1 ENS Live Breaking News

ఆక్వా ప్రతిపాదనలు పరిశీలించాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఆక్వా పరిశ్రమ ఏర్పాటుకు వచ్చిన  ప్రతిపాదనలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లాలో ఆక్వా పరిశ్రమపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్షించారు. ఆక్వా పరిశ్రమ స్థాపనకు వచ్చిన దరఖాస్తులు వివరంగా పరిశీలించాలి. పరిశ్రమలకు ప్రతిపాదనలు వచ్చిన స్థలాల్లోను, సమీపంలోను తాగునీటి వసతులు, తదితర సౌకర్యాలు ఉంటే వాటికి కలిగే అవరోధాలు గుర్తించాలని ఆదేశించారు. కాలుష్యం ప్రభావం పరిశీలించాలని ఆయన అన్నారు. వినియోగించే ఆహార పదార్థాలు, ఆక్వా చెరువుల నుండి విడిచిపెట్టే నీటి మార్గాలు, తద్వారా కలిగే కాలుష్య ప్రభావం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సంతబొమ్మాలి, కవిటి, పోలాకి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, గార, సోంపేట, వజ్రపు కొత్తూరు మండలాల్లో 73.35 హెక్టార్లలో 85 నూతన ఆక్వా పరిశ్రమలను ఏర్పాటు చేయుటకు, సంతబొమ్మాలి, పోలాకి, శ్రీకాకుళం మండలాల్లో 9.50 హెక్టార్లలో గల 10 ఆక్వా పరిశ్రమలను రెన్యూవల్ చేయుటకు జిల్లా స్థాయి కమిటీలో పరిశీలించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, మత్స్యశాఖ ఇన్ ఛార్జ్ సంయుక్త సంచాలకులు పివి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె. శ్రీధర్, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ ఎస్.శంకర్ నాయక్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి జి.చక్రధర రావు, ఆక్వా పరిశ్రమల సంఘం ప్రతినిధి సురేంద్ర  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-10-13 18:54:31

అదనపు ఆయకట్టు అభివ్రుద్ధి..

శ్రీకాకుళం జిల్లాలో అదనపు ఆయకట్టు అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. చిన్న భూ సేకరణ సమస్యలు వలన ఆయకట్టు అభివృద్ధి ఆలస్యం జరగరాదని ఆయన పేర్కొన్నారు. వంశధార ప్రాంతంలో కొత్తూరు, భామిని మండలాలు, తోటపల్లి ప్రాజెక్టు క్రింద, హెచ్.ఎల్.సి క్రింద ఆయకట్టు అభివృద్ధి కావాలని ఆయన అన్నారు. అదనపు ఆయకట్టు, భూ సేకరణ పై  కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. హెచ్.ఎల్.సిని డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఇంజినీర్లు పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అన్నారు. భూ సేకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగరాదని ఆయన ఎస్డీసి లను ఆదేశించారు. తోటపల్లి ప్రాజెక్టు క్రింద 27 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందాలని అందుకు అవసరమైన భూ సేకరణ వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వంశధార ఎస్ఇ డోల తిరుమల రావు మాట్లాడుతూ హై లెవెల్ కెనాల్ ద్వారా 5 వేల ఎకరాలను స్థిరీకరణతో పాటు కొత్తగా 15 వేల ఎకరాలకు ప్రతిపాదనలు పెట్టామన్నారు. 5 వేల ఎకరాలకు 10 డిస్త్రిబ్యూటరీలు ఉన్నాయని చెప్పారు. 39 ఎకరాలు భూ సేకరణ కావలసి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్,  జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, సర్వే సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, ఎస్డీసిలు బి.శాంతి, కాశీవిశ్వనాథ్, జి.సుజాత తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-10-13 18:50:07

పోరాటాలతో పనిలేకుండానే సాగు హక్కులు..

