1 ENS Live Breaking News

సర్వీస్ రెగ్యులర్ తో బాధ్యత పెరుగుతుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల రెండేళ్ల సర్వీసు ప్రొబేషన్ ను రెగ్యులర్ చేసిన తరువాత అందరిపై మరింత బాధ్యత పెరుగుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు పేర్కొన్నారు. శనివారం అన్నవరం పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఆయన మహిళా పోలీసుల సర్వీసు క్రమబద్దీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వం ఒక ఉన్నత లక్ష్యంతో గ్రామ రక్షణ కోసం మహిళా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామ సచివాలయాల్లో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించాలన్నారు. అనంతరం తమ సర్వీస్ రెగ్యులర్ అయిన సందర్భంగా తేంక్యూ సీఎం సర్..తేంక్యూ ఎస్సీ అంటూ గ్రామ సచివాలయ మహిళా పోలీసులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐ సోభన్ కుమార్,  గ్రామ సచివాలయ మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్. కళాంజలి, జర్తా.నాగమణి, రజియాసుల్తానా తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2022-08-27 14:34:52

గ్రామాల్లో రక్షణ కల్పించేలా పనిచేయాలి

గ్రామ సచివాలయ మహిళా పోలీసులు గ్రామాల్లో మహిళలకు, విద్యార్ధినిలకు రక్షణ కల్పించేవిధంగా పనిచేయాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు సూచించారు. శనివారం వార్షిక పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా శంఖవరం మండలంలోని అన్నవరం పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గ్రామాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా స్టేషన్ కు తరలించి పరిష్కరించంలో కీలకంగా ఉండాలన్నారు. అన్నివర్గాల వారితో కలివిడిగా ఉంటూ పోలీసు సేవలు ప్రజలకు చేరువ అయ్యేలా చూడాలన్నారు. అన్ని విషయాల్లోనూ అవగాహన పెంచుకొని సచివాలయాల నుంచే పోలీసు సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐ సోభన్ కుమార్,  గ్రామ సచివాలయ మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్. కళాంజలి, జర్తా.నాగమణి, రజియాసుల్తానా తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2022-08-27 14:18:29

ఎలుకల నియంత్రణలో రైతులు భాగస్వామ్యం కావాలి

సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములై తమ పంటలను ఎలుకల బారి నుండి కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి .ప్రశాంతి అన్నారు. శనివారం కాళ్ల మండలం సీసలి గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద సామూహిక ఎలుకల  నిర్మూలనకు ఎలుకల మందు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టరు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు  ఎలుకలు పాడుచేయడం  వల్ల చాలా నష్టం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.   ఎలుకలు చేసే నష్టాల నుండి రైతులు బయటపడడానికి సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో అందరూ భాగస్వాములై తమ తమ పొలాలలో ఉన్న ఎలుకల కన్నలలో ఎలుకల మందు పొట్లాలు ఉంచి వాటిని నిర్మూలించాలని కలెక్టర్ సూచించారు . 

నిన్న మూసిన ఎలుక కన్నాలలో  ఈరోజు ఏవైతే తెరుచుకున్నాయో ఆ కన్నాలలో ఈ ఏలుకల మందు పోట్లలు ఉంచాలని సూచించారు .ఎలుకల మందు తయారీకి నూకలు ,నూనె , బ్రోమెడయోలిన్ ఎలుకల మందు మిక్స్ చేసి  ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వర రావు, సహాయ సంచాలకులు కె ఏ యస్.యస్ శ్రీనివాసరావు, తహశీల్దారు కె.కృష్ణారావు, యం.పి.డి.వో స్వాతి, వ్యవసాయ శాఖ అధికారి కె.జయవాసకి, ఆర్బికె సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Kalla

2022-08-27 13:46:17

చింతామణి గణపతికి మంత్రి పూజలు

విశాఖజిల్లాలోని సిరిసపల్లి గ్రామంలోని శ్రీ చింతామణి గణపతి దత్త క్షేత్రంలో  గణపతిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త క్షేత్రంలో జరగనున్న గణపతి నవరాత్రి మహోత్సవాల కరపత్రాన్ని అమర్ నాథ్ విడుదల చేశారు. దత్తక్షేత్రం గణపతి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు 1000 మారేడు మొక్కలు, 1000 గణపతి మట్టి ప్రతిమలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. వీటిని మంత్రి అమర్నాథ్ లాంఛనప్రాయంగా భక్తులకు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీచండీ హోమం పూర్ణాహుతిలో అమర్ నాథ్ పాల్గొన్నారు.

