1 ENS Live Breaking News

మంచి పుస్తకం కావాలంటే 'విశాలాంధ్ర'కు వెళ్లాలి..

విశాలాంధ్ర బుక్ హౌస్ అనేక సంవత్సరాల నుంచి జ్ఞాన కేంద్రంగా వెలుగుతోందని, మంచి పుస్తకం కావాలంటే విశాలాంధ్రకు వెళ్లాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. విశాలాంధ్ర బుక్ హౌస్ ఏర్పాటుచేసిన ఒకటవ పుస్తక మహోత్సవాన్ని మంత్రి అమర్నాథ్ ఆదివారం ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల చరిత్రలను తెలుగులోకి అనువదించిన ఏకైక సంస్థ విశాలాంధ్ర అని అన్నారు. ఆకలి గురజాడ అప్పారావును వెలుగులోకి తెచ్చింది విశాలాంధ్ర సంస్థయే అని అమర్నాథ్ పేర్కొన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్యం, తెలుగు భాష, సంస్కృతి విస్తరణలో విశాలాంధ్ర చేసిన కృషి అమోఘమని అని రాష్ట్ర భారీ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి అన్నారు.  విశాలాంధ్ర ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అన్ని రకాల పుస్తకాలను ఓకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని, ఇలాంటి ప్రదర్శనలు మనిషి విజ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని అన్నారు. తాను మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించక ముందు ఈ విశాలాంధ్ర బుక్ హౌస్ కి వచ్చేవాడినని ఇక్కడ అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేసే వాడినని అమర్నాథ్ గుర్తుచేసుకున్నారు.

 తెలుగు సాహిత్యంతో పాటు ఆంగ్ల పుస్తకాలు కూడా ప్రదర్శనలో లభ్యమౌవడం అభినందనీయమని అన్నారు. విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రాంగణాన్ని ద్వారకనగర్ పరిసర ప్రాంతానికి తరలిస్తే పాఠకులకు మరింత చేరువయ్యే ఆవకాశం ఉందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అమర్నాథ్ హామీ ఇచ్చారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మంత్రి గుడివాడ అమరనాధ్ విశాలాంధ్ర విస్తరణకు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో విశాలాంధ్ర అంత మొత్తంలో వనరులు సమకూర్చే పరిస్థితి లేదని చెప్పుతూ ప్రభుత్వమే చొరవ తీసుకొని వి ఎం ఆర్ డి ఎ కాంప్లెక్స్ లో తక్కువ మొత్తంలో దుకాణం కేటాయిస్తే ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అమర్నాథ్ సానుకూలంగా స్పందించారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. సాహిత్య విస్తరణ ప్రస్థానంలో విశాలాంధ్ర చేసిన కృషికి ఫలితంగా వైస్సార్ జీవిత సాఫల్య పురష్కారం రాష్ట్ర ప్రభుత్వంచే అందుకుందని గుర్తు చేశారు. ఉత్తరాంద్ర కవుల రచనలను వెలుగులోకి తీసుకురావాడానికి విశాలాంధ్ర ప్రముఖ పాత్ర పోసించిందని అన్నారు. 

కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ పి.మైధిలి మాట్లాడుతూ విశాలాంధ్ర తో చాలాకాలం నుంచి అనుబంధం ఉందని, సాహిత్య ప్రస్థానంలో విశాలాంధ్ర చేసిన కృషిని ప్రత్యేకంగా కొనియాడారు.  హిందూ దినపత్రిక బ్యూరో చీఫ్ సుమిత్ భట్టాచార్జీ మాట్లాడుతూ పాతనగరంలో విశాలాంధ్ర కేరాఫ్ అడ్రస్ గా ఉండేదని, భాష, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్య విలువలు పెంపొందించేందుకు, పాఠకులకు సాహిత్యాన్ని చేరవేయడంలో విశాలాంధ్ర చేసిన కృషి అద్వితీయమన్నారు.
   కార్యక్రమంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ టి. మనోహర్ నాయుడు,సీపీఐ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఎ జె స్టాలిన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు,కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సత్యనారాయణ, స్థానిక వార్డు కార్పొరేటర్ కోడూరి అప్పలరత్నం, అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు,విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడపా రామకృష్ణ, బుక్ హౌస్ మేనేజర్ పి ఎ రాజు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-11-13 15:20:47

