1 ENS Live Breaking News

రైతుల చేను వద్దనుంచే పంట కొనుగోలు

రైతులు పండించే ఖరీఫ్ పంటను పొలంవద్దనే కొనుగోలు చేయుటకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఎం .దేవుళ్లనాయక్ తెలిపారు.  మంగళవారం ఆయన కార్యాలయ చాంబరు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజను సంబంధించిన వరిపంట కొనుగోలుకు అక్టోబరు మాసాంతానికిని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు.  వ్యవసాయ శాఖ వారు అందజేసిన నివేదకల ఆధారంగా జిల్లాలో మూడులక్షల పదహారువేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నామని, నవంబరు నెలనుండి ధాన్యం సేకరణ మొదలు పెడతామన్నారు.  ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (ఎ)రకానికి క్వింటాకు  రెండువేల అరవై రూపాయలు, సాధారణ రకానికి రెండువేల నలబై రూపాయలు రైతులకు చెల్లించనున్నట్లు తెలిపారు.  

రైతులు తప్పని సరిగా ఇ-పంట నమోదు చేసుకోవాలని, ఇ-పంట నమోదు చేయకపోతే ధాన్యం కొనుగోలు జరుగదన్నారు. మిల్లర్లకు రైతుకు సంబంధం లేకుండా  ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పారదర్శకంగా ప్రక్రియ రూపొందించినదని,  దానికి ఇ-పంట నమోదు తప్పనిసరని తెలిపారు. జిల్లాలో మూడు వందల ఆరు రైతుభరోసా కేంద్రాల వద్ద ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు గోనుసంచులు పౌర సరఫరాలశాఖ, మిల్లర్లు సమకూర్చుతారని, రైతులు గోనెసంచులు సమకూర్చుకుంటే దానికి డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. ధాన్యం కోత పూర్తిచేసిన రైతులు సంబంధిత రైతుభరోసా కేంద్రంలో నమోదుచేసుకొని, ధాన్యం శాంపిల్స్, వేయింగుపూర్తయిన తరువాత రశీదు అందజేస్తారని, ఆ తరువాత రైతుకు సంబంధం ఉండదని తెలిపారు.

 మిలర్లుగాని, మద్యవర్తులు గాని తూకం, నాణ్యత విషయంలో రైతులతో మాట్లాడే అవకాశం ఉండదని తెలిపారు.  ధాన్యం అమ్ముకొనుటలో యిబ్బందులు ఎదురైనా, మిల్లర్లు సంప్రదించుటకు ప్రయత్నంచినా టోల్ నెంబరు 1902 గాని 15525 గాని 18004251903 గాని ఫోన్ చెయ్యాలని  లేదా జిల్లా కంట్రోల్ రూం నెంబరు 08963-293037 లేదా 7702003582 కు పిర్యాదు చేయవచ్చునని తెలిపారు.  జిల్లా లో తొంబదిఒక్క బియ్యం విల్లులు ఉన్నాయని వాటిలో ప్రస్తుతం ఇరవైఏడు మిల్లులు సార్టెక్స్, ఫ్లోరిఫైడ్ మిషనరీ కలిగిఉన్నాయని,త్వరలోనే ముప్పదిఎనిమిది మిల్లులకు సార్టెక్స్, ఫ్లోరిఫైడ్ మిషనరీ ఏర్పాటు చేస్తున్నట్లు  ఆయన తెలిపారు. రైతులు దళారులనుగాని, మిల్లర్లను గాని వారి ధాన్యం అమ్ముకొనుటకు సంప్రదించవద్దని, రైతు భరోసా కేంద్రాల ద్వారా వారి ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని ఈ సంధర్బంగా రైతులకు కోరారు.

Parvathipuram

2022-10-18 14:07:57

ఘన, వ్యర్ధ పదార్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు  ఘన వ్యర్ధ పదార్థాలు, లిక్విడ్ వేస్ట్( వ్యర్థ జలాలు )లను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ చేపట్టేందుకు  చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ కమిషనర్ కే.రమేష్ చెప్పారు. మంగళవారం ఆయన ఎస్ఈ సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఈ మాధవి, ఇతర అధికారులతో కలిసి సేంద్రీయ ఎరువు తయారీ కేంద్రాన్ని, డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. అంతకుముందు మిషన్ క్లీన్ ఫర్ గోదావరి కృష్ణ కెనాల్స్ లో భాగంగా ఇంద్రపాలెం నుంచి మాధవపట్నం వరకు చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జడ్పీ సెంటర్ వద్ద జరుగుతున్న పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ విలేకరులతో మాట్లాడుతూ రోజూ ప్రజల నుంచి సేకరించిన తడి చెత్తను సేంద్రీయ ఎరువు తయారికి వినియోగిస్తున్నామన్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్ కోసం  ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నామన్నారు. బయో మెథనైజేషన్ ప్లాంట్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు.

