ఎస్.రాయవరం ప్రజలను పందులు నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పందుల పెంపకం దారులను స్థానిక సచివాలయ సిబ్బంది హెచ్చరించా ఫలితం లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెబుతున్నారు. విశేషమేమిటంటే ఈ పందుల ద్వారా పడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక గ్రామస్తులు పోలీసు స్టేషన్ కి సైతం ఫిర్యాదు చేశారు. ఇపుడు స్పందనలో కూడా ఫిర్యాదు చేస్తున్నట్టు సమాచారహక్కు చట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు మీడియాకి వివరించారు. యస్.రాయవరం గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ రైతులు వేసుకున్న పంట పొలాలను పందులు నాశనం చేస్తున్నాయన్నారు. గ్రామస్తులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పందులను పెంచుతున్న పెంపకందారులను, అనేక సందర్భంలో గ్రామ పంచాయతీ అధికారులు హెచ్చరించినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికే పందులను గ్రామానికి చివరన పెంచుకోవాలని పెంపకం దారులకు చెప్పినట్టు రైతులు,గ్రామస్తులు చెప్పారు. పందుల కారణంగా గ్రామంలోని ప్రజలు అనారోగ్యం భారిన పడుతున్నారని, తరచూ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మెదడువాపు వ్యాధి, బోదకాలు వ్యాధి పందలు వలన వచ్చే అవకాశం వున్నందున పందులను ఊరవతలకి తరలించాలని పెంపకం దారులకు చెప్పామన్నారు. వినకపోతే, పెంపకం దారులపైనా పోలీసులకు ఫిర్యాదులు చేయడం తోపాటు జిల్లా కలెక్టర్ ద్రుష్టికి ఈ పందుల విషయాన్ని తీసుకెళతామని గ్రామస్తులు సైతం చెబుతున్నారు.
విశాఖ ఏజెన్సీలో 18 సంవత్సరాలు నిండిన వారు తప్పకుండా ఓటు నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని వెన్యూ డివిజనల్ అధికారిణి కె.లక్ష్మీ శివ జ్యోతి సూచించారు. శనివారం హకుంపేట మండలం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఓటర్ల నమోదు కార్యక్రమంపై వాలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బూతు లెవెల్ అధికారులు అందుబాటులో వుండాలన్నారు. సచివాలయంలో ఎల్లప్పుడూ సిబ్బంది కూడా అం దుబాటులో వుండి ఓటరు నమోదుపై ప్రజలకు వచ్చిన సందేహాలను నివ్రుత్ది చేయాలన్నారు. తదనంతరం ఆమె హుకుంపేట మండలం కొట్నాపల్లి గ్రామంలో గల సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రజలకు అందుతున్న సంక్షేమ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పాయకరావుపేట నియోజకవర్గంలోని సత్యవరం నుంచి మాసాపేట రోడ్డుకి రూ. 1.50 కోట్లు తాను ప్రత్యేంగా నిధులు మంజూరు చేశానని ఎమ్మెల్యే గొల్లబాబూరావు స్పష్టం చేశారు. శనివారం పాయకరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో తాను సత్యవరం, మాసాపేట గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రోడ్డుకి నిధులు మంజూరు చేస్తే..దానికి ఎవరో నిధులు మంజూరు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలకు తెలియాలనే తాను ఈ విషయాన్ని ప్రత్యేంగా చెబుతున్నానన్నారు. సత్యవరం నుంచి మాసాపేట వెళ్లే రహదారిపూర్తిగా పాడైపోవడంతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకొని ఆ రోడ్డుకి నిధులు మంజూరు చేస్తే..దానికి ఎవరో నిధులు మంజూరు చేశారని ప్రచారం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అభివ్రుద్ధి పనికి ఎవరు నిధులు మంజూరు చేశారో ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్గబాబూరావుని డామినేట్ చేయాలని చూస్తున్న కొందరు అతని అనుచరులే ఈ విధమైన ప్రచారానికి తెరలేపి ప్రత్యేకంగా దినపత్రికల్లో వార్తలు రాయించారనే ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో ఎమ్మెల్యేకి వస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేని ఒక వర్గం నాయకులే చేసిన పనిగానే నియోజవకర్గంలో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సత్యవరం నుంచి మాసాపేట రోడ్డు విషయమై నేరుగా ఎమ్మెల్యే గొల్లబాబూరావు తానే ఫేస్ బుక్ , మీడియా వేదికగా వాస్తవాన్ని తెలియజేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.!
