1 ENS Live Breaking News

పెన్షన్ పంపిణీ చేసిన డీఆర్డీఏపీడీ

వై.యస్.ఆర్. పెన్షన్ కానుక అవ్వ, తాతల అవసరాలకు వినియోగిస్తారని జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ డైరెక్టర్ డా. డి.వి. విద్యాసాగర్ వెల్లడించారు. గురువారం శ్రీకాకుళం మండలంలోని రాయిపాడు పంచాయితీ, గూడెం పంచాయతీలలో అవ్వ, తాత, వితంతువులకు వై.యస్.ఆర్. పెన్షన్ కానుక పింఛను ప్రోజెక్ట్ అధికారి అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో ఈ.రఘు, ఎంపిడిఓ పెన్షన్లు విభాగం పర్యవేక్షకులు బివివిఎస్ దొర, పంచాయితీ సెక్రటరీ సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-01 13:35:13

ప్రజల ఎలాంటి సమస్యలైనా పరిష్కాం

ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తనను కలవొచ్చునని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కాకినాడ 12వ డివిజన్‌లోని పర్లోపేట, స్వప్నిల్‌దినకర్‌  పుండ్కర్‌ కాలనీల్లో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. మేయర్‌ సుంకర శివప్రసన్న, కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కార్పొరేటర్లు, అధికారులు ఇంటింటికి వెళ్ళి మూడేళ్ళ పాలనో ప్రభుత్వం అందించిన లబ్ధిని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా పరిష్కరించగలమన్న ధైర్యం జగన్‌ ప్రభుత్వంలో ఉంటుందన్నారు. అందువల్లే ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. 

ఇలాంటి ప్రభుత్వంలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుపై ప్రజల్లో పూర్తి సంతృప్తి కనిపిస్తోందని, గడపగడపలో ప్రజల నుంచి వస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్, నగరపాలక సంస్థ కార్యదర్శి ఏసుబాబు, కార్పొరేటర్లు రాగిరెడ్డి బన్ని, నల్లబెల్లి సుజాత, గోడి సత్యవతి, సంగాని నందం, కర్రి శైలజ, లంకే హేమలత, వైఎస్సార్‌సీపీ నాయకులు సుంకర విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-30 13:41:13

గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి

ప్రజలకు అందుబాటులో వుండి మెరుగైన సేవలు అందించడం తో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరువ చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఉదయం.ముత్తుకూరు మండల పరిధిలోని కృష్ణపట్నం, బ్రహ్మదేవి గ్రామాల్లోని సచివాలయాలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత కృష్ణపట్నం లో కలెక్టర్ కు వైస్ ప్రెసిడెంట్ రాగాల వెంకటేశ్వర్లు,మండలం ప్రత్యేక అధికారి మొక్కలు అందచేసి స్వాగతం పలికారు. సచివాలయం పరిధిలో ప్రతి రోజు ఎన్ని అర్జీలు వస్తున్నాయి, వచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని బియాండ్ ఎస్.ఎఎల్.ఎ లో వున్నాయి అని జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 

సచివాలయం సిబ్బంది నిబద్దతతో పనిచేసి ప్రజల వద్ద నుండి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరం పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో వుండి, ప్రజలు సంతృప్తి చెందేలా మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా సచివాలయం హాజరు రిజిస్టర్ ను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రెవెన్యూ సర్వీసెస్ పై ప్రజల్లో అవగాహన కల్పించి రెవెన్యూ సర్వీసెస్ ను ఇంప్రూవ్మెంట్ చేయాలని జిల్లా కలెక్టర్, సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, సచివాలయం సిబ్బందిని ఆదేశించారు.

 సచివాలయం పరిధిలో బూస్టర్ డోసు ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ఏ.ఎన్.ఎం లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల ప్రత్యేక అధికారి సోమయ్య, తహసిల్దార్ మనోహర బాబు, కృష్ణపట్నం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ రాగాల వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, విఆర్ఓ అవినాష్, వాలంటీర్లు, కృష్ణపట్నం గ్రామ సచివాలయం, బ్రహ్మదేవి సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Muttukuru

2022-08-30 12:25:26

నిర్ధేశించిన రేట్లకే ఎరువులను అమ్మాలి..

