1 ENS Live Breaking News

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బంగారు నేత్రాలు బహూకరణ

శంఖవరం గ్రామంలో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శంఖవరం గ్రామానికి చెందిన కొండమూరి చంటిబాబు, ప్రమీల దంపతుల మనవరాలు షణ్ముఖి శ్రీ సమన్వి స్వామివారికి బంగారు నేత్రాలు బహూకరించారు. సుమారు 60 వేల రూపాయలతో (11 గ్రాములు) కూడిన వస్తువును ఆలయ ప్రోత్సాహకులు దాసరి లోవరాజుకు, కొండమూరి చంటిబాబు కుటుంబ సభ్యులు అందజేశారు. ఆలయ అర్చకులు చదువుల సాయికుమార్ శర్మ నేత్రాలను స్వామివారి, అమ్మవార్ల చెంత ఉంచి పూజలు నిర్వహించి అనంతరం స్వామివారికి అలంకరించారు. గతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఈ కుటుంబ సభ్యులైన కొండమూరి చంటిబాబు ప్రమీల, సురేఖ సూర్యనారాయణ, నవీన్ కిరణ్ మై దంపతులు ధ్వజస్తంభం ఇచ్చియున్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి బాబ్జి, దాసరి శ్రీను, కుమార్, జట్ల రాంబాబు, బొర్ర శ్రీను, రేలంగి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-08-18 12:14:55

రైతులు తప్పక ఈకేవైసీ చేయించుకోవాలి

వరి సాగు చేస్తున్న ప్రతీ రైతు ఈ పంటలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్.బుల్లి బాబు రైతులకు సూచించారు. గురువారం శంఖవరం గ్రామంలో వ్యవసాయ సిబ్బంది చేస్తున్న ఈ పంట నమోదు ప్రక్రియను వ్యవసాయ అధికారి పి.గాంధీతో స్వయంగా  పర్యవేక్షించి పలు సూచనలు ఇచ్చారు. వరి, పత్తి,ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు,కౌలు రైతులు వారి ఆధారాలతో రైతు భరోసా కేంద్ర సిబ్బందితో ఈ పంట నమోదు చేసుకోవాలని కోరారు. పి.ఎం కిసాన్ వచ్చే విడత సొమ్ము కొరకు అర్హులైన రైతులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని వివరించారు. ఈ కేవైసీ సంబంధించి సమాచారం తెలుసుకునేందు సచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామీ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వ్యవసాయ సహాయకులు వికాస్,బిందు,రైతులు పాల్గొన్నారు. 

Sankhavaram

2022-08-18 11:41:38

భారతదేశానికి అభివ్రుద్ధిలో ఏపీ దిక్సూచి

అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి దిక్సూచిగా నిలుస్తుందని కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగా గీత పేర్కొన్నారు. గురువారం ఉదయం కాకినాడ గ్రామీణ నియోజకవర్గం, కాకినాడ గ్రామీణ మండలం గంగనాపల్లి గ్రామంలో ప్రభుత్వ శాశ్వత భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం కురసాల కన్నబాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ లను ప్రారంభించారు. అదేవిధంగా డిజిటల్ లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగాగీత మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలను ప్రజల వద్దకు, అందుబాటులో ఉంచాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించడం జరిగిందన్నారు. నేడు అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి దిక్సూచిగా నిలుస్తుందని ఈ ఘనత గౌరవ ముఖ్యమంత్రికే చెందుతుందని ఆమె తెలిపారు. గ్రామ సచివాలయ ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ భవనాలు ఒకే చోట ఒకే వరుసలో నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం గొప్ప శుభపరిణామన్నారు. ప్రభుత్వ సేవ నిమిత్తం ఒకసారి ప్రజలు ఈ ప్రాంతంలో అడుగుపెడితే వారు కావలసిన అన్ని ప్రభుత్వ సదుపాయాలు ఇక్కడ పొందవచ్చన్నారు. సచివాలయం, ఆర్బీకే, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, బిఎంసియు ఈ నాలుగు భవనాలు ఒకే ప్రాంగణంలో నిర్మించడంతో ఈ భవనాలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తాయని ఆమె తెలిపారు.  ఈ భవనాలు నిర్మాణాల కొరకు స్థానిక సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు.. అధికారులతో సమన్వయం చేసుకొని చక్కని కృషి చేశారని ఎంపీ అభినందించారు.

