ఏజెన్సీలోని కొత్తగా 17 ఆధార్ కేంద్రాలు, ఐదు మొబైల్ ఆధార్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న ట్టు రంపచోడవరం ఐటీడీఏ పీఓ సూరజ్ గోనోరే పేర్కొన్నారు. శుక్రవారం ఐటిడిఏలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అధికారులు, ఐటీ కన్సల్టెంట్ అధికారిలతో ఆధార్ కేంద్రాలు ఏర్పాటుకై ప్రాజెక్ట్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే మాట్లాడుతూ, ఏజెన్సీలోని చాలామంది ఆధార్ కార్డులలో తప్పులు, ఆధార్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించి కొత్తగా ఆధార్ కార్డుకేంద్రాలు ఏర్పాటు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఏజెన్సీలో ప్రస్తుతము దుర్చార్తి, ఇందుకూరుపేట, లక్కుండా, సున్నంపాడు, ఫోక్స్ పేట, బొడ్డగండి, పి, ఎర్రగొండ, జడ్డంగి, దుసారపాము, మొత్తం తొమ్మిది ఆధార్ కేంద్రాలు సంబంధిత గ్రామ సచివాలయాల ద్వారా ఆధార్ కార్డు సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా మరో 17 ఆధార్ కేంద్రాలు డి, భీమవరం, రాయిపల్లి, కోనలోవ, అడ్డతీగల గ్రామ సచివాలయం టూ లో ఒకటి, ఇందుకూరు, గంగవరం, నెల్లిపూడి, మొల్లేరు, జడేరు, రాజవొమ్మంగి గ్రామ సచివాలయం వన్ లోఒకటి, వేములకొండ, పెద్ద గెద్దాడ, మడిచర్ల, బోలగొండ, బి, వెలమలకోట, కె. ఎర్రగొండ, గ్రామ సచివాలయాలలోని డిజిటల్ అసిస్టెంట్ లు ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల ఆపరేటర్లుగా బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందని ఆయన పేర్కొన్నారు, అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు ఆధార్ కార్డు లేని వారికి, ఆధార్ కార్డులు తప్పులు సరి చేయుట కొరకు 5 మొబైల్ ఆధార్ యూనిట్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి నెల మొదటి వారం ఆధార్ కేంద్రాలు ఏ విధంగా పనిచేయుచున్నవి అనే అంశంపై పర్యవేక్షించడం జరుగుతుందని ప్రాజెక్టు అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మానిటరింగ్, యూనిట్ అధికారులు, రామ్ గోపాల్, హర్షిత, ఐటీ కన్సల్టెంట్, తదితరులు పాల్గొన్నారు.