శృంగవృక్షం గ్రామంలో వశిష్ట ఆగ్రో ఎంటర్ప్రైజెస్ ఎరువులు, పురుగు మందుల షాపులో పశ్చిమగోదవారి జిల్లా జాయింట్ కలెక్టర్ జె వి మురళి తనిఖీలు నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. స్టాక్‌ రిజిస్టర్లు, షాపుల లైసెన్స్‌ గడువు తేదీలు జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. గోడౌన్ కూడా తనిఖీ చేశారు. మందుల ప్యాకింగ్ వాటి ధరలు సక్రమంగా లేవని  గమనించిన జాయింట్ కలెక్టర్ సంభందిత వ్యవసాయ శాఖ వారికి షాపు నిర్వాహకులపై తగు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి పలు ఆదేశాలు జారీ చేశారు.  జిల్లా జాయింట్ కలెక్టరు వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగ లింగాచారి, తహశీల్దారు షేక్ హుస్సేన్, ఎంపీడీవో ఎన్ ఎం గంగాధర్, వ్యవసాయ శాఖ ఏవో నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

Srungavruksham

2022-08-30 12:00:34

ఆర్బికే కేంద్రంలో జెసీ ఆకస్మిక తనిఖీ

రైతులకు పూర్తిస్థాయిలో ఆర్బీకేలు ఉపయోగపడాలని పశ్చిమగోదవారి జిల్లా జాయింట్ కలెక్టర్ జె వి మురళి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం శృంగవృక్షం గ్రామంలో సొసైటీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆర్బికే జెసి కేంద్రాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించారు. సిసిఆర్సి కార్డులు పై లబ్ధిదారులకు అందిస్తున్న రుణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రుణాల వల్ల లబ్ధిదారులు పొందుతున్న ప్రయోజనాలు,   రైతులకు డబ్బులు జమవుతున్న విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం జెసి మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వ సేవలు, పథకాలు అన్నీ ఆర్బీకేల ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.  జిల్లా జాయింట్ కలెక్టరు వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగ లింగాచారి, తహశీల్దారు షేక్ హుస్సేన్, ఎంపీడీవో ఎన్ ఎం గంగాధర్, వ్యవసాయ శాఖ ఏవో నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

Srungavruksham

2022-08-30 11:59:25

మీ ఇంటిదగ్గరైతే ఇలాగే అపారిశుధ్యం ఉంటుందా

మీ ఇంటి చుట్టు ప్రక్కల అపారిశుధ్యాన్నిఇలాగే వదిలేస్తారా..ఇక్కడెవరు కార్యదర్శి..ఇంత అధ్వాన్నంగా పారిశుధ్య చేస్తున్నారేంటి అంటూ జెసి జెసి జెవి.మురళి శ్రుంగవ్రుక్షం-2  సచివాలయ సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. మంగళవారం పాలకోడేరు మండలం  పెన్నాడ 1, శృంగవృక్షం 1,2 సచివాలయాలు తనిఖీలో భాగంగా జెసి  మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సేవలను నిరుపేదల ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారుల జాబితాలను పధకాల వారీగా నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటివద్దకు తీసుకువెళ్లేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చే దిశగా సిబ్బంది పనిచేయాలని జెసి సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా అనర్హుల జాబితాలను కూడా నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. ప్రతీ రోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రతీ సచివాలయం పరిధిలోనూ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించాలని, వాటిని అదేరోజు సంబంధిత శాఖల అధికారులను పరిష్కారం నిమిత్తం పంపించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందించాలన్నారు. 

సచివాలయం ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు సమన్మయంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. శాఖల వారీగా సచివాలయం ఉద్యోగులను వర్క్ ప్లాన్ అడిగి తెలుసుకున్నారు. స్పందన, సి సి ఆర్ సి కార్డ్స్ , ఈ క్రాఫ్, అజమాయిషి హజరుపట్టి తదితర రిజిస్టర్లను పరిశీలించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించే స్థాయిలో ఉండాలని,ఏ చిన్న పిర్యాదు లేకుండా చక్కగా విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. శృంగవృక్షం 2 వ సచివాలయంలో పారిశుధ్య నిర్వహణ బాగోలేదని జెసి సచివాలయ సెక్రెటరీ పై మండిపడ్డారు. సచివాలయం బయట డిస్ ప్లే చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల జాబితాలని పరిశీలించి, అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

