1 ENS Live Breaking News

శారధాపీఠాధిపతి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి..

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మరిన్ని కాలాలు జీవించి, విశాఖతోపాటు, రాష్ట్రాన్ని శుభిక్షండా ఉండేటట్టు దీవించాలని కోరుకుంటున్నట్టుు ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ అన్నారు. బుధవారం పీఠాధిపతి జన్మదినోత్సవం సందర్భంగా నగరంలోని  పోలీస్ బేర్స్ వద్దగల బాలుర పాపా హోమ్ లో   ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ గారు హాజరై పిల్లలకు భోజన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దైవాంశ సంభూతులు స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు.  ఈ కార్యక్రమంలో  విశాఖ పార్లమెంట్ వైసీపీ మహిళా ఇన్చార్జ్ పీలా వెంకటలక్ష్మి, పాప హోమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.    

విశాఖ పాపాహోం

2020-11-18 15:12:37

నిరుపేదల సేవలోనే ఆత్మసంతృప్తి..

నిరుపేదలకు వారు కోరుకున్న విధంగా సేవలు అందించడం లోనే పూర్తిస్థాయిలో ఆత్మ సంతృప్తి కలుగుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పక్కి దివాకర్ అన్నారు. బుధవారం  వివేకానంద అనాధ వృద్ధాశ్రమంలో పైలా శివతేజ  చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  శివతేజ జయంతి వేడుకలు వారి కుటుంబ సభ్యులు  సన్నిహితులు పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పక్కి దివాకర్ మాట్లాడుతూ, నిరుపేదల కోసం వివేకానంద సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. కోవిడ్  లో సైతం ఈ సంస్థ ఎనలేని విధంగా సేవలందించింది అని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ప్రతి ఏటా శివతేజ జయంతి వేడుకలను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  వారి కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. శివతేజ  జయంతి, వర్ధంతి సందర్భంగా నగరంలోని అనేక వృద్ధాశ్రమాలలో వారి కుటుంబ సభ్యులు సేవలందిస్తున్నారని ఎంతో మందికి వారికి తోచిన రీతిలో సహాయం చేస్తున్నట్లు చెప్పారు. నగరం లోనిప్రేమ సమాజంతో పాటు  అనేక ఆశ్రమాలకు  శివతేజ తండ్రి పైల దివాకర్ రావు విరాళాలు అందిస్తున్న ఆదర్శనీయమన్నారు. తాజాగా శివతేజ జయంతిని  పురస్కరించుకుని వివేకానంద వృద్ధాశ్రమంలో అతిధుల చేతులమీదుగా అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాన్ని ఘనంగా  నిర్వహించారు. చలి కాలం నేపథ్యంలో వృద్ధులు కు రగ్గులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పైల దివాకర్ వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు, ఇరోతి ఈశ్వర్ రావు, పీతల మూర్తి యాదవ్ తో పాటు పలువురు పాల్గొని తమ వంతు సేవలు అందించారు. అంతకుముందు,  శివ తేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ కాలనీ సాయి బాబా ఆలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు అన్నార్థులకు అల్పాహారం ను దివాకర్ కుటుంబ సభ్యులు  పంపిణీ చేసారు..     

Visakhapatnam

2020-11-18 14:51:07

సర్వీసు రిక్వెస్టులు పెరిగిలా చైతన్యం తేవాలి..

ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అభివృధి, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు స‌చివాల‌యాల ద్వారా మెరుగైన, స‌త్వ‌ర సేవ‌లందించ‌డం ద్వారా గ్రామాల్లోనే త‌మకు ప్ర‌భుత్వ సేవ‌లు అందుతాయ‌న్న నమ్మకం ప్ర‌జ‌ల్లో క‌ల్పించాల‌ని  స‌చివాల‌య సిబ్బందికి సూచించారు. ప్రాజెక్ట్ అధికారి తన పర్యటనలో భాగంగా మంగళవారం పార్వతీపురం జగన్నాధపురం 1, స‌చివాల‌యాన్ని ఆయ‌న  ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామ స‌చివాల‌యం ద్వారా అందిస్తున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మాచారాన్ని స‌చివాల‌యంలో గోడ‌ల‌పై ప్ర‌ద‌ర్శించిన‌ది, లేనిది ప‌రిశీలించారు. సంక్షేమ ప‌థ‌కాల కోసం అందే విన‌తుల ప‌రిష్కారం నిమిత్తం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇ-రిక్వెస్టుల ప‌రిష్కారంపై ఆరా తీశారు. స‌చివాల‌య ఉద్యోగుల హాజ‌రు ప‌ట్టీల‌ను ప‌రిశీలించి సిబ్బంది అంతా ప్ర‌తిరోజు విధుల‌కు హాజ‌రవుతున్న‌ది, లేనిది తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ స‌చివాల‌యాల‌కు మంచి పేరు తీసుకురావ‌డ‌మ‌నేది సిబ్బంది చేతుల్లోనే ఉంద‌ని,  ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిత్యం కృషిచేయాల‌ని సూచించారు.   అనంతరం పెడబొండపల్లి  జిల్లా పరిషత్ హైస్కూల్లో  చేపడుతున్న నాడు నేడు పనులు,  పరిశీలించి సంబంధిత ఆధికారులతొ మాట్లాడుతూ నిర్మాణ పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగవంతం చేయాలని, సంబంధిత అధికారులకు సూచించారు.  ఈ పర్యటనలో ట్రైబల్ వెల్ఫేర్ ఎ.ఇ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2020-11-17 22:39:51

వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ తో జిల్లాకి రూ.13.4 కోట్లు లబ్ది

విజయనగరం, నవంబర్ 17:  జిల్లాలో  వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పధకం కింద 40 వేల 200 మంది రూ. 13.4 కోట్లు లబ్ది పొందనున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.  అదే విధంగా ఈ  అక్టోబర్ లో  జరిగిన పంట నష్టాలకు పెట్టుబడి రాయితీల క్రింద 18.42 లక్షల  రూపాయలను   355 మంది రైతులు నష్ట పరిహారాన్ని పొందనున్నారని తెలిపారు.  మంగళ వారం  ముఖ్యమంత్రి 2019- వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ,  అక్టోబర్ లో జరిగిన అకాల వర్షాల పంట నష్టం పరిహరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసారు.  ఈ కార్యక్రమానికి విజయనగరం నుండి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, శంబంగి చిన  అప్పల నాయుడు , జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్, సంయుక్త కలెక్టర్ జి.సి కిషోర్ కుమార్ హాజరైనారు.  ఈ వీడియో  కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  ఈ అక్టోబర్ లో కురిసిన భారీ వర్షాలకు 33 శాతం పై బడి పంట నష్టం జరిగిన రైతులు 355 మంది ఉన్నారని, 125 హెక్టార్ల పంట నష్టం జరిగిందని, వీరికి 18.42 లక్షల పరిహారాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు.  పంట రుణాలు తీసుకొని సంవత్సరం లోపల తిరిగి చెల్లించిన  రైతులకు 2.41 కోట్ల రూపాయల చెక్కును వీడియో కాన్ఫరెన్స్ అనంతరం లబ్దిదారులకు అందజేసారు.   ఈ సీజన్లో జరిగిన నష్టానికి ఈ  సీజన్లోనే పరిహారం అందడం ఆనందంగా ఉంది: రైతు అబిప్రాయం :  ఈ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఈ సీజన్లోనే పరిహారం రావడం  మొదటిసారిగా చూస్తున్నామని గంట్యాడ మండలం పెంట శ్రీరామ్ పురం గ్రామానికి చెందిన రైతు బోలెం ఎర్రినాయుడు ఆనందాన్ని వ్యక్తం చేసారు. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.   ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన కుటుంబం వ్యవసాయ సహాయం, పొదుపు సంఘాల ద్వారా , అమ్మ ఒడి, తదితర పధకాల ద్వారా 2 లక్షల రూపాయల వరకు లబ్ది పొందామని తెలిపారు. వ్యవసాయం దండగని , వదులుకున్దామని అనుకున్నామని , రైతన్న రాజ్యం వచ్చింది కదా చూద్దామని అనుకున్నామని, అయితే మా  ఉహలకు మించి ఈ ప్రభుత్వం ఆదుకుందని అన్నారు.   ఉమ్మడి కుటుంబం  అయినందున సోదరులందరికి వడ్డీ రాయితీ కింద రూ. 24 వేలు అందిందని, రైతు భరోసా  నగదు వచ్చిందని, ప్రస్తుతం అన్ని విధాలుగా వ్యవసాయమే మేలని భావిస్తున్నామని, అది మీ వల్లనే జరిగిందని ముఖ్యమంత్రి తో తెలిపారు. రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు  సకాలం లో అందుతున్నాయని, పంట నష్టాలూ తగ్గాయని అన్నారు.  గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీలు మేమే కట్టుకునే వారిమని,  ఇన్సూరెన్స్ కూడా మేమే  చెల్లించేవారమని,  మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఆ భారం రైతులకు తగ్గిందని పేర్కొన్నారు.  గతం లో అప్పులపాలై వ్యవసాయం వద్దనుకున్న మాకు   రైతు    బాందవునిగా   మా కష్టాలను తీరుస్తున్నారని తెలిపారు.  ఈ సమావేశం లో వ్యవసాయ శాఖాధికారులు నందు, అన్నపూర్ణ, ఉద్యాన శాఖ డి డి శ్రీనివాస రావు, రైతులు పాల్గొన్నారు.  