విశాఖలో కార్తీక మహా దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్,  విశాఖపట్నం కార్తీక మహా దీపోత్సవం కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో  సోమవారం జరుగనున్న కార్తీక మహాదీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్ తెలిపారు. విశాఖ  నగరంలోని ఎంవిపి కాలనీలోని టిటిడి కళ్యాణ మండపంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా సిఈవో  మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు రామకృష్ణ బీచ్ కాళీ మాత అమ్మవారి గుడి ఎదురుగా సాగర తీరాన అంగరంగ వైభవంగా కార్తీక మహా దీపోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదా  పీఠాధిపతి  స్వరూపానంద సరస్వతి స్వామి మంగళాశాసనాలు అందిస్తారని వెల్లడించారు. టిటిడి చైర్మన్  వైవి.సుబ్బారెడ్డి, ఈవో  ఏవి ధర్మారెడ్డి పాల్గొంటారని తెలిపారు. విష్ణుసహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు పారాయణం చేస్తారని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా  ఏబి.బాలకొండల రావు బృందంతో నృత్యం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తనల ఆలాపన జరుగుతాయన్నారు.

అంతకుముందు టిటిడి ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం రామకృష్ణ బీచ్ వద్ద గల 
దీపోత్సవం వేదిక పనులను పరిశీలించారు. ఆర్డీవో  హుస్సేన్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో దాతలు  రాజేష్,  హిమాంశుప్రసాద్, టిటిడి ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, పిఆర్ఓ డా.టి.రవి, డిఇ  రవిశంకర్ రెడ్డి, డిఎఫ్ఓ  శ్రీనివాస్, విజివో  మనోహర్ పాల్గొన్నారు.

Visakhapatnam

2022-11-13 12:57:03

శాస్త్ర విజ్ఞాన ఫలాలను హక్కుగా అందివ్వాలి..

సామాన్య ప్రజానీకానికి శాస్త్ర విజ్ఞాన ఫలాలను హక్కుగా అందివ్వాలని, దీనికి ఎదురవుతున్న అశాస్త్రీయ భావజాల ఆధి పత్య ధోరణులను ప్రజాసైన్సు కార్యకర్తలు ఎదుర్కోవాలని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ప్లీనరీ రెండవ రోజు సభలో మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్లీనరీ సభల 2వ రోజైన ఆదివారం జే ఎన్ టి యు హాలులో జరిగిన సభకు రాష్ట్ర జి.వి.వే. అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్ అధ్యక్షత వహించారు.  కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కోవటంతో సైన్సు మాత్రమే పరిష్కారం చూపగలిగిందని, వేక్సిన్  ఉత్పత్తిలో సైన్సు కీలక పాత్రవహించిందని  శర్మ అన్నారు. భావజాల రంగంలో ప్రశ్నించే తత్వాన్ని, ప్రజాస్వామ్య కాంక్షని  విద్యార్థి దశ నుంచే అభివృద్ధి చేయాలన్నారు. కొందరు కుహనా మేధావులు మాఢ నమ్మ కాలను పనిగట్టుకొని ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజల కోసం సైన్సు, ప్రగతికోసం సైన్సు, ప్రపంచశాంతి కోసం సైన్సు అనే నినాదాలతో జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు ప్రజా సైన్సు ఉద్యమానికి పునరంకితం కావాలని శర్మ అన్నారు. ఈ సభలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ వెంకటేశ్వర రావు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాద్యక్షులు డాక్టర్ సి.స్టాలిన్ రాష్ట్రపూర్వ అధ్యక్షులు డాక్టర్ చల్లా రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి  రాధారాణి, కాకినాడ జిల్లా జ.వి.వే. అధ్యక్షులు కె.ఎం.ఎం.ఆర్.ప్రసాద్  
కార్యదర్శి  రామారావు తదితరులు పాల్గొన్నారు. 

ఆకట్టుకొన్న కర్రసాము విన్యాసం :-
 నీలపల్లి జెడ్.పి. హైస్కూల్ విద్యార్థులు ఎం.భార్గవి, ఐ.జాహ్నవి, పి. సుశాంత్ లు చేసిన కర్రసాము విన్యాస ప్రేక్షకులను అలరించింది. జ.వి.వేదిక సమతా విభాగం జిల్లా కన్వీనర్ శ్రీమతి మంగతాయురు దర్శకత్వంలో రూపొందించిన సావిత్రీ భాయి ఫూలే కళారూపం అందరినీ  ఆకట్టుకొంది.

