1 ENS Live Breaking News

త్వరితగతిన రీసర్వే పూర్తిచేయాలి

పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలో రీ సర్వే వేగవంతంగా పూర్తిచేయాలని  సబ్ కలెక్టర్ భావన పిలుపు నిచ్చారు. శుక్రవారం సాయంత్రం మండలములోని మరిపివలస, పాపమ్మవలస, నీలకంటాపురం గ్రామాలలో జరుగుతున్న రీసర్వే పనులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురోగతిపై ఆరాతీసి ప్రభుత్వ భూములు సర్వే, జిరాయితీ భూముల సర్వే నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సకాలంలో అన్ని గ్రామాల్లో పూర్తి చేసేలా సిబ్బంది పనిచేయాలని తెలిపారు. రీసర్వేపై పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ షేక్ ఇబ్రహీం, ఆర్ఐ రాజేష్, మండల సర్వేయర్ రాజ గోపాల్ నాయక్, వి ఆర్ ఓ లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Seethanagaram

2022-07-29 13:47:22

అమృత్ సరోవర్ తో చెరువుల అభివ్రుద్ధి

అమృత్ సరోవర్ పథకం ద్వారా జిల్లాలోని చెరువులు కొత్త రూపు రేఖలు సంతరించుకునేలా చేస్తామని జిల్లా కలెక్టర్  పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వీరవాసరం మండలం వడ్డిగూడెం గ్రామంలోని త్రాగునీటి చెరువు అభివృద్ధి పనులను  పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆజాదికా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లోని చెరువులను  అమృత్ సరోవర్ పథకం ద్వారా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.   వీటిలో భాగంగా ఉపాధి నిధులతో  కొత్త చెరువుల నిర్మాణాలు, పాత చెరువుల అభివృద్ధి, జంగిల్ క్లియరెన్స్, పూడికతీత, బౌండరీల నిర్మాణం వంటి పనులను ఉపాధి కూలీల ద్వారా చేపట్టడం జరిగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అమృత సరోవర్ పథకం కింద 75 చెరువులను ఎంపిక చేయగా 39 చెరువుల పనులను చేపట్టి రెండు చెరువు పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. తణుకులో కొత్త చెరువు త్రవ్వకం పనులకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 

వీరవాసరం త్రాగునీటి చెరువు గట్టులను పట్టిష్టం చేసి, మొక్కలు నాటి, చెరువు చుట్టుపక్కలంతా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డ్వామా  పిడి రాజేశ్వరరావు, ఏపీడి జె.కనకదుర్గలకు సూచించారు.  'హార్  ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా జెండా పండుగ కార్యక్రమాన్ని ఈ ప్రదేశంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట డ్వామా  పిడి రాజేశ్వరరావు, ఏపీడి జె.కనకదుర్గ, తహసిల్దార్ ఎం.సుందర్ రాజు,  ఇంచార్జ్ ఎంపీడీవో పి.శామ్యూల్, రెవిన్యూ అధికారులు, తదితరులు ఉన్నారు.

Veeravasaram

2022-07-29 13:23:12

ఆగష్టు 1న అన్నవరంలో జిల్లా స్పందన

ఆగష్టు నెల మొదటి  సోమవారం 1వ తేదీన  జిల్లా స్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని అన్నవరంలోని గౌరీ కళ్యాణ మండపంలో  ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్  విజ్ఞాపనలను అన్నవరంలో స్వీకరిస్తామని కాకినాడ జిల్లాకు చెందిన  అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని  గమనించి ఆగష్టు 1వ తేదీన తమ అర్జీలను అన్నవరంలో నిర్వహించే  స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు. అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ ఆగష్టు 1వ తేదీ సోమవారం ఉదయం 9-30 గంటలకే అన్నవరంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి  విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Annavaram

