1 ENS Live Breaking News

28న జిల్లా సమీక్షా కమిటి సమావేశం..

శ్రీకాకుళం జిల్లా సమీక్షా కమిటి (డి.ఆర్.సి) సమావేశం ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డి.ఆర్.సి ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆయన ఆదేశించారు.

Srikakulam

2020-11-23 17:27:32

నగరిలో స్కూళ్లకు శానిటైజర్ గొడుగులు..

పిల్లలు దేవుడితో సమామని అలాంటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని నగిరి ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పి.సి.ఎన్. హైస్కూల్, నగరి,  జెడ్.పి.బాలికల ఉన్నత పాఠశాల, పుత్తూరు, జెడ్.పి. బాలుర ఉన్నతపాఠశాల, వడమాలపేట,  జెడ్.పి.ఉన్నతపాఠశాల, నిండ్ర,  జెడ్.పి.ఉన్నత పాఠశాల, విజయపురం లకు శానిటైజర్ గొడుగులను రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో పాఠశాలు తెరిచిన సమయంలో వారికి వైరస్ సోకకుండా ఈ గొడుగు శానిటైజర్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మంచి ఆలోచనతో శానిటైజర్ గొడుగు సృష్టికర్త, తడుకు ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ భానుప్రసాద్ తన వద్దకు రావడంతో వాటిని పాఠశాలలకు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్టు రోజా వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎం.ఇ.ఓ లు శ్రీదేవి, తిరుమల రాజు, పద్మావతి, నారాయణ, ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు మనోహరి, సునీత, భువనేశ్వరి,దొరస్వామి, గీతాకుమారి తదితరులు పాల్గొన్నారు. 

Nagari

2020-11-23 17:25:39

మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రత కోసం  అభయం   ప్రాజెక్టును  ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  సోమవారం నాడు  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఆయన  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు  సంయుక్తంగా  నిర్వహించనున్న  అభయం ప్రాజెక్టును  వర్చువల్ గా  ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  మహిళల రక్షణ , భద్రత  విషయంలో   ఏమాత్రం రాజీపడేది లేదని  అన్నారు.  రవాణా శాఖ పర్యవేక్షణలో  నిర్వహించే ఈయాప్ ద్వారా మహిళలు, బాలికలు, ఆటోలు లేదా  ఇతర  ప్రజారవాణా వాహనాలలో  ప్రయాణించేటప్పుడు  అధునాతన సాంకేతిక పరిజ్ఞానం  ద్వారా రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో  విశాఖపట్నం నుంచి పర్యాటక శాఖ మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు,  జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్ ,  పోలీసు కమిషనర్  మనీష్ కుమార్ సిన్హా , జి.వి.ఎం .సి కమిషనర్  జి.సృజన, డిటి సి రాజారత్నం , డిగ్రీ కళాశాల విద్యార్ధినులు పాల్గొన్నారు. అనంతరం  మంత్రి , జిల్లా కలెక్టర్  అభయం  పోస్టర్ ను రిలీజ్ చేసారు. తరువాత  కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో  ఆటోర్యాలీని  పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టర్  ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  మహిళలకు  ఒక అన్నగా  వారి భద్రత ,రక్షణకు అత్యంత ప్రాధాన్యత  ఇస్తున్నారని తెలిపారు. ఆధునిక సాంకేతిక  పరిజ్ఞానం కలిగిన  ట్రాకింగ్ పరికరాన్ని  ఆటోలు మరియు  ఇతర  ప్రజా రవాణా వాహనాల్లో  అమరుస్తారని తెలిపారు. స్మార్ట్ ఫోన్  కలిగిన మహిళలు, ప్లేస్టోర్ ద్వారా  అభయం మొబైల్ యాప్ ను  డౌన్ లోడ్ చేసుకొని , తన మొబైల్  నెంబరుతో  నమోదు చేసుకోవాలని  తెలిపారు.  ప్రయాణం  మొదలైన  తరువాత   నమోదు చేసిన రూట్  లో కాకుండా ,  వేరే రూట్ కి వెళ్లినా  లేక  డ్రైవరు యొక్క చెడు ప్రవర్తన   గుర్తించిన వెంటనే  బటన్ నొక్కడం ద్వారా  వెంటనే  కమాండ్ కంట్రోల్ కేంద్రానికి  అలర్టు వెళుతున్నదని తెలిపారు.  జి.పి.యస్ లొకేషన్  ట్రాకింగ్ ద్వారా  ఆ మహిళలను రక్షించడం  జరుగుతుందని అన్నారు.ఈయాప్ ను  అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని  ఆయన కోరారు. 