  నాన్ రీసైక్లబుల్ కంబస్టబుల్ డ్రై వేస్ట్ ను విశాఖ లోని బిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు పంపిస్తున్నామన్నారు. రోజు విడిచి రోజు  10 టన్నుల కంబస్టబుల్  డ్రై వేస్ట్ తరలిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ప్రజలు కూడా  తడి, పొడి చెత్తను వేరువేరుగా సిబ్బందికి అందజేయాలని కోరారు. అలాగే వ్యర్థ జలాలు, భవన  నిర్మాణ వ్యర్ధాలను కూడా శాస్త్రీయ పద్ధతిలో నూ రు శాతం ప్రాసెసింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆయన సూచించారు. మిషన్ క్లీన్ ఫర్ గోదావరి కెనాల్ కార్యక్రమంలో భాగంగా కెనాల్ ప్రాంగణాన్ని  సుందరీకరణ చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై  ఆయన సంబంధిత అధికారులతో చర్చించి సూచనలు ఇచ్చారు. ఇంద్ర పాలెం వంతెన వద్ద  పొరుగున ఉన్న పంచాయతీ  ప్రాంత ప్రజలు చెత్తను తీసుకువచ్చి వేయడం పై అసహనం వ్యక్తం చేశారు. చెత్తను  కెనాల్ ఆవరణలో వేయకుండా ఉండేలా  సంబంధిత పంచాయతీ అధికారులతో మాట్లాడాలని ఆయన అధికారులకు సూచించారు.

Kakinada

2022-10-18 12:51:06

వికలాంగ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానం

జాతీయ దివ్యాంగుల ఆర్ధిక, అభివృద్ధి సంస్థ (NHFDC) న్యూఢిల్లీ ద్వారా దివ్యాంగులకు రుణము కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.  అనకాపల్లి జిల్లాకు చెందిన అర్హులైన దివ్యాంగులు 40% అంగవైకల్యము 18 నుండి 60 సం.లవయస్సు కలవారు (మానసిక వికలాంగులు 14 సం.) రుణము పొందుటకు అర్హులని చెప్పారు. రుణము మొత్తం తిరిగి పూర్తిగా వడ్డీతో సహా చెల్లించ వలసి ఉంటుందన్నారు. రూ.10 వేల నుండి 50 వేల వరకు 5%, ఆపై రూ. లక్ష వరకు వడ్డీ 6% వడ్డీ ఉంటుందన్నారు దరఖాస్తు కొరకు ఏడి సంక్షేమ శాఖ వారి కార్యాలయంలో   సంప్రందించాలన్నారు.  సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, విద్య, శిక్షణ దృవీకరణ పత్రాలు, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకము కాపీ,  2 పాస్ పోర్టు సైజు ఫోటోలు, రూ. లక్ష  దాటినట్లెతే   సంబందిత పరిశ్రమల శాఖ వారి  నుంచి పొజెక్టు రిపోర్టు సమర్పించాలన్నారు. 

ఈ రుణాలు చిన్న వ్యాపారములకు వ్యాపార అభివృద్ధి చేసుకొనుటకు మంజూరు చేస్తారని వివరించారు.  రూ.లక్ష వరుకు షూరిటీగా 5సం.ల సర్వీసుగల ప్రభుత్వ ఉద్యోగి,  రూ.లక్షకు  దాటినట్లయితే  10 సం. సర్వీసు గల ప్రభుత్వ ఉద్యోగిషూరిటీ ఉండాలన్నారు. లేనట్లయితే బ్యాంకు గ్యారంటీ లేదా ఆస్తి తాలుకా ఒరిజనల్ దస్తావేజులు కూడా షూరిటీగా పెట్ట వచ్చని చెప్పారు.  SC/ ST/ BC మరియు మహిళా అభ్యర్ధులకు పాదాన్యత ఇవ్వబడుతుందని, మహిళా దివ్యాంగులకు వడ్డీలో ఒక శాతం రిబేట్ ఇస్తారని చెప్పారు.  రూ. లక్ష  వరకు లోను తీర్చుటకు 3 సం.లు, రూ. 5 లక్ష ల వరకు లోనుకు 5 సం.లుగా కాల పరిమితి ఉంటుందన్నారు. దరఖాసులు పరిశీలన, ఎంపిక మరియు లోను మంజూరు కార్యక్రమములు  జిల్లా స్క్రీనింగ్ కమిటీ (DLSC) ద్వారా జరుగుతుందన్నారు. అసలైన వికలాంగ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు.  ఇతర వివరముల కొరకు పోన్ నెం. 9493291018 ద్వారా తెలుసుకోవచ్చని  , విభిన్న ప్రతిభావంతులు, సహాయ సంచాలకులు జి‌.వి.పి.జగదీష్ తెలిపారు.

