1 ENS Live Breaking News

26న చదవడం మాకిష్టం..

శ్రీకాకుళం జిల్లాలో చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన ప్రారంభిస్తున్నట్లు వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చదవడం మాకిష్టం లోగోను ఆయన ఆవిష్కరించారు. విధ్యార్ధుల్లో పాఠశాల స్థాయిలోనే  పఠనాశక్తిని పెంపొందించే లక్ష్యాంతో  విధ్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన తెలిపారు. వాక్యాల నుండి గ్రంథాల దాకా చదివే శక్తిని కల్పించడం దీని ఉద్దేశ్యమన్నారు. కథలు, పత్రికలు, జీవిత చరిత్రలు, వైజ్ఞానిక విశేషాలు తదితర అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చదివే అభిరుచిని అలవాటు చేసి చదవటంలోని ఆనందాన్ని పరిచయంచేసి పిల్లల్ని పుస్తకలోకంలోకి ఆహ్వానించి ఉహాలోకాలలోకి రెక్కలు విచ్చుకొనే మహోన్నత ఉద్యమం అన్నారు. 26వ తేదీన శ్రీకాకుళం మండలం ఇప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9.30 గంటలకు చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Srikakulam

2020-11-24 17:15:47

పార్టీలకు అతీతంగా రైతులకు సేవలందిద్దాం..

