1 ENS Live Breaking News

వచ్చే ఏడది నుంచి రాష్ట్రమంతా ఫోర్టిపైడ్ బియ్యం

పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఐసిడిఎస్, పౌర సరఫరాలు, విద్య, గిరిజన సంక్షేమ శాఖాదికారులను ఆదేశించారు.  శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షించిన చైర్మన్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది మే నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిపైడ్ బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేసారు.  గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటించిన కమిషన్ చైర్మన్ అనంతగిరి, అరకు, దుంబ్రిగుడ, పాడేరు మండలాలలోని 30 కేంద్రాలు (ఎం.ఎల్.ఎస్ పాయింట్లు, చౌక దుకాణాలు, అంగన్వాడి కేంద్రాలు, సంచార పంపిణీ వాహనాలు, పాటశాలలు, వసతి గృహాలు) సందర్శించి లోటుపాట్లను గుర్తించి తగు సూచనలు జారీ చేసామని తెలిపారు. ఇంతవరకు రాష్ట్రవ్యాప్తంగా 366 కేంద్రాలు సందర్శించి కొన్ని కేంద్రాలపై చర్యలు కుడా తీసుకున్నామని స్పష్టం చేసారు. 

జిల్లాలో శాఖ తరుపున చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని, సమస్యలు పరిష్కరించుకుంటూ నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని, కమీషన్ లక్ష్యంగా పెట్టుకుందని,  ఆ దిశలో అందరూ పనిచేయాలని స్పష్టం చేసిన కమిషనర్ అలసత్వాన్ని, నాణ్యతా లేమిని సహించేది లేదని, అటువంటి వారిపై చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.  సమస్యలను. అర్ధం చేసుకోవటమే కాకుండా సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. అంగన్వాడి వర్కర్ల నిరక్షరాస్యత వల్ల కొన్ని కేంద్రాలలో తగు న్యాయం జరగటం లేనట్లు గుర్తించామని, అటువంటి కేంద్రాలపై మరింత ద్రుష్టి సారించాలని సూచించారు.  హాజరు నమోదులో, నాణ్యతలో రాజీ లేకుండా ఖచ్చితమైన కొలతలతో ఆహారాన్ని పెట్టాలని ఆదేశించారు.  ఆహార వస్తువులు, గుడ్లు, పప్పులు, నూనేలపై గడువు తేదీ పరిశీలించాలని కోరారు.  సిడిపిఓలు క్రమం తప్పకుండ కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు.

మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని, ఫోర్టిపైడ్ బియ్యం గూర్చి అవగాహన కల్పించాలని చైర్మన్ ఆదేశించారు.  పిల్లలకు బలమైన ఆహరం అందించటానికి విటమిన్లు, ఐరన్ కలిపి తయారు చేసిన ఫోర్టిపైడ్ బియ్యం ప్రతి కిలోకు 50 గ్రాములు అందిస్తున్నామని వివరించారు.  రాష్ట్రంలో అన్ని అంగన్వాడి,  విధ్యాసంస్థలతో పాటు ఏడు జిల్లాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిపైడ్ బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.  పిల్లలే కదా ఎదో ఒకటి పెడదామని ఆలోచించకుండా వారికి పౌష్టికాహారం అందించాలని, వాళ్ళ హక్కులను కాలరాసే ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించి చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.  ఇటీవల పాడేరు కెజిబివి విద్యార్ధులు ఆహరం సరిగా అందించటం లేనందున ధర్నా చేసినట్లు, ఒక్క చికెన్ ముక్క మాత్రమె వేస్తున్నారని మెసేజ్లు వచ్చాయని తెలిపారు.  

ఆహార పంపిణీలో నాణ్యత, పరిమాణం లో తేడాలు ఉంటే 94905 51117 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎపి ఫుడ్ కమిషన్ మూడవ స్థానంలో ఉందని,  దానిని మొదటి స్తానంకు తీసుకు రావటానికి చేస్తున్న కృషిలో అందరూ సహకరించాలని కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి చేసారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ,  ఫుడ్ కమిషన్ చైర్మన్ జిల్లాకు రావటం సంతోసకరమని,  వారి సందర్శనలో గుర్తించిన లోపాలను సరి చేస్తామన్నారు.  జిల్లాలొ భౌగోళికంగా ప్రత్యెక పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ నాణ్యమైన సేవలు అందించటానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని చైర్మన్ కు తెలిపారు. కమిషన్ సూచనలను, సలహాలను అమలు చేస్తామన్నారు. 