Palakoderu

2022-08-30 11:57:56

జాతీయ రహదారి పనులు వేగంపెంచండి

విశాఖ పట్నం నుంచి రాయ్ పూర్  జాతీయ రహదారి పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళ వారం పరిశీలించారు. విశాఖ పట్నం నుంచి రాయ్ పూర్ వరకు జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ (ఎక్స్ స్స్ కంట్రోల్ ఎక్స్ప్రెస్) జాతీయ రహదారి పనులను పాచిపెంట మండలం ఆలూరు, రామభద్రా పురం మండలం కొండ కింగువ వద్ద మంగళ వారం పరిశీలించారు. హెచ్ జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ చేపడుతున్న ఆలూరు నుంచి జక్కువ వరకు సుమారు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఆరు వరుసల జాతీయ రహదారి పనుల వివరాలను జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రోహిత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు మ్యాప్ ద్వారా ప్రతిపాదిత రహదారి వివరాలను వివరించారు. ప్రాజెక్ట్ పనులు నిర్వహణలో అటవీ ప్రాంతానికి సంబందించి అటవీశాఖ అనుమతులు, కాలువల నిర్మాణాలకు అవసరమైన  జలవనరుల శాఖ అనుమతులను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అవసరం మేరకు సహకారం అందిస్తామని అన్నారు. రహదారి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ ఇంచార్జి రాజశేఖర్ మాట్లాడుతూ 12 కిలో మీటర్ల మేర ఇప్పటికే పనులు ప్రారంభించామన్నారు. మిగిలిన మొత్తానికి పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో రహదారి ప్రక్కన వివిధ వసతులు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ మాల పరియోజన క్రింద జాతీయ రహదారి 130 సిడి గా రహదారిని నిర్మించడం జరుగుతోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కన్సల్టింగ్ టీమ్ లీడర్ జి.పి.మద్దిలేటి, తాసిల్దార్ ఎమ్.రాజశేఖర్, ఎం పి డి ఓ జే.ఉమామహేశ్వరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి.రామచంద్ర రావు, తదితరులు పాల్గొన్నారు.

Pachipenta

2022-08-30 11:37:47

సెప్టెంబర్5 నాటికి ప్లాంటేషన్ పూర్తిచేయాలి

శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ 5వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జివి చిట్టి రాజు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం బూర్జ మండలంలోని వైకుంటపురం వద్ద ఎవెన్యూ ప్లాంటేషన్ పనుల్లో భాగంగా పెంచిన మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం పనులు పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. జిల్లాలో వ్యక్తిగత తోటల పెంపకం పనులు 692 ఎకరాల్లో చేపడుతున్నామని అన్నారు. రహదారులకు ఇరువైపులా 46.75 కిలోమీటర్ల ఈ ఏడాది మొక్కల పెంపకం పనులు చేపట్టనున్నామని, అదేవిధంగా బ్లాక్ ప్లాంటేషన్ పనుల్లో భాగంగా 16,815 మొక్కలు పెంపకం పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

 47 ఎకరాల్లో మునగ తోటల పెంపకం పనులు కూడా చేపట్టనున్నామన్నారు. 234 ఎకరాల విస్తీర్ణంలో చెరువుగట్లపై మొక్కలు పెంచనున్నామన్నారు. మొక్కల లభ్యత తక్కువగా ఉందని, ఇతర ప్రాంతాల నుండి రప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో పీడీ వెంట గ్రామ సర్పంచ్ బొడ్డేపల్లి వెంకట సత్యనారాయణ, ఏపీవో రాజ్ కుమార్, ఈసీ గోపికృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్లు రామకృష్ణ, సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఇతర ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.

Burja

2022-08-30 10:21:24

గణేష్‌ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు

గణేష్‌ నిమజ్జనోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నా మని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు చెప్పారు. మంగళవారం ఆయన కాకినాడలోని జగన్నాథపురం వంతెన సమీపంలోని వినాయకసాగర్‌ వద్ద పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ గడచిన రెండేళ్ళుగా కరోనా వల్ల నిమజ్జనాలు తక్కువగా జరిగాయని, ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశం ఉన్నందున జగన్నాథపురం వినాయక సాగర్‌తోపాటు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో రెండవ ప్రాంతంలో కూడా ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. కలెక్టర్‌ కృతికాశుక్లా ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ తరుపున నిమజ్జన ప్రాంతాల వద్ద క్రేన్‌ల ఏర్పాటు, బారీకేడ్లు, టెంట్లు,నీటి సరఫరా, మైక్‌సెట్లు, రాత్రి సమయంలో ప్లడ్‌లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెవెన్యూశాఖ తరుపున వీఆర్వోలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తామన్నారు.

 వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో కీలకమైన పోలీసుశాఖ తరుపున విస్తృత బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు చెప్పారు. మత్స్యశాఖ తరుపున గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని ఏడీసీ నాగనరసింహారావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎం హెచ్ ఓ డాక్టర్ పృద్విచరణ్, తాసిల్దార్  వై హెచ్ ఎస్ సతీష్, వన్ టౌన్ సిఐ రజనీ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-30 10:16:34

ప్రతీ గడపకూ ప్రభుత్వ పథకాలు అందిస్తాం

సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో  మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర  పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల, మహిళల, రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అర్హత ఉంటే పథకాలు గడప వద్దకే వస్తాయని  ఆయన పేర్కొన్నారు. ప్రతి గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.  ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను వివరిస్తూ కర పత్రాలను ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని, పేదలందరికీ ఇల్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో  లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు.

 ప్రతి ఒక్కరూ గృహాలను నిర్మించుకొని సొంత ఇంటి యజమాని కావాలని ఆయన తెలిపారు.  పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని, విద్యార్థుల వసతి కొరకు ఏడాదికి 20 వేల రూపాయల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. 

     గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రోజు రోజుకు నిత్య నూతనంగా సాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ తమకు అందినవి, కావలసినవి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Salur

2022-08-30 09:02:01

డ్వాక్రా సంఘాలకు రూ.3.48 లక్షలు పంపిణీ

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు డా.వైఎస్సార్ ఆసరా చెక్కులను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే సహాయంలో ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు. రైవాడ పంచాయితీ శంఖువాని పాలెం గ్రామైఖ్య సంఘం పరిధిలో గల ఈశ్వర స్వయం సహాయక సంఘానికి కు వైఎస్సార్ ఆసరా రెండువిడత మొత్తం రూ 1,55,226/ -లక్షలు . మరియు కాశీపురం గ్రామైఖ్య  సంఘం పరిదిలో మరిడి మంబ- 2 ఎస్ హెచ్ జి కు వైఎస్సార్ ఆసరా రెండు విడతల మొత్తం రూ. 69,988 /- వచ్చింది. మరియు ఎం.అలమండ పంచాయితీ పరిది - ముత్యాలమ్మ ఎస్ హెచ్ జీ కు ఆసరా రెండు విడత మొత్తం రూ 1,23,214/-లక్షలు వచ్చింది. ఈ మూడు సంఘాల యొక్క మొత్తం రూ.3,48,428/ - లక్షల చెక్ లను తారువ లోని క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు అందచేశారు. అదే విధంగా మంత్రి రూ.6,96,856/- లక్షలు  మూడు సంఘాలకు కలిపి అధికారులు సాంక్షన్ చేశారు..  ఈ కార్యక్రమంలో దేవరాపల్లి ఎంపీపీ  బాస్కరరావు, జెడ్పీటీసీ  సత్యం, పంచాయితీల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు  మండల కార్యకర్తలు పాల్గోన్నారు. 

దేవరాపల్లి

2022-08-29 14:45:33

వార్నీ స్టేషన్ లోనే మందుకొట్టి రాసలీలలు

ఒంటిపై ఖాకీ చొక్కా.. నెత్తిన టోపీ..చేతిలో లాఠీ ఉంటే చాలు..ఎవర్నైనా ఏంట్రా అని ఎంతో మర్యాదగా పిలుస్తారు పోలీసులు.. పోలీస్ డ్రెస్ వేసుకోకుండా కూడా విధులు నిర్వహించే పోలీసులు నిందితుల కోసం గస్తీలో తిరుగుతున్నామని సమర్ధించుకుంటారు..చట్టం వీరి చుట్టమో ఏమో తెలీదు గానీ.. లా అండ్ ఆర్డర్ ని మొత్తం వీరే తమ బుజాలపై మోసేసి.. హరిశ్చంద్ర వంశానికి చెందిన వారిలా రూల్స్ మాట్లాడేస్తారు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐపీఎస్ లు కూడా ఇంతలా ఓవరేక్షన్ చేయరేమో అనిపిస్తుంది.. ఇదంతా సాధారణంగా పోలీసులు చేసే పని..కానీ అనకాపల్లి జిల్లా రావికమతం సర్కిల్ , కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఓ ఏఎస్ఐ ఏకంగా పోలీస్ స్టేషన్ ను బార్ గా మార్చేశాడు.. మందు కొట్టిన తరువాత పొందు లేకపోతే మజా ఏముంటుందని అనుకున్నాడో ఏమో..ఏకంగా ఒక మహిళను కూడా స్టేషన్ కి రప్పించుకున్నాడు. మందేసి..చిందేసి..రాసలీలలు మొదలు పెట్టాడు. ఇలాంటి సమయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా.. అంతే ఏఎస్ఐ అప్పారావు చేస్తున్న నిర్వాకాన్ని సిఐకి స్థానికులు సమాచారం అందించారు. రెడ్ హేండెడ్ గా ఏఎస్ఐని పట్టుకొని సిఐ సయ్యద్ ఇలియాస్ మహ్మద్ తీవ్రంగా మందలించి..విషయాన్ని జిల్లా ఎస్పీ ద్రుష్టికి తీసుకెళ్లారు. సిఐ ఈ విషయాన్ని ఎస్పీ ద్రుష్టికి తీసెకెళ్లకపోతే స్థానికులే తీసుకెళ్లేంత పనిచేశారు.