2022-07-29 11:45:57

జాప్యం లేకుండా సేవలు అందించాలి

ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని సచివాలయ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.  శుక్రవారం భీమవరంలో 10,18,20,21  వార్డు సచివాలయాలు ,ఏడ్వార్డ్ ట్యాంకు లను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ   సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్,  గడువులోగా ప్రజా సమస్యల పరిష్కారం నివేదిక తదితర వాటిని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. వివిధ పధకాల అర్హుల జాబితాలను ప్రతినెల సచివాలయంలో ప్రదర్శించాలన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను  అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఎంతో కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు.  ప్రతి పౌర సేవ నిర్దేశించిన కాలంలొనే  ప్రజలకు సంతృప్తికరంగా ఉండేలా జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి చూడాలన్నారు.ఏడ్వార్డ్ ట్యాంక్ సుందరీకరణకు ప్రతిపాదనలు రూపొందించామని  మున్సిపల్ కమిషనర్  యస్ శివరామకృష్ణ జిల్లా జాయింట్ కలెక్టరుకు వివరించారు. జిల్లా జాయింటు కలెక్టరు వెంట మున్సిపల్ కమిషనరు యస్. శివరామకృష్ణ,తహశీల్దారు వై. రవికుమార్, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, తదితరులు వున్నారు.

Bhimavaram

2022-07-29 09:46:59

పార్టీలకు అతీతంగా విశాఖ నగరాభివ్రుద్ధి

పార్టీలకతీతంగా నగరాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె 6వ జోన్ 88 వ వార్డు పరిధిలోని నరవ, కోటనరవ తదితర ప్రాంతాలలో సుమారు 229.67 లక్షల వ్యయంతో పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజు, వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు శాసనసభ్యులు, ప్రతీ కార్పొరేటర్ తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో నగరాన్ని సుందర విశాఖ నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వార్డులోని ప్రధాన సమస్యలైన త్రాగు నీరు, విద్యుత్తు, పారిశుధ్యం ,రోడ్లు ,కాలువలు, డ్రైన్లు మొదలైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ ఫలాలు కూడా అందిస్తున్నామని  తెలిపారు.  రెండు కోట్ల రూపాయలుపైనే అభివృద్ధి కార్యక్రమాలు మన ఒక వార్డ్ లోనే శంకుస్థాపన చేస్తామని, ఇంకా వార్డులో చాలా వరకు పనులు చేయవలసి ఉందని వాటికి కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

 అనంతరం గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, స్థానిక వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ తో కలిసి సుమారు రూ.1.09 కోటి తొమ్మిది లక్ష రూపాయలు అభివృద్ధి పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రతి వార్డును ప్రత్యేకంగా దృష్టితో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కొరకు రెండు కోట్ల రూపాయలు  కేటాయించారని, వాటిని కూడా అవసరమున్న చోట ఖర్చు పెడతామని తెలిపారు.  అనంతరం నరవ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో సర్వ శిక్ష అభియాన్ నిధులతో సుమారు రూ.1.06 కోట్ల వ్యయంతో తొమ్మిది అదనపు తరగతి గదుల నిర్మాణానికి శాసనసభ్యులు, కార్పొరేటర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సింహాచలం, కార్యనిర్వహణ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, సచివాలయం సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2022-07-29 09:11:48

విద్యుత్తు ప్రగతి తోనే ఉజ్వల భవిష్యత్

విద్యుత్ ప్రగతి తోనే దేశ ఉజ్వల భవిష్యత్ ను సాధించవచ్చని భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు పేర్కొన్నారు. అజాద్ కా అమృత్ మహాత్సవంలో భాగంగా గురువారం ఉదయం అనందపురంలో రాష్ట్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మానవ జీవనశైలిలో  విద్యుత్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అటువంటి విద్యుత్ ను పరిరక్షించుకునేందుకు, అందరికి విద్యుత్ ను అందించేందుకు రాష్ట్రముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ వెలుగులకు, అదే విధంగా ఉచిత విద్యత్ ను  అందించడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నేడు ఆధునిక విద్యుత్ సౌకర్యాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర మాట్లాడుతూ ఆదాయంతో  సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి  విద్యుత్ సౌకర్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.

