానాల ఏర్పాటులో ఎలాంటి స‌మ‌స్య‌లేద‌ని వాటిని ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు.  ఉమ్మ‌డి రాష్ట్రంలో పోలీసు ట్రైనింగ్ కళాశాల వుండేద‌ని అయితే అది లేక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతం అనంత‌పూర్‌లో తాత్కాలికంగా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రంలో పోలీసు ట్రైనింగ్ క‌ళాశాల ఏర్పాటుకు ఆలోచిస్తున్నామ‌ని, ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేది ఇంకా నిర్ణ‌యించ‌లేద‌న్నారు. రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, అగ్నిమాప‌క శాఖ ఇత‌ర రాష్ట్రాల్లో సైతం సేవ‌లందిస్తూ అక్క‌డి ముఖ్య‌మంత్రుల ప్ర‌శంస‌లు కూడా పొందుతోంద‌ని హోం మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 175 అగ్నిమాప‌క కేంద్రాల ద్వారా విప‌త్తులు, అగ్నిప్ర‌మాదాల స‌మ‌యంలో సేవ‌లందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ స్థానిక ఎన్నిక‌లను వాయిదా వేసిన‌పుడు అన్ని పార్టీల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేద‌ని హోం మంత్రి ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో నాడు 26 కోవిడ్‌ కేసులు ఉన్న‌పుడు ఎన్నిక‌లు వాయిదా వేసి 27వేలకు పైగా కేసులున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు నిర్వ‌హ‌ణ చేప‌డ‌తామ‌న‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని పేర్కొన్నారు. ప‌త్రికా విలేక‌రుల స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, శాస‌న మండ‌లి స‌భ్యులు సురేష్‌బాబు, శాస‌న‌స‌భ్యులు అల‌జంగి జోగారావు, శంబంగి చిన‌ప్ప‌ల నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.  అంత‌కుముందు శ్రీ‌కాకుళం నుండి జిల్లాప‌రిష‌త్ అతిథిగృహానికి చేరుకున్న హోం మంత్రికి ఉప ముఖ్య‌మంత్రి పుష్ప‌శ్రీ‌వాణి, శాస‌న‌స‌భ్యులు శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, అల‌జంగి జోగారావు, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, జిల్లా ఎస్‌.పి. బి.రాజ‌కుమారి, జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి.కిషోర్ కుమార్‌, ఆర్‌.డి.ఓ. భ‌వానీశంక‌ర్, జిల్లా అగ్నిమాప‌క అధికారి జె.మోహ‌న‌రావు‌ త‌దిత‌రులు స్వాగ‌తం ప‌లికారు. పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, శాస‌న‌స‌భ్యులు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు త‌దిత‌రులు హోం మంత్రిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. హోం మంత్రి వెంట ప‌ర్య‌ట‌న‌లో విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ మ‌హమ్మ‌‌ద్ హ‌స‌న్ రెజా కూడా ఉన్నారు.

Vizianagaram

2020-10-29 18:35:00

ప్రగతి సాధింకపోతే ఇంటికి పంపుతాం..

