1 ENS Live Breaking News

గర్జించకపోతే మనం తీవ్రంగా నష్టపోతాం

ఉత్తరాంధ్ర అభివృద్ధి, భవిష్యత్ తరాల కోసం జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలందరూ మద్దతు పలకాలని, ఈ అవకాశాన్ని వదులుకోకూడదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం జరగనున్న విశాఖ గర్జన ఏర్పాట్లను అమర్నాథ్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి శనివారం ఉదయం 9 గంటలకు జేఏసీ ఆధ్వర్యంలో  ర్యాలీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో కలసి అమర్నాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  శనివారం జరిగే ర్యాలీలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు,వృద్ధులు పాల్గొని తమ ఆకాంక్షలను తెలియజేయనున్నారు అని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలియ చేసే సమయం ఆసన్నమైందని, ఇప్పుడు మౌనంగా ఉంటే, మన భవిష్యత్ తరాలు  తీవ్రంగా నష్టపోతాయని, అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు గర్జనకు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. మన ప్రాంతo అభివృద్ధి చెందకూడదన్న దురుద్దేశంతో అమరావతి రైతులు దండయాత్రగా మనపైకి వస్తున్నారని వాళ్లు కళ్ళు తెరుచుకునేలా ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు.

ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోండి..
గత కొద్ది రోజులుగా జన నాయకుడు పవన్ కళ్యాణ్ విశాఖ గర్జన మీద చేస్తున్న వ్యాఖ్యలను అమర్నాథ్ తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ జనవాణి పేరుతో విశాఖ వస్తున్నారని, ముందు ఆయన ఇంట్లో సమస్యలను పరిష్కరించుకొని, ఆ తర్వాత జనం సమస్యల గురించి ఆలోచించాలని అమర్ నాథ్ విజ్ఞప్తి చేశారు. జనవాణికి తాను హాజరు అవుతానన్న ప్రచారాన్ని అమర్నాథ్ ఖండించారు. పవన్ కి ఏమైనా అవసరం ఉంటే నా దగ్గరికి రావాలి కానీ నేను ఆయన దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను ఇప్పటివరకు పట్టించుకోని పవన్ కళ్యాణ్ కు అకస్మాత్తుగా ఈ ప్రాంత ప్రజలు ఎందుకు గుర్తుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ డబ్బులు ఎక్కువ వస్తాయని కాల్షీట్లను అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 10:07:50

మన్యంజిల్లా కలెక్టర్ ను కలిసిన ఐటిడిఏ పిఓ

పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సి.విష్ణు చరణ్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ను కలుసుకున్న ప్రాజెక్టు అధికారిని ఐటిడిఎ అభివృద్ధిలో మరింత ముందడుగు వేయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో కీలకంగా వ్యహరించాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని అగ్ని గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించే విధంగా పనిచేయాలని కలెక్టర్ పీఓకి సూచించారు. కాగా విష్ణు చరణ్ నరసాపురం సబ్ కలెక్టర్ గా చేస్తూ బదిలీపై ప్రాజెక్టు అధికారిగా వచ్చారు.

2022-10-14 10:01:20

పీజీవీవై రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి

పీఎం గ్రామీణ్ ఆవాస్ యోజన రిజిస్ట్రేషన్ల్ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్  పీఎం గ్రామీణ ఆవాస్ యోజన, హౌసింగ్ స్కీమ్, జిజిఎంపి, డ్రాప్ఔట్ స్టూడెంట్స్ అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీఎం గ్రామీణ ఆవాస్ యోజన కింద 655 గృహ నిర్మాణాలు రిజిస్ట్రేషన్ చేయించాల్సిఉండగా, ఇప్పటివరకు 365 మాత్రమే చేయడం జరిగిందని, ఇంకా చేయవలసిన 290 వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  రిజిస్ట్రేషన్, అప్డేషన్, జియో ట్యాగింగ్   ప్రక్రియను వెంటనే పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ విషయమై అలసత్వం వహిస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏఈలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

