1 ENS Live Breaking News

గవర్నర్ పర్యటన విజయవంతం చేయాలి

తూర్పుగోదావరి జిల్లా అధికారులు, ఆయుష్ విభాగం వారితో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతం చేయాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ముందస్తు ఏర్పాట్లు పై సమీక్ష చేసి, అనంతరం ఆనం కళా కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్  హాజరు కానున్న దృష్ట్యా ఏర్పాట్ల విషయంలో అత్యంత జాగృత్తగా వ్యవహరించాలని అన్నారు.

రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటనను పూర్తి స్థాయి లో విజయవంతం చేయడం కోసం ఆర్ట్స్ కళాశాల నుంచి.. అధికార విడిది, అక్కడ నుంచి ఆనం కళా కేంద్రంలో  జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకల్లో పాల్గొని సందేశం ఇస్తారన్నారు.  ఉ.10.45 కు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్, చేరుకుని, మంజీరలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిది కి చేరుకుని, స్వల్ప విశ్రాంతి అనంతరం ఉ 11.20 కు బయలుదేరి ఉ.11.30 కి ఆనం కళా కేంద్రానికి చేరుకుంటారన్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, ఎంపి, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఆయుర్వేదిక్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నానున్నారని పేర్కొన్నారు. ఉ.11.30 నుంచి మ.12.30 వరకు "జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ " ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని  మ.12.40 కి మంజీర ప్రవేట్ అతిధి గృహంలో స్వల్ప విరామం  ఆర్ట్స్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ కి  మ.1.00 కు చేరుకుని  విజయవాడ కు బయలుదేరి వెళతారన్నారు.

సభా ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  మూడు రోజుల పాటు జరిగే జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకల సందర్భంగా ఉచిత ఆయుర్ వేద, యునాని , తదితర సంప్రదాయ వైద్య సేవలు ఉచితంగా అందచెయ్యడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 

ఈ సమావేశంలో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఏ సి పి జేవి సతీష్, ఆయుష్ జాతీయ జనరల్ సెక్రెటరీ మనోజ్ జెన, రాష్ట్ర కన్వీనర్ బాలు అక్కియా, ఎడిసి పిఎం సత్య వేణి, ఎస్ ఈ పాండురంగారావు,  ప్రభుత్వ ఆసుపత్రి సూరింటెండెంట్ డా ఆర్. రమేష్, ఎస్ డి సి  కె. గీతాంజలి, డ్వామా పీడీ జీ. రామ్ గోపాల్,  డి హెచ్.వో రాధాకృష్ణ,ఎక్సైజ్ ఇనస్పెక్టర్ ఆర్ సిహెచ్. చిట్టిబాబు, డి ఐ పి ఆర్ వో సిహెచ్. శ్రీనివాస్, ఫుడ్ ఇన్స్పెక్టర్, తహశీల్దార్లు, పోలీసు అధికారులు, నగరపాలక సంస్థ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-11-17 09:58:38

ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలి.

మానవాళికి పెను ముప్పు పొంచివున్న ప్లాస్టిక్ సంచుల నిషేధానికి ప్రత్యేక దృష్టిసారించాలని  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలు, జగనన్న భూ హక్కు సర్వే నిర్వహణ, జాతీయ ఉపాధి హామీ పనులు, జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిబంధనల మేరకు ప్లాస్టిక్ నిషేధం పగడ్బందిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్లాస్టిక్ సంచుల వాడకం నిర్మూలించడం తోపాటు పరిసరాల పరిశుభ్రత కు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెంది సుస్థిరమైన ఆదాయం సాధించేలా తోడ్పాటును అందించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులు మహిళా సంఘాలు ద్వారా విక్రయించి ఆదాయ వనరులను పెంపొందించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలు శత శాతం పనులు గ్రౌండింగ్ జరగాలన్నారు. జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని అన్నారు.
     