జేసి శివ శ్రీనివాసు మాట్లాడుతూ పౌర సరఫరాలు, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం అమలు పై ప్రత్యెక దృష్టి సారిస్తామని, పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని అందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని తెలిపారు.  సంచార పంపిణీ వాహనాలు ఎత్తైన కొండ ప్రాంతాలకు వెళ్ళటం ఇబ్బందిగా ఉందని, సిగ్నల్ సమస్య కూడా ఉందని చైర్మన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్, ఐటిడిఎ ఇంచార్జ్ ప్రాజెక్ట్ అధికారి వి. అభిషేక్, పౌర సరఫరాల ఉప సంచాలకులు సురేష్, జిల్లా పౌర సరఫరా అధికారి శివ ప్రసాద్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గణేష్ కుమార్, ఐసిడిఎస్ పధక సంచాలకులు సూర్య లక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి డా. పి. రమేష్, డిఎంహెచ్ ఓ డా. బి. సుజాత, ఎటిడబ్ల్యుఓ ఎల్. రజని, సిడిపిఓలు, ఎంఇఓలు, తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 12:27:27

రైతులు తప్పకుండా ఈకేవైసీ చేయించాలి

మామిడి పంట వేసిన  రైతులు కూడా ఈ.కే.వై.సి చేయించాలని, లేని యెడల పంటల నష్ట పరిహారం, ఇన్సురెన్సు వర్తించవని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి స్పష్టం చేసారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్.బి.కే ల ద్వారా రైతులకు ఈకేవైసీపై అవగాహన కలిగించాలని  జిల్లా వ్యవసాయాధికారి తారక రామారావు కు సూచించారు. పశువులకు వాక్సినేషన్  లక్ష్యాలను పూర్తి చేయాలనీ జే.డి డా. రమణ కు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలో శత శాతం టాయిలెట్లు ఉండాలని , విద్యార్ధి, ఉపాధ్యాయుల నిష్పత్తి ఖచ్చితంగా ఉండేలా చూడాలని డి.ఈ.ఓ వెంకటేశ్వర రావుకు తెలిపారు. 

పి.ఎం.జి.ఎస్.వై క్రింద చేపడుతున్న రహదారుల పురోగతి పై సమీక్షించారు. 34 రహదారులకు గాను 15 పూర్తి అయ్యాయని, మిగిలినవి పలు దశల్లో ఉన్నాయని ఆర్ అండ్ బి  ఈ ఈ వెంకటేశ్వర రావు తెలుపగా మార్చ్ నెల లోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు.  మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి వనరులు ఉన్న ప్రతి రైతు 90 శాతం సబ్సిడీ పై ప్రభుత్వం అందిస్తున్న  డ్రిప్, స్ప్రింక్లర్ కొనుగోలు చేయాలనీ , అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలనీ ఏ.పి.ఎం.ఐ.పి ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కు సూచించారు.   జలజీవన్ మిషన్ క్రింద మంజూరైన ప్రాజెక్ట్ లకు వెంటనే టెండర్స్ పిలవాలని గ్రామీణ నేటి సరఫరా ఎస్.ఈ ఉమా శంకర్ కు సూచించారు. 

నీతి అయోగ్ సూచీలన్నీ శత శాతం సాధించాలని, ఏ ఒక్క శాఖ వెనుకబడినా జిల్లా వెనుకబడిపోతుందని స్పష్టం చేసారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్. డా. నాగభూషణ రావు, ఐ.సి.డి.ఎస్. పి.డి. శాంత కుమారి, సి.డి.పి.ఓ లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

