1 ENS Live Breaking News

డా.బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో సహకారం..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని తమవంతు సేవ రూపంలో దళిత ఐక్యవేదిక సేవాసంఘం ఆదివారం తమవంతు సహాయాన్ని అందించింది.  శంకవరం మండల కేంద్రంలోని దళితవాడలో కంది కట్ల సుశీలకు చెందిన ఒంటరి మహిళ ఇల్లు 4 నెలల కిందట విద్యుత్ తీగలు తగిలి కాలి బూడిదైపోయింది. అప్పటి నుంచి ఎలాంటి ఆసరా లేని ఆమెకు శంఖవరం దళితవాడ అంబేద్కర్ యూత్, దళిత ప్రజా ఐక్యవేదిక సేవా సంఘం  కమిటీ సభ్యులు చేయూనందించారు. నిలువ నీడలేని పేదరాలికి రేకుల షెడ్డు నిర్మించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా బాధితురాలు సుశీల మాట్లాడుతూ, నా అన్న వారే పట్టించుకోని ఈరోజుల్లో  అంబేద్కర్ పేరుతో సహాయ సహకారాలు అందించిన కమిటీ సభ్యుల సహాయాన్ని తాను ఎన్నటికీ మరిపోనని అన్నారు. సంఘం సభ్యులు మాట్లాడుతూ, సంఘటన జరిగిన సమయంలో వీఆర్వో సందర్శించి 25 కేజీల బియ్యం అందజేశారు. రూ.75 వేలు నష్టాన్ని అంచనా వేశారు తప్పితే నేటి వరకూ నష్ట పరిహారం ప్రభుత్వం నుంచి రాలేదని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం, స్థానిక తహశీల్దార్ స్పందించి ఒంటరి మహిళ సుశీలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బందిలి లక్ష్మణరావు, గుణపర్తిఅప్పలస్వామి(అపురూప్), పులి కిషోర్, కొంగు రమేష్, భూర్తి దుర్గాప్రసాద్, బత్తిన తాతాజీ, గుణపర్తి కొండలరావు, కొంకిపూడి అప్పారావు, పులి అంబేద్కర్, అంగులూరి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-18 17:17:12

గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర..

గిరిజన ఉత్పత్తులకు అధిక ధరకు విక్రయించడానికి చర్యలు తీసుకుంటున్నామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ తెలిపారు. మండలంలోని దేవాపురం, ఈదుల పాలెం ,పులుసుమామిడి గ్రామాల పరిధిలో గిరిజన రైతులు సాగు చేస్తున్న అనాసపనాస, సీతాఫలం,పనస పండ్లను విశాఖపట్నం తరలించి రైతు బజార్లులో విక్రయించడానికి రెండు ఆటోలలో నాలుగు వేల అనాస పనాస పళ్లు వాహనాలను శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన రైతులతోమాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులను దళారులకు విక్రయించ కుండా విశాఖపట్నం రైతు బజార్లులో అమ్మకానికి జాయింట్ కలెక్టర్ వేణుగోపాల రెడ్డితో మాట్లాడి తగిన అవకాశం కల్పించాలని కోరారు. ఏజెన్సీలో దళారులు తగిన గిట్టుబాటు ధరను రైతులకు అందించడంలేదని విశాఖపట్నం సీతమ్మధార, ఎంవిపి రైతు బజారులలో విక్రయిస్తే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. దేవాపురం గ్రామంలో గిరిజన రైతులతో మాట్లాడుతూ అటవీ ఫలాలను రైతు బజారులలో విక్రయించడానికి ప్రతీ ఏడాది చర్యలు చేపడతామన్నారు. అటవీ ఉత్పత్తులను రైతు బజార్లులో విక్రయించడానికి మార్కెటింగ్ శాఖ ద్వారా అవసరమైన గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు. అటవీ ఉత్పత్తులను నిల్వ చేయడానికి దేవాపురం గ్రామంలో గిడ్డంగిని నిర్మిస్తామన్నారు. గ్రామస్తులతో మాట్లాడి గ్రామ సమస్యలను అడిగితెలుసుకున్నారు. 12వమైలు రాయి నుంచి దేవాపురం గ్రామానికి ఉన్న రహదారిని మరమ్మతులు చేయించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అనంతరం ఈదుపాలెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని తరిఖీ చేసారు. అసుపత్రి అటెండెన్సు రిజిష్టరు, మూవ్‌మెంట్ రిజిష్టర్లను తనిఖీ చేసారు. ఆసుపత్రిలో జరుగుతున్న నాడు నేడు పనుల పురోగతిని వైద్యాధికారి డా.లక్ష్మినాగేశ్వరి వివరించారు. విద్యుత్తు నిత్యం అంతరాయం జరుగుతోందని పి ఓ దృష్టికి తీసుకుని వచ్చారు.నాడు నేడు పనుల్లో అభివృధ్ది పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టాక్‌రూం పరిశీలించారు. మందుల నిల్వలను రికార్డులను తనిఖీ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉద్యాన వన అధికారి జి. ప్రభాకర రావు, తదితరులు పాల్గొన్నారు.

