1 ENS Live Breaking News

కరోనా నుంచి కోలుకున్న 77 మంది డిశ్చార్జ్..

అనంతపురం జిల్లాలో  కరోనా నుంచి కోలుకోవడంతో 97 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు శనివారం 77 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని  సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇప్పటి వరకూ అందించిన సహకారమే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యమైన సానిటైజర్లు వినియోగించాలనీ, సానిటైజర్లు లేనివారు ఏ సబ్బుతోనైనా తరచుగా 20 సెకెండ్లపాటు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. పౌష్టికాహరం, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఎవరికైనా అనుమానం వున్నా, కరనా లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.

Anantapur

2020-11-21 19:16:56

రాష్ట్రపతి పర్యటను బందోబస్తు పక్కాగా ఉండాలి..

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఈ నెల 24 న జిల్లా పర్యటన సంధర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త సూచించారు. శనివారం మద్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఇంటలిజెన్స్ ఐ జి శశిధర్ రెడ్డి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కలసి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ వివరిస్తూ గౌ. భారత రాష్ట్రపతి పర్యటన సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రజాప్రతినిధులు స్వాగతం పలకనున్నారని విమానాశ్రయంలో ఏర్పాట్లను జెసి (సంక్షేమం) రాజశేఖర్, ఎ. పి. డి. సురేష్, సి. ఎస్. ఓ. రాజశేఖర రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ శుక్ల    కలసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. తిరుపతి ఆర్డీఓ కనకనరసా రెడ్డి భారత   రాష్ట్రపతి పర్యటన పూర్తి సమన్వయ అధికారిగా వ్యవహరించాలని  తెలిపారు. ఆర్ అండ్ బి , పంచాయితీరాజ్ రోడ్డు మరమ్మత్తులు, పరిసరాలపై దృష్టి పెట్టాలని అన్నారు. వైద్య శాఖ రాష్ట్రపతి పర్యటనలో  విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి తప్పనిసరి కోవిడ్ పరీక్షలు (రాపిడ్) టెస్టులు నిర్వహించాలని సూచించారు. అనంతరం విమానాశ్రయం నుండి రాష్ట్రపతి పర్యటించనున్న   ప్రదేశాలను ముందస్తు వాహనశ్రేణి ద్వారా   రోడ్డు మార్గం పరిశీలిస్తూ, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్,   శ్రీవారి ఆలయం వద్ద పరిశీలించారు.  ఈ సమీక్ష, పర్యటనలో టి.టి.డి సి.వి. అండ్ ఎస్. ఓ. గోపినాథ్ జెట్టి, ఆర్డీఓ కనకనరసారెడ్డి, ఎస్. బి. డి ఎస్. బి. గంగయ్య, రాష్ట్రపతి పర్యటన విధులు కేటాయించిన అధికారులు, విమానాశ్రయ అధికారులు శ్యామ్ , సెక్యూరిటీ అధికారులు   పాల్గొన్నారు.

