1 ENS Live Breaking News

398 మందికి సెకెండ్ డోస్ కరోనా వేక్సిన్..

శంఖవరం ప్రాధమిక ఆరోగ్యం పరిధిలో 398 మందికి కరోనా టీకాలు వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవిసత్యన్నారాయణ తెలియజేశారు. శనివారం పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసిన 40 కోవీషీల్డ్ వైల్స్ తో 398 మందికి వేక్సినేషన్ పూర్తిచేశామన్నారు. గతంలో ఒకే కేంద్రంలో వేక్సినేషన్ చేసేవారని ఇపుడు మండలంలో నాలుగు చోట్ల ఈ కరోనా వేక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అన్ని కేంద్రాలకు వేక్సినేషన్ సరఫరా చేస్తున్నామన్నారు. ఈరోజు ముఖ్యంగా రెండవ డోసు వేసుకునేవారికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు వైద్యాధికారి తెలియజేశారు. 

Sankhavaram

2021-07-10 15:07:50

శంఖవరంలో 100 మందికి కరోనా టీకా..

శంఖవరం శాస్వత కోవిడ్ టీకా కేంద్రంలో 100 మందికి కరోనా వేక్సిన్ వేసినట్టు సచివాలయ-1 వీఆర్వో సీతారాం తెలియజేశారు. శనివారం ఈ మేరకు శంఖవరం మండల కేంద్రంలోని కోవిడ్ టీకా కేంద్రంలో వీఆర్వో దగ్గరుండి రెండవ డోస్ వారికి టీకాలు వేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేశామన్నారు. దానికోసం ముందురోజు మూడు సచివాలయాల పరిధిలోని వాలంటీర్ల ద్వారా అన్నివార్గాల వారికి సమాచారం అందించి టీకా కార్యక్రమానికి ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, వెల్పేర్ అసిస్టెండ్ చిరంజీవి, సచివాలయం2 కార్యదర్శి సత్య, వైద్య సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పడాల బాష, పడాల షతీష్, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-10 14:29:06

వెంకటేశ్వరస్వామికి మేయర్ పూజలు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు పాయకరావుపేట లోని నక్కపల్లి మండలం ఉపమాక శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం పాయకరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గొల్ల బాబురావు జివిఎంసి మేయర్ దంపతులను సాదరంగా ఆహ్వానించి స్వామి దర్శనం చేయించారు. ఆలయ పూజారులు స్వామి దర్శనం అనంతరం మేయర్ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉపమాక వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, విశాఖ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, విశాఖ అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించామని మేయర్ తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ లైన వీసం రామకృష్ణ, గొర్ల బాబురావు, తాతా రావు, డిఎల్ చందర్రావు తదితరులు పాల్గొన్నారు.

Nakkapalli

2021-07-10 13:43:31

ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతుందని  ప్రత్యేక అధికారి ప్రసాదరావు పేర్కొన్నారు. తెలియజేశారు. శ్రీకాకుళం మహిళా కళాశాల లో  45 దాటిన వారికి, 5 సంవత్సరాల లోపు వయస్సువున్న పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ జరుగుతుందని చెప్పారు. వేక్సినేషన్ చేయించుకోని వారు వార్డు, గ్రామ వాలంటీర్లను సంప్రదించి తక్షణమే కరోనా వైరస్ నియంత్రణకు వేక్సివ్ వేయించుకోవాలన్నారు. ఏ ఒక్కరూ అలక్ష్యం చేయకుండా వేక్సిన్ వేయించుకోవాలన్నారు. కేంద్రంలో వ్యాక్సినేటర్ చాందిని, ఏఎన్ఎం స్వర్ణలత, ఆశావర్కర్లు రాజ్యలక్ష్మి, లక్ష్మి, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-10 11:37:39

ప్రైవేటు టీచర్లకు సరుకులు వితరణ..

కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయి బ్రతుకు జీవనం కొనసాగిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను గుర్తించి వారికి సహాయం అందించడం ఆదర్శనీయమని ఎంపీడీఓ డివిఎస్ పద్మిని  అన్నారు. శనివారం కామవరపు కోట ఆర్ అండ్ బి బంగ్లా వద్ద యాంటీ కరోనా హెల్పింగ్ టీం ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు 11 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎంపీడీవో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత మూడు నెలలుగా యాంటీ కరోనా హెల్పింగ్ టీం సభ్యులు ఎంతో మానవతా ద్రుక్పదం.. దాతల సహాయ సహకారాలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి ఉపాది కోల్పోయిన వారికి తమ వంతుగా సహాయ సహకరాలు అందించాలని ఎంపీడీఓ పిలుపునిచ్చారు. సిపిఐ నాయకులు టీవీఎస్ రాజు హెల్పింగ్ టీం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ టీం సభ్యులు వీరమల్ల మధు, నిజాపరపు దుర్గాప్రసాద్, మున్నంగి శ్రీనివాస్, వీరమల్ల సౌజన్ సాయి, వీరంకి రాటాలు, ప్రైవేటు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Kamavarapu Kota

2021-07-10 09:40:34

దిశ మహిళల జీవితంలో భాగమైపోవాలి..

దిశ యాప్ మహిళల జీవితంలో భాగస్వామ్యం కావాలని మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పేర్కొన్నారు. శుక్రవారం శంఖవరం మండల కేంద్రంలోని గ్రామసచివాలయం2, 3 లలో వాలంటీర్లకు దిశ యాప్ మరింత మందికి ఏ విధంగా చేర్చాలనే విషయమై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ శిరీష మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, విద్యార్ధిని రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ యాప్ ను ప్రతీఒక్కరూ వారి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు. దిశ యాప్ కోసం తెలియనివారికి స్వచ్చందంగా వాలంటీర్లు అవగాహన కల్పించాలన్నారు. మహిళల జీవితానికి రక్షణ దిశ యాప్ ఉండేలా పోలీస్ శాఖ దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రతీరోజూ వారి సచివాలయ పరిధిలోని ఎక్కువ మందితో ఈ యాప్ ఇనిస్టాల్స్ చేయించడంతోపాటు, గ్రామంలో కూడా ఇంటి దగ్గర ఉండే మహిళలకు చైతన్యం కల్పించాలన్నారు. తక్కువ సమయంలో యాప్ ఎక్కువ మందితో ఇనిస్టాల్స్ చేయించిన వాలంటీర్లను మహిళా పోలీస్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-09 15:03:45

ఘనంగా Dr.YSr జయంతి వేడుక..

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ ముందడుగు వేయాలని క్రిష్ణదేవిపేట సర్పంచి పందిరి సత్యన్నారాయణ పేర్కొన్నారు. గురువారం వైఎస్సార్ జయంతి సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వైఎస్సార్ జన్మదినోత్సవం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పెద్ద పండుగలాంటిదన్నారు. వైఎస్సార్ కలలుగన్న గ్రామ స్వరాజాన్ని ముఖ్యమంత్రి గ్రామసచివాలయాలను ప్రజల ముందుకు వినూత్న వ్యవస్థగా ముందుకి తెచ్చారని కొనియాడారు. నేడు గ్రామంలోనే అన్నివర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ పందిరిబుజ్జి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు చుక్కల సత్యన్నారాయణ, కరక చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Krishnadevipeta

2021-07-08 14:31:14

ప్రజా సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారం..