Vizianagaram

2020-11-17 22:14:43

అట‌వీభూముల‌పై గిరిజ‌నుల‌కు సాగుహ‌క్కు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని అట‌వీభూముల‌ను సాగుచేసుకుంటున్న పేద గిరిజ‌నుల‌కు సుమారు 50వేల ఎక‌రాక‌లకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ ప‌ట్టాల‌ను పంపిణీ చేయ‌డానికి ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఆర్ఓఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీకి సంబంధించి క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం సాయంత్రం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఏళ్ల‌త‌ర‌బ‌డి అట‌వీభూముల‌ను సాగుచేసుకుంటున్న పేద గిరిజ‌నుల‌కు సాగు హ‌క్కు క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని, ఈ మేర‌కు జిల్లాలో ఇప్ప‌టికే  ప‌ట్టాల‌ పంపిణీని ప్రారంభించామ‌ని తెలిపారు. అర్హులైన వారందరికీ సాగు హ‌క్కు క‌ల్పించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. జిల్లాలో సుమారు 24వేల‌మంది గిరిజ‌నుల‌కు ద‌శ‌ల‌వారీగా దాదాపు 50వేల ఎక‌రాల‌కు సంబంధించి ప‌ట్టాల‌ను పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. దీనిలో భాగంగా తాజాగా 980 మంది గిరిజ‌నుల‌కు సుమారు 1926 ఎక‌రాల భూమికి సాగుహ‌క్కు క‌ల్పించేందుకు మంగ‌ళ‌వారం ఆమోదం తెలిపారు. ఈ స‌మావేశంలో ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీస‌ర్ ఆర్‌.కూర్మ‌నాధ్‌, ఇన్‌ఛార్జ్ డిఎఫ్ఓ సందీప్ కృపాక‌ర్‌, జిల్లా అట‌వీశాఖాధికారి(సామాజిక వ‌న విభాగం) ఎస్‌.జాన‌కిరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-17 22:09:49

జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఆర్‌టిఏ అధికారుల స‌న్మానం..

విజ‌య‌న‌గ‌రం జిల్లా జ‌ల సంర‌క్ష‌ణ‌లో జిల్లాకు జాతీయ అవార్డును సాధించిపెట్టిన జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ కు అభినంద‌న‌లు వెళ్లువెత్తుతున్నాయి. జిల్లా ర‌వాణాశాఖ అధికారులు క‌లెక్ట‌ర్‌ను మంగ‌ళ‌వారం స‌న్మానించారు. డిప్యుటీ ట్రాన్స్‌పోర్టు క‌మిష‌న‌ర్ సిహెచ్‌. శ్రీ‌దేవి ఆధ్వ‌ర్యంలో  దుశ్శాలువ‌తో ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ కార్యక్ర‌మంలో సీనియ‌ర్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్లు జె.రామ్‌కుమార్‌, ఎం.బుచ్చిరాజుతోపాటు లీలాప్ర‌సాద్‌, జెవిఎస్ఎస్ ప్ర‌సాద్‌, ఎఎంవిఐలు ఎండి బ‌షీర్‌, యు.దుర్గాప్ర‌సాద్‌, కె.పార్వ‌తి, పి.శిరీష‌, కాశీరామ్‌నాయ‌క్‌, సిబ్బంది పాల్గొన్నారు.  గుర‌జాడ సాంస్కృతిక  స‌మాఖ్య త‌ర‌పున కె.ప్ర‌కాష్‌, డాక్ట‌ర్ ఏ.గోపాల‌రావు మాష్టారు జిల్లా క‌లెక్ట‌ర్ ను శాలువ‌తో స‌న్మానించారు. అలాగే ప‌ద్మ‌నాభం ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్‌లోని ట్రెజ‌రీ సిబ్బంది సైతం క‌లెక్ట‌ర్‌ను స‌త్క‌రించారు.

Vizianagaram

2020-11-17 22:06:59

స్వచ్ఛసర్వేక్షణ్ లో మంచి స్థానం సంపాదించాలి..