Tirupati

2020-11-21 18:54:15

ప్లాస్టిక్‌ నిర్మూలన‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ప్ర‌తీ మున్సిపాల్టీలో ప్లాస్టిక్ నిర్మూల‌న‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. దీనిని నిర్మూలించిన‌ప్పుడే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ సాధ్య‌ప‌డుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మోన‌ట‌రింగ్ ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌పై అన్ని మున్సిపాల్టీల క‌మిష‌న‌ర్ల‌తో క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో శ‌నివారం స‌మావేశం జ‌రిగింది. ఆయా మున్సిపాల్టీల్లో చెత్త నిర్వ‌హ‌ణ ప‌ద్ద‌తులు, దీనికి తీసుకున్న చ‌ర్య‌ల‌పై అంశాల‌వారీగా చ‌ర్చించారు. త‌మ‌త‌మ మున్సిపాల్టీల్లో అవ‌లంబిస్తున్న విధానాల‌ను, తీసుకున్న చ‌ర్య‌ల‌ను క‌మిష‌న‌ర్లు వివ‌రించారు.  ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌కృతికి తీర‌ని హాని చేసే ప్లాస్టిక్ ను నిర్మూలించ‌డం‌పై ప్ర‌తీఒక్క‌రూ దృష్టి పెట్టాల‌ని ఆదేశించారు.  ప్లాస్టిక్ నియంత్ర‌ణ‌కు తీసుకున్న చ‌ర్య‌ల‌పై బొబ్బిలి మిన‌హా మిగిలిన మున్సిపాల్టీల‌పై క‌లెక్ట‌ర్ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ముందుగా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, ఆ త‌రువాత ప్లాస్టిక్‌ను విక్ర‌యించేవారిపైనా, వినియోగించే వారిపైనా చ‌ర్య‌లు మొద‌లు పెట్టాల‌ని సూచించారు. అన్ని మున్సిపాల్టీల్లో డిబ్రిస్ ను ఇష్టానుసారం ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప‌డేయడం వ‌ల్ల చాలా స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని అన్నారు. దీనిని అరిక‌ట్టేందుకు ఒక ప‌టిష్ట‌మైన వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని చెప్పారు. దీనికోసం డిసెంబ‌రు 1 నుంచి స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించాల‌ని, ఆ నెలంతా ఎక్క‌డికక్క‌డ పేరుకుపోయిన డెబ్రిస్‌ను తొల‌గించి, దీనికోసం ఒక నిర్ణీత ప్ర‌దేశాన్ని కేటాయించాల‌ని, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని  సూచించారు. నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా డెబ్రిస్ వేసేవారికి జ‌న‌వ‌రి నుంచి జ‌రిమానాలు విధించ‌డంతోపాటు, దానిని త‌ర‌లించేందుకు అయ్యే వ్య‌యాన్ని సైతం వారివ‌ద్ద‌నుంచే రాబట్టాల‌ని చెప్పారు.  స‌చివాల‌యాల్లో  ఎంతో సామ‌ర్ధ్య‌మున్న  సిబ్బంది మ‌న‌కు అందుబాటులో ఉన్నార‌ని, వారి సేవ‌ల‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. స‌మాచారం త్వ‌ర‌గా అందించేందుకు, ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు వీలుగా మున్సిపాల్టీల్లోని స‌చివాల‌య సిబ్బందికి వాకీటాకీ హేండ్‌సెట్లు ఇవ్వాల‌ని ఆదేశించారు. మొక్క‌ల‌ను నాటే కార్య‌క్ర‌మం విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ మిన‌హా, మిగిలిన మున్సిపాల్టీల్లో ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌లేద‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.  ప‌చ్చ‌ద‌నాన్ని పెంచ‌డానికి, చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. దీనికోసం ప్ర‌తీ మున్సిపాల్టీలో ఒక ప్లాంటేష‌న్ విభాగాన్ని ఏర్పాటు చేయాల‌ని సూచించారు.  మున్సిపాల్టీల్లో నాడూ-నేడు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని, ప్ర‌తీచోట క‌నీసం ఒక పాఠ‌శాల‌ను న‌మూనా పాఠ‌శాల‌గా ఎంపిక‌చేసి, డిసెంబ‌రు నాటికి అన్ని వ‌స‌తుల‌తో సిద్దం చేయాల‌ని ఆదేశించారు. ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ ఇష్టానుసారం ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయ‌డాన్ని నివారించాల‌న్నారు. ముఖ్య‌ప్ర‌దేశాల్లో వివిధ ప్రాంతాల‌ను తెలుపుతూ డైరెక్ష‌న్ బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని, ప్ర‌తీ ఒక్క అధికారీ సృజ‌నాత్మ‌క‌త‌తో ఆలోచించి, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.     ఈ స‌మావేశంలో విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, బొబ్బిలి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎం.మ‌ల్లయ్య‌నాయుడు, సాలూరు క‌మిష‌న‌ర్ ఎం.ర‌మ‌ణ‌మూర్తి, పార్వ‌తీపురం క‌మిష‌న‌ర్ కె.క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయితీ క‌మిష‌న‌ర్ అప్ప‌ల‌నాయ‌యుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-21 18:44:34

లబ్ధిదారుల ఎంపిక సత్వరం పూర్తిచేయాలి..