Kakinada

2022-11-13 11:10:07

స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కలియుగ  ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ  ఆలయ మర్యాదలతో ప్రధాన కార్యదర్శి దంపతులకు మంగళ వాయిద్యాలు,పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులకు తీర్ధ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. తదుపరి ఆలయ అనివేటి మండపంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ స్వామి వారి చిత్రపటాన్ని ప్రధాన కార్యదర్శికి అందజేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్య ప్రకాష్ స్వామి వారి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి.ఆర్.రాధిక, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి టి.సీతారామమూర్తి, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ డి.వి.వి.ప్రసాదరావు, కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్య ప్రకాష్,  తహసీల్దార్ కె.వెంకటరావు, ఆలయ పాలకమండలి సభ్యులు అంధవరపు రఘురామ్, మండవిల్లి రవి, ఆలయ అర్చకులు, సిబ్బంది, వడ్డి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-11-13 11:06:57

మాతృ మరణాల పట్ల పక్కా విశ్లేషణ జరగాలి

మాతృ మరణాలు జరిగితే పక్కా విశ్లేషణ ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మాతృ మరణాల పట్ల జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. మాతృ మరణాలు జరుగుటకు సౌకర్యాల లోపమా, వైద్య సేవలలో లోపమా, సామాజిక పరమైన అంశాలు ఉన్నాయా అనే కారణాలను విశ్లేషించాలని ఆయన స్పష్టం చేశారు. ఉప కమిటీ పక్కాగా విచారణ చేయాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలు ప్రసవ సమయంలో మృతి చెందితే అందుకుగల నిర్దిష్టమైన కారణం కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. వైద్య సౌకర్యాలు అందుబాటు, క్లినికల్ సౌకర్యాల లభ్యత, సామాజిక విధానంలో జరిగిన తప్పులు విశ్లేషించాలని ఆయన సూచించారు. హై రిస్క్ కేసులకు స్థానిక ఆర్.ఎం.పి వైద్యులు చికిత్స అందించడం పట్ల తీవ్రంగా పరిగణించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొన్ని మండలాల్లో హై రిస్క్ కేసులకు ఆర్.ఎం.పిలు ఐ.వి. ఫ్లూయిడ్స్ ఇవ్వడంతో గర్భిణీల ఆరోగ్య పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి మరణాలు సంభవిస్తున్నట్లు ఏ.ఎన్.ఎం, ఆశా కార్యకర్తలు వివరించడం పట్ల జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ప్రసవాలకు వచ్చే వారి రక్తపు గ్రూప్ ముందుగా పి.హెచ్.సి స్థాయిలో  గుర్తించి జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారికి తెలియజేయాలని ఆయన అన్నారు. అవసరం మేరకు రక్తపు యూనిట్లు సిద్ధం చేయాలని ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకూ చికిత్స అందించిన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తుల వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. అటువంటి కుటుంబ సభ్యులను రక్త దానానికి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించారు. 

*రక్త దానానికి ముందుకు రావాలి* : 

ప్రసవ సమయంలో అవసరమగు రక్తపు యూనిట్లు, ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్, అందుబాటులో ఉండక పోవడంపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందిస్తూ యువత రక్త దానానికి ముందుకు రావాలని కోరారు. రక్త దానం ప్రాణ దానమని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. రక్త దాతలు నిజమైన హీరోలు అని అన్నారు. రక్త దాతలు తమ పేర్లను జిల్లా ఆసుపత్రిలో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా ఆసుపత్రిలో ఇందుకు ప్రత్యేక కౌంటర్ ను శని వారం ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన వివరించారు. ప్రత్యేక కౌంటర్ వద్ద పేరు, ఫోన్ నంబరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ముందుకు వచ్చి సహకరించాలని, ప్రాణాలు కాపాడాలని కోరారు.  