ఏ పోరాటాలు చేయకుండా, ఎవరూ అడగకుండానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, అడగకుండానే అన్నీ ఇస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గిరిజనులను తన కుటుంబ సభ్యులుగా గౌరవిస్తున్నారని, అయితే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ల పాటు గిరిజనులకు కనీసం మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా అవమానించారని విమర్శించారు.  గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో మంగళవారం కురుపాం నియోజకవర్గ స్థాయిలో గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్, డీకేటీ పట్టాలను ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, కొండ కోనల్లో  అడవిని నమ్ముకొని బతికే గిరిపుత్రలకు వారు సాగు చేసుకొనే భూములకు పట్టాలు లేక కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా  గిరిజన పక్షపాతి అయిన అప్పటి ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి 2008లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఇచ్చారని,  వైయస్సార్ ను తన గుండెల్లో పెట్టుకొని గిరిజనుల పట్ల అదే ఆదరణతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తాను గిరిజన పక్షపాతి అని నిరూపించుకున్నారని చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్  పథకంలో పట్టాలు ఇచ్చే విషయంగా సీఎం నిర్వహించిన తొలి సమీక్షా సమావేశంలో అధికారులు ముందుగా 10 వేల మందికి 50 వేల ఎకరాలకు మాత్రమే పట్టాలను ఇస్తామని చెప్తే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదని తెలిపారు. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షా సమావేశల్లో  మళ్లీ 50 వేల మందికి లక్ష ఎకరాలను ఇస్తామన్నా ఒప్పుకోకుండా 3 లక్షల ఎకరాలు 1.5 లక్షల మందికి ఇవ్వాల్సిందే అని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పడంతో అక్టోబర్ 2న 1.65 లక్షల మందికి 3 లక్షల ఎకరాలకు పట్టాలను ఇవ్వగలిగామని వివరించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కోసం దరఖాస్తు చేసుకొనే గిరిజనులకు అన్ని అర్హతలు ఉన్నా వారి దరఖాస్తులు తిరస్కరణకు గురికావడానికి కారణం వారు అటవీ భూముల్లో కాకుండా రెవెన్యూ భూములలో పోడు సాగు చేయడమేనని తెలుసుకున్న ముఖ్యమంత్రి రెవెన్యూ భూములలో సాగు చేసుకుంటున్న గిరిజనులకు కూడా డీకేటీ పట్టాలను ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కూడా  జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి 45 వేల ఎకరాల దాకా పట్టాలను ఇవ్వడం జరుగుతోందన్నారు. కురుపాం నియోజకవర్గం 12429 మంది గిరిజనులకు లో 21 వేల ఎకరాలను పట్టాలుగా ఇవ్వడం జరుగుతోందని పుష్ప శ్రీవాణి వివరించారు. అయితే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా భూమి పట్టాలను అందించడం ఒక నామమాత్రపు కార్యక్రమం కాకూడదని, ఒక చిన్న కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి బతకాలంటే కనీసం 2 ఎకరాల భూమి ఉండాలని,  అంతకంటే తక్కువ భూమి ఉంటే దానిపై వచ్చే ఆదాయం వారి జీవనావసరాలకు సరిపోయే అవకాశం లేదన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయమని పుష్ప శ్రీవాణి చెప్పారు.  ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఒక్కో గిరిజన కుటుంబానికి ఇచ్చే భూమి 2 ఎకరాలకు తక్కువ కాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇదివరకే 2 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన కుటుంబాలకు వారి భూమి 2 ఎకరాలకు తక్కువ కాకుండా ఉండేలా అదనంగా భూమి పట్టాలను  ఇవ్వడం జరుగుతోందని విపులీకరించారు. ఇప్పుడు భూమి పట్టాలను అందుకుంటున్న గిరిజనులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని వర్తంపజేయాలని కూడా సీఎం ఆదేశించారని తెలిపారు. టెలిఫోన్ సిగ్నల్ కూడా సరిగా ఉండని పాడేరులో 500 కోట్ల రుపాయలతో గిరిజన వైద్యకళాశాలను నిర్మాణాన్ని చేపట్టడం, మిగిలిన ఐటీడీఏలకు కూడా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను మంజూరు చేయడం, రాష్ట్రంలో మారుమూలన ఉన్న కురుపాం నియోజకవర్గంలో 153 కోట్ల రుపాయలతో  గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణాన్ని మంజూరు చేయడం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు.    గిరిజనులను చంద్రబాబు అవమానించారు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులు తన సొంత కుటుంబ సభ్యులని గౌరవిస్తే, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అనుచితమైన వ్యాఖ్యలతో గిరిజనులను అవమానించారని విమర్శించారు. తాను అధికారంలో కొనసాగిన ఐదేళ్ల కాలంలో సుమారు నాలుగురేళ్ల పాటు గిరిజనులకు తన మంత్రి వర్గంలో స్థానం కూడా ఇవ్వలేదని పుష్ప శ్రీవాణి ధ్వజమెత్తారు. గతంలో గిరిజనులకు, గిరిజన ప్రాంతాలకు ఏ అభివృద్ధి కావాలన్నా పోరాటాలు చేయాల్సి వచ్చేదని ప్రస్తావించారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరూ ఎలాంటి పోరాటాలు చేయకుండానే, ఎవరూ అడగకుండానే గిరిజనులను, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని కితాబిచ్చారు.

గుమ్మలక్ష్మీపురం

2020-10-13 15:19:54

8 మందికి కారుణ్య నియామ‌కాలు..

