1 ENS Live Breaking News

రాజ్యాంగమే దేశానికి రక్ష..

 రాజ్యాంగమే దేశానికి రక్షణగా నిలుస్తోందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం ఏయూలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా పరిపాలనా భవనం వద్దనున్న అంబేద్కర్‌ ‌విగ్రహానికి, న్యాయ కళాశాల వద్దనున్న అంబేద్కర్‌ ‌విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం న్యాయ కళాశాలలో ఆచార్యులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. సుస్తిర రాజ్యాంగం భార్‌తదేశానికి ప్రత్యేకమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని, విలువలను పరిరక్షించే విధంగా పౌరులు నడచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య జి.వి రవీంద్రనాథ్‌ ‌బాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, కె.శ్రీనివాస రావు, పి.రాజేంద్ర కర్మాకర్‌, ఎస్‌.‌సుమిత్ర, పి.రాజేంద్ర ప్రసాద్‌, ఆర్‌.‌శివ ప్రసాద్‌, ఆచార్య కె.వెంకట రావు, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, జేమ్స్ ‌స్టీఫెన్‌, ఎస్సీ,ఎస్టీ, బిసి సి ఉద్యోగుల సంఘం అద్యక్షులు పి.అర్జున్‌, ‌డీన్‌ ‌డాక్టర్‌ ‌టి.షారోన్‌ ‌రాజు, డీన్‌లు, అధికారులు, ఉద్యోగులు, పరిశోధకులు పాల్గొన్నారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-11-26 17:36:20

షాహిదాబేగం హత్య కేసులో ఐదుగురు అరెస్టు..

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం అలియాస్ షాహిదమ్మ (19) హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని కళ్యాణదుర్గం డీఎస్పీ ఎన్ రమ్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె బాధితులతో మాట్లాడుతూ, కనేకల్లు మండలం తుంబిగనూరు సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో షాహిదా బేగం నిన్నటి రోజున శవమై తేలిన విషయమై ఈనెల 17 వ తేది రాత్రి నుంచి షాహిదాబేగం కన్పించుటలేదని కళ్యాణదుర్గం రూరల్ పోలీసు స్టేషన్లో ఆ అమ్మాయి తల్లి దూదేకుల సతాన్భీ ఈనెల 19 రాత్రి 7 గంటలకు ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే  మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఈ హత్యతో సంబంధమున్న చాపిరి గ్రామానికి బి.రఘు, ఇతని చిన్నాన్నలు రాజప్ప అలియాస్ రాజశేఖర్ , ఆనంద్ , పిన్నమ్మ విశాలమ్మ, అమ్మ లింగమ్మలను అరెస్టు చేశామన్నారు. ఈ ఐదుగురిలో ప్రధాన నిందితుడైన బి.రఘు ఈనెల 17 న పెళ్లి చేసుకుంటానని షాహిదా బేగంను నమ్మించి కనేకల్లు మండలం మాల్యం వద్దకు తీసికెళ్లాడన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని మాల్యం సమీపంలోని హెచ్చెల్సీ కాలువలోకి షాహిదా బేగంను తోసేశాడన్నారు. ఈ కేసును త్వరగా ఛేదించిన కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ శివశంకర్ నాయక్ , ఎస్సై సుధాకర్ మరియు సిబ్బందిని కళ్యాణదుర్గం డీఎస్పీ అభినందించారు. చాపిరి షాహిదా బేగం హత్య కేసులో ప్రధాన నిందితుడైన బి.రఘుపై రౌడీషీట్ ఓపెన్ చేశామని డీఎస్పీ ఎన్ రమ్య తెలిపారు. అమ్మాయిలు/మహిళలపై నేరాలకు ఒడిగడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Kalyandurga

2020-11-26 17:29:01

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత్ దే..

ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పెట్టని కోటని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్  అభివర్ణించారు . నవంబర్ 26 దేశ చరిత్ర లోనే అద్భుతమైన ఘట్టమని, ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ను  గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యమని పేర్కొన్నారు.  భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకొని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి  పూల మలాంకరణ గావించి నివాళు లర్పించారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ  కేంద్ర ప్రబుత్వ ఆదేశాలు మేరకు నవంబర్ 26న  సంవిధాన్ దివా స్ (రాజ్యాంగ దినోత్సవం) జరుపుతున్నామని, ఇదే రోజున  జాతీయ న్యాయ దినోత్సవం కూడా జరుపుకోవడం విశేషమని న్నారు. 1949 , నవంబర్ 26 న రాజ్యాంగ ముసాయిదాకు రాజ్యాంగ సభ లో అంగీకారం లభించిందని, 1950, జనవరి 26న రాజ్యాంగం అమలులొకి వచ్చిందని పేర్కొన్నారు. 70 ఏళ్ళు గడిచినా  మన రాజ్యాంగం చెక్కు చెదరకుండా  ఉంటూ,  ప్రజలంతా స్వేచ్చ, సమానత్వాలను అనుభవిస్తున్నారంటే  అది మన రాజ్యాంగం గోప్పతనమేనని అన్నారు.  ఇలాంటి రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం అవసరమని, అన్నారు. జాతీయ పండుగలు జరుపుకోవడం వలనజాతి సమైఖ్యత, ఐకమత్యం వర్దిల్లుతాయని  అన్నారు.   ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ డా.జి.సి కిషోర్ కుమర్  భారత రాజ్యాంగం లోని  ప్రియాంబుల్(పీఠిక)  ను చదివి  సభలో హాజరైన  వారితో ప్రతిజ్ఞ చేయించారు.   ఈ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ (ఆసరా) స్వాగతం పలుకగా జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  జిల్లా పరిశాత్చి.ఈ.ఓ వెంకటేశ్వర రావు,  విజనగరం కార్పొరేషన్  కమీషనర్ ఎస్.ఎస్.వర్మ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆశా దేవి, ఐ.సి.డి.ఎస్. ఫై.డి రాజేశ్వరి,  పలువురు జిల్లా అధికారులు , కల్లెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-26 17:14:54

పేర్ని నాని కుటుంబాన్ని పరామర్శించిన భరత్ రామ్..

 రాజమండ్రి ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ననాని తల్లిగారికి మచిలీపట్నంలో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. పేర్నినానితో కొంతసేపు మాట్లాడారు. ఇలాంటి సమయంలోనే మనసు దిటవు చేసుకోవాలని పేర్నిని సముదాయించారు. తల్లిని కోల్పోవడమంటే ఇంటిపెద్దను కోల్పోవడమేనని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు.అనంతరం పలు అంశాలు పేర్నితో చర్చించారు. గత మూడు రోజులు పేర్ని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శిస్తూనే వున్నారు.

Machilipatnam

2020-11-26 16:50:05

ఘనంగా రాజ్యంగ దినోత్సవం..

భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా గురువారం విశాఖ కలెక్టర్ రేట్ లో కలెక్టర్ వినయ్ చంద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫొటో కు పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని భారత రాజ్యాంగం గూర్చి  సిబ్బంది అందరితో చదివి  వినిపించారు. నివాళులు అర్పించిన వారిలో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్,   ఎ. ఓ. రామ్మోహన్, కలెక్టర్ కార్యాలయం అన్ని విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-11-26 16:31:32

ఆదిత్యుడిని దర్శించుకున్న డీజిఎం..

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ) విశాఖపట్నం మాడ్యూల్ డిప్యూటి జనరల్ మేనేజర్ (డిజిఎం) కె.రంగరాజన్ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వేదమంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించారు. అనివెట్టి మండపంలో స్వామి వారి ఆశీర్వచనాలను అందించారు. జిల్లావాసులు సురక్షితంగా ఉండాలని, కరోనా మహమ్మారి ప్రభావానికి లోనుకాకుండా ఆరోగ్యంగా ఉండాలని రంగరాజన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జిల్లాలో ఎస్.బి.ఐ ఖాతాదారులకు మంచే సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు సేవలు అందుతున్న తీరును పరిశీలించుటకు జిల్లా పర్యటనకు విచ్చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఏ.వి.ఎస్.ఎస్.ప్రసాద్, బ్యాంకు సిబ్బంది కిరణ్ బాబు, ఎస్.బి.ఐ ఉద్యోగుల జోనల్ కార్యదర్శి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-26 16:22:30

రాజ్యాంగ పరిరక్షణ మన బాధ్యత..

శ్రీకాకుళం రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ పేర్కొన్నారు.  గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో 71వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి జె.సి. ముఖ్య అతిధిగా విచ్చేసారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగమని  తెలిపారు.   ఇందులో ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పొందుపరచడం జరిగిందన్నారు.  రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలను తెలియచేసారు. విభిన్న మతాలు, భాషలు, విభిన్న సంస్కృతులతో విలసిల్లే దేశానికి రాజ్యాంగం దిక్సూచి వంటిదని తెలిపారు. రాజ్యాంగ రూపశిల్పి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఈ సందర్భంగా స్మరించుకోవలసిన ఆవశ్యకతను వివరించారు.  ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు.  రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తామని, రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేసారు. ఈ  కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజరు ఎ.కృష్ణారావు, హార్టికల్చర్ ఎ.డి.సాల్మన్ రాజు, కలెక్టరేట్ ఎ.ఓ. బి.రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-26 16:09:39

జెఎన్టీయూకేలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం..

