1 ENS Live Breaking News

శ్రీగౌరీ గ్రంథాలయానికి జీవీఎంసీ చేయూత..

నిరుద్యోగులకు శిక్షణాలయంగా సేవలందిస్తున్న శ్రీగౌరీ గ్రంథాలయానికి చేయూతనిస్తామని జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌ కొట్యాడ కనకమహలక్ష్మి స్పష్టం చేశారు. శ్రీగౌరీగ్రంథాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాలిటెక్నిక్‌, ఐఐటీ, గ్రూప్‌ 1, 2, సివిల్స్‌ ప్రిలిమినరీ, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్‌ మొదలగు పోటీ పరీక్షల పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కనకమహలక్ష్మి మాట్లాడుతూ పోటీ పరీక్షల పుస్తకాలతోపాటు వివిధ అంశాల్లో చైతన్యం తీసుకువచ్చే సామెతలు, పొడుపు కథలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, ఉన్నత స్థానాలు అధిరోహించిన వ్యక్తుల వైఫల్యాలు, విజయగాథలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ నేర్పే పుస్తకాలు గ్రంథాలయంలో ఉంచాలని ఆమె సూచించారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికలను తప్పనిసరిగా చదవాలని, ఫలితంగా కొత్త విషయాలతోపాటు మన చుట్టూ జరిగే విషయాలు తెలుస్తాయన్నారు. పత్రికలు చదవడం వల్ల సమాజంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో పుస్తకాలు అందించే వెబ్‌సైట్లను వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్ధులు తమకు కావాల్సిన పుస్తకాలను ఆన్‌లైన్‌లో వెతకడానికి అమెజాన్‌ యూజ్డ్‌ బుక్‌ స్టోర్స్‌, బకెట్‌ బోల్ట్‌, యువర్‌ బుక్‌ స్టాల్‌, యో బుక్స్‌, సెల్‌ బై బుక్‌, ఆల్‌ బుక్స్‌ ఆన్‌లైన్‌, బుక్‌ అడ్డా, మై కాలేజ్‌ అడ్డా, బుక్స్‌ నెటవర్క్‌, స్టూడెంట్‌ డెస్క్‌, శ్వాప్‌ ద బుక్‌, బుక్‌ మై బుక్‌, బుక్‌ సెల్‌ బై, కితాబి వంటి వెబ్‌ సైట్లను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే పుస్తకాలు కావాలి, ఇలాంటి స్థితిలో శ్రీగౌరీ గ్రంథాలయం నిరుద్యోగుల అవసరాన్ని తీర్చడం అభినందనీయమన్నారు. శ్రీ గౌరీ గ్రంథాలయం అధ్యక్షుడు మళ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, ఉపాధ్యక్షుడు కర్రి గంగాధర్‌, సభ్యులు మళ్ల సూరిబాబు, కాండ్రేగుల అప్పారావు (కెప్టెన్‌), కర్రి హనుమంతరావు, కాండ్రేగుల సత్యనారాయణ (ఎస్‌.ఎఫ్‌.ఐ.), బుద్ద జోగినాయుడు, కాండ్రేగుల జగ్గారావు, మారిశెట్టి శివరామకృష్ణ, కర్రి శివ తదితరులు పాల్గొన్నారు.    

Anakapalle

2021-07-23 15:54:51

సర్పంచ్ లు అంకితభావంతో పనిచేయాలి..

అంకిత భావంతో పనిచేసి గ్రామాభివృద్ధికి సహకరించండి అని  జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాలా పేర్కొన్నారు. పార్వతీపురం డివిజన్ లో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో పార్వతీపురం, సీతానగరం, కొమరాడ మండలాల  సర్పంచులకు  నిర్వహిస్తున్న రెండవరోజు  శిక్షణా కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల (అభివృధి), జాయింట్ కలెక్టర్ మయుర్ అశోక్ (హౌసింగ్) పాల్గొన్నారు. ముందుగా శిక్షణా కార్యక్రమ నిర్వహణ పై ఆరా తీశారు. అనంతరం శిక్షణకు హాజరైన సర్పంచులతో  మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై, సర్పంచుల విధివిధానాలపై పూర్తిగా అవగాహన కల్పించుకోవలన్నరు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు.

         జాయింట్ కలెక్టర్ మయుర్ అశోక్ మాట్లాడుతూ ఈ శిక్షణ గ్రామంలో మీకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సత్వరం లబ్ధి చేకూరేలా చూడాలన్నారు.