విజ‌య‌న‌గ‌రం  జిల్లాలో 8 మందికి కారుణ్య నియామ‌కాలు జ‌రిపారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఉద్యోగం చేస్తూ మ‌ర‌ణించిన వారి వార‌సుల‌కు ఉద్యోగాలు ఇచ్చి, వారి కుటుంబాల‌కు ఆస‌రా క‌ల్పించారు. వారి వార‌సుల విద్యార్హ‌త‌ల‌ను బ‌ట్టి, వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల ఆధారంగా పోస్టుల‌ను కేటాయించారు. ఈ పోస్టుల‌కు సంబంధించి త‌న ఛాంబ‌ర్‌లో అభ్య‌ర్థుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ముందుగా కౌన్సిలింగ్ నిర్వ‌హించారు. ఖాళీల‌ను బ‌ట్టి, వారు ఏ శాఖ‌లో చేరుతారో, ఏ ప్రాంతంలో విధులు నిర్వ‌హించ‌డానికి సిద్దంగా ఉన్నారో తెలుసుకున్నారు. అనంత‌రం వారికి ఉద్యోగ నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశారు.               బి.గౌరీకుమారిని ఆఫీస్ స‌బార్డినేట్‌గా, ఎం.చైత‌న్య‌వ‌ర్మ‌, యంద‌వ అజ‌య్‌కుమార్, ‌ తాడంగి పృధ్వి, పిజి సాయిధీర‌జ్‌, సోము మౌనిక‌, స‌వ‌ర‌పు రాజ్‌కుమార్‌, కె.సుధీర్‌బాబుల‌ను  జూనియ‌ర్ అసిస్టెంట్లుగా నియ‌మిస్తూ నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌రేట్ ఏఓ దేవ్‌ప్ర‌సాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-10-12 19:50:33

జర్నలిస్టుల సంక్షేమమే ప్రెస్ అకాడమీ లక్ష్యం..