ప్రతీ ఒక్కరు రాజ్యాంగంపై అవగాహన పెంచుకుని ఇతరులకు కూడా రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను వివరించాలని జెఎన్‌టియుకె ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు పిలుపునిచ్చారు. 72వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను యూనివర్శిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌సెంట్రల్‌ ‌లైబ్రరీ హాలులో కోవిడ్‌-19 ‌నిబంధనలను అనుసరిస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు మాట్లాడుతూ, డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌రచించిచ రాజ్యాంగం భారతదేశంలో అమలైన నవంబర్‌ 26‌వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. భారత రాజ్యాంగ పితగా డా.బిఆర్‌.అం‌బేద్కర్‌ ‌చరిత్రలో నిలిచిపోయారని, భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగ గ్రంథంగా నిలిచిందన్నారు. ప్రతీ ఒక్కరు భారత రాజ్యాంగం గురించి తెలుసుకుని తద్వారా సమాజాభివృద్ధి తమ వంతు కృషి చేయాలన్నారు. అనంతరం ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు భారత రాజ్యాంగ ప్రవేశికను ప్రతీ ఒక్కరి చేత చదివించి భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ‌ప్రొ.సిహెచ్‌.‌సత్యనారాయణ, ఓఎస్‌డి ప్రొ.వి.రవీంద్రనాధ్‌, ‌చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌ప్రొ.జి.ఏసురత్నం, యుసిఇకె ప్రిన్సిపాల్‌ ‌ప్రొ.బి.బాలకృష్ణ, గ్రీన్‌ ‌క్యాంపస్‌ ఇనీషియేటివ్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రొ.కె.వి.ఎస్‌.‌జి.మురళీకృష్ణ, ఉమెన్‌ ఎం‌పవర్‌మెంట్‌ & ‌గ్రీవెన్సెస్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రొ.ఏ.స్వర్ణకుమారి, ఐఐఐపిటి డైరెక్టర్‌ ‌ప్రొ.ఎన్‌.‌మోహన్‌రావు, స్కూల్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌స్టడీస్‌ (ఎస్‌ఎంఎస్‌) ‌డైరెక్టర్‌ ‌ప్రొ.ఏ.కృష్ణమోహన్‌, ఇం‌టర్నల్‌ ‌క్వాలిటీ అస్యూరెన్స్ ‌సెల్‌ (ఐక్యూఏసి) డైరెక్టర్‌ ‌ప్రొ.ఎన్‌.‌బాలాజీ, టీచింగ్‌ & ‌నాన్‌ ‌టీచింగ్‌ ‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2020-11-26 16:04:43

ఆ ఎస్పీ దాత్రుత్వానికి సెల్యూట్..

ఆ ఎస్పీ దాత్రుత్వానికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే..నివర్ తుపాను విలయతాండవం చేస్తున్న తరుణంతో నా అనేవారు లేని అనాధల కోసమే ఆలోచించారు..డిఎస్పీకేడర్ అధికారిని వారికి సేవలు చేయమని పంపి వారి కడుపు నింపారు...ఆయన తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి. అనునిత్యం ప్రజలకు ఫ్రెండ్లీ పోలిసింగ్ ను దగ్గర చేసే ఈయన సేవ కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు. తుపానులో ముఖ్యమైన ప్రాంతాల పర్యటనకు వెళుతూ,మార్గ మధ్యలో దిగాలుగా కనిపించిన అనాధలను చూసి తక్షణమే తన సిబ్బందిని ఆదేశించారు. వెంటనే తిరుపతి పట్టణంలో నిరాశ్రయులుగా ఉన్న అనాధలను వెతికి వారికి ఆహారం, బట్టలు ఇవ్వాలని సూచించారు. దీంతో రంగంలోకి దిగిన డిఎస్పీ మురళీ క్రిష్ణ, సిఐ శివప్రసాదరెడ్డిలు నగరంలోని అనాధలను గుర్తించి వారికి ఆహార పొట్లాలు, బట్టలు పంపిణీ చేశారు. నివర్ తుఫానులో ప్రజలను కాపాడటానికే ఖాళీ లేకుండా వరద ప్రాంతాలను తిరుగుతూనే అనాధల కోసం ఆలోచించి మరీ వారికి ఆకలి తీర్చిన ఎస్సీ రమేష్ రెడ్డి సేవకు ప్రశంసల జల్లు కురుస్తోంది..ఐపీఎస్ లంటే విధి నిర్వహణే కాదు..మానవతా ద్రుక్పదం చాటడంలో ముందుంటారని ఈయనను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది.!