*క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి* 

పి.హెచ్.సి వైద్యులు, క్షేత్ర స్థాయి వైద్య సిబ్బంది గ్రామాల్లో గర్భిణీల ఆరోగ్యం పట్ల పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హై రిస్క్ కేసులకు ఆర్.ఎం.పిలు చికిత్స చేయరాదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి చికిత్స అందించేవారిపై కేసులు నమోదు చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రసవ సమయంలో ఉన్న గర్భిణీల ఆరోగ్యం పట్ల అత్యంత జాగరూకత ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రాణాలతో చెలగాటం వద్దని ఆయన సూచించారు. 

*ప్రాంతాలను గుర్తించండి - అవగాహన కల్పించండి* 

మూడు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. గుమ్మలక్ష్మీ పురం మండలంలో ఒక గ్రామంలో 30 సంవత్సరాల వయస్సులో 8వ కాన్పులో మృతి చెందినట్లు గుర్తించారు. దీనిపై స్పందిస్తూ ఇటువంటి అభ్యర్థులను మండలాల వారీగా గుర్తించాలని సూచించారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, దానిని నివారించాలని ఆయన ఆదేశించారు. ఇటువంటి ప్రాంతాలను గుర్తించి, కుటుంబ నియంత్రణ చికిత్సలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు మాట్లాడుతూ జిల్లాలో 11 మాతృ మరణాలు సంభవించాయని తెలిపారు. 

ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.వాగ్దేవి, వైద్య శాఖ అధికారులు ధవళ భాస్కరరావు, అనిల్, టి. జగన్మోహన రావు, సి.హెచ్.విజయ కుమార్, జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి గొల్ల వరహాలు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-11-11 09:17:15

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

మౌలానా అబుల్ కలాం జయంతి ఘనంగా జరిగింది. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ దేశ మొదటి విద్యా శాఖ మంత్రి గా పనిచేసి, గొప్ప విద్యా విధానానికి మంచి పునాది వేశారని కొనియాడారు. నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా దీర్ఘకాలిక వ్యూహంతో విద్యా విధానాలు ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. విద్యా వ్యాప్తికి పెద్ద ఎత్తున కృషి చేసారని ఆయన అన్నారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం స్థాపించారని చెప్పారు. మక్కాలో గౌరప్రదమైన కుటుంబంలో జన్మించి భారత దేశం విచ్చేసి సేవలు అందించారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. వార పత్రిక ప్రారంభించి ప్రజలలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి నింపి, స్పందన రప్పించారని దానితో ఇంగ్లీష్ ప్రభుత్వం పత్రికను నిషేధించిందని చెప్పారు. మరో పత్రిక స్థాపించి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారని తెలిపారు. యుక్త వయస్సులోనే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. దేశ విభజన, ఇతర సందర్భాల్లో మతపరమైన దాడులు జరుగుతున్నప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉదారంగా పనిచేస్తూ, ఉద్రిక్తతలు తగ్గించుటకు ఎంతగానో కృషి చేశారని ఆయన వివరించారు. ఆజాద్ జయంతి రోజున అల్ప సంఖ్యాక వర్గాల దినోత్సవంగా ప్రకటించడం శుభసూచకమని చెప్పారు. 

ఈ సందర్భంగా అల్ప సంఖ్యాక వర్గాల ప్రతినిధులు షేక్ షఫీ, మహ్మద్ జలాల్, సందీర్ చంద్ర తదితరులు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాథ రావు,  జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి.మంజుల వీణ, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జి.వరహాలు, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, రాష్ట్రీయ బాల స్వాస్త్యా కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా. ధవళ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

manyam

2022-11-11 09:03:48

రాజమండ్రిలో పడిపోయిన రైలు భోగీ..రెండు రైళ్లు రద్దు

Annavaram

రాజమండ్రిలో  రైలు బోగీ పడిపోవడంతో నిర్ణీత సమయానికి వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ 2గంటలు ఆలస్యంగా నడుస్తుందని అన్నవరంలోని రైల్వే సిబ్బంది తెలియజేశారు. వాస్తవానికి అన్నవరం ఈ రైలు ఉదయం 8.5గంటలకు రావాల్సి ఉంది. అదే విధంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుని రద్దుచేసినట్టు కూడా రైల్వే అధికారులు ప్రకటించారు.ఈ రైలు సమాచారాన్ని గమనించాలని సూచిస్తున్నారు. కాగా ఈ సమాచారం ఈరోజువరకూ మాత్రమేనని ప్రకటించారు.