    రెండవ రోజు శిక్షణా కార్యక్రమంలో మండలాల వారిగా వారికి కేటాయించిన గదులలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు, రెండవ రోజు శిక్షణలో నియంత్రణ అధికారులతో గ్రామ పరిపాలన, గ్రామపంచాయతీల  అర్ధిక పరిపుష్టి, ఆర్థిక వ్యవహారాలు, గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, ఇంటి ముంగటికే సంక్షేమ పథకాలు,నవరత్నాలు, గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న వివిధ పథకాలు తదితర అంశాలపై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకటేశ్వర రావు, డి.ఎల్.డి. ఓ రాజ్ కుమార్ మూడు మండలాల గ్రామాలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Garugubilli

2021-07-23 15:24:12

అన్నవరంతో మెరుపులతో భారీ వర్షం..

తూర్పుగోదావరి జిల్లాకు వాతావరణ శాఖ భారీ వర్షాలు సూచించిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి అన్నవరంలో భారీ వర్షం కురిసింది. దానికితోడు ఇదే సమయంలో అనధికార విద్యుత్ కోతలు విధంచడంతో అన్నవరం వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా అన్నవరం దేవస్థానం, బిసీ కాలనీ, నూకాలమ్మ అమ్మవారి దేవాలయం ప్రాంతాల్లో ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగానే ఈ ప్రాంతంలో విద్యుత్ లో లోఓల్టేజి అధికంగా వుంటుంది. ఈ సమయంలో శుక్రవారం దానికి వర్షాలు తోడవడంతో ఇక్కడి ప్రజలు వర్ణణతీతమనే చెప్పవచ్చు. 

Annavaram

2021-07-23 15:14:48

ఆధునిక పద్దతిలో ఈ-క్రాప్ బుకింగ్..

తూర్పుగోదావరి జిల్లాలో గతంలో కంటే మెరుగ్గా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన పద్ధతిలో రైతులకు ఈ-క్రాప్  బుకింగ్ నమోదు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు.  శుక్రవారం  అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, అచుతాపుత్రయం గ్రామంలో ఈ -క్రాప్ బుకింగ్ చేసే విధానాన్ని వ్యవసాయ శాఖ అధికారులు , జాయింట్ కలెక్టర్ రెవెన్యూ జి లక్ష్మీ శ తో కలసి  జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి,అనపర్తి శాసనసభ్యులు డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రైతులకు సంబంధించి ప్రతి గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సింగిల్ స్టాప్ విధానంలో ఫర్టిలైజర్స్, విత్తనాలు, ఎరువులతో పాటు పంట పండించిన తర్వాత పంట మార్కెటింగ్ చేసుకునే విధంగా అన్ని సదుపాయాలు అందించే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయిలో ప్రతి నెల మొదటి శుక్రవారం,రెండవ శుక్రవారం.మండల స్థాయిలోను వ్యవసాయ సలహా మండలి కమిటీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయంపై అవగాహన పెంపొందించుకోవాలి అన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక  రైతు ఎంత విస్తీర్ణంలో, ఏ రకమైన పంట పండింస్తునారో వంటి వివరాలు ఈ-క్రాప్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందని ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానంతో  బయోమెట్రిక్ అథంటీకేషన్ ద్వారా మరింత ఎక్కువ సమాచారం యాప్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు.దీని ద్వారా గతంలో కంటే మెరుగుగా ఈ -క్రాప్  బుకింగ్నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

      అనపర్తి శాసనసభ్యులు డా. సత్తి సూర్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తూ వేల కోట్ల రూపాయలు వ్యవసాయరంగానికి ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానంగా అధిక వర్షాలు, వరదలు సంభవించినప్పుడు పంట పొలాలన్నీ ముంపునకు గురవుతున్నాయని ఈ సమస్యను అధిగమించే విధంగా కాలవలు , డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్త, పూడిక తీసే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు.  అచుతాపుత్రయం గ్రామానికి చెందిన కొంట్టెళ్ళ.సుబ్బారావు వ్యవసాయ పొలం దగ్గర ఈ -క్రాప్ నమోదు ప్రక్రియను కలెక్టర్,ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ ఈ సందర్భంగా గా పరిశీలించారు.   అనంతరం అచుతాపుత్రయం వద్దనున్న పశ్చిమ ఏలేరు కాలువ,కరకుదురు వద్ద నున్న కైకవోలు మురికి కాలువ డ్రైనేజీ పనులను డ్రైనేజీ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే ,జాయింట్ కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మురికి కాలవ డ్రైనేజీలో డ్రోన్ సహాయంతో గుర్రపు డెక్క కు మందు పిచికారీ చేసే విధానాన్ని ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ ,జిల్లా వ్యవసాయశాఖ జేడీ విజయ్ కుమార్, ఆర్టీవో ఏజీ.చిన్నికృష్ణ,ఏడిఏ పద్మశ్రీ, తహశీల్దార్ టీ.సుభాష్, ఎంపీడీవో పీ. విజయ భాస్కర్,మండల వ్యవసాయ అధికారి సిహెచ్. సత్యనారాయణ, డ్రైనేజీ శాఖ ఈఈ లు ,గ్రామ వ్యవసాయ సహాయకులు ,రైతులు పాల్గొన్నారు.