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ ఆర్.వెంకటరావు (ఆసరా) అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ భీమా, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు పథకాల పురోగతిపై జేసీ వెంకటరావు, డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ తో కలిసి బ్యాంకుల ప్రతినిధులతో, వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ పథకాల్లో చేరిన లబ్ధిదారుల వివరాలను, ఎంపిక ప్రక్రియలో చోటుచేసుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా వైఎస్సార్ భీమలో లబ్ధిదారులను చేర్చే ప్రక్రియపై చర్చించారు. జిల్లాలో మొత్తం 6,97,161 మంది రైస్ కార్డ్ లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటి వరకు 5,92,908 మంది మాత్రమే చేరి ఉన్నారని జేసీ వెల్లడించారు. మిగతా వారిని త్వరితగతిన సర్వే చేసి చేర్చాలని మెప్మ, డి.ఆర్.డి.ఎ సిబ్బందిని ఆదేశించారు. 18 సం"రాలు కన్న తక్కువ వయస్సు, 70 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ల వివరాలు ప్రత్యేకంగా సేకరించాలని సూచించారు. వైఎస్సార్ భీమా, చేయూత, జగనన్న తోడు పథక ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాలంటే ప్రతీ ఒక్కరికీ ఖాతా తెరవాలని చెప్పారు. ఖాతాలు తెరిచే విషయంలో ప్రభుత్వ సిబ్బందికి బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బ్యాంకుల ప్రతినిధులతో సమన్వయంగా వ్యవహరిస్తూ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం నాటికల్లా ప్రతి లబ్ధిదారుకీ బ్యాంక్ ఖాతా తెరవాలని, సంబంధిత సమస్యలు ఉంటే పరిష్కరించి నివేదికలు అందజేయాలని సూచించారు. ఖాతాల తెరిచే నిమిత్తం బ్యాంకులకు పంపిన పెండింగ్ లిస్టును పరిష్కరించాలని చెప్పారు. అనంతరం వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు పథకాల అమలుపై సమీక్షించి, తగిన సలహాలు సూచనలు అందజేశారు.      కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారావు, మేప్మా పి.డి. సుగుణ ఖర్ రావు, పశుసంవర్ధక శాఖ జె.డి. నరసింహులు, ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, డి.ఎల్.డి.ఒ.లు రాజ్ కుమార్, రామచంద్రరావు, ఎస్బిఐ, ఐ ఓ బి, ఏపీజివీబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంకు, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-21 18:36:17

దేవుళ్లంతా ఏకమై కరోనాని తరిమికొట్టాలి..

 విశాఖలోని ఆదర్శనగర్  శ్రీ శ్రీ శ్రీ సిద్ధి శ్రీకృష్ణ దత్తాత్రేయ సుబ్రహ్మణ్యేశ్వర పంచముఖ ఆంజనేయస్వామి సహిత షిరిడి సాయినాధుల ఆశీస్సులతో కరోనా పూర్తిస్థాయిలో రూపుమాసిపోవాలని విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షలు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆలయ 19 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, అందరు దేవుళ్ల  ఒకే చోటఉండి ఈ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారని అన్నారు. ఆలయ వార్షికోత్సవర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందన్న వంశీ కరోనా సమసిపోతే జనజీవనాకి పనులు దొరికి జీవితాలు కూడు, గూడు దొరుకుతాయన్నారు. అంతకుముందు ఆలయంలో  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయకమిటీ ప్రత్యేక జ్ఞాపకను  అందజేశారు. కార్యక్రమంలో శ్రీ సిద్ధి ,శ్రీకృష్ణ సేవాసమితి  కమిటీ వారు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ఆదర్శనగర్

2020-11-21 18:13:48

విశాఖలో rtc complex లో ఫిష్ కియోస్క్..

ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా  4 ఫిషింగ్ హార్బర్లు , 25 ఆక్వా హబ్ ల నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి  శనివారం  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  వర్చువల్ విధానంలో   శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్దికి  ప్రభుత్వం   అంతర్జాతీయ స్థాయి  మౌలిక సదుపాయాలు  కల్పించ నున్నదని తెలిపారు. మరో నాలుగు చోట్ల కూడా  ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో  విశాఖపట్నం జిల్లా నుంచి  ఆర్.టి. సి. కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన  ఫిష్ కియోస్క్ యూనిట్  దగ్గర నుంచి  వీడియో కాన్పరెన్స్ లో  జిల్లా ఇన్ చార్జి మంత్రి  మరియు  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ,  జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్, శాసన సభ్యులు  వాసుపల్లి గణేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ యం.వేణుగోపాల్ రెడ్డి , ఆర్.డి.ఒ. పి.కిషోర్ , మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఫణిప్రకాశ్,  ఉప సంచాలకులు లక్ష్మణరావు, లబ్దిదారులు చెన్నా ధనలక్ష్మి, సురాడ అపర్ణ  తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్.టి.సి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ కియోస్క్ ను జిల్లా ఇన్ చార్జి మంత్రి  మరియు  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ , శాసన సభ్యులు  వాసుపల్లి గణేష్ కుమార్  పాల్గొన్నారు.

Rtc Complex Vizag

2020-11-21 17:58:03

27లోగా వాహనాలకు దరఖాస్తులు చేసుకోవాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి, మైనారిటి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సరుకు రవాణా వాహనాలను సబ్సిడిపై మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఇందుకు ఈ నెల 27వ తేదీ నాటికి దరఖాస్తులు సమర్పించాలని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతకు సరుకు రవాణా వాహనాల మంజూరుపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మునిసిపల్ కమీషనర్లతో శని వారం వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. పేద కుటుంబములకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ద్వారా ఇళ్ళ వద్దకే నేరుగా పంపిణీ చేస్తున్న సంగతి విదితమేనని అన్నారు. సరుకు రవాణా వాహనాలను ప్రజాపంపిణీ వ్యవస్ధతో అనుసంధానం చేసి ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి, మైనారిటి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సబ్సిడీపై వాహనాలు అందించుటకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో లబ్దిదారుని వాటా – 10 శాతం రూ.58,119., బ్యాంకు ఋణము - 30 శాతంగా రూ.1,74,357 కాగా సబ్సిడిగా 60 శాతం రూ.3,48,714/- ఉంటుందని వివరించారు. అర్హత గల ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి, మైనారిటి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత స్థానిక గ్రామ/వార్డు సచివాలయములో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు. నిర్ధేశిత దరఖాస్తును సంక్షేమ సహాయకుల నుండి ఉచితంగా పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 27వ తేదీ వరకు సంక్షేమ సహాయకులకు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్దులకు డిశంబరు 4వ తేదీన సంబధిత మండల, మునిసిపాలిటి, మునిసిపల్ కార్పోరేషన్ లలో ఎంపిక కమిటి ఆధ్వర్యంలో ఎంపిక జరపాలని ఆయన స్ఫష్టం చేసారు. దరఖాస్తు చేసిన అభ్యర్ధులు ఎంపిక కమిటి ముందు విధిగా హాజరు కావాలని ఆయన స్పష్టం చేసారు. వీటిపై మండల స్ధాయిలో నిరుద్యోగ యువతకు తగిన సమాచారం అందించాలని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల సరఫరాలోను, స్వీకరణలోనూ ఎటువంటి ఆరోపణలకు తావు ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల సర్వేలో భాగంగా మండలాల్లో ఉన్న నమోదు అయిన పరిశ్రమలు, నమోదు కాని పరిశ్రమలను కూడా సర్వే చేయాలని సూచించారు. ఏ ఒక్క పరిశ్రమను విడిచి పెట్టరాదని, స్పష్టమైన, వాస్తవమైన డేటా ఉండాలని ఆయన పేర్కొన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, డిప్యూటి ట్రాన్సుపోర్టు కమీషనర్ వడ్డి సుందర్, జిల్లా సరఫరా అధికారి డి.వెంకట రమణ, ఎస్.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-21 17:51:42

మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు..