వార్డు సచివాలయ సెక్రెటరీ లు ప్రగతిపై దృష్టి పెట్టాలని, మీసేవా కార్యాలయాలతో పోటీ పడి ప్రజలకు పౌర సేవలందించాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా  అన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు సెక్రెటరీలు, వాలంటీర్లతో వారంత సమీక్షలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పౌర సేవల ధరఖాస్తులు  పట్టణ ప్రాంతాలలో మీ సేవా కేంద్రాలలో అత్యధికం వస్తున్నాయని సచివాలయ నుండి కేవలం 10 శాతం మాత్రమే ఉందని అన్నారు. మీ సేవా నిర్వాహకులు ఇద్దరు, ముగ్గురు సిబ్బందితో  ఒక్కొక్కరు 40 పైగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అక్కడ వారు ఇచ్చే ఆతిధ్యం ఏమి? వార్డు సచివాలయాల్లో ఇంతమంది సెక్రెటరీలు, వాలంటీర్లు ఉంది ప్రగతి చూపలేక పోవడానికి మీరే కారణం వెతకాలని అన్నారు. జిడి నెల్లూరు మండలం గ్రామ సచివాలయాలు 27 వేల పౌర సేవల ధరఖాస్తులు స్వీకరించారు. దీన్ని బట్టి మీ దగ్గర పూర్ పర్ఫార్మన్స్ ఉందని అర్థం అవుతున్నదని అన్నారు.  వైఎస్ఆర్ చేయూత  మహిళకు ఆర్థిక సహాయం అందించారు. దీనికి తోడు  బ్యాంకుల నుండి మాచింగ్ గ్రాంట్ ఇప్పించి ఏదైనా శాశ్వత ఆర్థిక భరోసా కల్పించారా అంటే లేదు . జగనన్నతోడు ముఖ్యమంత్రి నవంబర్ 6 న ప్రారంభించనున్నారు. జిల్లాలో 49 వేల ధరఖాస్తులు వస్తే, తిరుపతి నగరపాలక పరిధిలో 3 వేలు మాత్రమే చేశారు, జనాభా 4 లక్షలు పైగా  ఉంది, ఎంతో మందికి తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్నారు. వై ఎస్ ఆర్ భీమా అమల్లోకి వచ్చింది అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలి లేదంటే పెద్దవాళ్ళు ఆపదలో ఆర్థిక సహాయం కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి రోజూ  సచివాలయాలపై సమీక్షలు జరుపుతున్నాము, త్వరలో ప్రగతి చూపించాలని అన్నారు.   ఈ సమీక్షలో తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి , అదనపు కమీషనర్ హరిత, ఎం.ఇ. చంద్రశేఖర్, సచివాలయాల ఇంచార్జి రవి, వార్డు సెక్రెటరీలు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Tirupati

2020-10-29 18:29:17

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం..