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వినూత్న గ్రామ సచివాలయ విధానంతో ప్రజల సమస్యలను గ్రామంలోనే పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం-2 భవానాన్ని ఎంపీగీత, ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒకప్పుడు ఏదైనా ఒక ధ్రువీకరణ పత్రం కావాలంటే ప్రజలు మండల, జిల్లా కేంద్రాలకు రావాల్సి వచ్చేదన్నారు. అలాంటిది గ్రామసచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏకంగా 745 సేవలు గ్రామంలోనే అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఒకేరోజు ఒకే ప్రాంతంలో మూడు గ్రామసచివాలయ భవనాలను డా.వైఎస్సార్ జయంతిరోజున ప్రారంభించడం ఆనందంగా వుందన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు శాస్వతంగా సేవలందించడానికి ఏర్పాటు చేసిన ఎంతో అమూల్యమైన వ్యవస్థ గ్రామ, వార్డు సచివాలయ విధామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లిబాబు, ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు,  గ్రామ ఉప సర్పంచ్, కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తి, జానియర్ అసిస్టెంట్ రమణమూర్తి, గ్రామ ఉప సర్పంచ్, చింతంనీడి కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత సత్యన్నారాయణమూర్తి, కొండమూరి చంటిబాబు, సర్పంచ్ బందిలి చిన్నయ్యమ్మ, మండల మేనేజర్ పడాల సతీష్, పడాల బాషా,బిసి కార్పోరేషన్ డైరెక్టర్ కిల్లి పార్వతి, కార్యకర్తలు మూడు సచివాలయాల కార్యదర్శిలు, వీఆర్వోలు, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సచివాల సబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. 

Sankhavaram

2021-07-08 14:16:16

గ్రామస్వరాజ్యం YSRCP తోనే సాధ్యం..

దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ అన్నారు.  గురువారం శంఖవరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం-3 భవనాన్ని ఎంపీ  వంగా గీత, జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి, ఆర్డీఓ మల్లిబాబులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ప్రజలకు గ్రామంలోనే అన్ని సేవలు అందించడానికి ఈ సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున నూతన భవనాలను నిర్మించారన్నారు. దివంతగత ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన గుర్తుగా ఈ నూతన భవనాలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఒకేసారి మూడు సచివాలయ భవనాలు ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల కోసం ఏం చేయడానికైనా..సంక్షేమం కోసం ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడదనే విషయం ఒక్క గ్రామ సచివాలయాలను చూసి చెప్ప వచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో  ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు,  గ్రామ ఉప సర్పంచ్, కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తి, జానియర్ అసిస్టెంట్ రమణమూర్తి, గ్రామ ఉప సర్పంచ్, చింతంనీడి కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత సత్యన్నారాయణమూర్తి, కొండమూరి చంటిబాబు, సర్పంచ్ బందిలి చిన్నయ్యమ్మ, మండల మేనేజర్ పడాల సతీష్, పడాల బాషా,బిసి కార్పోరేషన్ డైరెక్టర్ కిల్లి పార్వతి, కార్యకర్తలు మూడు సచివాలయాల కార్యదర్శిలు, వీఆర్వోలు, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సచివాల సబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. 

Sankhavaram

2021-07-08 13:58:59

ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు..

ప్రజల గుమ్మం ముందుకే సేవలు అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిందని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని నూతంగా నిర్మించిన గ్రామసచివాలయం-1  భవనాన్ని ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు గ్రామంలోనే 745 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసి గ్రామసచివాలయాల ద్వారా ప్రజలు పూర్తిస్థాయిలో సేవలు గ్రామాల్లోనే పొందాలని ఆమె కోరారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ,  గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్.జగన్మోమహన రెడ్డి ఈ సచివాలయ వ్యవస్తను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. మహిళలు, గ్రామ సంరక్షణ కోసం మహిళా పోలీసులు, దిశ యాప్ ను కూడా స్థాపించారన్నారు. అన్ని జిల్లాల్లోనూ దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి అక్క, చెల్లమ్మలకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సచివాలయ భవనాలను ఎంతో చక్కగా నిర్మించారన్నారు. శంఖుస్థాపన, ప్రారంభంలోనూ ఎమ్మెల్యే పాల్గొనడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లిబాబు, ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు,  గ్రామ ఉప సర్పంచ్, కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తి, జానియర్ అసిస్టెంట్ రమణమూర్తి, గ్రామ ఉప సర్పంచ్, చింతంనీడి కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత సత్యన్నారాయణమూర్తి, కొండమూరి చంటిబాబు, సర్పంచ్ బందిలి చిన్నయ్యమ్మ, మండల మేనేజర్ పడాల సతీష్, పడాల బాషా,బిసి కార్పోరేషన్ డైరెక్టర్ కిల్లి పార్వతి, కార్యకర్తలు మూడు సచివాలయాల కార్యదర్శిలు, వీఆర్వోలు, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సచివాల సబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. 