జిల్లాలో మొదటి సారిగా ప్రభుత్వ భవనాలు అన్ని ఒకే ప్రాంగణంలో..కలెక్టరు డా. కృతికా శుక్లా.. 
కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా మాట్లాడుతూ ఒక మోడల్ విలేజ్ గా జిల్లాలో అన్ని ప్రభుత్వ శాశ్వత భవనాలు గంగానపల్లి గ్రామంలో ఒకే చోట నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులకు సంబంధించి  గ్రామ సచివాలయం రూ.35 లక్షలు, రైతు భరోసా కేంద్రం రూ.21.80లక్షలు, వైఎస్సార్ విలేజ్ క్లీనిక్ రూ.17.50లక్షలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ రూ.15.74 లక్షలతో నిర్మించడం జరిగిందని కలెక్టరు తెలిపారు. వీటితోపాటు మరో 16లక్షల రూపాయలు వ్యయంతో డిజిటల్ లైబ్రరీకి శంకుస్థాపన కూడా చేశారన్నారు. 

 పెద్ద ఎత్తున పరిపాలన సంస్కరణలు 

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద సంకల్పంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నూతనంగా గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థలు నెలకొల్పినట్టు కాకినాడ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కురసాల కన్నబాబు అన్నారు. ఈ వ్యవస్థలు రెండు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఒక వినూత్నమైన సంస్కరణలు ప్రారంభించడమే కాకుండా గ్రామస్థాయిలో,  క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పరిపాలన సంస్కరణలు జరుగుతున్నాయన్న విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వివిధ రాష్ట్రాలు ఈ విధానాలపై అధ్యయనం చేస్తున్నాయన్నారు. కాకినాడ గ్రామీణ మండలం గంగనపల్లి గ్రామంలో ఒక మోడల్ ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగిందని, ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలను ఒకచోటే లభ్యమయ్యే విధంగా ప్రభుత్వ భవనాలు ఒకే ప్రాంగణంలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ భవనాల ద్వారా గంగానపల్లి గ్రామం రాష్ట్రంలో ఒక ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. 

రాష్ట్రమంతటా ప్రభుత్వ శాశ్వత భవనాల నిర్మాణ పనులు రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమైనప్పటికీ కరోనా కారణం గా కొంతకాలం పనుల్లో జాప్యం జరిగిందని ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందు చూపు, సంక్షేమం, అభివృద్ధిని నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం అమలు చేయడం ద్వారా భారతదేశంలో  ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రులలో అయిదవ స్థానం రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కడం అభినందనీయమని కురసాల కన్నబాబు తెలిపారు. తొలుత నూతనంగా నిర్మించిన గంగానపల్లి ముఖ ద్వారమును ఎంపీ, కలెక్టరు, ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీరు ఎం శ్రీనివాసు, ఏడీఎ పద్మశ్రీ, కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీవో పీ. నారాయణమూర్తి, తహసీల్దార్ మురార్జీ, గంగనాపల్లి గ్రామ సర్పంచ్ గీసాల మహాలక్ష్మి, ఏఎంసీ చైర్ పర్సన్ జి. శ్రీనివాసు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ రూరల్