Anakapalle

2022-10-18 12:21:13

నాడు నేడు పనులలో ప్రగతి కనిపించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు నేడు పనులలో గణనీయ ప్రగతి కనిపించాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్ అన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ సహాయ ప్రాజెక్టు మేనేజర్ల (ఏపిఎం)కు నాడు నేడు పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గిరి మిత్ర సమావేశ మందిరంలో మంగళ వారం ఏపిఎంలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాజెక్టు అధికారి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నాడు నేడు పనులలో జిల్లా వెనుకబడి ఉందని అన్నారు. ప్రభుత్వం ఏపిఎంలకు నాడు నేడు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. నాడు నేడు పనులను ప్రభుత్వం ప్రాధాన్యతతో చేపడుతుందని ఆయన చెప్పారు. పాఠశాలలు ఆహ్లాదంగా మారుతున్నాయని, విద్యార్థులలో ఆనందం వెల్లివిరుస్తోందని పేర్కొంటూ ప్రస్తుతం జరుగుతున్న పనులు వేగవంతం చేయడానికి శ్రద్ద వహించాలని ఆయన స్పష్టం చేశారు.

 నాడు నేడు పనుల విధివిధానాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నిబంధనలు తు.చ తప్పకుండా అమలు చేస్తూ నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని ఆయన ఆదేశించారు. నాడు నేడు పనులతోపాటు జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం తదితర కార్యక్రమాలను కూడా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎస్.డి.వి రమణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, పేదరిక నిర్మూలన సంస్థ ఎపిడి వై. సత్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-10-18 12:10:37

భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలి

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పక అమలు జరిగేలా సంబంధిత శాఖలు చూడాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అద్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ప్రమాదాలతో పోల్చుకుంటే 3 శాతం అధికంగా జరిగాయని జీరో ప్రమాదాలు లక్ష్యంగా సంబందిత శాఖలు పని చేయాలని అన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే వైద్య సహాయం అందించేలా జిల్లా వైద్య శాఖ, పోలీసు, ట్రాన్స్పోర్ట్, శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 ప్రమాదం జరిగిన వివరాలను ఐ.ఆర్.ఎ.డి. వెబ్ సైట్ నందు పోలీసు, వైద్య శాఖలు నమోదు చేయాల్సి ఉంటుందని, ఈ వివరాలను కేంద్రంలో దేశంలోని ప్రమాదాలు  ఒకే చోట చూసి, అధ్యయనం చేసి మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు.  ప్రధానంగా ప్రమాదం జరిగిన వెంటనే కాపాడిన వారికి గుడ్ సమరటిన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని ఇందుకు సంబందించిన పోస్టర్లను సచివాలయాలలో, ఆసుపత్రులలో, పోలీసు స్టేషన్ లలో ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బారీ వాహనాల  డ్రైవర్ లకు విశ్రాంతి కొరకు వడమాలపేట వద్ద మల్టి కాంప్లెక్స్ నిర్మించనున్నామని అలాగే చిత్తూరు – నాయుడుపేట మద్యలో మరొకటి ఏర్పాటుకు సంబందిత ఆర్.డి.ఓ లు స్థల పరిశీలన చేయాలని సూచించారు. బాకరాపేట ఘాట్ నందు చేపట్టవలసిన భద్రతా పనులను పూర్తి చేసినందుకు సంతోషమని అన్నారు.

 సి.మల్లవరం – గాజులమండ్యం రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కూడళ్ళలో సిగ్నల్స్ ఏర్పాటు, బ్లిన్కర్స్ ఏర్పాటు కావాలని ప్రస్తుతం మరమ్మత్తులు ప్రారంభించారని డిసెంబర్ నాటికి పూర్తి కావాలని సూచించారు. ప్రధానంగా ప్రస్తుతం గాజులమండ్యం – నాయుడుపేట జాతీయ రహదారి  నిర్మాణం  సాగుతున్నదని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసు, ట్రాన్స్పోర్ట్, రెవిన్యూ సంయుక్త పరిశీలనతో అవసరమైన వేగనిరోదకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్.ఐ.సి. రోడ్డు భద్రతపై రహదారి దగ్గరలో ఉన్న సచివాలయాల వాలింటర్లకు శిక్షణ ఇచ్చి ప్రమాదాల బారిన పడిన వారి ప్రాణాలు కాపాడేలా చూడాలని డివిజనల్ డెవలప్ మెంట్ అధికారి వెంటనే దృష్టి పెట్టాలని అన్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ, హై వే లపై టూ వీలర్ ప్రయాణికులు హెల్మెట్ తప్పనిసరి చేయాలని సూచించారు. తిరుపతి నగరానికి సంబంధించి ఉప్పరపల్లి, వైకుంటపురం, బాలాజీ కాలనీ, టౌన్ కల్బ్, టి.ఎం.ఆర్. జంక్షన్, శ్రీనివాస కళ్యాణ మండపాల జంక్షన్ లలో ఫ్రీ లెఫ్ట్ రహదారుల నిర్మాణాలు నగరపాలక కమీషనర్ చర్యలు చేపట్టాలని సూచించారు. 