అలాగే 90 రోజులు ఇళ్ల పట్టాలు మంజూరు కార్యక్రమంలో సుమారు 1,900 పట్టాలు ఇవ్వడం జరిగిందని అప్ డెషన్ లో ఎందుకు వెనుకబడి ఉంటున్నారని ప్రశ్నించారు.  కోర్టు కేసులు కొట్టివేసిన లేఔట్లలో సుమారు 3,600 వరకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, వారి  రిజిస్ట్రేషన్ లను వెంటనే పూర్తి చేయాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం లో అందిన విన్నపాలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. అలాగే వారు కోరిన పనులకు సంబంధించి ఎంపీడీవో పరిధిలో మంజూరు చేసే పనులకు వెంటనే మంజూరు చేసి పనులు చేపట్టాలన్నారు. తమ పరిధిలో లేని వాటికి ప్రతిపాదనాలను వెంటనే తన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. 

 గడపగడపకు కార్యక్రమంలో కోరిన పనులపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు.   పాఠశాలలో డ్రాప్స్  అవుట్స్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, డ్రాప్స్  అవుట్స్ గుర్తించిన పాఠశాలల పరిధిలో ఇంటింటికి వెళ్లి డ్రాప్స్ అవుట్స్  గల కారణాలను తెలుసుకొని , తిరిగి వారిని పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరేట్ నుండి హౌసింగ్ పీడీ రామరాజు పాల్గొనగా,  వివిధ మండల కార్యాలయాల నుండి హౌసింగ్ ఇఇలు, డిఇఇలు, ఎ.ఇలు, సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

2022-10-14 09:54:20

గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిష్కారానికి చర్యలు

శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.  గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భూ గర్భ గనులు శాఖ పై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డిఎస్ఓ నిషా కుమారిలతో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రానైట్ ఇండస్ట్రీస్ పై సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. రెన్యూవల్స్ చేయాల్సిన వాటిని తక్షణమే రెన్యూవల్స్ చేయాలని, సంబంధిత కంపెనీ రెన్యూవల్స్ కు రాకపోతే వారికి కొంత సమయం ఇచ్చి రెన్యూవల్స్ రద్దు చేయాలని భూ గర్భ గణులు శాఖ డిడిని ఆదేశించారు.  గ్రానైట్ పరిశ్రమలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పెద్ద ప్రాజెక్టులకు ప్రజాభియం ఉండాలన్నారు.  

అనధికారికంగా గ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. గ్రావెల్ అనుమతులు ఉన్న వారికే గ్రావెల్ క్వారీ తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రావెల్ క్వారీకి అనుమతులు తీసుకోవాలవాలని పేర్కొన్నారు. ప్రతీ నెల సమావేశం ఏర్పాటు చేయాలని ఎడిని ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్కు పథకంనకు కొలత రాళ్లు త్వరగా సరఫరా చేయాలని చెప్పారు. నాన్ వర్కింగ్ లీజు లను లీజులుగా కన్వర్సన్ చేసి రెవెన్యూ పెంచాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని స్పష్టం చేశారు.  గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిడిని ఆదేశించారు.   ఈ సమావేశంలో ఆర్డీవోలు బి శాంతి, సీతారామమూర్తి, జయరాం, భూగర్భ గనుల శాఖ డిడి ఫణి భూషణ్ రెడ్డి, ఎడి బాలాజి నాయక్, ఎపిపిసిబి ఎఇఇ కరుణశ్రీ, గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు, తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 08:34:46

కాకినాడ డీఎంహెచ్ఓ గా డా.శాంతిప్రభ నియామకం

కాకినాడ డీఎంహెచ్ఓ గా డా.శాంతిప్రభను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఆమె నూతనంగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ డా.ఆర్.రమేష్ ఇన్చార్జి డిఎంహెచ్ఓగా వ్యవహరించేవారు. ఆయన దగ్గర నుంచి శాంతిప్రభ విధులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మాత్రుమరణాలు తగ్గించి ప్రతీ ఒక్కరికీ ప్రాధమిక వైద్యం అందించేందుకు విశేషంగా క్రుషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు అందించే వైద్య, ఆరోగ్యసేవలను మరింత చేరువ చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా నూతన డిఎంహెచ్ఓను కలిసి వారి విధులు, విభాగాలు తదితర వివరాలను ఆమెకు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

