1 ENS Live Breaking News

భావనపాడు పోర్టుతో ప్రయోజనం - డిప్యూటీ సీఎం

భావనపాడు పోర్టు వలన జిల్లాకు ఎంతో ప్రయోజనకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు.భావనపాడు పోర్టు నిర్మాణంపై తయారు చేసిన డిపిఆర్ పై కలెక్టర్ కార్యాలయంలో  సమీక్ష జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రైట్స్ సంస్థ రూ.3669.95 కోట్లతో రూపొందించిన డిపిఆర్ ను ఆమోదించారని తెలిపారు. పోర్టు వలన జిల్లాకు ప్రత్యేకంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. మొదటి దశలో 3 సాధారణ బెర్తులతో పాటు ఒక బల్క్ బెర్తు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో 9.18 మిలియన్ టన్నుల కార్గో సామర్ధ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. పోర్టు నిర్వాసితులతో సామరస్యధోరణిలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా అభివృద్ధికి, ఆ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ బ్రేక్ వాటర్స్ ఉత్తరం వైపున ఫింగర్ జెట్టి ఒక దానిని ప్రతిపాదించాలన్నారు. తద్వారా దేవునళ్తాడ, భావనపాడు గ్రామస్తులు వినియోగించుకోగలరని చెప్పారు. పోర్టుకు రైల్వే కనెక్టివిటీ రానుందని అన్నారు. నిర్వాసితులకు, భూ సేకరణకు రూ.12 వందల కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దేవునళ్తాడ, భావనపాడు మధ్య గల తీర ప్రాంతం పోర్టు నిర్మాణానికి అత్యంత అనువైనదని చెప్పారు. ఏపీ మారిటైమ్ బోర్డ్ జెట్టి నిర్మాణానికి కూడా సానుకూలంగా ఉందని అన్నారు. సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. డిపిఆర్ తయారీ సంస్థ రైట్స్ ఏజిఎం శర్వానంద్ మాట్లాడుతూ డిపిఆర్ ను గూర్చి వివరించారు. మొదటి దశలో 150 ఎకరాల్లో స్టోరేజి, మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు చత్తీస్ ఘడ్, జార్ఖండ్,దక్షిణ ఒడిషా తదితర రాష్ట్రాలు పోర్టు సేవలను ప్రధానంగా వినియోగించుకోగలవని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జేసీ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డిప్యూటీ కలెక్టర్ పి.అప్పారావు, సర్వే ఎడి ప్రభాకర్, మత్స్య శాఖ జెడి పివి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-11 21:51:33

హోమ్ ఐసోలేషన్ కు ప్రాధాన్యత..జిల్లా కలెక్టర్ జె.నివాస్

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ ప్రాథమిక లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడి ఎస్ సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ పై వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ ప్రాథమిక లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాజిటివ్ కేసుల ప్రాథమిక కాంటాక్టులు హోమ్ క్వారంటీన్ లోనే ఉండాలని, హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటీన్ లో ఉన్నవారు విధిగా ఇంట్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ వారు బయటకు తిరగరాదని కలెక్టర్ చెప్పారు. జిల్లావ్యాప్తంగా హోం ఐసోలేషన్ లో 3,920 మంది ఉన్నారని, రోజుకు 8 వందలు వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయన్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా హోమ్ ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇచ్చి తగు పర్యవేక్షణ చేయాలని, మందుల కిట్లు అందించాలని ఆదేశించారు. అవసరమైన వారికి సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన వారిని తప్పనిసరిగా కోవిడ్ కేర్ కేంద్రాలకు తరలించాలని, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కేసులు పెరగకుండా పర్యవేక్షణ చేయాలని, ఇంటింటి సర్వే చేస్తూ జ్వరం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని, పరీక్షల కిట్లకు జిల్లాలో కొరత లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎన్. అనురాధ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బి.జగన్నాధరావు, ఐసిడిఎస్ పథక సంచాలకులు డా. జి.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-11 20:01:11