Visakhapatnam

2020-11-23 17:08:23

ప్రభుత్వ భూ ఆక్రమితులపై చర్యలు తీసుకోవాలి..

విశాఖజిల్లాలో స్వాతంత్ర సమరయోధులు,  మాజీ సైనిక ఉద్యోగుల భూములకు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలపై  పూర్తి స్థాయి విచారణ జరపాలని  జనసేన నాయకులు  పీతల మూర్తి యాదవ్  సిట్  ఉన్నతాధికారి డాక్టర్ విజయ్ కుమార్ నో కోరారు.  విశాఖలో జరిగిన భూ అవకతవకలకు  సంబంధించిన పలు అంశాలతో  సిట్ కు లేఖ ఆయన సోమవారం ఒక లేఖ రాశారు.  అక్రమాలు జరిగిన భూమిలన్నింటిని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవాలని  మూర్తి యాదవ్ కోరారు.   నిబంధనలకు విరుద్ధంగా  ప్రైవేటు వ్యక్తుల పరమైన దసపల్లా భూముల  రిజిస్ట్రేషన్ లను రద్దుచేసి  వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.  గతంలో బయటపడిన ఉడా భూముల కుంభకోణానికి సంబంధించి  అప్పటి వీసీ కోన శశిధర్ ఇచ్చిన నివేదికను  తిరిగి పరిశీలించాలని,  ఆ నివేదికలో పేర్కొన్న ఐదు వందల నలభై కోట్ల రూపాయల అక్రమాలు సంబంధించిన భూములను, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.  అక్రమాలకు మారుపేరుగా మారిన ఉడా ల్యాండ్ పూలింగ్ వ్యవహారాలను బహిర్గతం చేయాలని,   జి వి ఎం సి పరిధిలో మంజూరైన టిడిఆర్  సర్టిఫికెట్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి అన్నారు.  ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా  కార్యక్రమాలు చేపడుతున్న సినారె బీచ్ రిసార్ట్,  హైగ్రీవ,  బే పార్క్,  కార్తీక వనం,  మూన్ ల్యాండ్  లకు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.  అటవీశాఖ,  తీరప్రాంత, యు ఎల్ సి మిగులు భూములను సిట్ పరిధిలో  చేర్చి  అందులోని అక్రమాలపై విచారణ జరపాలన్నారు.  మెడిటెక్ పార్క్ భూసేకరణలో అక్రమాలకు పాల్పడిన వారిపై  తీసుకోవాలని,  ముదపాక దళితులకు చెందిన భూములను  బలవంతంగా లాక్కొని కూడా ల్యాండ్  పూలింగ్ కు ఇచ్చినట్లు ఫిర్యాదులు ఉన్నాయని  తెలిపారు.  అన్ని రకాల భూ లావాదేవీలలో  అవినీతి అక్రమాలకు పాల్పడిన  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ, ఉడా పరిధిలోని  10 శాతం ఓపెన్ స్పేస్ స్థలాలను,  పార్కులను గుర్తించి కాపాడాలన్నారు.  గత ప్రభుత్వ హయాంలోని  సిట్ నివేదికను  తాజా సిట్ నివేదికతో పాటు బహిర్గతం చేయాలన్నారు.

Visakhapatnam

2020-11-23 16:44:44

వైఎస్సార్ పై తప్పుగా మాట్లాడి వుంటే క్షమించండి..