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు,  జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.కృష్ణా జి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామీణాభివద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్, జిల్లా సర్వే, భూ  రికార్డుల శాఖ అధికారి ఆర్. రాజ్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-11-17 09:43:36

రైస్ మిల్లుల్లో తప్పనిసరిగా సిసి కెమెరాలుండాలి

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని రైస్ మిల్లుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులలను జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి ఆదేశించారు.బుధవారం రాత్రి  స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. బుధవారం పరిశీలించిన ధాన్యం కొనుగోలు సెంటర్లో కొన్ని లోటుపాట్లను గమనించడం జరిగిందన్నారు.  సొసైటీలు ఏర్పాటు చేసుకున్న పిపిసి ఏజెన్సీ ప్రెసిడెంట్స్ ఆర్బికేల్లో అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కోపరేటివ్ అధికారిని ఆదేశించారు.  టెక్నికల్ అసిస్టెంట్లకు విధులు కేటాయించడంతోపాటు, అసిస్టెంట్ రిజిస్టర్లు ఆర్.బి.కెలను తరచు సందర్శించేలా చూడాలన్నారు.  తొలి విడతలో 34 ఆర్బికేల్లో పి పి సి సెంటర్లను వినియోగంలోకి తీసుకురాగా, నేటికీ వాటి సంఖ్య 67 గా ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 153 రైస్ మిల్లులో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మిగిలిన  రైస్ మిల్లులో కూడా వెంటనే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి ప్రతిరోజు డేటాను పరిశీలించేందుకు సమర్పించాలన్నారు. 

జిల్లాలో ఉన్న 296 ఆర్పీకెలలో సుమారు 400 తేమశాతం కొలిచే యంత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు.  ధాన్యం సేకరణ ముగిసిన ఆర్ బి కే ల నుండి  ఇతర సెంటర్లకు వాటిని తరలించేందుకు కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. బ్యాంక్ గ్యారంటీలను త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్ఓ ను ఆదేశించారు. జిల్లాలోని ఆర్బికెల్లో ఏ ఏ తేదీల్లో దాన్యం కొనుగోలు జరుగుతుందో షెడ్యూల్ను రూపొందించి ముందుగానే రైతులకు తెలియజేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారినీ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా కోపరేటివ్ అధికారి ఎం. రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, సివిల్ సప్లైస్  డి. ఎం టి శివరాం ప్రసాద్, డీఎస్ఓ ఎన్ సరోజ పాల్గొన్నారు.

Bhimavaram

2022-11-16 14:10:03

అడ్డగోలుగా ఇచ్చిన సిబిసిఎన్ సి టిడిఆర్ రద్దుచేయాలి

క్రిస్టియన్ మైనార్టీకి చెందిన సిబిసిఎన్సి స్థలం టిడిఆర్ రద్దుచేసి, అడ్డగోలుగా టి డి ఆర్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన జీవీఎంసీ కమిషనర్ పీ రాజబాబు, మేయర్ హరి వెంకట కుమారిలకు సి బి సి ఎన్ సి స్థల బాగోతంపై  ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిరిపురం సమీపంలోని సుమారు రూ.500 కోట్ల విలువగల క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన స్థలాన్ని కబ్జా చేయడానికి ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, స్మార్ట్ వైజాగ్ సిటీ మాజీ చైర్మన్ జీవి కలిసి పథకం వేసారని ఆరోపించారు. గత కొన్ని ఏళ్లుగా ఈ స్థల వివాదం హైకోర్టులో నడుస్తుందని, దీనిపై ఎనిమిది కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయన్నారు.  ఇవన్నీ దాచేసి18 సంస్థల క్రిస్టియన్ మిషనరీకి చెందిన  18,390 గజాల సీబీసీఎన్సి స్థలాన్ని ఆదిత్య పవన్ డెవలపర్స్ కు  డెవలప్మెంట్ నిమిత్తం ప్లాన్ మంజూరు ఎలా చేశారని ప్రశ్నించారు.  ప్లాన్ అనుమతులకు అవసరమైన ఈసి, స్థల డాక్యుమెంట్లు, గతంలో యూఎల్ సి క్లియరెన్స్ వంటి డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో సమర్పించక పోయినా,  టౌన్ ప్లానింగ్ అధికారులు బి ఏ నెంబర్ కేటాయించినట్టు తెలిపారు. ప్లాన్ అనుమతుల కొరకు 18,390 గజాల స్థలానికి వి ఎల్ టి కింద సుమారు రూ.2.56 కోట్లు జీవీఎంసీకి పన్నులు చెల్లించాలని, ఈ మొత్తాన్ని చెల్లించకుండా ఉండేందుకు జీవీఎంసీ రెవిన్యూ అధికారులు ఖాళీ స్థలంలో అక్రమంగా 18 ఎస్సేస్మెంట్ నంబర్లు కేటాయించి,   సదరు డెవలపర్లకు  కోట్ల రూపాయల  ప్రయోజనం చేకూర్చారని ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో జీవీఎంసీ ఆదాయానికి నష్టం కలిగించిన సంబంధిత రెవిన్యూ అధికారులపై చట్టపరమైన  చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి  తప్పించాలని కోరారు. సర్వే అధికారుల నివేదిక  ప్రకారం టౌన్ ప్లానింగ్ అధికారులు  దినకర్ త్యాగరాజ్  పేరుతో 1800 గజాలకు నాలుగు రెట్లు అంటే సుమారు రూ. 62 కోట్ల విలువగల టీడిఆర్ సమర్పించారన్నారు. 2006లో మాస్టర్ ప్లాన్ లో జీవీఎంసీ రోడ్ల నిర్మాణంలో స్థలాలు పోగొట్టుకున్న వారికి, బి ఆర్ టి ఎస్ రోడ్లు వేసేటప్పుడు స్థలాలు కోల్పోయిన వారికి నేటి వరకు టిడిఆర్లు ఇవ్వలేదని, సి బి సి ఎన్ సి స్థలంలో టీడిఆర్ లు కేవలం 18 రోజుల వ్యవధిలో దినకర్ త్యాగరాజ్ కు నాలుగు రెట్లు అధికంగా రూ.62కోట్ల విలువైన టీడిఆర్ ఇచ్చేసారన్నారు.  తణుకులో 350 కోట్ల టిడిఆర్ స్కాం జరిగిందని, దీంతో తణుకు మున్సిపాలిటీ బ్లాక్ లిస్టులో పెట్టిందని, కొంతమంది అధికారులను వైసీపీ నేతలు బలి చేశారని గుర్తు చేశారు. కాబట్టి  సి బి సి ఎన్ సి స్థలానికి అనుమతులు, బీ ఏ నెంబర్ రద్దుచేసి, టి డి ఆర్ లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్ ను కోరినట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన నేత శ్రీనివాస్ పట్నాయక్ కూడా ఉన్నారు.

