1 ENS Live Breaking News

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీతంపేట ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.నవ్య వైద్యులను ఆదేశించారు. పాలకొండ ఏరియా హాస్పిటల్ ని ఐటీడీఏ పీఒ నవ్య మంగళ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యం అందిస్తున్న తీరు ముఖ్యంగా పేదలకు వైద్యం అందుతున్న తీరును ఆరాతీశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు ఆదేశించారు. మలేరియా, టైఫాయిడ్, అతిసార, డెంగ్యూ కేసులు అధికంగా వచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులకు చికిత్స అందించడం కోసం అవసరమగు మందులు సిద్ధం చేయాలని ఆమె సూచించారు. దోమలు వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. దోమల నివారణకు స్ప్రేయింగ్ పక్కాగా జరగాలని, దోమ తెరలు వినియోగించాలని ఆమె పేర్కొన్నారు. మునిసిపాలిటి, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని ఆమె ఆదేశించారు. తాగు నీటి వసతులను క్లోరినేషన్ చేయాలని సూచించారు.

 సచివాలయం సిబ్బంది తమ పరిధిలో పారిశుధ్యం, క్లోరినేషన్, దోమల నివారణ, త్రాగు నీరు, ఆహార పదార్థాల వినియోగం తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. రానున్న మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.  పాలకొండ నగర పంచాయతీ పరిధిలో లంబూరు జగనన్న హౌసింగ్ ఇళ్ళను ప్రాజెక్టు అధికారి పరిశీలించారు. నిర్మాణాలు వేగవంతం చేయాలని  పాలకొండ నగర పంచాయతీ కమిషనర్  రామారావును ఆదేశించారు. హౌసింగ్ బిల్లులు అందించాలని ఆదేశాలు జారీ జేశారు.  నగర పంచాయతీ కమిషనర్ రామారావు మాట్లాడుతూ  ప్రతి వార్డు లో పర్యటించి  ఇళ్ల నిర్మాణాలు  పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ జె. రవీంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు

Palakonda

2022-07-19 12:19:44

పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లు పరిశీలన

రాజమహేంద్రవరం రూరల్ లోని ధవళేశ్వరం పునరావాస కేంద్రంలో ముంపు ప్రాంతాలలోని కుటుంబాలకు వసతి ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. మంగళవారం  మధ్యాహ్నం  ధవళేశ్వరం లోని వాడపేట ఎంపిపి పాఠశాల లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాసితులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ,  పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఇంటిని తలపించేలా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిర్వాసితులు వారి ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వచ్చినందున చక్కని ఆహారం, దుప్పట్లు, చక్కని శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వరద బాధితుల ను గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా రూ .2 వేలు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు 25 కేజీలు బియ్యం, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజి బంగళా దుంప,, ఐదు రకాల కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందచేయాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ పునరావాస కేంద్రాల ఏర్పాట్లలో అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు, సచివాలయ వాలంటీర్ వ్యవస్థలు మెరుగైన పనితీరు చూపుతున్నారని మాధవీలత పేర్కొన్నారు. వరదల సమయంలో వాలంటీర్లు పనితీరును కలెక్టర్ ప్రశంసించడం జరిగింది. పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించడం, గోదావరి గట్లు తెగిపోకుండా చూడడంలో, సమాచార లోపం రాకుండా అధికారులతో సమన్వయం తో చక్కటి పనితీరు చూపినట్లు పేర్కొన్నారు. నిర్వాసితులతో కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాలలో అందుతున్న సౌకర్యాల పై ఆరా తీసి, వారితో కలిసి కలెక్టర్, రూడా చైర్ పర్సన్ లు  భోజనం చేశారు. ఏర్పాట్ల పట్ల నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పునరావాస కేంద్రంలో ఉన్న నిర్వాసితులకు నిత్యవసర వస్తువులు నగదు పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ రత్నకుమారి, తదితరులు ఉన్నారు.

