1 ENS Live Breaking News

ప్ర‌గ‌తి సాధ‌న‌లో స‌మ‌న్వ‌య కృషి అవ‌స‌రం

విజ‌య‌న‌గ‌రంజిల్లాను మ‌రింత ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపించేందుకు జిల్లా అధికారుల స‌మ‌న్వ‌య కృషి అవ‌స‌ర‌మ‌ని, ఆ దిశ‌గా ఒక‌రికొక‌రు స‌హ‌కరించుకుంటూ ప్ర‌తి ఒక్కరూ పని చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. ఎప్ప‌టి స‌మ‌స్య‌లు అప్పుడే పరిష్క‌రించుకోవాల‌ని, త‌రచూ క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌నలు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల ప్ర‌త్యేకాధికారుల‌తో ఆమె స్థానిక క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. ప‌లు సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై, ప్‌వజా స‌మ‌స్యపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ముందుగా ప్ర‌తి మండ‌ల ప్ర‌త్యేక అధికారి ఇటీవ‌ల కాలంలో త‌న ప‌ర్యటించిన‌ గ్రామాల్లో గుర్తించిన‌ స‌మ‌స్య‌ల‌ను, మండ‌ల స్థాయి క‌న్వ‌ర్జెన్సీ స‌మావేశాల్లో చ‌ర్చించిన అంశాల గురించి క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.

క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌ల్లో గుర్తించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, క‌న్వ‌ర్జెన్సీ స‌మావేశాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాల‌పై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఈ సంద‌ర్భంగా మార్గ‌నిర్దేశం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో.. సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లో చొర‌వ చూపాల‌ని సూచించారు. సఖి గ్రూపుల‌ను, స్పోర్ట్స్ క్ల‌బ్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. అంగ‌న్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల‌కు, గ‌ర్భిణుల‌కు పౌష్టికాహారం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంట‌ర్లు, డిటిజ‌ల్ లైబ్ర‌రీల నిర్మాణాలు వేగ‌వంతంగా జ‌రిగేలా ప్ర‌ణాళికాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు. వివిధ విభాగాల్లో సిబ్బంది, అధికారులు అందుబాటులో ఉండేలా చూసుకోవాల‌ని చెప్పారు. పాల్ న‌గ‌ర్‌లో అంగ‌న్ వాడీ కేంద్రాన్ని స్థానికుల‌కు అందుబాటులో ఉండే చోటుకు మార్చాల‌ని, పీపీ-1,2 పాఠ్యాంశాల బోధ‌న‌పై వ‌ర్క‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఐసీడీఎస్ పీడీని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ప్ర‌ధానంగా బాలికా విద్య‌పై అంద‌రూ దృష్టి సారించాల‌ని సూచించారు.

గ్రామాల ప‌రిశుభ్ర‌తపై దృష్టి సారించాల‌ని, చెత్త నుండి సంప‌ద త‌యారీ కేంద్రాల‌ను వినియోగంలోకి తీసుకురావాల‌ని సూచించారు. కొత్త‌వ‌ల‌స‌, పెద‌తాడివాడ‌, ర‌ఘుమండ త‌దిత‌ర జ‌గ‌నన్న కాల‌నీల్లో త్వ‌రిత‌గ‌తిన విద్యుత్ స‌దుపాయం క‌ల్పించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఎల్‌. కోట‌లో తాగునీటి ట్యాంకు ప‌రిశుభ్ర‌త‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్‌.ఈ.కి సూచించారు. మెంటాడ కేజీబీవీలో కంప్లైంట్ బ్యాక్స్ ఏర్పాటు చేయాల‌ని, వాటిని ప‌రిశీలించి నివేదిక అంద‌జేయాల‌ని ప్ర‌త్యేక అధికారిని ఆదేశించారు. వివిధ విభాగాల్లో ఇ-కేవైసీ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని, అమ్మ ఒడి న‌గ‌దు జమ కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. జ‌గ‌న‌న్న విద్యాకానుక కిట్ల‌ను అంద‌రికీ అంద‌జేయాల‌ని, వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని చెప్పారు. పీహెచ్‌సీల్లో సిబ్బంది స‌మ‌య పాల‌న పాటించాల‌ని, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని పేర్కొన్నారు.  స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, సీపీవో బాలాజీ, జ‌డ్పీ సీఈవో అశోక్ కుమార్‌, విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌రాములు నాయుడు, డీఆర్డీఏ పీడీ క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి, మెప్మా పీడీ సుధాక‌ర్‌, డీఎం&హెచ్‌వో ర‌మ‌ణ కుమారి, ఎస్‌.ఎస్‌.ఎ. పీవో స్వామినాయుడు, డీసీవో అప్ప‌ల‌నాయుడు, ఐసీడీఎస్ పీడీ శాంత‌కుమారి, మత్స్యశాఖ అదనపు సంచాలకులు ఎన్.నిర్మలకుమారి, పంచాయ‌తీ రాజ్ ఎస్.ఈ. గుప్తా ఇత‌ర జిల్లా స్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-18 13:14:45