సిరసపల్లి

2022-08-27 13:39:16

పంటల్లో ఎలుకలతో జాగ్రత్తలు అవసరం

వరి సాగులో ఎలుకల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని శంఖవరం మండల వ్యవసాయ అధికారి పడాల గాంధీ రైతులకు సూచించారు. శనివారం శంఖవరం, కత్తిపుడి ప్రాంతాల్లో రైతులతో వరి పంటను పరిశీలించి ఎలుకల వల్ల వరి పంటకు కలిగే నష్టాన్ని రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి మాట్లాడుతూ, రైతులు ఎప్పటికప్పుడు ఎలుకల బొరియలను గుర్తించాలన్నారు. అలా గుర్తించి వాటిలో బ్రోమోడయోలిన్ తో ఎర వేయాలన్నారు. అనంతరం ఎలుకల నియంత్రణ  మందు తయారు చేసే విధానాన్ని రైతులకు తెలియజేశారు. పంట వేసిన తరువాత పొలం గట్లను శుభ్రం గా ఉంచుకోవాలని,ఎలుకల నివారణకు రైతులు సామూహికంగా ఎర మందు పెట్టడం ద్వారా నివారించ వచ్చు అని వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ప్రభాస్,చినబాబు,రైతులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-08-27 13:04:55

అధైర్య పడొడ్డు..ప్రభుత్వం అండగా ఉంది

రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.  ఎచెర్లలోని  బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ళ విద్యార్థిని మృతిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున శనివారం జిల్లా పర్యటనలో స్వయంగా వెళ్లి పరామర్శించారు.  గురుకులంలోని  విద్యార్థులతో ముచ్చటించిన ఎవ్వరూ అధైర్యపడొద్దని, ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. మీకు అండగా ప్రభుత్వం ఉంటుందని, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నాడు - నేడుతో పేను మార్పులు చేపట్టిందని వెల్లడించారు.  మధ్యాహ్న భోజనం పథక నిర్వహణలో ప్రభుత్వం పెను మార్పులు చేసి మెనూ అందిస్తుందన్నారు.   విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చిన జిల్లా యంత్రంగా అందుబాటులో ఉంటుందని, విద్యార్థుల సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి శాసన సభలోనే మధ్యాహ్న భోజనానికి ఒక మెనూ తయారుచేసి అందులో చిక్కీలు కూడా చేర్చినట్లు వివరించారు. 

 ఈ నేపథ్యంలో ఎస్.సి.,ఎస్టీ, బిసి, మైనారిటీ వసతీ గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ల్లో మంచి మెనూ, నాణ్యమైన భోజనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  విద్యార్థులు బహిరంగ మరుగుదొడ్లకు వెళ్లకుండా మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి అధైర్య పడకుండా, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండి బాగా చదువుకోవాలని హితవుపలికారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్ల కిరణ్ కుమార్, ఎ.పి.రెసిడెన్షియల్ సెక్రెటరీ పావనమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి, ఎస్.సి. కార్పొరేషన్ ఇ డి రామారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు గడ్డెమ్మ, జిల్లా కో ఆర్డినేటర్  యశోద లక్ష్మి, బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పి. నిర్మల, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు కంఠ వేణు, తైక్వాండో శ్రీను, యజ్జల గురుమూర్తి, లింగాల గరికివాడు, మిస్కా కృష్ణయ్య పెయ్యల  చంటి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Echherla