మత్స్యకారులు వారి మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకోవడానికి రాష్ట్రం లోనే తొలిసారిగా రిజిస్ట్రేషన్ చేసిన  మార్కెటింగ్ సొసైటీ పత్రాలను మత్స్యకార సంఘాలకు జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ అందజేసారు.   ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా  శనివారం  రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  నాలుగు ఫిషింగ్ హార్బర్ లకు, 25 ఆక్వా హబ్ లకు వీడియో కాన్ఫరెన్స్  ద్వారా  శంకుస్థాపనలు  చేసారు.   ఈ కార్యక్రమం లో విజయనగరం నుండి జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్, శాసన మండలి  సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, సంయక్త కలెక్టర్లు జి.సి కిషోర్ కుమార్, జే, వెంకట రావు తదితరులు  పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆక్వా బజార్ కు సంబంధించిన   మత్స్యకార మార్కెటింగ్ సొసైటీ  రిజిస్ట్రేషన్ పత్రం తో పాటు బైలా ను సంఘ సభ్యులకు అందజేసారు. ప్రతి జిల్లాకు ఒక  ఆక్వా మార్కెటింగ్ సొసైటీ ని ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు మార్కెటింగ్ సౌకర్యం , గిట్టుబాటు ధరలను  కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున, రాష్ట్రం లోనే విజయనగరం తొలి సొసైటీ గా  ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు..  అనంతరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో గల స్వదేశి మత్స్యకారులకు, ఆక్వా రైతులకు, చేపల వ్యాపారం  చేసుకునే వారికీ, మహిళా సహకార  సంఘాల సభ్యులకు పెట్టుబడి కోసం బ్యాంకుల ద్వారా  అతి తక్కువ వడ్డీ తో రుణం  అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా   62 మంది మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేసారు.  .  వీరికి బ్యాంకుల ద్వారా  మంజూరు జేసిన  13.5 లక్షల రూపాయల ఋణం కు సంబంధించిన పాస్ పుస్తకాలను అందజేసారు. జిల్లాలో ఇప్పటి వరకు 128 మందికి 19.95 లక్షల రూపాయలను  కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలక్రింద మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు శాసన మండలి సభ్యులు,శాసన సభ్యులు, మత్స్య శాఖ ఉప సంచాలకులు నిర్మలా  కుమారి,  జిల్లా మత్స్యకార  సంఘం మాజీ అధ్యక్షులు బర్రి చిన్న అప్పన్న, మక్కువ ఆక్వా  రైతుల మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు వై. గోపాల కృష్ణ, మహిళా   సంఘాల  ప్రతినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-21 17:20:14

మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ కు ఘనసత్కారం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన మత్స్యకార కార్పొరేషన్  డైరెక్టర్ మైలపల్లి నరసింహులు ను ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. శనివారం విజయనగరం జిల్లా కలెక్టర్ డా.జవహర్ లాల్ తో పాటు శాసన మండలి సభ్యులు  పెనుమత్స సురేష్ బాబు,శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, మత్స్య శాఖ ఉప సంచాలకులు నిర్మలా  కుమారి,  జిల్లా మత్స్యకార  సంఘం మాజీ అధ్యక్షులు బర్రి చిన్న అప్పన్న, మక్కువ ఆక్వా  రైతుల మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు వై. గోపాల కృష్ణ, మహిళా   సంఘాల  ప్రతినిధులు పుష్ప గుచ్చాలతో, శాలువాలతో  సన్మానించారు. మత్స్యకారులకు మేలు జరిగేలా  కష్టపడి పని చేయాలని  శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాడు డైరెక్టర్ ను కోరారు.

కలెక్టరేట్

2020-11-21 17:17:42

మంత్రివర్యా దళితవాడ దాహార్తిని తీర్చండి..