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఒక్కరోజులోనే అదే స్థాయిలోనే క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిన్న జరిగిన ఓ ప్రెస్ మీట్ లో దివంగత నేత వైఎస్సార్ పై చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్ అభిమానులకు  తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. అదే సమయంలో వైఎస్సార్‌పై రాఘునందన్‌రావు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్లు సోషల్‌ మీడియా వేదికగా మహానేత అభిమానులు భగ్గుమంటూ స్పందించారు. దీంతో దిగొచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ వైఎస్సార్‌ పట్ల చేసిన వ్యాఖ్యలపై క్షమాపన చెప్పారు. దానికి ముందు..ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించిన నేపథ్యంలో చెప్పిన క్షమాపణలు కూడా అటు బీజేపీలోనూ, ఇటు సోషల్ మాద్యమాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. రఘునందన్‌ వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని కూకట్‌పల్లిలో వైఎస్సార్‌ అభిమానులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా పెను దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో రఘునందన్‌రావు స్పందించారు. వైఎస్సార్‌ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు. వైఎస్సార్‌ అభిమానుల మనసు నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసేన సేవలు ఎంతో గొప్పవని, వాటిపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని అన్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో నోటికొచ్చినట్టు ఎందుకు మాట్లాడాలని, అదే సమయంలో వైఎస్సార్ అభిమానుల ఆగ్రహానికి ఎందుకు గురి అయి ఎందుకుక్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో అంతా కౌంటర్లు వేయడం కొనసాగుతోంది..

కుకట్ పల్లి

2020-11-23 16:35:47

రూ.160.55 కోట్ల అభివ్రుద్ధి పనులకు శంఖుస్థాపన..

అనంతపురంట జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో రూ.160.55 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు మునిసిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధి శాఖా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ శంకుస్థాపనలు చేశారు. సోమవారం ఉదయం కల్యాణదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తో కలిసి రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ,స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి ఉషాశ్రీ చరణ్,జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు భూమిపూజ, శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ముందుగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మూడుకోట్ల రూపాయల అంచనా వ్యయంతో   30 పడకల నుండి 50 పడకల ఆసుపత్రి స్థాయి కి  పెంపుచేస్తూ నిర్మించనున్న  సందర్భంగా నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మంత్రులు భూమిపూజ నిర్వహించి  శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన శిలాపలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కళ్యాణదుర్గం పట్టణంలో జల్ జీవన్  మిషన్ ద్వారా రూ.1952.90 లక్షల వ్యయంతో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ప్రజలకు ఇంటింటికి కుళాయిల సౌకర్యం కల్పించనున్న పథకానికి,రూ.138.02 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కళ్యాణదుర్గం పట్టణ సమగ్ర త్రాగు నీటి సరఫరా పథకాలకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాలను మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, కదిరి,మడకశిర ఎమ్మెల్యేలు డాక్టర్ సిద్ధారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి,పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సెక్రటరీ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, కళ్యాణదుర్గం ఆర్డీఓ రామ్మోహన్,ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ హరేరామ్ నాయక్,డిఎంహెచ్ఓ డా.కామేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డా.రమేష్ నాధ్,పీఆర్ ఎస్ఈ మహేశ్వరయ్య,పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాధ్ రెడ్డి,ఈఈ సతీష్ చంద్ర ,డీఈఈ సూర్యనారాయణ ,అధికారులు,ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Kalyandurga

2020-11-23 16:28:43

మహిళలకు తిరుగులేనిది ’అభయం‘యాప్..