జివిఎంసికి 6వేల మాస్కులు వితరణ చేసిన విశాఖ డెయిరీ

మహా విశాఖ నగర పరిధిలో కరోనా నియంత్రణలో భాగస్వాములుగా ఎంతో సేవలందిస్తున్నారని విశాఖ డెయిరీ సీఈఓ ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఈమేరకు శుక్రవారం పారిశుధ్య కార్మికుల రక్షరార్ధం 6వేల మాస్కులు జీవిఎంసికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జివిఎంసీ పరిధిలో పారిశుధ్య కార్మికులు వీటిని తప్పకుండా ధరించి విధులు నిర్వహించాలన్నారు. ఏ ఒక్కరూ కరోనా వైరస్ భారిన పడకుండా ఉండేందుకు విశాఖ డెయిరీ వంతుగా వీటిని అందజేస్తు న్నామని చెప్పారు. ఈ మాస్కులను అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుకి అందజేశారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులను గుర్తించి మాస్కులు వితరణ చేయడం అభినందనీయమన్నారు. స్వచ్చందంగా ఈరకమైన సహకారం అందించే దాతలను జీవిఎంసి గుర్తిస్తుందన్నారు. వారి సహాయంతో అందించిన మాస్కులను పారిశుధ్య కార్మికుల కోసం వినియోగిస్తామని విశాఖ డెయిరీ సీఈఓకి తెలియజేశారు. 

మహా విశాఖ నగరపాలక సంస్థ

2020-09-11 19:53:39

స్వచ్ఛ సర్వేక్షణ్ 2021కి నివాసిత సంఘాల సహకారం అవసరం

విశాఖ నగరం మరింత సుందరంగా, స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి 2021వలో జరుగబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ కు నివాసిత సంక్షేమ సంఘాల సహకారం చాలా అవసరమని అదనపు కమిషనర్ డా.వి.సన్యాసి రావు అన్నారు.  జివిఎంసీ కమిషనర్ డా. జి. సృజన ఆదేశాల మేరకు, నగరంలోని నివాసిత సంక్షేమ సంఘాల ప్రతినిధులతో స్వచ్ఛ్ సర్వేక్షన్ -2021 కార్యక్రమాలపై సోమవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  స్వచ్ఛ సర్వేక్షణ్-2021 సర్వే అంశాలపై స్వచ్ఛ భారత్ మిషన్ విధి విధానాలను రూపొందించినదని చెప్పారు. ముఖ్యంగా నివాసిత సంక్షేమ సంఘాలు చేపట్టవలసిన కార్యక్రమాలపై విశాఖనగరం ఉత్తమ స్థానం సాధించగలదన్న ఆయన దానికి ప్రతీ ఆర్.డబ్ల్యూ.ఏలు సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రతీ వార్డులో తప్పనిసరిగా ప్రతీ ఇంటి నుంచి చెత్త విభజన, సేకరణ జరగాలని, తడి చెత్త నుండి ఎరువును తయారు చేయుటకు సహకరించాలన్నారు. ఈ సంవత్సరం, గార్బేజ్ ఫ్రీ సిటీ 3 - స్టార్ రేటింగ్ వచ్చిందని, జరగబోయే స్వచ్చ సర్వేక్షణ్-2021నకు మన నగరానికి తప్పనిసరిగా 5 - స్టార్ రేటింగ్ రావడానికి ఆర్. డబ్ల్యూఏ. ల సహకారంతో జి.వి.ఎం.సి. కృషి చేస్తుందన్నారు. ఆర్. డబ్ల్యూ.ఏ లు, బల్క్ వేస్ట్ జెనెరేటర్లు తడి చెత్తనుండి ఆన్ సైట్ కంపోస్టింగు తప్పనిసరిగా చెయ్యాలని తెలిపారు. ప్రతీ ఇంటి నుండి చెత్తను సేకరించుటకు 50 రూపాయలు యూజర్ చార్జీలు వసూలు చేస్తుందని అందుకు ఆర్. డబ్ల్యూ.ఏ. లు సహకరించాలన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకాలని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. జరనున్న స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ప్రజల భాగస్వామ్యం ముఖ్య భూమికను, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రామాణికాలలో ఈ భాగస్వామ్యానికి 1800 మార్కులు ఉంటాయని, సర్వే జరుగుతున్నందుకు బృందానికి ప్రజలు నగర అభివృద్ధి దృష్ట్యా సిటిజెన్ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని చెప్పారు. 1969 నంబరుకు మిస్డ్ కాల్ ద్వారా, My.Gov. వెబ్ సైట్ ద్వారా, స్వచ్ఛతా యాప్ ద్వారా, అవుట్ బౌండ్ కాల్స్ ద్వారా, సర్వేబృందం అడిగిన ప్రశ్నలకు  సానుకూల సమాధానాలు అందించాలన్నారు.  ఆర్.డబ్ల్యూ.ఏ. లు స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో చేపట్టే ప్రచార కార్య క్రమాలు, అవగాహన కార్య క్రమాలు S.B.M. పోర్టల్ (అప్లోడ్) పొందు పర్చాలన్నారు