గోదావరి డెల్టా రైతులను రాజకీయ పార్టీలకు అతీతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో ఉభయ గోదావరి జిల్లాల సాగునీటి సలహా మండలి సమావేశం మంత్రి కృష్ణదాస్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం రైతులు త్యాగం చేయడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఆ రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు మనకు అత్యంత ప్రాధాన్యం కాబట్టి, ఒకవైపు ప్రాజెక్టు పూర్తి కావడానికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా సాగునీటి ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాఫర్‌ డ్యాంను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో ఈ ఏడాది రబీ సీజన్‌ను ఖచ్చితంగా 120 రోజుల్లోనే పూర్తి చేయాలని, అందుకు రబీ సాగును కుదింపు చేయాలని నీటి పారుదల సలహ మండలి(ఐఎబి) నిర్ణయించింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా డెల్టా కాలువలకు విడుదల చేసే సాగునీటిని వచ్చే ఏడాది మార్చి 31న నిలుపుదల చేయాలని ఇరిగేషన్‌ శాఖ అధికారులు నిర్ధేశించారు. అయితే గోదావరి డెల్టాలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీటిని సరఫరా చేసేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మండలి దృష్టికి తీసుకొచ్చారు. ఆఖరికి 90 టిఎంసీల నీటితో తాగునీరు, పశువులకు సరిపడే నీటి సరఫరాతోపాటు రబీ సాగుకు ఢోకా లేకుండా రబీని పూర్తి చేయాలని నిర్ణయించారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం 2020-21 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలనే సంకల్పతో అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఈ సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ రబీకీ 90 టిఎంసీల నుంచి 97 టిఎంసీల నీటితో ఉబయ గోదావరి జిల్లాల పరిధిలో డెల్టా కాలువలకు సాగునీటిని సరఫరా చేసేలా అధికారులు ఈ ఏడాది కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని రబీ కార్యచరణను రూపొందించారు. సాగునీరు సలహా మండలి సమావేశం ప్రారంభం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి. మురళీధర్‌ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో రబీ సాగుకు సంబంధించిన ఆయకట్టు వివరాలు, నీటి వసతి, తదితర అంశాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. రబీ సీజన్‌లో ఒక లక్షా 45 వేల ఎకరాల నుంచి ఒక లక్షా 50 వేల ఎకరాల వరకూ సాగు అవుతుందని వివరించారు. అయితే పోలవరం కాఫర్‌ డ్యాం వల్ల గత ఏడాది డెల్టా పరిధిలో రైతులు పలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ముఖ్యంగా అమలాపురం, టైలాండ్స్‌లో ఏప్రియల్‌లో తాగునీటికి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. టైలాండ్స్‌ ప్రాంతాలకు నీరు వెళ్లాలంటే 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే సాధ్యమని తెలిపారు. ఈస్ట్రన్‌ డెల్టా పరిధిలో డిసెంబర్‌ లోగా 85 శాతం నాట్లు పూర్తియ్యే అవకాశం ఉందని, అయితే సెంట్రల్‌ డెల్టా పరిధిలో 35 శాతం మాత్రమే నాట్లు పడే అవకాశాలు ఉన్నాయని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రబీ సాగుకు కనీసంగా 120 రోజుల నుంచి 135రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. డిసెంబర్‌లోగా పూర్తి స్థాయిలో నాట్లు పడకపోతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని సమావేశం దృష్టికి కలెక్టర్‌ తీసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు మాట్లాడుతూ పశ్చిమ డెల్టా పరిధిలో సుమారు 5.29 లక్షల ఎకరాలు  సాగులో ఉందని, అయితే మార్చి 31నాటితో నీటి సరఫరాను నిలుపుదల చేస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అదే జరిగితే సుమారు 60 వేల ఎకరాల వరకూ ఆయకట్టులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. గత ఏడాది రబీ సీజన్లో కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 120 రోజుల లోపులో పంట చేతికొచ్చేలా పంటలను వేయడం ద్వారానే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చునని అభిప్రాయపడ్డారు.  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ జిల్లాలో చాగల్నాడు, వెంకటనగరం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా రాజానగరం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలు సాగు అవుతున్నాయని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆయకట్టుకు సాగునీటితోపాటు, తాగునీరు, పశువులకు నీరు సక్రమంగా అందేలా చూడాలని, ఈ విషయంలో రాజీ పడవద్దని అన్నారు.  రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి 31లోగా డెల్టా కాలువలను మూసివేయాల్సి ఉన్నందున రైతులు తక్కువ సమయంలో పంట చేతికి వచ్చేలా పక్కా ప్రణాళికతో పంటను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ సలహా బోర్డు సహకారంతో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. 9 లక్షల 90 వేల ఎకరాలకు సాగునీరు ఎంత అవసరమో...తాగునీరు అంతే అవసరమని, ఆ దిశగా ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఎఈలు, డీఈలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.  గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ రంగనాథ రాజు మాట్లాడుతూ బహుళార్ధక సాధక ప్రాజెక్టు అయినపోలవరం పనులకు ఆటంకం కల్గకుండా రైతులకు నష్టం కాకుండా ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో 120 రోజుల వ్యవధిలో పంట చేతికి వచ్చేందుకు అవసరమైన ప్రణాళికను రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. సాగునీటితోపాటు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. టైలాండ్‌ ప్రాంతాలకు సాగునీరు తప్పనిసరిగా అందేలా చూడాలిన ఆదేశించారు.  బీసీ సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది వచ్చిన నీటి ఎద్దడిని ఈఏడాది ఎలా అధిగమించాలో సంబంధిత శాఖల అధికారులు సమగ్ర కార్యచరణను రూపొందించాలని అన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఏ పంట వేస్తే దిగుబడి త్వరగా చేతికి వస్తుందో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ విషయంలో టైలాండ్‌ రైతులను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. అలాగే కాలువల మూసివేత సమయానికి ఎక్కడ పనులు ప్రారంభం కావాలో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.  రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాస్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ మార్చి 31న డెల్టా కాలువలను మూసివేస్తే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, కావున అధికారుల ప్రణాళికకు వాస్తవ సంఘటనలకు 15 రోజుల వ్యవధి తేడా ఉందని, ఆ 15 రోజులపాటు నీటిని విడుదల చేయకపోతే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. కావున ఆ 15 రోజులపాటు సాగునీటిని సరఫరా చేయడానికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి 31 నాటికి డెల్టా కాలువలు మూసివేయనున్నందున డిసెంబర్‌ 7 నుంచి 15 వరకూ 120 రోజుల కాలంలో పంట చేతికొచ్చే విత్తనాలను సెంట్రల్‌ డెల్టాలో వినియోగించాలని జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి సూచించారు. ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో రైతులకు నష్టం లేకుండా ముందుకు సాగాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు మాట్లాడుతూ ఇరిగేషన్‌, ఉద్యానవన, వ్యవసాయం, పట్టణ మంచినీటి సరఫరా శాఖలు సమన్వయంతో సాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాని అన్నారు. గత ఏడాది ఏ ప్రాంతంలో అయితే నీటి ఎద్దడి వచ్చిందో ఆ ప్రాంతాన్ని గుర్తించడంతోపాటు, దాని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తిలంచడం జరిగిందని తెలిపారు. సీజన్‌ పూర్తియ్యే నాటికి  పంటలకు కానీ, తాగునీటికి కానీ ఇబ్బందులు లేకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సాగునీటి, తాగునీటి సమస్యలను సలహా మండలి దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులకు, అధికారులను కోరారు. ఈ సమావేశంలో శిశు స్త్రీ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్‌ తానేటి వనిత, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్‌, పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ పి.సుధాకర్‌ బాబు, గోదావరి డెల్టా సీఈ వి.శ్రీధర్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈలు శ్రీరామ కృష్ణ, సూర్యప్రకాశరావు, జాయింట్‌ కలెక్టర్లు లక్ష్మీ శ, కే.వెంకట రమణా రెడ్డి, సబ్‌ కలెక్టర్లు అనుపమ అంజలి, హిమాన్షు కౌశిక్‌, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Rajahmundry