Annavaram

2022-11-09 03:23:31

గోకుల్ పార్కును ప్రారంభించిన విశాఖ మేయర్

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజల సందర్శనార్ధం గోకుల్ పార్కును ఆధునీకరించామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె ఆర్కే బీచ్ లోని గోకుల్ పార్కు ను సుమారు రూ.30.50 లక్షలతో ఆధునీకరించిన పనులకు జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు, ఎం ఎల్ సి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఎంతో మంది భక్తులు బీచ్ లో గోకుల్ పార్కులోని శ్రీ కృష్ణ మందిరాన్ని సందర్శిస్తారని వారికి సౌకర్యాల కల్పనకు గోకుల్ పార్కును సుమారు రూ.30.50 లక్షలతో శ్రీ కృష్ణ ని  పిల్లని గ్రోవితో ఆర్చ్, బనియన్ ట్రీతో రాధా కృష్ణులకు నీడ, సందర్శకులకు కూర్చునేందుకు సిమెంటు బెంచీలు, బీచ్ వైపు ఉన్న పిల్లర్సు మరమ్మత్తులు, పెయింటింగ్, ఫ్లోరింగ్, విద్యుత్ మొదలైన పనులను ఆధునీకరించాలని తెలిపారు.

అనంతరం జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున బీచ్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, మరుగుదొడ్లు మొదలైనవి ఏర్పటుచేసారన్నారు. సందర్శనానికి వచ్చే భక్తులు వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్ధాలు, పూజా సామాగ్రిల యొక్క వ్యర్ధాలను, అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలో వేయాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే నగర పరిశుభ్రతకు బీచ్ లో నిషేధిత ప్లాస్టిక్ ను వాడరాదని, ప్రత్యామ్నాయ వస్తువులనే వాడాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు పిన్నింటి వరలక్ష్మి, పల్లా శ్రీను, కార్పొరేటర్ ఊరుకూటి నారాయణ రావు, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఒమ్మి సన్యాసి రావు, మాజీ అధ్యక్షులు  భరణికానా రామారావు, ప్రధాన కార్యదర్శి మొల్లి అప్పారావు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గోలగాని శ్రీనివాస్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, పర్యవేక్షక ఇంజినీరు వేణు గోపాల్, కార్యనిర్వాహక ఇంజినీరు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, జిల్లా యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-11-07 16:05:17

రాజమండ్రిలో వైభవంగా గోదావరి హారతి

రాజమండ్రిలో కార్తీకమాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని గోదావరి హారతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ గోదావరి హారతులు కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి పాల్గొని తిలకించారు. సోమవారం రాత్రి పుష్కర్ ఘాట్ వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గోదావరి హరతుల కార్యక్రమంలో  రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, అనపర్తి  శాసన సభ్యులు సత్తి సూర్య నారాయరెడ్డి దంపతులు, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ దంపతులు, స్థానిక ప్రజా ప్రతినిదులు, 
వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు, చైర్ పర్సన్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-11-07 15:31:29

7న యాగంటిలో కార్తీక దీపోత్సవరం

రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ, టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు 7వ తేదీ నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు  కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, టీటీడీ జెఈవో సదా భార్గవి ఆదివారం స్థల పరిశీలన చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 
భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇందుకు తగిన ఏర్పాట్లపై వారు అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే  రామ్ భూపాల్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈవో  ఎ వి ధర్మారెడ్డి సహకారంతో యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి చెంతన కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.

వంబరు 7వ తేదీ సాయంత్రం  5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తమప్రాంతం, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవించాలని స్వామి వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టీటీడీ, స్థానిక అధికార యంత్రాంగం సమన్వయంతో భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జెఈవో  సదా భార్గవి మాట్లాడుతూ, కార్తీక దీపోత్సవం నిర్వహణకు అవసరమైన స్థల పరిశీలన జరిపామన్నారు. ఏర్పాట్ల పై స్థానిక, టీటీడీ అధికారులతో సమీక్ష జరిపామన్నారు. 