ఏడీపీలో నిర్ణీత ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి

ఏస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం (ఏడీపీ)లో భాగంగా నిర్ణీత ల‌క్ష్యాల‌ను చేరుకొని, ఇప్ప‌టి కంటే మెరుగైన ర్యాంకు సాధించేలా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. నీతి ఆయోగ్ నిర్దేశించిన అన్ని ఇండికేట‌ర్ల‌లో మెరుగైన ఫ‌లితాలు సాధించేలా ప్ర‌తి విభాగం త‌న వంతు పాత్ర పోషించాల‌ని సూచించారు. ముఖ్యంగా జిల్లాలోని చిన్నారులు, గ‌ర్భిణుల ఆరోగ్యంపై ప్ర‌ధానంగా దృష్టి సారించాల‌ని, పాఠ‌శాల‌లు, అంగ‌న్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అంద‌జేయాల‌ని చెప్పారు. పారిశుద్ధ్యంపై, ప్ర‌జారోగ్యంపై దృష్టి సారించాల‌ని, ఆరోగ్య క‌ర స‌మాజ నిర్మాణానికి ప్ర‌తి ఒక్క‌రూ శ్ర‌మించాల‌న్నారు. గ్రామాల్లో ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని, సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌ల కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని పేర్కొన్నారు. చిన్న వ‌య‌సులోనే వివాహం అన‌ర్థాల‌కు దారి తీస్తుంద‌ని, త‌ల్లి పిల్లా ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంద‌ని దీనిపై ప్ర‌త్యేక దృష్టి సారించి బాల్య వివాహాల‌ను అరిక‌ట్టాల‌ని సూచించారు. అలాగే త‌ల్లిపాల శ్రేష్ఠ‌త గురించి ప్ర‌తి త‌ల్లికీ తెలియ‌జేసి.. బిడ్డ ఆరోగ్యాన్ని సంర‌క్షించాల‌ని చెప్పారు. విద్య‌, వైద్యం, ప్ర‌జా ఆరోగ్యం, ప్ర‌జా సంక్షేమంపై దృష్టి సారించి అన్ని రంగాల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించ‌టం ద్వారా నీతి ఆయోగ్ ర్యాంకింగ్‌లో జిల్లా మెరుగైన స్థానంలో ఉండేందుకు అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఈ సంద‌ర్భంగా నీతి ఆయోగ్ ఇండికేట‌ర్ల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా సీపీవో బాలాజీ వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, సీపీవో బాలాజీ, ఐసీడీఎస్ పీడీ శాంత కుమారి, డీఎం & హెచ్ వో ర‌మ‌ణ కుమారి, డీఈవో విజ‌య శ్రీ, జ‌డ్పీ సీఈవో అశోక్ కుమార్‌, ఇత‌ర జిల్లా స్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-18 13:03:17