Visakhapatnam

2022-11-16 13:51:00

ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు రూ.2.38 కోట్లు మంజూరు

పరిశ్రమలకు సంబంధించి   30 దరఖాస్తులకు సంబంధించి వివిధ పరిశ్రమల ప్రోత్సాహకాల కింద రూ. 2.38 కోట్లు మంజూరు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. బుధవారం సాయంత్రం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా.. పరిశ్రమలు, ఎపీఐఐసీ, గ్రౌండ్ వాటర్, ట్రాన్స్ పోర్టు, అగ్నిమాపక, పంచాయతీ, ఫ్యాక్టరీస్, ట్రాన్స్ కో, లీడ్ బ్యాంకు తదితర శాఖలతో కలిసి జిల్లాస్థాయి పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గత నెల జరిగిన సమావేశంలో తీర్మానించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలపై కమిటీ తొలుత చర్చించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు ఏక గవాక్ష విధానంలో వచ్చిన 23 దరఖాస్తులలో 15 దరఖాస్తులను కమిటీ ఆమోదించడం జరిగిందన్నారు. ఇందులో 1 దరఖాస్తును తిరస్కరించగా 7దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టరు తెలిపారు.

అదేవిధంగా  ఎంఎస్ఎంఈ లకు సంబంధించి 30 దరఖాస్తులు గాను 2.38 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇందులో జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ. 2.08కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 59 పరిశ్రమలకుగాను ఇప్పటి వరకు 51 పరిశ్రమల్లో తనిఖీలు పూర్తి చేయడం జరిగిందని కలెక్టరు తెలిపారు. జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం టి.మురళి, ఏడీ కె.కృష్ణారావు, ఎపీఐఐసీ జేడ్ఎం బి.హరిధర్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జే.రంగలక్ష్మిదేవి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాథాకృష్ణ, ఎల్డీఎం సీహెచ్ఎస్వి.ప్రసాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్. అశోక్, గ్రౌండ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ అధికారులు, ఇండస్ట్రీస్ ప్రతినిధులు  ఇతర అధికారులు హాజరయ్యారు.