జర్నలిస్టుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ లక్ష్యమని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పేర్కొన్నారు . జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు . సోమవారం వైజాగ్ జర్నలిస్టు ఫోరం నిర్వహించిన మీద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫేక్ జర్నలిస్టుల తొలగింపు ప్రస్తుతం జరుగుతుందన్నారు . ఆ తరువాత జర్నలిస్టుల సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆయన వెల్లడించారు . జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ జాప్యంకు అది కూడా ఒక కారణం అన్నారు . వీజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పలు విషయాలను ప్రస్తావించారు . పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలి చ్చారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ ప్రభుత్వం కోసమో , ప్రభుత్వం తరపునో పనిచేస్తుందని భావించవద్ద న్నారు . గతంలోని ప్రెస్ అకాడమీ చైర్మన్లు వారి కారణాల దృష్ట్యా జర్నలిస్టులకు మేలు పూర్తిగా చేసి ఉండకపోవచ్చని , తాను జర్నలిస్టుగానే మెలిగిన జర్నలిస్టుల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా మంచి చేయాలనే తలంపుతోనే ఉన్నట్లుగా శ్రీనాథ్ వెల్లడించా రు అందులో భాగంగానే తాను ఛైర్మన్ అయ్యాక జర్నలిస్టులకు శిక్షణా తరగతులు కోవిడ్ దృష్ట్యా జూమ్ లోనే మొదట విశాఖ పట్నం లోనే నిర్వహించానన్నారు . ఇక్కడి జర్నలిస్టులు బాగా స్పందించి సహకరించారన్నారు . రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకూ వర్తింపజేసి , తిరిగి ప్రత్యక్షంగా కలసే ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు . జర్నలిస్టుల సమస్యలన్నిటి పట్లా తాను అందు బాటులో ఉంటానని , అకాడమీ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు . నైపుణ్యం ఉంటేనే జర్నలిస్టులు ఇప్పుడు న్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే రాణింపు సాధ్యమవుతుందన్నారు . ఆ దశగా శిక్షణ నిపుణులతో జర్నలిస్టులకు ఇప్పించే ప్రక్రియ జరుగుతుందన్నారు . ఇందులో భాగంగా పలు పుస్తకాలను జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా ముద్రించి సిద్ధం చేసామని చెప్పారు . జర్నలిస్టులు రాసే వార్తాంశాలు నిజ నిర్ధారణ చేసుకునే రాయాలని , ఫేక్ కథనాలు కూడదన్నారు . వివిధ శాఖలు అందించే పథకాలను , వాటిని జర్నలిస్టులు ఉపయోగించుకుని వార్తాంశాలు మలచుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్ సైట్ను రూపొందించి అందుబాటులోకి తెస్తున్నట్లుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ప్రకటించారు . ఇది గ్రామీణ జర్నలిస్టులకు అత్యంత ప్రయోజనకరం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు . జర్నలిస్టు యూనియన్ల మధ్య పోరాట ధోరణి , వ్యతిరేక ధోరణి ఉండడం వల్ల జర్నలిస్టులు నష్టపోతున్నారని ఆయన చెబుతూ వైజాగ్ జర్నలిస్టు ఫోరంలా యూనియన్లకు అతీతంగా కలిసి కార్యక్రమాలు చేసుకోగలిగితే సంక్షేమం సాధించుకోవడం కష్టం కాదన్నారు . వీజేఎఫ్ యూనిటీని ఇతర జిల్లాల ప్రెస్ క్లబ్ లకూ తాను ఉదాహరణగా వివరిస్తానని చెప్పారు . బోగస్ జర్నలిస్టులను ఏరివేస్తే , తాను జర్నలిస్టులకు మంచి చేసేందుకు సిద్ధమేనని తన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి స్పందించారని , ప్రస్తుతం ఫేక్ జర్నలిస్టుల ఏరివేత జరుగుతుందన్నారు . అందువల్లనే అక్రిడేషన్ల మంజూరులో జాప్యం జరుగుతుందని దేవిరెడ్డి శ్రీనాథ్ స్పష్టం చేశారు . జర్నలిస్టుల ముసుగాలో జరుగుతున్న దందాలను తొలగిస్తా మన్నారు . టెక్నాలజీ దాడి నుంచి జర్నలిస్టులు రక్షించుకోవడానికి తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించారు.  సభకు అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కోడ్లో విశేష సేవలందించిన జర్నలిస్టులనూ కోవిడ్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించేలా ప్రెస్ అకాడమీ చైర్మన్ కృషి చేయాలని కోరారు . హెల్తు ఇన్సూరెన్సు  రూ .50 లక్షల రూపాయలు వర్తించేలా దోహదపడాలని కోరుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు మంజూరు జరిగేలా ప్రభుత్వంను ప్రెస్ అకాడమీ చైర్మన్ సహకరించాలని ప్రతిపాదించారు . వైజాగ్ జర్నలిస్టు ఫోరం దేశంలోని ఇతర ప్రెస్ క్లబ్ లకు ఆదర్శంగా జర్నలిస్టుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాద్ కు వివరించారు . అందరి సహకారంతో 11 దేశాల్లో ఏజేఎఫ్ సన్నిహిత సంబంధాలు , కార్యకలాపాల అనుసంధానం ఉందన్నారు . దేశ వ్యాప్తంగా ఉన్న ప్రెస్ క్లబ్లతో ఉన్న అనుసంధానం చివరించారు . వీజేఎఫ్ కార్యదర్శి ఎస్.దుర్గారావు మాట్లాడుతూ వివిధ జిల్లాల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులతో నిర్వహించిన , నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లు వంటివి ఛైర్మన్ ముందు ఆవిష్కరించారు . ఇక మీదట జరిగే క్రీడల్లో శ్రీనాథ్ స్వయంగా పాల్గొని ఆశీర్వదించాలని కోరారు . కార్యక్రమంలో భాగంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ను ఉచిత రీతిన సత్కరించారు.  వీజేఎఫ్ ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టి . నానాజీ , జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్ , కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు , ఎంఎస్ఆర్ ప్రసాద్ , దివాకర్ , వరలక్ష్మి గయాజ్ , శేఖరమంత్రి తదితరులు పాల్గొన్నారు . కార్యక్రమంలో భాగంగా ఆడీడీ మణిరామ్ , డీపీఆర్‌వో వెంకట రాజు గౌడు వీజేఎఫ్ సభ్యులు ఉచిత రీతిన సత్కరించారు .

విజెఎఫ్ ప్రెస్ క్లబ్

2020-10-12 19:41:04

ఎరువుల అధిక నిల్వలపై కేసులు పెట్టండి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అత్య‌ధికంగా ఎరువుల‌ను కొనుగోలు చేసిన 20 మందికి జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్‌కుమార్ జరిమానా విధించారు.  అదేవిధంగా ఆగ‌స్టు నెల‌లో కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా, ఎరువుల‌‌ను ఈ-పోస్ విధానం ద్వారా అధికంగా కొనుగోలు చేసిన‌, విక్ర‌యించిన వారిని గుర్తించి, ఆయా మండ‌లాల వ్య‌వ‌సాయాధికారుల స‌మ‌క్షంలో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సోమ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ విచారించారు. అనుమ‌తించిన ప‌రిమితి కంటే అధికంగా ఎరువుల‌ను కొనుగోలు చేయ‌డం, వినియోగించ‌డం చ‌ట్ట‌రీత్యా నేర‌మ‌ని ఈ సంద‌ర్భంగా జెసి స్ప‌ష్టం చేశారు. ఇలా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన కొనుగోలు దారులు, డీర్ల‌కు రూ.15వేలు నుంచి 20 వేలు వ‌ర‌కూ జ‌రిమానా విధించారు. ఇక‌ముందు ఎవ‌రైనా నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఎరువుల‌ను కొనుగోలు చేసినా, విక్ర‌యించినా, వ్య‌వ‌సాయేత‌ర కార్య‌క్ర‌మాల‌కు వినియోగించినా వారి లైసెన్సుల‌ను ర‌ద్దు చేయ‌డ‌మే కాకుండా, అత్య‌వ‌స‌ర స‌రుకుల చ‌ట్టం క్రింద‌, వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని జెసి హెచ్చ‌రించారు. ఈ విచార‌ణ‌లో వ్య‌వ‌సాయ‌శాఖ జాయింట్ డైరెక్ట‌ర్ ఎం.ఆశాదేవి, డిప్యుటీ డైరెక్ట‌ర్ ఆనంద‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-10-12 19:17:00

బాలల సంరక్షణకు సత్వర చర్యలు..

