జివిఎంసి పరిధిలో వివిధ పన్నులను శత శాతం వసూలు చేయాలని జివిఎం సి కమిషనర్ డాక్టరు జి. సృజన అధికారులను ఆదేశించారు. బుదవారం, జివియం సి సమావేశమందిరంలో జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. 2020 - 21 ఆర్ధిక సంవత్సరమునకు సంబందించి ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, నీటి చార్జీలు, కళ్యాణమండపాలు, షాపులు, మార్కెట్ల నుండి రావలసిన పన్నులు పూర్తిగా వసూలు చేయాలని ఆదేశించారు. జివిఎంసికి రావాల్సిన అదాయం సకాలంలో వసూలు చేయకపోతే ప్రజలకు అందించవలసిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయన్నారు. తక్కువ శాతం పన్ను వసూలు చేసిన రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లును తీవ్రంగా హెచ్చరించారు. అదనపు కమిషనరు ఆశా జ్యోతి మాట్లాడుతూ నూతనంగా కట్టిన భవనాలకు, వినియోగ మార్పిడి జరిగిన భవనాలు, పన్ను పరిధిలోకి రాని ఖాళీ స్థలాలను గుర్తించి, వెంటనే పన్నులు విధించాలని, మార్చి- 2021 నాటికి 25% పన్ను ఆదాయం పెరగాలని, రెవెన్యూ అధికారులకు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ అశా జ్యోతి, డి.సి.(ఆర్). ఫణిరాం, అందరు జోనల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసీ పరిధిలోని వార్డు సచివాలయ ప్రత్యేక అధికారులు సచివాలయలను నిత్యం పర్యవేక్షించాలాని జివిఎంసి కమిషనర్ డాక్టరు జి. సృజన ఆదేశించారు. బుదవారం, జివిఎంసిలో వార్డు ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రత్యేక అధికారులు సచివాలయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలకు సంబందించిన వివిధ పోస్టర్లను ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు. ప్రతీ సచివాలయ పరిధిలో ఎక్కువ తక్కువ కాకుండా నిబంధనల ప్రకారం కనీసం 1000 నుండి 1200 వరకు ఇల్లు వుండే విధంగా మ్యాపింగు చేసి వాటి జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. కొన్ని సచివాలయాలలో వార్డు కార్యదర్శులు డైరీలో సరిగా వ్రాయడం లేదని, వారు బయటకు వెళ్ళినప్పుడు ఏ పనిపై వెళ్ళారో డైరీలో పూర్తీ వివరాలను వ్రాయాలన్నారు. నవరత్నాలలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ప్రజలు సచివాలయాలకు వెళ్తే అక్కడ మన పని అవుతుందనే నమ్మకం కలగాలన్నారు. వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులు, ఎమినిటీ కార్యదర్శులు, ప్లానింగ్ కార్యదర్శులు వారి పరిధిలో క్షేత్రస్థాయిలో సాయంత్రం పర్యటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఆశా జ్యోతి, డాక్టరు వి. సన్యాసి రావు, ప్రధాన వైద్య అధికారి డాక్టరు కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, పి.డి.(యు.సి.డి) వై. శ్రీనివాసరరావు, డి.సి.(ఆర్). ఫణిరాం, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, అందరు జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడంలో గ్రామసచివాలయ సిబ్బంది బాధ్యతగా వ్యహరించాలని క్రిష్ణాజిల్లా కలెక్టర్ ఏ. ఎం. డీ. ఇంతియాజ్ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని ఉయ్యురు మున్సిపల్ పరిధిలో తోట్లవల్లూరు కెనాల్ బ్రిడ్జిలో ఉన్న వార్డు సచివాలయం 4 & 6 కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సచివాలయాల్లో రికార్డులను తనిఖీ చేవారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన సేవలు ప్రజలకు వాలంటీర్ల ద్వారా తెలిసేలా చైతన్యం కలిగించాలన్నారు. అంతేకాకుండా సచివాలయాల్లో అందే సేవల వివరాలను బోర్డుల ద్వారా ప్రజలకు అర్ధమయ్యేలా తగిలించాలన్నారు. కరోనా సమయంలో సిబ్బంది కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించడంతోపాటు, ప్రజలను కూడా చైతన్యం చేయాలన్నారు. విధి నిర్వహణలో ఎవరు అలక్ష్యంగా వ్యవహరించా కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అన్నిశాఖల సిబ్బంది మూమెంట్ రిజస్టర్, బయోమెట్రిక్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు...