2022-08-18 11:34:10

వర్కింగ్ జర్నలిస్టులకు పునశ్చరణ తరగతులు

విశాఖ మహానగరం పరిధిలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం పునఃశ్చరణ తరగతులు నిర్వహి స్తున్నట్లు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ తెలిపారు. ఈనెల 28వ తేదీన అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రంగసాయి నాటక గ్రంథాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టు ఎన్ నాగేశ్వరరావు (ఎన్. ఎన్. ఆర్) తో కలిసి అశోక్ కుమార్ మాట్లాడారు.  పాత్రికేయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్ నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల్లో నాలుగు సెషన్స్ ఉంటాయని తెలిపారు. ఒక్కొక్క సెక్షన్ 45 నిమిషాలు చొప్పున మూడు గంటల పాటు శిక్షణ తరగతులు ఉంటాయని వివరించారు. ఇరువురు జర్నలిజం అధ్యాపకులు, ఇరువురు సీనియర్ జర్నలిస్టులు తరగతులు చెప్తారని ఆయన తెలిపారు. పునఃశ్చరణ  తరగతుల్లో పాల్గొనే జర్నలిస్టులకు సర్టిఫికెట్స్ అందజేయబడునని పేర్కొన్నారు..అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు  పద్మజా మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనే వారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సాహవంతులు తమ పేర్లను 73860 90368 నెంబర్ కు ఫోన్ చేసి ఈ నెల 26వ తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రంగ సాయి నాటక గ్రంథాలయం వ్యవస్థాపకులు బాదంగీర్ సాయి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎస్.ఎన్. నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్లజీరావు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-18 04:53:58

రమణీయంగా శేషగోపాలన్ గాత్ర కచేరి

చెన్నైవాసి విద్వాన్ మధురై టి ఎన్ శేష గోపాలన్ కృష్ణ తన వాద్య సంగీత మధురిమల తో పలువురు వాగ్గేయకారుల కృతులను రమణీయంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు. మంగళవారం సాయంత్రం విశాఖలోలని పిఠాపురం కాలనీ లోని కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ (కళాభారతి) నిర్వహిస్తున్న వార్షికోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు జరిగిన కచేరీలో కృష్ణకు మృదంగం పై విశాఖ ఆకాశవాణి కళాకారులు ధన్వాడ ధర్మారావు, ఘ ఘటం పై సూర్య ప్రసాదరావు( శ్రీకాకుళం), వయోలిన్ పై మావుడూరి సత్యనారాయణ శర్మ( శ్రీకాకుళం) లయ వాద్య సహకారం అందించి కచేరిని రసవత్తరంగా  నడిపించారు. ఈ కార్యక్రమానికి ఎం ఆర్ సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ కె రాంబాబు ముఖ్యఅతిథిగా, విజయ నిర్మాణ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొని కళాకారులను అభినందించారు. వి ఎం డి ఏ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ రాజు, కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్( రాంబాబు), సుసర్ల రామ్ గోపాల్ తదితరులు కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించారు. రాంబాబు మాట్లాడుతూ 18 వరకు సాగే కార్యక్రమాలను ఉచితంగా వీక్షించేందుకు ప్రజలందరూ ఆహ్వానితులేనని, తాము తలపెట్టిన ఈ సంగీత వైభవాన్ని జయప్రదం చేయాలని కోరారు.

Visakhapatnam

2022-08-16 15:17:12

గిరిజన గ్రామాల సమస్యలపై ప్రత్యేక దృష్టి

మారుమూల గిరిజన గ్రామాలు సమస్యలను పరిష్కరించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అర్.గోపాలకృష్ణ ఆదేశించారు. మంగళవారం అన్ని శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదబయలు మండలం  కొండ్రుo, గిన్నెలకోట ఇంజరి, గ్రామ గిరిజనుల వ్యక్తి గత సమస్యలు, సామాజిక సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అందరికీ జాబ్ కార్డులు, రైస్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు.84మందికి బ్యాంక్ ఖాతాలు లేవని అందరికీ బ్యాంక్ ఖాతాలు తెరవాలని చెప్పారు. గిన్నెలకోటలో 15రోజులు ఇంజరిలో 15రోజులు ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసి ఆధార్ కార్డ్స్ మంజూరు చేయాలని చెప్పారు. 58కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి మరుగు దొడ్లు మంజూరు చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారికి సూచించారు. ఇంజరి కొండ్రుo గ్రామాల మధ్య కల్వర్టు నిర్మించాలని పి అర్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అర్హులైన లబ్ధదారులకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంజరిలో పాటశాల నిర్మాణానికి రు . 5లక్షలు మంజూరు చేశామన్నారు. కొండ్రుo గ్రామానికి సామాజిక భవనం, పాటశాల మంజూరు చేశామన్నారు. అదేవిధంగా గ్రామీణ నీటిసరఫా విభాగం అధికారులతో సమీక్షించారు. మంజూరు చేసిన తాగు నీటి పనులను పూర్తి చేయాలని స్పష్టం చేసారు.జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి పై ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలక్టర్ వి. అభిషేక్,పి.అర్. ఈ ఈ కె. లావణ్య కుమార్ 11మండలాల అధికారులు పాల్గొన్నారు.