బాలల హక్కుల పై అందిన ఫిర్యాదులకు సత్వరమే స్పందించాలని  సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు.   జాతీయ బాలల హక్కుల కమిషన్ ఫిర్యాదుల  పై ఆయన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సోమవారం జే.సి సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా శాఖల వారీగా ఉన్న కేసు లను సమీక్షించారు. అనంతరం  మాట్లాడుతూ ప్రతి శాఖలో బాలల హక్కుల పై వచ్చే ఫిర్యాదులను, వినతులను స్వీకరించి చర్యలు తీసుకొనుటకు ఒక ఉద్యోగిని ఇంచార్జ్ గా  డిసిగ్నేట్ చెయ్యాలన్నారు.   ప్రతి ఫిర్యాదుకు తక్షణమే స్పందించి జవాబు రాసి ఢిల్లి లోని ఉన్నతాధికారులకు పంపుతూ ప్రతిని జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ లకు ఐ.సి.డి.ఎస్. పి.డి కు పంపాలని సూచించారు. ఆగష్టు 8 న బాలల హక్కుల కమిషన్ నిర్వహించిన బెంచ్ వద్ద 134 ఫిర్యాదులు విచారణకు వచ్చాయని, వాటిలో 123 వినతులకు యాక్షన్ టేకెన్   రి పోర్ట్ ను పంపడం జరిగిందన్నారు.  మిగిలినవి కూడా ఆయా శాఖలు వెంటనే పంపాలని   అన్నారు.     విద్యా శాఖకు సంబంధించి  టాయిలెట్స్,  తాగు  నీరు, ప్రహరి గోడలు, క్రీడా పరికరాల కోసం ఎక్కువగా వినతులు అందాయని, వాటిని నాడు- నేడు క్రింద పరిష్కరించడం జరుగుతోందని జిల్లా విద్యా శాఖా దికారి జి. నాగమణి తెలిపారు.   విద్యా సంస్థల సమీపంగా మద్యం దుకాణాలు ఉన్నాయనే ఫిర్యాదు అందిందని, రాష్ట్ర నిబంధనలను అనుసరించి వాటిని తనిఖీ చేసి తొలగిస్తామని ఎక్సయిజ్ అధికారులు తెలిపారు.  ఈ సమావేశం లో ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి,  మున్సిపల్ కమీషనర్ వర్మ, జిల్లా సరఫరా అధికారి పాపా రావు, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి లక్ష్మి, ఆర్టిసి , పోలీస్, సాంఘిక సంక్షేమ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.  

కలెక్టరేట్

2020-10-12 19:04:50

ల్యాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ సత్వరం జరగాలి..