Tirupati

2020-11-26 15:43:26

రహదారిపై నేలకొరిగిన చెట్లను తొలగించిన పోలీసులు..

తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి  ఏ.రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు గురువారం సహాయక చర్యలు చేపట్టారు. భారీ గాలులు, వర్షాలు పడిన ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లను తొలగింపు చేపట్టారు. తొట్టంబేడు పోలీస్ సిబ్బంది శ్రీకాళహస్తి తొట్టంబేడు, తంగెళ్ళ పాల్యెం, కొలత్తూరు రోడ్డు నివర్ తుఫాన్ ధాటికి రహదారిలో భారీ వృక్షాలు నేలకొరిగి రహదారి మొత్తం దిగ్బంధం జరిగినది. దీంతో ప్రజలు రాకపోకలు స్తంబించాడంతో సమాచారం అందుకున్న తొట్టంబేడు పోలీస్ సిబ్బంది ఉంటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు ఏ ఇబ్బంది లేకుండా చేశారు. అదేసమయంలో ఆ ప్రాంత వాసులను కూడా భారీ వర్షాల్లో జరిగే అనర్ధాలపై అప్రమత్తం చేశారు.

తొట్టంబేడు

2020-11-26 12:37:29

శ్రీకాలహస్తిలో పోలీసుల సహాయక చర్యలు..

శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న పలు లోతట్టు ప్రాంతాలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. గురువారం శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రజలకు సూచనలు జారీచేస్తున్నారు. వర్షాల కారణంగా స్వర్ణముఖి నది లో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని పిల్లలను బయటకు పంపొద్దని చెబుతున్నారు.  ఈ సందర్భంగా  సి.ఐ నాగార్జున రెడ్డి వారి సిబ్బందితో అన్ని ప్రాంతాలను తిరిగి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పడిపోయిన చెట్టును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. వర్షాలు అధికంగా కురుస్తున్న పిడుగులు, చెట్లు పడిపోయే అవకాశం వుందని ప్రజలు చెట్లు ఉన్న చోట వాటిదగ్గరకు వెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Srikalahasti

2020-11-26 12:35:26

27లోగా సచివాలయ ఉద్యోగాలు భర్తీపూర్తి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చేప‌ట్టిన స‌చివాల‌య ఉద్యోగ ఖాలీల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను ఈ నెల 27వ తేదీలోగా పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ఆయా శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌ర్ త‌న ఛాంబ‌ర్‌లో గురువారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ మాట్లాడుతూ స‌చివాలయాల్లో వివిధ ఖాలీల భ‌ర్తీకి రెండో ద‌శ‌లో 1134 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌న్నారు.  నోటిఫికేష‌న్ ఇచ్చిన త‌రువాత కూడా‌, అక్టోబ‌రు 31 లోపు మ‌రో 339 పోస్టులు ఖాలీ అవ్వ‌డంతో, మొత్తం 1473 పోస్టుల‌కు భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఈనెల 27వ తేదీలోగా  ఉద్యోగాలను భ‌ర్తీ చేయాల్సి ఉంద‌న్నారు. వివిధ శాఖ‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 740 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌డం జ‌రిగింద‌న్నారు. వీరికి నియామ‌క ప‌త్రాల‌ను కూడా అంద‌జేశామ‌ని చెప్పారు.  ఈ సారి కూడా గిరిజ‌న ప్రాంతంలో ఎక్కువ‌గా ఖాలీలు మిగిలిపోయే అవ‌కాశం ఉంద‌న్నారు. అలాగే సాంకేతిక‌ప‌ర‌మైన కొన్ని విభాగాల్లోని ఉద్యోగాల‌కు త‌గినంత‌మంది అర్హులు లేక‌పోవ‌డంతో, వాటిలో కొన్ని పోస్టులు మిగిలిపోతాయ‌న్నారు. స్పోర్ట్స్‌, ఎక్స్‌స‌ర్వీసుమెన్ త‌దిత‌ర కొన్ని విభాగాల్లో అర్హులైన‌వారు లేనిప‌క్షంలో, ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వాటిని ఇత‌ర కేట‌గిరీల‌తో నింపాల‌ని, సర్టిఫికేట్లు స‌మ‌ర్పించ‌ని వారికి బ‌దులు, వారి త‌రువాత‌వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు.  ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, జెడ్పీ సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, వ్య‌వ‌సాయ‌శాఖ జెడి ఎం.ఆశాదేవి, ఉద్యాన‌శాఖ డిడి ఆర్‌.శ్రీ‌నివాస‌రావు, మ‌త్స్య‌శాఖ  డిడి నిర్మ‌లాకుమారి, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విజయనగరం

2020-11-26 12:05:15

చిత్తూరుజిల్లాలో విద్యాలయాలకు సెలవు..