మ‌హిళ‌ల‌కు అభ‌యం యాప్ ఒక అభ‌య‌హ‌స్తం లాంటిద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌, ఎస్‌పి బి.రాజ‌కుమారి పేర్కొన్నారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ప్ర‌తీ ఒక్క‌రూ డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని వారు కోరారు. అభ‌యం ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి త‌న క్యాంపు కార్యాల‌యం నుంచి సోమ‌వారం ప్రారంభించారు. అభ‌యం యాప్‌ను విడుద‌ల చేశారు. త‌మ‌ది మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని, వారి ఆర్థిక‌, రాజ‌కీయ స్వావ‌లంబ‌న‌కు కృషి చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ విష‌యంలో రాజీ ప‌డేది లేద‌ని, వారు నిర్భ‌యంగా ఆటోలు, టేక్సీల్లో ప్ర‌యాణించేందుకే అభ‌యం యాప్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని చెప్పారు. ఏడాదిలోగా ద‌శ‌ల‌వారీగా  ల‌క్ష ప‌రిక‌రాల‌ను ఈ వాహ‌నాల్లో అమ‌ర్చ‌నున్నామ‌ని సిఎం ప్ర‌క‌టించారు. అభ‌యం ప్రాజెక్టు క్రింద కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా ఒక అభ‌యం యాప్‌ను రూపొందించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ద‌శ‌ల‌వారీగా ఆటోలు, టేక్సీల్లో ఒక ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాన్ని ఏర్పాటు చేస్తారు. అభ‌యం యాప్‌ను త‌మ స్మార్టుఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న మ‌హిళ‌లు, బాలిక‌లు, ఆ వాహ‌నం ఎక్కిన వెంట‌నే, ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప‌రిక‌రం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, ఆటో వివ‌రాలు, డ్రైవ‌ర్ వివ‌రాలు స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతాయి. అలాగే తాము ఎక్కిన ప్ర‌దేశం నుంచి వెళ్లాల్సిన ప్ర‌దేశానికి రూట్ మ్యాప్‌ను కూడా న‌మోదు  చేసుకోవ‌చ్చు. వెంట‌నే ఈ వివ‌రాలు 112 పోలీస్ కంట్రోల్ రూముకు చేర‌తాయి. ఒక‌వేళ ఆటో ఆ రూటు కాకుండా, వేరే రూటులోకి వెళ్తే అలారం మ్రోగుతుంది. అలాగే ఆటోలో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ, ఈ మార్పును గ‌మ‌నిస్తే, వెంట‌నే ఆ ప‌రికరంలో ఉన్న‌ పానిక్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేసినా అలారం మ్రోగుతుంది. వాహ‌నానికి ఇంథ‌న స‌ర‌ఫ‌రా బంద్ అయి అది నిలిచిపోతుంది. కొద్దినిమిషాల్లోనే పోలీసులు అక్క‌డికి చేరుకొనే విధంగా ఈ ప్రాజెక్టును, యాప్‌ను రూపొందించారు.            అనంత‌రం క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ మీడియాతో మాట్లాడుతూ మ‌హిళ‌లు, బాల‌లిక‌ల ప్ర‌యాణ భ‌ద్ర‌త‌కు అభ‌యం యాప్ ఎంత‌గానో దోహ‌దం చేస్తుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఒక్కోసారి ఒంట‌రిగా ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తుంద‌ని, అలాంటి స‌మ‌యంలో ఈ యాప్ వారికి వ‌రం లాంటిద‌ని పేర్కొన్నారు. ద‌శ‌ల‌వారీగా ఆటోలు, టేక్సీల్లో ప‌రిక‌రాల‌ను బిగించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పానిక్ బ‌ట‌న్‌ను నొక్కడం ద్వారా, ఆ ప‌రిస్థితినుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. పోలీసులు, ర‌వాణా శాఖ స‌మ‌న్వ‌యంతో అభ‌యం ప్రాజెక్టును నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్‌ చెప్పారు. ఎస్‌పి బి.రాజ‌కుమారి మాట్లాడుతూ అభ‌యం యాప్ మ‌హిళ‌ల‌కు, బాలిక‌ల‌కు అభ‌య‌హ‌స్తాన్ని ఇస్తుంద‌ని అన్నారు. వారి భ‌ద్ర‌త‌కు ఇది ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ క‌ల్పించే విష‌యంలో ఇప్ప‌టికే దిశ యాప్ కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని చెప్పారు. అభ‌యం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ద్వారా మ‌హిళ‌లు ఆత్మ‌స్థైర్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని సూచించారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీ మ‌హిళా ఉప‌యోగించుకోవాల‌ని, సుర‌క్షిత ప్ర‌యాణం కోసం అభ‌యం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని ఎస్‌పి కోరారు. వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లాకు చెందిన‌ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్లు జెవివిఎస్ ప్ర‌సాద్, ఎస్ఎల్ ప్ర‌సాద్‌, ఎఎంవిఐలు ఎండి భ‌షీర్‌, వి.దుర్గాప్ర‌సాద‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-23 16:25:44

సత్యసాయి ఫౌండేషన్ సేవలు చిరస్మరణీయం..