చిత్తూరు జిల్లాలో ల్యాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సచివాలయ సర్వేయర్ వారి పరిధిలోని వి.ఆర్.ఓ., సహకారంతో రోజుకొక్క సర్వే వంతున నిర్దేసించి  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కార్యలయం నుండి డివిజన్ స్థాయి అధికారులతో, తహసీల్దార్లతో , సచివాలయ సర్వేయర్లతో లాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ , మీసేవ , సచివాలయ ధరఖాస్తుల పెండింగ్ , ఇంటిపట్టాల కోసం లేఔట్స్ , నవశకం కార్డుల పంపిణీ పై జిల్లా కలెక్టర్ వీడియోకాన్ఫెరెన్స్ నిర్వహించగా ఆర్డీఓ కనకనరసా రెడ్డి పాల్గొన్నారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సర్వే నెంబర్ పరిశీలించి లాండ్ రికార్డ్స్ ఖచ్చితంగా తయారు కావాలని అందుకోసం సచివాలయం సర్వేయర్లు తమ పరిధిలోని సర్వే నెంబర్లను గుర్తించి రోజుకొక్క సర్వేపూర్తిచేయాలని అన్నారు. అందుకు సంబంధించిన ప్రత్యేక  ప్రోఫార్మా పంపించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగపరిష్కారం , డాక్యుమెంట్ల పరిశీలన, వున్న లాండ్ వివరాలు , చనిపోయివుంటే  గ్రామసభలో గుర్తించి నామినీలకు హక్కు కల్పించడం వంటివి గుర్తించి సరిచేయాల్సి వుంటుందని అన్నారు. రేణిగుంట – నాయుడుపేట , కడప-బెంగళూరు బ్రాడ్ గేజ్ , జాతీయా రహదారుల భూసేకరణ పెండింగ్ అంశాలు దృష్టి పెట్టి పూర్తిచేయాలని సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. ఇక ఇంటిపట్టాల విషయంలో అదనంగా  మరో 7 వేల వరకు అర్హతగల  జాబితా వుందని, వీరికూడా లేఔట్ సిద్దం కావాలని అందుకు కావలసిన భూసేకరణ ప్రతిపాధనలు పంపాలని అన్నారు. ఇంటి పట్టాలకు కోసం చిత్తూరు డివిజన్ లో 141 లేఔట్లకు గానూ 41 పెండింగ్ , మదనపల్లి 545 లేఔట్లకు గానూ 120 , తిరుపతి 281 లేఔట్లకు గానూ 22 ఆన్ లైన్ నమోదు జరగలేదని, పెండింగ్ వుంటే త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అంగన్ వాడి, సచివాలయాలకు, రైతు బారోసా కేంద్రాలకు పెండింగ్ లో వున్న  సైట్ లను త్వరగా క్లియర్ చేసి అందించాలని అన్నారు.  ఏపీఐఐసీ లాండ్స్, జాతీయ రహదారులలాండ్స్ కూడా నమోదు కావాలని అన్నారు.  మీసేవా, సచివాలయ ధరఖాస్తుల పెండింగ్ పై దృష్టి  పెట్టి పరిష్కరించాలని, మీ సేవా కన్నా, సచివాలయాలల్లో  ధరఖాస్తుల నమోదు పెరగాలని  అన్నారు. నవశకం రేషన్ కార్డుల పరిష్కారం 94.9 శాతం , స్ప్లిట్ కార్డుల పరిష్కారం 95.3 శాతంగా ముందున్నా పంపిణీలో ఆలస్యం వుందని రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.           చిత్తూరు నుండి జెసి మార్కండేయులు , డిఆర్ఓ మురళి లాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ పై , సర్వే చేపట్టాలసిన  విధానం పై తహసీల్దార్లకు సూచించగా, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, చిత్తూరు ఆర్డీఓ రేణుక పాల్గొనగా, అన్నిమండల కార్యాలయాల నుండి తగసిల్దార్లు, సచివాలయ వి ఆర్ ఓ లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-10-12 18:59:13

వర్షంలోనే కమీషనర్ సహాయక చర్యలు..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో తుఫాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వరమే సంరక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ వరద నీరు బ్లాక్ అయిన చోట్ల దగ్గరుండి మరీ పనులు చేయించారు.హోరున వర్షం కురుస్తున్నప్పటికీ వడివడిగా అడుగులు వేసుకుంటూ ముఖ్యమైన ప్రాంతాలను తిరిగి సత్వర చర్యలను పరిశీలించారు. అనంతరం 2, 3, 4, 5 జోన్ల  లోని చావులమదుం, ఎర్రగడ్డ, షీలానగర్, గురుద్వారా జంక్షన్ తదితర ప్రాంతాలను పరిశీలించి అవసరం ఉన్నచోట యుద్ధ ప్రాతిపదికన మోటారులను ఉపయోగించి నీరు నిల్వలేకుండా చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా చావులమదుం వద్ద నీరు నిల్వలేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం నాల్గవ జోన్ లోని ఎర్రగడ్డను పరిశీలించి గడ్డలోని చెత్తను తొలగించి నీరు సముద్రంలోకి వెళ్ళే మార్గంను పోర్టు అధికారులతో సంప్రదించి తగుచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయిదవ జోన్ లోని షీలానగర్ వద్ద హరిజన జగ్గయ్యపాలెం ముంపునకు గురియైనందున యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ముంపుకు  కారణమైన కల్వర్టును తాత్కాలికంగా తొలగించి, హైవేపైకి నీరు చేరకుండా, శాస్వత ప్రతిపాదనలను సిద్దం చేయాలని పర్యవేక్షక ఇంజినీరులను ఆదేశించారు. గురుద్వారా జంక్షన్ వద్ద ఈపీడీసీఎల్ చేపడుతున్న భూగర్భ కేబుల్ పనులలో భాగంగా కల్వర్టు కింద ఉన్న ఇసుక బస్తాల వలన నీరు హైవేపైకి చేరినందువల్ల వెంటనే ఇసుక బస్తాలను తొలగించి నీరు పోయే ఏర్పాటు చేయాలని, భూగర్భ కేబుల్ గుత్తేదారునికి జరిమానా విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్లు శ్రీనివాస రావు, బి. సన్యాసినాయుడు, పి. సింహాచలం, శ్రీధర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజనీర్లు  గణేష్ బాబు,  శ్యాంసన్ రాజు, ఏ.ఎమ్.హెచ్.వో జయరాం, ఏ.సి.పి.లు అమ్మాజీ, హరిబాబు, కార్యనిర్వాహక ఇంజనీర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