2022-10-14 11:52:29

అంగన్వాడీల్లోనే గర్భిణీలకు భోజనం పెట్టాలి

గర్భిణీల  గుర్తింపు,  వారి పర్యవేక్షణ  శతశాతం  జరగాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఐసీడిఎస్, వైద్యఆరోగ్యశాఖ అధికారులను  ఆదేశించారు. బయట జిల్లాల, రాష్ట్రాల  నుండి వచ్చిన వారిని కూడా నమోదు చేసి వారికీ అవసరమగు అలహాలను అందించాలని సూచించారు. ఎలిజిబుల్  కపుల్స్  ను గుర్తించి వారితో ఎప్పటికప్పుడు ఏ.ఎన్.ఎం,ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు  మాట్లాడుతూ ఉండాలని అన్నారు. శుక్రవారం  కలెక్టర్ తన ఛాంబర్ లో ఆకాంక్షల జిల్లా సుచీలైన  వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులతో  గర్భిణీల నమోదు, సామ్. మాం  , బాల్య వివాహాలు, సఖి బృందాలు,  వ్యవసాయం ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ శాఖలు, పంచాయతి రాజ్, విద్యా శాఖల సూచీల పై  సమీక్షించారు. 3వ సారి గర్భం ధరించిన వారిపై ప్రత్యెక దృష్టి పెట్టాలని, అందుకు గల కారణాల పై ఆరా తీసి వారికీ కౌన్సిలింగ్ చేయాలనీ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల పై , సిజారియన్లు  పై సమీక్ష చేయాలనీ సూచించారు. హై రిస్క్ గర్భినీలను ముందే గుర్తించి వారి పై ప్రత్యెక దృష్టి పెట్టాలని అన్నారు. గర్భిణీల నమోదు పై  లక్ష్యాలు వారీగా సమీక్షించి తక్కువ సాధించిన  వైద్యారులను, సి.డి.పి.ఓ లను అందుకు గల కారణాల పై ఆరా తీసారు. అపార్ట్ మెంట్ ల లో ఉన్న వారు సర్వే కు రానివ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాలంటీర్ల ద్వారా  వెళ్ళాలని, ఒక సారి పరిచయం అయితే ఇక పై సర్వే కు సహకరిస్తారని కలెక్టర్ తెలిపారు. 

అంగన్వాడీ కేంద్రం పరిధి లో ప్రతి వారం లో ఒకసారైన సఖి బృందాల సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశాలకు వైద్యాధికారులు కూడా హాజరు కావాలని , బాలికల ఆరోగ్య సమస్యల పై చర్చించాలని అన్నారు. ఎర్లీ ప్రేగ్నన్సి వలన శరీరానికి కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించాలని తెలిపారు.   సామ్, మాం పిల్లలు ఎక్కువగా ఉన్న కేంద్రాలను ఎక్కువ సార్లు సి.డి.పి.ఓ లు సందర్శించి వారికీ ప్రత్యెక ఆహారాన్ని ఎలా అందించాలో వారి తల్లులకు అవగాహన కలిగించాలన్నారు.  6 నెలలకే అన్నప్రాసన జరగాలని, గుడ్డు, పాలు, బాలామ్రుతం  పిల్లలకు అందజేయాలని తెలిపారు. ఈ విషం పై తల్లులకు అవగాహన కలిగించాలని తెలిపారు.  బాల్య వివాహాల నిరోధానికి పోలీస్ ల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్. డా. నాగభూషణ రావు, ఐ.సి.డి.ఎస్. పి.డి. శాంత కుమారి, సి.డి.పి.ఓ లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

2022-10-14 11:48:01

ప్రభుత్వ నిర్మాణాలు వేగవంతం చేయాలి

నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న గృహాలు, ప్రభుత్వ శాశ్వత భవనాల పనులపై ప్రత్యేక దృష్టిసారించి వినియోగంలో తీసుకు వచ్చే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు డా కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ లో కాకినాడ, పెద్దాపురం డివిజన్ పరిధిలోని హౌసింగ్, పీఆర్ బిల్డింగ్స్, హౌసింగ్ లేఔట్లు, అప్రోచ్ రోడ్లు, ఎస్ డబ్ల్యూ పిసి, ఎస్.హెచ్. జీ రుణాలు మంజూరు, తదితర అంశాలపై జిల్లా కలెక్టరు కృతికా శుక్లా.. హౌసింగ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్ ఇతర జిల్లా అధికారులతో పాటు కాకినాడ, పెద్దాపురం డివిజన్లు వారిగా అన్ని మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవో హౌసింగ్, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

 ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద చేపట్టిన గృహ నిర్మాణాలతో పాటు ప్రభుత్వ శాశ్వత భవనాలైన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలు ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న వాటిని నెల రోజులలో మిగిలిన పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చూడాలన్నారు. గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ కార్యదర్శులు హౌసింగ్ కు సంబంధించిన స్టేజ్ కన్వర్షన్ వివరాలు యాప్ లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో ఎస్.డబ్ల్యూ.పిసి కేంద్రాల ద్వారా వర్మి కంపోస్ట్ తయారీకి చర్యలు చేపట్టాలన్నారు.