ఈ సమీక్షలో రోడ్డు భద్రతా కమిటీ కన్వీనర్ డి.టి.ఓ సీతారామి రెడ్డి,  ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ఆర్.ఎం.- టి.చంగల్ రెడ్డి,  వే ఫౌండేషన్- డా.పైడి. అంకయ్య, 108 అంబులెన్స్ సర్వీసెస్ – బి.మోహన్ బాబు, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ – డా,రామ్, డా.కోటి రెడ్డి,  ఎన్.హెచ్.ఎ..ఐ అధికారులు టి.దుర్గా ప్రసాద్ రెడ్డి, ఓ.నాగరాజ, డి.ఈ.ఈ., జి.వెంకటేశ్వరులు, మేనేజర్,  ఆర్ అండ్ బి  అధికారి సి.సుధాకర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా.ఎన్.ఆర్.రిచా శర్మ,  పశుసంవర్థక శాఖ ఎ.డి. డా.అప్సర్ సైయద్, మొహమ్మద్ అలీ ఖాన్, తిరుపతి ఎన్.హెచ్. 71 అధికారులు  కే.దాశరధ రామయ్య,  ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.మల్లికార్జున రావు,  మేనేజర్ సేఫ్టీ సెక్షన్ విజయ్ రాథోడ్,  సీనియర్ మేనేజర్ సర్వే   ఎం.రామ కృష్ణ,  కే.హనుమంత నాయక్, ట్రాన్స్పోర్ట్ అధికారులు శ్రీనివాస రావు, కుసుమ, స్వర్ణలత, సుబ్రహ్మణ్యం, మోహన్ కుమార్, శ్వేత బిందు, ఎ.ఓ. శ్రీనివాస రావు, కిషోర్,  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-10-18 11:38:18

ఈవీఎం, వీవీప్యాట్ భద్రతకు పటిష్ట చర్యలు..

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్  డా. కృతికా శుక్లా ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర‌ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా..రెవెన్యూ, ఎన్నికల శాఖ‌ల అధికారుల‌తో కలిసి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. వ‌ర్షాలు తరుచుగా కురుస్తున్నందున ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఈ సంద‌ర్భంగా సూచించారు.  కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో బీవి.రమణ, పట్టణ త‌హ‌సీల్దార్ వైహెచ్ఎస్ సతీష్‌, కాకినాడ పట్టణ, కలెక్టరేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్లు సీహెచ్ లక్ష్మి ప్రసన్న, ఎం.జగన్నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-10-18 11:20:56

జగనన్నతోనే నగర అభివృద్ధి సాధ్యం

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే నగరం అభివృద్ధి చెందినట్లు జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని రెండవ జోన్ 13వ వార్డు  పరిధిలోని పైనాపిల్ కాలనీలలో సుమారు 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో రోడ్లు కాలువలకు ఆమె తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాన్ని విజయనిర్మల, వార్డ్ కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని నమ్మి  జగనన్న విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. 

నేడు ప్రతి వార్డు లో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పరిపాలన రాజధాని ఇక్కడ ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన వార్డు కార్పొరేటర్ సునీత సత్యనారాయణ విన్నపం మేరకు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు వార్డులో చేపట్టామని నూతనంగా రోడ్లు కాలువలు నిర్మాణానికి 56 లక్షల రూపాయలు కేటాయించి నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కార్యదర్శులు వైయస్సార్ సిపి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-10-18 11:13:21

ఆర్.బి.కేలలో రైతులకు సదస్సులు

పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాలలో 19వ తేదీ నుండి రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, విధి విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించుటకు రైతు సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వ నిబంధనలు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వాటిని సద్వినియోగం చేసుకొను విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుండి అన్ని రైతు భరోసా కేంద్రాలలో రైతు సదస్సు ఉంటుందని రైతులు సదస్సుకు హాజరై అవగాహన చెంది ప్రయోజనం పొందాలని ఆయన కోరారు.