Dhavaleswaram

2022-07-19 11:45:20

వరదలు తగ్గేవరకూ బాధితులు ఇక్కడే ఉండాలి

గోదావరి వరద పూర్తి స్థాయిలో యధా స్థితికి వచ్చే వరకు బాధితులు పునరావాస కేంద్రాల్లో  ఉండాలని ,అన్ని సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వ చీఫ్ విఫ్, శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు, జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి కోరారు. మంగళవారం నరసాపురం 29 వార్డు అరుంధతి పేట,4 వ వార్డు పొన్నపల్లి ,గోదావరి ఎటుగట్లను, మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడుతున్న విధానాన్ని, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ముదునూరి. ప్రసాద రాజు  మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకు వెళ్ళుట,వారు పరిస్థిని అడిగితెలుసు కునుట వారి ఆదేశాలు ,జిల్లా యంత్రాంగం అంతా మాకాం వేసి వరద సహాయ కార్యక్రమాలల్లో నిమగ్నఅగుట బాధితులకు ధైర్యం భరోసా కల్పించామని ఆయన అన్నారు.  లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించడం వారికి అవసరమైన పాలు , మంచినీరు , బిస్కెట్లు  భోజనం అందించడం ప్రతి రోజూ జరుగుతుందని ఆయన తెలిపారు.ముంపుకు గురైన బాధితులకు త్వరగా నిత్యవసర వస్తువులు, ప్రభుత్వం నుంచి అందుతున్న నగదు సహాయం లబ్దిదారులందరికీ చేరే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింటు కలెక్టర్ జె వి మురళిని ఆయన  కోరారు. ఎటుగట్లు బలహీనంగా  ఉన్నట్లు గుర్తించి వాటిని పటిష్ఠం చేయడం జరిగిందని ,పకృతికి ఎవ్వరూ ఎదురు వెళ్లలేమని అయితే ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా , అస్థి తది తర నష్టాలు కొంతవరకు తగ్గించగలిగామని ప్రసాదు రాజు తెలిపారు.

జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి మాట్లాడుతూ అధికారులు, వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ప్రతి ఒక్క లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. అతి తక్కువ సమయంలో వారికి చేరుకుంటాయి అన్నారు. వీఆర్వోలు , పంచాయతీ సెక్రటరీ తది తర సిబ్బంది అందరూ గ్రామాల్లో ,పునరావాస కేంద్రాల్లో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు.శానిటేషన్  ,డ్రింకింగ్ వాటర్ , వైద్యంపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. మండలాలలో, గ్రామాలలో ఏదైనా సమస్య వచ్చినట్లయితే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నెంబరు 08816299189  కి ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన కోరారు.గోదావరి ఏటు గట్లు బలహీనంగా ఉన్నవి గుర్తించి వాటిని పటిష్ట పరిచామని ఎవరూ భయంందోళన చెందనవసరం లేదని, ప్రజలంతా  అధికారులు సూచనలు సలహాలు పాటించాలని  జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి కోరారు. ఈ పర్యటనలో నరసాపురం సబ్ కలెక్టరు సి. విష్ణు చరణ్, భీమవరం ఆర్ డి వో  దాసి రాజు, మున్సిపల్ చైర్పర్సన్  బర్రి. శ్రీవెంకట రమణ, తహశీల్దారు యస్ యం ఫాజిల్, కౌన్సిలరు సిర్రా.కాంతమ్మ, దొంగ మురళి కృష్ణ , తది తర వార్డు కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.

Narsapur

2022-07-19 11:40:18

వరద బాధితులందరికీ ప్రభుత్వ సహాయం

గోదావరి పరివాహ ప్రాంతాలలో ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్న ట్లు వరదల  ప్రత్యేక అధికారి కార్తికేయ మిశ్రా తెలిపారు.  మంగళవారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో వరదల  ప్రత్యేక అధికారి కార్తికేయ మిశ్రాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వరద బాధితుల సహాయ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ప్రత్యేక అధికారి కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ చింతూరు, ఎటపాక, కూనవరం, వి ఆర్ పురం, మండలాలలో వరద బాధితులకు తక్షణ సహాయం కింద ముందుగా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని  పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయలు, ఇద్దరు, అంత కన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఉన్న కుటుంబాలకు రెండు వేల రూపాయలు చొప్పున బాధితులకు అందజేయడం జరుగుతుందని వివరించారు.  అదేవిధంగా వరద ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు  25 కేజీల బియ్యం, కేజీ పామ్ ఆయిల్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కిరోసిన్, బ్లాంకెట్స్, టార్ఫాలిన్స్, పాలు, బిస్కెట్స్, తదితర నిత్యవసర వస్తువులు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు.  రాజమండ్రి, కాకినాడ, నుండి 190 మందిని పారిశుధ్య కార్మికులను వరద ప్రాంతాలకు తీసుకురావడం జరిగిందని, వారిని కూనవరం, యాటపాక, వి ఆర్ పురం,  చింతూరు మండలాల్లో  పారిశుద్ధ్యం నిర్వహణకు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. 