2022-08-27 12:51:14

గురుకులాల్లో ఫలితాలు మెరుగుపడాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని సాంఘిక సంక్షేమ‌శాఖ ఆధ్వ‌ర్యంలోని డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ గురుకులాల్లో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు మ‌రింత‌గా మెరుగుప‌ర‌చాల‌ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున ఆదేశించారు. ఆయా పాఠ‌శాల‌ల ప్రిన్సిపాల్‌లు, బోధ‌న సిబ్బంది, విద్యార్ధులు క‌ల‌సి ఈ దిశ‌గా మ‌రింత కృషి చేయాల‌ని సూచించారు. పూస‌పాటిరేగ మండ‌లం కొప్పెర్ల‌లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాల‌యాన్ని మంత్రి స్థానిక ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడుతో క‌ల‌సి శ‌నివారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా 10వ‌ త‌ర‌గ‌తి, ఇంట‌ర్ త‌ర‌గ‌తి గ‌దుల‌ను సంద‌ర్శించి విద్యార్ధుల‌తో మాట్లాడారు. గురుకులంలో క‌ల్పిస్తున్న భోజ‌న సౌక‌ర్యంపై విద్యార్ధుల‌ను ప్ర‌శ్నించారు. భోజ‌నం బాగుంద‌ని ప‌లువురు విద్యార్ధులు మంత్రికి వివ‌రించారు. పాఠ‌శాల‌లో మౌళిక వ‌స‌తుల‌పై మంత్రి ఆరా తీశారు. విద్యార్ధుల విద్యా ప్ర‌మాణాల గురించి మంత్రి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఫ‌లితాలు త‌క్కువ‌గా వున్నాయ‌ని, ఫ‌లితాలు మెరుగుప‌రిచేందుకు, విద్యా ప్ర‌మాణాలు మెరుగుప‌డేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి గురుకులాల స‌మ‌న్వ‌య అధికారిణి చంద్రావ‌తికి సూచించారు.

 గురుకులాల్లో నాడు- నేడు కింద‌ మౌళిక వ‌సతుల‌ను క‌ల్పిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. విద్యార్ధులు క‌ష్ట‌ప‌డి చ‌దివి త‌మ త‌ల్లిదండ్రుల‌కు పేరు తీసుకురావాల‌న్నారు. ఇక్క‌డి విద్యార్ధులంతా పేద కుటుంబాల నుంచి వ‌చ్చిన వారేన‌ని, వారంతా చ‌దువుపై దృష్టిసారించి త‌మ భ‌విష్య‌త్తును తీర్చిదిద్దుకోవాల‌న్నారు. తాను కూడా పేద కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని, హాస్ట‌ళ్ల‌లో చ‌దివే ఈ స్థాయికి వ‌చ్చాన‌ని గుర్తుచేస్తూ క‌ష్ట‌ప‌డి చ‌దివితేనే భ‌విష్య‌త్తు వుంటుంద‌న్నారు. కొప్పెర్ల గురుకులంలో వ‌స‌తుల క‌ల్ప‌న‌కోసం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు మంత్రికి వివ‌రించారు. రూ.2 కోట్ల సి.ఎస్‌.ఆర్‌. నిధుల‌తో కొన్ని భ‌వ‌నాల‌ను నిర్మించామ‌ని, మ‌రో రూ.1 కోటి జెడ్పీ నిధుల‌తో మ‌రికొన్ని భ‌వ‌నాల‌కు ప్ర‌తిపాదించామ‌న్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో గురుకులాల జిల్లా స‌మ‌న్వ‌య అధికారిణి చంద్రావ‌తి, ఎస్‌.సి.కార్పొరేష‌న్ ఇన్ ఛార్జి ఇ.డి. సుద‌ర్శ‌న దొర‌, త‌హ‌శీల్దార్ భాస్క‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Pusapatirega