 ఈ పీ డీ సి ఎల్  డైరక్టర్ బి. రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ పొదుపు ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థను  పటిష్ట పరుస్తు పర్యావరణానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.  రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలకు ధీటూగా విద్యుత్ సౌకర్యాలను సమకూరుస్తున్నట్టు తెలిపారు. అనంతరం స్కూల్ ఆఫ్ ధియెటర్ ఆర్ట్స్  బాలలు జానపద నృత్యాలను, డేవిడ్ బృందం లఘనాటికలను  ప్రదర్శించారు. నోడల్ ఆఫీసర్ మధు, వందన సమర్పణ చేశారు.  ఈ కార్యాక్రమంలో  ఈ పీడీసిఎల్ జోన్-3 డివిజినల్ ఎలక్టికల్ ఇంజనీర్ పోలంకి శ్రీనివాస రావు, స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సి.ఈ.ఓ, చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ., విజయ్ కుమార్, విద్యుత్ శాఖాదికారులు పాల్గోన్నారు.  

Anandapuram

2022-07-28 12:01:28

ఐ.టి. చెల్లింపులకు ఆటంకం లేదు

జనవరి నెల జీతాలు రాష్ట్ర ఖజానా సంచాలకుల ద్వారా నేరుగా చెల్లించి నప్పటికీ ఉద్యోగులకు వారి ఆదాయపు పన్ను రిటర్న్ లు దాఖలు చేసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని జిల్లా ఖజానాధికారి వి.లక్ష్మీ సుభాషిణి తెలిపారు. గురువారం ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో ప్రకటన విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 2022 జనవరి నెలకి సంబంధించిన వేతనాలు నేరుగా సంచాలకుల వారే చెల్లించుట జరుగగా మిగిలిన 11 నెలల జీతం ఆయా కార్యాలయాల డిడిఓల ద్వారా చెల్లించినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల జనవరి నెల ఆదాయపు పన్నును వేరువేరు భాగాలుగా సంచాలకుల "టేన్" (TAN) ను ఉపయోగించి  అప్లోడ్ చేశామని తెలిపారు. ఈ విషయాన్ని డ్రాయింగ్ అధికారులు తమ పరిధిలోని ఉద్యోగులకు పరిస్థితిని తెలియజేసి 12 నెలలకు సంబంధించి ఫారం-16ను ఫారం-26ASని దృష్టిలో పెట్టుకొని జారీ చేయవలసిందిగా ఆమె ప్రభుత్వశాఖల అధికారులను ఆమె మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా కోరారు.

Anakapalle

2022-07-28 11:36:35

29 న అంతర్జాతీయ పులుల దినోత్సవం

తిరుపతి జూలై 29 న అంతర్జాతీయ పులుల దినోత్సవం  సందర్భంగా   శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాలలో రాష్ట్ర స్థాయి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, మైనింగ్ , విద్యుత్ శాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి   వై.మధుసూధన్ రెడ్డి , ఇతర అటవీశాఖ ముఖ్య అతిధిలుగా హాజరు కానున్నారని,  ప్రతి ఏటా జూలై 29 వ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకోవటం ఒక ఆనవాతీగా వస్తోందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో పులుల ప్రాముఖ్యత ను గుర్తించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి   ఆంధ్రప్రదేశ్ లో పులుల సంతతిని పెంచడానికి, వాటి సంరక్షణ కు రాష్ట్ర అటవీ శాఖకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడమే కాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అటవీ శాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి చొరవతో రాష్ట్ర స్థాయి పులుల దినోత్సవ కార్యక్రమాన్ని తిరుపతి జూ పార్క్ లో ఏర్పాటు చేయనున్నట్టు ఆ ప్రకటనలో తెలియజేశారు.

Tirupati

2022-07-28 11:15:03

ఏటిగట్టు పనులు సత్వరమే పూర్తిచేయాలి

వరద కోతకు గురైన గోదావరి ఏటుగట్టు తాత్కాలిక మరమ్మత్తు పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయ్యాలని జిల్లా కలెక్టరు  పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఇటీవల గోదావరి వరద కారణంగా నరసాపురం పట్టణం పొన్నపల్లి 4 వార్డు వద్ద ఏటిగట్టు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షిస్తూ 56 లక్షల 60 వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఏటి గట్టు తాత్కాలిక మరమ్మత్తు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంలో కన్జర్వెన్సీ సహాయక ఇంజనీరు కె వి సుబ్బారావు జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ ఏటుగట్లు తాత్కాలిక పటిష్టపనులు  2, 4 వార్డులలో పొన్నపల్లి రేవు నుండి అమరేశ్వర స్వామి రేవు వరకు సుమారు 400 మీటర్ల మేర పనులు చేపట్టడం జరిగిందని,  ఇందుకు అవసరమైన పనివాళ్ళ, ఇసుక బస్తాలు, ఏదురు బొంగులు , ఏదురు  తడికేలు తదితర సామగ్రి సిద్దంగా చేశామన్నారు. గోదావరి ఏటిగట్టు తాత్కాలిక మరమ్మత్తు పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టరుకు తెలిపారు.