Sankhavaram

2021-07-08 13:48:28

వీబీఆర్ఐ అభివృద్ధికి ప్రత్యేక చ‌ర్య‌లు..

సామ‌ర్ల‌కోట‌లోని ప‌శువైద్య జీవ‌శాస్త్ర ప‌రిశోధ‌న సంస్థ (వీబీఆర్ఐ)ను ద‌శ‌ల వారీగా మ‌రింత అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని, రూ.20 కోట్ల‌తో ప్ర‌తిపాద‌న‌లు రూపొందించి రాష్ట్ర ప్ర‌భుత్వానికి పంపించిన‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. రూ.2.24 కోట్ల ఖ‌ర్చుతో వీబీఆర్ఐ ప్రాంగ‌ణంలో ఏర్పాటుచేసిన కోళ్ల వ్యాధి నిరోధ‌క టీకా మందుల నాణ్య‌తా ప‌రీక్ష‌ల లేబొరేట‌రీ (క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌)ను క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ 1978-79లోనే  సామ‌ర్ల‌కోట‌లో ఏర్పాటు చేసిన కోళ్ల వ్యాధినిరోధ‌క టీకా మందుల ఉత్ప‌త్తి కేంద్రం రాష్ట్రంలోని 13 జిల్లాల అవ‌స‌రాల‌ను తీర్చుతోంద‌ని, నాణ్య‌మైన టీకాలు అందిస్తూ కోళ్ల ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తూ స‌న్న‌, చిన్న‌కారు రైతుల ఆర్థిక స్వ‌యంస‌మృద్ధికి ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని పేర్కొన్నారు. ఉన్న‌త ప్ర‌మాణాల‌తో ఈ కేంద్రంలో చేప‌ట్టిన ఆధునికీక‌ర‌ణ చ‌ర్య‌ల వ‌ల్ల ఏడాదికి 280 ల‌క్ష‌ల మోతాదుల టీకా మందుల‌ను ఉత్ప‌త్తి చేసే స్థాయికి చేరింద‌న్నారు. గ‌తంలో ఇక్క‌డ ఉత్ప‌త్తి చేసిన టీకాల‌కు నాణ్య‌తా ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు హైద‌రాబాద్‌లోని రాజేంద్ర‌న‌గ‌ర్‌కు పంపాల్సి వ‌చ్చేద‌ని, అయితే డ్ర‌గ్ కంట్రోల్ ప్రాధికార సంస్థ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఎక్క‌డ ఉత్ప‌త్తి చేసిన టీకాల‌ను అక్క‌డే నాణ్య‌తా ప‌రీక్ష‌లు చేసేందుకు వీలుగా ఇప్పుడు కొత్త‌గా రూ.2.24 కోట్ల‌తో ల్యాబ్‌ను ఏర్పాటు చేసి, ప్రారంభించిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలోని పెర‌టి కోళ్ల‌కు ఉచితంగా టీకా అందించి వాటి ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు, అధిక ఉత్ప‌త్తులు సాధించేలా చేయ‌డంలో ఈ టీకా ఉత్ప‌త్తి కేంద్రం కీల‌క‌పాత్ర పోషిస్తున్న‌ట్లు ప‌శుసంవ‌ర్థ‌క శాఖ జేడీ సూర్య‌ప్ర‌కాశ్‌రావు తెలిపారు. కోళ్ల‌లో వ‌చ్చే తీవ్ర ప్ర‌మాద‌క‌ర వ్యాధుల‌కు సంబంధించి టీకాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో సామ‌ర్ల‌కోట మునిసిప‌ల్ ఛైర్ప‌ర్స‌న్ గంగిరెడ్డి అరుణాకృష్ణ‌మూర్తి, ద‌వులూరి సుబ్బారావు, ద‌వులూరి దొర‌బాబు, త‌హ‌సీల్దార్ జితేంద్ర‌, మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు, రీసెర్చ్ సెంట‌ర్ శాస్త్ర‌వేత్త‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

Samarlakota

2021-07-08 13:02:26

మరపురాని మహానేత డా.వైఎస్సార్..

ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒకేఒక్క వ్యక్తి మహా నేత, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమేనని అని ఎంపీపీ అభ్యర్ధి పర్వత రాజబాబు పేర్కొన్నారు. గురువారం డా.వైఎస్సార్ జయంతి సందర్భగా శంఖవరం మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, విద్యార్ధులకు ఫీజ్ రీఎంబర్సుమెంట్ లాంటి చారిత్రక సంక్షేమ పథకాలు అందించిన మహా మనిషి అన్నారు. భౌతికంగా ఆ మహానేత మన మధ్యలేకపోయినా ప్రతీ అభిమాని గుండె చప్పుడు ఆయనేగా ఉండిపోయారన్నారు. అంతటి మహానేత జయంతిని రాష్ట్రప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించి ఆయన కన్న కలలను నేటి యువ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఎస్సీకాలనీలోని విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, చింతంనీడి కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తి, జానియర్ అసిస్టెంట్ రమణమూర్తి, గ్రామ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత సత్యన్నారాయణమూర్తి, కొండమూరి చంటిబాబు, సర్పంచ్ బందిలి చిన్నయ్యమ్మ, మండల మేనేజర్ పడాల సతీష్, పడాల బాషా,బిసి కార్పోరేషన్ డైరెక్టర్ కిల్లి పార్వతి, కార్యకర్తలు మూడు సచివాలయాల కార్యదర్శిలు, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సచివాల సబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

Sankhavaram

2021-07-08 05:51:13

వజ్రకూటంలో దిశ యాప్ పై అవగాహన..

దిశ యాప్ ని మహిళలంతా తమ తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా అత్యవసర సమయాల్లో పోలీసు సహాయం పొంది రక్షణ పొందవచ్చునని అన్నవరం ఎస్ఐ రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం శంఖవరం మండలంలోని వజ్రకూటం గ్రామంలోని మహిళలు, విద్యార్ధినిలకు మహిళా పోలీస్ కళాంజలి ఆధ్వర్వరంలో దిశ యాప్ వినియోగంపై అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం మహిళల రక్షణకోసం ప్రత్యేకంగా ఈ దిశ యాప్ ని రూపొందించిందన్నారు. దీని ద్వారా మహిళలకు ఎంతో ఉపయోగంతోపాటు, రక్షణ కూడా వుంటుందన్నారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్ధినిలు, ఇంట్లో, గ్రామాల్లో ఆకతాయిల నుంచి వేదింపులు ఎదుర్కొనే వారికి ఎంతో వెన్నుదన్నుగా వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సకురు గుర్రాజు, కార్యదర్శి డి.అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

వజ్రకూటం

2021-07-07 15:32:12

విద్యార్ధులకు మాస్కులు పంచిన సమిథ..

కరోనా సమయంలో విద్యార్ధులు అత్యంగ జాగ్రత్తగా ఉండాలని సమిథ నిర్వాహకులు వీరభద్రరావు అన్నారు. బుధవారం రావికమతం మండలం చీమలపాడు గ్రామంలోని పాఠశాల విద్యార్ధులకు SHG95 మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాలతోపాటు, వెనుకబడిన ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్ధులకు తమ సంస్థ ద్వారా దాతలు ఇచ్చిన ప్రోత్సాహంతో సేవాకార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా వైరస్ ఉన్నంత కాలం ప్రతీ ఒక్కరూ మాస్కులు తప్పని సరిగా ధరించడంతోపాటు, బౌతిక దూరం, చేతుల పరిశుబ్రత చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని అమెరికాకు చెందిన అనూప్ రాజ్ సహకారంతో చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగరాజు, కార్యదర్శి చిన్నయ్యనాయుడు సంస్థ ప్రతినిధులు నాగమణి, బుద్దరాజు, సింహాద్రి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Cheemalapadu

2021-07-07 14:34:16