2022-08-27 12:14:13

రీసర్వే ఈ-క్రాప్ నమోదు పక్కాగా ఉండాలి

అనకాపల్లి జిల్లాలో చేపట్టిన రీ సర్వే, ఈ-క్రాప్ నమోదు ఖచ్చితంగా ఉండాలని కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె చోడవరం మండలంలో పర్యటించి తాసిల్దార్ కార్యాలయంలో  భూమి రీ సర్వే రికార్డులను పరిశీలించారు.  రీ సర్వే మూలంగా రైతుకు మేలు జరుగుతుందని, సరిహద్దులు స్పష్టంగా ఉంటాయని చెప్పారు. ఎటువంటి లోపాలు లేకుండా ఈ సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. తరువాత మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో ఈ-క్రాప్ నమోదును పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. వేసిన పంట నమోదు చేయడం పక్కాగా ఉండాలని, ఈ-క్రాప్ ను అనుసరించే రైతుకు ధాన్యం సేకరణ, పంటల బీమా మంజూరు చేయబడుతుంది అన్నారు. ఈ నెల 31వ తేదీ లోగా ఈ క్రాప్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.  రీసర్వే, ఈ క్రాప్ ల నమోదుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వీటి మూలంగా వారికి కలిగే లాభాలను గురించి వివరించాలని చెప్పారు.  ఈ పర్యటనలో తాసిల్దార్ తిరుమల బాబు, సర్వే అధికారులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Chodavaram

2022-08-26 14:05:54

అర్హులైన లబ్దిదారులందరికీ సొంతిల్లు.

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా ధరకాస్తు చేసుకున్న లబ్దిదారుల స్వంత ఇంటి కల సాకారం చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం రాజానగరం నియోజకవర్గం లో జాయింట్ కలెక్టర్ రాజానగరం, కోరుకొండ, రంగంపేట ,  సీతానగరం మండలాల్లో భూసేకరణ లో భాగంగా తహశీల్దార్లు తో కలిసి క్షేత్ర స్థాయి లో పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ వివరాలు తెలుపుతూ, జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాని ఇంటి కల సాకారం కోసం భూములను గుర్తించి, సేకరించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, 90 రోజుల కార్యక్రమంలో భాగంగా అనువైన స్థలాలను మండల స్థాయి లో గుర్తించడం జరిగిందని, వాటిని క్షేత్ర స్థాయి లో ప్రత్యక్షం గా పర్యవేక్షణ చేసినట్లు తెలిపారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లో 1,024 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందించే క్రమంలో 25.71 ఎకరాలు పరిశీలన చేసినట్లు తెలిపారు.  రాజానగరం లో శ్రీకృష్ణ పట్నం లో 16 మంది లబ్దిదారుల కోసం 93 సెంట్లు, కోరుకొండ మండలంలో నీడిగట్ల లో 60 మంది కోసం 87 సెంట్లు,  గాదరాడ లో 440 మందికి 15. 26ఎకరాలు, కోటికేశవరంలో  136 మందికి 6.12 ఎకరాల్లో స్థలాలు ఇళ్ళ స్థలాల కోసం భూసేకరణ చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. అదేవిధంగా రంగంపేట లో వడిసలేరు గ్రామంలో 22 మంది లబ్ధిదారుల కోసం 63 సెంట్లు, సీతానగరం మండలం లో నాగులపల్లి 1.40 ఎకరాలు,   వంగలపూడి గ్రామాల్లో  50 సెంట్లు, గతంలో సేకరించిన 7 ఎకరాలు తో కలిపి 350 మందికి ఇళ్ళ స్థలాల ఇచ్చేందుకు భూములను గుర్తించినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ పర్యటన లో తహశీల్దార్లు పి. పాపరావు, ఎన్. పవన్ కుమార్, అహ్మద్ ఉన్నిసా , ఎస్.సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Rajanagaram

2022-08-26 13:42:31

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమమే లక్ష్యం.

సాలూరు మండలం మరిపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర గురు వారం పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రోజు రోజుకు నిత్య నూతనంగా సాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ తమకు అందినవి, కావలసినవి తెలియజేస్తున్నారు.  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పక్షపాతి ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అర్హత ఉంటే పథకాలు మంజూరు అవుతాయని ఆయన పేర్కొన్నారు. గడప గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.  ప్రభుత్వం నుండి లబ్ధి కలిగిందని వివరిస్తూ కర పత్రాలను ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని, పేదలందరికీ ఇల్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో  లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు. 