Paderu

2022-08-16 15:03:51

గ్రామ సచివాలయంద్వానే సేవలందాలి..

విజయనగరం జిల్లాలోని చీపురుప‌ల్లి మండ‌లంలోని మెట్టుప‌ల్లి గ్రామ స‌చివాల‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, మంగ‌ళ‌వారం ఆకస్మికంగా త‌నిఖీ చేశారు. ఆమె ముందుగా అటెండెన్సు రిజ‌ష్ట‌ర్ల‌ను, ఇత‌ర రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రజలకు సచివాలయం ద్వారా అన్ని సేవలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. సచివాలయ పరిధిలో అమ‌లు జ‌రుగుతున్న సంక్షేమ‌, అభివృద్ది కార్య‌క్ర‌మాల‌పై వాక‌బు చేశారు. కోవిడ్ వేక్సినేష‌న్‌, పిల్ల‌లు, బాలింత‌లు, గ‌ర్భిణుల‌కు టీకా కార్య‌క్ర‌మంపై ఆరా తీశారు. గృహ‌నిర్మాణ ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు. ఓటిఎస్‌పై ప్ర‌శ్నించారు. అంగ‌న్‌వాడీ కేంద్రాల ద్వారా జ‌రుగుతున్న పోష‌కాహార పంపిణీ, పాల స‌ర‌ఫ‌రాపై ప్ర‌శ్నించారు. ఎఎన్ఎం, ఆశా వ‌ర్క‌ర్ల‌తో మాట్లాడారు. గ్రామానికి చెందిన గ‌ర్బిణిని రప్పించి, ఆమెతో మాట్లాడారు. ఆమెకు పోష‌కాహారం స‌క్ర‌మంగా అందుతున్న‌దీ లేనిదీ, నెల‌వారీగా నిర్వ‌హిస్తున్న‌ ఆరోగ్య ప‌రీక్ష‌ల‌పై ఆరా తీశారు. గ‌ర్భిణులు, బాలింత‌లు అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు వ‌చ్చి భోజ‌నం చేసేలా చూడాల‌న్నారు. వ్య‌క్తిగ‌త‌, సామూహిక మ‌రుగుదొడ్ల నిర్మాణంపై ప్ర‌శ్నించారు. అర్హులంద‌రికీ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో తాశీల్దార్ మామిడిప‌ల్లి సురేష్ పాల్గొన్నారు.

Cheepurupalli

2022-08-16 13:26:23

పి.కె.పాల‌వ‌ల‌స‌లో హైస్కూలు మంజూరుకు హామీ

చీపురుప‌ల్లి మండ‌లం పి.కె.పాల‌వ‌ల‌స గ్రామంలో హైస్కూలు మంజూరుకోసం చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలోని బైరెడ్డిపేట‌లో రూ.40 ల‌క్ష‌ల ఉపాధిహామీ నిధుల‌తో నిర్మించిన గ్రామ స‌చివాల‌య భ‌వనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ శ్రీ‌కాకుళం జిల్లాలోని అప్పాపురం మీదుగా ఈ గ్రామాన్ని అనుసంధానించేలా ఒక రోడ్డును మంజూరు చేస్తామ‌న్నారు. తోట‌ప‌ల్లి కాలువ నీరు అంద‌డం వ‌ల్లే ఈ ప్రాంతం స‌స్య‌శ్యామ‌లంగా మారింద‌ని, సంవ‌త్స‌రం పొడ‌వునా పంట‌లు పండి ఇక్క‌డి భూముల విలువ పెరిగే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు ఎలాంటి త‌ప్పులు చేయ‌వ‌ద్ద‌ని కోరారు. వారు ప్ర‌భుత్వానికి క‌ళ్లు, చెవులు వంటి వార‌ని పేర్కొన్నారు. వారు చేసే త‌ప్పులు ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప్ర‌భావం చూపిస్తాయ‌న్నారు. ఎలాంటి అవినీతికి, మ‌ధ్య‌వ‌ర్తుల‌కు తావులేకుండా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం నేరుగా ల‌బ్దిదారులకే ప‌థ‌కాల సొమ్మును అంద‌జేస్తుంద‌ని, గ‌త ప్ర‌భుత్వానికి, ఈ ప్ర‌భుత్వానికి ప‌థ‌కాల అమ‌లులో గ‌ల తేడాను ప్ర‌జ‌లు గుర్తించాల‌ని మంత్రి కోరారు.

జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ ప‌నిచేసే నాయ‌కుల‌ను, పార్టీల‌ను ప్రోత్స‌హించాల‌ని కోరారు. ఈ మూడేళ్ల‌లో ఒక్క పి.కె.పాల‌వ‌లస గ్రామంలోనే సంక్షేమ ప‌థ‌కాల కింద రూ.12.40 కోట్లు లబ్దిదారుల‌కు అందించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి శ్రీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. తోట‌ప‌ల్లి కాలువ రాక ముందు ఈ ప్రాంతం పూర్తి వ‌ర్షాధారంగా వుండేద‌ని, పంట‌లు కూడా ప‌రిస్థితి వుండేది కాద‌ని ఎం.పి. బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ పేర్కొన్నారు. అటువంటిది నేడు తోట‌ప‌ల్లి కాలువ‌లు వ‌చ్చాక పంట‌ల‌తో ప‌చ్చ‌గా వుంటున్నాయ‌ని, నాడు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వంలో మంత్రిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ కృషివ‌ల్లే ఇది సాధ్య‌మ‌య్యింద‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఎం.పి.పి. ఇప్పిలి వెంక‌ట‌న‌ర‌స‌మ్మ‌, జెడ్పీటీసీ వ‌లిరెడ్డి శిరీష‌, గ్రామ స‌ర్పంచ్ జ‌మ్ము సావిత్రి, చీపురుప‌ల్లి ఆర్‌.డి.ఓ. అప్పారావు, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ. అశోక్ కుమార్‌, పంచాయ‌తీరాజ్ ఇ.ఇ. కె.జి.జె.నాయుడు, డి.ఇ. పి.చంద్ర‌శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Cheepurupalli

2022-08-16 13:19:57

ప్ర‌తి రైతు ఇ-క్రాప్ న‌మోదు చేయించుకోవాలి

ప్రతి రైతు తన పంటను ఇ.క్రాప్ లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ఈ -క్రాప్ నమోదు చేయించుకోనందువల్ల రైతులు ఎంతో నష్టపోతారని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టానికి గురైనా, పంట ఉత్పత్తులు విక్రయించి మద్దతు ధర పొందాలన్నా ఈ. క్రాప్ నమోదు అవసరమనీ చెప్పారు. చీపురుపల్లి మండలంలో మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం పర్యటించారు. కరకాం లో రూ.40 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని, రూ.23 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. పి.కె.పాలవలస పంచాయితీ బైరెడ్డి పేటలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి తదితరులతో కలసి మంత్రి కరకాంలో గ్రామసభ నిర్వహించి గ్రామంలో సచివాలయం ద్వారా అందుతున్న సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు నిర్వహించిన గ్రామసభలో సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందిస్తున్న సేవలు, అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. రేషన్ కార్డులో చనిపోయిన భర్త పేరు తొలగించి వితంతువులకు వచ్చే జనవరి నుంచి ఫించన్ మంజూరు చేయాలని గ్రామ కార్యదర్శికి ఆదేశించారు.

గ్రామంలో ఏ.ఎన్.ఎం. ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలకు అంగన్ వాడి కేంద్రం ద్వారా పోషకాహారం అందుతున్న తీరుపై ఆరా తీశారు. మహిళా పోలీస్ వ్యవస్థను గ్రామ స్ధాయిలో ప్రవేశ పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకే ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. క‌ర‌కాంలో టీచ‌ర్లు స‌క్ర‌మంగా ప‌నిచేయ‌డం లేద‌ని పేర్కొంటూ ప‌లువురు గ్రామ‌స్థులు విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ఫిర్యాదు చేశారు. ముగ్గురు టీచ‌ర్లు సరిగా ప‌నిచేయ‌ని కార‌ణంగా ఈ ఏడాది 30 మంది ఇక్క‌డి పాఠ‌శాల నుంచి వేరేచోటికి మారిపోయారని తెలిపారు. దీనిపై మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ ఆ ఉపాధ్యాయుల‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాల‌ని మండ‌ల విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.