Parvathipuram

2022-10-18 07:35:54

ప్రైవేటు ఆసుపత్రి తలదన్నేలా సేవలందాలి

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తమకు అత్యుత్తమ వైద్య సేవలు అందాయనే సంతృప్తితో ఆసుపత్రి నుంచి తిరిగి వెళ్ళాలన్నదే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఆ మేరకు వైద్యసేవలు మెరుగుపరిచే దిశగా వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ప్రభుత్వ వైద్యులకు సూచించారు. ఆసుపత్రుల్లో నాడు – నేడు పేరుతో వసతులు మెరుగు పరచడంలో ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని చెప్పారు.   ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే తమకు మంచి వైద్య సేవలు అందుతాయనే అభిప్రాయాన్ని కలుగజేసే దిశగా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు పని చేయాలన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శనివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తో కలసి జిల్లా ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి రోగుఅలకు అందుతున్న సేవలపై ఆరా తీసారు. ముందుగా జిల్లా ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు చేపట్టిన అదనపు నిర్మాణాలు, కల్పిస్తున్న అదనపు వసతులపై వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు సత్యప్రభాకర్, ఎస్.ఇ. శివకుమార్ తదితరులు చిత్రపటాల ద్వారా వివరించారు. 
ఓ.పి. నమోదు విభాగాన్ని తనిఖీ చేసి రోజుకు ఎంతమంది ఓ.పి. నమోదు అవుతోందని ముఖ్య కార్యదర్శి తెలుసుకున్నారు. రోజుకు 600 మంది వరకు రోగులు నమోదు అవుతున్నట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. ఓ.పి. నమోదు ఎంతమంది సిబ్బందితో నిర్వహిస్తున్నదీ తెలుసుకున్నారు. కొత్తగా ఓ.పి.బ్లాక్ నిర్మిస్తున్నామని అక్కడ 11 కౌంటర్ లు ఏర్పాటు చేయనున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. 

అనంతరం ఆరోగ్యశ్రీ విభాగాన్ని పరిశీలించి ఇక్కడికి వచ్చే రోగులకు ఆరోగ్యమిత్రాల ద్వారా అందిస్తున్న సేవలపై తెలుసుకున్నారు. రోగులకు సంబంధించిన డయాగ్నొస్టిక్ సమాచారాన్ని, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ లను, కేసు రికార్డులను, వారికి ఇస్తున్న మెడిసిన్ ను ఒక కోడ్ నెంబర్ ఇచ్చి ఆన్ లైన్ లో వుంచినట్లయితే వాటిని ఇతర వైద్యులు ఎక్కడ వారికి చికిత్స అందించినా వారికి కేస్ హిస్టరీ అందుబాటులో వుంటూ చికిత్స సులభతరం అవుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్యులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారితో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ లో సమావేశమయ్యారు.  ఈసందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీ ప్రక్రియపై సమీక్షించారు. ఖాళీల భర్తీలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.పద్మలీల వివరించారు. ముఖ్యంగా వికలాంగులకు కేటాయించిన ఖాళీల భర్తీ సమస్యగా ఉంటుందని దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. వెంటనే రాష్ట్ర స్థాయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ముఖ్య కార్యదర్శి ఫోన్ లో మాట్లాడి పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చారు. 

ఆసుపత్రిలో డయాగ్నొస్టిక్ పరికరాల అవసరం లభ్యత పై ముఖ్య కార్యదర్శి ఆరా తీసారు. శస్త్ర చికిత్సలకు అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో తగినంతగా అందుబాటులో ఉన్నదీ లేనిదీ ఆరా తీసారు. మందుల లభ్యతపై కుడా తెలుసు కున్నారు.  ఇక్కడి సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో 575 రకాల మందులు అందుబాటులో వున్నట్టు డ్రగ్ స్టోర్ అధికారులు వివరించారు. మందులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ఇండెంట్ ఇచ్చిన వెంటనే మందులు సరఫరా చేస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇస్తున్న నిధుల్లో ౩౦శాతం రోగుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు. ఈ మొత్తాన్ని సిబ్బంది జీతాల కోసం ఖర్చు చేయడం సరికాదన్నారు. రోగులకు అవసరమైన ప్రత్యెక మందులు, చికిత్స పరికరాలు ఈ నిధులతోనే కొనుగోలు చేయవచ్చన్నారు.