చిత్తూరు జిల్లాలో నేడు వాతావరణశాఖ భారీ వర్ష సూచన చేసిన కారణంగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల లకు మరియు విశ్వ విద్యాలయాలకు నేడు  సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా  ఒక ప్రకటన లో తెలిపారు. వర్షాలు అధికంగా వున్నందున ఎవరూ బయటకు రాకూడదని కోరారు. వర్షాలు పడుతున్నంతసేపు కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. ఎవరికైనా జ్వరాలు వస్తే దగ్గర్లోని గ్రామ వాలంటీరు ద్వారా సచివాలయ ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి మందులు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ప్రజలు తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

కలెక్టరేట్

2020-11-26 11:05:48

పేర్ని నానిని పరామర్శించిన డిప్యూటీసీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గారి మాతృమూర్తి  స్వర్గీయ పేర్ని నాగేశ్వరమ్మ కి డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాస్, మంత్రి చెల్లుబోయినవేణులు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా   డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రివర్యులు చెల్లుబోయిన వేణులు పేర్నినానితో కొంతసేపు మాట్లాడారు. ఇలాంటి సమయంలోనే మనసు దిటవు చేసుకోవాలని పేర్నిని సముదాయించారు. తల్లిని కోల్పోవడమంటే ఇంటిపెద్దను కోల్పోవడమేనని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు.అనంతరం పలు అంశాలు పేర్నితో చర్చించారు. గత మూడు రోజులు పేర్ని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు పరామర్శిస్తూనే వున్నారు.

Machilipatnam

2020-11-26 10:24:52

నెట్ షెడ్ల నిర్మాణాలకు అంచనాలు తయారుచేయాలి..

విశాఖలోని ఆరిలోవ నైట్ షెల్టర్ల రేకుల షెడ్డులు కారిపోతున్నందున వాటిని తొలగించి ఆ స్థానంలో స్లాబ్ వేయుటకు అంచనాలు తయారుచేయాలని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన  ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జివిఎంసి పరిధిలోని జోన్-1లో జివిఎంసి కమిషనర్ నైట్ షెల్టర్లకు కావలిసిన మౌళిక వసతులను పరిశీలించారు. అనంతరం మధురవాడ కారు షెడ్ నుంచి మారికవలస వరకు రహదారి విభాగినులపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, మెట్రో పనులు  ప్రారంభమైతే వాటిని తొలిగించి, వేరే చోట ఉపయోగించేలా ఏర్పాటుచేయాలన్నారు. బింద్రానగర్ 60అడుగుల రోడ్డు, ఎండాడ నుండి గీతం కాలేజ్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపెడుతున్న నేపద్యంలో, ఆ ప్రాంతంలో ఆస్తులు కోల్పోయే వారికి టి.డి.ఆర్.లు మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. రుషికొండ నుండి ఐ.టి.సెజ్ వరకు రోడ్డు విస్తరణ పనులకు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వాంబే కోలనీలోని ఏ1 బ్లాకు నుండి ఏ47 బ్లాకు వరకు బి1 బ్లాకు నుండి బి47 బ్లాకు వరకు మొత్తం 97 బ్లాకులకు సంబందించి భూగర్భ మురుగు నీటి వ్యవస్థను మెరుగు పరిచే పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. స్థానిక ప్రజలతో మాట్లాడి మౌళిక వసతులపై ఆరా తీసారు. ఇంకా పునరుద్ధరించని యు.జి.డి. కనక్షనులను తక్షణమే ఇవ్వాలని ఆదేశించారు. ఎండాడలో శిధిల స్థితిలో ఉన్న రిజర్వాయర్ ను  తొలగించి, 2000కి.లీల రిజర్వాయరు నిర్మాణానికి  అంచనాలను తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, డి.సి.పి. రాంబాబు, పర్యవేక్షక ఇంజినీర్లు  శివప్రసాద రాజు, వేణుగోపాల్, కార్యనిర్వాహక ఇంజినీర్లు సుధాకర్, నరసింహ తదితరులు పాల్గోన్నారు.             

Arilova

2020-11-25 20:27:56