స్వచ్ఛ సర్వేక్షణ్-2021 పోటీలలో విశాఖ నగరానికి ఉత్తమ స్థానం తీసుకు రావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన పిలుపునిచ్చారు.  మంగళవారం జీవిఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజారోగ్య అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ – 2020లో జరిగిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ -2021లో ఉత్తమ ర్యాంకు పొందాలంటే కింద స్థాయి అధికారులనుండి పై స్థాయి అధికారి వరకు బాగా కృషి చేయాలని స్వచ్ఛతా యాప్ ఉపయోగించాలని, ప్రజలను చైతన్యవంతులు చేసి ఫీడ్ బ్యాకులు పెంచాలన్నారు. డోర్ టు డోర్ చెత్త కలక్షన్ చేయాలని, గృహాల నుండి చెత్త పద్దతిగా ఇవ్వకపొతే వారికి గృహాల వద్ద పూర్తీ అవగాహన కల్పించాలన్నారు. కాలేజిలలోను, ఆర్.డబ్ల్యూ.ఏ. తోను సమావేశాలు నిర్వహించి, స్వచ్ఛతపై అవగాహన పెంచాలన్నారు. హోమ్ కంపోష్ట్ ల తయారీకి, మహిళా గ్రూపులను ప్రోత్సహించాలన్నారు. బిన్స్ పూర్తిగా నిండకుండా చూడాలన్నారు. ముఖ్యంగా బిన్ ఫ్రీ సిటీగా డిశంబరు ఒకటవ తేది నుండి ప్రారంభించడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. దసపల్లా లే అవుట్లో చెత్త తరలించినప్పటికీ మరల చెత్త వేస్తున్నారని, చెత్త వేయకుండా చూడాలన్నారు. ఇంకా బహిరంగ మల మూత్ర విసర్జన అక్కడక్కడ ఉన్నందున అక్కడ ప్రజలను చైతన్యవంతులను చేసి మరుగుదోడ్డ్లు ఉపయోగించేలా చూడాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం, మూత్ర విసర్జన మొదలగువాటిపై జరిమానా విధించాచాలన్నారు. చెత్త తరలించే వాహనాలు ఉదయం 6.30 కు ఎం.ఎస్.ఎఫ్. కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యనిర్వాహక ఇంజినీరును ఆదేశించారు. చెత్త తరలింపు విషయంలో ఎక్కడ అలసత్వం  ఉండకూడదన్నారు. మెకానికల్ ఇంజినీరింగు అధికారులు కూడా ఉదయం పూట క్షేత్ర పర్యటనలు నిర్వహించి, గ్రూపులో ఫోటోలు పెట్టాలన్నారు.  ప్రతీ జోన్ లో చెత్త నిర్వహణకు ఉపయోగిస్తున్న ప్రైవేటు వాహనాలకు తగు నియంత్రణ చేయాలని వాటి నిర్వహణ పై తగు దృష్టి సారించి అవి ప్రతీ రోజూ విధులలో ఉండే విధంగా చూడాలని, ఒక వేల వాహనం ఆగిపోతే సంబందిత కాంట్రాక్టరు బాధ్యతా వహించి వాటికి బదులు వేరొక వాహనాన్ని పంపించేలా చూసే బాధ్యతా కార్యనిర్వాక ఇంజినీరు(మెకానికల్) వారిదేనని స్పష్టం చేసారు. కార్యనిర్వాక ఇంజినీరు(మెకానికల్) వారు అందరు కాంట్రాక్టర్లతోను, మెకానికల్ సహాయక ఇంజినీర్లతోను ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రైవేటు వాహనములను ఒక క్రమ పద్దతిలో నడిచేటట్లు ప్రణాళిక తయారు చేసి చూపెట్టాలని  కార్యనిర్వాక ఇంజినీరు(మెకానికల్) ను ఆదేశించారు. వివిధ కార్మిక యూనియన్లకు అనుమతించిన సంఖ్య కన్నా ఎక్కువగా వినియోగిస్తే వారిని విధులలో లేనట్లుగా పరిగణించాలని అందరికి ఆదేశించారు. రిపేర్లు చేయవలసిన చెత్త తోపుడు బళ్లను (పుష్ కార్ట్ లు) ఈ వారంలోగా రిపేరు చేయాలని, మెకానికల్ విభాగం వారికి ఆదేశించారు. చెత్తను రవాణా చేసే వాహనాలకు రిపేర్లు వస్తే వాటిని అక్కడికక్కడే రిపేరు చేయించే విధంగా దూరపు జోన్లు అయిన గాజువాక, అనకాపల్లి, భీమిలిలో  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మెకానికల్ ఇంజినీరును ఆదేశించారు. ఖాళీగా ఉన్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మీకుల స్థానంలో, వారి బంధువుల ఎవ్వర్నీ తీసుకోవద్దని సి.ఎం.ఓ.హెచ్.ని ఆదేశించారు. వచ్చే సమావేశంలో సంబందిత జోనల్ కమిషనర్లు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్ పై తీసుకున్న చర్యలు గురించి  వివరించాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ డా.వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, బయాలజిస్ట్ పైడి రాజు, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.ఎం.ఓ.హెచ్.లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.      