గ్రామసచివాలయ భవన నిర్మాణాలను త్వరతి గతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎలమంచిలి మండలం పులపర్తి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఎలమంచిలి మండలంలో షేక్ ఆలి పాలెం గ్రామ సచివాలయ నిర్మాణపు పనులను పరిశీలించారు. భవనాల పురోగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లే అవుట్ పనుల పురోగతిపై రెవెన్యూ , మున్సిపల్ శాఖాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిమెంట్ స్టాకును పరిశీలించారు. పులపర్తి గ్రామంలో కలెక్టరు సచివాలయ సిబ్బందిని, ఎఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్ లను విధి నిర్వహణపై ప్రశ్నలు అడిగారు. ఇంటింటి సర్వే చేసి ఆరోగ్యశ్రీ లబ్దిదారులను గుర్తించాలని ఆదేశించారు. మహిళా సంరక్షణ సహాయకులను, ఇతర ఉద్యోగులను వారి శాఖకు సంబంధించిన విధులపై ప్రశ్నించారు. సిబ్బంది ప్రజా సమస్యలను అర్ధంచేసుకొని పరిష్కరించడంతో చొరవచూపాలాన్నారు. ఆరోగ్యసిబ్బంది సచివాలయ పరిధిలోని ప్రజల ఆరోగ్యంపై ద్రుష్టిసారించాలని ఆదేశించారు.
పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇల్లులేని నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల లే అవుట్ ల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కశింకోట మండలం కశింకోట, ఎలమంచిలి మండలం మర్రిబంద, షేక్ ఆలీపాలెం గ్రామాలలో ఇళ్ల పట్టాల లేఅవుట్ ల పురోగతిని కలెక్టరు తనిఖీ చేశారు. కశింకోటలో ఎ.8-86సెం. భూమిలో 305 మంది లబ్దిదారులకు, మర్రిబంద గ్రామంలో ఎ.8-86సెం. ఎలమంచిలి మున్సిపాలిటీకి చెందిన389 మంది లబ్దిదార్లకు షేక్ ఆలీపాలెంలో ఎ.1-57సెం. భూమిలో 55 మంది లబ్దిదార్లకు పట్టాలు అందించడానికి గాను లేఅవుట్లు అందరికీ అనుకూలంగా వుండేలా, త్వరగా పనులను పూర్తిగా వించాలని అధికారులను ఆదేశించారు. స్థలంలో వున్న తుప్పలను తొలగించి, చదును, శుభ్రం చేయించాల్సిందిగా ఉపాధి హామీ క్రింద పనుల ను చేయించాలని డ్వామా ఎపిడిని ఆదేశించారు.