ఈ నాలుగు మండలాల్లోని  ప్రతి గ్రామంలో త్రాగునీరు ఏర్పాటు చేయడం  జరుగిందని పేర్కొన్నారు, అదేవిధంగా ప్రతి గ్రామంలో బోర్లు మరమ్మతులను  వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ప్రత్యేక అధికారి ఆదేశించారు.  ముంపునకు గురైన అన్ని గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా  తగు చర్యలు తీసుకోవాలని,  మండల కేంద్రాల్లో 104 వాహనం ద్వారా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా ముంపునకు గురైన అన్ని గ్రామా సచివాలయాలలో ఒక షెడ్యూల్ తయారుచేసి ఆ షెడ్యూల్ ప్రకారం వరద బాధితులకు వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ప్రత్యేక అధికారి ఆదేశించారు. వరద పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వైద్యాధికారులు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు.  వరద ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు పదిమంది వైద్యాధికారులు అవసరం ఉందని డిఎంహెచ్ఓ  ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకు వచ్చారు. వరద పరివాహ ప్రాంతాలలో ఎన్ని శాటిలైట్ ఫోన్లు ఉపయోగించుచున్నది ఆరా తీశారు. ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఫైర్ సర్వీస్ శాఖల ద్వారా  వరదలు తగ్గిన వెంటనే రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్లుఫై ఉన్న మట్టిని, బురదని, తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను  ఆదేశించారు. అదేవిధంగా వరద బాధితులకు సహాయ సహకార అందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అధికారులకు గదికి 20 బెడ్లు చొప్పున ఏర్పాటు చేయాలని   ఆదేశించారు. 

    ఈ సమావేశంలో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్  కుమార్, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కిషోర్, చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, రామశేషు,  డిఆర్ఓ బి దయానిధి, జిల్లా పంచాయతీ అధికారులు టి కొండల రావు, కాకినాడ డిపిఓ నాగేశ్వరరావు నాయక్, అదనపు డిఎంహెచ్వో పుల్లయ్య, గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, చింతూరు తాసిల్దార్ రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.                                 

Chinturu Bridge

2022-07-19 09:29:40

అర్హతే ప్రామాణికంగా పేదలకు సంక్షేమ పథకాలు

తూర్పుగోదావరి జిల్లాలో ఏ ప్రభుత్వ పథకమైనా పొందాలంటే అర్హతే ప్రామాణికం అని ఆ దిశలో లబ్దిదారుల గుర్తింపు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో నవరత్నాలు - ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ , లబ్దిదారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఏ కారణం చేతనైనా ప్రభుత్వం అందించే పథకాలు అర్హులకు  చేరిఉండకపోతే ద్వై వార్షిక కార్యక్రమంలో భాగంగా అందచెయ్యడం జరుగుతోందన్నారు.   వృధ్యాప్య, వితంతు, దివ్యంగుల తదితర పథకాలు అమలు నిరంతర ప్రక్రియ అని తెలిపారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు పొందకుండా ఉంటే అటువంటి వారి వివరాలు గ్రామ/వార్డ్ సచివాలయ సిబ్బంది /  వాలంటీర్  వ్యవస్థ ద్వారా ఇంటింటికీ తిరిగి గుర్తించడం జరుగుతుందన్నారు. ఆ దిశలోనే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందని వారిని ద్వై వార్షిక కార్యక్రమంలో లబ్దిదారుల గుర్తింపు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

 వై ఎస్ ఆర్ సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద జిల్లాలో కొత్తగా 12,997 మందిని గుర్తించి మంజూరు చెయ్యడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 479 మందికి సివిల్ సప్లై శాఖ ద్వారా బియ్యం  కార్డులను,  వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను  కొత్తగా ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కొత్తగా 1697 మంది తల్లులకు అమ్మఒడి మంజూరు చేశామన్నారు. జిల్లాలో జగనన్న తోడు, వై ఎస్ ఆర్ చేయూత, ఆసరా, సున్న వడ్డీ కింద సుమారు 19 వేలకు పైగా లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. సాంకేతిక కారణాల వలన, తదితర కారణాల వల్ల అర్హులకు పథకాలు పొందకుండా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.  ఇంకా అర్హులు ఉండి సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, తదితర పథకాలు రాకపోతే సంబంధించి వాలంటీర్ ద్వారా తిరిగి ధరఖాస్తు చేసుకోవాలని మాధవీలత సూచించారు. వారి సమస్యను పరిశీలించి, పరిష్కారం చేసి, ప్రతి ఆరునెలల కి ఒకసారి ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా 12997 మందికి వై ఎస్ ఆర్ పెన్షన్ కానుకగా రూ 3,24,92,500/- మెప్మా ద్వారా బ్యాంకు రుణాలు 757 గ్రూపులకు రూ.29,91,796/-,  479 మందికి కొత్త రేషన్ కార్డులు అందచేశారు.                                    