జాతీయ జర్నలిస్టు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా జర్నలిస్టులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా వ్యాచరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాకుమాను వెంకట వేణు తెలిపారు. బుధవారం వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఏపీలోని వివిధ రీజియన్ల నుంచి ఈ పోటీలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు.నేటి రాజకీయ పార్టీలు, పత్రికల పాత్ర అనే అంశంపై పోటీల్లో పాల్గొనే వారు తమ ఎంట్రీలను పంపాల్సి ఉంటుందన్నారు.పచ్చదనం` పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ పోటీల్లో పాల్గొనే వారు చదువుతున్న విద్యా సంస్థ గుర్తింపు కార్డుతో పాటు వ్యాస రచన, చిత్రలేఖనం ఎంట్రీలను ఏపీ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ విశాఖపట్నం రీజియన్ కార్యాయానికి పంపాల్సి ఉంటుందని వివరించారు.
జాతీయా పత్రికా దినోత్సవం, జాతీయ పాత్రికేయ దినోత్సవ వేడుకలు నవంబరు 16,17 తేదీల్లో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకుమాను వెంకట వేణు తెలిపారు. బుధవారం డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షుడు నేమాల హేమసుందరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేణు మాట్లాడారు. ఏపీలోని వివిధ ప్రాంతాల వారీగా ఉత్తమ జర్నలిస్టులను ప్రధమ,ద్వితీయ,తృతీయంగా ఎంపికచేసి వారికి సత్కరించి, సన్మానించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా ఎంట్రీలను నవంబర్ 4,లోగా విశాఖపట్నంలోని యూనియన్ కార్యాయానికి పంపాలని కోరారు.కరోనా కట్టడిలో వార్తా కథనాలు కవర్ చేసిన జర్నలిస్టులు ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నారో తెలియజేసే గుర్తింపు కార్డుతో పాటు, వారు కరోనా సమయంలో మార్చి1, నుండి సెప్టెంబరు 30,2020 వరకు కవర్ చేసిన వార్తా కథనాలు, వీడియో క్లింపింగ్‌ను ఎంట్రీ దరఖాస్తుతో పాటు జత చేసి పంపాలన్నారు.దరఖాస్తులను కె. వెంకట వేణు, డోర్ నంబరు 31-27-31/1, పావని పబ్లిక్ స్కూల్ ఎదురుగా, కూర్మన్నపాలెం, విశాఖపట్నం-530046, సెల్-9030246776, చిరునామాకు పంపాలని పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొయిలాడ పరశురాం పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములు(40ఎకరాలు)ను అడ్డగోలుగా ఖబ్జాకోరు విద్యాసంస్థ గీతం పూర్తిస్థాయి యూనివర్శిటీ కాదని, అది గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ అని ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు జెటి రామారావు తీవ్రంగా ఆరోపించారు. విశాఖలో ఎన్ఫోర్స్ మెంట్ కార్యాలయం వద్ద ఆయన మీడియతో మాట్లాడారు. గీతం అక్రమ ఆస్తుల విషయంలో ఈడీ ఇప్పటి వరకూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ట్రస్టుపేరుతో విద్యాసంస్థలను నడుపుతూ, హవాలా రూపంలో ఈ విద్యాసంస్థ నిధులను రప్పించు కోవడంతోపాటు విద్యార్ధుల దగ్గర నుంచి కూడాల ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తుందన్నారు. ఒక్కసారి గీతం విషయంలో యూజిసి ఏమని నోటీసులు ఇచ్చిందో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. లేదంటే రేపన్న రోజు ఆ సర్టిఫికేట్లు పనిచేయకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. అక్రమ విద్యా సంస్థ గీతం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేసినట్టుగా కేంద్రం ప్రభుత్వం ఒక్క చర్యకూడా తీసుకోలేదన్నారు. తక్షణమే ఈడీ గీతం అక్రమాస్తుల విషయంలో భూములు, ఆస్తులను అటాచ్ చేయాలన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకూ ట్రస్టు పేరుతో ఎగ్గొట్టిన ఇన్కం టాక్సులను కూడా రాబట్టాలన్నారు. గీతం అన్యాక్రాంతం చేసుకోవాలని చూసిన 40 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే ప్రైవేటు సాఫ్ట్ వేర్ సంస్థలకు గానీ, ఇళ్లు లేని నిరుపేదలకు ఆ భూములను ఇళ్లపట్టాల క్రింద మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గీతం టుబి డీమ్డ్ యూనివర్శిటీ విషయంలో సహకారం అందిస్తూ వస్తున్న అన్ని కేంద్ర శాఖలకు ఈ సంస్థ అక్రమాలపై ఫిర్యాదులు చేయడంతోపాటు, ఉద్యమాన్ని ముందుకి తీసుకెళతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కారెం వినయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 29వ తేదీన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ తెలిపారు. బుధవారం జె.సి. ఛాంబరులో సంబంధిత అధికారులతో సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు రాజాం మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. శాసన సభ్యులు కంబాల జోగులు ఈ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటి రకం పత్తిని క్వింటాలుకు రూ.5825 లు గాను, రెండవ రకం రూ. 5515 లు గాను నిర్ధారించినట్లు చెప్పారు. తేమ శాతం 8 నుండి 12 వుండాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలోతమ పేర్లను సి.ఎం.యాప్ ద్వారా రైతులు నమోదు చేసుకోవాలన్నారు. ముందుగా ఈ క్రాప్ లో నమోదు కావలసి వుంటుందన్నారు. పత్తి పండించే మండలాలలోని రైతులకు మండల వ్యవసాయ అధికారులు అవగాహన కలిగించాలని తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర వివరాలను డిస్ప్లే చేయాలని చెప్పారు. పత్తి రైతులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ ఎ.డి. బి.శ్రీనివాస రావు, అడిషనల్ ఎస్.పి. సోమశేఖర్, డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమీషనరు వడ్డి సుందర్, కాటల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ప్రవీణ్, అగ్రికల్చర్ ఎ.డి. సుధారాణి, రాజాం ఫైర్ ఆఫీసర్ ఎం.కె.ఎం.రాజు, కొత్తూరు ఫైర్ ఆఫీసరు ఐవి.రమణ, రాజాం మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ఈ నెల 29వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద గల రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ నూతనంగా నిర్మించిన భవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, శాసన సభాపతి తమ్మినేని సీతారాం, పశుసంవర్ధక శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజులతో కలసి హోమ్ మంత్రి ప్రారంభిస్తారని జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతోపాటు అగ్నిమాపక శాఖ మహా సంచాలకులు (డైరక్టర్ జనరల్) మహమ్మద్ హసన్ రెజా, అదనపు మహా సంచాలకులు పి.వి.సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్ జె నివాస్ ఇతర అతిథులు పాల్గొంటారని ఆయన వివరించారు.
చిత్తూరుజిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలో గవర్నమెంట్ బిసి బాయ్స్ హాస్టల్ ను మంజూరు చేయవలసిందిగా బిసి వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన వెలుగోపాలా కృష్ణ ను కలిసి నగిరి ఎమ్మెల్యే ఆర్కేరోజా వినతి పత్రం సమర్పించారు. మంగళవారం ఈమేరకు మంత్రి కార్యాలయంలో ఆయనను రోజా మర్యాదపూర్వకంగా కలిసి బిసి హాస్టల్ విషయమై ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో బిసి బాయ్స్ హాస్టల్ లేకపోవడం వలన ఎందరో నిరుపేద బిసిలు పట్టణ ప్రాంతాల్లో పెయిడ్ హాస్టల్స్ ఉండాల్సి వస్తుందన్నారు. బిసి బాయ్స్ యొక్క పరిస్థితిని అర్ధం చేసుకొని హాస్టల్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే ఆర్కేరోజా వినతిసై మంత్రి సానుకూలంగా స్పందించారని రోజా మీడియాకి వివరించారు. నగిరి నియోజకవర్గంలోని అభివ్రుద్ధి కార్యక్రమాలతో విద్యకు కూడా పెద్దపీ వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే హాస్టల్ విషయం మంత్రి ద్రుష్టికి తీసుకువెళ్లినట్టు రోజా వివరించారు. మంత్రిని కలిసిన వారిలో సినీ దర్శకులు, రోజా భర్త సెల్వమణి కూడా ఉన్నారు...