2022-10-14 07:22:54

15లోగా మార్పులు, చేర్పులు జరగాలి

జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాలలో మార్పులు చేర్పులు కోసం వన్ టైం ఎడిట్ మాడ్యూల్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందని భూపరిపాలన ప్రధాన కార్యదర్శి మరియు ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రీసర్వే , జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల మంజూరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే దాదాపు పూర్తవుతుందని, సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కుదారులకు జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో సమగ్ర సర్వే పూర్తయిన 350 గ్రామాలకు భూహక్కు పత్రాలను పంపిణీచేయాల్సి ఉందని అన్నారు. 

భూహక్కు పత్రాలలో ప్రచురణే కొలమానం అయినందున పత్రాల జారీలో వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పత్రాల జారీలో మార్పులు, చేర్పులు కొరకు అప్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. కావున మార్పులు, చేర్పులు చేయాల్సినవి ఉంటే అటువంటి వాటిని ఈ నెల 15 లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. తమకు పంపిన వివరాలను అనుసరించి భూహక్కు-భూరక్ష పత్రాలు సిద్ధమవుతాయని, కావున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, భూసర్వే మరియు రికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 16:12:16

త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయాలి

పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తికావాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం  భవన నిర్మాణాలు, జల్ జీవన్ మిషన్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న భవన నిర్మాణాల్లో మరింత పురోగతి కనబరచాలన్నారు. ఆయా శాఖాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి రోజు ప్రగతిని  కనబరచేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక, ఇనుము అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 

పనులు ఆలస్యమైన చోట కాంట్రాక్టర్లతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. జల్ జీవన్ మిషన్ మంచి కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. ఎక్కడా పెండింగ్ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శానిటేషన్ కాంప్లెక్స్ ల నిర్మాణ పనులు, పారిశుద్ధ్యం పనులు చురుకుగా సాగాలని, వీలైనంత త్వరగా పూర్తికావాలని ఆయన వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్లను కోరారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్.వెంకటరామన్, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి.చిట్టిరాజు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 15:58:22

నాడు-నేడు పనులు వేగవంతం పెంచండి

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు - నేడు క్రింద రెండవ విడతలో చేపడుతున్న జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లోని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని  పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు జి.శ్రీనివాసులు,పాఠశాల విద్య కమీషనర్ సురేష్ కుమార్, పాఠశాల వసతులకల్పన కమిషనర్ కె. భాస్కర్  లతో కలిసి   నాడు-నేడు రెండవ విడత కార్యక్రమం, అదనపు తరగతి గదులు నిర్మాణం, ప్రహరీ గోడలు, మౌలిక వసతుల కల్పన, రివాల్వింగ్ ఫండ్ జమ తదితర అంశాలపై  జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షణ అదనపు పథక సమన్వయకర్తలు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

నాడు- నేడు కార్యక్రమం క్రింద జిల్లాలో చేపడుతున్న  అదనపు తరగతి గదులు, ప్రహరీగోడల నిర్మాణాలు త్వరితగతిన పూర్తికావాలని అన్నారు.  నాణ్యత లోపం లేకుండ పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులకు నిధుల కొరత సమస్య లేకుండ చర్యలు తీసుకుంటామన్నారు.  వర్షాలు కారణంగా నిర్మాణ పనులు ప్రారంభమై పునాది స్థాయిలో తీసిన గుంతలు నీటితో నిండి ఉన్న చోట ప్రమాదాలు జరగకుండా రేడియం రిబ్బన్, బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పాటశాలల్లో డ్రాపౌట్స్ ఉన్న చోట వాస్తవ పరిస్థితిని విచారించి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  మాట్లాడుతూ జిల్లాలో నాడు - నేడు  నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. సిమెంట్ కొరత కారణంగా నిర్మాణాలకు అవసరం మేరకు సిమెంట్ సరఫరా చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ,  జిల్లా గ్రామీణ సరఫరా ఇంజనీరింగ్ అధికారి ఓ. ప్రభాకర్, జిల్లా వృత్తి విద్యా అధికారి డి.మంజుల వీణ, ఏ పి ఓ వై.శంకర్ రావు, సర్వ శిక్షా అభియాన్ డి ఈ డి.కిషోర్ కుమార్ ,గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి శాంతిస్వర్, తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 15:13:11