2022-07-19 09:22:04

ఘనంగా విప్లవ వీరుడు మంగళ్ పాండే జయంతి

కాకినాడ  సర్పవరం జంక్షన్ లో శ్రీరామ నామ క్షేత్రం, ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో భారతమాత ముద్దుబిడ్డ, విప్లవ వీరుడు మంగళ్ పాండే జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా  ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్  మాట్లాడుతూ 1827 జూలై 19న మంగల్ పాండే ఉత్తరప్రదేశ్లో జన్మించారని అన్నారు.  1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ  సైన్యంలో చేరాడని అన్నారు. భారత జాతి పౌరుషాన్ని బ్రిటిష్ వారికి రుచి చూపించిన దీశాలి, దేశభక్తుడు  మంగల్ పాండే అన్నారు. బ్రిటిష్ అధికారులపై దాడి చేసిన మొదటి భారతీయ సైనికుడు పాండే అన్నారు. 1857 ఏప్రిల్ 8న బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ఉరి తీసింది అని అన్నారు. అతని స్మారక చిహ్నంగా భారత ప్రభుత్వం 1984లో   తపాలా బిళ్ళను విడుదల చేసిందని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా, అడబాల రత్న ప్రసాద్,  బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.         

Kakinada

2022-07-19 09:18:59

కంటి వ్యాధుల నివారణకు ప్రభుత్వం కృషి

వృద్ధాప్యంలో వచ్చే కంటి వ్యాధులను నివారించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కంటి వెలుగు పథకం కింద ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ తో పాటు  కంటి శుక్లాల తొలగింపుకు చర్యలు చేపట్టారని పండురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంటి వైద్యులు డిజి మహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో బోట్ క్లబ్ వాకర్సు సంఘం ఆధ్వర్యంలో వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 నుంచి 60 సంవత్సరాలు నిండిన వారికి మండల పరిధిలో రోజుకు ఒక ప్రాంతంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఏఎన్ఎం సిహెచ్. అమ్మాజీ మాట్లాడుతూ వైయస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు సమకూరుస్తున్నట్లు తెలిపారు. కంటికి ఆపరేషన్లు అవసరమైన వారిని ప్రభుత్వాసుపత్రికి పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, పట్నాయక్, రాజా, బాపిరాజు, ఆశా కార్యకర్తలు బి. వరలక్ష్మి, జి. నాగలక్ష్మి, పి. సుబ్బలక్ష్మి, జి. వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో  వృద్ధులు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.               

Kakinada

2022-07-19 08:36:24

ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఆర్థిక భద్రత

ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుకు ప్రభుత్వ బ్యాంకులలో పూర్తి భద్రత లభిస్తుందని ఇండియన్ బ్యాంకు విశ్రాంతి ఉద్యోగి ఎంపీవి ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో  బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన  కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బ్యాంక్ అంటే డిపాజిట్లను స్వీకరించడం, అవసరమైన వారికి రుణాలు ఇవ్వడానికి లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థ అని అన్నారు. ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని నియంత్రించడానికి, సాంఘిక సంక్షేమం కోసం 1969 జూలై 19న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలోని 85% బ్యాంకు డిపాజిట్లు కలిగిన 14 ప్రధాన బ్యాంకులను జాతీయం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారని అన్నారు. ప్రభుత్వ బ్యాంకులలో డిపాజిట్లు చేయడం వలన కొద్దిగా వడ్డీ తగ్గినా  నిశ్చింతగా ఉండవచ్చు అన్నారు. ప్రైవేట్ బ్యాంకు యాజమాన్యాలు లాబాపేక్షతో పనిచేస్తాయన్నారు. అదేవిధంగా డిపాజిట్ దారులకు భద్రత కూడా కొరవడుతుందని అన్నారు. జాతి నిర్మాణంలో ప్రభుత్వ బ్యాంకులు ఎల్లప్పుడు తోడ్పాటు అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్రస్థాయిలో విజవంతం కావడానికి జాతీయ బ్యాంకులు ఎంతగానో తోడ్పడుతున్నాయని ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీవి ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ పట్నాయక్, రాజా, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.                     