విశాఖ మహానగరాన్ని డస్ట్ బిన్ ఫ్రీ సిటిగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన కోరారు. మంగళవారం ఎఎంహెచ్‌వో, శానిటరి సూపర్‌వైజర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో ప్రజారోగ్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి వార్డు నుంచి ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల లోపు తప్పనిసరిగా డంపర్‌బిన్లును ఖాళీ చేయాలని, నిత్యం డంపర్‌బిన్లులో చెత్తను వేసేవారిని గుర్తించి వారికి జరిమానాలు విధించాలన్నారు. ప్రతి వార్డులో చెత్త సేకరణ చేసే ఆయా వాహనాల సమయంలో ఖచ్చితంగా బ్లూ, గ్రీన్, రెడ్ రంగుల బిన్లు ఉంచాలని, అలాగే వార్డులోని ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాలన్నారు. నగరంలోని దుకాణాల వద్ద తప్పనిసరిగా డస్ట్ బిన్‌లు ఉంచాలని, వాటిని ఏర్పాటు చేయనివారిపై జరిమానాలు విధించాలన్నారు. ప్లాస్టిక్ నివారణకు శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది కలసి దుకాణాలను తనిఖీ చేసి అమ్మకాలు చేసినట్లు గుర్తిస్తే వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. అలాగే నగరంలోని పలు హోటల్స్ సిబ్బంది నిత్యం వారి చెత్తను డంపర్‌బిన్లులలో వేస్తున్నారని, దీనిలో భాగంగా గెట్‌వే హోటల్ వారు వేస్తున్నట్లు గుర్తించామని, దీనికి రూ.25వేల రూపాయాలు జరిమానా విధించాలని సిఎంహెచ్‌వోను ఆదేశించారు. అంతేకాకుండా శానిటరి, సచివాలయ సిబ్బందితో పాటు, మెకానికల్ సిబ్బంది కూడా ప్రతిరోజు శానిటేషన్ పనులు, చెత్త తరలించే వాహనాలకు సంబంధించిన పనులపై దృష్టిసారించాలన్నారు. డంపర్‌బిన్లు నుంచి డంపిగ్‌యార్డ్ కు చెత్తను తరలించే వాహనాలకు ఖచ్చితంగా పై కవర్ కప్పి ఉంచాలని, లేనిట్లు కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా గాజువాక, పెందుర్తి, మధురవాడ ప్రాంతాల్లో పందుల బెడద ఉందని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వార్డుల్లో యూజీడి సర్వే పూర్తి చేయాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మీడియన్లు, గ్రీన్‌బెల్ట్ ప్రాంతాల్లో చెత్త, చెదారాలు లేకుండా చూడాలన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ప్రధమ స్థానమే లక్ష్యంగా పనిచేయాలని, ఓడబ్ల్యూఎంఎస్ స్కానింగు గేట్స్ తక్కువుగా ఉన్న 10 వార్డులను గుర్తించి ఆయా వార్డు శానిటరీ ఇన్స్పెక్టరులకు వివరణ కోరారు. మరల రిపీటు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సి.ఎమ్.ఓ.హెచ్. డాక్టర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి మాట్లాడుతూ జాబ్ చార్టు ప్రకారం ఉదయం 6గంటల నుండే శానిటరీ కార్యదర్శులు విధులలో ఉండాలని, డైరీలో ప్రతీ రోజూ చేసిన పని వివరాలు ఉండాలన్నారు. శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు, ఒక టీంగా కూర్చొని మైక్రో పోకెట్స్ వైజ్ పని వివరాలు చర్చించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసిరావు, సిఎంహెచ్‌వో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఎఎంహెచ్‌వోలు జయరాం, లక్ష్మీతులసి, రాజేష్, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖ మహానగరానికి ఎలాంటి ప్రక్రుతి వైపరీత్యాలు రాకుండా ప్రజలను చల్లగా చూడాలని శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి దీవించాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఎంపీ ఎంవివి సత్యన్నారాయణలు చెప్పారు. విశాఖ బీచ్ రోడ్డులోని నేవీ క్యాంటీన్ ఎదురుగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి ఆలయాన్ని మంగళవారం మత్సకారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, విశాఖలో కరోనా లాంటి విపత్తు మరోసారి రాకుండా గంగమ్మ కాపాతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కరుణతో మత్స్యకారులు శుభిక్షంగా ఉండాలని, వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా తోడుండే అవకాశం ఇవ్వాలన్నారు. చేపలవేటపైనే జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారన్నారు. ఇటీవల బిసిలకు ఏర్పాటు చేసిన కార్పోరేషన్ లలో కూడా మత్స్యకారులకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందనే విషయాన్ని వీరు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, దక్షిణ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు...
రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సేవలు అందించే నిమిత్తం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిందని వినూత్నమైన మార్పులు తీసుకువచ్చిందని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి మంగళవారం తన పర్యటనలో భాగంగా మక్కువ మండలం కవిరిపల్లి, మర్కండపుట్టి గ్రామాలలో గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులు, మక్కువ గ్రామంలో గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పనుల నిర్వహణలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చేపట్టాలన్నారు పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. అనంతరం మర్కొండపుట్టి గ్రామ సచివాలయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా ఆనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని సమయపాలన పాటించాలని అన్నారు. పిర్యాదుల సేకరణలో పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హజరుపట్టి, ప్రగతి నివేదికల పట్టిక పరిశీలించారు. వాలంటరీ వ్యవస్థను సక్రమంగా వినియోగించుకోవాలని హితవు పలికారు. ఈ పర్యటనలో RWS AE, రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ ఆధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
గర్భిణీ వసతి గృహాలలో గర్భిణిలకు మెరుగైన సేవలు అందించాలని పార్వతీపురం ఐటిడిఏ పీఓ ఆర్. కూర్మనాథ్ పేర్కొన్నారు. మంగళవారం ప్రాజెక్ట్ అధికారి తన పర్యటనలో భాగంగా సాలూరు వై.టి.సి.లో ఉన్న గర్భిణీ వసతి గృహం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా గర్భిలకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు, రోజువారీ మెనూ ప్రకారం వారికి ఆహారం అందజేస్తున్న వివరాలు పరిశీలించారు. వసతి గృహంలో వున్న మహిళలతో మాట్లాడుతూ మీకు వైద్య పరీక్షలు చేస్తున్నారా, మీకు సమయానికి ఆహారం అందిస్తున్నారు అలాగే మీకు అందిస్తున్న ఆహారం ఎలావుంటుంది అన్న వివరాలు ఆడీగి తెలుసుకున్నారు అలాగే మీకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయా. ఏమైనా సమస్యలు వుంటే తెలపండి సత్వరం పరిష్కరించ డం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ గర్భిణీలకు మెనూ ప్రకారం పోషక విలువల తో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ఏటువంటి పిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే గర్భిణీ వసతి గృహం లో ఉన్న వైద్యులు గర్భిణీలకు ఎప్పటి కప్పుడు కావలసిన వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించేయలని సంబంధిత మెడికల్ ఆఫీసర్స్ కి సూచించారు.
కేంద్ర విజిలెన్స్ కమిషన్(సివిసి) పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న అవినీతి వ్యతిరేక, భద్రతా అవగాహన వారోత్సవాలను మంగళవారం టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఉదయం సివిఎస్వో గోపినాథ్ జెట్టి ఆధ్వర్యంలో టిటిడి పరిపాలన భవనం వద్ద అన్ని విభాగాల ఆధిపతులు, ఉద్యోగులతో తాము అవినీతికి వ్యతిరేకంగా తాము సంస్థ ప్రయోజనాలు కాపాడుతూ పని చేస్తామని ఈవో ప్రతిజ్ఞ చేయించారు. ఉద్యోగులు, అధికారులు నైతిక ధోరణిని ప్రోత్సహిస్తూ, నిజాయితి, సమైక్యతతో పారదర్శక సేవలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అక్టోబరు 31న ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ వారోత్సవాలు నవంబరు 2వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, జెఈవోలు పి.బసంత్‌కుమార్, సదా భార్గవి,సిఇ రమేష్ రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, విజివో బాలిరెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.
భారతదేశంలో రైతు పక్షపాతి ప్రభుత్వమంటే అది వైఎస్ జగనన్న ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రైతులు శుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం ఆనందంగా వుందని నమ్మే సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన ఎందరో రైతులకు మేలు జరుగుతుదన్నారు. మంగళవారం పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో రైతు భరోసా రెండో విడత చెక్కుల పంపిణీ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లాలోని 3,41,003 రైతు కుటుంబాలకు వైస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ద్వారా 82 కోట్ల 4 లక్షల రూపాయలు పెట్టుబడి సహాయం ద్వారా అందించామన్నారు. అంతేకాకుండా జులై ఆగస్ట్ ,సెప్టెంబర్ నెలలో కురిసిన అధిక వర్షాలకు, గోదావరి వరదల వలన ఇబ్బంది పడిన 21,242 రైతు కుటుంబాలకు రూ 15 కోట్ల59 లక్షల ను పెట్టుబడి సహాయంగా కూడా అందించినట్టు వివరించారు. ప్రతి సంవత్సరం రైతు కుటుంబానికి రూ 13500 పెట్టుబడి సహాయం అందిస్తున్నామని 5 సంవత్సరాల లో మొత్తం పెట్టుబడి సహాయం రూ 67,500గా ఇవ్వనున్నామని చెప్పారు. శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు గారు,కోటారు అబ్బాయ్ చౌదరి, ఎమ్మెల్సీ రామ సూర్యారావు, జిల్లా డి.సి.సి.బి చైర్మన్ శ్రీనివాస్ ,జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు,జె.సి వెంకట రమణా రెడ్డి ,జేడీ అగ్రికల్చర్ గౌస్య భేగం తదితరులు పాల్గొన్నారు.