2020-11-24 17:07:32

వ్రుత్తి విద్యాకోర్సులకు మంచి డిమాండ్..

వ్రుత్తి విద్యా కోర్సులు నేర్చుకోవడం ద్వారా మంచి ఉద్యోగ, ఉపాది అవకాశాలు పొందడాటినికి అవకాశం వుంటుందని స్టీల్ ప్లాంట్ డైరెక్టర్(పర్శనల్) కె.కిశోర్ చంద్రదాస్ అన్నారు. మంగళవారం ప్లాంటఓ ఏర్పాటు చేసిన ఇజియాట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండో జర్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సడ్ టెక్నాలజీ 60 మంది నిరుద్యోగులకు సిఎన్సీ మెషిన్ ఆపరేటర్, వెల్డింగ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి ఇజియాట్ సహాయం అందించిందని, తద్వారా ఉపాది పొందవచ్చునన్నారు.  ప్రస్తుతం ఆ ట్రేడులకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. అంతేకాకుండా మోటారు మెకానిక్స్, స్టిచింగ్ & టైలరింగ్, వెల్డింగ్, ప్లంబింగ్ & ఫిట్టింగ్, ఎలక్ట్రీషియన్, ఎసి రిపేర్, బిల్డింగ్ మెయింటెనెన్స్, సోలార్ వర్క్‌షాప్, క్యాంటీన్, లైబ్రరీ మొదలైన వివిధ ట్రేడ్‌ల కోసం ఈ సంస్థ ప్రత్యేక వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుందని చెప్పారు.  శిక్షణ పూర్తయిన అభ్యర్ధులతో ఆయన మొక్కలు నాటారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో బి. వినోద్ కుమార్ (డైరెక్టర్, ఇజియాట్),బి నరేంద్ర కుమార్ (డిప్యూటీ డైరెక్టర్), కె సత్య నారాయణ (జిఎం-సిఎస్ఆర్, రిన్ఎల్) ఎంఎస్ నవ్య లూత్రా, డిప్యూటీ మేనేజర్ (సిఎస్ఆర్) తదితరులు పాల్గొన్నారు.

స్టీల్ ప్లాంట్

2020-11-24 16:58:25

కరోనా 2వదశ కేసులు అధికమవుతున్నాయ్..