2020-09-11 19:44:37

మావోయిస్టులపై ఏడాది నిషేధం..ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు కార్యకలాపాలపై ఏడాదిపాటు నిషేధాన్ని పొగిడిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ భధ్రతా చట్టం 1992 ప్రకరం ఈ ఉత్తర్వులు పొడిగింపు కొనసాగుతుందని పేర్కొంది. కాగా ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఏడాది పాటు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో తెలియజేసింది. మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుంబంధ సంస్థలు రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ పైనా ఇదే ఉత్తర్వులు అమలు జరుగుతాయని కూడా తెలిపింది. ఇదిలా వుండగా విశాఖ ఏజెన్సీలోని 15 రోజుల్లో రెండు మూడు సార్లు తుపాకుల మొత మోగింది. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మన్యంలోకి మావోయిస్టు రాష్ట్రపార్టీ నాయకులు వచ్చేరనే సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులు తారపడటంతో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు ఫైరింగ్ ఓపెన్ చేయగానే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ ప్రభుత్వం నిషేధం విధించిన అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Velagapudi

2020-09-11 15:52:25

వంశీ బాగున్నారా..CMవైఎస్ జగన్ ఆత్మీయ పలకరింపు

ఏం వంశీ బాగున్నారా...అంటూ విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు సిహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ ను సీఎం వైఎస్ జగన్ జగన్మోహనరెడ్డి ఎంతో ఆత్మీయంగా పలుక రించారు. శుక్రవారం వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించిన తరువాత అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖప ట్నం నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతోపాటు వంశీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖజిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తోమా ట్లాడానికి ముందుగానే ఏం వంశీ బాగున్నారా అంటూ పలకరించడం విశేషం. అనంతరం వైఎస్ ఆసర పథకాన్ని మహిళల అభివ్రుద్ధికోసమే చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలిచ్చిందో వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. అధికారులు ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చేయడంలో విశేషంగా క్రుషిచేయాలని అన్నారు. సీఎం వైఎస్ జగన్ వంశీని పలుకరించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది...

కలెక్టరేట్

2020-09-11 15:32:29

రిజర్వేషన్ కలిగిన వారికే ప్రత్యేక రైలు ప్రవేశాలు..

కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 4.0 సడలింపుల్లో భాగంగా సెప్టెంబరు 12 నుంచి అదనపు రైలు సేవలను ప్రకటించిందని ఈస్ట్ కోస్టు రైల్వే, వాల్తేరు డివిజనల్ రైల్వే కమర్షియల్ మేనేజర్  ఏకె త్రిపాఠి చెప్పారు. శుక్రవారం ఆయన విశాఖలోని రైల్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా  రిజర్వేషన్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులకు మాత్రమే అనుమతి కల్పిస్తున్నట్టు చెప్పారు. రైలు ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా మాస్కు, ఫేస్ షీల్డులు ధరించాలన్నారు. వీటితోపాటు సామాజిక దూరం పాటిస్తూనే రావాలని, అదేవిధంగా రైలులో కూర్చోవాలని చెప్పారు. ప్రతీస్టేషన్ లో ఎక్కే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేసిన తరువాత మాత్రమే లోనికి అనుమతిస్తారన్న ఆయన ప్రయాణీకులే సొంత దుప్పట్లు తెచ్చుకోవాలని సూచించారు. గమ్యస్థానంలో దిగిన తరువాత కూడా ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు పాటించాల్సి వుంటుందన్నారు. కేంద్రం నిర్ధేశించిన ఈ మార్గదర్శకాలను పాటిస్తూ, రైల్వేకి సహకరించడంతోపాటు, కరోనా వైరస్ నియంత్రణలో బాగస్వాములు కావాలని డిసిఎం త్రిపాఠి సూచించారు.