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జయంతిని పురష్కరించుకొని విశాఖ శ్రీ సత్యసాయి బాబా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన్యంలోని 10 గిరిజన గ్రామాల్లో 550 కుటుంబాల గిరిజనులకు బిందెలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంతగిరిలో సత్యసాయి సభ్యులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఈ పంపిణీ జరిగింది. అటు విశాఖలోని కెజిహెచ్ లో 100 గర్భిణీ స్త్రీలకు చీరలు, బిస్కెట్లు  సూపరింటెండెంట్ డా.మైధిలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సత్యసాయి జయంతిని రోగులకు సేవలు చేయడానికి వినియోగించడం చాలా ఆనందంగా వుందన్నారు. ఆ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం ద్వారా రోగులకు సేవలు చేసే అవకాశ దక్కిందన్నారు. కార్యక్రమంలో సాయిడివోటీలు పాల్గొన్నారు.

Ananthagiri

2020-11-23 15:46:22

శ్రీకాకుళం స్పందనకు 101 వినతులు..

శ్రీకాకుళం జిల్లాలోని కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 101  వినతులు వచ్చినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం లో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ విన్నపాలు తెలియజేశారన్నారు. వాటన్నింటిని వివిధ విభాగాలు, శాఖలకు బదిలీల చేసి వారం రోజుల్లోగా వాటికి పరిష్కార మార్గాలు చూపించాలని అధికారులను ఆదేశించినట్టు డిఆర్వో తెలియజేశారు. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోనులోనే స్పందన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్నారు. స్పందర దరఖాస్తుల విషయంలో ఏ ఒక్కరు అలసత్వం వహించినా వారిపై చర్యలు తీసుకుంటామని డిఆర్వో హెచ్చరించారు.  

Srikakulam

2020-11-23 15:30:38

సత్యదేవుని సన్నిధిలో కార్తీక రద్దీ..

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నధిలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో వ్రతాలు చేయించుకున్నారు. వేకువ జామునుంచే స్వామివారి ఆలయం ఎదురుగా వున్న రావిచెట్టు వద్ద భక్తులు భారీగా బారులు తీరి కార్తీక దీపాలు అలంకరించారు. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో సత్య దేవుని కొండ భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున మూడు గంటల నుండే భక్తులు పెద్ద సంఖ్యలో సత్యదేవుడుని దర్శించుకుంటున్నారు. లాక్ డౌన్ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఇదే మొదటిసారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఈరోజు రికార్డు స్థాయిలో వ్రతాలు జరుగుతున్నా కార్తీకమాసంలో మాత్రం ఈ సంఖ్య మరింత అధికంగా వుంటుంది. అదే సమయంలో ఉపవాస దీక్షల్లో కూడా భక్తులు అధికంగా పాల్గొనడంతో ఎక్కువ మంది స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం దీక్ష పూర్తయిన తరువాత కూడా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తారని చెబుతున్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ప్రసాదాలు కూడా దేవస్థానం సిద్ధం చేసింది..

Annavaram

2020-11-23 15:21:21

అభయం యాప్ తో మరింత భద్రత..