స్పషలాఫీసర్లు వ‌చ్చిన‌ప్పుడు స్పందించండి

క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌నల్లో భాగంగా ఆయా ప్రాంతాల‌కు ప్రత్యేక అధికారులు  వ‌చ్చిన‌ప్పుడు మండ‌ల స్థాయి అధికారులు త‌గిన రీతిలో స్పందించాల‌ని, వారు అడిగిన స‌మాచారం అందజేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశించారు. త‌నిఖీల్లో భాగంగా ప్ర‌త్యేక అధికారుల‌కు అన్ని విధాలా మండల అధికారులు, సచివాలయ సిబ్బంది స‌హ‌క‌రించాల‌ని సూచించారు. అలాగే మండ‌ల స్థాయి క‌న్వ‌ర్జెన్సీ స‌మావేశాలకు అన్ని విభాగాల మండ‌ల స్థాయి అధికారులు త‌ప్పుకుండా హాజ‌రు కావాల‌ని, బాధ్య‌త‌గా ఉండాల‌ని ఆదేశించారు. స్థానిక క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జిల్లాలోని అన్ని మండ‌లాల‌ ప్ర‌త్యేకాధికారుల‌తో సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌త్యేక అధికారులు ప‌లు స‌మ‌స్య‌ల‌ను క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకొచ్చారు. త‌నిఖీల‌కు వెళ్లిన‌ప్పుడు కొంత‌మంది సిబ్బంది అందుబాటులో ఉండ‌టం లేద‌ని, కొంత‌మంది స‌రిగా స్పందించ‌టం లేద‌ని చెప్పారు. ప్ర‌ధానంగా రాజాం ప‌రిధిలోని త‌నిఖీల‌కు వెళ్లినప్పుడు ఈ స‌మ‌స్య ఎదుర‌వుతోంద‌ని క‌లెక్ట‌ర్ కు వివరించ‌గా ఆమె పై మేర‌కు స్పందించారు. అన్ని మండలాల అధికారులు ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, బాధ్య‌త‌గా ఉండాల‌ని ఆమె ఆదేశించారు.

Vizianagaram

2022-07-18 13:00:52

మన్యం జిల్లాలో స్పందన అర్జీలు..120

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వినతులు పెద్ద ఎత్తున అందాయి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, సబ్ కలెక్టర్ భావన ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి 120 అర్జీలు అందాయి. జియ్యమ్మవలసకు చెందిన జి.సుజాత వికలాంగుల పింఛను మంజూరు చేయాలని కోరారు. పార్వతీపురానికి చెందిన మామిడి శారద అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని కోరారు. పెద గొడబ గ్రామానికి చెందిన పి.కృష్ణ పింఛను ఇపించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. పులిపుట్టి గ్రామానికి చెందిన ఎల్.గణేష్ అనే వ్యక్తి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని కోరారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతి రాజ్ ఇఇలు ఓ. ప్రభాకర రావు, ఎం.వి.జి. క్రిష్ణాజి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యా అధికారి మంజుల వాణి, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి గొల్ల వరహాలు, సెరికల్చర్ అధికారి సాల్మన్ రాజు, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఔషద నియంత్రణ అధికారి ఏ.లావణ్య, జిల్లా రవాణా అధికారి ఎం.వి.గంగాధర్, జిల్లా ప్రధాన అగ్ని మాపక అధికారి కె. శ్రీను బాబు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-07-18 11:17:22