Paderu

2021-07-16 15:33:39

ప్రపంచదేశాలకు నేటికీ మహానుభావులు గుర్తే..

ప్రపంచ దేశాలకు భారత దేశం గుర్తుకు వస్తే  ముందుగా  జాతి పితగా కొలుచుకునే మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత  భారతరత్న, డాక్టర్ భీమారావు రాంజీ అంబేద్కర్ పేర్లేనని రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్,  కురసాల కన్నబాబు లు అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో  ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ లతో కలసి గాంధీవిగ్రహాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, గాంధీ, అంబేద్కరుల త్యాగం, కృషి వలనే మన దేశంలోని ప్రతి పౌరుడూ నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఉండగా, రాజ్యాంగ రిజర్వేషన్లను ఏమాత్రమూ పొందని అన్ని కులాల్లోని ఆర్ధికంగా వెనుక బడిన నిరుపేద (ఇడబ్ల్యుఎస్) కుటుంబాల ప్రజల ప్రయోజనార్ధం వారికి 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారమే నిర్ణయం తీసుకుందని, ఇదొక గొప్ప విషయమని కన్నబాబు అభివర్ణించారు. ఇది గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమేనని, దీని అమలు వల్ల ప్రస్తుతం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లకు ఏమాత్రం నష్టం జరుగకుండా, గతంలో ఏ రిజర్వేషన్లు పొందని, గతంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన కాపులతోబాటు కమ్మలు, రెడ్డిలు, రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు తదితరులంతా ఈ 10 శాతం రిజర్వేషన్లను పొందుతారు అన్నారు. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ చదువుకోవాలి, అందరూ ఆర్ధికంగా ఎదగాలని నాడు కృషి చేసిన దివంగత నేత రాజశేఖరరెడ్డి ఆశయాలను అమలు పరుస్తూ, ఆయన వారసునిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పధంలో ముందుకు తీసుకు వెళుతున్నారని స్పష్టం చేశారు. శంఖవరంలో 1956 సంవత్సరంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని పునరుద్ధరించ డానికి అన్ని సామాజిక వర్గాల ప్రజలనూ ఏకాభిప్రాయానికి తేవడానికి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ చేసిన కృషి అభినందనీయం అన్నారు. శంఖవరం సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్, అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమారరాజా, కత్తిపూడి సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, మండపం సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యం, గౌరంపేట సర్పంచ్ రామిశెట్టి ఏసుబాబు, నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ఏలేశ్వరం నగర పంచాతీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-16 15:12:31

రాష్ట్ర మంత్రులకు శంఖవరంలో ఘనస్వాగం..