Kakinada

2022-07-19 08:34:14

ఎవరికీ ఇబ్బంది లేకుండా సత్వర చర్యలు

తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు స్థానిక ఆర్యపురం, తుమ్మలావ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన ప్రాంతాల్లో కమీషనర్ కె.దినేష్ కుమార్ ,ఇంజినీరింగ్ అధికారులు సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సమస్యకు పరిష్కారం దిశ గా యుద్ధప్రాతిపదికన నగరపాలక సంస్థ చర్యలు చేపట్టినట్టు కమీషనర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. 250 హార్స్ పవర్ మోటార్ ను నల్లా ఛానెల్ వద్ద ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మురుగు నీటిని పంపింగ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నల్లా ఛానెల్ దగ్గర లో ఉన్న ఎ. బి. నాగేశ్వర రావు పార్క్ ను అత్యవసర సమయం లో రిజర్వాయర్ గా ఉపయోగించాలని సూచించారు.  వరద నీరు తగ్గిన వెంటనే పేరుకుపోయిన బురద, మురుగు ను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. అనంతరం అంటూ వ్యాధులు ప్రబలకుండా  శానిటేషన్ సిబ్బంది బ్లీచింగ్ చల్లాలని ఆదేశించారు. వరద ఉధృతి తగ్గే వరకూ ప్రత్యేక సిబ్బంది ని ఈ ప్రాంతంలో నియమిస్తున్నట్టు కమీషనర్ తెలిపారు. కమీషనర్ వెంట ఎస్ ఈ పాండు రంగారావు, ఎమ్ హెచ్ ఓ వినూత్న, ఇతర ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-18 12:57:45

బూస్టర్ డోస్ తప్పక వేయించుకోవాలి

కోవిడ్ నియంత్రణలో భాగంగా 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ కోవిడ్ బూస్టర్ డోస్ టీకా తప్పనిసరి గా వేయించుకోవాలని కత్తిపూడి గ్రామ సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ  సూచించారు. కాకినాడ జిల్లాలోని  శంఖవరం మండలం లోని కత్తిపూడి గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సర్పంచి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో  రెండు డోస్ లు తీసుకున్న ప్రతీ ఒకరు బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.  జూలై15 నుంచి 75 రోజుల పాటు నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే 60 సంవత్సరాల వయస్సు దాటిన వారికి బూస్టర్ డోస్ ను వైద్య సిబ్బంది అందిస్తున్నారన్నారు.  వీరితో పాటు 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గలవారందరూ  ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాస్, హెవి ధనలక్ష్మి, ఏఎన్ఎం నాగమణి, యమ్ ఎల్ హెచ్ పి మాధవి లత పంచాయతీ  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-07-18 12:06:17