బాలలు, మహిళలకు ఒక అన్నగా భద్రత కల్పించాలనే ధ్యేయంతో పనికేగేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభయం యాప్ ను ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు. బాలలు, మహిళల ప్రయాణ భద్రతకు యాప్ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. రక్షణ, భద్రతలో ఎటువంటి రాజీ ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. దిశా చట్టాన్ని తీసుకు వచ్చామని అన్నారు. అక్కా,చెల్లెమ్మ లకు అండగా ఉంటామని చెప్పారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. బాలలు, మహిళలలు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆటో లపై నమ్మకం లేక యాప్ ఏర్పాటు చేయడం కాదు, మన ఆటో లపై నమ్మకం పెంచేందుకు, ధైర్యం ఇచ్చేందుకు యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యాప్ ద్వారా అంతా మంచి జరగాలని ఆకాక్షించారు. రవాణా శాఖ కమీషనర్ ఎం.టి.కృష్ణ బాబు అభయం యాప్ పనితీరు వివరించారు. ఆటోలకు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఐఓటి పరికరాన్ని, జిపిఎస్ విధానాన్ని అమర్చుతారని, వెబ్ అప్లికేషన్ సహాయంతో వాహనాలను పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. మొదటి విడతలో ప్రధాన నగరాలలో అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రయాణీకుల వద్ద అభయం యాప్ ఉండాలని అన్నారు. యాప్ ను  యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి అభయం యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ ఫోన్ లేనప్పటికి భద్రత పొందే అవకాశం యాప్ లో పొందుపరచడం జరిగిందని అన్నారు. ప్రయాణీకులు వాహనంలో ఎక్కుటకు ముందు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తరువాత వాహనం వివరాలు, డ్రైవర్ వివరాలు అందుబాటులోకి వస్తుందని వివరించారు. వాహనం బయలుదేరుటకు ముందు ప్రయాణీకులకు మూడు దారులను సూచిస్తుందని, ప్రయాణ వివరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు  అందిస్తుందని అన్నారు. స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు వాహనంలో ఉన్న పేనిక్ బటన్ నొక్కితే వివరాలు పర్యవేక్షణ విధానంలోకి వెళుతుందని అన్నారు. డ్రైవర్ ప్రవర్తన భిన్నంగా ఉన్నా, వెళ్లాల్సిన రూట్ మార్చినా పేనిక్ బటన్ నొక్కితే వివరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుతుంది. అచ్చట నుండి సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందుతుందని, తక్షణ చర్యగా వాహనం ఇంజిన్ ఆగిపోయి, రక్షించండి అనే అరుపు వినిపిస్తుందని అన్నారు.  తద్వారా వాహనం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సహాయక చర్యలు చేపడతారని చెప్పారు. కోడ్ స్కాన్ చేయడం ద్వారా, రూట్ ను షేర్ చేయడం, భయం అనిపించిన సమయంలో బటన్ నొక్కడం (పేనిక్ బటన్) వంటి భద్రతా చర్యలు వలన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవచ్చని తెలిపారు. నిర్భయ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం అభయం ప్రాజెక్టును మంజూరు చేసిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 నిష్పత్తిలో నిధులను సమకూర్చుతాయి. అభయం ప్రాజెక్టు విలువ రూ.138.49 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా రూ.83.09 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.55.39 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.58.64 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. 2021 నవంబరు మాసాంతానికి లక్ష ఆటోలను  ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావడం జరుగుతుందని వివరించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, డిప్యూటీ ట్రన్స్పోర్ట్ కమీషనర్ డా.వడ్డి సుందర్, ఎం.వి.ఐ వేణుగోపాల్, సిపిఓ ఎం.మోహన రావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-23 15:12:45

తుంగభద్రలో స్వాత్మాంనందేంద్ర సరస్వతి పూజలు..

తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా సోమవారం సంకల్ బాగ్ పుష్కరఘాట్ లో విశాఖ శ్రీ శారదా పీఘం ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మాంనందేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాత్మాంతందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, కరోనా వైరస్ నిర్మూల జరిగి ప్రజలు శుభిక్షంగా ఉండాలని తాను కోరుకున్నట్టు చెప్పారు. అనంతరం నదీపూజలు నిర్వహించారు.  రాష్ట్రప్రభుత్వం తుంగభద్ర పుష్కరాలకు మంచి ఏర్పాట్లు చేసిందని స్వామీజి కితాబు నిచ్చారు. పుష్కరాల్లో స్నానాలు ఆచరించి పిత్రుదేవతలకు పిండ ప్రధానం చేయడం ద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరి, వారి బిడ్డల రుణం తీరుతుందని స్వామీజి వివరించారు. స్వామివారు రాక సందర్భంగా కర్నూలు జిల్లాలో పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. స్వామీజీకి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు డా.జె. సుధాకర్, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు స్వామి వారికి స్వాగతం పలికారు.

Tungabhadra

2020-11-23 15:01:16

శివనామస్మరణతో భీమేశ్వరాలయం..