 ముఖ్యంగా  రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనుసరించి నవంబర్ 1 నుంచి అమలు చేయనున్న  ప్లేక్సీల నిషేధంపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని, ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రభుత్వ కార్యాలయలలో ఉన్న ప్లేక్సీల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ బి సుధాకర్ పట్నాయక్, డ్వామా పీడీ ఇంచార్జ్ డీపీఓ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ పెద్దాపురం డీఎల్డీవోలు పి.నారాయణ మూర్తి, కె.ఎన్.వి ప్రసాదు రావు హౌసింగ్, పీఆర్  డీఈ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 11:14:23

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి

పట్టభద్రుల  నియోజకవర్గ  ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని సత్వరమే పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం ఉదయం అన్ని జిల్లాల ఈఆర్ఓ లు మరియ ఏఈఆర్ఓ లతో నమోదు ప్రక్రియ పై వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన పట్టభద్రులు అందరు నవంబర్ 7వ తేదీ లోగా కొత్తగా ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. శాసనసభ నియోజక వర్గాల పరిధిలో ఉండవలసిన ఓటర్ల శాతం 75 కంటే అధికంగా ఉంటే ఓటర్ల వివరాలను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించి తప్పులను సరిచేయాలని, అలాగే తక్కువ ఓటర్లు నమోదైన చోట మరోసారి ఓటర్ల వివరాలు సేకరించాలని ఆదేశించారు. 

  ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఓటర్ల మార్పు చేర్పులు చేసుకోవడానికి గరుడ్ యాప్ ను ఇవ్వడం జరిగిందని, ఈ యాప్ వినియోగంపై  బూతు లెవెల్ అధికారులకు (బి.యల్.ఓ) పూర్తి అవగాహన ఉండాలన్నారు. కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి.యల్.ఓ ల ద్వారా పరిశీలించి, ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు.  వాలంటీర్లు ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొనరాదని, వారు పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందితే విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సు లో జిల్లా నుండి  డిఆర్వో శ్రీనివాసమూర్తి, వియంఆర్డీఏ ఎస్టేట్ అధికారి లక్ష్మా రెడ్డి , స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎన్ హెచ్ -16 వెంకటేశ్వర రావు, ఎన్నికల డిప్యూటి తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

2022-10-14 11:06:56

బాణ‌సంచా త‌యారీ, విక్ర‌యాల్లో నిబంధ‌న‌లు పాటించాలి

దీపావ‌ళి సంద‌ర్భంగా బాణ‌సంచా త‌యారీ, విక్ర‌యాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని.. ఎవ‌రైనా ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని, కేసులు న‌మోదు చేయ‌నున్న‌ట్లు కాకినాడ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ స్ప‌ష్టం చేశారు. దీపావ‌ళి పండ‌గ నేప‌థ్యంలో బాణ‌సంచా త‌యారీ, విక్ర‌యాల‌కు ఇచ్చే తాత్కాలిక లైసెన్సులు, విక్ర‌యాల సంద‌ర్భంగా దుకాణ య‌జ‌మానులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, వివిధ స‌మ‌న్వ‌య శాఖ‌ల త‌నిఖీలు త‌దిత‌ర అంశాల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్‌గా రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాప‌క‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ‌, కార్మిక‌, మున్సిప‌ల్‌, పంచాయ‌తీరాజ్‌, ఆరోగ్య త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ నెల 23, 24వ తేదీల్లో రెండు రోజుల పాటు మాత్ర‌మే బాణ‌సంచా విక్ర‌యాల‌కు అనుమ‌తి ఉంటుంద‌ని.. విక్ర‌యాల కోసం వ‌చ్చే ప్ర‌తి ద‌ర‌ఖాస్తును క్షుణ్నంగా ప‌రిశీలించి ఆర్‌డీవోలు అనుమ‌తులు మంజూరు చేయాల‌ని సూచించారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు విక్ర‌యాలు జ‌ర‌పొచ్చ‌న్నారు. దుకాణాలు ఏర్పాటుచేసేందుకు అనువైన స్థ‌లాల‌ను గుర్తించి.. విక్ర‌యాలు స‌జావుగా సాగేలా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. దుకాణానికి దుకాణానికి మ‌ధ్య క‌చ్చితంగా మూడు మీట‌ర్ల దూరం ఉండాల‌ని.. ఒక క్ల‌స్ట‌ర్‌లో గ‌రిష్టంగా 50 దుకాణాలు మాత్ర‌మే ఏర్పాటు చేసేందుకు అవ‌కాశ‌ముంద‌న్నారు. అధికారులు మార్కు చేసి ఇచ్చిన చోట మాత్ర‌మే దుకాణాలు ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. అగ్నిమాప‌క వాహ‌నాలు, అంబులెన్సులు వంటివి వ‌చ్చి వెళ్లేందుకు అనువుగా ర‌హ‌దారులు ఉండేలా చూడాల‌న్నారు. 