సచివాలయాల్లోనూ పన్నులు చెల్లించవచ్చు

వార్డు స‌చివాల‌యాల్లో కూడా మున్సిప‌ల్ ప‌న్నులు చెల్లించే అవ‌కాశం ఉంద‌ని, ఈ మేర‌కు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, ప‌న్నులు క‌ట్టించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి సూచించారు. విజయనగరంలోని పాల్‌న‌గ‌ర్‌, అయ్య‌న్న‌పేట ప్రాంతాల్లో ఉన్న 51,52 వార్డు స‌చివాల‌యాల‌ను క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి సోమ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆమె ముందుగా ఆయా స‌చివాల‌యాల రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. స్థానికుల‌తో మాట్లాడి, స‌చివాల‌య సిబ్బంది ప‌నితీరును, వారు అందిస్తున్న సేవ‌ల‌ను తెలుసుకున్నారు. వివిధ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ఆరా తీశారు. స్పంద‌న విన‌తుల‌ను ప‌రిశీలించారు. స‌చివాల‌యాల్లో కూడా మున్సిప‌ల్ ప‌న్నులు వ‌సూలు చేయాల‌ని, రైల్వే టిక్కెట్ బుకింగ్ త‌దిత‌ర‌ సేవ‌ల‌ను అందించాల‌ని సూచించారు. ఇంటి ప్లానుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం స‌చివాల‌యాల్లో కూడా ఉంద‌ని, దీనికి ప్రాచుర్యం క‌ల్పించాల‌ని సూచించారు. ఆయా స‌చివాల‌యాల ప‌రిధిలోని పాఠ‌శాల‌లు, అంగ‌న్‌వాడీ కేంద్రాల‌పై ఆరా తీశారు. అంగ‌న్‌వాడీ కేంద్రాల్లోని పిల్ల‌లు, గ‌ర్భిణ‌లు, బాలింత‌ల సంఖ్య‌, వారికి అందిస్తున్న సేవ‌లు, ర‌క్త ప‌రీక్ష‌లు, వేక్సినేష‌న్‌, పోష‌కాహార పంపిణీపై ప్ర‌శ్నించారు. సంబంధిత రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. గ‌ర్భిణులంతా ప్ర‌తిరోజూ అంగ‌న్‌వాడీ కేంద్రానికి వ‌చ్చి భోజ‌నం చేసేలా వారిని చైత‌న్య ప‌ర‌చాల‌ని సూచించారు. స‌ఖి గ్రూపులకు నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను తెలుసుకున్నారు. స్పోర్ట్స్ క్ల‌బ్లుల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు.  52వ స‌చివాల‌యంలో ఆధార్ సేవ‌ల‌ను ప‌రిశీలించారు. ఆయా స‌చివాల‌యాల్లో నిర్వ‌హిస్తున్న పారిశుధ్య ప‌నులు, స్ప్రేయింగ్‌, చెత్త నిర్వ‌హ‌ణ త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌పై ఆరా తీశారు. పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ త‌నిఖీల్లో మున్సిప‌ల్ స‌చివాల‌యాల స‌మ‌న్వ‌యాధికారి హ‌రీష్ పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-18 11:11:37

28 గ్రామాల ప్రజలకు 30 పునరావాసా కేంద్రాలు

వరదల వల్ల ధవలేశ్వరం దగ్గర 27 లక్షల క్యూసెక్కులు నీరు రావడం వల్ల పశ్చిమగోదావరి జిల్లా లో మూడు మండలాలలోని 28 గ్రామాలకు ప్రభావం చూపిందని ఈ గ్రామాలలోని ప్రజలను 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ  కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , వరద  ఉపశమనం పునరావాస ప్రత్యేక అధికారి  ప్రవీణ్ కుమార్  తెలిపారు.  సోమవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో  వరద ప్రభావిత గ్రామాలలోని ప్రజల  కోసం 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ,  పునరావాస కేంద్రాలకు ప్రజలను  తరలించడం జరిగిందని , పునరావాస కేంద్రాలకు రానివారందరికి  ఆ గ్రామాలలోని టిఫిన్ , మధ్యాహ్న భోజనం  ,రాత్రి భోజనం,  మంచినీరు ,  నిత్యవసర వస్తువులు 25 కేజీల బియ్యం , ఒక కేజీ కందిపప్పు ,  ఒక కేజీ ఆయిల్ , కేజీ టమాట , కేజీ ఉల్లిపాయలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.  ప్రస్తుతం వరద స్థాయి తగ్గుతున్నందున గ్రామాలలో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వచ్చే 48 గంటల్లో ప్రత్యేకమైన  పరిశుద్య కార్యక్రమాలు , హెల్త్ క్యాంపులు నిర్వహించి గ్రామాలలోని మంచినీరు ట్యాంకులను శుభ్రం చేయడం , స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. 