చావులమదుం

2020-10-12 18:39:35

డయల్ యువర్ కమిషనర్ కి 23 ఫిర్యాదులు

 జి.వి.ఎం.సి.  ప్రధాన  కార్యాలయం  సమావేశపు  మందిరం నుంచి డయల్ యువర్ కమిషనర్ ప్రోగ్రామును ఉప కమిషనర్ (రెవెన్యూ) ఫణిరాం టోల్ ఫ్రీ నం.1800-4250-0009 ద్వారా ఉదయం 10.00 గం. నుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించారు. స్వీకరించిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులను/జోనల్ కమిషనర్లకు పంపించారు. ఇందులో ఒకటవ జోనుకు సంబందించి 05, రెండవ జోనుకు సంబందించి 04, మూడవ జోనుకు సంబందించి 05, నాల్గవ జోనుకు సంబందించి 05, అయిదవ జోనుకు సంబందించి 01, ఆరవ జోనుకు సంబందించి 02, ఎడవ  జోను(అనకాపల్లి)కు సంబందించి 01,  మొత్తము 23 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనరు వి. సన్యాసి రావు, జాయింట్ డైరెక్టర్ (అమృత్) విజయ భారతి, అసిస్టెంట్ డైరెక్టర్(ఉద్యాన శాఖ) ఎం. దామోదర రావు తదితరులు పాల్గొన్నారు. 

జివిఎంసి కార్యాలయం

2020-10-12 18:35:37

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు.  ప్రభుత్వం, ప్రతిపక్షం, అధికారయంత్రాంగం సమన్వయంతో కలిసి నడిస్తేనే సమగ్రమైన మంచి పాలన ప్రజలకు అందుతుందని అన్నారు.  సోమవారం జలుమూరు మండలం శ్రీముఖలింగం, సారవకోట మండలాల్లో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీముఖలింగంలో ఆయన మాట్లాడుతూ పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ప్రభుత్వం భావించిందని అన్నారు. దానికి కొంత మంది వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే దానిని కూడా కోర్టుల వరకు తీసుకువెళ్లారని తద్వారా ఆలస్యం జరుగుతుందని అన్నారు.  పేద ప్రజల అవసరాల పట్ల సరైన దృష్టి ఉండాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల దగ్గరికే అనునిత్యం పరిపాలన అందుబాటులో ఉండేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ విధానం దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సారవకోటలో మాట్లాడుతూ ఒకప్పుడు తాను ఈ స్కూల్లోనే చదువుకున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎవరికి ఏమిటి అవసరమో సక్రమంగా గుర్తించి వారికి సంక్షేమ పథకాలను  సమర్ధవంతంగా అందజేస్తున్నామని అన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు విద్య కానుకలు ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేనే లేదన్నారు. ఈ విద్యా కానుకను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోర్, డిప్యూటీ డీఈఓ జి.పగడాలమ్మ, తహశీల్దారు రాజ్ మోహన్, ప్రత్యేక అధికారి నీలాద్రి, ఎంపీడీఓలు ఈశ్వరరావు, జి. శ్యామలకుమారి, తహశీల్దారు శ్రీనివాసరావు, స్థానికులు  కూర్మినాయుడు, రామకృష్ , మండే రాంబాబు, ఎం .శ్యామలరావు, మాజీ వైస్ ఎంపీపీ టి .ధనలక్ష్మి, అల్లాడ పీఏసీఎస్ అధ్యక్షుడు లుక్కా లక్ష్మణరావు, స్కూలు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుంటా సింహాచలం, తమ్మన్నగారి రమణ, ఐస్ రమణ, కె హరి ప్రసాద్, లాడి రమేష్, వాన గోపి తంగి మురళీకృష్ణ, ధర్మాన జగన్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-10-12 18:21:50

ఆత్మహత్యపై నివేదిక సమర్ఫణ..