గ్రామసచివాలయాలకు సిబ్బంది సమయానికి వచ్చి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పాడేరు ఆర్డీఓ కె.లక్ష్మీశివజ్యోతి ఆదేశించారు. జి.మాడుగుల మండలం బీరమ్ గ్రామ సచివాలయాన్ని శుక్రవారం రెవెన్యూ డివిజనల్ అధికారిణి ఆకస్మికంగా తనిఖీచేసారు. ఈ తనిఖీ లో భాగంగా సిబ్బంది హాజరు పట్టిక, మరియు ప్రతీరోజు కార్యాలయానికి వస్తున్నదీ లేనిది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల సచివాలయ సేవలు ప్రజలకు అందించాలని ఆమె తెలిపారు.ప్రతీరోజు సచివాలయానికి హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలోని ప్రజలకు సచివాలయానికి వెళితే తమ సమస్యపరిష్కారం అవుతుందనే భరోసాను కల్పించాలన్నారు అనంతరం నుర్మతి గ్రామంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్.డి.ఒ., అటవీశాఖ సిబ్బంది, మరియు రెవెన్యూశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాదదూళితో పునీతమైన ప్రాంతం తుని పట్టణమని పాయకరావుపేట ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్సి వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్లబాబూరావు కొనియాడారు. విశాఖపట్నం నుంచి తుని రైలు ప్రయాణం ద్వారా వచ్చి చరిత్రాత్మక పర్యటన జరిగి నేటికీ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ తపాలా శాఖ స్పెషల్ కెరీ కవర్ విడుదల చేపట్టారు. దానాని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 1944 సంవత్సరం అంబేద్కర్ తుని వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ఏపీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లుతో కలిసి ఈ కవర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా వుందన్నారు. నవంబర్ 26న అంబేద్కర్ తుని విచ్చేసిన రోజు కావడం, భారత రాజ్యాంగం ఆమోదింపబడిన రోజు కావడం మరువలేని రోజు అని తెలియజేశారు. నేటి యువతరానికి అంబేద్కర్ స్ఫూర్తిదాయకమన గొల్ల తపాలా ఏపీ శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు మంచి కార్యక్రమానికి నాంది పలికారన్నారు. పోస్టుమాస్టర్ జనరల్ మాట్లాడుతూ, తపాలా శాఖ చరిత్రాత్మక , సామాజిక,ప్రత్యేక కలలు,చరిత్రలో నిలిచి వుండే అంశాలపై తపాలాశాఖ స్పెషల్ కెరీ కవర్ విడుదల చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ అధికారుల, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ట్రైకార్ ద్వారా మినీ ట్రక్కులు మంజూరు చేయడానికి లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని పాడేరు సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ఏజెన్సీలో పేద గిరిజన నిరుద్యోగులకు మినీ ట్రక్కులు ఆర్దిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు . మన్యంలోని 11 మండలాల ఎంపిడి ఓలు ,గ్రామ సచివాలయాల వెల్ఫేర్ సహాయకులతో గురువారం మధ్యాహ్నం ఐటిడి ఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా లో 158 మంది గిరిజన అభ్యర్దులకు మినీ ట్రక్కులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈనెల 27తో దరఖాస్తుల గడువు ముగిస్తుందన్నారు. డిసెంబరు 4 వతేదీన దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మౌఖిక పరీక్షలు నిర్వహించడానికి నలుగురు అధికారుల బృందాన్ని నియమించామని చెప్పారు. ఇంటర్వూలను అనుమానాలకు తావు లేకుండా పగడ్భందీగా నిర్వహించాలని అధికాలను ఆదేశించారు. ఎంపిక చేసిన అభ్యర్దుల జాబితాను వెంటనే ఐటిడి ఏ కు సమర్పించాలన్నారు. అభ్యర్దుల అర్హతలు పక్కాగా గుర్తించి ,ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేసారు. గ్రామ వాలంటీర్ల పరిధిలో 50గృహాల కంటే ఎక్కువ గృహాలు ఉన్న వాలంటీర్ల జాబితా సిద్దం చేసి సమర్పించాలని సూచించారు. అవసరమైన చోట అదనపు గ్రామ వాలంటీర్ల నియమాకానికి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. 11 మండలాల్లో ఉద్యానవన గిరిజన రైతులకు 1740 బ్యాటరీతో నడిచే పిచికారీ పరికరాలు పంపిణీ చేసామని , లబ్దిదారుల జాబితాను ఐటిడి ఏ సమర్పించాలన్నారు. ముంచింగ్‌పుట్టు, హుకుంపేట, పెదబయలు,జి.