Anaparthi

2021-07-23 13:08:34

రేషన్ బియ్యం పింపిణీ చేసిన జెసి..

ప్రజలకు ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలోగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని జెసి జి.లక్ష్మీశ పేర్కొన్నారు. శుక్రవారం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో  ఎం.శ్రీరంగ నాయకమ్మ రేషన్ షాప్ ను రెవెన్యూ అధికారులు ,ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జేసీ లక్ష్మీశ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానమంత్రి కళ్యాణ అన్న యోజన పథకం కింద ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని, రేషన్ షాప్ లో ఉన్న స్టాకు వివరాలను ,బియ్యం నాణ్యతను, బయోమెట్రిక్ విధానాన్ని  జేసీ ఈ సందర్భంగా పరిశీలించి , లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఏజీ.చిన్నికృష్ణ , తహసిల్దార్ టి.సుభాష్, గ్రామ రెవిన్యూ అధికారి రామకృష్ణ ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Pedapudi

2021-07-23 13:03:56

సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..

ప్రజలకు సేవలందించడంలో గ్రామసచివాలయాలు రాష్ట్రంలోనే ముందుండాలని జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పెదపూడి మండలం, అచుతాపుత్రయం గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) జి లక్ష్మీశ తో కలిసి జిల్లా కలెక్టర్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు, ఇతర సేవలకు సంబంధించిన రిజిస్టర్లను, సిబ్బంది హాజరు పట్టుకను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందరికీ అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. సచివాలయానికి వివిధ సేవల నిమిత్తం వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా గడువులోపు పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి గ్రౌండింగ్ పూర్తి అయిన ప్రతి ఇల్లు నిర్మాణం పూర్తయ్యే విధంగా లబ్ధిదారులను చైతన్యపరచలని కలెక్టర్ తెలిపారు.  ఈ పర్యటనలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆర్డిఓ ఏజి.చిన్ని కృష్ణ , తాసిల్దార్ టి.సుభాస్, ఎంపీడీవో పి.విజయభాస్కర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అచుతాపుత్రయం

2021-07-23 13:00:22

డ్వాక్రా మహిళలకు కోవిడ్ వేక్సినేషన్..

జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ‌,  వైఎస్ఆర్ క్రాంతిప‌థం ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక కోవిడ్-19 వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మం భోగాపురం మండ‌లం పోలిప‌ల్లి పిహెచ్‌సిలో గురువారం ప్రారంభ‌మ‌య్యింది. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశాల మేర‌కు, ఈ కార్య‌క్ర‌మాన్ని డిఆర్‌డిఏ పిడి కె.సునీల్ రాజ్‌కుమార్ ప్రారంభించారు. వ‌య‌సు 45 ఏళ్లు దాటిన‌ వైఎస్ఆర్ క్రాంతిప‌థం, డిఆర్‌డిఏ సిబ్బందితో బాటు, స్వ‌యం స‌హాయ‌క సంఘాల స‌భ్యుల‌కు వేక్సిన్ వేశారు. తొలిరోజు సుమారు 246 మంది వేక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శుక్ర‌వారం జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్‌సిల్లో నిర్వ‌హిస్తామ‌ని పిడి సునీల్ రాజ్‌కుమార్ తెలిపారు. త‌మ శాఖ సిబ్బందితోపాటు, స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లంతా ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని, వేక్సిన్ వేయించుకోవాల‌ని కోరారు. మొద‌టి డోసుతోపాటు, అవ‌స‌ర‌మైన వారికి రెండో డోసును కూడా వేయ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ముఖ్య ప్ర‌ణాళికాధికారి జె.విజ‌య‌ల‌క్ష్మి, వైఎస్ఆర్‌కెపి ఏరియా కో-ఆర్డినేట‌ర్‌, ఎపిఎంలు, పిహెచ్‌సి వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Bhogapuram

2021-07-22 15:43:22

శాకాంబరిగా దర్శమివ్వనున్న నూకాలమ్మ..