కార్తీక దీపోత్సవ విశిష్టతను భక్తులకు  తెలిపేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.  టీటీడీ విద్యుత్ విభాగం  ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ  శ్రీనివాస్ , విజివో  మనోహర్ , శ్వేత డైరెక్టర్  ప్రశాంతి , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్  కుమార్ ,ఈఈ  మల్లిఖార్జున ప్రసాద్ , అన్నదానం డిప్యుటీ ఈవో  సుబ్రహ్మణ్యం  పిఆర్వో డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.  అనంతరం ఎమ్మెల్యే , జేఈవో  అధికారులతో  ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. భక్తులందరూ కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా వేదిక, ఎల్ఈడీ స్క్రీన్లు, డాక్టర్లు ,పారామెడికల్ సిబ్బంది 

డిప్యుటేషన్ ,శ్రీవారి సేవకుల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు సూచనలు ,సలహాలు ఇచ్చారు.  6వతేదీకి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Tirupati

2022-10-30 14:59:57

పారిశ్రామికంగా అనకాపల్లిని అగ్రస్థానంలో నిలుపుతా

పారిశ్రామిక రంగంలో రాష్ట్రంలో అనకాపల్లిని మొట్టమొదటి స్థానంలో నిలుపుతానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో సుమారు 60 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎమ్ఈ పార్కుకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అమర్నాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అనకాపల్లి అభివృద్ధిని పట్టించుకోలేదని, వేల ఎకరాల ప్రభుత్వ స్థలం వున్నా, పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేయలేకపోయాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని పారిశ్రాంగంలో ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అనకాపల్లిలో ఎమ్మెస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, తాను పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఎమ్మెస్ఏమీ పార్క్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి మరింత ప్రోత్సాహం అందించారని అమర్నాథ్ తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వున్నాయని, వీటికి ఎంఎస్ఎమ్ఈ రంగం కూడా తోడైతే ఈ జిల్లాలో చాలా వరకు నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 ప్రస్తుతం ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ పార్క్ లో 36 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. పార్క్ లో 200 ఫ్లాట్లు ఏర్పాటు చేయడానికి విఎంఆర్డిఏ నుంచి త్వరలోనే అనుమతులు లభించనున్నాయని ఆయన తెలియజేశారు. ఎమ్మెస్ఎమ్ఈ పార్క్ ను జాతీయ రహదారులకు అనుసంధానం చేసేందుకు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని ఆయన తెలియజేశారు. ఎంఎస్ఎమ్ఈ పార్కుకు ఆనుకునే మరో 70 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు అమర్నాథ్ తెలియజేశారు. "1978 లో మా తాతగారు గుడివాడ అప్పన్న గాజువాకలో ఆటోనగర్ యేర్పాటుకు పునాది వేశారని, ఇప్పుడు నేను కోడూరులో ఎంఎస్ఎమ్ఈ పార్కు శంకుస్థాపన చేయడం అదృష్టoగా భావిస్తున్నాను" అని అమర్ నాథ్ చెప్పారు.
రాష్ట్రంలో ఎంఎస్ఎమ్ఈలకు చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఇందులో భాగంగానే 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెస్ఎంఈలకు రావలసిన ఇన్సెంటివ్ లను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారని అమర్నాథ్ వెల్లడించారు. 


ఇదిలా ఉండగా, అనకాపల్లి జిల్లాలో సుమారు 25వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇది కార్యరూపం దాలిస్తే, ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇప్పటికే జిల్లాలో ఉన్న వివిధ పరిస్థితుల్లో రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని ఆయన వెల్లడించారు.
అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతమ్మ  మాట్లాడుతూ అమర్ నాథ్ పరిశ్రమల శాఖ మంత్రిగా మన జిల్లాకు రావటం మన అదృష్టమని అన్నారు. పారిశ్రామిక రంగంలో అనకాపల్లి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు.
కలెక్టర్ రవి పటాన్ శెట్టి మాట్లాడుతూ భవిష్యత్తులో కోడూరు ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు ఇంత పెద్ద పారిశ్రామికవాడ రావడం ముదావహమని అన్నారు. ఇక్కడ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, పారిశ్రామికంగా అడుగులు ముందుకు వేస్తున్న ఈ జిల్లాలో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

