1 ENS Live Breaking News

బొలిశెట్టిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాల్సిందే..

పాయకరావుపేట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గొల్లబాబూరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖజిల్లా దళిత సంఘాల సమాఖ్య వేదిక కన్వీనర్ డా.బూసి వెంటకరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విశా ఖలో మీడియాతో మాట్లాడుతూ, దళిత ఎమ్మెల్యే అయిన బాబూరావుపై ఒక మాజీ ఎంపీటీసీ ఇష్టానుసారం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలను ఐక్యవేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే బొలిశెట్టి గోవిందరావుపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా  ప్రోటోకా ల్ పాటించకుండా ఎమ్మెల్యేపై కులపెత్తనం చేయడం దారుణమన్నారు. ఇలాంటి వైఎస్సార్సీపీ నాయకులపై అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ వ్యవహారాలుంటే ఆవిధంగా చూసుకోవాలి తప్పితే దళితుడనే చిన్నచూపుతో, పార్టీ కార్యకర్తల ముందు పరువుతీసినట్టుగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. అధికాపార్టీ దళిత ఎమ్మెల్యేపై చేసిన ఈ వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అంభేత్కర్ వారసులంతా ముక్త కంఠంతో ఖండించాలని, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసు కునేలా కేసు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని ఇలా వదిలేస్తే రేపు మంత్రులు, ఆ పై ఎంపీలు ఇలా ఎవరినైనా ఇదే తరహాలో మాట్లాడేందుకు అవ కాశం వుంటుందని అన్నారు. దళితులంతా ఒక్కటేనని విషయాన్ని ప్రభుత్వాలకు తెలిసేలా చేయాలన్నారు. కార్యక్రమంలో సమాఖ్య కో కన్వీనర్ చింతాడ సూర్యం, బహుజన సేన కార్యదర్శి కొమ్మువీర్రాజు, కో కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, జి.రాంబాబు, సుధాకర్, మునపర్తి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-09-15 13:19:53

సెర్ప్ లో 14నెలల పారితోషకాలు బకాయి..

సెర్ప్ విభాగంలో పనిచేస్తున్న కళ్యాణ మిత్రలకు 14 నెలల పారితోషికాల బకాయిలు వెంటనే చెల్లించాలని, పని భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.కమల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో  కళ్యాణ మిత్రలతో ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ కళ్యాణ మిత్రులకు పారితోషకాలు రెట్టింపు చేసి చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని గతంలోహామీ ఇచ్చారని, కానీ నేటి వరకూ దానిని అమలు చేయాలేదన్నారు.  బకాయి పడ్డ14నెలల  పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని ఆమె కోరారు.  శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.ధనశ్రీ  మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న కళ్యాణ మిత్రలకు ఉద్యోగ భద్రత, తగిన గుర్తింపు నివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సిఐటియు పట్టణ కార్యదర్శిబూర.సుబ్రహ్మణ్యం ధర్నాకు మద్దతు తెలియజేస్తూ కళ్యాణ మిత్రులకు 14 నెలల నుంచి పారితోషికాలు బకాయి ఉండటం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారిని వెంటనే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పి రాజేశ్వరి, జి అరుణ, సిహెచ్. సుమలత, సిహెచ్ అశ్విని, పి దివ్య, శ్రీదేవి, వి. స్వాతి, ఎస్ భవాని ఆర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Machilipatnam

2020-09-14 21:23:59

నూతన్ నాయుడు నకిలీ లీలలుపై రూ.12 కోట్ల కేసు..