వాల్తేరు రైల్వే

2020-09-11 14:21:52

లీజు బంకుల్లోనే అధిక మోసాలు..లీగల్ మెట్రాలజీ ఐజీ

రాష్ట్రంలో ఎక్కువగా లీజుకు తీసుకున్న పెట్రోల్ బంకులలో మోసాలు జరుగుతున్నాయని లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ ఇస్పెక్టర్ జనరల్ పోలీస్ ( ఐజి) ఎం కాంతా రావు అన్నారు.  గురువారం మంగళగిరి తెనాలి జంక్షన్  బైపాస్  రోడ్డు భారత్ ప్రెటోల్ బంక్ లో ఆకస్మిక తనీఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కాంతారావు మాట్లాడుతూ,  రాష్ట్రంలో 300 ప్రెట్రోల్ బంకులు లీజ్ పద్దతిలో నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉందన్నారు.  వాటిపై నిఘా పెట్టామన్న ఆయన  పెట్రోల్ బంకులు లీజుకు ఇవ్వడం నేరమన్నారు. అనధికారికంగా  బంకుల లీజుల నిర్వహణ వ్యవహరం ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు.  ఎక్కడైన లీజు కు తీసుకున్న బంకులలో అయిల్ కొట్టించుకోవాలంటే అలోచన చేయాల్సిందే..  ఎక్కువగా చిప్ మోసాలు జరిగే అవకాశాలు మెండుగా వున్నాయన్నారు. యజమానులు నడిపే ప్రెట్రోల్ బంకులలో చిప్ మోసాలు తక్కువగా వున్నాయి. మోసాలకు అవకాశం వున్న మిషన్లకు అనుమతులు ఇవ్వవద్దని ఢిల్లీ లీగల్ మ్రెట్రాలజీ వారికి లేఖ వ్రాసినట్లు తెలిపారు.  ఆయిల్ కొట్టించుకొనే సమయంలో ప్రజలు  ప్రజలందరూ ఆయిల్ కొట్టించుకొనే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.  అంతేకాకుండా బంకులలో అనుమానం వస్తే  5 లీటర్ల  క్యాన్ ద్వారా పరీక్షించే అధికారం ప్రతీ వినియోగదారుడికీ ఉందన్నారు. ఆయిల్ కొట్టించుకొనే సమయంలో "0" చేసి కొడుతున్నారో లేదో చూసుకోవాలన్నారు..  ఎక్కడైనా ఫ్యూయల్ యంత్రాల్లో తేడాలు ఉంటే  ప్రతి ప్రెటోల్ బంకు వద్ద బోర్డులపై వున్న తనీఖీ అధికారుల  ఫోన్ నెంబర్లకు  ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఈ సందర్భంగా  లీగల్ మెట్రాలజీ గుంటూరు జాయింట్ కంట్రోలర్ ( జెసి) రామ్ కుమార్ .  ప్రెట్రోల్ బంకులలో జరిగే చిఫ్ మోసాలపై డెమో అవగాహన కల్పించారు.  తనీఖీలలో  లీగల్ మెట్రాలజీ ఫ్లైయింగ్ స్వాడ్ విజయవాడ డిప్యూటీ కంట్రోలర్  కాకి ఐజక్, డిప్యూటీ కంట్రోలర్ మనోహార్ , తెనాలి అసిస్టెంట్ కంట్రోలర్ పి లిల్లీ తదితరులు పాల్గోన్నారు.

Tenali

2020-09-10 20:26:00

సచివాలయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..