స‌చివాల‌యం ద్వారా క‌ల్పిస్తున్న సేవ‌ల‌ను గ్రామ‌స్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి కోరారు. గ్రామాల్లో వెల్ నెస్ సెంట‌ర్‌లు కూడా త్వ‌ర‌లోనే ఏర్పాట‌వుతున్నాయ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఇక‌పై గ్రామ‌స్థాయిలోనే స‌చివాల‌యంలో వైద్య సేవ‌లు అంద‌నున్నాయ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకొని తల్లిదండ్రులంతా త‌మ పిల్ల‌ల‌ను బాగా చ‌దివించాల‌ని కోరారు. స‌చివాల‌య సిబ్బందికి గ్రామ ప్ర‌జ‌లు పూర్తిగా స‌హ‌క‌రించి వారు కోరిన స‌మాచారం అందించాల‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని త‌మ ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో ఎం.పి.పి. ఇప్పిలి వెంక‌ట‌న‌ర‌స‌మ్మ‌, జెడ్పీటీసీ వ‌లిరెడ్డి శిరీష‌, గ్రామ స‌ర్పంచ్ జ‌మ్ము సావిత్రి, చీపురుప‌ల్లి ఆర్‌.డి.ఓ. అప్పారావు, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ. అశోక్ కుమార్‌, పంచాయ‌తీరాజ్ ఇ.ఇ. కె.జి.జె.నాయుడు, డి.ఇ. పి.చంద్ర‌శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Cheepurupalli

2022-08-16 13:18:13

సీఎం వైఎస్.జగన్ కు ఘన స్వాగతం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యోకొహోమా టైర్ల కంపెనీ యూనిట్ ప్రారంభోత్సవానికి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన  ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా యూనిట్ నెలకొల్పిన ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ, అనకాపల్లి పార్లమెంటరీ సభ్యురాలు డా. బి. సత్యవతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె. సుభద్ర, ఎమ్మెల్యేలు యు.వి. రమణ మూర్తి రాజు,  గొల్ల బాబూరావు, పి. ఉమా శంకర్ గణేష్, అదీప్ రాజ్, మున్సిపల్  చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి, ఎమ్మెల్సీలు మాధవ్, జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఎస్పీ గౌతమి సాలి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Atchutapuram

2022-08-16 08:37:10

ప్రభావంతమైన యోగి పరమహంస ..

కాళీమాత భక్తుడైన రామకృష్ణ పరమహంస ప్రభావంతమైన యోగి, ఆధ్యాత్మికవేత్త అని సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలోని మంగళవారం సర్పవరం జంక్షన్లో బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ పరమహంస వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్రంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారని అన్నారు. చిన్నతనం నుంచి ఏకాంతంగా ఉంటూ భగవంతుని పట్ల పలు రకాల ఆలోచనలు చేసేవారని  అన్నారు. వివిధ ఆచారాలతో,భిన్నమైన ఆలోచన విధానంతో ఉన్నా  చివరికి చేరే గమ్యం ఒకటేనని బోధించారని అన్నారు. 1886 ఆగస్టు 16న ఆయన కాలం చేశారని సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, రాజా, రేలింగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-16 06:32:22