మాడుగుల , జికె వీధి మండలా ఎంపిడి ఓలు వెంటనే రిపోర్టులు నేటికి రాలేదని ఈనెల 30 వతేదీలోగా పంపించాలన్నారు. ఈ సమావేశంలో ఐటిడి ఏ సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) వి ఎస్ ప్రభాకర్ , ప్రాజెక్టు ఉద్యాన వన అధికారి జి.ప్రభాకరరావు,ట్రైకార్ సహాయకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం గాని, తాను గాని ఎల్లప్పుడూ రైతు పక్షమేనని, ప్రజలకు ఇబ్బంది, నష్టం కల్గించే పరిశ్రమలను తాను కూడా ప్రోత్సహించబోనని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్పష్టం చేశారు. బుధవారం రాజయ్యపేట వద్ద విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యే బాబూరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను అధికారంలో లేనప్పుడూ, వున్నప్పుడూ ఒకే మాట, సిద్దాంతానికి కట్టుబడి వుంటానని చెప్పారు. హెటెరో పరిశ్రమ వల్ల కొన్ని నష్టాలు కలుగుతున్నాయన్న విషయాన్ని తాను కూడా గుర్తించానని చెప్పారు. కారిడార్ భూములకు సంబంధించి 2013 భూసేకరణ ప్రకారం పరిహారం, జిరాయితీ భూములకు సమానంగా డి.పట్టా భూములకు పరిహారం, ఫలసాయం, గృహాలకు ముందుగా చెప్పిన మాట ప్రకారం పరిహారం ఇవ్వలేదన్న విషయాన్ని రైతులు ఇటీవలే తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ భూసేకరణ, పరిహారం పంపిణీ తదితర అంశాల్లో కొన్ని అక్రమాలు జరిగినట్టు తెలిసిందని, పది రోజుల్లో ఎస్డీసీలతో గ్రామాల వారీగా సమగ్ర పరిశీలన జరిపిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులు, రైతులు, చేతివృ త్తుల వారికి అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంచినీరు, విద్యవైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
చిరువ్యాపారులకు జగనన్నతోడు పథకంతో ఆర్ధికాభివ్రుద్ధి సిద్ధిస్తుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన జగనన్నతోడు పథకాన్ని నియోజకవర్గ పరిధిలో నక్కపల్లి లో ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్ సి వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా దళారులు, వడ్డీ వ్యాపారుల నుంచి ఇబ్బందుతు తొలగుతాయని చెప్పారు. కాగా అనేక మంది చిరు వ్యాపారులు 36–60 శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని అష్టకష్టాలు పడుతున్నారని అలాంటి వారికి ఎంతో చేయూతనిచ్చే పథకంగా మారుతుందని అన్నారు. రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులని చెప్పారు. . ఈ పథకంను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే లబ్దిదారులకు సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, చిరువ్యాపారులు పాల్గొన్నారు.
తెలుగు చిత్ర సీమలో ఎన్నో జనరంజకమైన చిత్రాలు ఉన్నాయి .వాటిల్లో గుండమ్మ కథ చిత్రం మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు .
ఈ చిత్రంలో నందమూరి ,అక్కినేని, ఎస్వీ రంగారావు ,సావిత్రి, సూర్యకాంతం , రమణారెడ్డి వంటి హేమాహేమీలు అయినటువంటి ఎందరో నటీనటులు ఉన్నారు
ఈ చిత్రాన్ని నిర్మించాలనే ప్రయత్నాన్ని ఎందరో నిర్మాతలు చేసి విరమించుకున్నారు. ANR పాత్రను నాగార్జున ,NTR పాత్రను బాలకృష్ణ వేస్తారని ఒక్కసారి , ఏఎన్నార్ పాత్రను నాగ చైతన్య ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేస్తారని మరోసారి కొందరు నిర్మాతలు అనుకోవడం జరిగింది.
కానీ ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్ర గుండమ్మ . ఈ పాత్రకు ఒకసారి శ్రీదేవిని , మరొకసారి రమ్యకృష్ణను అనుకోవడం జరిగింది.
గానీ ఆ సాహసం ఎవ్వరూ చేయలేకపో
యారు.
గుండమ్మగా సూర్యాకాంతం అభినయించిన విధంగా ఎవరూ అభినయించలేరని ఈ ప్రయత్నాన్ని చివరకు సదరు నిర్మాతలు విరమించుకున్నారు .
తెలుగువారికి ఎంతో ఇష్టమైన "గుండమ్మ కథ"నిర్మాణం చివరకి అయోమయంలో
పడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు .
గొలుగొండ మండలంలో నాడు- నేడు పాఠశాలలో అభివ్రుద్ధి పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆర్. టి. ఐ ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్. యం. సి. కమిటీ , ప్రధాన ఉపాధ్యాయులు కలిసి నిర్ణయించి నాణ్యమైన గ్రానైట్ కొనుగోలు చేయవలసి ఉండగా ప్రధానోపాధ్యాయులు ఏకపక్షంగా గ్రానైట్ సరఫరా దారునితో లాలూచీపడి మండలంలో గల పాఠశాలలో అన్నిటి కి సరఫరా చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలపాలని అన్నారు. ఎస్ ఎం సి కమిటీ చైర్మన్లు గ్రానైట్ కొనుగోలు లో మమ్ములను సంప్రదించకుండా వారు ఇష్టారాజ్యంగా చేసి ప్రభుత్వమే సరఫరా చేసిందని దాని యొక్క సొమ్ము చెల్లించాలని ఖాళీ చెక్కులు పై ప్రధాన ఉపాధ్యాయులు సంతకాలు తీసుకోవడం లో అవినీతికి నిదర్శనం అన్నారు . జిల్లాలో చాలా మండలాల్లో నచ్చిన చోట ఎస్. ఎం.సి. నిర్ణయం మేరకు పలు షాపుల్లో కొనుగోలు చేశారని కానీ గొలుగొండ మండలానికి నర్సీపట్నం నుంచి సరఫరా చేయడంలో జిల్లా అధికారుల పాత్ర ఉందా ? లేక మండల అధికారుల పాత్ర ఉందా ? లేక ప్రధానోపాధ్యాయులా ఉందా ? దీనిపై విచారణ జరిపితే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్రుష్టికి కూడా తీసుకెళ్లనున్నామని ఆయన మీడియాకి వివరించారు.
అనకాపల్లి పట్టణం లో అక్కినేని అభిమానుల సమక్షంలో ఉత్తరాంధ్ర నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షులు మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో అక్కినేని నాగచైతన్య జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "లవ్ స్టోరీ" మూవీ విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. మరిన్ని మంచి చిత్రాలు రాబోయే కాలంలో వస్తున్నాయంటూ అక్కినేని నాగ చైతన్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తమ అభిమాన నటుడు సినిమాల కోసం ఎంతో కాలంగా మా ప్రేక్షులమంతా వేచి చూస్తున్నామన్నారు. కరోనా వైరస్ ను ద్రుష్టిలో ఉంచుకొని చైతన్య వేడుకలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో CH. అవతారం, ఆడారి కాశి రావు, గోల్డ్ వాసు, రాము యాదవ్, బెల్లాన శివాజీ, భాను చంద్ర అఖి, మోనో శ్రీను, బండి నాగరాజు, విశ్వనాథం, చందు, రెడ్డి సాయి కుమార్, చేపల చందు తదితరులు పాల్గొన్నారు.
రైతు శుభిక్షంగా ఉంటే దేశం సౌభాగ్యంగా వుంటుందని గాజువాక బీజేపి నియోజకవర్గ కన్వీనర్ కె.నరసింగరావు అన్నారు. ఆదివారం కే.కోటపాడు మండలం, సూదివలస గ్రామంలో గల 20మంది సన్నకారు రైతుల ఎరువులను పంపిణీకి ఆర్దికసాయం చేసారు. ఈ సందర్భంగా కే.ఎన్.ఆర్ మాట్లాడుతూ సన్నకారు రైతులు అప్పులు చేసి వ్యవసాయంలో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరైతు కుటుంబం ఆనందంగా వుండాలని మన దేశ ప్రదాని నరేంద్ర మోదీ ఓకే దేశం - ఓకే పంట ద్వారా దేశంలో రైతులు తాము పండించిన పంట దేశంలో ఎక్కడైనే అమ్ముకొనే అవకాశం కల్పించి రైతుల ఆదాయం రెండింతలు వచ్చేవిదంగా చేశారన్నారు. అమ్మచారిటబుల్ ట్రస్టు సభ్యులు సన్నకారు రైతులను గుర్తించి వారికి ఎరువులు , పనిముట్లు,విత్తనాలు