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  దర్శకుడు నూతన్‌ నాయుడు లీలలు ఒక్కొక్కటీగా  బయటకు వస్తున్నాయి. ఇతనిపై ఇప్పటికే పలు కేసులు బయటపడగా.. తాజాగా మరో మోసం విశాఖలో వెలుగుచూసింది. ఉద్యోగం పేరిట నూతన్‌ నాయుడు 12 కోట్ల రూపాయలను వసూలు చేశాడని ఆరోపిస్తూ మహారాణి పేట పోలీస్‌ స్టేషన్‌లో ఈరోజు కేసు రిజస్టరైంది. ఎస్‌బీఐలో రీజినల్‌ డైరెక్టర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి 12 కోట్లు వసూలు చేశాడని ఫిర్యాదుపై స్పందించిన విశాఖ డీసీపీ ఐశ్వర్య రస్తోగి ఫిర్యాదుపై లోతైన విచారణ జరుపుతామని మీడియాకి చెప్పారు. అంతేకాకుండా మరోసారి కస్టడీలోకి తీసుకుంటామని కూడా వివరించారు... కాగా సీనియర్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్‌ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్‌ స్టేషన్లలోనూ నూతన్‌పై కేసులు నమోదయ్యాయి.  నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్‌ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించి  సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు...

Visakhapatnam

2020-09-14 21:17:57

యువతకి వ్యక్తిత్వ వికాసం పై ఉచిత శిక్షణ..

యువతకు ఉచితంగా ఆన్ లైన్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ (సెట్ శ్రీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాస రావు తెలిపారు.  ఈ మేరకు సోమ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికితీయడం, అదే విధంగా వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిచ డానికి, యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 15-35 సం. మధ్య వయస్సు కలిగిన యువతీ యువకులకు మహత్తరమైన అవకాశాన్ని కల్పిస్తూ నైతిక విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం, యువ నాయకత్వాలపై అంతర్జాలము వేదికగా ఉచిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి సంకల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమము ప్రతి శనివారం నిర్వహించబడం జరుగుతుందని ఆయన వివరించారు. విజయవాడ రమకృష్ణ మఠానికి చెందిన స్వామి సవ్యానంద వంటి ప్రముఖులు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొని ఆన్ లైన్ ద్వారా వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు వంటి కార్యక్రమాలపై శిక్షణ ఇస్తారని వివరించారు.  ఆసక్తి, అర్హత గల యువతీ, యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస రావు కోరారు. http://tiny.cc/personalitydevelopment వెబ్ సైట్ లో యవత వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆప్ లైన్ ద్వారా నమోదు చేసుకొన్న అభ్యర్థులకు 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు ఆన్ లైన్ లో "నైతిక విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం, యువ నాయకత్వం" పై ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు.  వివరములకు కార్యాలయం పని దినములలో సెట్ శ్రీ మేనేజరు బి.వి. ప్రసాదరావును 8341478815, 08942240601 నంబరు ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Srikakulam

2020-09-14 20:50:18

డయల్ యువర్ కమిషనర్ కి18 ఫిర్యాదులు

డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి వచ్చిన వినతులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి, సమస్య పరిష్కరించాలని జెడి విజయభారతి( అమృత్) అన్నారు. సోమవారం  జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. స్వీకరించిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులను/జోనల్ కమిషనర్లకు పంపించారు. ఇందులో 1వ జోనుకు సంబందించి 03, 2వ జోనుకు సంబందించి 03, 3వ జోనుకు సంబందించి 03, 4వ జోనుకు సంబందించి 02, 5వ జోనుకు సంబందించి 03, 6వ జోనుకు సంబందించి 03, పి.డి.(యు.సి.డి) సంబందించి 01, మొత్తము 18 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఆమె ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ, ఫిర్యాదులు 03రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

జివిఎంసి ప్రధాన కార్యాలయం

2020-09-14 20:47:25

ప్లాస్మదాతలూ మీకు మా సలాం...