ప్రతి ఒక్కరూ గృహాలను నిర్మించుకోవాలని, సొంత ఇంటికి యజమాని కావాలని ఆయన కోరారు.  పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు వసతి కొరకు ఏడాదికి 20 వేల రూపాయల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం క్రింద జిల్లాలో 180 మంది చేనేతకారులకు రూ.43.20 లక్షలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సచివాలయం పరిధిలో మౌళిక సదుపాయాలు కల్పనకు రూ.20 లక్షలు చొప్పున మంజూరు జరిగిందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. 

Salur

2022-08-25 12:28:50

రూ.44 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా వుంటుందని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. గురువారం  కోటపాడు (మం) అర్లీ గ్రామానికి  చెందిన  బోలిం ఎర్రాపాత్రుడు అనారోగ్య సమస్యల నిమిత్తం ఆసుపత్రిలో అయినా ఖర్చుల నిమిత్తం 44 వేల  రూపాయల చెక్ ను  గురువారం అర్లి గ్రామంలో లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ సహాయాన్ని ఎందరో అభాగ్యులకు అందిస్తోందన్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నవారికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ సహాయాన్ని అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

K. Kotapadu

2022-08-25 10:00:20

యోగ సాధన తో సంపూర్ణ ఆరోగ్యం

యోగ సాధనలో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఇందుకు గాను కొన్ని నియమాలు పాటించాలని యోగా శిక్షకులు పి . పార్థసారథి పేర్కొన్నారు.  గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శబ్ద, వాయు కాలుష్యం లేని ప్రదేశంలో గాలి, వెలుతురు ఉన్నచోట యోగాసనాలు వేయాలన్నారు. మలమూత్ర విసర్జన అనంతరం ఖాళీ కడుపుతో ఎటువంటి ఒత్తిడి, కోపం, భయం లేకుండా యోగ సాధన చేయాలన్నారు. కాఫీ, టీ లు వంటివి తాగరాదని, బిగువైన దుస్తులు ధరించరాదని అన్నారు. నేల మీద యోగ సాధన చేయరాదని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు యోగ సాధన చేయాలన్నారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు యోగాసనాలు వేయవచ్చని పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-25 07:52:30

అర్హులందరికీ నేరుగా సంక్షేమ పథకాలు

గ్రామంలో అభివ్రుద్ధి జరగాలని ఆలోచిస్తే.. అందరికీ సంక్షేమం సులువవుతుందని డిప్యూటీ  సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. బుధవారం కే.కోటపాడు మండలంలోని ఇంటింటికీ మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రాష్ట్రం లో  అవ్వ తాతలతో పాటు దివ్యాంగులు ,  దీర్ఘకాలిక వ్యాధి గ్రాస్తులకు జగనన్న ప్రభుత్వం ఎల్లవేళలా తోడు ఉంటుందని గడప గడపకు మన ప్రభుత్వం చేపడుతుందన్నారు. గ్రామానికి సంబంధించిన మౌళిక సదపాయాల గురించి గ్రామ పెద్దలతో చర్చించారు. గ్రామంలో పరిసరాలను పరిశీలించి పారిశుధ్య పనులపైన, ఇంటింటికీ కుళాయి ఏర్పాటు పై అసంతృప్తి వ్యక్తం చేసి అధికారులపై  అసహనం వ్యక్తం చేశారు. అనంతరం నాడు - నేడు మొదటి విడత పనులలో భాగంగా 18.48.లక్షల ఏర్పాటు చేసిన భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో ఇతరత్రా మౌళికవసతుల కల్పన కోసం 20 లక్షలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో కోటపాడు జెడ్పీటీసీ అనురాధ, ఎంపిపి రెడ్డి జగన్ మోహన్, ఎమ్మార్వో,  ఎంపిడిఒ, మండల, గ్రామ స్థాయి అధికారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

