రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు,కార్పొరేటు పాఠశాలల నోటీసు బోర్డులో ప్రతీ తరగతికి సంభందించిన పూర్తి ఫీజులు వివరాలు ప్రదర్శించాల్సిందే అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రోజెక్ట్ ఆఫీసర్ అనంతలక్ష్మి, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ శ్రీలక్ష్మి,జిల్లా బాలల సంరక్షణ అధికారి రమణ,ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి శ్రీ చైతన్య,రవీంద్ర భారతి పాఠశాలల్లో ఆయన పర్యటించారు,ముందుగా పాఠశాలల్లో నోటీసు బోర్డ్ ల్లో ఫీజులు వివరాలు లేక పోవడంపై జిల్లా విద్యాశాఖాధికారిని ప్రశ్నించారు, తరగతి గదులు, మరుగు దొడ్లు,మంచినీటి సదుపాయాలు, ఆట స్థలాలు,అగ్నిమాపక నిరోధకాలు, దండనలు, ఉపాధ్యాయుల లైంగిక వేదింపులు, ఫీజులు చెల్లించడంలో ఉన్న తారతమ్యాలు,మానసిక ఒత్తిడులు పైన విద్యార్థులతో మాట్లాడి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు, అనంతరం యుద్ధ ప్రాతిపదికన ఆయా పాఠశాలల్లో నోటీసు బోర్డు ల్లో దగ్గరుండి అతికింప జేశారు,అనంతరం సీతారాం మాట్లాడుతూ క్రమం తప్పకుండా కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలల్లో సందర్శనకు వెళ్లాల్సిన భాధ్యత సంభందిత మండల విద్యాశాఖాధికారులు ఇతర సిబ్బందిపై ఉందన్న విషయం మర్చిపోవద్దని సూచించారు.
అన్ని స్థాయిల పాఠశాలల్లో ఫీజు వివరాలు ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత,భాధ్యత ఆయా పాఠశాలల యాజమాన్యాలపై ఉందని అన్నారు, జిల్లాలోని అన్ని పాఠశాలలను తక్షణమే తనిఖీలు చేపట్టి ఫీజుల వివరాలు అతికించేలా విద్యా శాఖాధికారి చర్యలు చేపట్టాలని సూచించారు, పాఠశాలల్లో సదుపాయాలు కల్పనకు ఆయా యాజమాన్యాలు చేపడుతున్న చర్యలపై తమ కమిషన్ కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు, ప్రైవేటు,కార్పొరేటు స్కూళ్ళు,కాలేజీలపై వచ్చే అన్ని రకాల ఫిర్యాదులపై కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు సారథ్యంలో స్పందించి ఆయా జిల్లాల అధికార యంత్రాంగాల నుండి పూర్తి సమాచారం సేకరిస్తుందని అన్నారు, ఇటువంటి వాటిపై ప్రతికూల నివేదికలు అందితే ఆయా పాఠశాలల,కళాశాలల అనుమతులు రద్దు చేయించేందుకు,బాలల హక్కుల పరిరక్షణ చట్టాలకు అనుగుణంగా వివిధ సెక్షన్ల ద్వారా కేసులు నమోదు చేసేలా సంభందిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు,అంతిమంగా బాలలు,వారి తల్లిదండ్రులే విజయం సాధించడంలో కమిషన్ చట్టబద్ధమైన కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
జిల్లా పోలీసు ఎస్పీ జి.ఆర్.రాధికతో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం ఆమె కార్యాలయంలో భేటీ అయ్యారు,చైల్డ్ మిస్సింగ్ కేసులు,బాలల అక్రమ రవాణా బాల్యవివాహాలు,పోక్సో కేసులపైన చర్చించారు,బాలల చట్టాలపై పోలీసు సిబ్బందికి తరచూ సదస్సులు సమావేశాలు నిర్వహించాలని సూచించారు,జిల్లాను శత శాతం బాలల హక్కుల పరిరక్షణ జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ సునీతతో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం, జిల్లా విద్యాశాఖాధికారి జి. పగాడాలమ్మ , ఐ సి డిఎస్ పి డి అనంతలక్ష్మి,జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మెన్ యు. శ్రీలక్ష్మి,సభ్యులు రమణ మూర్తి,గన్నెప్పడు,జిల్లా బాలల సంరక్షణ అధికారి రమణ లు భేటీ అయ్యారు,జిల్లాలో బాలల ప్రత్యేక హోమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు.అలాగే జిల్లాలో విద్యార్థులు,బాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు, నూతన శకానికి ఉపాధ్యాయులు నాంది పలకాలని కమిషన్ సభ్యులు సీతారాం అన్నారు,ఇందిరానగర్ కోలనిలోని సర్వశిక్షా అభియాన్ కార్యాలయం లో జిల్లా విద్యాశాఖాధికారి జి. పగడాలమ్మ ఆధ్వర్యంలో 30 మండలాల విద్యాశాఖాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతారాం మాట్లాడుతూ కొత్త ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేసేటపుడు నూటికి నూరుశాతం అన్ని ధ్రువీకరణలు ఉంటేనే అనుమతులు జారీచేయాలని అన్నారు,అలాగే నిత్యం పాఠశాలలను తనిఖీ చేస్తూ ఫీజులు వివరాలు,ఇతర సదుపాయాలు కల్పించేందుకు పర్యవేక్షణాధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.