అన్నవరంలోని బిసీకాలనీ వేంచేసి వున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి శనివారం శాకాంభరిగా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త గంగరాజు అమ్మవారి అలంకరణకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ, గురుపౌర్ణమిని పురుస్కరించుకొని అమ్మవారిని శాఖాంభరిగా అలంకరించనున్నామన్నారు. అరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకూ ప్రత్యేక దర్శలు, తీర్ధ ప్రసాదాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనుకునే భక్తులు 9492509024 నెంబరు ద్వారా ఆర్ధిక సహాయం, విరాళాలు పంపవచ్చునన్నారు. స్థానికంగా వున్నవారు కమిటీని సంప్రదించి అమ్మవారి అలంకరణకు కూరగాయలను సైతం సమర్పించవచ్చునన్నారు. ఆరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలిరావాలన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి దర్శన ఏర్పాట్లు చేసినట్టు ధర్మకర్త వివరించారు.

Sankhavaram

2021-07-22 13:28:55

వేగంగా వైఎస్సార్ హౌసింగ్ గ్రౌండింగ్..

శంఖవరం మండలంలో వైఎస్సార్  హౌసింగ్ గ్రౌండింగ్ పనులు వేగంగా జరుగుతు న్నాయని తాహసిల్దార్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. గురువారం శంఖవరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలో 1402 ఇళ్లు మంజూరు అయ్యాయని అందులో గాను 400 ఇళ్లు గ్రౌండింగ్ జరిగిందన్నారు. ఈ ఇళ్లన్నీ గుడా పరిధిలోనివేనని తహశీల్దార్ వివరించారు. ప్రస్తుతం లబ్దిదారులు నిర్మాణ సామాగ్రితో పనులు వేగవంతం చేస్తున్నామని తహశీల్దార్ వివరించారు. ఇంకా ఇళ్లు గ్రౌండింగ్ చేయని వారిని కూడా ప్రోత్సహించి ఇళ్ల నిర్మాణానికి ముందుకి తీసుకు వస్తున్నామన్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి ఆదేశాలు కూడా జారీచేసినట్టు తహశీల్దార్ చెప్పారు.