శంఖవరం మండల కేంద్రంలోని 2 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లకు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. సచివాలయ కార్యదర్శి రామచంద్రమూర్తి, ఇతర అధికారులు, వేద పండితులు మంగళవాయిద్యాలతో మంత్రుల బ్రుందానికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి సచివాలయం-2, 3 పరిధిలోని రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడి సుంకర బుల్లిబాబు, ఏఓ కెజెచంద్రశేఖర్, హార్టికల్చర్ అధికారి శ్రీవల్లి, పశుసంవర్ధశాఖ ఏడి డా వీర్రాజు, వైద్యులు కె.ప్రసాద్, లావణ్య, ప్రియాంక, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు, మూడు సచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, సర్పంచ్ బందిలి గన్నయ్యమ్మ, ఉప సర్పంచి చింతంనీడి కుమార్, పర్వత స్వామి, బుర్రాలచ్చబాబు, పడాల భాషా, పడాల సతీష్, పడాల గంగాధర రామారావు మండలంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు, గ్రామవాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-16 14:53:35

రాజన్న రాజ్యంలో రైతన్నలకు పెద్దపీట..

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  రైతన్నలకు ఎంతో పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ తో కలిసి శంఖవరం మండల కేంద్రంలోని రైతుభరోసా కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామస్థాయిలో రైతుల సమస్యలు తీర్చడంతోపాటు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించాలనే లక్ష్యంతో ఈ రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం నిర్మించిందన్నారు. ఒకేసారి రెండు కేంద్రాలను ప్రారంభించడం ఆనందంగా వుందన్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, ఏ రాష్ట్రప్రభుత్వంలోనూ లేని విధంగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అక్కడే రైతులకు చేదోడుగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేసిందిన్నారు. గ్రామసచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రాలు ఒకేచోట ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్సీపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా, రాజన్న రాజ్యంలో రైతులు అభివ్రుద్ధి చెందడానికి ఆర్బీకేలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం ఆర్బీకేలో ల్యాబ్, మందులు, అగ్రి కియోస్క్ లను పరిశీలించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రుల బ్రుందం తిలకించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడి సుంకర బుల్లిబాబు, ఏఓ కెజెచంద్రశేఖర్, హార్టికల్చర్ అధికారి శ్రీవల్లి, పశుసంవర్ధశాఖ ఏడి డా వీర్రాజు, వైద్యులు కె.ప్రసాద్, లావణ్య, ప్రియాంక, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు, మూడు సచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, సర్పంచ్ బందిలి గన్నయ్యమ్మ, ఉప సర్పంచి చింతంనీడి కుమార్, పర్వత స్వామి, బుర్రాలచ్చబాబు, పడాల భాషా, పడాల సతీష్, పడాల గంగాధర రామారావు మండలంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు, గ్రామవాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-16 14:50:02

ఘనంగా ఉపసర్పంచ్ జన్మదినోత్సవం..

ప్రజాసేవే పరమావధిగా భావించి శక్తివంచన లేకుండా సేవలందించే ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని సచివాలయ కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్యలు కోరారు. శుక్రవారం శంఖవరం మండల కేంద్రంలో ఉపసర్పంచ్ కుమార్ జన్మదిన వేడుకలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్ కట్ చేయించి మిఠాయిలు పంచారు. ఉపసర్పంచ్ కుమార్ మాట్లాడుతూ, తనపై ఎంతో అభిమానం చూపించే అభిమానులు, సచివాలయ సిబ్బంది, వైఎస్సార్సీపి కార్యకర్తల నడుమ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ ఆశీస్సులతో ప్రజలకు సేవచేసుకునే భాగ్యం దక్కిందని, తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతను ఎంతో ఉన్నతంగా నెరవేరుస్తానని అన్నారు. సచివాలయం-1 కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఏ కష్టం వచ్చిన నేనున్నాంటూ ముందుకొచ్చి సేవలందించే ఉపసర్పంచ్ అనతికాలంలో ప్రజల మన్ననలు పొందారన్నారు. అలాంటి మంచి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.  ఈ సందర్బంగా సిబ్బంది, నాయకులు ఉప సర్పంచ్ కుమార్ కు కేక్ తినిపించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, మూడు సచివాలయాల సిబ్బంది, వైఎస్సార్సీపి మండల నాయకులు పర్వత స్వామి, బుర్రాలచ్చబాబు, పడాల భాషా, పడాల సతీష్, పడాల గంగాధర రామారావు అభిమానులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-16 14:42:29

సచివాలయాల నిర్వహణ మెరుగుపడాలి..