Kakinada

2022-11-16 13:47:08

విలేకరులతో ఉన్న అనుబంధం మరువలేనిది

కాకినాడ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విలేకరులతో తనకున్న అనుబంధం మరువలేనిదని,  విలేకరులకువిద్య,  ఆరోగ్య పరంగా అన్ని విధాల తన వంతు సహాయం నిరంతరం ఉంటుందని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల అన్నారు. విలేకరులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య, విద్య,  వైద్య పరంగా తనకు తెలియజేస్తే విధానపరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని కలెక్టర్ విలేకరులకు భరోసా కల్పించారు. బుధవారం కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో కాకినాడ చిన్న మధ్య తరహా దినపత్రికల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమారాధన, జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులుగా వారణాసి సూర్యనారాయణ, డాక్టర్ వైవి పరశురాం, అడపా అప్పారావులను పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

   ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జర్నలిస్టులుగా ఎనలేని సేవలు చేస్తారని కొన్నంటిని ప్రాణాలు తెగించి ధైర్య సాహసాలతో వార్తలను తీసుకొని ప్రచారం చేస్తుంటారని అటువంటి విలేకరులను మరువలేమని ఆమె చెప్పారు. కాకినాడలో తాను జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న కాలం నుండి జిల్లా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని ఈసారి పంట అధిక స్థాయిలో దిగుబడి అయిందని, ఇది చాలా మంచి పరిణామన్నారు. అధిక స్థాయిలో దిగుబడి రావడం రైతులకు ఆనందంగా ఉందని చెప్పారు. విలేకరులకు తన అవసరం వచ్చినప్పుడు సహాయం పడతానని చెప్పారు. అనంతరం కలెక్టర్కి విలేకరులు ధన్యవాదాలు తెలిపారు.

  ఈ కార్యక్రమంలో కాకినాడ నగరానికి,  రూరల్ ప్రాంతానికి చెందిన విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక వన సమారాధనతో పాటు జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.

Kakinada

2022-11-16 13:43:36

నాడు-నేడు పనులు సత్వరమే పూర్తిచేయాలి

నాడు-నేడు పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి మండల స్థాయి అధికారులతో నాడు-నేడు పనుల , ఆధార్ అప్డేషన్ , ఏపీ సేవ సర్వీసులు  గృహ నిర్మాణం , జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు,   అమూల్ పాల కేంద్రాల ప్రారంభం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నిధులను సక్రమంగా వినియోగించి ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేయాలన్నారు. నాడు-నేడు కింద చేపట్టిన పనులకు సంబంధించి పాఠశాలలు, కళాశాలలో ఏ ఏ  నిర్మాణాలు చేపడుతున్నారో అన్ని పనులకు  ఒకేసారి జరగాలని ఆమె ఆదేశించారు.   ఎక్స్పెండిచర్ కూడా బుక్ చేయాలని కలెక్టర్  ఆదేశించారు.  అదనపు గదులు నిర్మాణం  ,కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్ , డ్రింకింగ్ వాటర్ తదితర పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు .  నాడు నేడు పనులకు ఇసుక కొరత లేదని అన్ని పనులు ఒ ఒకేసారి ప్రారంభించి పనులు కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు.  

   ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును విధిగా అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆధార్ కార్డు  పొంది పది సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు అడ్రస్ తదితర వాటిని  ఆప్ డేట్ చేసుకోవాలని ఆమె అన్నారు . పిల్లల ఆధార్ కూడా అప్డేట్ చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ నెల 18 ,19 తేదీలలో ప్రత్యేక ఆధార్ నమోదు, అప్డేషన్ క్యాంప్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలు , దరఖాస్తులు త్యారిత గతిన పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనుల లకు అంచనాలు తయారు చేసి పంపించాలని ,మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.

     జిల్లాలో ప్రతి శనివారం గృహ నిర్మాణాలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ మీటింగ్ నిర్వహించి గృహ నిర్మాణానికి సంబంధించిన అధికారులతో చర్చించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని అక్కడే అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారం గృహ నిర్మాణం స్టేజ్ కన్వర్షన్ పనులు చాలా మందకోడిగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేజ్ కన్వర్షన్ పనులు కూడా వేగవతం కావాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స లో డిఇఓ ఆర్.వి రమణ, సమగ్ర శిక్ష ఏ పి సి  పి. శ్యాంసుందర్,  డి ఆర్ డి ఏ పి డి వేణుగోపాల రావు  ,డ్వామా పీడి రాజేశ్వరరావు , డి ఎల్ డి ఓ కే సి హెచ్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-11-16 13:05:38