దరఖాస్తుదారులకు స్పష్టమైన అవగాహన అవసరం

భూగర్భగనుల లీజు అనుమతులు కోరే దరఖాస్తుదారులకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.  కలెక్టర్ కార్యాలయంలో  భూగర్భ గనుల శాఖ, కాలుష్య నియంత్రణ సంస్థ, రెవిన్యూ అధికారులు, లీజు దరఖాస్తుదారులతో గురువారం  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరమైన, పర్యావరణ, రెవెన్యూ , జిల్లా పరిపాలన, గనుల లీజు దారులకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. భూగర్భ గనుల లీజు అనుమతులు మంజూరైన వెంటనే క్వారీ పనులు ప్రారంభించాలన్నదే ప్రభుత్వ విధానమని అన్నారు. పనులు ప్రారంభించని పక్షంలో లీజు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా లీజు కొరకు దరఖాస్తు చేసుకునే వారికి సులువుగా అర్థమయ్యేటట్లు చార్ట్ తయారు చేసి వారం రోజుల్లోగా అందివ్వాలని సూచించారు. 

దరఖాస్తుల అనుమతులకు ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ, అవసరమైన చోట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్నారు. అనంతరం ఇప్పటివరకు క్వారీ లీజు మంజూరైన ఏ కారణంతో మొదలు కాలేదు, ఉన్న సమస్యలపై క్వారీ లీజు దారులు, అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్డీవో కె.హేమ లత, గనుల శాఖ ఉప సంచాలకులు ఎమ్ . బాలాజీ నాయక్, సహాయ సంచాలకులు ఎస్.పి.కె.మల్లేశ్వర రావు,  భూగర్భ గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్యామ్ పీటర్, కాలుష్య నియంత్రణ, పర్యావరణ జూనియర్ ఇంజనీర్ వీణా లహరి, తదితరులు, పాల్గొన్నారు.

2022-10-13 15:07:13

ఉత్తరాంధ్రాలో 18,745లో దరఖాస్తుల సమర్ఫణ

ఉత్తరాంధ్రాలోని  శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నందు గల 6 జిల్లాల లోను తేది 13.10.2022 నాటికి ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ద్వారా. (1) శ్రీకాకుళం 3231, (2) విజయనగరం - 4149, (3) పార్వతీపురం మన్యం - 735, (4) అల్లూరి సీతారామ రాజు - 923, (5) విశాఖపట్నం – 7047, (6) అనకాపల్లి-266) వెరసి మొత్తం 18,745 ఓటరు దరఖాస్తులు సమర్పించారని జిల్లా కలెక్టర్ డా.ఎ మల్లిఖార్జున తెలియజేశారు.

 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామ రాజు జిల్లాలలో సాధారణ నివాసులైన అర్హులైన వ్యక్తులు తమ పేర్లను నిర్దేశించిన పారమ్ 18లో సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు తేది 07.11.2022 లో గా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (జిల్లా రెవెన్యూ అధికారి, విశాఖపట్నం) లేదా అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామ రాజు జిల్లలో గల అందరు శాసనసభ నియోజకవర్గం ఓటరు నమోదు అధికారులు, రెవిన్యూ డివిజినల్ అధికారులు, జోనల్ కమిషనర్లు, తహసీల్దారు మరియు మండల పరిషత్ డవలప్మెంట్ అధికారులు) వారి కార్యాలయాల్లో కాని www.ceoandhra.nic.in వెబ్సైట్ నందు ఆన్ లైన్ ద్వారా కానీ ఫారం-18. ధరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

అర్హులైన వ్యక్తులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, గ్రాడ్యుయేట్ నియోజకవర్గం యొక్క తప్పులు లేని ఎలక్టోరల్ రోల్ తయారీలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి అవసరమైన సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