విక్ర‌యాలు జ‌రిపే చోట అగ్ని ప్ర‌మాదాలు చోటుచేసుకోకుండా ప‌టిష్ట జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. ప్ర‌తి షాపు వ‌ద్ద ఇసుక బ‌కెట్లు, డ్ర‌మ్ముల‌తో నీరు వంటివి ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ప్ర‌తి దుకాణం వ‌ద్ద నో స్మోక్ బోర్డులు ఏర్పాటుచేయాల‌న్నారు. డివిజ‌న్‌, మండ‌ల‌స్థాయిలో ప్ర‌త్యేక త‌నిఖీ బృందాలు ఏర్పాటుచేయాల‌ని.. రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాప‌క త‌దిత‌ర శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. బాణ‌సంచా త‌యారీ, విక్ర‌య కేంద్రాల్లో చిన్న‌పిల్ల‌ల‌ను ప‌నిలో పెట్ట‌కూడ‌ద‌ని.. ఎవ‌రైనా నిబంధ‌న‌లను ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు తప్ప‌వ‌న్నారు. రాత్రి ప‌ది గంట‌ల త‌ర్వాత ప్ర‌జ‌లు ఎవ‌రూ శ‌బ్దం వ‌చ్చే బాణ‌సంచా ఉప‌యోగించ‌కూడ‌ద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ వెల్ల‌డించారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం నిర్దేశించిన ఈ నిబంధ‌ల‌ను పాటిస్తూ ప్ర‌జ‌లు ఆనందోత్సాహాల‌తో పండ‌గ జ‌రుపుకోవాల‌ని సూచించారు. స‌మావేశంలో కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, పెద్దాపురం ఆర్‌డీవో జె.సీతారామారావు, ఇన్‌ఛార్జ్ డీపీవో ఎ.వెంక‌ట‌ల‌క్ష్మి, జిల్లా అగ్నిమాప‌క అధికారి ఎన్‌.సురేంద్ర, వివిధ మున్సిపాలిటీల క‌మిష‌న‌ర్లు, మండ‌లాల త‌హ‌సీల్దార్లు, పోలీస్‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

2022-10-14 10:38:24

గర్జించకపోతే మనం తీవ్రంగా నష్టపోతాం

ఉత్తరాంధ్ర అభివృద్ధి, భవిష్యత్ తరాల కోసం జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలందరూ మద్దతు పలకాలని, ఈ అవకాశాన్ని వదులుకోకూడదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం జరగనున్న విశాఖ గర్జన ఏర్పాట్లను అమర్నాథ్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి శనివారం ఉదయం 9 గంటలకు జేఏసీ ఆధ్వర్యంలో  ర్యాలీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో కలసి అమర్నాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  శనివారం జరిగే ర్యాలీలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు,వృద్ధులు పాల్గొని తమ ఆకాంక్షలను తెలియజేయనున్నారు అని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలియ చేసే సమయం ఆసన్నమైందని, ఇప్పుడు మౌనంగా ఉంటే, మన భవిష్యత్ తరాలు  తీవ్రంగా నష్టపోతాయని, అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు గర్జనకు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. మన ప్రాంతo అభివృద్ధి చెందకూడదన్న దురుద్దేశంతో అమరావతి రైతులు దండయాత్రగా మనపైకి వస్తున్నారని వాళ్లు కళ్ళు తెరుచుకునేలా ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు.

ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోండి..
గత కొద్ది రోజులుగా జన నాయకుడు పవన్ కళ్యాణ్ విశాఖ గర్జన మీద చేస్తున్న వ్యాఖ్యలను అమర్నాథ్ తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ జనవాణి పేరుతో విశాఖ వస్తున్నారని, ముందు ఆయన ఇంట్లో సమస్యలను పరిష్కరించుకొని, ఆ తర్వాత జనం సమస్యల గురించి ఆలోచించాలని అమర్ నాథ్ విజ్ఞప్తి చేశారు. జనవాణికి తాను హాజరు అవుతానన్న ప్రచారాన్ని అమర్నాథ్ ఖండించారు. పవన్ కి ఏమైనా అవసరం ఉంటే నా దగ్గరికి రావాలి కానీ నేను ఆయన దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను ఇప్పటివరకు పట్టించుకోని పవన్ కళ్యాణ్ కు అకస్మాత్తుగా ఈ ప్రాంత ప్రజలు ఎందుకు గుర్తుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ డబ్బులు ఎక్కువ వస్తాయని కాల్షీట్లను అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 10:07:50

మన్యంజిల్లా కలెక్టర్ ను కలిసిన ఐటిడిఏ పిఓ

పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సి.విష్ణు చరణ్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ను కలుసుకున్న ప్రాజెక్టు అధికారిని ఐటిడిఎ అభివృద్ధిలో మరింత ముందడుగు వేయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో కీలకంగా వ్యహరించాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని అగ్ని గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించే విధంగా పనిచేయాలని కలెక్టర్ పీఓకి సూచించారు. కాగా విష్ణు చరణ్ నరసాపురం సబ్ కలెక్టర్ గా చేస్తూ బదిలీపై ప్రాజెక్టు అధికారిగా వచ్చారు.

2022-10-14 10:01:20

పీజీవీవై రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి

పీఎం గ్రామీణ్ ఆవాస్ యోజన రిజిస్ట్రేషన్ల్ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్  పీఎం గ్రామీణ ఆవాస్ యోజన, హౌసింగ్ స్కీమ్, జిజిఎంపి, డ్రాప్ఔట్ స్టూడెంట్స్ అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీఎం గ్రామీణ ఆవాస్ యోజన కింద 655 గృహ నిర్మాణాలు రిజిస్ట్రేషన్ చేయించాల్సిఉండగా, ఇప్పటివరకు 365 మాత్రమే చేయడం జరిగిందని, ఇంకా చేయవలసిన 290 వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  రిజిస్ట్రేషన్, అప్డేషన్, జియో ట్యాగింగ్   ప్రక్రియను వెంటనే పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ విషయమై అలసత్వం వహిస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏఈలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

అలాగే 90 రోజులు ఇళ్ల పట్టాలు మంజూరు కార్యక్రమంలో సుమారు 1,900 పట్టాలు ఇవ్వడం జరిగిందని అప్ డెషన్ లో ఎందుకు వెనుకబడి ఉంటున్నారని ప్రశ్నించారు.  కోర్టు కేసులు కొట్టివేసిన లేఔట్లలో సుమారు 3,600 వరకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, వారి  రిజిస్ట్రేషన్ లను వెంటనే పూర్తి చేయాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం లో అందిన విన్నపాలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. అలాగే వారు కోరిన పనులకు సంబంధించి ఎంపీడీవో పరిధిలో మంజూరు చేసే పనులకు వెంటనే మంజూరు చేసి పనులు చేపట్టాలన్నారు. తమ పరిధిలో లేని వాటికి ప్రతిపాదనాలను వెంటనే తన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. 

 గడపగడపకు కార్యక్రమంలో కోరిన పనులపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు.   పాఠశాలలో డ్రాప్స్  అవుట్స్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, డ్రాప్స్  అవుట్స్ గుర్తించిన పాఠశాలల పరిధిలో ఇంటింటికి వెళ్లి డ్రాప్స్ అవుట్స్  గల కారణాలను తెలుసుకొని , తిరిగి వారిని పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరేట్ నుండి హౌసింగ్ పీడీ రామరాజు పాల్గొనగా,  వివిధ మండల కార్యాలయాల నుండి హౌసింగ్ ఇఇలు, డిఇఇలు, ఎ.ఇలు, సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

2022-10-14 09:54:20

గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిష్కారానికి చర్యలు

శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.  గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భూ గర్భ గనులు శాఖ పై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డిఎస్ఓ నిషా కుమారిలతో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రానైట్ ఇండస్ట్రీస్ పై సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. రెన్యూవల్స్ చేయాల్సిన వాటిని తక్షణమే రెన్యూవల్స్ చేయాలని, సంబంధిత కంపెనీ రెన్యూవల్స్ కు రాకపోతే వారికి కొంత సమయం ఇచ్చి రెన్యూవల్స్ రద్దు చేయాలని భూ గర్భ గణులు శాఖ డిడిని ఆదేశించారు.  గ్రానైట్ పరిశ్రమలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పెద్ద ప్రాజెక్టులకు ప్రజాభియం ఉండాలన్నారు.  