శ్రీకాకుళం జిల్లాలో కరోనా 2వ దశ కరోనా తీవ్రత  అధికంగా ఉందని,  ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా వాసులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో మెసేజ్ ను కలెక్టర్ విడుదల చేస్తూ గత ఎనిమిది నెలల కాలంలో కోవిడ్ నివారణకు జిల్లాలో అనేక చర్యలు చేపట్టామని, ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖంలో ఉందని, తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని, మరణాలు కూడా బాగా తగ్గాయని ఆయన తెలిపారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో కోవిడ్ వ్యాప్తి లేదని కొంత మంది భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి పూర్తిగా కనుమరుగు కాలేదని అదే సమయంలో దేశంలో రెండవ దశ వ్యాప్తి (సెకండ్ వేవ్) ప్రారంభం అయిందని గుర్తించాలని సూచించారు. మొదటి దశ కన్నా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో గత 15 రోజులుగా రోజుకు 5 నుండి 6 వేల కేసులు నమోదు అవుతున్నాయని, మరణాలు కూడా వంద వరకు ఉంటున్నాయని తెలిపారు. చలికాలం కావడంతో ప్రభావం అధికంగా ఉంటుందని, శ్రీకాకుళం జిల్లాలో శీతల వాతావరణం ఉంటుందని గమనించి కోవిడ్ ప్రభావానికి లోనుకాకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీతోపాటు హర్యానా, రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొంటూ మాస్కు లేకుండా బయటకు వెళ్ళరాదని, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Srikakulam

2020-11-24 14:44:19

అక్రమవసూళ్లకు పాల్పడే 9మంది విలేకరులు అరెస్టు..

అర్ధరాత్రి సమయంలో వాహనాలను అడ్డుకుని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న9 మంది విలేకరులపై కృష్ణా జిల్లా  వీరులపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగామ డీఎస్పీ  నాగి రెడ్డి ఈ మంగళవారం ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ,కొందరు విలేకరులు ఇటువంటి తప్పుడు దారిని ఎంచుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అల్లూరు గ్రామంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు విలేకరులను నరసింహారావు పాలెం వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా మిగిలిన ఏడుగురు విలేకర్ల అక్రమ వసూళ్లు బయటపడ్డాయని వారిలో ఆరుగురు విలేకరులను నందిగామలోని కె వి ఆర్ కాలేజీ వద్ద అదుపులోకి తీసుకున్నామని, నందిగామ ఆంధ్రప్రభ విలేకరి నరసింహారెడ్డి పరారీలో ఉన్నాడని పట్టుబడిన ఎనిమిదిమంది విలేకరులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా  జగ్గయ్యపేట 6 టీవీ ఛానల్ కు చెందిన విలేఖరి కొండ్రు సందీప్ మరియు 19 యూట్యూబ్ ఛానల్ కు చెందిన శ్రీనివాస్, విట్నెస్ యూట్యూబ్ ఛానల్ కు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తులు గత ఆదివారం రాత్రి సమయంలో వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో రహదారిపై వెళ్తున్న లారీని  ఆపి తమ దగ్గర ఉన్న కత్తిని చూపించి డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో లారీ వెనుక మరో లారీలో వస్తున్న ముఠా కార్మికులు లారీ డ్రైవర్ తో కలసి 6టివి రిపోర్టర్ సందీప్ ని చితకబాది  మొత్తం ముగ్గురు వ్యక్తులను వీరులపాడు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. లారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేయగా ఈ దర్యాప్తు లో భాగంగా వీరితో కలిసి గతంలో ఇదే విధమైన అక్రమ వసూళ్లకు పాల్పడిన నందిగామ ఆంధ్రప్రభ విలేకరి నరసింహ రెడ్డి, కోస్తా ఆంధ్ర విలేకరి తిరుపతిరావు ,H6 యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఉప్పు తల వీరబాబు, జీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ విలేఖరి కొంగర నవీన్ ,వి ఎస్ బి  యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఆవుల గోపికృష్ణ, తో పాటు చిన్నా అనే మరొక యూట్యూబ్ ఛానల్ విలేఖరిని అదుపులోకి తీసుకున్నారు. మీరు తొమ్మిది మందిపై వీరులపడు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

Nandigama

2020-11-24 14:40:44

సిస్టర్స్ ను అభినందించిన జె.సి..