2022-10-13 14:51:06

ప్రాధాన్యత నిర్మాణాలు వేగవం పెంచాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలని  రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఉదయం పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ సచివాలయాలు హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, ఎన్ ఆర్ ఈ జి ఎస్,  తదితర అంశాలపై విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ స్థానిక కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ.... క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భవనాల   నిర్మాణం కోసం స్థల సేకరణ కు సంబంధించి  లక్ష్యాలకు అనుగుణంగా  పూర్తి చేసేలా అధికారులు  చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ భవన నిర్మాణాలకు  కోర్టుకు సంబంధించిన పెండింగ్ కేసులను పరిష్కార దిశ గా చర్యలు తీసుకోవాలని  తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉంటే తక్షణమే అప్లోడ్  చేయాలన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం  జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  434 రైతు భరోసా  కేంద్రాలుగాను 222  రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, 482 గ్రామ సచివాలయం భవనాలు గాను 320 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు, 388 విలేజ్  హెల్త్ క్లినిక్ లు గాను 138 విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలపై క ప్రత్యేక దృష్టి పెట్టి పురోగతి సాధించి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్ పథకంలో ఇంటింటికి   కుళాయి కనెక్షన్లు తదితర పనులను  నిర్దేశించిన గడువులోపు  పూర్తి చేయాలని తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా లక్ష్యాలను నిర్దేశించుకుని చెత్త సేకరణ, ప్లాస్టిక్ వ్యర్థాలను విడి గా చేయడం ద్వారా సంపద కేంద్రాలలో తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  పి డి డ్వామా శ్రీనివాస్ ప్రసాద్,  ఆర్ బ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

2022-10-13 09:07:40

ఈశ్రమ్ నమోదు,సేవలు మరిన్నిపెంచాలి

తిరుపతి జిల్లాలో స్పందన వినతులకు సంబంధించి పరిష్కారం అర్థవంతంగా వుండాలని, ఎనీమియా తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని, ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలని మెగా గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సమీర్ శర్మ అన్నిజిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా అనంతరం జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ సంబందిత అధికారులతో హాజరయ్యారు. కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై స్పందన వినతుల ను ఆమోదించినప్పుడు అర్జీదారునికి మెసేజ్ అందేలా స్పందన పోర్టల్ లో సదుపాయం ఏర్పాటు చేయబడినదని ఆర్జీలను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించి బియాండ్ ఎస్.ఎల్.ఏ కి వెళ్ళకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. సచివాలయంలో సేవలు మరింత పెంచాలని, ఈ-శ్రమ్ నమోదు పెంచాలని అన్నారు. 

రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు వాడకం ను జి. ఓ నంబర్ 65 పర్యావరణ అటవీ శాఖ తేదీ 22.09.2022 ప్రకారం 01.11.2022 నుండి నిషేదించిన సందర్భంలో వాటి నియంత్రణ కు చర్యలు చేపట్టాలని సూచించారు.  ఫ్లెక్సీలు బ్యానర్ ల తయారీలో ప్లాస్టిక్ వాడకం చేయకుండా ప్రత్యామ్నాయంగా కాటన్, బయో డి గ్రెడబుల్ వంటి వాటితో తయారు చేసేలా ఉండాలని సూచించారు. వీటి పర్యవేక్షణ మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు, పంచాయితీ అధికారులు తప్పనిసరిగా చేయని అన్నారు. వీటిపై అవగాహన మరియు కల్పించాలని కోరారు.

గడప గడప కు మన ప్రభుత్వంకి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని అత్యంత ప్రాధాన్యత పనులు 454 మంజూరు చేశామని అందులో 169 పనులు పురోగతిలో ఉన్నాయని ఇంకను ప్రారంభం కానీ 285 పనులపై దృష్టి పెట్టి సత్వరమే చేపట్టాలని ఆదేశించారు.  గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది లేట్ అప్పాయింట్ అయిన వారికి శాఖా పరమైన పరీక్షలు పాస్ అయిన వారి పెండింగ్ ప్రోబేషన్ డిక్లరేషన్ ల ప్రతిపాదనలు ఉంటే పూర్తి చేయాలని PRAN నంబర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  జగనన్న తోడు ఐదవ విడత కు సంబంధించి అప్లికేషన్లకు బ్యాంకుల నుంచి లబ్దిదారులకు డబ్బు వారి ఖాతాలకు జమ అయ్యేలా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కృషి చేయాలని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు తో పాటు యువతను గుర్తింపు లో వాలంటీర్లు సేవలు వినియోగించుకోవాలి అని వారికి శిక్షణ ఇచ్చి నైపుణ్య పెంపుదల చేపట్టాలని సూచించారు.