 గ్రామ,వార్డు సచివాలయ  రిక్రూట్ మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, గ్రామ, వార్డు సిబ్బంది రిక్రూట్ మెంట్  పరీక్షలు నిర్వహించే అధికారులు, పరీక్షలు ప్రారంభా నికి ముందు, జరుగుతున్న సమయంలో , పూర్తయిన తర్వాత చేయవలసిన పనుల మీద పూర్తి అవగాహనతో శ్రధ్ధ తో పని చేయాలని సూచించారు.  గతంలో పరీక్షలు నిర్వహణ లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా వాటి అనుభవాలను పరిగణలోకి తీసుకొని పరీక్షలు సక్రమంగా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఈనెల 20 నుంచి  ప్రారంభం కానున్న స‌చివాల‌య ఉద్యోగాల రాత‌ప‌రీక్ష‌ల నిమిత్తం కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప‌రీక్షా కేంద్రాల‌వ‌ద్ద ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. కేంద్రాల్లోకి ప్ర‌వేశించే ప్ర‌తీ అభ్య‌ర్థికీ థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ నిర్వ‌హించి, శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను త‌నిఖీ చేయాల‌న్నారు.  శానిటైజ‌ర్ వేసి, చేతులు శుభ్రం చేసుకున్న త‌రువాతే లోప‌లికి పంపించాల‌ని చెప్పారు. మాస్కులు ధ‌రించిన వారిని మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించాల‌ని, అవసరమైతే ఉపయోగించడానికి ప్ర‌తీ కేంద్రంలో మాస్కుల‌ను కూడా రిజ‌ర్వులో ఉంచాల‌ని సూచించారు. కోవిడ్ పాజిటివ్ రోగులు ప‌రీక్ష‌లు రాసేందుకు అనుగుణంగా ప్ర‌తీ ప‌రీక్షా కేంద్రం వ‌ద్దా ప్రత్యేక గదులను  ఏర్పాటు చేయాల‌న్నారు. ప్ర‌తీ ప‌రీక్షా కేంద్రంవ‌ద్ద ఒక ఎఎన్ఎంను ఏర్పాటు చేయాల‌ని, శానిటైజ‌ర్లు, మాస్కులు, థ‌ర్మ‌ల్ థర్మామీటర్లు, ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌, అవ‌స‌ర‌మైన‌ మందుల‌ను కూడా సిద్దంగా ఉంచాల‌ని సూచించారు.  అభ్య‌ర్థులు ప‌రీక్షా కేంద్రానికి చేరుకొనేందుకు వీలుగా ఆర్‌టిసి అధికారులు బ‌స్సులు ఏర్పాటు చేయాల‌ని ఆయన సూచించారు.  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  మాట్లాడుతూ ప‌రీక్ష‌ల వివ‌రాల‌ను, చేస్తున్న ఏర్పాట్ల‌ను వివ‌రించారు. జిల్లాలోని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో  ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నామ‌ని, మొత్తం 1,50,441 మంది ఈ ప‌రీక్షల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని చెప్పారు.  ఈ నెల 20 నుంచి 26వ తేదీ వ‌ర‌కు,  ఉద‌యం 10 నుంచి 12.30, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5 గంట‌లు వ‌ర‌కూ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌న్నారు.  ప్ర‌తీ అభ్య‌ర్థి క‌నీసం 45 నిమిషాల‌ముందు ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంద‌న్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోసం   మొత్తం 512  ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా అభ్యర్థుల మ‌ధ్య భౌతిక దూరాన్ని పాటించేందుకు అనువుగా  ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ప‌రీక్షా కేంద్రాల‌ను  క్ల‌ష్ట‌ర్లుగా విభ‌జించి, ప్ర‌తీ క్ల‌ష్ట‌ర్‌కు ఒక స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా జిల్లా అధికారిని నియ‌మిస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే  సెంట‌ర్ల స్పెష‌ల్ ఆఫీస‌ర్లు, రూట్ ఆఫీస‌ర్లు,  ఛీఫ్ సూప‌రింటిండెంట్లు,  అద‌న‌పు ఛీప్ సూప‌రింటిండెంట్లు,  హాల్ సూప‌రింటిండెంట్లను, ఇన్విజిలేట‌ర్లను నియమించినట్లు  వారికి సమగ్ర శిక్షణ ను ఇవ్వనున్నట్లు వివ‌రించారు. ఈ స‌మావేశంలో జీవియంసి కమీషనర్ జి.సృజన, డి ఆర్ ఓ  ఎ.ప్రసాద్, జిల్లా పరిషత్ సిఈఓ నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, డిఎంహెచ్ఓ విజయ లక్ష్మి,  డి.ఆర్.డి.ఎ. పీడీ విశ్వేశ్వరరెడ్డి, డీఈవో లింగేశ్వర రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

కలెక్టరేట్

2020-09-10 20:18:01

భీమిలి ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు కృషి..మంత్రి

విశాఖజిల్లా  భీమిలి నియోజకవర్గంలో  యువతకు  ఉద్యోగ అవకాశాలు కొరకు పరిశ్రమలను స్థాపించేందుకు కృషి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు,  శంకుస్థాపనలు చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూట్ మిల్లు సమస్య పరిష్కరించటంతో పాటు  స్థానికంగా మరిన్ని కంపెనీల  ఏర్పాటుతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు.  కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. పాదయాత్ర లో ప్రజా సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అన్ని మతాలను వారి విశ్వాసాలను ఆయన గౌరవిస్తారని, రాష్ట్రం ప్రజలందరూ తమ ప్రభుత్వం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు.  భీమునిపట్నం మండలం, రేఖవాణిపాలెం పంచాయితీ మరడపాలెం గ్రామంలో రూ.13  లక్షలతో నిర్మించిన సిసి డ్రైన్స్, మూలకుద్దు గ్రామంలో రూ.70 లక్షల మూలకుద్దు నుంచి శ్రీనగర్ కాలనీ వరకు 1.50 KM  నిర్మించిన   సి.సి రోడ్లను ప్రారంభించి,  రూ.15 లక్షలతో నిర్మించే ఆరోగ్య కేంద్రానికి  శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా అందిస్తున్న  పోషకాహార కిట్లను గర్భవతులకు, బాలింతలకు అందజేశారు. వార్డు వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నీటి సమస్య ఉందని  స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొని రావటంతో వెంటనే స్పందించి నీటి సమస్య లేకుండా ట్యాంకుల ద్వారా  నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు , అధికారులు పాల్గొన్నారు.