ఎస్సీ ఎస్టీ   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉడా చిల్డ్రన్ ఏరినాలో “ జగనన్న వైయస్సార్ బడుగు వికాసం” ప్రత్యేక పారిశ్రామిక పాలసీ 20 20 - 23  జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని వారికి ఆర్థికంగా చేయూత నిచ్చి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును కల్పిస్తున్నారన్నారు. ఎస్సీ , ఎస్టీల లో చాలామంది చదువుకొని ఉద్యోగాలతో సరిపెట్టు కుంటున్నారని , వారికి పరిశ్రమలపై సరియైన అవగాహన , ప్రోత్సాహం లేకపోవడం తో ముందుకు రాలేక పోతున్నారన్నారు. మన ముఖ్యమంత్రి ఎస్సీలు ఎస్టీలు శ్రామికులుగా మిగిలి పోకూడదు, పెద్ద పారిశ్రామిక వే త్తలుగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా పలు రాయితీలను కల్పిస్తున్నా రన్నారు. భూ రిజర్వేషన్ కు సంబంధించి ఏపీఐఐసీ లలో అభివృద్ధి చేసిన భూమిలో 16 శాతం ఎస్సీలకు, ఆరు శాతం ఎస్.టి పారిశ్రామికవేత్తలకు కేటాయించారన్నారు. స్టాంపు డ్యూటీ రద్దు, విద్యుత్  చార్జీలలో రాయితీ ,వడ్డీ లో రాయితీ, సూక్ష్మ, చిన్న తరహా  పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిలో రాయితీ, సేవ మరియు రవాణా రంగంలో రాయితీ కల్పించడం జరుగుతుందన్నారు. విత్తన మూల ధన సహాయం, నాణ్యత ధృవీకరణ యోగ్యతాపత్రం అందించబడుతుందని, అదే విధంగా నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణా కార్యక్రమాలను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తుందన్నారు. గతంలో చట్టం ఉన్నా సరైన రీతిలో అమలు కాలేదని,ముందు చట్టాలు కార్యరూపం దాల్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు . ఇక నుండి ఈ పాలసీ మీద అన్ని నియోజకవర్గాల పరిధిలో ఎస్సీ ఎస్టీ  ఔ త్సాహిక  పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు మంత్రి సూచించారు. ఇంక్యుబేషన్ సెంటర్లలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మొదటి దశ నుండే శిక్షణ అందించి వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు  తగిన ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతిభావంతులను ప్రోత్సహించాలని , వారిలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కల్పించి వారి కలలను సాకారం చేయాలన్నారు. రాబోయే రోజులలో విశాఖ పారిశ్రామిక, విద్యా , పర్యాటక   రంగాలలోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, వారు మరి కొందరికి ఉపాధి కల్పించే విధంగా మారాలన్నఆకాంక్షను వ్యక్తపరిచారు. బ్యాంకర్లు వారికి రుణ సౌకర్యాన్ని అందించి  ప్రోత్సహించాలన్నారు.      పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ జగనన్న వైయస్సార్ బడుగు వికాసం పాలసీ అణగారిన దళిత, గిరిజన వర్గాల ఆర్థిక స్వావలంబన, సామాజిక చైతన్యం కల్పించడానికి ప్రవేశ పెట్టారన్నారు. ఎస్సీ ఎస్టీలకు దసరా దీపావళి కానుకగా ఈ పాలసీ అందిస్తున్నందుకు వారి తరఫున కృతజ్ఞతలను తెలియజేస్తున్నానన్నారు.            అరకు శాసనసభ్యులు శెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ గిరిజనులకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏజెన్సీలో మెడికల్ కాలేజీ ,స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారని, అదేవిధంగా అటవీ హక్కు చట్టాన్ని కల్పించారని, రవాణా, కమ్యూనికేషన్ వంటి రంగాలలో సుమారు రూ 650 కోట్లతో మౌలిక అభివృద్ధి పనులను చే పడుతున్నారన్నారు. ఏజెన్సీ పర్యాటకంగా అభివృద్ధి లో ముందు ఉందని, పర్యాటకులను ఆకర్షించేందుకు హోటళ్ల నిర్మాణానికి గిరిజన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. ఇక్కడ పండే ఆర్గానిక్ పంటలు దళారులతో సంబంధం లేకుండా రవాణా జరిగే విధంగా చూడాలన్నారు.         పాడేరు శాసనసభ్యులు  కే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికై నూతన అధ్యాయాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి దేననిి ,వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ పాలసీని ప్రవేశపెట్టారన్నారు. ఎస్సీ ఎస్టీ  పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రొక్యూర్మెంట్ పాలసీ కింద ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో పరిశ్రమలను పెట్టుకునేందుకు తక్కువ రేటు కు భూములను ఇవ్వాలన్నారు. చిన్న,భారీ పరిశ్రమల నిర్వహణకు  బ్యాంకర్లు సహకరించాలన్నారు.  జాయింట్ కలెక్టర్ -3 ఆర్ గోవింద రావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక పాలసీ సంబంధించి ఫైనాన్షియల్ , నాన్ ఫైనాన్షియల్ పథకాలను  పెట్టడం జరిగిందన్నారు. ఏపీఐఐసీ ,జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రతి ఆర్గనైజేషన్లో జగనన్న వైయస్సార్ బడుగు వికాసం పేరుతో ప్రత్యేకంగా ఒక సెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిశ్రమలు పెట్టుకునేందుకు ఉత్సాహం ఉన్నవారు ప్రభుత్వం అందించే 8 రకాల సబ్సిడీలను పొందవచ్చునన్నారు.   ఈ సమావేశంలో శాసన సభ్యులు  తిప్పల నాగిరెడ్డి,అదీప్ రాజ్, జిల్లా  పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగరాజు, ఏపీఐఐసీ జడ్ ఎం యతిరాజులు ,డిక్కీ, సిక్కిి ప్రతినిధులు రాంజీఅంబేద్కర్, రాజేంద్రప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

ఉడా చిల్డ్రన్ థియేటర్

2020-10-29 18:16:50

ప్రమాదాల నియంత్రణకు సాంకేతికత..