Sankhavaram

2021-07-22 13:27:09

మహిళా పోలీస్ విధు(శెలవు)లెక్కడ..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ముందుచూపులేని కొన్ని నిర్ణయాలు, ఉత్తర్వులు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు, అవమానాలు తెచ్చిపెడుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14వేలకు పైగా వున్న మహిళా పోలీసులకు కష్టాలు తప్పడం లేదు. ఫలితంగా ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది వారి పరిస్థితి.. ఖాకీ చొక్కాలేని, పేరుకే పోలీసులైన గ్రామ, వార్డు పోలీసులకు పోలీస్ శాఖలోని హోంగార్డులు, కానిస్టేబుళ్లు, కొందరు ఎస్ఐల నుంచి వస్తున్న డిఫరెంట్ కామెంట్లతో వీరంతా చాలా ఇబ్బందులకు గురికావాల్సివస్తుంది. అవెలా వుంటున్నాయంటే.. మీరేమైనా నిజమైన పోలీసులనేసుకుంటున్నారా.. మాలాగ శిక్షణ ఏమైనా తీసుకున్నారా.. మీ ఉద్యోగమే పోలీస్ కానీ పోలీస్.. పేరులో పోలీస్ ఉన్నంత మాత్రాన మీరు పోలీసులైపోరు.. అయినా మాది ఇంటర్ క్వాలిఫికేషన్, మీది డిగ్రీ క్వాలిఫికేషన్ అంటూ ఎవరి స్థాయిలో వారు సచివాలయ మహిళా పోలీసులను వివిధ రకాలుగా మాట్లాడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రభుత్వం వీరి ఉద్యోగనియామకాల సమంలో జీఓనెంబరు 129, ఆ తరువాత జీఓనెంబరు 59లు విడుదల చేసిన పోలీస్ శాఖలో జిల్లా ఎస్పీలు, డిఎస్సీలు తప్పా ఆ జీఓలపై మిగిలిన పోలీసులకు అవగాహన లేదు. అలాగని జిల్లా పోలీసులు సైతం వారికి వివరించే ప్రయత్నం కూడా చేయలేదు. ఫలితంగా ప్రభుత్వం గుర్తించినంత మాత్రామ మేము మిమ్మల్ని మాతోపాటు సమానంగా పోలీసులుగా ఎలా గుర్తిస్తామా అనే మాటలు మహిళా పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు వీరు విధులు గ్రామాల్లో నిర్వహిస్తున్నప్పటికీ క్యాజువల్ సెలవులు మాత్రం స్టేషన్ లోని ఎస్ఐ లు దగ్గర తీసుకోవాలంటూ ప్రభుత్వే ఉత్తర్వుల్లో మెలిక పెట్టింది. ఇప్పటికే పోలీసులతో సమానంగా గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను ప్రభుత్వం నియమించడాన్ని జీర్ణించుకోలేని పోలీస్ శాఖలోని కొందరు సిబ్బంది కావాలనే వీరికి ఇచ్చే సెలవుల విషయంలో పలు ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క సచివాలయాల్లో కార్యదర్శిలు కూడా వీరి విషయంలో పక్షపాత దోరణి ప్రదర్శిస్తున్నారు. విధులు చేసేది సచివాలయంలోనూ.. మీకు సెలవులు ఇచ్చేది మాత్రం స్టేషన్ ఎస్ఐలా అంటూ మాట్లాడుతున్నారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో రాష్ట్రవ్యాప్తంగా మహిళా పోలీసుల సర్వీసులు కూడా రెగ్యులర్ కాకపోవడంతో వీరంతా అటు హోంగార్డు నుంచి కానిస్టేబుల్, ఎస్ఐ వరకూ అనే అన్ని రకాల మాటలు పడాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వ శాఖలో అయినా రాష్ట్ర ఉన్నతాధికారులు జీఓలు ఇచ్చినపుడు వాటిని జిల్లా అధికారులు అమలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో జిల్లా అధికారులే మండల అధికారులకు జీఓలోని ముఖ్యమైన అంశాలను మండల, ప్రాంతీయ అధికారులకు వివరించి ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలనే ఆదేశాలు జారీ చేస్తారు. విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువా సుమారు 14 ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శిలు, కమిషనర్లు ఇచ్చిన ఆదేశాలు ఏ ప్రభుత్వశాఖలోనూ అమలు కావడం లేదు. ఏ ఒక్కశాఖ జిల్లా అధికారి కూడా మండల స్థాయిలో ఆ జీఓలను సచివాలయాలకు ప్రోటోకాల్ రూపంలో తెలియజేయజేసే ప్రయత్నం చేయలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే తామంతా పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నామనే ఒకే ఒక్క బలమైన నమ్మకంతో చాలా ఇబ్బందులు పడుతూనే విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులందరికీ సచివాలయ కార్యదర్శిలు(డిడిఓ)లే సెలవులు మంజూరు చేస్తారు. ఐదు అంతకంటే ఎక్కువ రోజులు కావాల్సి వస్తే ఆయాశాఖల జిల్లా అధికారులు, మండల శాఖ అధికారుల అనుమతులు పొందాల్సి వస్తుంది. ఈ క్రమంలో మహిళా పోలీసులకు విధులు సచివాలయంలోనూ, సెలవుల అనుమతి పోలీస్ స్టేషన్ లో పెట్టడంతో ఆ సెలవుల సమయంలో స్టేషన్ పోలీసుల నుంచి వీరంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇలాటి విషయాలన్నీ పోలీస్ డిపార్ట్ మెంట్ లోని ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళుతుంది. ఇక్కడ విచిత్రంగా సచివాలయ మహిళా పోలీసులపై తమ అనుమానాలు, భయాలు, మనసులో వున్న ఆలోచనలతో మాట్లాడే మాటలన్నీ పోలీసు విభాగంలోని ఇంటెలిజెన్స్ మాటలను డిజిపి ద్రుష్టికి తీసుకెళ్లడంలో పక్షపాత దోరణి అవలంభిస్తున్నారు. లేదంటే నిజంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసులను పోలీస్ శాఖలోని కొందరు పోలీసులు అనే మాటలు ఈ పాటికే రాష్ట్ర డిజిపి కార్యాలయానికి చేరాల్సి వుంది. అలా చేరితే అన్ని జిల్లాల ఎస్సీలకు, అన్నిడివిజన్ల ఏఎస్పీలు, డిఎస్పీలకు ఖచ్చితమైన ఆదేశాలు వచ్చేవి. అలా రాకపోవడం వలన పోలీసులు తమ విధులు, గౌరవానికి గ్రామస్థాయిలో ఎక్కడ భంగం వాటిల్లిపోతుందోననే భయంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పైగా మహిళా పోలీసులకు ఖాకీ డ్రెస్సు ఇచ్చే విషయంలో కూడా మొదట కానిస్టేబుళ్లకే ఇష్టం లేని విషయాన్ని ఇపుడు మహిళా పోలీసుల నుంచి తమ ఆలోచనలు తీసుకు స్థాయికి చేర్చాయి( మీకు ఖాకీ డ్రెస్సు కావాలా సివిల్ డ్రెస్సు కావాలా). ఈ తరుణంలో క్యాజువల్ సెలవుల విషయంలో మహిళా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాకపోతే తమ ఇబ్బందులను నేరుగా జిల్లా ఎస్పీలకు చెప్పుకోలేని స్థితిలో వున్న మహిళా పోలీసుల క్యాజువల్ లీవుల సమస్య, వీరు ఎదురుపడితే స్టేషన్ పోలీసులు చేసే కామెంట్ల సమస్యలు ఎప్పటికీ తీరుతాయోనని వీరంతా ఆందోళన చెస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే మహిళా పోలీసులుగా చేరిన చాలా మంది పోలీసులు నుంచి వస్తున్నా ఈ కామెంట్లను తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 మంది వేరే ఉద్యోగాలొచ్చిన సందర్భంలో ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో వారు చెప్పే మాటలు విన్నవారికి నిజంగా స్టేషన్ పోలీసుల నుంచి ఈ స్థాయిలో కామెంట్లు వస్తున్నాయా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.  క్యాజువల్ లీవులు, స్టేషన్ పోలీసులు చేసే కామెంట్ల విషయంపై రాష్ట్ర డిజీపీ నిర్ధిష్ట ఆదేశిలిస్తే ఈ కామెంట్లు, సెలవుల విషయం కొలిక్కి వచ్చేటట్టు కనిపించడం లేదు..చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2021-07-22 01:59:49