K. Kotapadu

2022-08-24 13:44:03

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనుల భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పాచిపెంట లోని నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాల పనులను పరిశీలించారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి వీలైనంత త్వరగా నూతన భవనాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు పాలనా సౌలభ్యం అందించాలనే లక్ష్యంతో ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. అక్కడ నుంచి గ్రామ సచివాలయాలను సందర్శించారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారుల వివరాల జాబితాను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సకాలంలో సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులు కాల పార్వతీ తో మాట్లాడి ఇంటి సామాగ్రి, సిమెంట్ ఎన్ని బస్తాలు అధికారులు అందించారు అనే వివరాలపై ఆరా తీశారు. గృహ నిర్మాణ బిల్లు మంజూరు అయ్యిందా అని ప్రశ్నించగా రూ.75 వేలు మంజూరైందని తెలపడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జల జీవన్ మిషన్ క్రింద చేపట్టిన ఇంటింటికీ కుళాయిలు లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి.సంతోష్, ఇంచార్జి తాసిల్దార్ ఎమ్.రాజశేఖర్, పంచాయత్ రాజ్ డి ఈ చిన్నం నాయుడు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మధుసూదన రావు, వ్యవసాయ అధికారి అనురాధ, ఏ ఈ ఓ హైమవతి, తదితరులు పాల్గొన్నారు.

Pachipenta

2022-08-24 13:27:16

దోమల నియంత్రణకు స్ప్రేయింగ్ చేపట్టాలి

పార్వతిపురం మన్యం జిల్లాలో  దోమల  నియంత్రణకు  చేపడుతున్న  చర్యలలో  భాగంగా జరుగుతున్న పారిశుధ్యం,   స్ప్రేయింగ్  పనులను     సబ్ కలెక్టర్  భావన  తనిఖీ చేశారు.   స్ప్రేయింగ్  పనులు  సక్రమంగా  జరుగాలని,  దోమల  నియంత్రణకు  స్ప్రేయింగ్  ప్రక్రియ  ముఖ్యమని తెలిపారు.  స్ప్రేయింగ్ జరుగుతున్నప్పుడు  స్థానిక  వైద్యసిబ్బంది,  మున్సిపల్  సిబ్బంది,  సచివాలయ సిబ్బంది  తదితర  సంబందిత శాఖల  సిబ్బంది  పర్యవేక్షణలో జరుగాలని,  అధికారులు  తనిఖీ  నిర్వహించాలని తెలిపారు.     పాలకొండ  నగర పంచాయతీ    ఏడవ  వార్డులో  రెవెన్యూ  డివిజినల్  అధికారి  కె.  హేమలత   పారిశుధ్యం,  స్ప్రేయింగ్ పనులను తనిఖీ  చేశారు.  పారిశుధ్యం నిర్వహణపై  మాట్లాడుతూ  చెత్తను  ఎప్పటికప్పుడు  శుభ్రం  చేయాలని తెలిపారు.  కాలువలలో  చెత్త  లేకుండా చూడాలని, మురుగు నీరు  సక్రమంగా  పారేలా  చూడాలన్నారు.  ప్రజలు  ఇంటిలోని  చెత్తను   తడిచెత్త, పొడిచెత్తగా  విభజించి  పారిశుధ్య  సిబ్బంది కి  అందించాలని  సూచించారు.

పారిశుధ్య నిర్వహణపై జిల్లాలో కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యంగా మున్సిపాలిటీలలో మరింత పకడ్బందీగా నిర్వహించాలని డివిజనల్ అధికారులకు జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించిన సంగతి విదితమే. పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు ఇద్దరు రెవిన్యూ డివిజనల్ అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నారు. పార్వతీపురం వరహాల గెడ్డ దశాబ్దాల కొలది పూడిక తీతకు నోచుకోలేదు. అటువంటి పనులను ఈ ఏడాది చేపట్టి పారిశుధ్యానికి మరీ ముఖ్యంగా వరద నీరు వచ్చినా పట్టణానికి ఇబ్బంది లేకుండా చేశారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వలన మురుగు నీరు పారుటకు ఇబ్బంది కరంగా ఉండటం, పారిశుధ్యం కోపంలో వాటి పాత్ర ఎక్కువగా ఉండటం పట్ల జిల్లా యంత్రాంగం శ్రద్ద వహించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు పారిశుధ్య నిర్వహణలో సహకారం అందించి, పరిశుభ్రమైన పట్టణాలు, గ్రామాలు ఆవిర్భావానికి, అంటువ్యాధుల ప్రభావం లేకుండా ఉండటానికి తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు.

Parvathipuram

2022-08-24 13:25:24