పారిశ్రామిక అవసరాల కోసం భూములు ఇచ్చేవారికి రెవిన్యూ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ అనకాపల్లిని అందాలపల్లిగా తీర్చిదిద్దుతానని ఎన్నికలలో ఇచ్చిన హామీని అమర్నాథ్ నెరవేరుస్తున్నారని చెప్పారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఎంఎస్ఎమ్ఈ పార్క్ అనకాపల్లికి రావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. అనకాపల్లి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న అమర్ నాథ్ పరిశ్రమల శాఖకు సరైన న్యాయం చేస్తున్నారని అన్నారు. మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో అనకాపల్లి అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ బీసెట్టి సత్యవతి, జడ్పీటీసీ శ్రీధర్ రాజు, కశింకోట ఎంపీపీ కలగా లక్ష్మీగున్నయ్య నాయుడు, మళ్ళ బుల్లిబాబు, ఎమ్మెస్ఎంఈ డైరెక్టర్ నదియా, కోడూరు సర్పంచ్ శానాపతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-10-30 14:44:48

నవంబర్ 7లోగా ఓటరుగా నమోదుకావాలి..

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని పట్టభధ్రులందరూ ఓటరుగా నమోదుకావాలని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో అధిక సంఖ్యలో పట్టభద్రులు ఉన్నప్పటికీ ఓటరు నమోదు తక్కువగా ఉందన్నారు. గత ఓటరు జాబితాలో పేరు ఉందనే భ్రమలో ఉండవద్దని, ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటరుగా నమోదుకావలసిన అవసరం ఉందని చెప్పారు. కావున జిల్లాలో డిగ్రీ పొందిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. పట్టభద్రులు ఫారం -18 సమర్పించి ఓటరుగా నమోదుకావచ్చని, తమ సమీప తహసీల్దార్లకు ఓటరు నమోదు ఫారాలను అందజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటరుగా నమోదు అయ్యేందుకు నవంబర్ 7వ తేదీ వరకు అవకాశం ఉందని, కావున ఈలోగా  ఫారం-18లను సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ వివరించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా

2022-10-30 14:27:56

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పట్టభద్రుల సత్తా ఏంటో చూపించాలి..!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు యొక్క సత్తాచూపించాలంటే ప్రతీ ఒక్క పట్టభద్రుడు ఖచ్చితంగా ఓటరుగా నమోదు కావాలని అల్లూరి చరిత్రపరిశోధకులు, ఈఎన్ఎస్ నేషన్ న్యూస్ ఏజెన్సీ సంపాదకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్రా లోని ఆరు(అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం) జిల్లాలు జిల్లాల్లోని ప్రతీ పట్టభద్రుడు ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. అవకాశం లేనివారు ఆన్ లైన్ లోనైనా నమోదు చేయించుకోవాలన్నారు. శాసన మండలికి నిజమైన ప్రజాప్రతినిధిని, ప్రజలు, నిరుద్యోగ యువత భవిత కోసం పోరాటం చేసే మంచి వ్యక్తులును పంపాలంటే అది ఒక్క ఓటుతోనే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ పట్టభద్రులు గెజిడెట్ అటెస్టేషన్ చేయించిన డిగ్రీ ప్రొవిజినల్, ఓటు గుర్తింపుకార్డు జెరాక్సులు, ఫారం-18ను తప్పులు లేకుండా పూర్తిచేసి, ఓటు నమోదుకి దరఖాస్తులు సమర్పించాల్సి వుంటుందన్నారు.

 ప్రతీ పట్టభద్రుడూ తనవంతు భాద్యతగా తాము ఓటు నమోదు చేసుకోవడంతోపాటు, సహచర పట్టభద్రులతో కూడా ఓటు నమోదు చేయించాలని సూచించారు. ఎక్కువ మంది పట్టభద్రులు ఓటరుగా నమోదు కావడం వలన, అనుకున్న మంచి వ్యక్తులను ఎమ్మెల్సీని చేసుకోవడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ మంది తమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లను నమోదుచేసుకొని ఓటరు యొక్కత సత్తాను తెలియజేయాలని అల్లూరి చరిత్రపరిశోధకులు, ఈఎన్ఎస్ నేషన్ న్యూస్ ఏజెన్సీ సంపాదకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) మీడియాకి విడుదలచేసిన ప్రకనటలో పేర్కొన్నారు.