 గ్రామ సచివాలయాల నిర్వహణతీరును మరింతగా మెరుగుపర్చాలని జిల్లా కలెక్టరు డి. మురళీధర్‌ రెడ్డి గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం రామంద్రాపురం మండల పరిధిలోని ఓదూరు, నరసాపురపుపేట గ్రామాలలోని   గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాలలో నవరత్నాలు వివిధ సంక్షేమ పధకాలకు సంబందించిన గోడ పత్రికలు, ప్రదర్శన బోర్డులులో  ఏవిధంగా ఆయా పధకాలను వినియోగించుకోవాలన్న వివరాలు స్పష్టంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పధకాలకు సంబందించిన వివరాలు ప్రదర్శింపజేయాలని ఆదేశించారు. సర్వీసు రిక్వస్టులు గడువు దాటకుండా నిర్దేశిత కాలవ్యవధిలోని పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన తనఖీలో కొన్ని సర్వీసులు పెండిరగు ఉండటాన్ని గమనించి వెంటనే వాటిపరిష్కారానికై ఆయా శాఖలకు నివేదించి పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి అర్జీని క్రమపద్దతిలో తీసుకోవడంతోపాటుగా వాటి పరిష్కారానికి అదేవిధంగా సకాలములో చర్యలు తీసుకుంటూ విధేయతతో పనిచేస్తూ  ప్రభుత్వ పనితీరు పట్ల విశ్వసనీయతను పెంపొందించాలని ఆయన  సూచించారు. గ్రామాబివృద్దిని సాధించడానికి ప్రజల జీవన విధానాలను పెంపొందించడానికి ప్రతి కుటుంబానికి సంక్షేమ పధకాల లబ్దిని  చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్దను అందుబాటులోనికి తెచ్చిందని  ప్రభుత్వ పాలనను ప్రజలకు చేర్చేందుకు సచివాలయాలు ఆవిర్బవించాయన్నారు. గాంధీ కలల సాకారమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ఆదిశగా ఆవిర్బవించినవే గ్రామ, వార్డు సచివాలయాలు అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్ద ప్రజలకు చేరువగా ఉంటూ ప్రజావసరాలను సమస్యలను తెలుసుకుంటూ కావాల్సిన కనీస సేవలను అందించి వారి అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఆర్‌.డి.ఓ కుమారి పి. సింధు సుబ్రహ్మణ్యం, మండల తాహసిల్దారు పి. తేజోశ్వరరావు, మండల పరిషత్‌ అభివృద్ది అధికారి నాగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.  

Ramachandrapuram

2021-07-15 15:18:35

సత్యా మాష్టారి సేవలు అభినందనీయం..

విశాఖజిల్లాలోని సబ్బవరం తవ్వవానిపాలెంలో పొనిపిరెడ్డి సత్యన్నారాయణ మాస్టారు ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహచర ఉపాధ్యాయులు మాట్లాడుతూ, సత్య మాస్టారి సేవలు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎన్నటికీ మరిచిపోలేరని అన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ,  దేశ అభివృద్ధికి  విద్య ఎంతో అవసరమని భావించి ఎంతోమంది విద్యార్థులు భావిభారత పౌరులుగా తీర్చి దిద్దిన ఘనత మాస్టారికే దక్కుతుందన్నారు.1996 వా సంవత్సరంలో  ప్రభుత్వ  ఉపాధ్యాయు వృత్తిని చేపట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పారని కొనియాడారు.   అంతే కాకుండా మాస్టారు  విద్యార్థులకు,  వయోజనులకు ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని స్థాపించి తద్వారా వారి ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మాస్టారి కుటుంబ సభ్యులు, విద్యార్ధులు పాల్గొన్నారు.