జిల్లాలో నేటి నుంచి ఇంటింటా కుష్టువ్యాధి సర్వే

కుష్టు వ్యాధి నివారణపై నవంబరు 15 నుండి డిసెంబరు 5వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వస్తున్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు చెప్పారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం సర్వే నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సోమ వారం కర పత్రంను ఆవిష్కరించారు. సర్వేలో ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎం, పురుష వాలంటీర్లు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాలని తెలిపారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్నవారు, కనుబొమ్మలు, రెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనుబొమ్మలు మూతపడటం లాంటివి ఎవరికైనా ఉంటే వారు స్వచ్చందంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రంకి వచ్చి వివరాలను అందించాలని అన్నారు. కుష్టు వ్యాధి సులభంగా అంటుకునే అంటు వ్యాధి కాదని, ఇది చర్మానికి, నాడీ వ్యవస్థకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధి అని వివరించారు. క్షయ వ్యాధికి  కారకమైన మైక్రో బాక్టీరియా వల్ల కుష్టు వ్యాధి వస్తుందని చెప్పారు. వైద్య శాస్త్రం ఎంతో అభివద్ధి చెందినా ఇంకా సమాజంలో కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల నిరాదరణ కొనసాగుతూనే ఉందని, పూర్వకాలంలో ఈ వ్యాధికి సరైన మందు ఉండేది కాదని వివరించారు. 1873 లో హన్సన్‌ అనే నార్వే శాస్త్రవేత్త ఈ వ్యాధికి కారకమైన సూక్ష్మజీవిని కనుగొన్నాడని తెలిపారు. దీని వలన శాశ్వతమైన అంగవైకల్యం కలుగుతుందన్నారు. ప్రాథమిక దశలోనే వైద్యులను సంప్రదించాలని వివరించారు. జాతీయ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కుష్టు వ్యాధి చర్మం అసలు రంగు కంటే ముదురు లేదా లేత రంగులో ఉండే  మచ్చల ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారన్నారు. ఈ వ్యాధిని నిర్ధారించడానికి చర్మ లేదా నరాల బయాప్సీ చేసి వ్యాధిని నిర్దారించవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యాధిని అదుపుచేయుటకు యం.డి.టి మందులను ఆరోగ్య కార్యకర్తలు ఉచితంగా పంపిణీ చేస్తారని, వాటిని వాడవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి ధవళ భాస్కరరావు., డా.వినోద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-11-15 13:00:12

బాధిత కుటుంబాలరు రూ.20లక్షలు అందజేత

దేవరపల్లి కొండగూడెం విజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో జరిగిన ప్రమాదం లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు చెందిన ఒకొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటిందని జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం కంపెనీ వారి నిర్లక్ష్యం కారణంగా ప్రాథమిక విచారణ లో తెలియ వచ్చిందని, పూర్తి స్థాయి విచారణ కు ఆదేశించడం జరిగిందని కలెక్టర్ అన్నారు 

ఈ ప్రమాదం కారణంగా దుంగ మహిదర్, ఎంగాల రత్నబాబు, సత్యనారాయణ అనే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారన్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు  చెందిన చదువుకున్న వ్యక్తికి ఒకరికి కంపెనీ లో ఉద్యోగం,  అంతిమ సంస్కరాలు కోసం తక్షణ ఆర్థిక సహాయం గా కంపెనీ తరపున ఒక్కొక్కరికి రూ. 2.50 లక్షలు ఆర్థిక సహాయం అందజేసినట్టు పేర్కొన్నారు.


Rajamahendravaram

2022-11-15 12:30:27

వివాదాలకు తావు లేకుండా పక్కాగా భూముల రీసర్వే

వివాదాలకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అదేశించారు. మంగళవారం కలెక్టర్ పాడేరు కార్యాలయం సమావేశమందిరంలో రీసర్వే పై మండల సర్వేర్లు, గ్రామ సర్వేయర్లుతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వెక్టరైజేషన్ సక్రమంగా జరగాలని స్పష్టం చేశారు. మండల సర్వేయర్లు, తాసిల్దార్లు భూమి మీదకు వెళ్లి 
అభ్యంతరాలను పరిశీలించాలని అన్నారు. సర్వేయర్లు ఎఫ్ఎంబిని దగ్గర ఉంచుకుని రీ సర్వే చేయాలన్నారు. ఎఫ్ఎంబి పై సర్వేయర్లకు, రెవెన్యూ అధికారులకు అవగాహన ఉండాలన్నారు. ముసాయిదా ల్యాండ్ రిజిస్టర్ లో చెందిన వారి పేర్లు, జాయింట్ పట్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, కలెక్టరేట్ ల్యాబ్ లో వెక్ట్రైజేషన్ చేయాలని చెప్పారు. రీసర్వే డేటాను నాణ్యతలు పరిశీలించి తహసిల్దార్ లాగిన్ నుండి ఆర్డీవో లాగిన్ కి పంపించాలని అన్నారు. రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ వేగవంతం చేయాలని చెప్పారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఆర్డీవో బి. దయానిధి, సర్వే సహాయ సంచాలకులు వై .మోహన్ రావు , మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-11-15 10:53:51