ఈ సంధర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అధిక వర్షాలు వలన గోదావరి ఉదృతంగా ప్రవహించడంతో ఏటి గట్టు  కోతకు గురైంది అని, తాత్కాలిక మరమ్మత్తు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు. యాధాస్ధితికి వచ్చాక గోదావరి ఏటిగట్టుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారానికి   గ్రోయల్స్ ఏర్పాటుతో పాటు ఫుట్ పాత్ పునర్నిర్మాణం చేసి  పటిష్టం చేస్తామని అమె అన్నారు.  గోదావరి ఏటిగట్ల పటిష్టత వలన భవిష్యత్తులో లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద ముంపు లేకుండా భద్రత కల్పించడమే ప్రధమ లక్ష్యం  అన్నారు. వరద కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజల జీవనానికి ఇబ్బంది లేని విధంగా కరకట్ట ప్రతిష్టతకు పక్కా ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, నదీ ప్రవాహం యధాస్థితికి వచ్చిన అనంతరం ఏటిగట్లకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు. జిల్లా కలెక్టరు వెంట సబ్ కలెక్టరు సి .విష్ణు చరణ్, తహశీల్దారు యస్ యం ఫాజిల్, కన్జర్వెన్సీ సహాయక ఇంజనీరు కె వి సుబ్బారావు, తదితరులు వున్నారు.

Narsapur

2022-07-28 10:22:27

కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కాంట్రాక్టు కార్మికుల సమస్య లను తక్షణమే పరిష్కరించి, చట్టపరంగా కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో గురువారం డిఆర్ఎమ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ ఒ అప్పారావు మాట్లాడుతూ, రైల్వే ఎన్ సిసి లో అప్పర్ గేర్ కార్మికులకు కాంట్రాక్టరు ఓరియెంటల్ సెక్యూరిటీ సర్వీసస్ యజమాని గత ఆరు నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింలేదన్నారు. కాంట్రాక్టర్లంతా ప్రస్తుతం కాంట్రాక్టును ముగించుకొని వెళ్ళిపోయే పనిలో ఉన్నారని అన్నారు. ఇక్కడ పనిచేసే కార్మికులందరూ స్కిల్డ్ కార్మికులు అని , అయినా నెలకు 10 వేల రూపాయలు మాత్రమే జీతంగా ఇస్తున్నారన్నారు. రైల్వే స్టేషన్ ఎ 1 ఫెసిలిటీస్ ప్రయివేటు లిమిటెడ్ యజమాని పని చేస్తున్న కార్మికులకు చట్టపరంగా జీతాలు ఇవ్వలేదని, కరోనా పేరు మీద అనేక మంది కార్మికులను విధుల నుండి తొలగించారని అన్నారు. ఎన్ సిసి లో సి అండ్ డబ్ల్యు 180 మంది కార్మికులకు నెలలో 3 మస్తర్ల జీతాలను కాంట్రాక్టరు తినేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. రైల్వే కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని అన్నారు.  ఈ సమస్యలును తీర్చే వరకూ పోరాడుతామని అన్నారు. ఈకార్యక్రమంలో సిఐటియు జోన్ ప్రెసిడెంట్ బి సింహాచలం, నాయకులు ఎస్ శ్రావణ్, కార్మికులు రాజుతల్లి, అర్జున్, హరికృష్ణ, శివ, నూకరాజు, ఎన్ రమణ, ఎన్ నరేష్, బి సన్నిబాబు, ఎమ్ సత్యనారాయణ, బి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-28 08:37:15