రాష్ట్రంలో ప్రమాదాలు జరుగకుండా సాంకేతికత వినియోగంచుటకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఉత్తరాంధ్ర తొలి పర్యటనలో భాగంగా గురు వారం శ్రీకాకుళం విచ్చేసిన హోమ్ మంత్రి శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద గల అగ్నిమాపక కేంద్రంకు రూ.48.50 లక్షలతో మొదటి అంతస్తుపై అదనంగా నిర్మించిన భవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజులతోకలసి సుచరిత ప్రారంభించారు. అగ్నిమాపక యంత్ర పరికరాలను పరిశీలించారు. నూతన అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి సుచరిత మాట్లాడుతూ రాష్ట్రంలో 185 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని వాటిలో 12 అగ్నిమాపక కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 207 ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఇందులో రూ.2.07 కోట్ల విలువ గల ఆస్తి నష్టం జరుగగా, రూ.10.81 కోట్ల విలువ మేరకు ఆస్తులను కాపాడటం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా, 17 మందిని ప్రాణాలతో రక్షించడం జరిగిందని ఆమె వివరించారు. తుఫానులు, విపత్తుల సమయంలో విపత్తులు, అగ్నిమాపక శాఖ నిర్విరామంగా కృషి చేస్తుందని, ప్రాణ నష్టం జరుగకుండా అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు. తితిలి తుఫాను సమయంలో 22 రోజుల పాటు నిరంతరం సేవలు అందించారని పేర్కొన్నారు. ఇటీవల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ తదితర జిల్లాల్లో సంభవించిన వరదలలో సకాలంలో అగ్నిమాపక, విపత్తుల సిబ్బంది సేవలు అందించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టారని అన్నారు. మనుషులతోపాటు పశువులను కూడా సురక్షితంగా ఉండుటకు చర్యలు చేపట్టడం ముదావహం అన్నారు. ఆపద సమయంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించుటకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కేరళ, హైదరాబాదు వరదల్లో సహాయ కార్యక్రమాల్లో మన రాష్ట్ర సిబ్బంది పాల్గొని అత్తుత్తమ సేవలు అందించారని మంత్రి తెలిపారు.  దేశ వ్యాప్తంగా పోలీసు శాఖ మంచి సేవలు అందించడంలో మంచి గుర్తింపు పొందిందని పేర్కొంటూ జాతీయ స్ధాయిలో 83 అవార్డులు ప్రకటించగా 48 అవార్డులు మన రాష్ట్రానికి దక్కాయని తెలిపారు. దిశ పోలీసు స్టేషన్లకు 5 అవార్డులు దక్కాయని చెప్పారు. గత రెండు సంవత్సరాల కాలంలో ఏపి పోలీసు సేవలకు మొత్తంగా 85 అవార్డులు రావడం జరిగిందని, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం జరుగుతోందని అన్నారు. చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా సాంకేతికతను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నామని సుచరిత చెప్పారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన సహాయ జిల్లా అగ్నిమాపక అధికారులు బి.జె.డి.ఎస్.ప్రశాంత్ కుమార్, కె.శ్రీనుబాబు, లీడింగ్ ఫైర్ మెన్ దుర్గా రెడ్డి, పైర్ మెన్ పి.రాంబాబు, రాజశేఖర్, డ్రైవర్ పి.చక్రధర్ లకు ప్రశాంసా పత్రాలను మంత్రి అందజేసారు. అతిధులకు అగ్నిమాపక మహా సంచాలకులు (డైరక్టర్ జనరల్) మహమ్మద్ హసన్ రెజా దుశ్సాలువలు, జ్ఞాపికలతో సత్కరించారు. అగ్నిమాపక శాఖలో హోమ్ గార్డుగా పనిచేస్తూ రహదారి ప్రమాదంలో మరణించిన సింహాద్రి నాయుడు కుటుంబ సభ్యులకు అగ్నిమాపక సిబ్బంది విరాళాలుగా అందించిన రూ.3,43,250 మొత్తాన్ని మంత్రి సుచరిత అందజేసారు.  ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు, కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, గొర్లె కిరణ్ కుమార్, డిసిసిబి అధ్యక్షులు పాలవలస విక్రాంత్, వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురాం, తూర్పు కాపు, కాళింగ కార్పొరేషన్ ల ఛైర్మన్లుగా నియమితులైన మామిడి శ్రీకాంత్, పేరాడ తిలక్, అగ్నిమాపక శాఖ సంచాలకులు కె.జయరాం నాయక్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి జి.శ్రీనివాసులు, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, ఏపి పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ కార్యనిర్వాహక ఇంజనీరు కె.తమ్మిరెడ్డి., మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి., దువ్వాడ శ్రీనివాస్,సురంగి మోహన రావు, పి.రుషి తదితరులు పాల్గొన్నారు.   

Srikakulam

2020-10-29 14:52:44

సోలార్ పవర్ ప్రాజెక్టుతో జీవిఎంసీకి ఆదాయం..