శ్రీకాకుళం పట్టణంలో గల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ( రిమ్స్ )లోని కోవిడ్ పేషెంట్లకు సేవలందించిన మథర్ థెరిస్సా హోమ్ సిస్టర్స్ ను సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. గత 15 రోజులుగా కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించి రిలీవ్ అవుతున్న సిస్టర్స్ కు సన్మాన కార్యక్రమం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలోని గిరిజన యువక శిక్షణా కేంద్రంలో మంగళవారం జరిగింది.  ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని గత 15 రోజులుగా రిమ్స్ లోని కోవిడ్ పేషెంట్లకు సహాయకులుగా ఉండి వారికి ఉపచర్యలు చేసిన సిస్టర్ మహిమ,  సిస్టర్ జస్వింతలను జె.సి దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందించి అభినందించారు. మథర్ థెరిస్సా హోమ్ సిస్టర్స్ గత నాలుగు బ్యాచులుగా   కోవిడ్ తో బాధపడుతున్న పేషెంట్లకు సహాయకులుగా ఉండి సేవలందిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించేందుకు స్వచ్చంధంగా ముందుకువచ్చిన సిస్టర్స్ కు జె.సి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సిస్టర్స్ తో ముచ్చటిస్తూ వారికి గత 15 రోజులుగా అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. గత మూడు బ్యాచులలో సిస్టర్స్ సేవలు అందించారని, తద్వారా కోవిడ్ పేషెంట్లలో వచ్చిన మార్పు గురించి జె.సి అడిగి తెలుసుకున్నారు.  సేవలు అందించే సమయంలో కోవిడ్ పేషెంట్లకు గాని, సిస్టర్స్ కు  ఎటువంటి సమస్యలు లేవని సిస్టర్స్ తెలియజేయడంతో జె.సి సంతోషించారు. కోవిడ్ సెకెండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున 2021 జనవరి మాసాంతం వరకు ఇదేస్పూర్తితో మథర్ థెరిస్సా హోమ్ సిస్టర్స్ కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప తహశీల్ధార్ యస్.సతీష్, గ్రామ రెవిన్యూ అధికారులు డి.వరలక్ష్మీ, పి.శ్రావణి, బి.రమేష్, పర్యవేక్షకులు టి.హరిసూర్య తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-24 13:18:08

భీమేశ్వరుడిని దర్శించిన డిప్యూటీ సీఎం..

ఆ పరమశివుని దయతో కరోనా వైరస్ పూర్తిగా సమసిపోయి ప్రజలు శుభిక్షంగా ఉండాలని శివుడుని కోరినట్టు డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాస్ చెప్పారు. మంగళవారం పంచారామాలలో ఒకటైన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని కుమారభీమారామము క్షేత్రాన్ని సందర్శించి శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అంతరం 14 అడుగుల ఎత్తైన శివలింగానికి రెండవ అంతస్తులో కి వెళ్లి మంత్రి పూజలు చేశారు. తరువాత డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ, కార్తీక మాసంలో ఇక్కడి శివుడిని దర్శించుకోవడం ఆనందంగా వుందన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయం మొక్ విశిష్టతలను మంత్రికి వివరించారు. ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలా త్రిపురసుందరిగా పూజలు అందుకుంటోందని. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయని, దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయని క్షేత్ర  పురాణం, దాని మహత్యం గురించి డిప్యూటీ సీఎం కృష్ణ దాస్ కి వివరించారు. 

Samarlakota

2020-11-24 10:25:18

విశాఖలో సత్యసాయి 95వ జయంతి వేడుకలు..

విశ్వాభివ్రుద్ధికోసం, ఇతరులకు నిశ్వార్ధ సేవలిందించేందుకు పరితపించిన దైవదూత భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. సోమవారం విశాఖలో వివేకానంద వ్రుద్ధాశ్రమంలో జహీర్ అహ్మద్ లు సత్యసాయి 95వ జయంతి సందర్బంగా నిరుపేదలకు సాయిడివోటీస్ తో కలిసి బట్టలు, నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడూ భక్తిభావాన్ని ప్రజలకు పంచి, దైవత్వాన్ని బోధించిన దేవదేవుడు సత్యసాయి మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు యుగాంతం వరకూ ప్రతీ ఒక్కరికీ గుర్తుంటాయన్నారు. అనంతరం సత్యసాయి భక్తులతో కలిసి భజనా కార్యక్రమంలో పాల్గొని తీర్ధప్రసాదాలుు స్వీకరించారు. ఈ కార్యక్రమంలోని విశాఖ సత్యసాయి డివోటీస్ పాల్గొన్నారు.