Sabbavaram

2021-07-15 13:57:18

దిశ రిజిస్ట్రేషన్లలో మనమే ఫస్ట్ రావాలి..

తూర్పుగోదావరి జిల్లాలో దిశ యాప్ రిజిస్ట్రేషన్లలో శంఖవరం మొదటిస్థానంలో నిలబ డేవిధంగా వాలంటీర్లంతా దిశ యాప్ అందరి మొబైల్స్ లో రిజిస్ట్రేషన్ చేయించాలని వైఎస్సార్సీపీ నియకులు, ఉప సర్పంచ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం గ్రామ సచివాలయం-1లో మూడు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన దిశ యాప్ ఆగ, మగ తారతమ్యం లేకుండా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళల ఫోన్లలో ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఎంతో భద్రత వుంటుందన్నారు. యాప్ ఇనిస్టాల్స్ విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రత్యేక సూచనలు చేశారన్నారు.  ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ గ్రామవాలంటీర్లు దిశ యాప్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమం చేపట్టాలన్నారు. త్వరలోనే మండల కేంద్రంలో అన్నవరం స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మూడు సచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, మహిళాపోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, వైఎస్సార్సీపి నాయకులు పడాల సతీష్, పడాల భాషా, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-15 13:49:11

RBKలు ప్రారంభం విజయవంతం కావాలి..

శంఖవరం మండల కేంద్రంలో జూలై16న ప్రారంభించే రైతు భరోసా కేంద్రాల ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు, ఉపసర్పంచ్ కుమార్ కోరారు. గురువారం సచివాలయం-1 లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో ఒకేసారి 3ఆర్బీకేలు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ సారధ్యంలో మంత్రులు ప్రారంభిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లు, వారి కేటాయించిన కుటుంబాల వారు, రైతులతో విచ్చేసి విజయవంతం చేయాలన్నారు. కార్యదర్శి-1 రాంబాబు మాట్లాడుతూ, విధిగా వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మూడు సచివాలయాల కార్యదర్శిలు రాంబాబు, శంకరాచార్యులు, సత్య, మహిళాపోలీస్ జిఎన్ఎస్ శిరీష, జూనియర్ సహాయకులు రమణమూర్తి, వైఎస్సార్సీపి నాయకులు పడాల సతీష్, పడాల భాషా, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-15 13:42:38

స్పందన దరఖాస్తులు పరిష్కరించాలి..

విశాఖ ఏజెన్సీలోని తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చిన స్పందన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ వి.అభిషేక్ తహశీల్దార్ జయప్రకాష్ నుఆదేశించారు. గురువారం సబ్ కలెక్టర్ డుంబ్రిగుడ ఎమ్మార్వో తాహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మీసేవ సర్వీసులు, సచివాలయ సర్వీస్ రిక్వెస్టులు, స్పందన ,
పిఓఎల్ఆర్ , రెవెన్యూ పెండింగ్ విషయాలపై చర్చించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డుంబ్రిగుడలం  పంటలచింత  గ్రామంలో   జాతీయ రహదారి 516 (NH-516) పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ తోపాటు సర్వేయర్ చిరంజీవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి, జెఇ (NH)రమేష్  తదితరులు పాల్గొన్నారు.

Dumbriguda

2021-07-15 13:35:22

శంఖవరంలో 176మందికి కరోనా వేక్సినేషన్..

శంఖవరం ప్రాధమిక ఆరోగ్యం పరిధిలోని సచివాలయంలో 176 మందికి కరోనా టీకాలు వేసినట్టు సచివాలయం-2 కార్యదర్శి శంకరాచార్యులు తెలియజేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసిన 300 కోవీషీల్డ్ వైల్స్ ను శంఖవరం మండల కేంద్రంలో వైష్ణవమాన్యం ప్రాంతంతో పాటు మూడు చోట్ల క్యాంపులు నిర్వహించి అక్కడ రెండవ డోసు పూర్తిచేశామన్నారు. గతంలో ఒకే కేంద్రంలో వేక్సినేషన్ చేసేవారని ఇపుడు మండల కేంద్రంలో పలు ప్రాంతాల్లో వేక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ కరోనా వేక్సినేషన్ సరఫరా చేస్తున్నామన్నారు. ఈరోజు ముఖ్యంగా రెండవ డోసు వేసుకునేవారికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు సచివాలయ కార్యదర్శి తెలియజేశారు.