ప్లాస్మా దానకర్తలకు ప్రతి ఒక్కరూ సలాం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. ప్రస్తుతం ప్లాస్మా దానకర్తలు కోవిడ్ ను పారద్రోలుతున్నారని, అనేక మంది ప్రాణాలు నిలుపుతున్నారని కొనియాడారు. ప్లాస్మా దానానికి కోవిడ్ వారియర్స్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసిన యువత నిర్ణీత గడువు తరువాత కూడా దానం చేయుటకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. కరోనా భారీన పడిన వారు మన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులే అని గుర్తించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్లాస్మా దానం చేసిన యువత - వి.మురళి కృష్ణ, ప్రశాంత్ పాత్రో,దుప్పల సతీష్ కుమార్,ఇతికర్లపల్లి మహేష్ కుమార్, ఆడిదెల శామ్యూల్,వంటకుల సూర్య నారాయణ మూర్తి,బొర్రా నాగరాజు,ఆర్ వెంకటరమణ, పి వెంకటేష్, ఎస్ చంద్రశేఖర్,కింజరాపు భాస్కర రావులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేసారు.  ఈ కార్యక్రమంలో కోవిడ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రామ్మోహన్, కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సోమేశ్వర రావు,డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ జెమ్స్ ప్రిన్సిపాల్ లక్ష్మీ లలిత, ఆర్ఎంఓ డాక్టర్ బాలమురళి, డిప్యూటీ అర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-14 20:30:10

సచివాలయ పరీక్షలు సజావుగా నిర్వహించాలి..జెసి

విశాఖజిల్లాలో సచివాలయ ఉద్యోగ పోటీ పరీక్షల నిర్వహణ సజావుగా జరగాలని నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశిం చా రు. సోమవారం 2 వ క్లస్టర్ లోని భీముని పట్నం మండలం లోని 6 పరీక్షా కేంద్రాల ను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన భీమిలి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెయింట్ ఆన్స్ పబ్లిక్ స్కూలు, అమేయ పబ్లిక్ స్కూలు, చిట్టి వలస లోని శారదా పబ్లిక్ స్కూలు, జిల్లా పరిషత్ హైస్కూలు, కుమ్మ రిపాలెం లోని తిరుమల హైస్కూలు పరీక్షా కేంద్రాల ను సందర్శించారు. ఈ కేంద్రాలలో ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, శానిటేషన్ లను పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. అభ్యర్థుల ను తనిఖీ చేసే గదులను, సామానులు భద్రపరిచే గదులను పరిశీలించారు. అనంతరం భీమిలి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును సందర్శించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, సిసిటీవీ ల నిఘా పటిష్టం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి జోనల్ కమీషనర్ సీహెచ్ గోవింద రావు, తహసీల్దార్ వెంకటేశ్వర రావు, యంపీడీఓ వెంకట రమణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Bheemili

2020-09-14 20:22:54

డిగ్రీ లెక్చరర్ ఉద్యోగ పరీక్ష సజావుగా జరగాలి..

శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు జరగనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షలను పక్కాగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపిరిం టెండెంట్లు, లైజనింగ్ అధికారులు, ఉప తహశీల్ధారులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( ఏపి.పి.యస్.సి ) ప్రత్యేక అనుమతులు ఇచ్చిందని అన్నారు. సెప్టెంబర్ 15, 16 తేదీలలో రాజాంలోని జి.యం.ఆర్.ఐ.టి, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షలకు 487 మంది అభ్యర్ధులు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. అభ్యర్ధులు పరీక్షలను రెండు పూటల రాయాల్సి ఉంటుందని,  ఉదయం 9.30గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు, అలాగే మధ్యాహ్నం 3.00గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.  అభ్యర్ధులు పరీక్షా కేంద్రానికి రెండు గంటల ముందే హాజరుకావలసి ఉంటుందని, అయితే కోవిడ్ దృష్ట్యా పరీక్షా సమయం ప్రారంభ సమయం వరకు ఏ.పి.పి.యస్.సి ప్రత్యేక అనుమతిని ఇచ్చినట్లు డి.ఆర్.ఓ తెలిపారు. అభ్యర్ధులు తమ హాల్ టికెట్ తో పాటు నాన్ కోవిడ్ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని, కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అభ్యర్ధులు తెలియజేసిన లేదా థర్మల్ స్క్రీనింగ్ నందు కోవిడ్ ఉన్నట్లు రుజువైన వారికోసం ప్రతీ పరీక్షా కేంద్రంలో ఐసోలేషన్ ల్యాబ్ లను ఏర్పాటుచేసినట్లు డి.ఆర్.ఓ స్పష్టం చేసారు. అలాగే కోవిడ్ దృష్ట్యా అభ్యర్ధులు తమతో పాటు ట్రాన్స్పెరెంట్ వాటర్ బాటిల్ తెచ్చుకునేందుకు ప్రత్యేక అనుమతిని మంజూరుచేయడం జరిగిందని వివరించారు. జిల్లాలోని 4 సెంటర్లకు గాను మూడు సెంటర్లలో దివ్యాంగులు లేరని, జి.యం.ఆర్.ఐ.టి నందు ఒకరు దివ్యాంగులు ఉన్నారని, వారికోసం అభ్యర్ధి ప్రత్యేకంగా అటెండెంట్ ను తీసుకువచ్చుటకు అనుమతిని మంజూరుచేయాలని, లేనియెడల కళాశాల యాజమాన్యం ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స కిట్లు తదితర ఏర్పాట్లు పక్కాగా ఉండాలని , ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని, పోస్టు గ్రాడ్యుషన్ అభ్యర్ధులు పరీక్షలు రాసేందుకు హాజరుకానున్నందున వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని అధికారులకు సూచించారు. అభ్యర్ధులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, మాస్కులను మరచిపోయిన అభ్యర్ధుల కోసం మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని డి.ఆర్.ఓ వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తిన ఏ.పి.పి.యస్.సి కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ పైడి ఢిల్లీశ్వరరావు, సెల్ నెం.90145 50915 లేదా 99599 33631 నెంబర్లకు ఫోన్ చేసి పరిష్కరించుకోవాలని అధికారులకు సూచించారు. మరో వైపు...జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి రానున్న అభ్యర్ధుల కోసం ఏ.పి.యస్.ఆర్.టి.సి బస్సులను సిద్ధం చేసింది. ఉదయం 5.00గం.ల నుండి  ప్రతీ 15 ని.లకు టెక్కలికి,  ప్రతీ 30ని.లకు చిలకపాలెంకు, ప్రతీ 60ని.లకు రాజాం వెళ్లేందుకు ఒక బస్సులను ఏర్పాట్లను చేసింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే బస్సులను గుర్తించేందుకు ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటుచేస్తామని ఆర్.టి.సి అధికారులు డి.ఆర్.ఓ కు వివరించారు. పరీక్షా సమయానికి రెండు గంటలు ముందే అభ్యర్ధులు హాజరుకావలసి ఉన్నందున రాజాం, టెక్కలి వెళ్లే అభ్యర్ధులు ఉదయం 5.45గం.లకే బయలుదేరాలని డి.ఆర్.ఓ దయానిధి అభ్యర్ధులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ యస్.ఓ పి.ఢిల్లీశ్వరరావు, ఏ.యస్.ఓ పద్మప్రియ, చీఫ్ సూపరింటెండెంట్లు, జి.యం.ఆర్.ఐ.టి, శివానీ, శ్రీ వెంకటేశ్వర, ఐతమ్ కళాశాలల ప్రతినిధులు, ఉప తహశీల్ధారులు, లైజనింగ్ అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-14 19:38:00