వరదల ప్రాంతాల్లో ఇబ్బంది రాకుండా పటిష్ట చర్యలు

పశ్చిమగోదావరి జిల్లాలో వరద తాకిడి ప్రాంతాల ప్రజలకు ఏవిధమైన ఇబ్బంది కలగని  పటిష్ట మైన  ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఆయా జిల్లాలలోని వరద పరిస్థితులపై  జిల్లా కలెక్టర్ లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్  నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి  వరద ఉపశమన పునరావాస  ప్రత్యేక అధికారి  ప్రవీణ్ కుమార్ ,  జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి , ఎస్పీ యు. రవిప్రకాష్ , జాయింట్ కలెక్టర్ జెవి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 30 పునరావాస కేంద్రాలు  ఏర్పాటు చేయడం జరిగిందని  తెలిపారు. పునరావాస  కేంద్రాలలో 7334 మంది ఉన్నారని , పునరావాస కేంద్రంలో ఉన్నవారికి ,పునరావాస కేంద్రానికి రావడానికి నిరాకరించిన వారికి కూడా  ఉదయం అల్పాహారం , మధ్యాహ్నం భోజనం  రాత్రి భోజనం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో నూ ప్రజలకు 25 కేజీల బియ్యం,  ఒక కేజీ కందిపప్పు ,  ఒక కేజీ ఆయిల్ , ఒక లీటర్ పాలు , బిస్కెట్లు , బ్రెడ్లు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు .
    పశువుల కొరకు  2  టన్నుల పశుగ్రాసం కూడా పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు .జిల్లాలో వరద ప్రభావ ప్రాంతాలలోని ప్రజలను తరలించేందుకు 104 బోట్లను,  208 మంది గజఈతగాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  ప్రజలకు  ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు. గ్రామాలలో గ్రామస్థాయి సిబ్బందిని, తాసిల్దారులు , ఎంపీడీవోలను  నియమించి 24 గంటలు వరద పరిస్థితిపై మానిటర్ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. వరద ప్రభావ గ్రామాలలోని ప్రజలకు రెండు వేల రూపాయలు వారి అకౌంట్ కు బదిలీ చేసేందుకు ఎన్యూమురేషన్ చేయడం జరుగుతుందని వాటిని ఈరోజు నుండి వారి అకౌంట్ కు 2000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.  వరద పనరావాస కార్యక్రమాలకు అదనంగా మరో రెండు కోట్ల రూపాయలు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమె కోరారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Bhimavaram

2022-07-18 11:15:00

24నుంచి రాములోరి పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై 24 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూలై 23న సాయంత్రం అంకురార్పణంతో ఈ  ఉత్సవాలు ప్రారంభమవుతాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక  దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా  నివారించేందుకు ప్రతి ఏడాది  మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Tirupati

2022-07-18 11:04:43

సమస్యల పరిష్కారంలో చొరవ చూపండి

పశ్చిగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన  స్పందన  కార్యక్రమంలో  జిల్లా రెవెన్యూ  అధికారి కె.కృష్ణవేణి కలెక్టరేట్ ఏవో వై రవికుమార్, డిఎస్పి కె.ప్రభాకర్, స్పందన తాసిల్దార్ దుర్గా కిషోర్, అనంత కుమారి, భీమవరం ఎంపీడీవో జి పద్మ లతో హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సంధర్బంగా జిల్లాలోని వివిధ గ్రామాల నుండి  వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారుల అందించిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారంకు సంబందించి  సంబంధిత అధికారులకు డిఆర్ఓ ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా డిఆర్ఓ  మాట్లాడుతూ స్పందన ద్వారా అందిన దరఖాస్తులను ఎట్టిపరిస్థితులలోనూ నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు. స్పందనలో అందిన వినతుల పరిష్కారం లో ఎటువంటి జాప్యానికి తావులేకుండా పరిష్కరించాలన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్పందన కార్యక్రమం ఉండాలన్నారు.  ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు  క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా, అర్జీదారుడు సంతృప్తిచెందేలా  నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.  స్పందన అర్జీలను  మరింత సులభతరంగా, నాణ్యతతో పరిష్కరించడంతో పాటు పరిష్కార నివేదికను కూడా సంబందిత పోర్టల్లో పొందుపరచాలన్నారు. అనర్హత కలిగిన దరఖాస్తులను అందుకు తగిన కారణాలను తప్పనిసరిగా వివరిస్తూ తిప్పి పంపాలన్నారు. స్పందన కార్యక్రమంలో  వృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యులు మేళం దుర్గా ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Bhimavaram