డోలీలోనే గిరిజనుల ప్రాణాలు పోతున్నాయ్

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, మండలంలోని చింతలపూడి పంచాయతీ బోడిగరువు నేరేళ్ళ పూడి గిరిపుత్రులకు డోలీమోత కష్టాలు తప్పడం లేదు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు నియోజవర్గంలో పరిస్థితి ఇంత దారుణంగా వుందనడానికి గిరిజనులు పడుతున్న అవస్థలే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతానికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఈ గ్రామానికి చెందిన చెందిన గిరిజనులు ఎవరికైనా ఆరోగ్యం మందగిస్తే డోలీ మోతలతోనే ఏరు దాటాల్సి వస్తుంది. గురువారం తెల్లవారుజామున వ్రుద్ధురాలికి ఆరోగ్యం క్షీణించడంతో చింతలపూడి బ్రిడ్జి వరకు ఐదు కిలోమీటర్లు దూరం డోలిలో మోసుకోచ్చి  యస్.కోట ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. ఇపుడే కాదు ఈ ప్రాంతంలో ఎవరికి ఓంట్లో బాగోలేకపోయినా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు గిరిజనులు. 2నెలలు క్రితం ఇదే గ్రామానికి చేందిన గర్భిణీ  సాహుశాంతిని డోలికట్టి మెయిన్ రోడ్డుకు తీసురాగా..  వారం రోజులు క్రితం పోయిరి దారప్పను డోలికట్టి తీసుకు వచ్చామమిన..నేడు వ్రుద్ధురాలిని డోలికట్టి తీసు వస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు. 

శారదా నది ప్రవాహం ఎక్కువ అయితే ప్రాణాలు ఏటవతలే పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.  ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు ఇంత దారుణమైన ఇబ్బదులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి,వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమండలంలోని ఈ ఓక్కగ్రామమే కాదని పూలగరువు కోడాపల్లి రామాన్నపాలెం,బుచ్చపాలెం తాటిపూడి  వీరబద్రపేట నేరేళ్ళపూడి  గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు సౌకర్యాలు లేక గిరిజనులకు నానాపాట్లు పడుతున్నారని అన్నారు. ఈ గ్రామాలకు లింక్ రోడ్లు సౌకర్యం కల్పించండి మహాప్రభో మంత్రి గారు అంటూ గిరిజనులు మోరపెట్టు కున్నా ఫలితం నేటికీ కనిపించడం లేదన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి75 ఏళ్లు పూర్తవుతున్నా..నేటి తమ గ్రామాలకు మాత్రం రోడ్డు సౌకర్యం కలగలేదని.. మారుమూల గిరిజనుల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదని అంటున్నారు. ఎవరి ఆరోగ్యం బాగలేక పోయిన చిన్న పిల్లలు,ముసలి వారిని గర్బిని స్త్రీలను డోలిమోతలతోనే మోసుకోని మేయిన్ రోడ్డుకు తీసుకురావసి వస్తుందని చెబుతున్నారు. నేరెళ్ళపూడి, బలిపురం, తాటిపూడి, మదన గరువు గ్రామాలుయెక్క గిరిజనులు పరిస్థితిని అర్ధం చేసుకొని ప్రభుత్వం తక్షణమే రోడ్లు వేయించాలని గిరిజనులు ముక్త కంఠంతో కోరుతున్నారు. 

Devarapalli

2022-07-28 06:56:35

Sankavaram

2022-07-19 18:21:00

నిర్మాణాల్లో అధికారులు లక్ష్యాలు సాధించాలి

ఇంజినీరింగ్ శాఖలు తమ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనేంట్ నిధులతో జరుగుతున్న పనులపై సంబంధిత ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. మెటీరియల్ కాంపోనేంట్ నిధులను విడుదల చేయడం జరిగిందని పనులు పురోగతి కనిపించాలని ఆయన పేర్కొన్నారు. సిమెంట్, ఇతర సామాగ్రి పంపిణీ జరిగిందని తమ అధీనంలో జరుగుతున్న పనులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన చెప్పారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనేంట్ నిధులతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొంటూ భవనాల నిర్మాణం పూర్తి చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఒక మౌళిక సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఎక్కువ పనులు పూర్తి చేసామనే సంతృప్తి పొందాలని సూచించారు. మెటీరియల్ కాంపోనేంట్ నిధులు గ్రామీణ ప్రాంతాలకు వరమని దానిని సద్వినియోగం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా. ఎం.వి.జి కృష్ణాజి, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జి. మురళి, వివిధ శాఖల ఉప కార్యనిర్వాహణ ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