ఇవ్వడంతో పాటు , వారితో కలసి ఒకరోజు శ్రమదానం కూడా చేస్తున్నందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ స్వచ్చంద సంస్ధ చైర్మన్ బాటా శ్రీను, ట్రస్టీలు బాస్కర్, అయ్యల నాయుడు,ఉషారాణి, లక్కీ షాపింగ్ మాల్ అధినేత స్వామి , ప్రముఖ వ్యాపారవేత్త రాజు గారు, మాజీసైనికులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కహానీలు నమ్మే అధికారులుంటే కట్టుకధలు ఫోటోలు చూపించి మరీ చెప్పొచ్చునని ఎస్.రాయవరం గ్రామసచివాలయ సిబ్బంది నిరూపిస్తున్నారనే ప్రచారం జోరుగగా సాగుతోంది..లేని ఆధార్ కేంద్రం ఉన్నట్టుగా..ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వ గ్రామసచివాలయంలో ఫోటోలు తీయించుకొని, వాటిని సామాజిక మాద్యమాల్లోకి పంపుతూ మరీ హడావిడీ చేస్తున్నారు. విషయం బయటకు తెలియడంతో అదేం లేదు కానీ.. అంటూ నాలుక కరుచుకుంటున్నారు..ఇదంతా జిల్లా అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడమే దీనికి కారణంగా కనిపిస్తుంది విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండల కేంద్రమైన ఎస్.రాయవరం లో ఆధార్ నమోదు కేంద్రం ఒక చోట ఇస్తే నిర్వహణ మరోచోట జరుగుతుంది. దీనికి సాక్షాత్తు సచివాలయ అధికారులే అవకాశం కల్పించడం గామాన్హారం. గ్రామ సచివాలయ కార్యాలయ భవనంలో ఆధార్ సెంటర్ కోడ్ 205231654 ప్రకారం నిర్వహిస్తున్నట్లు రికార్డుల లో పంచాయతీ కార్యదర్శి ఏ వి ఎస్ ఎస్ ప్రసాద్ తో కలిసి ఉన్నతాధికారులకు చూపిస్తూ కర్రి జోగారావు అనే వ్యక్తి గురజాడ షాపింగ్ కాంప్లెక్ ఎదురుగా నిర్వహిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఆధార్ కేంద్రం నిర్వహించకుండా వారంలో ఒక రోజు తూతూ మంత్రంగా ఆధార్ సేవలు నిర్వహించి ఫోటోలకు పోజులు ఇచ్చి ఇటు స్థానిక అధికారులను,అటు యూ.ఐ. డి ఆధార్ అధికారులను మభ్యపెడుతున్నారని మండలానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త ఆరోపిస్తున్నారు. ఇదేవిషయమై సచివాలయ అధికారులతో మాట్లాడితే పొంతన లేని సమాధానం చెబుతున్నారని రాజు మీడియాకి వివరించారు. కాగా ఈ విషయం ఒక్క పంచాయతీ కార్యదర్శి కి మాత్రమే తెలుసా ? లేక మండల స్థాయి అధికారులకు తెలుసా అనే సంగతి ఆ పెరుమాళ్లకే తెలియాలి అంటున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు ఉండటం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లా అధికారులు కొన్ని చోట్ల ఆధార్ కేంద్రాలు గ్రామసచివాలయాలకు పైలెట్ ప్రాజెక్టుగా మంజూరు చేశాయి. అయితే వాటిని ప్రభుత్వ సిబ్బందే నిర్వహిస్తున్నారు. కానీ ఎస్.రాయవరంలో మాత్రం ప్రభుత్వ భవనంలోప్రైవేటు వ్యక్తులు నిర్వహించడంపైనా రాజు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విదషయాన్ని జిల్లా అధికారులు, ఆథార్ నిర్వాహకులు, అటు మీసేవాల అధికారులకు ద్రుష్టికి తీసుకెళుతున్నట్టు ఆయన మీడియాకి వివరించారు. తక్షణమే అధికారులు ప్రభుత్వ భవనంలో ప్రైవేటు నిర్వాహకులతో చేపడుతున్న ఆథార్ కేంద్రంపై వివరణ ఇవ్వకపోతే ఎవరు ఏ కార్యాలయంలో ఏ పని చేస్తున్నారో అర్ధం కాని పరిస్థి నెలకొంటుందని చెబతున్నారు..