Bheemili

2020-09-10 20:12:43

ప్రభుత్వం ఛలో అంతర్వేదిని అడ్డుకోవడం సిగ్గుచేటు..

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుసదాడనులను నిరసిస్తూ.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014తర్వాత హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింన్నారు. 2014నుంచి 2019వరకు టీడీపీ హయాంలో దేవాలయాలు కులగొట్టారన్న కన్నా ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండతో మతమార్పిడి, డేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయని తీవ్రంగా ఆరోపించారు. గుంటూరులో, పిట్టపురం, ఉద్రజావారం, ప్రకాశం బ్యారేజీ వద్దకుడా, నెల్లూరు జిల్లాలో భుఅక్రమనలు, ఇప్పుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం దగ్ధం చేయడం ఇవన్నీ నిదర్శనాలు కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతిస్థిమిటంలేని వారుచేసారని చేతులు దులుపుకో వడం ఎంతవరకూ సమంజసమని, ఆలయంలో రక్షణ చర్యలు తీసుకోకపోవడమే ఈ సంఘటకు  ప్రధాన కారణమని దుయ్యబట్టారు. దాడులకు గురైన వాటిని వెంటనే బాగుచేయలని డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనలో ఇంతవరకు ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోక పోవడం కూడా ఒకనాటకమని ఆరోపించారు. రాష్ట్రంలో పెద్ద దేవాలయాలను, చిన్న దేవాలయాలను వెంటనే హిందువులకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు చేసిన వాటిని ఖండించడానికి వెళ్ళేవారిని అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రతిఒక్క హిందువు ఈఘటనలను ఖండించాలని కన్నా పిలుపునిచ్చారు.

Guntur

2020-09-10 12:40:05

దేవాలయల నిధులు బ్రాహ్మణ కార్పోరేషన్ కి ఇస్తారా..?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి కొట్లాదిగా నిధులను ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఉత్తరాంధ్ర  బీజే పి ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. బుధవారం విశాఖ నగరంలోని బీజేపి నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేవాలయాలు కేవలం బ్రాహ్మణులకే సొంతంకాదని హిందూ సమాజంలో ప్రతీఒక్కరికీ హక్కు ఉంటుందన్నారు. అలాంటప్పుడు ఒక్క బ్రాహ్మణులకే ఈ నిధులు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపడుతోందన్నారు. తక్షణం ఆ నిధులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై సీబిఐ విచారణ చేయించాలన్నారు. అసలు తప్పు చేసిన వారిని వదిలిపెట్టి అధికారులపై చర్యలు తీసుకుంటే ఏం ఒరుగుతుందన్నారు. అంతర్వేది ఆలయంలో జరిగిన వ్యవహారంలో హిందువుల మనోబావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్న ఆయన ఎక్కడైతే దేవాలయాలు క్షేమంగా ఉంటాయో ఆ రాష్ట్రం శుభిక్షంగా వుంటుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్త రథానికి నిధులు మంజూరు చేస్తే...అసలు దోషులు ఎలా బయటకి వస్తారని ప్రశ్నించారు. దోషులను పట్టుకున్న తరువాత స్వామివారి రధాన్ని తయారు చేయించాలని ప్రభుత్వానికి సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక నిఘాతో కూడిన రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Visakhapatnam

2020-09-09 21:55:05

భళా విశాఖ..కరోనా నియంత్రణలో ముందంజ..

రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు చేపట్టిన చర్యలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ నేతృత్వంలో 19 పారామీటర్ లలో శతశాతం పాయింట్లు సాధించి మొదటి స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి..వినయ్ చంద్ జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ, అన్ని ఆసుపత్రుల డాక్టర్లు, అధికారులు, సిబ్బంది అందరూ నిర్విరామంగా నిబద్దత తో కృషి చేసి జిల్లాని ప్రథమ స్థానంలో నిలిపినందుకు అభినందించారు. ఐ సి యూ పడకలు, ఆక్సిజన్ పడకల నిర్వహణ, ఆసుపత్రులలో చేరిన వారిని త్వరగా కోలుకుని డిశ్చార్జి గావించడం,  అదేవిధంగా ఆసుపత్రిలో చేరిన వారిలో  మరణాలు ఎక్కువగా సంభవించకుండా, కూడా 100 శాతం పాయింట్లు సాధించారు. ప్రతీరోజూ  ఆస్పటల్ రిపోర్టులను పంపించడం,4 పర్యాయాలు మరుగుదొడ్లను, 2 పర్యాయాలు వార్డులను  శుభ్రపరచడం, నాణ్యమైన ఆహారాన్ని సకాలంలో రోగులకు అందించడం,డాక్టర్లు నర్సులు   తరచుగా సందర్శించడం, రోగులకు సేవలు అందించడం, ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆయా ఆసుపత్రుల సిబ్బంది మూడు షిప్టుల్లో  సమర్ధవంతంగా పని చేయడం, హెల్ప్ డెస్క్ నిర్వహణ,  ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు,   బీపీ, షుగరు మొదలైన పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించడం,నోడల్ అధికారుల పనితీరు, పడకలకు తగినట్లుగా డాక్టర్లు, నర్సులు నియమించడం,  కోవిడ్ పరీక్షలు నిర్వహించి బాధితులను గుర్తించడం మొదలైన 19 పారామీటర్స్ లో మొత్తం 2,500 పాయింట్లు కైవసం చేసుకుని విశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది.

Visakhapatnam

2020-09-09 21:45:44

ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు లోన్లు అందించాలి..కమిషనర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో గుర్తించిన  వీధి వర్తకులకు బ్యాంకులు  రుణ సహాయం అందించాలని  జి.వి.ఎం.సి కమిషనర్ డాక్టర్ జి.సృజన బ్యాంకర్లను కోరారు. విశాఖలో బుధవారం  వివిధ అర్బన్ బ్యాంకుల ప్రతినిధులతో  జీ.వీ.ఎం.సీ.  పాత సమావేశ  మందిరంలో సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి స్వానిధి ( స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భాన్  నిధి), జగనన్న తోడు, వైయస్సార్ చేయూత గల పథకాలకు గాను మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ గుర్తించిన వీధి వర్తకులకు, చిన్నచిన్న వ్యాపారస్తులకు, 45 సంవత్సరాలు దాటిన మహిళల లైన  లబ్ధిదారులకు వ్యాపారాలు చేసుకునే నిమిత్తం వారి ఆర్థిక పురోగాభివృద్ధికి తమ వంతు భాగంగా బ్యాంకర్లు రుణ సదుపాయం కల్పించాలన్నారు. పి. ఎం. స్వానిధి పథకం కింద 10,500 మంది లబ్ధిదారుల జాబితాను సంబంధిత బ్యాంకులకు పంపించడం జరిగిందన్నారు. ఒక్క లబ్ధిదారికి  రూ. 10,000/- లు  చొప్పున, జగనన్న తోడు పథకానికి గానూ ఒక లక్ష మంది చిన్నచిన్న వ్యాపారస్తులను  గుర్తించి, వారికి  ఒక్కొక్కరికి పది వేల రూపాయల రుణ సహాయం అందించాలన్నారు. అదేవిధంగా  వైయస్సార్ చేయూత పథకం కింద 45 నుండి 60 సంవత్సరముల వయస్సు గల మహిళలకు వ్యాపారం చేసుకోవడానికి  55,572 మంది లబ్ధిదారులకు రూ.75,000/- లు  నాలుగు సంవత్సరంలో అందించుటకుగాను,  అందులో మొదటి విడతగా రూ.18,250/- లు  ఒక్కొక్క లబ్ధిదారుని  ఖాతాలో ఇప్పటికే జమ చేయడం జరిగిందన్నారు.  మిగిలిన రూ.56,750/-లు బ్యాంకు రుణ సదుపాయం  లబ్ధిదారులకు బ్యాంకర్లు  మంజూరు చేయాలని కమిషనర్ తెలిపారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఈనెల 18వ తేదీలోగా  రుణ సదుపాయం అందించాలన్న కమిషనర్ లోన్లు వచ్చేలా చూడాలని యు సి డి, పి. డి. డా. వై.  శ్రీనివాసరావు ను  కమిషనర్ ఆదేశించారు. ఈ బ్యాంకర్ల సమావేశంలో యు సి డి, పి. డి. డా.  వై.  శ్రీనివాసరావు, ఏ.పీ.డి.లు, డి.ఎం.ఎ.లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ రంగరాజన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వై శ్రీనాథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2020-09-09 21:25:28

పాయకరావుపేటలో అసలేం జరుగుతోంది..?