2022-07-19 15:15:23

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు

పశ్చిమగోదావరి జిల్లాలో వరదలు, భారీ వర్షాలు కారణంగా వరద తాకిడిగురై నీరు తొలగిన అనంతరం సహాయ చర్యలు ముమ్మురంగా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వరద నీరు తగ్గిన గ్రామాల్లో మంగళవారం సాయంత్రం నాటికి ఐదు రకాల నిత్యసర వస్తువులను అన్ని గృహాలకు అందజేయడం జరిగిందన్నారు.  అలాగే 3,107 వరద బాధిత కుటుంబాలకు సుమారు రూ.62 లక్షలు నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామన్నారు.  మిగిలి ఉన్న లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ నెంబర్లను సచివాలయ సిబ్బంది ద్వారా సేకరిస్తున్నామని, పూర్తి వివరాలు అందిన వెంటనే వారి కుటుంబాలకు కూడా నగదును జమ చేయడం జరుగుతుందన్నారు. 22 గ్రామపంచాయతీలలో వరద ప్రభావం ఉందని ఆయా పంచాయతీల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వీటిలో ఆచంట మండలంలో నాలుగు, ఎలమంచిలి మండలంలో 15, నరసాపురం మండలంలో మూడు పంచాయతీలు ఉన్నాయన్నారు.

 పారిశుద్ధ్య పనుల కొరకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు.  పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణకు 22 మంది పర్యవేక్షణ అధికారులు, 44 మంది సూపర్వైజర్లును, నిర్వహణకు 370 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించడం జరిగిందన్నారు.  14,655 కె.జిల బ్లీచింగ్, 34,465 కె.జిల  సున్నం, 380 లీటర్ల పినాయిల్, 54 స్ప్రేలు, 27 ఫాగింగ్ మిషన్స్ సిద్ధం చేయడం జరిగిందన్నారు.  అలాగే విద్యుత్ అంతరాయం కలిగిన ప్రాంతాల్లోని  ఇప్పటివరకు 15 గ్రామాల్లో విద్యుత్తును  పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 1,92,199 ఆహార పొట్లాలు, 11,21,500 వాటర్ ప్యాకెట్లు, 35.595 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,424 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 7 మెట్రిక్ టన్నుల, బంగాళదుంపలు, 1,424 లీటర్లు  పామాయిల్, 7 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు, 8,196 లీటర్లు పాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.  ఆచంట, యలమంచిలి, నరసాపురం, పెనుగొండ మండలాల్లోని 6,933 పశువులకు 162.45 టన్నుల పశుగ్రాసాన్ని అందజేయడం జరిగిందన్నారు.

Bhimavaram

2022-07-19 15:12:48

వరినారుమడి విధానం తప్పకపాటించాలి

వరి నారుమళ్లు తయారీలో రైతులు జాగ్రత్తలు పాటించాలని శంఖవరం మండల వ్యవసాయ అధికారి పడాల.గాంధీ సూచించారు. మంగళవారం అన్నవరం లో రైతులతో నారుమళ్లు తయారీ, విత్తనాలు వేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికా మాట్లాడుతూ,  ఐదు సెంట్ల నారు మడిలో 5కిలోల యూరియా, 6కిలోల సూపర్ ఫాస్ఫేట్, 2కిలోల పొటాష్ వేసుకుని కలియ దున్నిన తరువాత మాత్రమే 20కిలోల విత్తనాలు చల్లుకోవాలని సూచించారు. ఐదు సెంట్ల నారుమడి ఒక ఎకర పొలంలో నాట్లు వేసుకోడానికి సరిపోతుందన్నారు. వ్యవసాయ క్షేత్రంలో రైతులకు సూచనలు, సలహాల కోసం గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకుల సహకారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా ఇచ్చిన సూచనలు, సలహాలు పాటించడం ద్వారా మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మణికంఠ,రైతులు పాల్గొన్నారు.

Annavaram

2022-07-19 13:37:35