మహాదీపోత్సవం వేదికను పరిశీలించిన టిటిడి జెఈఓ

విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ వద్ద కార్తీక మహాదీపోత్సవం వేదికను టిటిడి జెఈఓ సదా భార్గవి సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ టిటిడిలోని ఇంజినీరింగ్, ఎస్వీబీసీ, ప్రజా సంబంధాలు, శ్రీవారి సేవ, నిఘా, భద్రత, ఉద్యానవన, ఆరోగ్య, అన్నమాచార్య ప్రాజెక్టు, ఆలయం తదితర విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసే శోభాయమానంగా వేదికను ఏర్పాటు చేశారని చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు యతివందనంతో కార్యక్రమం మొదలవుతుందని, 
రాత్రి 8.30 గంటలకు ముగుస్తుందని తెలియజేశారు. ఇందులో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి సుబ్బారెడ్డి సందేశం, విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం, సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపారు. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి  శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 

టిటిడి సివిఎస్వో  నరసింహ కిషోర్ మాట్లాడుతూ స్థానిక పోలీసుల సహకారంతో దీపోత్సవానికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు. భక్తులకు సేవలందించేందుకు 1000 మంది శ్రీవారి సేవకులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా సౌండ్ సిస్టం, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రత్యేక ఆకర్షణగా సైకత  శ్రీవారి శంఖుచక్రాలు వేదిక వద్ద  జగదీష్ ఆధ్వర్యంలోని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఇసుకతో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి శంకు చక్ర నామాలు ప్రత్యేక 
ఆకర్షణగా నిలుస్తున్నాయి.

 జెఈఓ వెంట ఎస్వీబీసీ సీఈవో  షణ్ముఖ్ కుమార్, దాతలు రాజేష్,  హిమాంశుప్రసాద్,  కృష్ణప్రసాద్, టిటిడి 
ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, పిఆర్ఓ డా.టి.రవి, డిఇ  రవిశంకర్ రెడ్డి, డిఎఫ్ఓ  శ్రీనివాస్, విజివో  మనోహర్ తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2022-11-14 14:10:30

కుమ్మరి శాలివాహనుల సమస్యల పరిష్కారానికి కృషి

అనకాపల్లిజిల్లాలో కుమ్మరి శాలివాహనుల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంఘ చైర్మన్ ఎమ్.పురుషోత్తం తెలిపారు. సోమవారం డైరెక్టర్ డి.ఏ. వెంకటరావు ఇతర సభ్యులతో కలసి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి కి విజ్ఞాపన పత్రం అందజేశారు.  దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని  తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా నియమింప బడిన సంఘ సభ్యులు కొత్తూరు జయమ్మ (తీడ గ్రామము), శ్రీకాకులపు జగదీశ్వరరావు (నరసయ్యపేట)కొత్తూరు త్రిమూర్తులు (దేవరాపల్లి), మునగపాక గోవింద (యలమంచిలి) బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బీసీ సంక్షేమ అధికారి కే.రాజేశ్వరి సంఘ సమావేశం నిర్వహించారు.  చైర్మన్, డైరెక్టర్ సభ్యులు  జిల్లాలో కుమ్మరి శాలివాహనలకు  సమస్యలపై చర్చించారు.