పాయకరావుపేట నియోజకవర్గంలో అసలేం జరుగుతుంది..నియోజకవర్గ ఎమ్మెల్యేని కాదని ఏకపక్షంగా పనులు చేస్తున్న ఆ నాయకుడిని ఎవరూ ఎందుకు వారించ లేకపోతున్నారు.. యాక్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ కేడర్ ని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారా..అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. నియోజక వర్గంలోని నాకు స్వేచ్ఛకావాలి...ప్రజలకు సేవచేసే భాగ్యం నాకు కల్పించండి.. అంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు కేడర్ ముందు, ప్రజల ముందు గొంతు విప్పుకొని అంతగా ఆందోళన పడేలా నియోజకర్గంలోనే ఏం జరుగుతున్నాయని ?... ఎస్.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో పెట్టిన సమావేశాల్లో నేరుగా ఎమ్మెల్యే తన బాధను, ఆవేదనను మూడునెలల క్రితం  వ్యక్తం చేయడం, దానికి అనుగుణంగానే నియోజకవర్గంలో ఒక నేత వ్యవహరించడం పార్టీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.  తాను చెప్పినట్టుగా వినకపోతే నియోజవర్గ కేడర్ ను రెండు వర్గాలుగా చేస్తానని గతంలో ప్రకటించిన విధంగానే ఆ నాయకుడు, నేరుగా ఎమ్మెల్యే ముందే కొట్టాటకి దిగడమే కాకుండా విషయానికి బలం చేకూరుస్తుంది. అంతేకాదు..ఎమ్మెల్యేని కాదని అవతలి వర్గం వారితో గొడవ పడి కూడా మొత్తం నాయకులందరికీ  తెలిసేలా చేయడంలో ఎవరి అండ చూసుకొని ఇదంతా చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో ఇక్కడ జరుగుతున్న తంతు మొత్తం నిఘా వర్గాలు ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తెలియజేస్తున్నప్పటికీ ఆ నేత తీరులో మార్పురాలేదు సరికదా..మరింత మొండిగా వ్యవహరిస్తూ..తనని కాదని కార్యక్రమాలు నిర్వహిస్తే...అనే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. పైగా తాను ప్రతిపాదించిన వారికే పనులు ఇవ్వాలని, తాను చేసే ఏ కార్యక్రమాల్లో ఎవరూ ఎదురు చెప్పకూడదనే హుకుం జారీ చేసినట్టుగా కేడర్ చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పేరుకి ఎమ్మెల్యే వున్నా హవా మొత్తం ఆ నేతే జరిపిస్తారని కేడర్ ను నమ్మించేంతగా నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఏ చిన్న తప్పు కనిపించినా ప్రతిపక్షాలు వాటిని చిలవలు పలవులుగా చేసి చూపిస్తున్న తరుణంలో ఇలాంటి యాక్టింగ్ ఎమ్మెల్యేల ఆగడాలకు, వ్యవహారాలకు చెక్ పెట్టకపోతే పాయకరావు పేట నియోజకవర్గంలో కేడర్ మొత్తం గ్రూపులుగా మారిపోయే అవకాశం వుంది. ఇప్పటికే అలా గ్రూపులుగా మారడంతోనే సోమవారం రాత్రి ఎమ్మెల్యే ముందే గొడవులు జరిగాయని పార్టీలోని నేతలే చెబుతున్నారు. ఈవిషయంలో ఎలాంటి ఆధారాలను బయటకు పొక్కనీయకుండా మా మాత్రం ఆ నేత ఇటు మీడియాని, అటు పార్టీలో తను భజన చేసే కొందరు నేతలతో కలిపి మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారని చెబుతున్నారు. చేసిన తప్పులు, అవినీతి వ్యవహరాలు రాసే జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం, వారిని బెదిరించడం వంటి కార్యక్రమాలు చేయడంలోనూ ఏ మాత్రం జంకకుండా వ్యవహారాలు చేయగలుగుతున్నారంటే ఏ టార్గెట్ తో, ఎవరి అండ చూసుకొని ఇవన్నీ చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ముందు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి అన్నట్టగా మారిపోయింది ఇక్కడ ఆ యాక్టింగ్ ఎమ్మెల్యే వ్యవహారం..అటు పార్టీగానీ, ఇటు ప్రభుత్వం గానీ ఈయన వ్యవహారాలు, విషయాలు, అజమాయిషి, యాక్టింగ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి...

Payakaraopeta

2020-09-09 21:14:17