ఘనంగా పింగళి జయంతి వేడుకలు

భారత త్రివర్ణ పతాక రూపశిల్పి, తెలుగు నేల ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య ఆశయ సాధనకై  ప్రతి ఒక్కరు పాటు పడుతూ దేశభక్తిని పెంపొందించుకోవాలని శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు పేర్కొన్నారు. పేర్కొన్నారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలోసి గ్రామసచివాలయం-1లో  పింగళి జయంతిని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పింగళి వెంకయ్య 1878 ఆగస్టు రెండున కృష్ణాజిల్లా బట్రా పెనుమర్రు గ్రామంలో జన్మించారని ,మూడు గంటల వ్యవధిలో జాతీయ పతాకాన్ని రూపొందించి మహాత్మా గాంధీకి అందజేశారని గుర్తుచేశారు. భారత జాతి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించేలా జాతీయ పతాకాన్ని రూపొందించారని అన్నారు. ఎంపీడీఓ జె.రాంబాబు మాట్లాడుతూ, దేశానికి, జాతికి ఘన కీర్తి సుమపార్జించిన పింగళి వెంకయ్య ఆదర్శప్రాయులని అన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహిస్తుందని ఇది మన తెలుగు జాతికి గర్వకారణమని  అన్నారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామసచివాలయాల కార్యదర్శిలు, శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్యన్నారాయణ, జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సంక్షేమ సహాయకులు, వైఎస్సార్సీ నాయకులు లచ్చబాబు, పడాల భాష, సతీష్, వీరబ్బాయి, సచివాలయ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-08-02 08:20:58

చాలా ఏళ్ల తరువాత పెద్ద ఎత్తున పించన్లు

శంఖవరం మండలంలో చాలా ఏళ్ల తరువాత పెద్ద ఎత్తున అర్హులైన నిరుపేదలకు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ప్రభుత్వం పించన్లును మంజూరు చేసిందని ఎంపీపీ పర్వత రాజబాబు అన్నారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలోన గ్రామ సచివాలయం 1లో నిర్వహించిన కొత్త పించను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్వచంద్రప్రసాద్ సహకారంతో 101 పించన్లు మూడు సచివాలయాల పరిధిలో మంజూరు కావడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఎంపీడీఓ జె.రాంబాబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ఇంటి ముంగిటే సేవలన్నీ అందిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ ప్రభుత్వ పథకానికైనా అర్హత ఉంటే వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సర్పంచ్ గన్నియ్యమ్మ, ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్ లు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొత్తగా పించన్లు మంజూరు మంజూరు చేసిందన్నారు. అనంతరం లబ్దిదారులకు పించన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామసచివాలయాల కార్యదర్శిలు, శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్యన్నారాయణ, జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సంక్షేమ సహాయకులు, వైఎస్సార్సీ నాయకులు లచ్చబాబు, పడాల భాష, సతీష్, వీరబ్బాయి, సచివాలయ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-08-02 07:59:01

సాహిత్యానికి సామాజిక ప్రయోజనం..

సాహిత్యానికి సామాజిక ప్రయోజనం,  జీవిత చిత్రణ వాస్తవికంగా ఉండాలని ఆ దిశగా  ప్రముఖ కవి రావిశాస్త్రి పలు ప్రజా సమస్యలను తన సాహిత్యం ద్వారా ప్రభావితం చేశారని సాహిత్య వేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. శనివారం కాకినాడాలోని సర్పవరం జంక్షన్ బోటు క్లబ్ వాకర్స సంఘం ఆధ్వర్యంలో రావిశాస్త్రి జయంతి ఘనంగా జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1922 జూలై 30న విశాఖ జిల్లా తుమ్మపాల గ్రామంలో రావిశాస్త్రి  జన్మించారని అన్నారు. కథ, నవల, నాటక ప్రక్రియ ఏదైనా రావిశాస్త్రి కలం దాన్ని ఒక సజీవ శిల్పంగా, మనోజ్ఞంగా మలచి    పాటకున్ని మంత్రముగ్ధున్ని గావించారని అన్నారు. సమాజంలో పీడితులు, తాడితులు, నిరుపేదలు, నిర్భాగ్యులు, స్త్రీలు ఇలా అన్ని విధాల వెనుకబడిన వారిని ఉద్ధరించాలనేది ఆయన రచనలలో లోతుగా ఉండేదని అన్నారు. ఒకవైపు న్యాయవాది వృత్తి చేస్తూనే మరోవైపు రచనలు చేసేవారని శిరీష తెలిపారు .ఈ కార్యక్రమంలో న్యాయవాది యనమల రామం, అడబాల రత్న ప్రసాద్,  రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram Junction

2022-07-30 06:38:36