2022-07-18 10:37:37

ఆరు నూరైనా విశాఖ పరిపాలన రాజధాని

ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, విశాఖను  పరిపాలనా రాజధానిగా చేస్తామని, మరో 2, 3 నెలల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు,  ఐ.టి శాఖామంత్రి గుడివాడ అమరనాథ్ స్పష్టం చేసారు. విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ శనివారం స్థానిక స్థానిక  ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమర్నా థ్ ముఖ్య  అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విశాఖపట్టణానికి ప్రత్యేక స్థానం ఉందని దేశ, విదేశాల నుంచి వచ్చినవారు ఈ ప్రాంతాన్ని ముందుగా చూడాలని అనుకుంటారని అన్నారు. ఈ శనివారం పశ్చిమ ఆస్ట్రేలియా బృందం కూడా మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినపుడు వాళ్ళు బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైని మాత్రమే ఎంచుకున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు.  తను అధికారికంగా ఏప్రాంతానికి వెళ్ళినా, వీలైనంత త్వరగా విశాఖ వచ్చేయాలని అనుకుంటానని, ఇంతటి సుందరమైన ప్రదేశాన్ని రాజధానిగా  చేస్తే  ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అమర్నాధ్ చెప్పారు. 

యజమానులు రుణాలు తిరిగి చెల్లించడంలో ఒక్క. రోజు ఆలస్యమైనా బ్యాంకులు ఇబ్బందులకు. గురిచే స్తూన్నాయని ఈ విషయాన్ని ప్రభుత్వంలో మాట్లాడి వారికి కొంత వెసులు బాటు కల్పించాలని బాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సతీష్ కోరారు. దీనిపై మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు,సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవలసిన అధికారులు. అందుకు భిన్నంగా వ్యవరించడం వలన ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.   తన పరిధిలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని అమర్ నాధ్  హామీ ఇచ్చారు. అధికారాన్ని తాను చాలా దగ్గరగా చూస్తున్నానని, అయితే అది శాశ్వతం కాదన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచు కుoటానని అమర్ నాథ్ చెప్పారు.   తను అధికారంలో ఉన్నoతవరకూ వీలైనంత మందికి సహాయం అందించాలని కోరుకుంటూ వుoటానని అమరనాథ్ స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా విశాఖలో త్వరలోనే ఎం.ఎస్. ఎంఈ.  పార్క్ ను ఏర్పాటు చేస్తామన మంత్రి అమరనాధ్ తెలియచేసారు. ప్రభుత్వ స్థలం అందుబటులోకి రాగానే పార్క్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో 1.25 లక్షల ఎం ఎస్ ఎంఈలు 15వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నామని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయ ని ఆయన చెప్పారు. కాగా విశాఖ లో ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో .సి.ఇ.ఇ. సదస్సు  నిర్వహించి మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు వస్తామని అమరనాద్ ఆ తెలియ చేశారు.

Visakhapatnam

2022-07-16 15:38:12

కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక

తూర్పుగోదారి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి వరద ప్రవాహం కొనసాగు తుండటంతో 3వ ప్రమాద హెచ్చరిక  కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 25.29 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎంత నీరు వస్తే అంతే నీటికి అధికారులు సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. వరద ప్రవాహం నెమ్మదిగా మాత్రమే పెరుగుతుందని..ఈ రాత్రి వరద ప్రవాహాం తగ్గే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  కంట్రోల్ రూమ్ నుంచే రాష్ట్ర విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఎండి బి. ఆర్ అంబేద్కర్ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రవాహం, ముంపు ప్రాంతాల వారి సమాచారం అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా..అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు, వారికి కావాల్సిన సదుపాయాలను సైతం జిల్లా యంత్రాంగం ఏర్పాట్టు చేస్తున్నది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రత్యేక బులిటెన్ ద్వారా కోరింది.

Dhavaleswaram

2022-07-16 13:11:16

2023లోగా భవన నిర్మాణాలు పూర్తికావాలి

తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. విలువైన విజ్ఞానం దాగివున్న మాను స్క్రిప్ట్స్‌ను (చేతి రాత‌ల ప్ర‌తులు) చక్కగా స్కాన్ చేసి భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని చెప్పారు. తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి శనివారం ఆయన టీటీడీలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌ రెడ్డి మాట్లాడుతూ, స్విమ్స్ లో క్యాన్సర్ యూనిట్ లోని ఈ, ఎఫ్‌ బ్లాక్ ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బర్డ్ ఆస్పత్రి సమాచారం, ఓపి ఇతర వివరాలన్నింటితో కలిపి మొబైల్ యాప్ తయారు చేయాలన్నారు. బర్డ్ లో కొత్తగా 100 పడకలు అందుబాటులోకి తేవడానికి తగిన ఏర్పాటు చేయాలన్నారు. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో ఈ నెలాఖరులోపు నూతన యంత్రాలను పూర్తిగా ఏర్పాటు చేసి అక్టోబర్ నుంచి 266 రకాల కొత్త మందుల తయారీకి త‌గు అనుమ‌తుల‌తో చర్యలు తీసుకోవాలన్నారు.