శంఖవరం

2021-07-13 13:44:59

జోరు వానలో పీఓ కాలినడన పర్యటన..

సాలూరు మండలం మామిడి పల్లి గ్రామ సచివాలయాన్ని ఐ.టి.డి.ఎ పీఓ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా సచివాలయంలో అందిస్తున్న సేవలు, ఉద్యోగి వారీగా సంక్షేమ పథకాల అమలు పై ఆరా తీశారు. వై. ఎస్.ఆర్.భీమా, చేయూత తదితర సంక్షేమ పథకాల అమలు, సచివాలయాల  ద్వారా ఇ - సేవకు, స్పందనకు వచ్చిన వినతులు పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు.  అనంతరం పీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయం సిబ్బంది సమయపాలన తప్పక పాటించాలని, కార్యాలయ వేళల్లో తప్పనిసరిగా కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. సచివాలయం నుంచి బయటకు వెళ్లాల్సి వుంటే తప్పక మూమెంట్ రిజిస్టరు నమోదు చేయాలని పేర్కొన్నారు.  అనంతరం పీఓ విపరీతమైన వాన పడుతున్న లెక్క చేయక నేరెళ్ళవలస నుంచి ఎగువసింభీ  గ్రామం వరకు నడుచుకుంటూ వెళ్లి ఎగువ శింభి గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో పాల్గొన్నారు, ముందుగా గ్రామంలో ప్రభుత్వ పథకాలు సకాలంలో అందుతున్నాయా అన్న వివరాల పై ఆరా తీశారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూములు కావాలని, అలాగే అంగన్ వాడి భావన కావాలని, ఆర్హులైన వారం ఉన్నాం మాకు పెన్షన్లు మంజూరు చేయమని కోరారు.   అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ  ఎగువ శింభి, దిగువ సింభి, ఎగువ గంజాయి భద్ర, దిగువ గంజాయి భద్ర, ధూళి భద్రా గ్రామాలకు చెందిన సుమారు 400 మంది అర్హతకలిగిన లబ్ధిదారులకు నెల రోజులలో పోడు పట్టాలు అందజేస్తామని తెలిపారు.  అంతే కాకుండా ఉద్యాన పంటలపై గిరిజనులకు అవగాహన కల్పించి వారికి జీడి మొక్కలు అందజేయడం జరుగుతుంది అన్నారు. పాఠశాలలు ప్రారంభం కానున్నయని పాఠశాలల్లో పిల్లలకు చేర్పించండి వారికి వసతి గృహం కల్పించి వారికి అమ్మవడి, విద్యా కానుక అందజేయడం జరుగుతుంది అన్నారు. గ్రామాల్లో అర్హులైన వారి పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకుంటే తదుపరి చర్యలు తీసుకొని మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే ఎగువసింభిలో  అంగన్వాడీ భవనం, నేరెళ్ళ వలసలో సంత షెల్టర్లు త్వరలోనే నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. ఈ పర్యటనలో పార్వతీపురం డి. ఎస్.పి సుభాష్, సాలూరు సి. ఐ, ఎం.పి.డి.ఓ, ట్రైబల్ వెల్ఫేర్ డి.ఈ,  రెవెన్యూ , సచివాలయం అధికారులు సిబ్బంది, చుట్టు ప్రక్కల గ్రామాల గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

Salur

2021-07-13 11:33:26

పనితీరు మెరుగు పరుచుకోవాలి..