Visakhapatnam

2020-11-17 22:03:03

స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో విశాఖ మరింత సుందరం..

స్మార్ట్ విశాఖ పనులతో నగరం మరింత సుందరం కానుందని వి.ఎం.ఆర్.డి.ఏ. కమిషనర్ కోటేశ్వరరావు, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అన్నారు. మంగళవారం రాత్రి కార్పోరేషన్ ఇంజినీరింగ్ అధికారులతో కలసి మంగళవారం పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పార్కులో కొనసాగుతున్న పనులను మూడు కేటగిరిలుగా విభజించి పరిశీలన చేసి ఇంజినీరింగు అధికారులకు పలు సూచనలు చేసారు. నడక దారి, ప్లాంటేషన్, గ్రీనరీ పనులు, సైకిల్ ట్రాకు, బోటింగు పూల్ ఏరియా, వాలీ బాల్, టేన్నీసు కోర్టుల పనులను నిశితంగా పరిశీలించారు. పార్కులో సోలార్ ట్రీని మరియు సోలార్ బెంచీలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కు లోపల వాహనాల పార్కింగు ఏర్పాటు చేయమని సూచించారు. ముఖ్యంగా పార్కు ప్రధాన గేటు వద్ద సుందరమైన ఆర్చ్ ను తీర్చి దిద్దాల్సిందిగా ఆదేశించారు. పార్కు అభివృద్ధి పనులను డిశంబరు నెలాఖరు నాటికి పూర్తీ చేయాలని సంబందిత కాంట్రాక్టరు ను ఆదేశించారు. ఈ పర్యటనలో కార్పోరేషన్ ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీరు వినయ కుమార్, కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్, పి.ఎం.సి. ప్రతినిధులు, గుత్తేదారు మొదలగువారు పాల్గొన్నారు. 

Visakhapatnam

2020-11-17 21:24:19

విశాఖలో త్వరలో టిడ్కో ఇళ్లు పంపిణీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా అర్హత కలిగిన లభ్దిదారులకు ఏ.పి. టిడ్కో సంస్థ ద్వారా నిర్మిస్తున్న 24వేల గృహాలను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉండాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె, జివిఎంసి సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ ఆషాజ్యోతితో కలసి యు.సి.డి. పధక సంచాలకులు, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.పి.డి.లు, ఏ.పి. టిడ్కో సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, ముందుగా అనర్హులైన వ్యక్తులకు తిరిగి చెల్లించవలసిన సొమ్ము గూర్చి జాబితా సిద్ధం చేయాలన్నారు. టిడ్కో ప్రాజెక్టులో నిర్మితమౌతున్న వివిధ కేటగిరీల గృహాలను మంజూరు చేయుటకు గాను తగు అర్హత కలిగిన లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని జోనల్ కమిషనర్లును ఆదేశించారు. గృహాలు మంజూరు చేసి లబ్దిదారులకు బ్యాంకు ఋణం మంజూరు చేయించుటకుగాను తగు చర్యలు చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆషాజ్యోతి, యు.సి.డి. పధక సంచాలకులు  వై. శ్రీనివాస రావు, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.పి.డి.లు, ఏ.పి. టిడ్కో సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జివిఎ:సీ కార్యాలయం

2020-11-17 21:04:29

శ్రీముఖలింగంలో గోత్రనామాల ఉచ్ఛారణ..

కార్తీక మహోత్సవాలలో భాగంగా శ్రీ వరాహి సహిత ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ఉచితంగా గోత్రనామాలను జపించుటకు నిర్ణయించామని ఆలయ ప్రధాన అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కోవిడ్ కారణంగా భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చే అవకాశం లేనందున ఈ ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. కార్తీక మాస ఉత్సవాలలో 108 పాదాలుగా గల జన్మ నక్షత్ర దోషాలు పోవడానికి గోత్ర నామాలు, కుటుంబ సభ్యుల పేర్లు పూజలో ఉచ్ఛరిస్తామని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్  వాట్సాప్ 9493577098 నంబరుకు గోత్ర నామాలు, పేర్లు పంపించవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనిని పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తామని, ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసామని ఆయన వివరించారు. భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Srikakulam

2020-11-17 20:59:57

20 నుంచి చదువంటే మాకిష్టం..