అనంతపురం కలెక్టరేట్లో నార్పల మండలం గూగుడు గ్రామానికి చెందిన ఎన్. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై డీఆర్డీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ తో ఆరా తీసి, నివేదికను సమర్పించాల్సిందిగా  జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు.  ఈ మేరకు డిఆర్డిఎ పిడి నర్సింహారెడ్డి వాస్తవ నివేదిక ను సమర్పించారు. పీడీ కథనం మేరకు.. నార్పల మండలం గూగుడు గ్రామం లో ఆంజనేయస్వామి సంఘం- 2 లో  ఆత్మహత్య చేసుకున్న ఎన్.రాజశేఖర్ రెడ్డి తల్లి ఎన్.రామలక్ష్మి,  భార్య అయిన ఎన్.రుక్మిణి ఇద్దరూ సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘానికి 21-06- 2017 లో  ఐదు లక్షల రూపాయల రుణం మంజూరు అయింది.. ఈ  మొత్తం లో  గ్రూప్ లో ఉన్న పది మంది సభ్యులకు 50 వేల రూపాయల చొప్పున వాటా రాగా,  అత్తా, కోడళ్లు అయిన ఎన్.రామలక్ష్మి, ఎన్.రుక్మిణి లు ఒకే ఇంట్లో ఉంటూ గ్రూప్ లో సభ్యులుగా ఉన్నందువలన ఇద్దరూ రుణం తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టమవుతుందని భావించి రామలక్ష్మి రుణం తీసుకోలేదు.  రామలక్ష్మి రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపనందున అదే సంఘంలోని సభ్యురాలు అయిన సి. లక్ష్మీదేవి అనే ఆమె తన వాటాగా వచ్చిన రూ.50 వేల రుణంతో  పాటు రామలక్ష్మి రుణం రూ.50 వేలు కూడా  కలుపుకుని లక్ష రూపాయల రుణం తీసుకుని, ఇందుకు సంబంధించిన రుణం వాయిదా మొత్తాలను ప్రతి నెల తిరిగి చెల్లిస్తోంది.. ఈ క్రమంలో  ఈ ఏడాది 11 -09- 2020 తేదీన వైయస్సార్ ఆసరా పథకం కింద మొదటి విడత రుణమాఫీ కింద ఆంజనేయ స్వామి సంఘం - 2  బ్యాంకు ఖాతాలో 40,133 రూపాయల నగదు జమ అయింది..ఇందులో 4 వేల రూపాయల చొప్పున ప్రతి సంఘం సభ్యులకు చెల్లించారు. రామలక్ష్మి రుణం వాటా కూడా లక్ష్మీదేవి తీసుకుని తిరిగి చెల్లించినందున లక్ష్మీదేవికి రూ. 8 వేల రూపాయలు ఇచ్చారు. తన తల్లి రామలక్ష్మి కి 50 వేల రూపాయల రుణం వచ్చిందని, ఆమె రుణం తీసుకోకపోయినప్పటికీ  ఆమె వాటాగా వచ్చిన 4 వేల రూపాయల నగదును ఇవ్వాలని మృతుడు ఎన్. రాజశేఖర్ రెడ్డి లక్ష్మీదేవి వద్దకు వెళ్లి పట్టుపట్టాడు.. కానీ  తానే  రుణం  తీసుకుని, రుణం వాయిదా కూడా తానే తిరిగి చెల్లిస్తున్నాను, కనుక 4 వేల రూపాయలను ఇవ్వనని లక్ష్మీదేవి అతనికి తెలియజేసింది. తమకు  డబ్బు ఇవ్వలేదనే  కారణంతో ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని డిఆర్డిఎ పిడి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు..

కలెక్టరేట్

2020-10-12 15:36:55

నాణ్యమైన ఉచిత విద్య ప్రభుత్వ లక్ష్యం..

నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధానన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావు అన్నారు. సోమవారం జి. వి. ఎం. సి. పరిధిలోని పెద వాల్తేరు  కె. డి. పి. ఎం. ఉన్నత  పాఠశాలలో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో  మంత్రి  పాల్గొని  విద్యార్థిని, విద్యార్థులకు  కిట్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా తయారు చేశామని వివరించారు. విద్యార్ధులకు ఉన్నతమైన విద్య అందించడానికి సీఎం వైఎస్ జగన్ క్రుతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. విద్యార్ధులకు ఇంగ్లీషు మీడియం విద్యను అందించి, వారి భవిష్యత్తుకు బాటలు వేసి, వారిని ప్రయోజకులుగా తయారు చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ సంకల్పమన్నారు. ప్రజలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి, మంచి ప్రయోజకులుగా మలుచకోవాలన్నారు. అన్ని వసతులు వినియోగించుకొని ఇంగ్లీషు మీడియం విద్యను అభ్యసించాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశాఖ మహానగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2020-10-12 14:16:56

ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి..

స్పందన దరఖాస్తులపై అన్నిశాఖ అధికారులు సత్వరమే స్పందించి ప్రజల అర్జీలకు న్యాయం చేయాలని డీఆర్వఓ బలివాడ దయానిధి అధికారులను ఆదేశిం చారు.  సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 112  వినతులు వచ్చాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖకు చెందినవి 25  కాగా, పౌర సరఫరాల శాఖవి 16, ఇతర శాఖలకు  సంబంధించి 71 వినతులు ఉన్నాయని తెలిపారు. కరోనా  నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి  ఫోన్ చేసి  112 మంది తమ ఫిర్యాదులను తెలియజేసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎన్. అప్పారావు, స్పందన విభాగం  సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు,  తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-10-12 14:13:24

2020-10-12 14:03:27