Visakhapatnam

2020-11-23 21:16:35

రూ.100 కోట్లతో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి..

 దేశంలోనే ప్రాముఖ్యత గల విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ ఎం. వేణుగోపాల  రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫిషింగ్ హార్బర్ హైలెవెల్ మేనేజింగ్ కమిటీ  సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా  జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ప్రహరీ నిర్మాణం అదనంగా మరో రెండు హాల్లు నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, ఐస్ క్రషింగ్ మిషన్, సోలార్ విద్యుత్ దీపాలు జట్టీల మరమ్మతులు మొదలైనవి చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేశారని తెలిపారు.  వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే సభ్యులు నిపుణులు తమ యొక్క సలహాలు సూచనలు ఇవ్వవలసినదిగా కోరారు.  ప్రొఫెసర్ డివి రావు డి పి ఆర్ ను గూర్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హార్బర్ అభివృద్ధికి డి పి ఆర్ లో చేపట్టిన పనుల పట్ల సభ్యులు హర్షం వెలిబుచ్చారు.  ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి సబ్ కమిటీని నియమించాలని, ఫిషింగ్ బోట్ లకు పూర్తి మరమ్మతులు సౌకర్యాన్ని హార్బర్ లోనే కల్పించాలని, కమిటీ సభ్యులు సూచించారు. మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు కె ఫణి ప్రకాష్ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కోలా గురువులు, ఏపీ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సి అప్పారావు, వివిధ అసోసియేషన్ల నాయకులు జి జి తిలక్, సి. సత్యనారాయణ, బి కొండబాబు. శ్రీధర్, గంగరాజు, మత్స్య శాఖ డిడి లక్ష్మణరావు, విశాఖపట్నం పోర్టు అధికారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

Collector Office

2020-11-23 20:51:15

వ్యాధులు ప్రభలకుండా చూడాలి..

జివిఎంసి పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలు కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం, జివిఎంసి సమావేశ మందిరంలో సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, బయాలజిస్ట్ పైడిరాజుతో కలసి సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శీతాకాలంలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుకుండా తగు ముందస్తు జాగ్రత్తలు  చేపట్టాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై పర్యవేక్షించేందుకు వార్డు ప్రత్యేకాదికారులు, మలేరియా ఇన్ స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, సచివాలయ శానిటరీ కార్యదర్శులు తదితరులు నిత్యం తగు చర్యలు చేపట్టాలని, మలేరియా, డెంగ్యూ వ్యాధులకు ముఖ్య కారకాలైన దోమలు వృద్ధి చెందకుండా, నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. వారంలో ఒక రోజు ఆదివారం “డ్రై డే” గా పాటించేవిధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి కరపత్రాలు, స్టిక్కర్లు వంటివి అంటించి ముఖ్యంగా మహిళలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. అలసత్వం వహించే సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, బయాలజిస్ట్ పైడిరాజు, అన్ని జోన్ల మలేరియా ఇన్ స్పెక్టర్లు, మలేరియా సూపెర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.  

GVMC office

2020-11-23 20:31:40

పటిష్టంగా ఇంటింటికీ సరుకులు పంపిణీ..

ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమాన్ని పటిష్టవంతంగా నిర్వహించాలని సివిల్ సప్లైస్ కమీషనరు కోన శశిధర్ తెలిపారు.  సోమవారం సివిల్ సప్లైస్ కమీషనరు కోన శశిధర్,  సంయుక్త  కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటికీ రేషన్ సరకులను పంపిణీ చేసే కార్యక్రమం పటిష్టవంతంగా నిర్వహించాలని తెలిపారు.  ఇందు నిమిత్తం యుధ్ధ ప్రాతిపదికన మ్యాపింగ్ చేయాలన్నారు.  మంగళ వారం సాయంత్రంలోగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కావాలన్నారు.  వాలంటీర్ల లాగిన్ ద్వారా ఇ.కె.వై.సి, మ్యాపింగ్ లను పూర్తి చేయాలని తెలిపారు.  డోర్ డెలివరీ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకం కలుగరాదన్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు.  రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దారులు, ప్రత్యేక శ్రధ్ధ వహించాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలను సిధ్ధం చేయాలని తెలిపారు.  సంయుక్త కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై చేపడుతున్న చర్యలను కమీషనరు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారి కిశోర్,   పౌర సరఫరాల అధికారి డి.వి.రమణ, అసిస్టెంట్ సివిల్ సప్లైస్ అధికారులు వంశీకృష్ణ, ఉదయ భాస్కర్  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-23 20:01:38

తిరుపతిలో కాన్వాయ్ రిహార్సల్..

తిరుపతిలో భారత రాష్ట్రపతిలో రేపు రామ్ నాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ బిస్వాభూసన్ హరిచందన్,  సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పర్యటన సందర్భంగా తిరుపతి అర్భన్ పోలీసులు తిరుపతి పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ఇంటలిజెన్స్ ఐ.జి  శశిధర్ రెడ్డి, డి.ఐ.జి  క్రాంతి రానా టాటా, తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాన్వయ్ ట్రైల్ నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుచానూరు, తిరుమల (రేణిగుంట విమానాశ్రయం, 150 బైపాస్, తిరుచానూరు అమ్మవారి ఆలయం, బాలాజీ కాలనీ, తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్, శ్రీవారి ఆలయం) వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు అప్ ఘాట్ మరియు డౌన్ ఘాట్ రోడ్ల యందు కూడా స్పెషల్ పోలీస్ టీం లచే క్షుణ్ణంగా తనికీలు నిర్వహించి, కాన్వాయ్ రిహార్సల్ ట్రయల్ రన్ ను భధ్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రముఖులు పర్యటన రోజు ఆ సమయంలో ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  చూస్తున్నామని ఎస్పీ వివరించారు. 

Tirumala

2020-11-23 19:58:40

డిసెంబరు 8నుంచి యువజనోత్సవాలు..

శ్రీకాకుళం జిల్లాస్థాయి యువజన ఉత్సవాలను డిసెంబర్ 8 నుంచి 11 వరకు  స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. 27అంశాల్లో సాంస్కృతిక పోటీలను ఆన్ లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 15 సం.ల నుండి 29 సం.ల వయస్సు కలిగిన యువతి యువకులు ఈ పోటీలకు అర్హులని, గత మూడేళ్లలో జాతీయ స్థాయిలో పాల్గొన్నవారు ఈ పోటీలలో పాల్గొనుటకు అనర్హులని వివరించారు. పోటీల్లో పాల్గొనదలచిన యువ కళాకారులు వారి దరఖాస్తును సెట్ శ్రీ కార్యాలయపు మెయిల్ setsrisklm@gmail.com నకు సమర్పించాలని కోరారు.  బారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు సంబందించిన విషయాలపైనే పోటీలలో ప్రదర్శించాల్సి ఉంటుందని,  సినిమా పాటలు అనుమతించబడవని ఆయన స్పష్టం చేసారు. 

Srikakulam

2020-11-23 19:49:15

అన్నవరంలో పరమశివుడికి కార్తీక దీపోత్సవం..

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం బిసికాలనీలో వెలసిన పరమశివుడికి భక్తులు కార్తీక సోమవారం సందర్భంగా రాత్రి దీపోత్సవం నిర్వహించారు. స్వామివారి విగ్రహం వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం పూజలు చేసి ఉపవాసం ఉన్న భక్తులంతా సాయంత్రం ఐదుగంటల నుంచే శివయ్యకు కార్తీక దీపం వెలిగించి చుక్కను చూశారు. భక్తుల పూజలకు అనుగుణంగా ఆలయధర్మకర్త స్వామివారి విగ్రహం వద్ద ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటుచేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూజలు నిర్వహించుకోవడినికి వీలుపడింది. అక్కడే బిల్వదళాల చెట్టు, ఉసిరిక చెట్లు వద్ద పూజలు చేసుకోవడానికి వీలుపడింది. ఈ సందర్భంగా కార్తీక దీపాలంకరణకు వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

Annavaram

2020-11-23 19:05:57

ఇళ్ళ స్థలాలను ప్రత్యేకాధికారులు తనిఖీ చేయాలి..