మాల్ న్యూట్రిషన్ మరియు స్టంటింగ్ 4 సం. లోపు పిల్లల్లో తగ్గించుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భిణులకు, బాలింతలకు, కౌమార దశ అమ్మాయిలకు అనీమియాను తగ్గించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో స్టేజి కన్వర్షన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు.  ఇంటి నిర్మాణాలకు SHG లోన్లు అవసరమైన వారికి 35000 సకాలంలో అందించాలని, స్లాబ్ స్థాయి, పై కప్పు స్థాయిలో ఉన్న ఇంటి నిర్మాణాలకు ఎలక్ట్రిసిటీ మరియు డ్రైనేజ్, వాటర్ సప్లై తదితర మౌలిక సదుపాయాలు సత్వరమే కల్పించాలని కోరారు. ఆప్షన్ 3 కింద ఉన్న ఇళ్లకు పెద్ద లేఅవుట్ లకు కాంట్రాక్టర్ లతో త్వరిత గతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. UDA పరిధిలోనీ అర్హత కలిగిన మిగిలిపోయిన పట్టా పొందిన లబ్ది దారులకు కొత్త ఇళ్ల మంజూరు కొరకు లబ్దిదారుల వివరాలను సత్వరమే ఆన్లైన్లో అప్లోడ్ చేయమని ప్రతిపాదనలు నెలాఖరు లోపు పంపాలని తెలిపారు. PMAY గ్రామీణ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. డిసెంబర్ 21 నాటికి 15446 గృహాల లక్ష్యాలను అధిగమించేలా మెగా గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని తెలిపారు. ఏపీ టిడ్కో ఇళ్లకు రుణాలు మంజూరు బ్యాంకర్లతో మెప్మా సిబ్బంది మాట్లాడి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లోన్లు ఇప్పించాలని ఆదేశించారు. 

రీ సర్వే పై దృష్టి పెట్టాలి అని త్వరిత గతిన పూర్తి చేయాలి అని అన్నారు. జాతీయ రహదారుల భూ సేకరణ, వాటి పరిహార పంపిణీ చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ప్రత్యేక అధికారి రామ చంద్ర రెడ్డి, పిడి హౌసింగ్ చంద్ర శేఖర్ బాబు, ఏ డి సర్వే జయరాజ్, జిల్లా ప్లానింగ్ మరియు స్టాటిస్టికల్ అధికారి అశోక్ కుమార్, డి ఎల్ డి ఓ సుశీల దేవి తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 09:04:34

డిజిటల్ లైబ్రరీలు గ్రౌండింగ్ చేయాలి

ప్రభుత్వ అభివృద్ధి భవన నిర్మాణ పనులలో భాగంగా డిజిటల్ లైబ్రరీల పనులు గ్రౌండింగ్ చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం గ్రామ పంచాయితీ భవనాలు, హెల్త్ క్లీనిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ గ్రామాలు, జలజీవన్ మిషన్ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతంలోని అర్ సి పి ఎల్ డబ్ల్యూ ఇ  రోడ్ల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు నివేదికలను పంపించాలని అన్నారు. జిల్లా లోని మండల ఇంజనీరింగ్ అధికారులు, డి ఈ ఈ లను ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. జలజీవన్ మిషన్ క్రింద గ్రామాల్లో ఇంటింటికీ మంచి నీరు అందించే కార్యక్రమం లక్యాలను పూర్తి చేయాలని అన్నారు. 