   వరద ప్రభావ ప్రాంతాలలోని ప్రతి కుటుంబానికి  రెండు వేల రూపాయలు చొప్పున వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే వరద ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నిమగ్నమై ఉన్నదని ఆయన తెలిపారు.  పునరావాస కేంద్రాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ వసతులు సమకూర్చడం జరిగిందని తెలిపారు.పొన్నపల్లి లో ఏటిగట్టు కోతకు గురవుతున్నందున  దానిని పటిష్ట పరిచేందుకు   ప్రణాళిక రూపొందించడం జరిగిందని , దానికి అంచనాలతో రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. వాటర్ ట్యాంకులు కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుందని, వచ్చే ఐదు రోజులు పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రెండు , మూడు రోజులు ప్రజలు కూడా సహనంతో ఉండి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.  వరద పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రెండు కోట్ల రూపాయలు అదనంగా కలెక్టర్ గారు అడిగారాని  వేను వెంటనే  ముఖ్య మంత్రి  రూ.  2 కోట్లు  మంజూరు ఉత్తర్వులు జారీ చేశారని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని యలమంచిలి, ఆచంట, నరసాపురం మండలంలోని 28 లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించడం జరిగింది వారికి అవసరమైన పాలు ,  మంచినీరు , బిస్కెట్లు  భోజనం   ఇంటి వద్ద ఉన్న వారికి కూడా అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లాలో 38 ప్రాంతాలలో గట్లు బలహీనంగా  ఉన్నట్లు గుర్తించి వాటిని పటిష్ఠం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.అయా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. వీఆర్వోలు , పంచాయతీ సెక్రటరీ తది తర సిబ్బంది అందరూ గ్రామాల్లో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తూ  సమాచారం  జిల్లాలోని కంట్రోల్ రూమ్ కు తెలియజేయడం జరుగుతుందని, అక్కడ నుండి మానిటర్ చేసి అన్ని వసతులు సమకూర్చడం జరుగుతుందని ఆమె తెలిపారు. వచ్చే 48 గంటల్లో సానిటేషన్  ,డ్రింకింగ్ వాటర్ , వైద్యంపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. మండలాలలో, గ్రామాలలో ఏదైనా సమస్య వచ్చినట్లయితే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నెంబరు 08816299189  కి ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టరు  పి.ప్రశాంతి తెలిపారు. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి తదితరులు పాల్గొన్నారు.

Narsapur

2022-07-18 10:33:59

నట మాంత్రికుడు ఎస్వీ రంగారావు..

ఏ పాత్రలోనైనా ఇట్టే  ఒదిగిపోయే నటమాంత్రికుడు ఎస్వీ రంగారావు అని వాకర్స్ జిల్లా చైర్ పర్సన్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని సర్పవరం జంక్ష బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ఎస్వీ రంగారావు 48 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎస్వీ రంగారావు 1918 జూలై మూడున నూజివీడులో జన్మించారన్నారు. గంభీర స్వరం,  ఆహార్యం, రాజసం ఆయన సొంతమన్నారు. ఏ పాత్ర చేసినా  తనదైన  విశ్వరూపం ప్రదర్శించే వా రని అన్నారు. తన మార్కు నటనను  పాత్రలో ఇనుముడింపజేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయన లేని లోటు ఇంతవరకు ఏ నటుడు తీర్చలేనిదన్నది స్పష్టమని అడబాల తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా, సత్యనారాయణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2022-07-18 08:42:21

వరద ప్రాంతాల్లో మెరుగైన ఏర్పాట్లు చేశాం

వరద తాకిడి గురైన ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి తెలిపారు. జిల్లాలో 28 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో ఆచంట మండలంలో  9,  యలమంచిలి మండలంలో 15,  నరసాపురం మండలంలో 4 ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఆచంట మండలంలోని 9 పునరావాస కేంద్రాలలో వున్న 1,360 మందికి ఉదయం  టిఫిన్,  4,500 మందికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని,  యలమంచిలి మండలంలోని 15 పునరావాస కేంద్రాలలో 6,124 మందికి ఉదయం  అల్పాహారం,  7, 350 మందికి మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. నరసాపురం మండలంలోని  4 పునరావాస కేంద్రాలలో 955 మందికి ఉదయం అల్పాహారం, 1095 మందికి  మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుచున్నదని  తెలిపారు .   యలమంచి మండలంలో 1368 మంది పిల్లలకు 3,000 బ్రెడ్ ప్యాకెట్లు,  499 మంది పిల్లలకు 4,568 బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం జరిగిందని ,  ఆచంట మండలంలో 280 మంది పిల్లలకు 2,768 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగిందని,  నరసాపురం మండలంలో 132 మంది పిల్లలకు 264 బ్రెడ్ ప్యాకెట్లు,  26 మందికి పిల్లలకు  240 బిస్కెట్ ప్యాకెట్లు మొత్తం మూడు మండలాలలో 7500 బిస్కెట్ ప్యాకెట్లు,  3,000 బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.చిన్న పిల్లలు కలిగిన కుటుంబాలకు రెండు లీటర్లు, మామూలు కుటుంబాలకు ఒక లీటర్ చొప్పున మొత్తం 13,898 కుటుంబాలకు 16,198  లీటర్ల పాల ప్యాకెట్లు అందజేయడం జరిగిందన్నారు. వాటిలో ఆచంట మండలం 1,712 కుటుంబాలకు 1,992, యలమంచిలి మండలంలో 10,710 కుటుంబాలకు 12,572 ప్యాకెట్లు ,  నరసాపురం మండలంలోని 1,476 కుటుంబాలకు   1,634  పాల ప్యాకెట్లు  అందజేయడం జరిగిందని ఆమె వివరించారు.