నగరంలో తల్లిబిడ్డలకు వైద్య సేవలందించే ఘోషా ఆసుపత్రిని కొత్తగా ఏర్పాటు చేసే వైద్య కళాశాలలో కలపకుండా దీనిని ప్రత్యెక తల్లీపిల్లల ఆసుపత్రిగా కొనసాగించినట్లయితే ప్రజలకు మంచి సేవలు అందుతాయని ఆసుపత్రి వైద్యులతో పాటు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ముఖ్య కార్యదర్శికి వివరించారు. ఈ అంశాన్ని ప్రభుత్వ స్థాయిలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని భోగాపురం వద్ద రోడ్డు ప్రమాద బాధితుల అత్యవసర చికిత్స కోసం ట్రామా కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్య కార్యదర్శి చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామ రాజు, డి.సి.హెచ్.ఎస్. డా.నాగభూషణ రావు, డి.ఎం.హెచ్.ఓ. డా.రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు. 

2022-10-15 11:30:16

నాణ్యతలో రాజీలేకుండా నిర్మాణాలు జరగాలి

నాణ్యతలో రాజీలేని విధంగా రోడ్ల నిర్మాణాలు ఉండాలని, నాణ్యత పై ఎన్ఫోర్స్మెంట్ తనిఖీకిలు ఉంటాయని జిల్లా కలెక్టర్పి ప్రశాంతి ఆర్ ఆర్ అండ్ బి అధికారులకు హెచ్చరించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ జిల్లాలో ఆర్ అండ్ బి చేపట్టే రోడ్లపై సంబంధిత  అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు చేసిన రోడ్ల మరమ్మతులు యధాస్థితికి రావడం పై అసహనం వ్యక్తం చేశారు. నిత్యం ప్రయాణించే రోడ్లే ప్రమాదానికి కారణం అయితే పరోక్షంగా మీరే బాధ్యులు అన్నారు.  ఉండి బైపాస్ రోడ్డు పరిస్థితి చూస్తుంటే  జిల్లా యంత్రాంగం పనితీరుకు మచ్చలాగా ఉందన్నారు.  గుంతలోని తేమ మీద ప్యాచ్ వర్క్ చేయడం వల్ల ఉపయోగం లేకుండా పోతుందన్నారు.  

ప్రాంతాలవారీగా పరిస్థితులను అంచనావేసి అందుకు అనుగుణంగా రోడ్లు చేపడితే ఎక్కువ మన్నిక  ఉంటాయని ఆ విధంగా ఆర్ అండ్ బి అధికారులు ఆలోచన చేయాలన్నారు.  లో లైన్ ఏరియాలో అవసరమైనచోట్ల కల్వర్టులు ఏర్పాటుచేసి రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. మొత్తం పాడై పోయేవరకు కాకుండా రవాణాకు అనుగుణంగా చిన్న, చిన్న మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర రిప్లై నిమిత్తం 32 పనులకు మంజూరు కోరగా స్టేట్ హైవే రోడ్స్ 15 మంజురు అయ్యాయని, అలాగే విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ 20 మంజూరైనట్లు ఆర్ అండ్ బి అధికారులు జిల్లా కలెక్టర్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు లేకపోతే అక్టోబర్ 28 నుండి రోడ్ల పనులు ప్రారంభించనున్నట్లు వారు జిల్లా కలెక్టర్ కు తెలిపారు.  

ఒక ఇంజనీరుగా రోడ్డు ఎలా వేస్తే ఎక్కువ కాలం మన్నిక వస్తుందో మీ అందరికీ తెలిసిందేనని, రోడ్లు నిర్మాణాలలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారి ఎస్. లోకేశ్వరరావు, డి ఈ లు రామరాజు, ఎస్వి రమణ, జి వి ఎస్ కిరణ్ కుమార్,  ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 11:20:26

నేటి తరానికి కలామ్ చక్కటి మార్గదర్శి

నేటి తరానికి భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న  ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ మార్గదర్శులని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం, ఆల్ కట్ తోటలోని అబ్దుల్ కలాం ఐఏఎస్ అండ్ నీట్ అకాడమీ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం జయంతి వేడుకల సందర్భంగా విగ్రహా ఆవిష్కరణ చేసి విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా కలెక్టరు డా.కే.మాధవీలత మాట్లాడుతూ  హార్డ్ వర్కు,హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ అని నిరంతరం
అబ్దుల్ కలామ్ పేర్కొనే వారన్నారు. అటువంటి వ్యక్తులు దేశానికే గర్వకారణమని, నేటి తరం  విద్యార్థులు , యువత వారి ఆదర్శయాలను  స్పూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. రాష్ట్రపతి పదవికి ముందే దేశం కోసం ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని తెలిపారు. ఆర్మీ, పృద్వి వంటి మిస్సైల్స్ తో పాటు మొత్తం మిస్సైల్స్ రంగంలోనే దేశానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. 