చదవడం మాకు ఇష్టం కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ తెలిపారు. విధ్యార్ధుల్లో పాఠశాల స్థాయిలోనే  పఠనాశక్తిని పెంపొందించే లక్ష్యాంతో  విధ్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని జిల్లా విద్యా శాఖ అధికారి తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా చదవడం మాకు ఇష్టం కార్యక్రమాన్ని విద్యా శాఖ ప్రవేశ పెట్టిందని చెప్పారు. ఈ మేరకు కార్యక్రమం అమలుపై సమగ్ర శిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ పి.వి.రమణ, ఉప విద్యా శాఖ అధికారి పగడాలమ్మలతో మంగళ వారం జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో చర్చించారు. వచ్చే ఏడాది నవంబరు 1వ తేదీ నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విధ్యార్ధుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించాలన్నది కార్యక్రమం లక్ష్యమని ఆమె వివరించారు. జిల్లాలో గల ప్రభుత్వ అధీనంలోగల అన్ని పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విధ్యార్ధులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ నెల 20న  రాష్ట్ర వ్యాప్తంగా చదవడం మాకు ఇష్టం (వుయ్ లవ్ రీడింగు) కార్యక్రమాన్ని విధ్యాశాఖ అధికారులు ప్రారంభిస్తున్నారని తెలిపారు.  గ్రామ స్థాయిలో ప్రధానోపాధాయ్యులు,  మండల స్థాయిలో ఎంఈఓలు పర్యవేక్షిస్తారని చెప్పారు.  స్కూల్ కాంప్లెక్స్  ప్రధానోపాధ్యాయులు తమ క్లస్టర్ పాఠశాలల్లో ఆమలయ్యేలా చర్యలు చేపడతారని ఆమె పేర్కొన్నారు. తరగతి వారీగా గ్రంధాలయ నిర్వహణ :చదవడం మాకు ఇష్టం కార్యక్రమంలో భాగంగా విధ్యార్ధుల స్థాయిలకు అనుగుణంగా సంబందిత ఉపాధ్యాయులు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తారని డి.ఇ.ఓ చెప్పారు. విధ్యార్ధులు అందరూ తెలుగు, ఇంగ్లీషు చదవగలిగేలా ప్రత్యేక తర్ఫీదునివ్వాలని, గ్రామ, మండల కమిటీ సభ్యులు చర్చించుకొని కార్యాచరణ  రూపొందించింది ఆమలు చేయాలని ఆమె సూచించారు. తరగతి ఉపాధ్యాయుడు ఆ తరగతి  విధ్యార్ధులకు  లైబ్రేరియన్ గా వ్యవహరిస్తారని, గ్రంధాలయంలో పుస్తకాల నమోదు, పుస్తక నిర్వహణ తరగతి వారీగా ఉండాలని వాటి బాధ్యత ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలకు అప్పగించాలని పేర్కొన్నారు. వారంలో ప్రతి శుక్రవారం సాయంత్రం విధ్యార్ధులకు పుస్తకాలు ఇచ్చి శని, ఆదివారాలలో ఇంటి వద్ద చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పారు. చదివించాల్సిన  పుస్తకాలు : పాఠశాలల్లో ఇప్పటికే సేకరించిన వివిధ పుస్తకాలను ఉపాధ్యాయులు చదివించాలని, తరగతుల వారీగా  ఏర్పాటు చేసుకున్న గ్రంధాలయంలో విద్యార్ధులు పఠించుటకు ప్రతిరోజూ రెండు గ్రంథాలయ పిరియడ్లను కేటాయించాలని అన్నారు. సామాజిక పఠనా కేంద్రాలు (కమ్యూనిటి రీడింగ్  సెంటర్స్) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కథలు, పత్రికలు, ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు, వైజ్ఞానిక విశేషాల పుస్తకాలకు ప్రాధాన్యమివ్వలని ఆమె పేర్కొన్నారు. విధ్యార్ధులను ఆకర్షించే కార్యక్రమాల్లో భాగంగా పుస్తక నేస్తం, పఠన ఉత్సవాలు, పఠన మేళాలు, గ్రామ కథా వేదిక వంటి కార్యక్రమాలు నిర్వహించాలని డి.ఇ.ఓ తెలిపారు.

Srikakulam

2020-11-17 20:57:22

నిర్ధిష్ట కార్యాచరణతో పని చేయాలి..