enslive ఎఫెక్ట్.. నోబయోమెట్రిక్.. నో సాలరీ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా వెలువడుతున్న  ప్రత్యేక వాస్తవిక కధనాల(న్యూస్ కార్డ్స్)పై  సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సత్వరమే స్పందిస్తుంచడమే కాకుండా. తక్షణమే ఉత్తర్వులు కూడా జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది..! బుధవారం ఉదయం ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ లో.. ‘బయో మెట్రిక్కా.. ఆఒక్కటీ అడక్కు’ అనే శీర్షికపై వచ్చిన కధనం ప్రభుత్వంలో చలనం తీసుకు వచ్చింది. సాయంత్రానికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల 5 సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు లక్షా 18వేలకు పైగా వున్న ఉద్యోగులకు బయో మెట్రిక్ ఆధారంగానే జీతాలు చెల్లిస్తామని, ఖచ్చితంగా విధులకు హాజరయ్యేటపుడు, విధులు ముగించేటపుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ వేస్తేనే జీతాలు వస్తాయని హెచ్చరించింది. బయోమెట్రిక్ లో ఎన్ని రోజులకు హాజరు పడితే అన్ని రోజులకు మాత్రమే జీతాలు ఇస్తామని కూడా ప్రకటించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటైన దగ్గర నుంచి అన్ని విషయాలను ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ద్వారా వాస్తవాలను ఇటు ఉద్యోగులకు, అటు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అభివ్రద్ధి, సేవలు, ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు ఇలా అన్ని కోణాల్లో ప్రత్యేక కధనాలు అందించండలో ముందుంటూ వస్తుంది. ఈ క్రమంలో బుధవారం ప్రచురితమైన వార్తకు సాయంత్రానికే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ మరీ ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సాధారణ మీడియా సంస్థల వార్తల మాదిరిగా లైట్ తీసుకునే ఉద్యోగులు ప్రభుత్వం ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనాలపై వెంట వెంటనే చర్యలకు ఉపక్రమించడం రాష్ట్రంలోనే ప్రభుత్వశాఖల్లో చర్చనీయాంశమవుతుంది. రాష్ట్రంలో ఏ మీడియా సంస్థకూడా ఒక ప్రత్యేక ప్రభుత్వశాఖపై ద్రుష్టి కేంద్రీకరించిన దాఖలాలు లేవు. సచివాలయ వ్యవస్థ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానసపుత్రిక కావడం, దేశంలోనే ఒక వినూత్న ప్రభుత్వశాఖ కావడంతో ఈఎన్ఎస్ మీడియా ఈ ప్రభుత్వ శాఖకు చెందిన లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రజలు, సచివాలయ ఉద్యోగుల ముందు ఉంచుతున్నది. దీనితో గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన తాజా సమాచారం ఎక్కడ వస్తుందనే ప్రశ్నకు ప్రతీ ఒక్కరికీ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ అనే సమాధానం వస్తోంది. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలోని 13 జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల్లో నిత్యం ప్రజలకు అందించే సేవలు, అందించబోయే సేవలపై సమస్త సమాచారం కూడా ఇదే వేగంతో అందిస్తామని కూడా ప్రకటిస్తున్నాం. అలాగని సచివాలయ ఉద్యోగులకు ఏ విషయంలో అన్యాయం జరిగినా, ప్రభుత్వమే విడుదల చేసిన జీఓలను అమలు చేయని విషయంలో వారి తరపున కూడా ప్రభుత్వం ముందుకి వాస్తవాలను తీసుకెళ్లడంలో ప్రాధాన్యత ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖ మాత్రమే కాకుండా ప్రజలకు అనునిత్యం ప్రభుత్వ సేవలు అందించే అన్ని ప్రభుత్వశాఖల సమాచారాన్ని కూడా ఇకపై తాజా తాజాగా అందిస్తామని కూడా ప్రకటిస్తున్నాం. ఆగస్టు 15 తరువాత ఈఎన్ఎస్ న్యూస్ నెట్వర్క్ ను 13 జిల్లాల్లోని అన్ని మండాలకు విస్తరించడానికి  ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దానికి అనుగుణంగానే తాజా సాంకేతికతను కూడా ఈఎన్ఎస్ మీడియా హౌస్ అందిపుచ్చుకుంటోంది. ప్రభుత్వంలో రాష్ట్ర, జిల్లా అధికారులు అత్యధికంగా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ కధనాలను అనునిత్యం పరిశీలిస్తున్న కారణంగానే ప్రభుత్వం నుంచి వచ్చే చర్యలు కూడా అంతే వేగంగా వుంటున్నాయనే విషయం ఈరోజు మరోసారి తేటతెల్లమైంది. ఇదే వాస్తవికతను, వార్తల్లో నాణ్యతను, ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలు, పాఠకులు, ప్రభుత్వం ముందుంచడంలో శక్తివంచన లేకుండా తాజా సమాచారాన్ని తక్షణమే అందిస్తామని తెలియజేస్తున్నాం..