ఆయనకు పిల్లలన్న, విద్యార్థులన్న మక్కువని, తరచుగా తన హోదాను మరిచి కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉండేవారని అన్నారు. కలామ్ రచించిన ఇగ్నిటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 రచనలు పాత, కొత్త తరానికి కూడా చైతన్యం వస్తుందని తెలిపారు. అబ్దుల్ కలామ్ గొప్ప రాష్ట్రపతిగానే కాకుండా శాస్త్రవేత్తగా,  సామాజిక కర్తగా సేవలు అందించారన్నారు.   అటువంటి మహనీయుని జయంతిని నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. ఎంత పెద్ద లక్ష్యమైనా దానిని అధిరోహించే వరకు ప్రణాళికా బద్దంగా సాధన చేయాలని విద్యార్థులకు ఎల్లప్పుడు అబ్దుల్ కలామ్ చేప్పేవారన్నారు. 18 గంటలు చదివి ఒకరు విజయం సాధిస్తే మరొకరు విజయం సాధించ లేదంటే దాని అర్థం సరైన శిక్షణ పొందకపోవడమేనని అన్నారు. ఆయన చూపిన బాట అందరికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనలో పాలుపంచుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. 

అబ్దుల్ కలాం ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా భోధన చేస్తామని అకాడమీ  డైరెక్టర్ సూరి కుమారి అన్నారు. 5 వేల మంది ఐ.ఏ.ఎస్ లను, 5 వేల మంది ఇంజనీర్లు ను తయారు చేయడమే అకాడమీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అకాడమీ ఫౌండర్, మెంటర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ 2013 అకాడమీ స్థాపించామని తెలిపారు. ఈ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించి క్యాష్ ప్రైజ్ లు ఇస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 30న రాష్ట్ర స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో  గెలుపొందిన విద్యార్థులకు రూ 50 వేల రూపాయలు క్యాష్ ప్రైస్ ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రామ్ గోపాల్, అకాడమీ డైరెక్టర్ సూరి కుమారి, నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ టేకి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్ ఫర్సన్ బి. పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 11:16:44

చేతుల పరిశుభ్రతతో.. వ్యాధులను పారద్రోలుదాం

 చేతులను తరచూ శుభ్రం చేసి వ్యాధులను పారద్రోలుదామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు పిలుపునిచ్చారు. చేతులు శుభ్రం చేసుకునే ప్రపంచ దినోత్సవాన్ని జిల్లా ఆసుపత్రిలో శని వారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ చేతులు శుభ్రం చేసుకోవడం ఆవస్యం అన్నారు. క్రిములు, కీటకాలు చేతులకు అంటుకుంటాయని, చేతులు శుభ్రం చేయకుండా ఆహారం తీసుకోవడం వలన క్రిములు, కీటకాలు కడుపులోకి వెళ్ళి రోగాలకు కారణం అవుతుందని అన్నారు. కరోనా సమయంలో చేతుల శుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగిందని, దానిని కొనసాగించాలని కోరారు. చేతులు శుభ్రం చేయకపోవడం వలన కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన పొందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా బి.వాగ్దేవి, తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 11:07:54

రైతులను దళారుల నుండి కాపాడాలి

శ్రీకాకుళంజిల్లాలో ధాన్యం సేకరణలో దళారుల నుండి రైతులను కాపాడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ స్పష్టం చేశారు. నూతన విధానం ద్వారే ధాన్యం సేకరించాలని ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం సేకరణ పై ఆయన  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శత శాతం ఈ క్రాప్ చేసుకున్న రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొన్ని మండలాల్లో చేయని ఈ క్రాప్, ఈకెవైసిలను త్వరితగతిన చేయించేందుకు ఆర్డీఓలు వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏ మండలాల్లో అయితే ఈ క్రాప్ ఈకెవైసి పూర్తి చేయకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులదే బాధ్యతన్నారు. సచివాలయం, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

బస్తాలు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా గోనెసంచులు ఏర్పాటు చేసుకుంటే వారికి నగదు ఇస్తామని తెలిపారు. సేకరించిన ధాన్యాన్ని రవాణాకు అంతరాయం లేకుండా చూడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఏ సమస్య లేకుండా చూడాలన్నారు. వే బ్రిడ్జి నుండి ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం తీయించేటప్పుడు ఒక్క గ్రాము కూడా తేడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీవో లు ధాన్యం సేకరణ ఏర్పాట్లు పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు, విఆర్ఓలు, మిల్లర్లుకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు ఆర్డీఓ శాంతి వివరించారు. ఏ ఏ ప్రాంతాల నుండి ధాన్యం వస్తాయని పలాస ఆర్డీఓ ను జెసి అడుగుగా డివిజన్ కు ఒరిస్సా బోర్డర్ ఉందని ఒరిస్సా నుంచి ధాన్యం తరలి రాకుండా తగు చర్యలు చేపట్టి చెప్పారు.