సచివాలయ పరీక్ష నిర్వహణలో అలసత్వం సహించేదిలేదు

గ్రామ/వార్డు సచివాలయాల పరీక్ష ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ అధికారులను హెచ్చరించారు.  గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలు ఈ నెల 20 తేదీ నుండి 26 వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలకు సంబంధించి  పరీక్ష మెటీరియల్స్ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలలో భద్రత పరచిన రూంలను ఆయన సోమవారం అధికారులతో సందర్శించారు.  స్ట్రాంగ్ రూమ్ లన్నింటిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ముందుగానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలని జిల్లా పరిషత్ సిఇఓ ను ఆదేశించారు. స్టేషనరీ, పరీక్ష మెటీరియల్ ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరాలని డిఆర్డిఎ ప్రాజెక్టు అధికారి విశ్వేశ్వరరావును ఆదేశించారు. సిబ్బంది అవసరమైతే తెలియజేయాలన్నారు. యువకులైన సీనియర్ అసిస్టెంట్ కేడర్ గల సిబ్బందినే నియమించుకోవాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం స్టేడియం లోపల, బయట ఉండాలన్నారు. శానిటరీ, తాగునీరు, విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల ఇన్ చార్జ్ లకు పరీక్ష మెటీరియల్ పంపిణీ చేసినపుడు రశీదు తీసుకోవాలని ఆదేశించారు. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంకు మెటీరియల్ కు వచ్చే వాహనాల ట్రాఫిక్ లేకుండా చూడాలని యుసిడి పిడి శ్రీనివాసరావు ను ఆదేశించారు. డ్రైవర్లను ముందుగానే పరిశీలించుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. బయట సైనేజస్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేషనరీకి ఒక రూం ఏర్పాటు చేసుకోవాలన్నారు.   ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పోలీసు బందోబస్తు ఏర్పాటుకు పోలీసు అధికారులతో మాట్లాడాలని డిఆర్డిఏ పిడిని ఆదేశించారు. ఈ  కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్ - 2 పి. అరుణ్ బాబు, డిఆర్ఓ ఎ. ప్రసాద్, డిఆర్డిఏ పిడి విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈవో నాగార్జున సాగర్, అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు, జివిఎంసి అధికారులు, రవాణా శాఖ అధికారులు, ఆర్టీసి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-09-14 18:32:58

ఘోషా ఆసుపత్రిలో ప్రధాని జన్మదిన సేవా సప్తాహం..

భారదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్న ప్రధాని నరేంద్రమోడి జన్మదిన వేడుకలు విశాఖ దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ ఆధ్వ ర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఈ సందర్భంగా ఘోషా ఆసుపత్రిలోని సిబ్బందికి, రోగుల బంధువులకు, సెక్యూరిటీ సిబ్బందికి ఆహారంతోపాటు, ఫేస్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ మేకిన్ ఇండియా నినాదంతో ఎందరో భారతీయులు దేశానికి ఉపయోగపడేవిధంగా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకొని తమవంతు సేవా కార్యక్రమాలు చేయాలనే లక్ష్యంతో పేదలకు ఆహారం పంపిణీ, మాస్కులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రధాని మోడి జన్మదిన వేడుకలు, సేవా సప్తాహం పేరుతో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకూ నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి బీజేపి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావడం విశేషమని ఆయన కొనియాడారు.

ఘోషా ఆసుపత్రి

2020-09-14 14:56:35

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి..గంట్ల

ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ, ఏపి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్లశ్రీనుబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటి వరకూ 600 మంది జర్నలిస్టులు కరోనా భారిన పడ్డారని, 20 మంది వరకూ ఈ వైరస్ కి బలైయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తోమ్రుతి చెందిన వారికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, వైరస్ సోకిన జర్నలిస్టులకు రూ.25వేలు ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్టుల కోసం జిల్లా అధికారిక వెబ్ సైట్ లలో ప్రత్యేకంగా వివరాలు నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జర్నలిస్టులకు కరోనా పరీక్షలు చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నవారికి రీఎంబర్సుమెంటు ఇవ్వాలన్నారు. అదేవిధంగా కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయడంతోపాటు, హెల్త్ కార్డులను తక్షణమే రెవిన్యువల్ చేయాలన్నారు. హెల్త్ కార్డులు లేకపోవడం వలన చాలా మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులు కార్పోరేట్ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని సమయాల్లో డెలివరీలు, ఇతర స్కానింగ్ అవసరాలు కూడా తీరడం లేదని అన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భీమాని రూ.10 లక్షలకు పెంచుతూ, జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్ల స్థలాల విషయంలోనూ ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రకటన చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ లో వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నారాయణ్, కార్యదర్శి అనురాధ, ఏపీ బిజెఏ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, అధిక సంస్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు...

విశాఖ కలెక్టరేట్

2020-09-14 13:21:24

అధిష్టానం ద్రుష్టికి గొల్ల అవమానం గోల..!