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు, ప్లాస్టిక్ వ్యర్ధాలు వేరుచేసే చెత్త నుండి సంపద కేంద్రాల నిర్వహణను పరిశీలించాలన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రాధాన్యతా అభివృద్ధి పనుల నిర్మాణాలకు సిమెంట్ కొరత లేకుండా సరఫరా చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్ , జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె. రామచంద్రరావు, జిల్లా గ్రామీణ సరఫరా ఇంజనీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, పంచాయతీరాజ్ అధికారి ఎమ్.వి. జి. కృష్ణాజి, జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి జె.శాంతిశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 08:20:51

ముంపు బాధితులకు అల్పాహారం అందజేత..

అనంతపురం నగరంలోని గురువారం వరద ముంపు ప్రాంతాల్లో  మేయర్ మహమ్మద్ వసీం పర్యటించి బాధితులకు అల్పాహారం అందించి సౌకర్యాలపై అరా తీశారు. వరుసగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం మీదుగా వెళ్తున్న నడిమి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వర్షపునీరు వంక సమీపంలోని కాలనీలలోకి వెళుతుండటంతో బాధితులను  కోసం రహమత్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని నగర మేయర్ మహమ్మద్ వసీం పరిశీలించి సౌకర్యాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు అవసరం ఉన్నట్లు కొందరు మేయర్ దృష్టికి తీసుకురాగా వెంటనే మందులను వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా 43,46,48,49వ డివిజన్ల పరిధిలో డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి తోపాటు స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి అల్పాహారం మేయర్ వసీం పంపిణీ చేశారు.బాధితులు ఎవరూ అధైర్య పడొద్దని అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని భరోసా కల్పించారు.భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముని శేఖర్, అనిల్ కుమార్ రెడ్డి,ఇషాక్ ,రహంతుల్లా ,నాయకులు దాదా ఖలందర్ ,రమణా రెడ్డి ,భారతి,డిఈ చంద్రశేఖర్ ,ఏఈ బాబావలి తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 05:38:42

ప్రజాసంబంధాల బలోపేతానికి 5జి మరింత ఊతం

ప్రజాసంబంధాలను బలోపేతం చేయడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తు న్నాయని  పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పి.ఆర్.ఎస్.ఐ) విశాఖ శాఖ ఛైర్మన్ డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి పేర్కొన్నారు. విశాఖలోని ఓ హోటల్ లో బుధవారం జరిగిన పి.ఆర్.ఎస్.ఐ. సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా అందుబాటులోకి రానున్న 5జి పరిజ్జానం సోషల్ మీడియా లో విప్లవాత్మక మార్పులకు దారితీయనున్నదని చెప్పారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ స్ట్రా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను 98.5 శాతం మంది మెుబైల్ ద్వారా వినియెాగిస్తున్నారని 5జి టెక్నాలజీ రాకతో 2026 సంవత్సరం నాటికి భారత దేశంలో స్మార్ట్ ఫోన్ ల వాడకం 1 బిలియన్ కు చేరనున్నదని చెప్పారు. ప్రజలకు సత్వర సమాచారాన్ని అధికారికంగా చేరవేయడంలో సామాజిక మాధ్యమాల ఉపయెాగం ప్రజాసంబంధాల అధికారులకు తప్పనిసరి అవుతోందన్నారు. 

పి.ఆర్.ఎస్.ఐ. దక్షిణ భారత ఉపాధ్యక్షుడు యు.ఎస్.శర్మ మాట్లాడుతూ, ట్విట్టర్ వాడకంలో అమెరికా తరువాతి స్థానంలో భారత్ ఉందన్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ వినియోగం ప్రపంచంలో భారత్ లోనే అధికమన్నారు. సామాజిక మాధ్యమాలను పెద్ద ఎత్తున వినియోగించడం  వలన కూడా సైబర్ నేరాల సంఖ్య దేశంలో పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా మార్కెటింగ్ నిపుణుడు డి.ఘనశ్యామ్ సామాజిక మాధ్యమాలను ప్రభావ వంతంగా ప్రజా సంబంధాలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఫెస్ బుక్ వంటివి వినియోగించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో పి.ఆర్.ఎస్.ఐ. కార్రదర్శి ఎమ్.కె.వి.ఎల్. నరసింహం. కోశాధికారి ఎన్.వి.నరసింహం, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పి.ఆర్. విభాగం అధికారులు పాల్గొన్నారు.

2022-10-12 13:42:38