శ్రీకాకుళంలోని దళితవాడకి త్రాగునీరు ఇప్పించాలని కోరుతూ తైక్వాండో శ్రీను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ను కలిసి  వినతిపత్రం అందజేసారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తోటపాలెంలోని ఎస్.సి  కాలనీకి చెందిన ప్రజలు,మహిళలు,యువతతో కలిసి డిప్యూటీ సి.ఎం వద్ద దళితుల సమస్యలను వివరించారు.  వినతిని స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సానుకూలంగా స్పందించారు.ఎస్.సి కాలనీకి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని మహిళలు,యువతకి హామినిచ్చారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ నివాస్ తో మాట్లాడి తోటపాలెంలోగల ఎస్.సి కాలనీకి మంచినీరు అందేలా చూస్తానని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఎఐమ్ సైనిక్ ప్రధాన కార్యదర్శి పెయ్యిల చంటితో పాటు ,డివిజన్ కార్యదర్శి ఆనంద్ కుమార్ తో పాటు తోటపాలెం ఎఐమ్ కమిటి సభ్యులు  మోహన్, రామారావు, రమణ, శివ, నాయుడు, రాజు, రాధ, రమణమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-21 16:11:01

కరోనా నియంత్రించమని స్వామిని కోరాను..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది  శాఖ మంత్రి శనివారం ముత్తంశెట్టి శ్రీనివాసరావు  దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి వర్యులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి..తీర్థ ప్రసాదాల స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, త్వరలోనే పంచ గ్రామాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఇప్పటికే కమిటీలు కూడా వేసినట్టు వివరించారు. కరోరా సెకెండ్ వేవ్ ప్రారంభం అయినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. స్వామిని కరోనా వైరస్ పూర్తిగా తగ్గించి ప్రజలు సాధారణ జీవితం గడిపేలా చూడమని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని  కోరినట్టు మంత్రి తెలియజేశారు. మంత్రి వెంట స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2020-11-21 15:51:04

ఎస్సీ యువతకు ఉచిత ఉపాది శిక్షణ..

విజయవాడలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ & హెడ్  చింతా శేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)సౌజన్యంతో 6 నెలల వ్యవధితో కూడిన మెషిన్ ఆపరేటర్ – ప్లాస్టిక్స్ ప్రాసెస్సింగ్ (Machine Operator – Plastics Processing) అనే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం ద్వారా 90 మంది ఎస్సీ నిరుద్యోగ యువతకు అందిస్తున్నామన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలను, Apron, Safety Shoes, Training Kit లను CIPET అందిస్తున్నదని, 6 నెలల శిక్షణకు గాను నెలకు రూ.500/- చొప్పున మొత్తం రూ. 3,000/- ప్రోత్సాహక స్టయిపెండ్ అందిస్తామని తెలిపారు. 18 – 30 సం.లు. మధ్య వయస్సు కలిగి, 10 వ తరగతి/ I.T.I. / Diploma పాస్ (లేక) ఫెయిల్ విద్యార్హత గల నిరుద్యోగ SC యువత ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిర్ణీత శిక్షణ అనంతరం అభ్యర్ధులకు CIPET సర్టిఫికేట్ తో పాటుగా ప్లాస్టిక్స్ మరియు అనుబంధ సంస్థలలో ఉద్యోగ అవకాశం అందిస్తామని చెప్పారు. అర్హులైన మరియు ఆసక్తి గల అభ్యర్ధులు తమ ఒరిజినల్ విద్యార్హత, కుల, ఆదాయ ధృవపత్రాలు, ఆధార్, వైట్ రేషన్ కార్డ్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీలు మరియు 4 పాస్పోర్టు సైజు ఫొటోలతో తేది. 23.11.2020, సోమవారం నుంచి CIPET విజయవాడ కార్యాలయంలో సంప్రదిన్చాలన్నారు. మరిన్ని వివరాలకు CIPET ప్రతినిధులను 9849263296, 9985941979 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

Vizianagaram

2020-11-21 15:43:11

అనంతలో రూ.కోటితో ఆక్వా హబ్ ఏర్పాటు..