       తిరుమలలో మ్యూజియం అభివృద్ధి, అంజనాద్రి, వెంగమాంబ ధ్యాన మందిరం,  ఘాట్ రోడ్ల‌లో కొండ చరియ‌లు విరిగిపడకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఈ- ఎం బుక్‌ అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. అలాగే తిరుమలలో విద్యుత్తు పొదుపు కోసం మీటర్ల ఏర్పాటు తదిత‌ర‌ అంశాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. తిరుప‌తిలోని టీటీడీ పరిపాలన భవనం ఆధునీకరణలో భాగంగా వర్క్ స్టేషన్స్, ప్రధాన ద్వారం ఎలివేషన్ అత్యద్భుతంగా వచ్చేలా వైకుంఠ ఏకాదశి నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. జమ్మూ, చెన్నైలో నిర్మిస్తున్న ఆలయాల నిర్మాణ పనులపై ఆయన సమీక్షించారు. గో శాలలో నిర్మిస్తున్న‌ ఫీడ్ మిక్సింగ్ ప్లాంటు, నెయ్యి త‌యారీ ప్లాంట్‌, గోశాల నిర్వహణ, దేశీయ గో జాతుల పిండోత్పత్తి విషయాలపై స‌మీక్షించారు.

       టిటిడి విద్యాలయాలకు సంబంధించి న్యాక్‌ గుర్తింపు, విద్యార్థుల వివరాలతో అప్లికేషన్ రూపొందించాల‌న్నారు. తిరుమల శేషాచ‌లం అట‌వీ ప్రాంతంలో అకేషియా చెట్ల తొలగింపునకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 28 నోడల్ గోశాలల నిర్వాహకులకు శిక్షణ గురించి అధికారులతో చర్చించారు. అదివో అల్లదివో కార్యక్రమం ఫైనల్ పోటీలను ఆగస్టు నెలలో పూర్తి చేయాలన్నారు. వేదాల సారాన్ని ప్రజలకు అందించేలా ఎస్వీబిసి కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌న్నారు. అలిపిరిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవ‌స‌ర‌మైన నియ‌మావ‌ళిని సిద్ధం చేయాల‌న్నారు.  జెఈవోలు  సదా భార్గవి,  వీర‌బ్ర‌హ్మం,  సివిఎస్వో  నరసింహ కిషోర్, ఎఫ్ ఎసిఎవో  బాలాజి, ఎస్వీబిసి సీఈవో  షణ్ముఖ కుమార్,  సిఎవో  శేష శైలేంద్రతో పాటు పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Tirupati

2022-07-16 13:00:07

ఎమ్మార్పీ ధరలకే ఎరువులు అమ్మాలి

ప్ర‌భుత్వ నిర్ణ‌యించిన ఎం.ఆర్‌.పి. ధ‌ర‌ల‌కే ఎరువుల‌ను విక్ర‌యించాల‌ని, అలా కాకుండా నిబంధ‌న‌లు అతిక్ర‌మించి అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించిన‌ట్ల‌యితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వని జిల్లాలోని ఎరువుల డీల‌ర్ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ హెచ్చ‌రించారు. రైతుల‌కు నాణ్య‌మైన ఎరువుల‌ను అందించాల‌ని, వారితో స‌ఖ్య‌త‌గా మెల‌గాల‌ని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ఎరువుల‌ డీల‌ర్ల‌తో జేసీ శ‌నివారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మావేశం నిర్వ‌హించారు. దీనిలో భాగంగా ముందుగా జిల్లా వ్య‌వ‌సాయ అధికారి వి.టి. రామారావు ఎరువుల విక్ర‌యంలో అనుస‌రించాల్సిన నిబంధ‌న‌లు, నియ‌మావ‌ళి గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. 
ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రైతుల‌కు నాణ్య‌మైన ఎరువులను అందించాల్సిన బాధ్య‌త  ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని పేర్కొన్నారు. అధిక లాభాపేక్ష‌కు పోకుండా రైతుల ప‌ట్ల‌ సేవా దృక్ప‌థాన్ని డీల‌ర్లు క‌న‌బ‌ర‌చాల‌ని జేసీ హిత‌వు ప‌లికారు. ఎరువుల కృత్రిమ కొత‌ర సృష్టించ‌టం, నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌టం లాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు. 

రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు మంచి చేయాల‌నే దృక్ఫ‌థంతో ముందుకు వెళ్తోంద‌ని దానికి అనుగుణంగా మ‌నంద‌రం న‌డుచుకోవాల‌ని పేర్కొన్నారు. క‌ల్తీ ఎరువులు విక్ర‌యించినా.. అధిక ధ‌ర‌ వ‌సూలు చేసినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు. రైతు భ‌రోసా కేంద్రాలు, ఎరువుల దుకాణాల వ‌ద్ద ఎం.ఆర్‌.పి. ధ‌ర‌లు వేస్తూ ధ‌ర‌ల ప‌ట్టిక‌ను ఏర్పాటు చేయాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను, డీల‌ర్ల‌ను జేసీ ఆదేశించారు. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీక‌రించేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబ‌ర్‌ను అందుబాటులో ఉంచాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. నానో యూరియా, పొటాస్ ప్ర‌యోజ‌నాల‌ను రైతుల‌కు తెలియజేయాల‌ని, వాటి వినియోగాన్ని పెంచాల‌ని డీల‌ర్ల‌కు సూచించారు. ఏ రోజుకా రోజు ఎరువుల విక్ర‌యానికి సంబంధించిన నివేదిక‌ను ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాల‌ని, బిల్లుల పుస్త‌కాల‌ను, స్టాక్ రిజిస్ట‌ర్ల‌ను మెయింటైన్ చేయాల‌ని సూచించారు. స‌మావేశంలో జిల్లా వ్యవ‌సాయ అధికారి వి.టి. రామారావు, ఏడీ అన్న‌పూర్ణ‌, ప‌రిశోధ‌క‌ అధికారి ప్ర‌కాశ్‌, మండ‌ల వ్యవ‌సాయ అధికారులు, అధిక సంఖ్య‌లో డీల‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-16 12:39:42

ఫ్రై డే డ్రై డే గా తప్పకుండా పాటించాలి

వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని శాఖల సమన్వయంతో  పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి సూచించారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని అన్నారు. పారిశుధ్యం,  వ్యాధుల నివారణ పై మున్సిపల్ కమీషనర్లు, వైద్య శాఖ అధికారులతో   శనివారం కలెక్టర్ సమీక్షించారు.  ఎక్కడ చెత్త కుప్పలు కనపడిన, నీటి నిల్వలు  గుర్తించినా, డ్రైనేజీ లు ఓవర్ ఫ్లో అయినా వాటిని  సంబంధిత యాప్ లో. హెల్త్ సెక్రటరీ, సానిటరీ సిబ్బంది తో కలసి అప్లోడ్ చేయాలని , సంబంధిత శాఖలు  వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లి క్లియర్ చేయాలన్నారు. ఫ్రై డే డ్రై డే గా తప్పక పాటించాలని ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ సహాయకులు, వాలంటీర్లు ,సానిటరీ సెక్రటరీలు, డ్వాక్రా మహిళలు భాగస్వామ్యం కావాలని సూచించారు. జిల్లాలో డెంగీ కేసు లు నమోదు అయితే సహించేది లేదని, అందరూ సమన్వయం  తో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి, డి.పి.ఓ సుభాషిణి, జిల్లా  పరిషత్ సి.ఈ.ఓ అశోక్ కుమార్, జిల్లా మలేరియా అధికారి తులసి తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-16 12:21:45