వీటితోపాటు పశువులకు మేతకు సంబంధించి ఆచంట మండలంలో 2,955 పశువులకు 33 టన్నుల పశుగ్రాసం, యలమంచిలి మండలంలో 2,606 పశువులకు 78.5 టన్నులు , నరసాపురం మండలంలో 116 పశువులకు  3.45 టన్నుల పశుగ్రాసం , పెనుగొండ మండలంలో 647 పశువులకు 18 టన్నుల పశుగ్రాసం పంపిణీ చేయడం జరిగిందని మొత్తం 6,324  పశువులకు 132.95 టన్నుల పశుగ్రాసం అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు.  వరద ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు 75 బోట్లను,134 మంది గజఈ తగాళ్లను సిద్దంగా ఉంచడం జరిగిందని, దీనిలో  యలమంచిలి మండలం కనకాల లంకలో 15 బోట్లు, 30 మంది గజ ఈ తగాళ్ళు,  పెదలంకలో 5 బోట్లు,  10 మంది గజ ఈతగాళ్ళు ,  ఎలమంచిలి లంకలో 7 బోట్లు 14 మంది గజఈతగాళ్లు ,  దొడ్డిపట్లలో 2 బోట్లు 4గజ ఈతగాళ్ళు ,  లక్ష్మీపాలెంలో 3  బోట్లు 6 గజఈతగాళ్ళు ,  గంగడ పాలెం లో 1 బోటు 2 గజఈతగాళ్ళు , వైబి లంక బడవలో 7 బోట్లు 14 మంది గజ ఈతగాళ్లు,  ఆచంట మండలంలోని బడ్డేవారి పేటలో  2 బోట్లు నలుగురు గజ ఈతగాళ్ళు,  పల్లెపాలెంలో 6 బోట్లు 12 మంది గజ ఈతగాళ్ళు , మర్రి మూల గ్రామంలో 3  బోట్లు 6 గజ ఈతగాళ్ళు, పుచ్చలంకలో 6 బోట్లు 12 మంది గజ ఈతగాళ్లు,  అయోధ్య లంకలో 6 బోట్లు 12 మంది గజ ఈతగాళ్ళు , కోడేరు లంక పల్లిపాలెంలో 2  బోట్లు, 4 గజ ఈతగాళ్లు ,  పెదమల్లం లంకలో 2 బోట్లు, 4 గజ ఈతగాళ్ళు ను ఏర్పాటు చేయడం జరిగిందని,  వీటితో పాటు మరో 8 బొట్లు అదనంగా అవసరమైనచోట్లకు పంపించేందుకు సిద్ధంగా ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు  ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు.

Achanta

2022-07-16 12:45:25

సచివాలయాల ద్వారా మెరుగైన సేవలందాలి

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగ నర్శింహారావు సూచించారు. శనివారం ఆయన రెండో డివిజన్‌ కృష్ణ నగర్‌లోని సచివాలయాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్‌ కేంద్రాన్ని తనిఖీ చేసారు. ప్రజల సౌకర్యార్ధం కొత్త ఆధార్‌ల నమోదు, 15 ఏళ్ళ లోపు పిల్లల ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేసి, చిరునామాల్లో మార్పులు, ఆధార్‌ సంబంధిత ఇతర సేవలను ఈ కేంద్రం ద్వారా పొందవచ్చని చెప్పారు. తాజాగా ఈ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 188 మంది వినియోగించుకున్నట్లు అదనపు కమిషనర్‌కు సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా ఏడీసీ నాగ నర్శింహారావు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అందించే సేవలన్నింటినీ సచివాలయాల ద్వారా స్థానికంగానే ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఇటీవలే సచివాలయ కార్యదర్శులకు రెగ్యులర్‌ పే స్కేలు కూడా ప్రకటించినందున ప్రతి ఉద్యోగి మరింత బాధ్యతగా పని చేయాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పధకాలు అందడంలో సచివాలయ సిబ్బంది మరింత క్రియాశీలకంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలన్నారు

Kakinada

2022-07-16 12:29:45