అనంతపురం జిల్లాలో కోటి రూపాయలతో ఆక్వా హబ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భముగా శనివారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి   రాష్ట్ర ముఖ్య మంత్రి  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి   నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందించేందుకు రాష్ట్రంలో  25 ఆక్వా హుబ్బుల ఏర్పాటుకు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతపురము నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా ఆక్వా హబ్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాద వశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.  వీడియో కాన్ఫరెన్సులో   ఉప మత్స్య సంచాలకులు శాంతి,  రాష్ట్ర బి.సి.కార్పొరేషన్ డైరెక్టర్లు  అశ్వర్ధ్ నారాయణ , లక్ష్మి నారాయణ,  రమణ, జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు  పోతన్న, బెస్త ఉపాధ్యక్షుడు కుళ్ళాయప్ప   తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-11-21 15:17:09

డిపార్ట్ మెంటర్ పరీక్షలకు తొలిరోజు 92% హాజరు..

ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న శాఖాపరమైన మొదటి రోజు ఉదయం సెక్షన్ పరీక్షకు 92 శాతం మంది హాజరైనట్టు కో - ఆర్డినేటింగ్ అధికారి, డి.ఆర్.వో. ఎం.గణపతిరావు చెప్పారు. ఉదయం సెక్షన్ పరీక్షకు 791 మంది రావాల్సి ఉండగా.. 727 మంది హాజరైనట్టు వివరించారు. పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి 29 వరకు జరగనున్నాయని దానికి తగ్గ ఏర్పాట్లు అన్ని పకడ్బందీగా చేశామని పేర్కొన్నారు. మొదటి రోజు పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించేందుకు గాజులరేగ లో ఉన్న సీతం ఇంజినీరింగ్ కళాశాలను ఆయన శనివారం సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. అభ్యర్థులెవరూ మాస్ కాపీయింగ్ కి పాల్పడకుండా జాగ్రత్త వహించాలని లైజెనింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట లైజెనింగ్ అధికారులు, ఏపీపీఎస్సీ ప్రతినిధులు ఉన్నారు.

Vizianagaram

2020-11-21 15:04:10

విప్లవ జ్యోతి అల్లూరికి సముచిత స్థానం కల్పించాలి..

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించాలని విశాఖ జిల్లా అల్లూరి యువజన సంఘం అధ్యక్షులు రాజాసాగి సత్యన్నారాయరాజు(కుర్రుపల్లిబాబు) అన్నారు.శనివారం విశాఖలోని ఏవిఎన్ కాలేజీలో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి విశాఖలోని ఏవిఎన్ కాలేజీలో చదుకున్న గుర్తుగా తమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాలవీరభద్రరావు, ఒబ్బలరెడ్డి సుబ్రమణ్యం, ఇ.శ్రీకాంత్, అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు  ఆధ్వర్యంలో గత ఏడాది విగ్రహం ఆవిష్కరించామని చెప్పారు. ఇపుడు ఆయన విగ్రహానికి తొలి వార్షికోత్సవం చేపట్టినట్టు వివరించారు. అల్లూరి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు అయిన రోజుకే ఆయనకు తెలుగు జాతి నిజమైన గౌరవం ఇచ్చినట్టు అని అన్నారు.  సంఘం కార్యదర్శి కల్లేపల్లి సంతోష్ కుమార్ వర్మ మాట్లాడుతూ, ఏవిఎన్ కాలేజిలోని స్కూలు పిల్లలకు అల్లూరి విరోచిత చరిత్రను  వివరించారు. స్కూలు హెచ్ ఎం క్రిష్ణవేణి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు ప్రపంచ వీరుడని, తెల్లవాడిని తరిమికొట్టిని మహా ధీరుడని కొనియాడారు. అనంతరం విద్యార్ధినీ, విద్యార్ధులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మిమిక్రీరాజు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-11-21 13:15:21