అనధికారికంగా గ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. గ్రావెల్ అనుమతులు ఉన్న వారికే గ్రావెల్ క్వారీ తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రావెల్ క్వారీకి అనుమతులు తీసుకోవాలవాలని పేర్కొన్నారు. ప్రతీ నెల సమావేశం ఏర్పాటు చేయాలని ఎడిని ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్కు పథకంనకు కొలత రాళ్లు త్వరగా సరఫరా చేయాలని చెప్పారు. నాన్ వర్కింగ్ లీజు లను లీజులుగా కన్వర్సన్ చేసి రెవెన్యూ పెంచాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని స్పష్టం చేశారు.  గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిడిని ఆదేశించారు.   ఈ సమావేశంలో ఆర్డీవోలు బి శాంతి, సీతారామమూర్తి, జయరాం, భూగర్భ గనుల శాఖ డిడి ఫణి భూషణ్ రెడ్డి, ఎడి బాలాజి నాయక్, ఎపిపిసిబి ఎఇఇ కరుణశ్రీ, గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు, తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 08:34:46

కాకినాడ డీఎంహెచ్ఓ గా డా.శాంతిప్రభ నియామకం

కాకినాడ డీఎంహెచ్ఓ గా డా.శాంతిప్రభను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఆమె నూతనంగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ డా.ఆర్.రమేష్ ఇన్చార్జి డిఎంహెచ్ఓగా వ్యవహరించేవారు. ఆయన దగ్గర నుంచి శాంతిప్రభ విధులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మాత్రుమరణాలు తగ్గించి ప్రతీ ఒక్కరికీ ప్రాధమిక వైద్యం అందించేందుకు విశేషంగా క్రుషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు అందించే వైద్య, ఆరోగ్యసేవలను మరింత చేరువ చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా నూతన డిఎంహెచ్ఓను కలిసి వారి విధులు, విభాగాలు తదితర వివరాలను ఆమెకు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

2022-10-14 07:22:54

15లోగా మార్పులు, చేర్పులు జరగాలి

జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాలలో మార్పులు చేర్పులు కోసం వన్ టైం ఎడిట్ మాడ్యూల్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందని భూపరిపాలన ప్రధాన కార్యదర్శి మరియు ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రీసర్వే , జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల మంజూరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే దాదాపు పూర్తవుతుందని, సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కుదారులకు జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో సమగ్ర సర్వే పూర్తయిన 350 గ్రామాలకు భూహక్కు పత్రాలను పంపిణీచేయాల్సి ఉందని అన్నారు. 

భూహక్కు పత్రాలలో ప్రచురణే కొలమానం అయినందున పత్రాల జారీలో వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పత్రాల జారీలో మార్పులు, చేర్పులు కొరకు అప్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. కావున మార్పులు, చేర్పులు చేయాల్సినవి ఉంటే అటువంటి వాటిని ఈ నెల 15 లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. తమకు పంపిన వివరాలను అనుసరించి భూహక్కు-భూరక్ష పత్రాలు సిద్ధమవుతాయని, కావున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, భూసర్వే మరియు రికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 16:12:16

త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయాలి

పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తికావాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం  భవన నిర్మాణాలు, జల్ జీవన్ మిషన్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న భవన నిర్మాణాల్లో మరింత పురోగతి కనబరచాలన్నారు. ఆయా శాఖాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి రోజు ప్రగతిని  కనబరచేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక, ఇనుము అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 

పనులు ఆలస్యమైన చోట కాంట్రాక్టర్లతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. జల్ జీవన్ మిషన్ మంచి కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. ఎక్కడా పెండింగ్ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శానిటేషన్ కాంప్లెక్స్ ల నిర్మాణ పనులు, పారిశుద్ధ్యం పనులు చురుకుగా సాగాలని, వీలైనంత త్వరగా పూర్తికావాలని ఆయన వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్లను కోరారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్.వెంకటరామన్, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి.చిట్టిరాజు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 15:58:22