విజయనగరం జిల్లాలో  పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద డిసెంబర్ 25న ఇళ్ళ పట్టాలను అందజేస్తున్నందున ఆ లేఔట్లను మండల ప్రత్యేకాధికారులు  తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్ అధికారులకు ఆదేశించారు.  ప్రత్యేకాధికారులు మండలాల్లో సచివాలయాలతో పాటు ఇళ్ళ స్థలాలను కూడా తనిఖీ చేసి వాటి అభివృద్ధి పై దృష్టి పెట్టాలన్నారు. సోమవారం స్పందన అనంతరం కలెక్టర్ జగనన్న తోడు, ఇళ్ళ పట్టాలు కన్వర్జెన్స్ పనులు, తదితర  కార్యక్రమాల పై అధికారులకు పలు సూచనలు చేసారు.  ఇళ్ళ కోసం వేసిన లేఔట్ల లో హద్దు రాళ్లు ఉన్నది లేనిది, బోర్డ్స్ డిస్ప్లే  చేసింది లేనిది  ప్రత్యేకాధికారులు తనిఖీ చేయాలనీ, అలాగే  ప్రతి సైట్ లోను మొక్కలు నాటాలని, రహదారుల కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కూడా జరగాలని ఆదేశించారు. అనవసర మొక్కలు, తుప్పలు ఉంటె వాటిని తొలగించాలని, అవసరమగు మొక్కల కోసం డుమా పి.డి  లేదా అటవీ అధికారిని సంప్రదించాలని అన్నారు. స్థలాల వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసే బాధ్యత ప్రత్యేకాధికారులదేనని స్పష్టం చేసారు. లే ఔట్లలో  వృధాలను తొలగించడానికి వాలంటీర్ , లబ్ది దారులను సమీకరించుకొని శ్రమదానం ద్వారా పని చేయించాలన్నారు. ప్రత్యేకాధికారులంతా వారి మండలాల్లోని లేఔట్ల పై నివేదికనివ్వాలని సూచించారు. జగనన్న తోడు దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి పూర్తి చేయాలన్నారు.  కన్వర్జెన్స్ పనులలో భాగంగా ఇప్పటికి ప్రారంభం కానీ రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలు, సచివాలయ భవనాలు ఈ నెలాఖరులోగా  ప్రారంభం కావాలని ఆదేశించారు.  డుమా పి.డి ఈ విషయం లో సమన్వయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాల సేకరణకు అత్యంత ప్రాధాన్యత నిస్తోందని,  అమూల్ కంపెనీ తో ఒప్పందం చేసుకొని రైతులకు పాడి ద్వారా లాభాలను చేకూర్చే కార్యక్రమం కావున  ఈ నెలాఖరు నాటికి  బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలకు స్థలం హ్యాండ్ ఓవర్ చేయాలని  అన్నారు. ఇప్పటికే డిజైన్, ప్లానింగ్ వచ్చాయని,  34 మండలాల్లో  గ్రామాల వారీగా గుర్తించిన స్థలాలను వెంటనే పశు సంవర్ధక శాఖ కు అప్పగించాలని సూచించారు. పాఠశాలలలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కల్పించాలని జిల్లా విద్య శాఖాధికారి జి. నాగమణికి ఆదేశించారు.   విద్యార్ధుల హాజరు పై ఆరా తీయాలని, పిల్లల్ని తల్లి దండ్రుల అంగీకారం తోనే పాఠశాలలకు వచ్చేలా  చూడాలన్నారు. ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా  కోవిడ్ ఉన్నదో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ద్వారా  నివేదిక తీసుకొని, ఆ ప్రాంతాల్లో పిల్లలకు, ఉపాధ్యాయులకు కోవిడ్ సోకకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ డా. జి.సి కిషోర్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-23 17:49:31