 ఏ ఏ మండలాల నుండి వచ్చినదీ ఆర్డీవో సీతారామమూర్తి వివరించారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో పబ్లిసిటీ చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ ను ఆదేశించారు. ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు.   371 కేంద్రాలు ఇచ్చినట్లు జడ్పీ సీఈవో వెంకటరామన్ చెప్పారు. వాలంటీర్లకు వర్చ్యువల్ గా శిక్షణ ఇవ్వడమైనదని, ఫిజికల్ గా శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారు. భారత ఆహార సంస్థ అధికారి ధాన్యం నిల్వ కేంద్రాలపై జెసికి వివరించారు. ఆర్టీవో గంగాధర్ రవాణా వాహనాలు పై తెలియజేశారు. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూం కలెక్టరేట్ లో ఉంటుందన్నారు. ధాన్యం సేకరణలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జయంతి ధ్యానం సేకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు బి. శాంతి, సీతారామమూర్తి, జడ్పీ సీఈవో వెంకటరామన్, డిపిఓ రవి కుమార్, డిఎం జయంతి, డిఎస్ఓ వెంకటరమణ, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, డిఎంలు, లీగల్ మెట్రాలజి అధికారులు, కోపరేటివ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 09:32:50

నీటి వసతులను పరిరక్షించుకోవాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో నీటి వసతుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శనివారం  పార్వతీపురం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణం, దాని చుట్టు ప్రక్కల ఉన్న నీటి వసతుల ప్రాదాన్యత మరింత ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. పెద్ద నగరాలు, పట్టణాలు  వరదల సమయంలో ముంపుకు గురి కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే గత రెండు వారాలుగా ప్రత్యేక బృందాలు సర్వే చేపట్టి పలు చెరువులు, బందలు గుర్తించడం జరిగిందని వివరించారు. భవిష్యత్తులో పార్వతీపురం పట్టణం వరదలకు గురి కాకుండా ఉండుటకు వీటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వం  చెరువుల పరిరక్షణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. 

బాల గొడబలో లెంకల చెరువు, పార్వతీపురంలో నెల్లి చెరువు, దేవుని బంద, సుందర నారాయణ పురంలో కోడువానిబంద, కొత్తవలసలో రాయిబంద లను గుర్తించామని అన్నారు. వీటిపై కొంత మేర నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని, తదుపరి నిర్మాణాలు చేపట్టకుండా రెవిన్యూ, పోలీస్ యంత్రాంగాలు నిఘా పెట్టాయని చెప్పారు. ఆక్రమణలకు ఎవరూ పాల్పడవద్దని, పట్టణ, భావితరాల భవిష్యత్తు దృష్ట్యా విశాల దృక్పథంతో ఆలోచించాలని ఆయన సూచించారు. ఆక్రమణదారులను గుర్తించామని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.  నీటి వసతులు భూగర్భ జలాల పెంపుకు, వరదల సమయంలో పట్టణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా నీటిని నింపుకునే గొప్ప వనరుగా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. జిల్లా హెడ్ క్వార్టర్ మరింత అభివృద్ది చెందుతుందని అదే సమయంలో దాని రక్షణకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపనిచ్చారు. 

2022-10-15 09:08:00

మన్యం జిల్లా కేంద్రంలో గంట స్తంభం

పార్వతీపురం మన్యంలో గంట స్తంభం నిర్మించేందుకు యోచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. పార్వతీపురం పట్టణంలో స్థల గుర్తింపుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. శనివారం పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గంట స్తంభం నిర్మాణానికి పట్టణ, జిల్లా ప్రజలు మంచి సూచనలు, సలహాలు అందించాలని దానితోపాటు మంచి నమూనాలు (డిజైన్) 10 రోజుల్లో ఇవ్వాలని కోరారు. త్వరలో స్థలం నిర్ణయించి మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. జిల్లా ఏర్పడి ఏడాది పూర్తి అయ్యే నాటికి సిద్ధం చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.  అంతేకాకుండా ఆహ్లాదంగా నీటి వసతులు ఉండేలా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని విధాలా రక్షణ కవచంగా ఉపయోగపడే చెరువులను ఆహ్లాదంగా తయారు చేయుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. చెరువు గట్లపై వాకింగ్ ట్రాక్, విశ్రాంతి తీసుకొనుటకు బెంచీలు వంటివి ఏర్పాటు యోచన ఉందని ఆయన తెలిపారు.

2022-10-15 09:06:29