రైతు కుటుంబాలను ఆదుకోవడానికి నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికతో పని చేయాలని వ్యవసాయాధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్  తెలిపారు.  మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విత్తనాల పంపిణీ, రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, ఈ క్రాప్ నమోదు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.. కరోనా సమయంలో చాలా కష్టం అనుభవించారని, వారిని  ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.    రబీలో అవసరమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు.  వేరుశనగ, మినుగులు, పెసలు, రాగులు వంటి విత్తనాల సరఫరాపై సమీక్షించారు. మండలవారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి వారికి అవసరమైన విత్తనాల వివరాలను తెలుసుకుని సరఫరా చేయాలన్నారు.  గ్రామ సచివాలయాలలో సంక్షేమ పథకాల వివరాలతో పాటు లబ్దిదారుల వివరాలను ప్రదర్శించాలని, అదే విధంగా రైతు భరోసా కేంద్రాలలో సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా  వివరాలు, ఇ-క్రాపింగ్ నమోదు వివరాలను తప్పని సరిగా ప్రదర్శించాలని చెప్పారు.  ఆర్.బి.కె.లలో కియోస్కులు సరిగా పనిచేయాలని అన్ని ఆర్.బి.కె.లలోను కియోస్కులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్.బి.కె.లను సక్రమంగా నిర్వహించాలని,  వ్యనసాయాధికారులు ఆర్.బి.కె.లను సందర్శించాలని తెలిపారు.   శతశాతం ఈ క్రాప్ పూర్తి కావాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులు రిజిస్టర్ కావాలన్నారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిశంబరు మొదటి వారం నాటికి సిధ్ధం చేయాలన్నారు.   తేమ శాతాన్ని పరీక్షించే యంత్రాలు, అవసరమైన పరికరాలతో  సిద్ధం గా ఉంచాలన్నారు.  ధాన్యం నిలువకు కావలసిన కెపాసిటీని పెంచడం జరిగుందన్నారు.  ఒరిస్సా నుండి ధాన్యం రాకుండా అవసరమైన  చర్యలు తీసుకున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు కావలసిన అన్ని చర్యలతో ముందుగా నే కొనుగోలు కేంద్రాలను సిధ్ధం చాయాలన్నారు.  అనంతరం, సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ మాట్లాడుతూ, స్వఛ్ఛంద సంస్థలకు  కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను అప్పగించడం జరిగిందని తెలిపారు. వారి పరిధిలోని కేంద్రాలకు అవసరమైన సామగ్రిని, పరికరాలను అందిస్తామని  వాటిని సక్రమంగా నిర్వహించాలని  జె.సి. తెలిపారు.  ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్,  సివిల్ సప్లైస్ జిల్లా మేనేజరు ఎ.కృష్ణారావు, విత్తనాభివృధి సంస్థ జిల్లా మేనేజర్,  పి.సి.సి. ఇన్-ఛార్జ్ లు, ఎ.డి.ఎ.లు, ఏ.ఓ.లు, వెలుగు పి.ఎ.సి.ఎస్.లు, ఎఫ్.పి.ఓ.లు, స్వఛ్ఛంద డైరక్టర్లు ఎం.ప్రసాదరావు, భూదేవి, కైలాష్ తదితరులు హాజరైనారు.