డెంకాడ గ్రామసచివాలయం నెంబర్ వన్

విజయనగరంజిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల వారి పని తీరును ప్రామాణికంగా చేసుకొని ర్యాంకింగ్ లను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. సచివా లయాలలో  అందించిన సేవలు, స్పందన నమోదు, స్పందన డిస్పోజల్స్, గడువు లోగా పరిష్కరించినవి,  హౌసింగ్ తదితర అంశాల  ప్రామాణికంగా  ఓవరాల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో ప్రధానంగా డేంకాడ రూరల్ గ్రామ సచివాలయం  రాంక్ 1 కైవసం చేసుకుంది. పూసపాటి రేగ మండలం   కోనాడ సచివాలయం  2 వ రాంక్, భోగాపురం మండలం సవరవల్లి సచివాలయం  3వ రాంక్ సాధించినట్లు కలెక్టర్ తెలిపారు. సంతకవిటి మండలం మోదుగుల పేట, రేగిడి ఆమదాలవలస మండలం రేగిడి సచివలయాలు 4,5 స్థానాలలో నిలిచినట్లు తెలిపారు.

Vizianagaram

2022-07-16 11:28:27

ఆసుపత్రుల్లో నాడు-నేడు సత్వరం జరగాలి

కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో నాడు-నేడు కింద చేపట్టిన పనుల‌ను త్వరితగతిన పూర్తిచేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషిచేయాల‌ని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శ‌నివారం కాకినాడ కలెక్టరేట్ కోర్టుహాల్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు-నేడు కింద చేపట్టిన మ‌ర‌మ్మ‌తులు, ఆధునికీక‌ర‌ణ త‌దిత‌ర పనుల పురోగతిపై క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏపీ ఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల ప్ర‌తినిధుల‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తునిలోని 100 ప‌డ‌క‌ల ఏరియా ఆసుప‌త్రి ఆధునికీక‌ర‌ణ‌, ఏలేశ్వ‌రం సీహెచ్‌సీ సామ‌ర్థ్యాన్ని 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపుతో పాటు పెద‌పూడి సీహెచ్‌సీ, జ‌గ్గంపేట సీహెచ్‌సీ, తాళ్ల‌రేవు సీహెచ్‌సీ, ప్ర‌త్తిపాడు సీహెచ్‌సీ, రౌతుల‌పూడి సీహెచ్‌సీ త‌దిత‌ర ఆసుప‌త్రుల్లో చేప‌ట్టిన ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో ప‌నులు జ‌రిగేలా చూడాల‌ని.. ఇందుకు ఆయా ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు ప్ర‌తి వారం స‌మీక్ష చేయాల‌ని సూచించారు. ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యక్ర‌మంలో ప్ర‌ణాళికాయుతంగా ప‌నుల పూర్తికి కృషిచేయాల‌న్నారు. కాంట్రాక్టు సంస్థ‌లు ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప‌నులు పూర్తిచేసేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో ఏపీఎంఎస్ఐడీసి ఈఈ కె.సీతారామరాజు,  డీసీహెచ్ఎస్ డా. పీవీ విష్ణువర్థిని, ఏపీఎంఎస్ఐడీసి డీఈలు ఎన్ఎస్. చక్రవర్తి, బి.రుసేంద్రుడు, వివిధ ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-07-16 10:11:50

ఈ సోమవారం స్పందన కలెక్టరేటులోనే

కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఈనెల 18వ తేదీ సోమవారం నాడు నిర్వహించే జిల్లా స్థాయి స్పందన ప్రజావిజ్ఞాపనల పరిష్కార కార్యక్రమం  జిల్లా కేంద్రం కాకినాడలో కలెక్టరేటులోని స్పందన సమావేశ హాలులో ఉదయం 9-30 గంటల నుండి జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలియజేశారు.  ఈ అంశాన్ని అర్జీదారులు గమనించి వారి సమస్యల పరిష్కారానికి స్పందన వేదికను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరో వైపు కలెక్టరేట్ లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వశాఖల  జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటలో జిల్లా కలెక్టర్  డా.కృతికా శుక్లా  కోరారు. 

Kakinada

2022-07-16 09:58:45