Visakhapatnam

2022-10-22 01:57:38

నిరుద్యోగులకు ఉపాది శిక్షణతో ఉద్యోగ అవకాశాలు

చదువులు పూర్తిచేసుకున్న యువతకు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు యువత తమలోని  ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా  నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ గ్రామీణం ఐటీఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్కిల్ హబ్ సెంటర్ ను ఎంపీ వంగాగీత.. జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు, కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగాగీత మాట్లాడుతూ సీఎం విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో చదువులు పూర్తి చేసుకున్న యువతకు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు యువతలో ఉన్న ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుగా  జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలియజేశారు.

జిల్లా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ ప్ర‌స్తుత పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా అభ్య‌ర్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి..ఉద్యోగ‌, స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు ల‌భించేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేష‌న్ (ఏపీఎస్ఎస్‌డీసీ) నోడ‌ల్ ఏజెన్సీగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక‌టి చొప్పున స్కిల్ హ‌బ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో తొలి దశ కింద కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ ఐటీఐ ప్రాంగణంలో ప్రారంభించడం శుభపరిణామమని ఆమె తెలిపారు. రానున్న నాలుగు నెలల్లో రెండో దశ కింద తుని, పెద్దాపురం జ‌గ్గంపేట‌, పిఠాపురం, ప్ర‌త్తిపాడు, కాకినాడ అర్బ‌న్ నియోజ‌వ‌ర్గాల్లోనూ స్కిల్ హ‌బ్‌ల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు కలెక్టరు వివ‌రించారు. 

కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించిన నాటి నుంచి స్థానికంగా ఉన్న పరిశ్రమలలో స్థానిక యువతకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు మంచి ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలంటే విద్యార్థులు ఎంచుకున్న అంశాలపై  కొంత శిక్షణ పొందడం చాలా అవసరమని ఆయన తెలిపారు. ప్రాముఖ్యంగా యువతకు క్రమశిక్షణ, అంకిత భావం నిబద్దత కలిగి ఉండడంతో పాటు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు పొందొచ్చని కన్నబాబు తెలిపారు.  

కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన వంటి కార్యక్రమాల ద్వారా చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారన్నారు. గొప్ప సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న నైపుణ్య శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స‌మావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డి.హ‌రిశేషు, వికాస పీడీ కె.ల‌చ్చారావు, జిల్లా ఉపాధి అధికారి కె.శాంతి, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ తదితరులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-10-21 11:38:58

పోలీసు అమరవీరుల త్యాగం శ్లాఘనీయం

విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు, సేవలు శ్లాఘనీయమని ఇంచార్జ్ కలెక్టర్, జెసి ఓ.ఆనంద్, జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వి. విద్యాసాగర్ నాయుడు కొనియాడారు . పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా శుక్రవారం  ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని వారు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్.పి మాట్లాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ప్రజల ధన, మాన, ఆస్తుల పరిరక్షణ, శాంతి భ్రతలను కాపాడడంలో సవాళ్ళను ఎదుర్కొని పోలీస్ శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదుగురు పోలీసులు అమరత్వం పొందారుని వారి సేవలు మరువలేనివని పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారు చూపించిన ధైర్య సాహసాలు, నిబద్ధత ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. 

జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ త్యాగాలను స్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా ఈ రోజున పోలీసు అమర వీరుల సంస్మరణ జరుపుకొని పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. శాంతి భద్రతల కట్టడిలో పోలీస్‌ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పోలీసులు పోలీసులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించారన్నారు. సమాజం ఎప్పుడూగుర్తుంచుకుంటుందన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో అమరత్వం పొందిన ఎం. గాంధీ, ఎస్ .సూర్యనారాయణ, సిహెచ్ .చిరంజీవిలు, బి. శ్రీరాములు లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు నగదు చెక్ లను జాయింట్ కలెక్టర్, ఎస్ పి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఓ. దిలీప్ కుమార్, ఐటీడీఏ పీవో సి. విష్ణు చరణ్, డి.ఎస్.పి సుభాష్, అమరులైన పోలీసు కుటుంబ సభ్యులు మనోరంజన్ , ఎస్ .రాజు, బి.ప్రమీల, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-10-21 09:04:57