అధికారపార్టీకి చెందిన విశాఖజిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుని పార్టీకే చెందిన ఎస్.రాయవరం మాజీ ఎంపీటిసి సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు కార్య కర్తల సమావేశంలో దారుణంగా మాట్లాడి అవమాన పరిచిన విషయం అధిష్టానం ద్రుష్టికి వెళ్లినట్టు తెలిసింది. అంతేకాదు నేరుగా ఎమ్మెల్యే విజయసాయిరెడ్డితో తన కు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేసినట్టుగా కూడా సమాచారం. గత మూడు నెలలుగా ఎమ్మెల్యే గొల్లబాబూరావు తనకు నియోజకవర్గంలో స్వేచ్ఛలేకుండా కొంద రు నాయకులు పదే పదే అడ్డుపడుతూ దళిత ప్రజాప్రతినిధినైన తనను అవమానిస్తున్నారంటూ వార్తలకెక్కారు. నియోజవర్గంలోని ఎక్కడ సమావేశం పెట్టినా ఇదే విషయాన్ని మీడియా వద్ద ప్రస్తావిస్తూ వచ్చేవారు. ఆ విషయం మీడియాలో గొల్లుమన్న తరువాత మూడు నెలలకి అడ్డురోడ్డులోని ఎమ్మెల్యే ఇంటి వద్ద జరిగిన సమావేశంలో బొలిశెట్టి గోవిందరావు, పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త చంటి వర్గాలకు మధ్య పెద్ద గొడవ జరిగి గత సోమవారం ఎమ్మెల్యే ముందే కొట్టుకున్నారు. అయితే పదేళ్లుగా పార్టీకి సేవచేసిన తనను కాదని, చంటి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని బొలిశెట్టిగోవిందరావు గొడవ అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులతో తన ఇలాకాలోని తోటలో సమావేశం అయ్యి ఎమ్మెల్యేని ఇష్టాను సారంగా మాట్లాడారు. ఆ విషయం కాస్తా అటు మీడియాకి, ఇటు నిఘా వర్గాలకు చేరడంతో ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లింది. ఇంతజరిగిన తరువాత కూడా సదరు గోవిందరావు స్థానిక మీడియాని కట్టడిచేసి, బెదిరించి మరీ జరిగిన తంతుని టివీలు, పత్రికల్లోనూ రాకుండా జాగ్రత్త పడ్డారు. ఆ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా బహిర్గతం చేసింది. ఎమ్మెల్యే ముందు జరిగిన గొడవను కూడా బయటపెట్టింది. దీంతో విషయం కాస్తా ఊరూనోట తెలిసిపోయింది. నిఘా వర్గాలు సైతం పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టుగా ప్రభుత్వానికి చేరవేశాయి. ఎమ్మెల్యేని ఒక సాధారణ మాజీ ఎంపీటిసి దారుణంగా అవమానించడంతోపాటు, తాను లేకపోతే పార్టీ గెలవదన్నట్టుగా మాట్లడటాన్ని తీవ్రంగా పరిగణించింది. దానికి బలమైన ఆధారాలు సమావేశంలో మాట్లాడిన మాటలన్నీ సాక్ష్యంగా ఉండటంతో అసలు బొలిశెట్టి గోవిందరావు అనే వ్యక్తి వ్యవహారాలపై కూపీలాగే పనిలో పడినట్టు సమాచారం అందుతోంది. గొడవ జరిగిన రోజు వీడియో ఫుటేజి, మాట్లాడిన సంభాషన సేకరించే పనికూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దళిత ఎమ్మెల్యేని అవమానించడం ఒక ఎత్తైతే ఒక మాజీ ఎంపీటిసికి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడివనే కోణంలో వివరాలు సేకరణ జరుగుతుందని కూడా నియోజవర్గంలో ప్రచారం జరుగుతోంది. కేవలం తన దగ్గర డబ్బులున్నాయని, పార్టీలో కొందరు పెద్దల సహకారం తనకుందనే ధీమానే బొలిశెట్టి గోవిందరావు చేసిన వ్యాఖ్యలపై ఇటు ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూడా గొల్లు మంటున్నాయి. దళిత ఎమ్మెల్యేపై కిందిస్థాయి అధికారపార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడాటాన్ని తప్పుపట్టి ఈ విషయాన్ని తమ సంఘాల ద్వారా ఆందోళన చేసే పనిలో పడ్డాయి.