Anakapalle

2022-11-14 11:37:17

మంచి పుస్తకం మనిషి జీవితంలో మార్పు తెస్తుంది

మంచి పుస్తకాలు మనిషి జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తాయని రాష్ట్ర పరిశ్రమల,పెట్టుబడులు – ప్రాధమిక వసతులు, వాణిజ్యం,ఐటీ శాఖా మంత్రి  గుడివాడ అమర్ నాధ్ పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని కోరారు. సోమవారం ఉదయం 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక విఎమ్ఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జునతో కలిసి ఆయన పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగాఏర్పాటు చేసిన సభలో  మంత్రి మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు సమాజం పట్ల అవగాహన అవసరమని అన్నారు. గొప్పగొప్ప రచయితల రచనల ద్వారా సమాజం పట్ల, వివిధ అంశాల పట్ల అవగాహన పెంచుకోవచ్చునని అన్నారు. పుస్తకాలు సమాజంలో ఎన్నో మార్పులకు దోహదం చేశాయని పేర్కొన్నారు. పుస్తక పఠనం ప్రతీఒక్కరికీ అవసరమని, మంచి పుస్తకాలను అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. జిల్లా  గ్రంథాలయంలో ఎన్నో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రంథాలయాల్లో మరిన్ని మౌలిక వసతులను కల్పించి మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.  

జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ దేశమంతా పిల్లలు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. గ్రంధాలయల యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు .  బాలల కోసం గ్రంధాలయ వారోత్సవాలు జరపడం మంచి శుభ పరిణామన్నారు.   మన దగ్గర ఉన్న పుస్తకాలే కాకుండా  గ్రంధాలయంలో ఉండే పుస్తకాలను కూడా పఠనం చేయాలన్నారు.  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కొండా రమాదేవి మాట్లాడుతూ సమాజ వికాశంలో గ్రంథాలయాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పిల్లలు టీవీలు, ఫోన్ లకు పరిమితం కాకుండా పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పెద్దవారు కూడా పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవడమే కాకుండా పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని కోరారు.
  
ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి,  డిఇఓ చంద్రకళ, వివిధ కార్పొరేషన్ చెర్మన్ లు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు  గ్రంథాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-11-14 11:08:21

మెర్జెడ్ అంగన్వాడీ కేంద్రాలకు తాత్కాలిక సూపర్వైసజర్లు

ఇటీవల ప్రభుత్వ నిబంధనల మేరకు మెర్జ్ చేసిన అంగన్వాడీ కేంద్రాలలో సూపర్వైజర్ పోస్ట్ లను సర్దుబాటు ద్వారా  తాత్కాలికంగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, విజయనగరం జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తాత్కాలిక సూపర్వైజర్ గ్రేడ్ 2 నియామకాలు నవంబర్ 1వ తేదిన వెలువడినప్రభుత్వ ఉత్తర్వులు మేరకు నియమ,నిబంధనలను అనుసరిoచి ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల విధులకు ఆటంకం లేకుండా మెర్జెడ్ అంగన్వాడి సెంటర్ లో 
పనిచేయుచున్న అంగన్వాడి కార్యకర్తలలో ఉన్నత విద్యఅర్హత ప్రాతిపదికన  ఎంపిక చేపట్టడం జరిగిందని తెలిపారు.  మెర్జెడ్ అంగన్వాడి సెంటర్ నందుకార్యకర్తలను తీసుకోవటం వల్ల అంగన్వాడి కేంద్రం విధులకు ఒకరు సెక్టార్ ఇన్ ఛార్జ్ యాక్టింగ్  సూపర్వైజర్ ,  ప్రస్తుత నియామకం తాత్కాలిక నియామకం మాత్రమేనని తెలిపారు. సదరు తాత్కాలిక బాధ్యతలు సూపర్వైజర్ గా నివర్తిస్తున్న వారికి 5000 రూపాయలు ఎలెవన్స రూపంలో చెల్లిస్తారన్నారు.

Vizianagaram

2022-11-14 10:59:16

విజయనగరం జిల్లాలో స్పందనకు 155 వినతులు

విజయనగరం జిల్లాలో సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 155  వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 32,  డి.ఆర్.డి.ఏ కు 17,  డి.పి.ఓ కు 5, హౌసింగ్ కు 7, మున్సిపల్ శాఖ కు 13 అందగా అత్యధికంగా  రెవిన్యూ కు సంబంధించి 74 వినతులు, మాన్యువల్ గా 7 అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, భూ సమస్యలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులను జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, జె.సి మయూర్ అశోక్,   ఉప కలెక్టర్లు సుదర్శన  దొర, సూర్యనారాయణ, పద్మావతి  స్వీకరించారు. రీ ఓపెన్  వినతుల  అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అర్ధవంతమైన సమాధానాలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. 

Tirumala

2022-11-14 10:43:17