నాడు-నేడు పనులు వేగవంతం పెంచండి

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు - నేడు క్రింద రెండవ విడతలో చేపడుతున్న జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లోని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని  పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు జి.శ్రీనివాసులు,పాఠశాల విద్య కమీషనర్ సురేష్ కుమార్, పాఠశాల వసతులకల్పన కమిషనర్ కె. భాస్కర్  లతో కలిసి   నాడు-నేడు రెండవ విడత కార్యక్రమం, అదనపు తరగతి గదులు నిర్మాణం, ప్రహరీ గోడలు, మౌలిక వసతుల కల్పన, రివాల్వింగ్ ఫండ్ జమ తదితర అంశాలపై  జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షణ అదనపు పథక సమన్వయకర్తలు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

నాడు- నేడు కార్యక్రమం క్రింద జిల్లాలో చేపడుతున్న  అదనపు తరగతి గదులు, ప్రహరీగోడల నిర్మాణాలు త్వరితగతిన పూర్తికావాలని అన్నారు.  నాణ్యత లోపం లేకుండ పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులకు నిధుల కొరత సమస్య లేకుండ చర్యలు తీసుకుంటామన్నారు.  వర్షాలు కారణంగా నిర్మాణ పనులు ప్రారంభమై పునాది స్థాయిలో తీసిన గుంతలు నీటితో నిండి ఉన్న చోట ప్రమాదాలు జరగకుండా రేడియం రిబ్బన్, బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పాటశాలల్లో డ్రాపౌట్స్ ఉన్న చోట వాస్తవ పరిస్థితిని విచారించి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  మాట్లాడుతూ జిల్లాలో నాడు - నేడు  నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. సిమెంట్ కొరత కారణంగా నిర్మాణాలకు అవసరం మేరకు సిమెంట్ సరఫరా చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ,  జిల్లా గ్రామీణ సరఫరా ఇంజనీరింగ్ అధికారి ఓ. ప్రభాకర్, జిల్లా వృత్తి విద్యా అధికారి డి.మంజుల వీణ, ఏ పి ఓ వై.శంకర్ రావు, సర్వ శిక్షా అభియాన్ డి ఈ డి.కిషోర్ కుమార్ ,గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి శాంతిస్వర్, తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 15:13:11

దరఖాస్తుదారులకు స్పష్టమైన అవగాహన అవసరం

భూగర్భగనుల లీజు అనుమతులు కోరే దరఖాస్తుదారులకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.  కలెక్టర్ కార్యాలయంలో  భూగర్భ గనుల శాఖ, కాలుష్య నియంత్రణ సంస్థ, రెవిన్యూ అధికారులు, లీజు దరఖాస్తుదారులతో గురువారం  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరమైన, పర్యావరణ, రెవెన్యూ , జిల్లా పరిపాలన, గనుల లీజు దారులకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. భూగర్భ గనుల లీజు అనుమతులు మంజూరైన వెంటనే క్వారీ పనులు ప్రారంభించాలన్నదే ప్రభుత్వ విధానమని అన్నారు. పనులు ప్రారంభించని పక్షంలో లీజు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా లీజు కొరకు దరఖాస్తు చేసుకునే వారికి సులువుగా అర్థమయ్యేటట్లు చార్ట్ తయారు చేసి వారం రోజుల్లోగా అందివ్వాలని సూచించారు. 

దరఖాస్తుల అనుమతులకు ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ, అవసరమైన చోట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్నారు. అనంతరం ఇప్పటివరకు క్వారీ లీజు మంజూరైన ఏ కారణంతో మొదలు కాలేదు, ఉన్న సమస్యలపై క్వారీ లీజు దారులు, అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్డీవో కె.హేమ లత, గనుల శాఖ ఉప సంచాలకులు ఎమ్ . బాలాజీ నాయక్, సహాయ సంచాలకులు ఎస్.పి.కె.మల్లేశ్వర రావు,  భూగర్భ గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్యామ్ పీటర్, కాలుష్య నియంత్రణ, పర్యావరణ జూనియర్ ఇంజనీర్ వీణా లహరి, తదితరులు, పాల్గొన్నారు.

2022-10-13 15:07:13