Tadepalle

2021-07-21 16:27:49

మహిళల రక్షణే సీఎం జగన్ ప్రధాన లక్ష్యం..

రాష్ట్రంలో మహిళలు, విద్యార్ధుల రక్షణే ధ్యేయంగా వైఎస్.జగన్మోహనరెడ్డి పనిచేస్తూ.. వారందరికీ తోడుగా నిలవడానికి దిశ యాప్ ను రూపొందించారని ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం శంఖవరం మండల కేంద్రంలోని శ్రీసత్యదేవ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దిశ అవగాహన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అక్క చెల్లమ్మలకు ఆపద సమయంలో వారి దశను మార్చడానికే దిశయాప్ ని ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకు వచ్చిందన్నారు. ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా దిశ ద్వారా పోలీసులు చేరుకునే విధంగా అత్యంత సాంకేతికతో దీనిని రూపొందించాని చెప్పారు. అలాంటి రక్షణ ఇచ్చే యాప్ ను ప్రతీ ఒక్కరూ వారి మొబైల్ ఫోన్లలలో ఇనిస్టాల్ చేసుకొని అత్యవసర సమయంలో పోలీసుల సహాయం పొందాలన్నారు. అంతేకాకుండా గ్రామస్థాయిలో ప్రజలకు రక్షణ కల్పించడానికి కూడా మహిళా పోలీసు అనే వ్యవస్థను కూడా గ్రామసచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజల సంక్షేమం, రక్షణ ఏకకాలంలో చూస్తున్న  ఏకైక ప్రభుత్వం ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. మహిళలంతా దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకుంటే ఒక సెక్యూరిటీ గార్డు వెనుక ఉన్నట్టేనని ఎమ్మెల్యే పర్వత పేర్కొన్నారు. ఎంపీడీఓ రాంబాబు మాట్లాడుతూ, అపోహలు వీడి ప్రతీ మహిళతోపాటు పురుషులు కూడా ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు. అందరూ ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ ఇనిస్టాల్ చేసుకుంటే దైర్యంగా ఉండొచ్చునన్నారు. అన్నవరం ఎస్ఐ రవికుమార్ మాట్లాడుతూ, దిశ యాప్ ఏవిధంగా పనిచేస్తుందో,  అందులోని ఆప్షన్లు వారీగా మహిళలకు వివరించారు. మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష మాట్లాడుతూ, దిశ యాప్ మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. ఆపద సమయంలో ఎదుటి మహిళలకు రక్షణ కల్పించడానికి పురుషులు కూడా దీనిని వినియోగించువచ్చునన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే శంఖవరం మండలంతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గమంతా దిశ యాప్ వినియోగం, రిజిస్ట్రేషన్ లో అగ్రభాగంలో నిలపడానికి ఎమ్మెల్యే విషయంగా క్రుషి చేస్తున్నారని అన్నారు. స్థానిక పంచాయతీలో ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్ ఆధ్వర్యంలోనూ వాలంటీర్లు దిశ యాప్ ఇనిస్టాల్స్ వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వత రాజబాబు, సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, మూడు గ్రామసచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, జూనియర్ సహాయకులు రమణమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు పడాల సతీష్, బైరా శ్రీరామ్మూర్తి, అడపావీరబాబు, పడాల బుజ్జి,  బందిలి వీరబ్బాయ్, మూడు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-21 08:46:04

ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలి..

గ్రామ వలంటిర్లు తమ పరిధిలోగల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి మంగళవారం తన పర్యటనలో భాగంగా సాలూరు మునిసిపాలిటీ పి.ఎన్.బొడ్డవలస ఎం.ఇ స్కూల్ వద్దనున్న వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి వార్డు సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్యం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ కరోనా నిర్మూలనకు సంబంధించిన జాగ్రత్తలు మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకోవాలి అని అందరిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ పర్యటనలో సాలూరు మున్సిపల్, మండల రెవెన్యూ అధికారులు, వార్డు సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Salur

2021-07-20 17:38:19

శంఖవరంలో మెగా దిశ అవగాహనా శిబిరం..

దిశ యాప్ పై నిర్వహించే మెగా అగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపసర్పంచ్ సిహెఎచ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం శంకవరం మండలకేంద్రంలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పర్వతప్రసాధ్ సారధ్యంలో స్థానిక సత్యదేవ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించే కార్యక్రమాన్ని వాలంటీర్లు విజయవంతం చేయాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ యాప్ ని సచివాలయాల్లోని అన్నివర్గాల వారితో ఈయాప్ ఇనిస్టాల్ చేయించాలన్నారు. అలాంటి మంచి కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో 3సచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీసు జిఎన్ఎస్ శిరీష, వీఆర్వో సీతారాం, సచివాలయ జూనియర్ సహాయకులు రమణమూర్తి, సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పడాల భాషా, పడాల సతీష్, శ్రీరామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-20 07:08:49

సర్టిఫికేట్ల విచారణ మహిళా పోలీసులకే..

నూతన ప్రభుత్వ ఉద్యోగుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ బాధ్యత మహిళలకు  అప్పగించడంతో శంఖవరం మహిళా పోలీస్ సోమవారం ఒక ఉద్యోగి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయించారు. ఈ మేరకు మహిళా పోలీస్  జిఎన్ఎస్ శిరీష సోమవారం కత్తిపూడి, శంఖవరం ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో తిరిగి ఉద్యోగుల సర్టిఫికేట్ల నిర్ధార‌ణ  చేపట్టి అన్నవరం స్టేషన్ కి అప్పగించారు. ప్రభుత్వం గతంలో ఈపని స్టేషన్ పోలీసులతో చేపట్టేది. ప్రస్తుతం ప్రభుత్వం సచివాలయ గ్రామ సంరక్షణా కార్యదర్శిలను సాధారణ పోలీసులుగా జీఓ నెంబరు 59 ద్వారా మార్చడంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్ పోర్టు వెరిఫికేషన్లు అన్నీ మహిళా పోలీసులే చేపట్టనున్నారు. ఇవేకాకుండా త్వరలో పాస్ పోర్టు, ఇతర కేసులకు సంబంధించిన గ్రామస్థాయి విచారణ మొత్తం మహిళా పోలీసులే చేయనున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు చెందిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గ్రామ స్థాయిలో మహిళా పోలీసులే చేస్తున్నారు. వీరి సర్వీసులను కూడా ప్రభుత్వం ఈ ఏడాది చివరిలోపుగా దశలవారీగా రెగ్యులర్ చేయనున్నది.

Sankhavaram

2021-07-19 15:28:43