విశాఖలో ముడసర్లోవ జలాశయంలో ఏర్పరచిన 2 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఇపిడిసిఎల్ గ్రిడ్ తో అనుసంధానం జరిగిందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. బుధవారం మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, జివిఎం కమిషనర్ తో కలిసి ఈ సోలార్ విద్యుత్ ప్లాంటను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  ఈ ప్రాజెక్టు వలన ఇపిడిసిఎల్ కి  చెల్లించవలసిన విద్యుత్ చార్జీలు  జివిఎంసికి అదా అవున్నాయని చెప్పారు. అనంతరం  సౌర విద్యుత్ ప్రాజెక్టు వివరాలను జివిఎంసి కమిషనర్ మంత్రులకు వివరించారు. 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టుని కూడా ఇపిడిసిఎల్ తో  త్వరలో అనుసంధానం చేస్తామని వివరించారు.  ముడసర్లోవ పార్కును సందర్శించిన మంత్రులు పార్కు అభివృద్ధికి గాను డిపిఆర్  తయారు చేయవలసినదిగా జివిఎంసి, విఎంఆర్ డి ఏ కమిషనర్లను ఆదేశించారు. జివిఎంసి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి సమావేశమందిరంలో ఏపిడిఆర్పి ప్రాజెక్టు క్రింద ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయం 110 కోట్ల తో విశాఖ బీచ్ లో పునరాభివృద్ది ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోతున్న వివిధ పనులను కమిషనర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులు కమిషనర్ తెలియజేశారు. 18 నెలల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టు పనులను పూర్తీ చేయాలని, పనులు జరుగుచున్న కాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు కమిషనరుకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు అశా జ్యోతి, వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కె. ఎస్.ఎల్. జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ కుమార్, కె.వి.ఎన్. రవి తదితర అధికారులు పాల్గొన్నారు.

ముడసర్లోవ

2020-10-28 21:44:00

ఒకరి రక్తదానం..ఐదుగురికి ప్రాణదానం..

డబ్బు దానం చేస్తే ఆకలి తీరుతుంది..కానీ అదే రక్త దానం చేస్తే మీరు ఐదుగురు జీవితాలను కాపడానికి వీలుపడుతుందని తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి అన్నారు.   పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం  ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు.  ఈ సందర్బంగా  యస్.పి మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితిలో రక్తం దొరకక, రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలలో ఎందరో ప్రాణాలు పోగొట్టు కుంటున్నారని, ఇలాంటి పరిస్థుతలను కొంతవరకైనా మెరుగు పరచాలనే ఉద్దేశంతో అర్బన్ జిల్లా పోలీసులు పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ వారోత్సవాలలోనే కాకుండా భవిష్యత్తులో జిల్లా మొత్తం రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా లభించిన  రక్త నిధిని అత్యవసర పరిస్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉపయోగకరంగా ఉండేటట్లు చేస్తామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజా స్రవంతిలో పోలీసులు మెరుగైన సేవలు చేసేందుకు పోలీసులకు - ప్రజలకు సత్సంబంధాలు ఏర్పడి ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పడుతాయన్నారు.    అనంతరం రక్తదానం చేసిన వారికి జిల్లా యస్.పి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డి.యస్.పి చంద్రశేఖర్, సి.ఐ లు అంజు యాదవ్, అమరనాథ్ రెడ్డి, యస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tirupati

2020-10-28 21:31:29

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..