Srikakulam

2020-11-17 20:47:20

రైతులకు ఎంత చేసినా తక్కువే –సీఎం

రైతులకు ఎంత చేసినా తక్కువే అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలు మరియు పెట్టుబడి రాయితీ పరిహారం కార్యక్రమంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 2019 ఖరీఫ్ పటంకు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు రూ.510 కోట్ల వడ్డీ రాయితీని జమ చేస్తున్నట్లు చెప్పారు. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టాలకు ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని ఇచ్చే సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ప్రారంభించామని ఆయన పేర్కొంటూ సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాలు, వరదలకు నష్టపోయిన పంటకు 1.66 లక్షల మంది రైతులకు రూ.135.73 కోట్ల సహాయాన్ని అందించామని, అక్టోబరులో కురిసిన వర్షాలకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన రైతులకు రెండు నెలల లోపే పెట్టుబడి రాయితీగా రూ.132 కోట్లను అందిస్తున్నామని ఆయన చెప్పారు. రైతుల తరపున రూ.1031 కోట్ల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించుటకు ఏర్పాట్లు చేసామని పేర్కొన్నారు. అమూల్ సంస్ధతో అనుసంధానం చేసి పాలసేకరణను ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్లు సి.యం ప్రకటించారు.         వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలుగా శ్రీకాకుళం జిల్లాలో 76,106 మంది రైతులకు రూ.10.68 కోట్లను జమ చేయగా, పెట్టుబడి రాయితీ పరిహారం క్రింద 288.75 హెక్టార్లకు గాను 1438 మంది రైతులకు రూ.43.32 లక్షలను జమ చేసారు.         ఇచ్చాపురంకు చెందిన రైతు ఇసురు యాదవ్ రెడ్డి మాట్లాడుతూ తనకు పెట్టుబడి రాయితీ లభించిందన్నారు. పంట నష్టపోయిన నెల రోజులు లోపు పెట్టుబడి సహాయం అందడం చరిత్రలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి జగన్ మోహన రెడ్డి మంచి దార్శనికుడని, రైతుల పక్షపాతి అన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేసే ముఖ్య మంత్రి దొరకడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పారు.         కోటబొమ్మాళి మండలానికి చెందిన రోణంకి మల్లేశ్వర రావు మాట్లాడుతూ సున్నా వడ్డీ తనకు లభించిందన్నారు. రుణాలు తీసుకున్న వారికి లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ అమలు చేయడం మంచి పరిణామమని అన్నారు. రైతులను ప్రోత్సహించే ప్రభుత్వం అన్నారు. లక్షలాది రైతులకు ఇది భరోసాగా నిలుస్తుందని మల్లేశ్వర రావు అన్నారు. ముఖ్య మంత్రిగా జగన్ మోహన్ రెడ్డి దీర్ఘకాలం పనిచేసి రైతులను ఆదుకోవాలని ఆకాంక్షించారు.         ఈ సందర్బంగా రైతులకు చెక్కులను పంపిణీ చేసారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురాం, జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, డిడి రాబర్ట్ పాల్, ఎడి బివి తిరుమల రావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ కరిమి రాజేశ్వర రావు., దువ్వాడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.  

Srikakulam

2020-11-17 20:39:00

ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ రూపకర్త సీఎం వైఎస్ జగన్..

  ప్రత్యేక వ్యవసాయ రూపకర్త రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలు మరియు పెట్టుబడి రాయితీ పరిహారం కార్యక్రమంలో  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం మీడియాతో శాసన సభాపతి మాట్లాడుతూ దేశంలోనే ప్రత్యేక బడ్జెట్ ను రూపకల్పన చేయడం చారిత్రాత్మకమన్నారు. సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 2019 ఖరీఫ్ పటంకు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు రూ.510 కోట్ల వడ్డీ రాయితీని జమ చేయడం జరిగిందన్నారు. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టాలకు ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని ఇచ్చే సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ప్రారంభించడం సంతోషదాయకమని కొనియాడారు. రైతుల తరపున రూ.1031 కోట్ల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించుటకు ఏర్పాట్లు చేస్తామని చెప్పడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వై.యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలుగా శ్రీకాకుళం జిల్లాలో 76,106 మంది రైతులకు రూ.10.68 కోట్లను జమ చేయగా, పెట్టుబడి రాయితీ పరిహారం క్రింద 288.75 హెక్టార్లకు గాను 1438 మంది రైతులకు రూ.43.32 లక్షలను జమ చేసారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం రైతులకు చెల్లింపు చేయడం విశేషమని పేర్కొన్నారు. రైతులకు మద్ధతు ధర ప్రకటన, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, గిడ్డంగుల సౌకర్యం, ధరల విశ్లేషణ, మార్కెంటింగు విశ్లేషణ వంటి అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. గ్రామీణ స్ధాయిలో రైతులకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న రైతు కార్యక్రమాలను ప్రజలు చరిత్రలో మరిచిపోలేరని ఆయన ప్రశంసించారు. రైతుల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.

Srikakulam

2020-11-17 20:35:17

రైతుకు ఆత్మస్ధైర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం..

రైతులకు ఆత్మస్ధైర్యం కల్పించడమే రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. మంగళవారం వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలు మరియు పెట్టుబడి రాయితీ పరిహారం కార్యక్రమంలో  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం మీడియాతో ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా భావించే రోజును త్వరలో ముఖ్య మంత్రి తీసుకురానున్నారని చెప్పారు. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్న ముఖ్య మంత్రి రైతుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రైతుకు ఒక్క రూపాయి కూడా భారం కాకుండా సి.యం చర్యలు చేపడుతున్నారని ఆయన అన్నారు. జల కళ కార్యక్రమం ద్వారా పుష్కలంగా సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రైతుకు సాగు నీరు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం జలకళ అన్నారు. ఉచిత విద్యుత్ ను 9 గంటల పాటు అందిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమయ్యే సమాచారాన్ని అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ప్రగతి పథంలో నడవడానికి రైతు అతి ముఖ్యమైన వ్యక్తి అని సి.యం భావిస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మంచి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రి నిలుస్తారని ఆయన అన్నారు.

Srikakulam

2020-11-17 20:32:49