గ్రామ సచివాలయంలోని సిబ్బంది, వాలంటీర్లు పనితీరును మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం దోర్నాల మండలంలోని దోర్నాల 2, 3 సచివాలయాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ రెండు సచివాలయాలలో సిబ్బంది హాజరు పట్టిక వాలంటీర్ల హాజరు పట్టికలో ఆయన నిశితంగా పరిశీలించారు. దోర్నాల-2 సచివాలయంలో రెండు నెలల నుంచి వాలంటీర్లు హాజరు పట్టికలో హాజరు నమోదు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  వాలంటీర్లు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని ఆయన గుర్తించి విచారించాలని ఎం పీ డీ వో ను కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో లోపాలు ఉండడంపై సంబంధిత సచివాలయం పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆయన చెప్పారు. సచివాలయంలోని సిబ్బంది, వాలంటీర్లు పనితీరు మెరుగుపరుచుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సచివాలయం సిబ్బంది కూడా సగంమంది సచివాలయంలో లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో సంతకాలు చేసిన తదుపరి ఎందుకు వెళ్తున్నారని సిబ్బందిని ఆరా తీశారు. సరిగా నిర్వహించక పోవడంపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు మాస్క్ ధరించకుండా దోర్నాల మండలంలో సంచరిస్తుంటే కనీసం అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో సంతకాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని తెలిపే వాలంటీర్లకు వేతనాలు ఇచ్చేది లేదని కలెక్టర్ చెప్పారు. అధికారులు నిరంతరం సచివాలయాల ను తనిఖీ చేయాలని ఆర్డిఓ ఎంపీడీవోలను కలెక్టర్  ఆదేశించారు.
        కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రజలను చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. దోర్నాల మండలం యడవల్లి గ్రామాన్ని సచివాలయాన్ని, పెద్దారవీడు దేవరాజు గట్టు గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, వాలంటీర్ల హాజరు పట్టికలు, అనుబంధ దస్త్రాలను ఆయన పరిశీలించారు. వాలంటీర్ వాలంటీర్ ల పనితీరు సిబ్బంది పనితీరు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ ల భవన నిర్మాణాలు పరిశీలించాలని ఆయన చెప్పారు. వేగంగా పూర్తయ్యేలా నిరంతర పరిశీలన ఉండాలని ఆయన తెలిపారు. ఆయన వెంట మార్కాపురం ఆర్ డి వో లక్ష్మిశివజ్యోతి, దోర్నాల ఎంపీడీవో మౌలాలి, తదితరులు ఉన్నారు.

Doranala

2021-07-13 11:02:27

ప్రజలకు సత్వరమే సేవలందాలి..

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వరమే సేవలు అందాలని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా గుర్ల‌, నెల్లిమ‌ర్ల మండ‌లాల్లో జెసి ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిబ్బంది సమయపాలన పాటించడంతో సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్య ఇవ్వాలన్నారు. సచివాలయాల ద్వారా అందేసేవలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం సచివాలయాల్లో సిబ్బంది హాజ‌రును ప‌రిశీలించారు. రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. ఆన్‌లైన్ ఫిర్యాదుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. సిబ్బంది స‌కాలంలో విధుల‌కు హాజ‌రై, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని, మెరుగైన సేవ‌ల‌ను అందించాల‌ని కోరారు. కార్యాల‌యాన్ని ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని, మొక్క‌ల‌ను నాటాల‌ని సూచించారు. ఇఓపిఆర్‌డి కూడా జెసి వెంట ఉన్నారు. నెల్లిమ‌ర్ల న‌గ‌ర‌పంచాయితీ ప‌రిధిలో నిర్మాణానికి ప్ర‌తిపాదించిన‌ ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రం స్థ‌లాన్ని, మార్కింగుల‌ను జెసి వెంక‌ట‌రావు ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని, నాణ్య‌త ఎక్క‌డా త‌గ్గ‌కుండా చూడాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో నెల్లిమ‌ర్ల మున్సిప‌ల్ అధికారులు, ఏఇలు పాల్గొన్నారు.

Nellimarla

2021-07-12 16:45:57