ప్రజలను 24 గంటలూ రక్షించాలని చూసేది ఒక్క పోలీస్ మాత్రమేనని తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ అధ్వర్యంలో స్థానిక పోలీస్ గ్రౌండ్ నుంచి బాలాజీ కాలనీ వరకు  అమరవీరులను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసులను, వారి త్యాగాలు ఉట్టి పడే విధంగా పోలీస్ బ్యాండ్ కళాకారులతో మ్యూజిక్ ద్వారా తియ్యని దేశభక్తి గీతాలను ఆలపించారు.   ఈ సందర్బంగా జిల్లా యస్.పి  మాట్లాడుతూ, పోలీసుల మొక్క సేవ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అవసరం వస్తుందన్నారు. ఈ సందర్భాలలో కొన్ని కష్టమైనా, ప్రజా రక్షణ కోసం త్యాగాలు కూడా చేస్తామన్నారు. 24x7 ప్రజా సేవకోసం ముందుండి రక్షణ కల్పించేది ఒక్క పోలీస్ శాఖ మాత్రమేనన్నారు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అది బయటకు కనబడకుండా ఎంతో మంది ఇప్పటికి విధులు నిర్వహిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. వీరి త్యాగాలను ఎప్పటికి మర్చిపోకూడదని యస్.పి సూచించారు.  ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ యస్.పి  సుప్రజ, యస్.బి  డి.యస్.పి  గంగయ్య , డి.యస్.పి లు ఈస్ట్ మురళి కృష్ణ, క్రైమ్ మురలిదర్, ఏ.ఆర్  డి.యస్.పి లు నంద కిశోర్, లక్ష్మణ్ కుమార్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tirupati

2020-10-28 21:11:27

ప్రజాసేవకు రియల్ పోలీస్ మనసు పెడితే..

ఒంటిపై ఖాకీ చొక్క ఉంటే చాలు ఎవరినైనా అరేయ్..ఒరేయ్...ఏరా.. అని ఎంతో మర్యాదగా పిలుస్తారు పోలీసులు...అలాంటి వారంతా ఒక్కసారి తిరుపతి అర్బన్ ఎస్పీ ఎ.రమేష్ రెడ్డిని చూసినా, ఆయన చేసిన పనుల కోసం తెలుసుకున్నా ఖచ్చితంగా మార్పువచ్చితీరుతుంది. అంతలా విధి నిర్వహణ చేస్తూ..ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నూతన ఒరవడిని స్రుష్టిస్తున్నారు. పోలీసులు మనసు పెట్టి పనిచేస్తే ఫలితాలు ఇంతలా వస్తాయా అనేవిధంగా వ్యవహరిస్తున్నారు. డిజిపి ఆదేశాల మేరకు తిరుపతి అర్భన్ లో ఆపరేషన్ ముస్కాన్ పేరిట నిర్వహించిన కార్యక్రమం ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అందించే కార్యక్రమం చేపడుతున్నారు. ఆ సమయంలో కూడా ఒక ఎస్పీ అయివుండి ఎంతో వినమ్రంగా చేతులు రెండూ దండకట్టుకొని మరీ శ్రద్ధగా తప్పిపోయిన బాలల నుంచి వివరాలు సేకరించి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అలా చేయడంతో ఇప్పటి వరకూ ఏకంగా 77 మంది బాలలను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చగలిగారు.  తిరుపతి అర్భన్ జిల్లాలో చేసే ఏ కార్యక్రమం అయినా దానిని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసి చైతన్యం తీసుకువస్తున్నారు. ఫేస్ బుక్ అనేసరికి అంతా ప్రచారం కోసం అనుకుంటారు. కానే కాదనే విషయం ఈ ఎస్పీని చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ అంటే ప్రజల్లో ఒక ఉన్నత గౌరవాన్ని నింపేందుకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందనే సూత్రాన్ని అమలు చేస్తూ, ప్రజాపోలీసింగ్ అందిస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఎన్జీఓలను కూడా భాగస్వాములు చేస్తూ తప్పిపోయిన పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించి మరీ వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు. ఐపీఎస్ అంటే హోదా కాదు.. ఒక బాధ్యత అని మాటలు చెప్పకుండా వస్తాయనడానికి ఈ సూపర్ ఐపీఎస్ రాష్ట్రంలో మచ్చుతునకలా కనిపిస్తున్నారు. అదేసమయంలో అవినీతిని ఎండగట్టడంలోనూ ఎల్లప్పుడూ ముందుంటూ పోలీస్ శాఖలో మన్ననలు పొందుతున్నారు. ఇలాంటి అధికారులు ప్రతీ జిల్లాలోనూ ఉంటే పోలీసులంటే మనసులో అమ్మనాభూతులు తిట్టుకుంటూనే బయటకు గౌరవాన్ని నటించే పరిస్తితిపోయి...నిజంగానే మనసునిండిన భావంతో గౌరవించే రోజులొస్తాయనిపించేలా వ్యవహరిస్తున్నారు రమేష్ రెడ్డి...

తిరుపతి అర్భన్

2020-10-28 21:01:50