Payakaraopeta

2020-09-14 09:28:35

26ఏళ్లుగా ఆ వాల్ పెయింట్ చెరగనే లేదు..

ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రెంట్  చేనేత కులాల ప్రాంతీయ సదస్సు ఛలో రాజమండ్రి.. 21.08.1994కోసం ఆచంట గ్రామంలో ఓ గోడపై దీనిని రాయించారు. అ26 ఏళ్లు గడుస్తున్నా రాసిన వాల్ పైయింటింగ్ నేటికి సజీవంగా నిలిచి వుంది. అప్పటి సమావేశానికి గుర్తుగా చేనేత సామాజిక వర్గం వారికి నాటి సమావేశం తేదీని గుర్తు చేస్తూనే వుంది. ఈ వాల్ పెయింగ్ టింగ్ ను రుద్రాక్షల సత్యనారాయణ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా విశేషంగా వైరల్ అవుతుంది. చేనేత ఉద్యమ కారులు, చేనేత కులాల ఐక్యత కోసం, హక్కుల కోసం, చేనేత రంగం అభివృద్ధి కోసం, చేనేత  కార్మికుల సంక్షేమం కోసం పద్మశాలీ నేతలు శీరం రామచంద్రమూర్తి , రామ్మూర్తి, చిందం రాదాకృష్ణ, దేవాంగ ప్రముఖులు కీ.శే బొమ్మన రామచంద్రరావు, కాలేపు సత్యనారాయణ , సంజీవరావు, కరికాలభక్తుల ప్రముఖులు, కర్ణభక్త, కుర్ణి, స్వకులశాలీ, పట్టుశాలీ ప్రముఖులు లక్షలాది మందితో ప్రాంతీయ సదస్సు రాజమండ్రిలో విజయవంతం చేసినట్టుగా చెబుతారు. నేటి యువత నాటి పెద్దల ఆలోచన విదానాలను ఆధర్శవంతంగా తీసుకొని జాతి ఐక్యతకు కృషిచేయాలని, ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ను బలపర్చాలని నేటి ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రెంట్ రాష్ట్ర కార్యవర్గం కోరుతోంది...

ఆచంట

2020-09-13 21:57:32

కెజిహెచ్ లో మంచినీటి ఆర్ఓ ప్లాంటు ప్రారంభం..

కరోనా వైరస్ వ్యాప్తి ఉద్రుతంగా వున్నసమయంలో రోగులు, వారికి సేవలు చేసే పారామెడికల్ సిబ్బంది సురక్షితమైన మంచినీరు తాగాల్సిన అవసరం ఎంతైనా వుం దని కెజిహెచ్ సూపరింటెండెంట్ డా.పివి సుధాకర్ అన్నారు. ఆదివారం కెజిహెచ్‌లోని సిఎస్‌ఆర్ బ్లాక్‌లోని కోవిడ్ సెంటర్‌లో రోటరీ వైజాగ్ కపుల్స్ రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ మరియు రోటార్టీ క్లబ్ ఆఫ్ వైజాగ్ మెట్రో ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన, గంటలకు రెండువేల లీటర్లు శుద్ధిచేయగల సామర్ధ్యం ఉన్న మంచినీటి ఆర్ఓ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాంట్ ఏర్పాటుతో పాటు 5 అంతస్తుల్లో 30 పాయింట్ల ద్వారా మంచినీరు అందిం చేందుకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. కోవిడ్ సమయంలో మరింత మంది దాతలు ముందుకి వచ్చిన తమకు తోచిన సహాయం కెజిహెచ్ కి వస్తురూపంలో చేయడం ద్వారా అవి రోగులకు నేరుగా చేరే అవకాశం వుంటుందన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు శ్రీరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

కింగ్ జార్జి ఆసుపత్రి

2020-09-13 21:35:59