భీమేశ్వరాలయం శివనామస్మరణతో మారుమోగి పోయింది.. కార్తీకమాసం రెండవ సోమవారం, మహా పర్వదినం కావడంతో పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో వేదపండితులు కొంతేటి జోగారావు, సోమేశ్వరశర్మ, రాంబాబు, వెంకన్నలు ముందుగా గోపూజలు నిర్వహించారు. అనంతరం భీమేశ్వరస్వామికి జరిగిన తొలి అభిషేక పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం బాలాత్రిపురసుందరీ అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజలు చేశారు. విశేష పూజలు అనంతరం స్వామి వారిని, అమ్మవారిని నూతన పట్టుబట్టలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. జిల్లా నలుమూలాల నుంచి కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవ్వగా కోవిడ్ నిబంధనలు ఆమలు చేస్తూ దేవాదాయ సిబ్బంది భక్తులను దర్శనాలు అనుమతించారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్యూ 100 మంది పాలీసులు, 29 మంది హోంగార్డులతో బందోబస్తు చర్యలు నిర్వహించారు.

Samarlakota

2020-11-23 11:48:24

పరమశివుని ఆలయ ప్రాకారానికి సహకరించండి..

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం బిసికాలనీలోని వెలసిన శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మితమైన పరమశివుని విగ్రహ ప్రాకారానికి భక్తులు దాతలు సహకరించాలని ధర్మకర్త గంగరాజు కోరుతున్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భక్తుల సహకరాంతోనే స్వామివారి విగ్రహం ఏర్పాటు చేసినట్టు చెప్పిన ఆలయ ప్రాకారం, ఆలయం వద్ద షెడ్లు ఇతర అభివ్రుద్ధి పనులకు దాతలు సహకరించాలన్నారు. ముఖ్యంగా మంచినీటి పైపులైన్లు, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లు, ఎవరైనా భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయంలో ప్రాంగణంలో పండుగలు చేసుకోవడానికి షామియానా సామాగ్రి, గోడల సిమ్మెంటు పనులు, పరమశివుని విగ్రహం చుట్టూ విద్యుత్ లైంటింగ్, మంచినీటి పైపులు, మంచినీటి బోరుకి మోటారు, వైరింగ్ పనులు మిగిలి వున్నాయని చెప్పారు. భక్తులు నేరుగా కానీ, 9492509024 నెంబరుకి నేరుగా ఫోన్ పే ద్వారా కూడా విరాళాలు పంపించవచ్చునన్నారు. దాతల పేరుతోనే అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. అదే విధంగా కొత్తగా నిర్మించిన పరమశివుని దర్శించుకోవాలని కూడా ధర్మకర్త కోరుతున్నారు. విగ్రహం ప్రారంభమైన మూడు రోజుల్లోనే 5వేల మంది భక్తులు ఇప్పటి వరకూ సందర్శించుకున్నట్టు ఆయన చెప్పారు.

Annavaram

2020-11-23 09:35:07

శిష్టకరణ అభివ్రుద్ధికి నిర్విరామ క్రుషి..

శిష్టకరణ సామాజిక వర్గం అభివ్రుద్ధికి తమవంతు సహకారం అందించాలని ఇంటక్ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ కోరారు. సోమవారం శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మపర్శన్ కంటి మహంతి అనూషా పట్నాయక్ నుఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, శిష్టకరణాల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారని వారి అభ్యున్నతికి కార్పోరేషన్ ద్వారా సేవలు అందించాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఉపాది, ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు కూడా క్రుషి చేయాలని కోరారు. చైర్ పర్శన్ మాట్లాడుతూ,ప్రభుత్వం, సామాజికవర్గం తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చడంతో తనవంతు బాధ్యతగా పనిచేస్తానని అన్నారు. చాలా సంవత్సరాల తరువాత శిష్టకరణాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే కార్పోరేషన్ ఏర్పడిందన్నారు. దీని ద్వారా సామాజిక అభివ్రుద్ధి, గుర్తింపు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో శిష్టకరణ సంఘం సభ్యులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2020-11-23 08:56:01