 ఒంటిపై ఖాకీ చొక్క వేసుకోగానే మేము ప్రజలందరికీ అతీతులం అన్నట్టు ఒక రేంజ్ లో విర్రవీగిపోయే పోలీసులు ఒక్కోసారి చేసే పనులకు ఈ విధంగానే అదే చట్టానికి దొరకాల్సి వుంటుంది. ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ రాసి కేసు గట్టిపడేలా సెక్షన్లు రాసే పోలీసులు రావికమతం పోలీస్ స్టేషన్ లోనే జరిగిన మందు, పొందు, రాసలీలలాడిన ఏఎస్ఐ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తప్పుచేసే పోలీసులపైనా కూడా చర్యలు తీసుకుంటామని ఈ విషయంలో ఎవర్నీ ఉపేక్షించేది లేదని సిఐ తెగేసి చెప్పారు. మందుకొట్టిన ఏఎస్ఐ అప్పారావుని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిఐ వచ్చి ఏఎస్ఐతో మాట్లాడుతున్న సమయంలో ఆశక్తి గట్టాలు రక్తికట్టించాయి..చేసిన తప్పు రుజువవడంతో సిఐ కాళ్లు పట్టుకొని మరీ బ్రతిమలాడాడు ఏఎస్ఐ అంతేగదా మరి.. ఎవడైనా తప్పుకి దొరకనంత వరకే దొరికన తరువాత పోలీసు అధికారులు కూడా హీరోలైపోతారు..అదే తప్పు చేసిన పోలీసోడు..అదే పోలీసు అధికారి కాళ్లు కూడా పట్టుకుంటాడు అనేలా ఏఎస్ఐ సిఐ కాళ్లు పట్టుకున్నాడు. ఇలాంటి వారిని చూసినపుడు గదా పోలీసంటే ఏంటో ప్రజలకి తెలిసేది..నిజంగా వీడేరా పోలీస్ అంటున్నారు విషయం తెలిసిన వారంతా..నిజమేకదా మరి..!

Ravikamatham

2022-08-29 06:21:56

ఏపీలో గూండాల ప్రభుత్వం రాజ్యమేలుతోంది

రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గూండాల రాజ్యం నడుస్తోందని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా వంతాడపల్లి పంచాయతీ సప్పిపుట్టు గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వైసీపీ అడ్డంకులు సృష్టించడాన్ని, అన్న క్యాంటీన్‌ భవనాన్ని ధ్వంసం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. నిరుపేదల కడుపు నింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయడాన్ని బట్టి వైఎస్సార్సీపీ పరిపాలన ఎలా వుందో ప్రజలకి అర్థమవుతోందన్నారు. 2024లో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, వైఎస్సార్సీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అధికారపార్టీ పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని విమర్శించారు. నేడు ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతికి బట్టకట్టలేని దుస్థితి నెలకొందన్నారు.

 చివరకు ఎన్టీఆర్ పాలనలో కట్టిన ఇళ్లకు కూడా జగన్ ప్రభుత్వం ఓటీఎస్ పేరిట డబ్బులు వసూలు చేస్తుందంటే రాష్ట్రంలో అరాచక పాలనను అర్థం చేసుకోవచ్చునన్నారు. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలు వద్ద వైఎస్సార్సీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజలు టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామాల్లో టిడిపి హయంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ వైఎస్సార్సీపీ అభివృద్ధి చేసినది కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం, సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-08-28 16:56:11

వైరస్ ప్రభావంతో వచ్చే జ్వరాలతో అప్రమత్తం

కోవిడ్ వైరస్ ప్రభావం, వర్షాలు కురుస్తున్నందున అధికమై పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డాక్టర్ కే. వెంకటరమణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాలు అవుతాయన్నారు. తలనొప్పి, కండరాల నొప్పులు, ఆయాసంతో పాటు  శరీరం పై దద్దుర్లు వచ్చే అవకాశం ఉందన్నారు. దీని నివారణకు గాను నిల్వ ఉన్న  ఆహార పదార్థాలను  తినరాదని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-28 07:02:28